secretariat
-
ప్రజల ముంగిటకు పౌరసేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నిపుణులను భాగస్వాములను చేస్తూ పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్’యాప్‌ను గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు.పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయం’అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయానికి జన జాతర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం గురువారం సందర్శకులతో కిటకిటలాడింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి కొందరు వస్తే.. మరికొందరు తమ సొంత పనుల కోసం సచివాలయానికి వచ్చారు. అధికారులను, మంత్రులను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీఎత్తున మంత్రుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సచివాలయం బయట ప్రాంగణంతోపాటు లోపల ఫోర్లు కిటకిటలాడాయి.సాధారణంగా సచివాలయంలోకి వెళ్లడానికి పాస్‌లు జారీచేసి సాయంత్రం 3 గంటల నుంచి మాత్రమే అనుమతినిస్తారు. అయితే, జన సందోహం పెరగటంతో ఉదయం నుంచే పాస్‌ల కౌంటర్ వద్ద క్యూలు కట్టడం గమనార్హం. మరి కొందరు మంత్రులు, అధికారుల పేషీల నుంచి ఫోన్లు చేయించుకొని లోపలికి వెళ్లారు. పార్కింగ్ కోసం ఇక్కట్లు.. భారీ ఎత్తున ప్రజలు రావడంతో వాహనాలు నిలిపేందుకు ఇబ్బంది పడ్డారు. గేట్ –2 దగ్గర సచివాలయం లోనికి వెళ్లేందుకు కార్లు క్యూ కట్టాయి. సచివాలయం ప్రాంగణంలో కూడా భారీగా వాహనాలు నిలపడంతో కార్లతో నిండిపోయింది. సందర్శకులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. -
సచివాలయాలపై చంద్రబాబు మార్క్ రాజకీయం
-
నేటి నుంచి సెక్రటేరియట్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్..
-
సర్కారు ఓకే : మరి 26 ఏళ్లుగా నిలిచిపోయిన భర్తీల మాటేంటి?
దాదర్: ప్రమాణస్వీకారం తంతు పూర్తికావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్, మంత్రాలయలోని తమ తమ క్యాబిన్లలో ఆసీనులయ్యేందుకు సిద్ధమైతున్నారు. ఇందుకోసం మంత్రాలయ సామాన్య పరిపాలన విభాగం ఆయా శాఖల మంత్రుల క్యాబిన్లను సిద్ధంగా ఉంచింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అంటెండర్లు, బంట్రోతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సామాన్య పరిపాలన విభాగంలో కేవలం 30 మంది పర్మినెంట్ అటెండర్లు ఉన్నారు. కొరతను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో శ్రేణి ఉద్యోగులను భర్తీ కోసం తరుచూ ప్రతిపాదనలు అందుతున్నప్పటికీ సామాన్య పరిపాలన విభాగం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది. 1998కి ముందు 120 మంది... ఈ నెల 15వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేప ట్టే అవకాశాలున్నాయి. ఆ తరువాత నాగ్‌పూర్ లో 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ప్రత్యేక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుసహా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులందరూ మంత్రాలయలో విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటెండర్లు, బంట్రోతుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 1998 ముందు సామాన్య పరిపాలన విభాగంలో 120 మంది అటెండర్లు, బంట్రోతులు, సిపాయిలు ఉండేవారు. ఎవరైనా పదవీ విమరణ చేస్తే వారి స్థానంలో ఇతరులను నియమించడం, పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తిచేసేవారు. కాని 1998 తరువాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పదోన్నతులు నిలిపివేయడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక మంది పదవీ విరమణ చేయడం, సిపాయి పోస్టులను రద్దు చేయడంతో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్టు అంతాకలిపి 40 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. వీరిని సామాన్య పరిపాలన విభాగం వివిధ శాఖలకు కేటాయించింది. ఇప్పుడైనా ఆమోదం లభించేనా? ముఖ్యంగా సామాన్య పరిపాలన విభాగం ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కా ముఖ్యమంత్రికి ఇద్దరు సూపర్వైజర్లు, ఒక బంట్రోతు, ఉప ముఖ్యమంత్రులకు ఒక సూపర్వైజర్, ఒక బంట్రోతు చొప్పున, క్యాబినెట్‌లోని మంత్రులందరికి ఒక బంట్రోతు, ఒక అటెండర్ చొప్పున సామాన్య పరిపాలన విభాగం కేటాయిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉభయ సభల్లో అధికార పార్టీకి 8 మంది, ప్రతిపక్ష పార్టీకి 8 మంది ఇలా 16 మంది అటెండర్లను సామాన్య పరిపాలన విభాగం సమకూర్చి ఇస్తుంది. కానీ గత 26 ఏళ్లుగా భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, పదోన్నతులు నిలిపివేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొనసాగిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఆరేడుగురు మంత్రులు అటెండర్లు, బంట్రోతులు లేకుండానే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వం ఇప్పుడైనా భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుందని మంత్రాలయ సిబ్బంది భావిస్తున్నారు. -
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
సచివాలయానికి సిటీ బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీబస్సులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసమే ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు గంటలతరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు. చివరకు ఆటోలు, తదితర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసి వచ్చింది. మరోవైపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. అమీర్‌పేట్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, లిబర్టీ, ఇందిరాపార్కు లోయర్‌ట్యాంక్‌బండ్ తదితర చోట్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. -
కవి అందెశ్రీకి సన్మానం
-
తెలంగాణ తల్లి విగ్రహం ఇలా.. ఆకుపచ్చ చీరలో, వరితో..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఫొటో ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్దమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. -
వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు
-
రూ. 5,260 కోట్ల పెట్టుబడులు.. 12,490 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాలుష్యరహిత గ్రీన్ ఫార్మా యూనిట్లను నెలకొల్పేందుకు, ప్రస్తుతమున్న కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటెరో ల్యాబ్స్ కంపెనీలు రూ. 5,260 కోట్ల పెట్టుబడులకు సంబంధించి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి.ఈ పెట్టుబడుల ద్వారా కొత్తగా 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రతిపాదిత ఫార్మాసిటీలో ఈ కంపెనీల యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో తొలుత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, హెటెరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ సమావేశమయ్యారు.ఈ భేటీలో టీఎస్ఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంవోయూలపై కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతోపాటు ఫార్మాసిటీలో సదుపాయాలు కలి్పంచాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. యూనిట్లు ఇలా.. ఈ ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లే»ొరేటరీ తయారీ యూనిట్‌తోపాటు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పనున్నాయి. అలాగే గ్లాండ్ ఫార్మా సంస్థ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టెన్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను స్థాపించనుంది. ఇక డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేయనుండగా హెటెరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. -
సచివాలయాల్లో ఆగిన ‘ఈసీ’ సేవలు
సాక్షి, అమరావతి: ఇళ్లు, భూములు వంటి పలు రకాల స్థిరాస్తులను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు సమయంలోనూ, రైతులు తమ వ్యవసాయ భూముల ఆధారంగా బ్యాంక్‌ల నుంచి తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందడంలో అత్యంత కీలక డ్యాకుమెంట్‌గా ఉండే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ల జారీ నాలుగైదు నెలలుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆగిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీటి జారీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా మాత్రమే ఈ సేవలు పొందాలి్సన పరిస్థితి. రెవెన్యూ శాఖలో ఉండే ఆన్లైన్ వెబ్సైట్లో సాంకేతిక అవాంతరాలు ఏర్పడి 2024 మార్చిలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీకి చిక్కులు ఏర్పడ్డాయి. మే నెలాఖరుకు ఆ వెబ్సైట్లో సాంకేతిక అవాంతరాలు పరిష్కరించబడినా ఇప్పటికీ ఆ సేవలను సచివాలయాల ద్వారా అందజేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.సచివాలయాల టాప్ సేవల్లో ఒకటి..గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గత ఐదేళ్లూ ప్రజలకు అందిన 540 పైబడిన సేవల్లో అత్యధికంగా అందిన ప్రజలు వినియోగించుకున్న సేవలు ఈసీ సర్టిఫికెట్ల జారీ ఒకటని అధికార వర్గాలు తెలిపాయి. సచివాలయాల శాఖ గణాంకాల ప్రకారం..2022 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మధ్య 3,73,907 మంది గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీ సేవలను వినియోగించుకున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం సచివాలయాల సేవల్లో టాప్–15 జాబితాలోనూ ఈసీల జారీ సేవ ఉండేదని అధికారులు చెప్పారు. -
సెక్రటేరియట్ సెక్యూరిటీ విధుల్లోకి టీజీఎస్పీఎఫ్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెష ల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) శుక్రవారం చేరారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి టీజీఎస్పీని తప్పించి టీజీఎస్పీఎఫ్‌కి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.సచివాలయం భద్రత కోసం ప్రస్తుతం 212 మంది టీజీఎస్పీఎఫ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధి కారులు కేటాయించారు. శుక్రవారం బాధ్యతల సందర్భంగా టీజీఎస్పీఎఫ్ సిబ్బంది సచివాల యం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి, కవాతు నిర్వహించారు. -
TG: ఎస్పీఎఫ్ పహారాలోకి సెక్రటేరియట్
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్ భద్రతను శుక్రవారం(నవంబర్ 1) నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షించనున్నారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని మార్చి ఎస్పీఎఫ్కు బాధ్యతలు అప్పగించారు.ఇటీవల ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఆందోళనల బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సెక్రటేరియట్ వీవీఐపీ జోన్లో ఉన్నందునే భద్రత నుంచి టీజీఎస్పీని ప్రభుత్వం తప్పించినట్లు తెలుస్తోంది. గతంలో చాలాకాలం పాటు సెక్రటేరియట్ భద్రతా వ్యవహారాలను చూసిన అనుభవం ఎస్పీఎఫ్కు ఉంది. భద్రతా విధుల్లో చేరిన తొలిరోజు శుక్రవారం సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఇదీ చదవండి: రాజ్‌పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి -
తెలంగాణ సెక్రెటరియేట్ లో సెక్యూరిటీని మార్చేసిన ప్రభుత్వం
-
సచివాలయాన్ని ఎత్తేశాడు
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల అధర్మ ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తాము చెప్పినచోటే సచివాలయం పనిచేయాలంటూ ఏకంగా కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను తరలించేశారు. దీంతో ఆ సచివాలయం ఉద్యోగులు మరో వార్డు సచివాలయానికి వెళ్లి పనిచేస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని 39వ వార్డులో ఈ దురాగతం జరిగి వారం రోజులైనా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం విమర్శనీయంగా ఉంది. 39వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ కేతా శ్రీను కొద్దిరోజులుగా సచివాలయ సిబ్బంది తాను చెప్పినట్లుగానే వినాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు.వార్డులోని 37వ నంబరు సచివాలయాన్ని తాను చెప్పినచోటుకు మార్చాలని హుకుం జారీచేశాడు. అతడు చెప్పిన ప్రదేశం వార్డు ప్రజల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సచివాలయాన్ని ఉన్నచోటే కొనసాగించాలని స్థానిక బీజేపీ నాయకుడు జింకా చంద్రశేఖర్, వార్డు ప్రజలు కోరారు. అయినా తనమాటే చెల్లాలంటూ కేతా శ్రీను వారం రోజుల కిందట సచివాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. వాటిని మరో ఇంట్లో ఉంచి సచివాలయ సిబ్బంది అక్కడికొచ్చి పనిచేయాలని నిర్దేశించాడు. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లిన సచివాలయ సిబ్బంది మూడురోజులు రామ్‌నగర్ సచివాలయం నుంచి పనిచేశారు.తరువాత వార్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో 40 వార్డులోని తారకరామాపురంలో ఉన్న 38వ నంబరు సచివాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పనుల మీద ఇప్పటివరకు సచివాలయం ఉన్న చోటుకు వెళ్లిన ప్రజలు ‘ఇక్కడి మా సచివాలయం ఏది?’ అని ప్రశ్నిస్తున్నారు తనకు ప్రభుత్వం నుంచి ఆరునెలల అద్దె రావాల్సి ఉందని, కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా సచివాలయాన్ని ఖాళీచేయడం దారుణమని భవన యజమాని కడప రంగస్వామి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను అడిగేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలోనే టీడీపీ నేత ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ సచివాలయం వద్ద భారీ భద్రత
-
సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రికి తాళమేసిన టీడీపీ నేతలు!
పలమనేరు: టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనేందుకు గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రి సిబ్బందిని బలవంతంగా బయటకు పంపి.. ఆయా కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటన అద్దం పడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జగమర్లలో గురువారం సాయంత్రం చోటుచేసుకోగా.. శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం రచ్చబండ వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించింది. ఈ కార్యాలయాల్లో మొత్తం 16మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. గతంలో ఈ కార్యాలయాలకు దారితోపాటు.. సీసీ రోడ్డును సైతం గత ప్రభుత్వమే నిర్మించింది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పక్కనే ఉన్న వైఎస్సార్సీపీకి చెందిన రెడ్డెప్పరెడ్డి సోదరుల పట్టా భూమిలో నుంచి దారి ఇవ్వాలంటూ గురువారం వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే దారి ఉన్నప్పటికీ తన పట్టా భూమిలో ఎందుకు దారి వదలాలని సంబంధిత రైతు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పచ్చనేతలు దుర్భాషలాడుతూ.. కార్యాలయాల్లోని సిబ్బందిని బయటకు పంపి.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రికి తాళాలు వేశారు. కోరినచోట దారి కల్పిస్తేనే కార్యాలయాలు తెరుస్తామంటూ హెచ్చరించారు. దీనిపై గ్రామ సర్పంచ్ విజయ్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
TG: సచివాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్దంపట్టేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు ఆటపాటలతో సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లోసెక్రటేరియట్లోని ఉన్నతాధికారుల నుంచి అన్నిస్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ
-
తెలంగాణ తల్లిని అవమానిస్తారా? కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని ధ్వజమెత్తారు .తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరతీస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎ క్స్ వేదికగా స్పందిస్తూ..‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!జై తెలంగాణ’ అంటూ పేర్కొన్నారు. కాగా సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తేల్చిచెప్పారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మృతి చిహ్నం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ఆ స్మృతి చిహ్నం ప్రారంభోత్సవ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అందుకోసం సచివాలయం ముందున్న సిగ్నల్ పాయింట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి రోడ్డును వెడల్పు వేసిందని పేర్కొన్నారు. ప్రజలు పండుగ సంబురాల్లో ఉండగా విగ్రహావిష్కరణకు పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. -
రెడ్ బుక్ వేధింపులు..
-
AP: ఉద్యోగులకూ తప్పని ‘రెడ్‌బుక్’ వేధింపులు
సాక్షి,విజయవాడ: రెడ్‌బుక్ వేధింపులు ఉద్యోగులను వదలడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో ఉద్యోగులు రెడ్‌బుక్ వేధింపులకు గురయ్యారు. పలువురు మిడిల్ లెవెల్ అధికారులను కూటమి ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు బదిలీ చేసింది. కులం, మతం ఆధారంగా ఎంఎల్ఓలను జీఏడీకి బదిలీ చేశారు. ఆరుగురు ఎంఎల్ఓలు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్‌బుక్ వేధింపుల పట్ల సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారశాఖలోనూ ఇద్దరు అధికారులకు ఇదే తరహా బదిలీలు తప్పలేదు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సెక్రటేరియట్‌కు అటాచ్చేస్తూ ఉత్తర్వులిచ్చారు. పది రోజులుగా సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులు రెడ్‌బుక్ వేధింపులు ఎదుర్కొంటుండడం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల భవనాన్ని కూల్చేసిన టీడీపీ -
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
-
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ