వాడవాడలా త్రివర్ణపతాకం ఎగురవేయాలి
వాడవాడలా త్రివర్ణపతాకం ఎగురవేయాలి
Published Thu, Sep 15 2016 10:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
మిర్యాలగూడ : తెలంగాణ వియోచనా దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు కోరారు. తిరంగాయాత్రలో భాగంగా గురువారం పట్టణంలో జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతనం రాజీవ్‌చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ లో తెలంగాణ వియోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల మనోభావాలను కించపరచడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగదన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాదూరి కరుణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు సైదులు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి లింగయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి, నాయకులు కడపర్తి సత్యప్రసాద్, పోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, మద్ది వేణుగోపాల్‌రెడ్డి, బంటు గిరి, చిలుకూరి శ్యాం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement