
జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు
అప్పుడే సమాజంలో అసమానతలు తొలగుతాయి: ‘మండలి’ చైర్మన్ మోషేన్‌రాజు
శాసనమండలి, శాసనసభ, సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందినప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం, సచివాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోషేన్ రాజు... జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సందేశమిచ్చారు. అసెంబ్లీ భవనం వద్ద వేడుకల్లో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment