National flag
-
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్య్ర దినాన్ని మరుగునపరిచి.. ఈనాటి తరానికి తెలియకుండా పాలకులు తొక్కిపెట్టారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన 13 నెలల తర్వాత తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగిరిందన్న విషయం తెలియకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన 1948 సెపె్టంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వమే అధికారిక వేడుకలు జరుపుతుందని చెప్పారు.నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం దేశంలోనేకాక ప్రపంచ పోరాటాల్లోనే మహోన్నతమని, అపురూప ఘట్టమన్నారు. భారత సైన్యం ముందు 17 సెపె్టంబర్ 1948లో నిజాం రాజు, సైన్యం, రజాకార్లు లొంగిపోయారన్నారు. ఇంతటి గొప్ప పోరాటచరిత్ర నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం సెపె్టంబర్ 17న ‘విమోచన’దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్‌కు సలాం కొడుతూ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని చెప్పారు.తెలంగాణ ఉద్యమం సమయంలో ‘విమోచన దినోత్సవం’అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్ సీఎం అయ్యాక స్వరం మార్చారన్నారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని తెలిపారు.17 సెపె్టంబర్ను బీఆర్ఎస్ ‘జాతీయ సమైక్య దినం’అనడం, కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవం’అనడం ముమ్మాటికీ ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమేనని చెప్పారు. రజాకార్ల వారసుల కోసమే: బండి సంజయ్ పిడికెడు రజాకార్ల వారసుల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశ విచి్ఛన్నకర శక్తులతో అధికార పారీ్టలు అంటకాగే పరిస్థితి తెలంగాణలో ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందని, అదే రజాకార్ల వారసులను సంతృప్తిపరిచే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని కోరారు.వచ్చే ఏడాది నుంచైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి, సీఐఎస్ఎఫ్ డీజీ ఆర్ఎస్. భాటియా పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో.... బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దిన వేడుకల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రస్తుత సెప్టెంబర్ 17 చాలా ప్రత్యేకమైనది. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ పాల్గొన్నారు. -
సాక్షి కార్టూన్ : 22-08-2024
-
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎంతో విలువైనవి: సీజేఐ
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జస్టిస్ చంద్రచూడ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత చరిత్రను పరికిస్తే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంత విలువైనవో అవగతమవుతుందని పేర్కొన్నారు. ఇవి సులువుగా లభిస్తాయని అనుకోవద్దని సూచించారు. దేశంలో సాటి పౌరుల పట్ల మన బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేశారని, వృత్తిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం అంకితమయ్యారని కొనియాడారు. పౌరులుగా దేశం పట్ల, సాటి మనుషుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అందరూ చక్కగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. -
విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్‌ను సగర్వంగా చాటాలి. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురంచి సమగ్రంగా వివరించాం. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను పరిచయం చేశాం. ఈ సందర్భంగా, దావోస్ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి కార్యాచరణ ప్రారంభించాం.పోరాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్దం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. లోతైన సమీక్షలతో మంచీ చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.స్వేచ్ఛా స్వాతంత్య్రాల పునరుద్ధరణ‘అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరు ద్ధరిస్తామన్నాం. అక్షరాలా చేసి చూపిస్తున్నాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పదేళ్లలో రాష్ట్ర అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది.రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లు ఉన్న అప్పు, 2023 డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేస్తున్నాం. అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో జరిగిన భేటీలో తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై సానుకూల చర్చలు జరిగాయి. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపం’ అని రేవంత్ చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీల అమలు బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి చరిత్ర సృష్టించాం. మహా లక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల ద్వారా జూలై నాటికి మహిళలు రూ. 2,619 కోట్లు ఆదా చేయగలిగారు. ఆరోగ్యశ్రీ వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని నిర్ణయించాం. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీని త్వరలో ప్రారంభిస్తాం. రూ.500కే వంట గ్యాస్ సరఫరాతో 43 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. గృహజ్యోతి పథకం కింద 47,13,112 పేదల గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం‘ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం. డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్‌ను అనుసరిస్తున్నాం. సైబర్ నేరాల బాధితులకు సత్వర సహాయం అందేలా 1930 నంబర్‌తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. బేగరి కంచె వద్ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు. అమరవీరులకు సీఎం నివాళిసాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ముందుగా జూనియర్ సైనికుడు ఒకరు నివాళులర్పించిన అనంతరం ఆర్మీ అధికారులు, సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. పలువురు ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కూడా రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. నిరుద్యోగులు చెప్పుడు మాటలు వినొద్దు‘రాష్ట్రంలో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టాం. నిరుద్యోగ యువత చెప్పుడు మాటలు విని భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పా రిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిర మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేశాం. 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో స్నేహ పూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రైతన్నలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఓ అద్భుత ఘట్టం..’ అని అన్నారు. -
కోనసీమ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం
సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ నేతల నిర్లక్ష్యం కారణంగా కోనసీమ జిల్లాలో జాతీయజెండాకు అవమానం జరిగింది. 78వ స్వాతంత్య్య దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం పంచాయతీలో జాతీయజెండాను టీడీపీ నేతలు తిరగేసి ఆవిష్కరించారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు టీడీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వాతంత్ర దినోత్సవం.. ఎంతోమంది త్యాగమూర్తుల బలిదానాలకు వారి త్యాగాలకు నిదర్శనం.. అందుకే ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఎంతో విశిష్టత కలిగిన మూడు రంగుల జెండా.. పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ.. ఐక్య భావానికి, విజయ గీతానికి సూచికగా నిలుస్తోంది. అలాంటి జాతీయ జెండాను టీడీపీ నేతలు అవమానించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పవన్ కల్యాణ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
సాక్షి,కాకినాడ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జర్నలిస్టు నాగార్జున రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పిఠాపురంలో జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ పతాకాన్ని వినియోగించడంపై అభ్యంతరం తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం(ఏప్రిల్ 23) పవన్‌కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనను కూటమి సభ్యులు ఉల్లంఘించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కూటమి కార్యకర్తలు చొచ్చుకువచ్చారు. నామినేషన్లో ఆస్తులు వెల్లడించిన పవన్ కల్యాణ్ పవన్ కళ్యాణ్ ఆస్తులు రూ. 114 కోట్ల 76 లక్షలు అప్పులు రూ.64.26 కోట్ల రూపాయలు ఇదీ చదవండి.. కూటమి వెన్నులో వణుకు.. వైఎస్ఆర్సీపీలో భారీ చేరికలు -
Narendra Modi: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?
సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచి్చన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచి్చన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు ‘అభివృద్ధి చెందిన భారత్’ రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పారీ్టలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పారీ్టల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెరి్మనల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన -
Republic Day: జెండాల గౌరవం కాపాడండి : కేంద్రం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య -
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అమిత్ షా
-
జాతీయ సమైక్యతా దినోత్సవం..పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జెండావిష్కరణ
-
సీతమ్మకొండపై హర్ శిఖర్ తిరంగా
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన సీతమ్మ కొండపై ‘హర్ శిఖర్ తిరంగా’కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొండపై ఆర్మీ బృందం జాతీయ జెండాను విజయవంతంగా ఆవిష్కరించింది. దీంతో సీతమ్మకొండకు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన ఆర్మీ బృందం సోమవారం మధ్యాహ్నం హుకుంపేట మండలంలోని మారుమూల ఓలుబెడ్డ గ్రామానికి చేరుకుంది. సర్పంచ్ పాంగి బేస్ ఆధ్వర్యంలో గిరిజనులంతా వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో ఆర్మీ బృందం కూడా సందడి చేసింది. మధ్యాహ్నం 1.30గంటలకు సీతమ్మ కొండపైకి బయలుదేరిన ఆర్మీ బృందం... గంటన్నరలో కొండపైకి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరంగా గుర్తించిన సీతమ్మ కొండపై జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తమ యాత్ర, జాతీయ జెండా ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, స్థానిక గిరిజనులు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హర్ శిఖర్ తిరంగా యాత్రను ప్రారంభించామన్నారు. సీతమ్మ కొండతో కలిపి ఇప్పటి వరకు 22 రాష్ట్రాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాల్లో జాతీయ జెండాను విజయవంతంగా ఎగురవేశామన్నారు. మరో 6 రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగాను అక్టోబర్ 15వ తేదీకి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరెస్ట్ అధిరోహకుడు ఆనంద్‌కుమార్, టూరిజం అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రతినిధి కుంతూరు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
సీతమ్మ కొండపై నేడు ‘హర్ శిఖర్ తిరంగా’
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో అత్యంత ఎత్తైన (1,680 మీటర్లు) సీతమ్మ కొండకు అరుదైన గౌరవం దక్కనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హకుంపేట మండలంలోని సీతమ్మ (అర్మ) కొండపైకి వెళ్లి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు సర్వం సిద్ధమైంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని అత్యున్నత శిఖరాలపై జాతీయ జెండా ఎగురవేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘హర్ శిఖర్ తిరంగా’ మిషన్ పనిచేస్తోంది. పర్వత ప్రాంతాల్లో సాహసయాత్ర చేసి.. జాతీయ జెండా ఎగురవేయడం దీని ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నాయకత్వంలో ఈ నెల 4వ తేదీ సోమవారం 15 మందితో కూడిన ఆర్మీ బృందం అర్మ కొండపై యాత్ర చేపట్టి జాతీయ జెండా ఎగురవేయనుంది. ఈ కార్యక్రమానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు సాధనపల్లి ఆనంద్‌కుమార్ హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఎత్తులో ఉన్న సీతమ్మ (అర్మ) కొండపై హర్ శిఖర్ తిరంగా మిషన్ సాహసయాత్రతో పాటు జాతీయ జెండా ఆవిష్కరిస్తుందని ఇండియన్ ఆర్మీ ఏపీ ప్రభుత్వానికి గత నెలలో లేఖ పంపింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి పోలీస్, రెవెన్యూ, టూరిజం శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టూరిజం అథారిటీతో పాటు ప్రభుత్వంచే స్థాపించబడిన అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్లైంబింగ్, లాజిస్టిక్స్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. హుకుంపేటలో ముందుగా పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తీగలవలస–తడిగిరి పంచాయతీల సరిహద్దు నుంచి కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నేతృత్వంలోని ఆర్మీ బృందం అర్మ కొండకు సాహస యాత్ర చేపడుతుంది. -
విశాఖలో ‘ఇండియా ఆన్ ద మూన్’ భారీ ర్యాలీ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ‘ఇండియా ఆన్ ద మూన్’ పేరుతో విశాఖపట్నంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు 400 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఇండియా మూన్ మిషన్ చంద్రయాన్–3 సక్సెస్ కావడంతో భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత శాస్త్ర విజ్ఞానం వైపు దూసుకెళ్లాలన్నారు. ఈ మిషన్‌లో ఏయూ ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి ప్రాతినిధ్యం వహించడం ఏయూకు గర్వకారణం అన్నారు. -
మువ్వన్నెల కాంతుల్లో మురిసిన రాష్ట్రం
సాక్షి, అమరావతి: స్వేచ్ఛామారుతంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి మదిలో పంద్రాగస్టు సంతోషం ఉప్పొంగింది. గుండెల్లో జాతీయ భావా న్ని నింపుకొని.. గుండెలపై జాతీయ జెండాను పెట్టుకున్నవారితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మురిసిపోయింది. త్యాగధనుల స్మరణలో.. ప్రజాసంక్షేమ నాయకత్వంలో.. బంగారు భవిష్యత్తు ధీమాలో రాష్ట్రంలో 77వ స్వాతంత్య్రదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. త్రివర్ణపతాక రెపరెపల నడుమ సాయుధదళాల కవాతు, దేశభక్తిని నింపిన పోలీసు అందరినీ ఉత్తేజితుల్ని చేశాయి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. గ్యాలరీల్లో ఆసీనులైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహా్వనితులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత సాయుధదళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వేడుకల్లో 14 ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రతిబింబిస్తూ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అగ్నిమాపక, పాఠశాల విద్య, వైద్యం, అటవీ, పరిశ్రమలు, రెవెన్యూ, గృహనిర్మాణ, సంక్షేమ, మహిళా అభివృద్ధి–శిశుసంక్షేమ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, వ్యవసాయ, పశుసంవర్థక, గ్రామ–వార్డు సచివాలయాల శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. పాఠశాల విద్య–సమగ్ర శిక్ష శకటానికి మొదటి బహుమతి దక్కగా వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ–వార్డు సచివాలయాలశాఖ రెండు, మూడు బహుమతుల్ని దక్కించుకున్నాయి. దేశభక్తిని చాటిన సాయుధదళాల కవాతు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధదళాల కవాతు స్వతంత్ర భారతావని రక్షణ, దేశభక్తిని, అమరవీరుల త్యాగనిరతిని చాటిచెప్పింది. తెలంగాణ రాష్ట్ర 17వ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఏపీ ఎన్సీసీ బాలబాలికల బృందం పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు, యూత్ రెడ్‌క్రాస్, మాజీ సైనికుల కవాతు ప్రశంసలు అందుకుంది. ఏపీఎస్పీ బ్రాస్‌బ్యాండ్, ఫైర్‌బ్రాండ్ బృందాల కళాప్రదర్శన ఆçహూతుల్లో స్వాతంత్య్ర ఉద్వేగాన్ని పెంచింది. కవాతులో ఉత్తమ ప్రదర్శనగా సాయుధదళాల విభాగంలో 9వ ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్, ద్వితీయ స్థానంలో 16వ ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ నిలిచాయి. అన్ ఆర్మ్డ్ విభాగంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రథమ స్థానం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఆర్టీఐ ప్రధాన కమిషనర్ ఆర్ఎం బాషా, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలకు అవార్డులు ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం విద్యార్థుల ఉత్తీర్ణతతో పాటు విద్యార్థుల సరాసరి అత్యధిక మార్కులు సాధించిన స్కూళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డులను అందజేశారు. సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జియ్యమ్మవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పార్వతీపురం మన్యం జిల్లా), ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల (భీమునిపట్నం), భద్రగిరిలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల–యూఆర్జేసీ (పార్వతీపురం మన్యం జిల్లా), మంచాల ఏపీ మోడల్ స్కూల్ (అనకాపల్లి జిల్లా), పెద్దపవని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (కర్నూలు), వీరఘట్టం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (పార్వతీపురం మన్యం జిల్లా) ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అవార్డులను అందుకున్నారు. -
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు : సీఎం కేసీఆర్
►సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణది 15 స్థానం ఉండగా.. ప్రస్తుతం వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం కోసం పోటీ పడుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తూ.. రైతులు 3 గంటల కరెంట్ చాలన కొందరు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ►ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి గృహలక్షి పథకం ►రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు అందిస్తున్నాం ►దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలిచింది ►నేతన్నల కోసం తెలంగాణ మగ్గం పేరుతో కొత్త పథకం ►ఆసరా పెన్షన్లకు రూ.2016కు పెంచాం ►ఆర్టీసీ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టాం ►ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం ►సింగరేణలో రూ.12వేల కోట్ల టర్నోవర్‌ను 30 వేల కోట్లకు పెంచాం ►సింగరేణిలో కార్మికులకు ఈ సారి దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు ► జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..హైదరాబాద్‌లో నేటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.37 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, పోడు సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు తెలంగాణలో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రం ప్లోరోసిస్ రహితంగా మారిందని కేంద్రమే ప్రకటించిందన్నారు. ►సమైక్య పాలనతో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ►రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం నడుస్తోందని అన్నారు. 44 లక్షల మందకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ► స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు చేరుకుంటారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. -
ఫ్లాగ్ కోడ్ తెలుసా..?
శ్రీకాకుళం: పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ ఫ్లాగ్ కోడ్ ఏమిటో తెలుసుకుందాం. ఫ్లాగ్ కోడ్ అంటే ఏమిటి ? ► జాతీయజెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్క రూ ఫ్లాగ్ కోడ్ 2002ను అనుసరించాల్సి ఉంది. ► అలాగే యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్–1971 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ► ఈ కోడ్‌లోని నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండాపై పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండాను ఎగురవేయవచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ► అయితే జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. ► 2002 జనవరి 26న కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు నేషనల్ సింబల్స్ అండ్ నే మ్స్ యాక్ట్–1950, యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్–1971 ఉండేవి. ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు. ► 2022 జూలై 20న చేసిన సవరణ ప్రకారం, ఇప్పుడు జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు. అది బహిరంగ ప్రదేశమైనా, ఇంటి మీదైనా ఎగరేయడానికి అనుమతి ఉంది. ► అంతకు ముందు జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది. ► జాతీయ జెండాను పాలిస్టర్ ఫాబ్రిక్‌తో తయా రు చేయడానికి 2021 డిసెంబర్ 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే జాతీయ జెండా తయారీకి అనుమతి ఉండేది. ఇవి గుర్తుంచుకోండి ► ప్రభుత్వ ఫ్లాగ్ కోడ్ గతంలో చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు దానిని సరళీకృతం చేశారు. అయినా సరే, జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు, పద్ధతులు గుర్తుంచుకోవాలి. ► జెండాను ఎగరేసేటప్పుడు అది చిరిగిపోయి ఉండకూడదు. నలిగిపోయిన, తిరగబడిన జెండా ను ఎగరవేయరాదు. సరైన స్థలంలోనే జెండాను ఎగరేయాలి. ► జాతీయ జెండాను ఎగరేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండా ఎగురవేయకూడదు. ► జెండాను ఎలాంటి అలంకరణలకు ఉపయోగించకూడదు. ► జెండాను ఎగుర వేసేటప్పుడు, కాషాయ రంగు పైకి ఉండేలా జాగ్రత్త వహించాలి. ► జెండాపై ఏమీ రాయకూడదు. ఏ వస్తువు మీద కప్పడానికి జెండాను ఉపయోగించకూడదు. ► జెండాను ఎగురవేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, అవసరమైతే కొన్ని పువ్వులు అందులో ఉంచవచ్చు. ► జాతీయ జెండా నేల మీద పడేయకూడదు, నీటిపై తేలనీయకూడదు. ► జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు. నడుము కింది భాగంలో చుట్టుకోకూడదు. రుమాలుగా, సోఫా కవర్‌గా, న్యాప్‌కిన్‌గా, లోదుస్తుల తయారీకి ఉపయోగించకూడదు. ► జెండాను ఎగురవేసేటప్పుడు, అది ధ్వజస్తంభా నికి కుడి వైపున ఉండాలి. ► ధ్వజస్తంభం మీద లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టకూడదు. -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్‌కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్‌కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
బూట్లతో జాతీయ జెండా దిమ్మైపెకి..
మెదక్ : జాతీయ జెండా గద్దైపెకి ఓ పోలీసు అధికారిణి బూట్లతో ఎక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తన మొబైల్ ఫోన్లో వీడియో తీయడానికి అక్కడికి వచ్చిన ఏఎస్ఐ స్వరూపరాణి కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ జెండా గద్దైపెకి బూట్లు తీయకుండా ఎక్కారు. ఈ దృశ్యాన్ని కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారి తీరుపై పలువురు విమర్శలు చేశారు. బాధ్యత కలిగిన ఓ అధికారి ఇలా చేయడం తగదని అన్నారు. -
దేశంలోనే తెలంగాణ నం.1
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసన మండలి ఆవరణలో గుత్తా, శాసనసభ ఆవరణలో పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ: స్పీకర్ కులమతాలకు అతీతంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి జరుపు కునే పండుగ గణతంత్ర దినోత్సవమని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాంతియుతంగా తెచ్చిన స్వాతంత్య్ర ఫలాలను పరిపాలన ద్వారా అమలు చేసే విధులు, బాధ్యతలను పవిత్రమైన రాజ్యాంగం తెలియజేసిందన్నారు. తెలంగాణ భవన్లో.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీటీడీపీ కార్యాలయంలో పతాకావిష్కరణ భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అట్లూరి సుబ్బారావు, ఆజ్మీరా రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆప్ కార్యాలయంలో జెండా వందనం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కార్యాలయంలో గురువారం గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆప్ కోర్ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్ ఎగురవేశారు. -
ప్రగతి భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్లో జాతీయ పతాకా విష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్తూపాన్ని సందర్శించి జ్యోతి ప్రజ్వలన చేయడంతో పాటు అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, మధు సూదనాచారి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎంవో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు'
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి జోష్ మీదున్న జొకోవిచ్‌కు అతని తండ్రి రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా టోర్నీలో రష్యా, బెలారస్‌కు చెందిన జెండాలను నిర్వాహకులు నిషేధించారు. తాజాగా రష్యా జెండా.. జొకోవిచ్ తండ్రి సర్డాన్ జోకొవిచ్ను చిక్కుల్లో పడేసింది. స్టేడియాల్లోకి జెండాలు నిషేధం కావడంతో రష్యా మద్దతుదారులు.. స్టేడియం బయట తమ దేశ జెండాలతో నిరసనలు చేస్తున్నారు. ఇదే సమయంలో బుధవారం జొకోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ చూసేందుకు అతని తండ్రి సర్డాన్ జొకోవిచ్ రాడ్లివర్ ఎరినాకు వచ్చాడు. ఈ సమయంలో రష్యా జెండాలు పట్టుకున్న అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు రష్యా వర్ధిల్లాలి అనే నినాదం చేయడం.. మ్యాచ్ కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించడం జొకోవిచ్ తండ్రిని మరింత వివాదంలోకి నెట్టింది. ఆ తర్వాత పుతిన్ ఫొటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ జోకొవిచ్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆయా దేశాల జెండాలు పట్టుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు బెలారస్ జెండాలను నిషేధించారు. మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇప్పుడో స్టార్ ప్లేయర్ తండ్రే ఇలా నిరసనకారులకు మద్దతుగా నినాదాలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. సర్డాన్ జోకొవిచ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి''. జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గు చేటు'' అంటూ కొందరు తీవ్రంగా స్పందించారు. ^Sorry, not half, 3/8 #AusOpen semifinalists are flagless since Rublev didn't make it...though obviously the debates over Rybakina's nationality and what it means in this context are well-worn. — Ben Rothenberg (@BenRothenberg) January 25, 2023 Seems he was not the only one. @TennisAustralia What’s going on there? https://t.co/ZuAQ1kNHmU — Alex Dolgopolov (@TheDolgo) January 25, 2023 చదవండి: Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' -
స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం!
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం). గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు. -
జెండాను పారేయడం నేరం
-
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ నుంచి రూ.60 కోట్ల జెండాలు
న్యూఢిల్లీ: గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జెమ్) ద్వారా జూలై 1 నుంచి ఆగస్ట్ 15 మధ్య 2.36 కోట్ల జెండాలను వివిధ ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. వీటి విలువ రూ.60 కోట్లు. ప్రభుత్వ సంస్థలు 4,159 మంది విక్రేతల నుంచి ఈ జెండాలను అందుకున్నాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ప్రభుత్వ సంస్థల కోసం పారదర్శక ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో జెమ్ వేదికను 2016 ఆగస్ట్ 9న కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్త, స్థానిక సంస్థలు తమకు కావాల్సిన ఉత్పత్తులను జెమ్ ద్వారా పొందవచ్చు.