సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ తేదీన సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఫొటో ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్దమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment