MIRYALAGUDA
-
ట్రాక్టర్‌ను ఢీకొన్న పెళ్లి బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు బస్సు..ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ పప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది గాయాలయ్యాయి. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరంతా హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం. -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బస్సు ప్రమాదం
-
ధాన్యం కొనాలి.. మద్దతు ధర చెల్లించాలి
మిర్యాలగూడ: ధాన్యం కొనాలని..మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులకు 3వేల ట్రాక్టర్లకుపైగా ధాన్యం తరలివచి్చంది. దీంతో కోదాడ రోడ్డు వైపు యాద్గార్పల్లి మిల్లుల్లో ఉదయం పూట ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని, నిల్వ సామర్థ్యం లేదని ఉదయం 11గంటల వరకు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మద్దతు ధరకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి రైతులు రాస్తారోకో చేశారు.మరోవైపు నల్లగొండ రోడ్డులో వేములపల్లి మండల పరిధిలోని రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. ఒక ట్రాక్టర్ ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 గంటల పాటు ధాన్యం ట్రాక్టర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. వెంటనే అధికారులు ఆ ట్రాక్టర్‌ను తొలగించడంతో పలు మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మహీంద్ర, పద్మ చింట్లు తదితర ఎర్ర రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,150 నుంచి రూ.2,250 వరకు ధర వేస్తు న్నారని రైతులు యాద్గార్పల్లి మిల్లుల వద్ద, వేములపల్లి మండల పరిధిలోని మిల్లుల వద్ద ధర్నా చేశారు. అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షించినా... ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివారం మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మిర్యాలగూడ ఏరియా రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ 3గంటల పాటు సమీక్షించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,320 నుంచి రూ.2,400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. దీనికి రైస్ మిల్లర్లు అంగీకరించారు. కానీ, ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులుదీరడంతో పచ్చి గింజ, తేమ అధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని పలు సాకులతో రూ.2,150 నుంచి రూ.2,350 వరకు కొనుగోలు చేశారు.ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చెప్పినా కూడా మద్దతు ధర చెల్లించకుండా కేవలం రూ.2,300లోపు ధరకు చాలా ధా న్యం కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు.పచ్చి వడ్లు అని ధర తగ్గిస్తున్నారు వడ్లలో నాణ్యత లేదని, పచి్చ గా ఉన్నాయని, తేమ శాతం అధికంగా ఉందని, తాలుగింజలు ఉందని సాకు చూపి మిల్లర్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ.2,250కే కొన్నారు. అధికారులు మిల్లుల వద్దకు రాకపోవడం వల్లే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర పర్యటన చేసి మద్దతు ధర ఇప్పించాలి. – వీరబోయిన లింగయ్య, రైతు, పాములపహాడ్ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాంమిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం సుమారు 3వేలకు పైగా ట్రాక్టర్లలో ధాన్యం వచ్చింది. రైతులు సహకరిస్తే కొనుగోళ్లు వేగవంతమవుతాయి. ఆదివారం ఉద యం 10గంటల వరకు కొనుగోలు కాస్తా మందగించాయి. మధ్యాహ్నం 1గంట వరకు కొనుగోలు చేశాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే రూ.2,320కు పైగా ధర చెల్లిస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. తడిసి రంగు మారి న ధాన్యాన్ని కూడా కొనాలని అన్ని మిల్లులకు ఫోన్లు చేసి చెప్పాం. – కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
మిర్యాలగూడ గ్యాంగ్ వార్ లపై డి.ఎస్ .పి సీరియస్ వార్నింగ్
-
భారీగా నగదు, బంగారం పట్టివేత
కావలి/టంగుటూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిధిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, బంగార దొరికాయి. కావలి వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉన్న గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారాన్ని పట్టుకున్నారు. వీటిని తరలిస్తూ పట్టుబడిన వారంతా తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. మిర్యాలగూడకు చెందిన మహిళలు తేజ, సుమతి వద్ద రూ.72.50 లక్షల నగదు బయటపడిందని చెప్పారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే చెన్నై వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా మిర్యాలగూడకే చెందిన శివమ్మ, యాదమ్మ వద్ద రూ.60 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో బస్సులో వెళ్తున్న మిర్యాలగూడకే చెందిన పర్వీన్ వద్ద రూ.29 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కారును తనిఖీ చేయగా.. మోహన్, ప్రభాకర్ అనే వ్యక్తుల వద్ద కిలోన్నర బంగారం బయటపడిందని చెప్పారు. ఈ బంగారానికి సంబంధించి రసీదులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు, మొత్తం బంగారం విలువ కలిపి రూ.2.62 కోట్లు ఉంటాయని వెల్లడించారు. అలాగే చెన్నై నుంచి మిర్యాలగూడకు కారులో వెళ్తున్న మద్దిశెట్టి మల్లేశ్, చంద్రకళ వద్ద 1.238 కేజీల బంగారు బిస్కెట్లను ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ పోలీసులు పట్టుకున్నారు. -
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్‌పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్‌గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
-
కేసీఆర్ బస్సు యాత్ర.. కాన్వాయ్‌లో ప్రమాదం
సాక్షి,నల్లగొండజిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ రోడ్ షో కు వెళ్తుండగా కేసీఆర్ కాన్వాయ్‌లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. వేములపల్లి సమీపంలో కాన్వాయ్‌లో ముందు వెళుతున్న వాహనం సడెన్ బ్రేక్ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ముందు వెళుతున్న కారును వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లో తొమ్మిది వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.కాగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బుధవారం నుంచి బస్సుయాత్ర చేపట్టారు. బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మే 10వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. బస్సు యాత్రలో భాగంగా పలు చోట్ల కేసీఆర్ రోడ్‌షోలలో ప్రసంగిస్తారు. ఇదీ చదవండి.. కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు -
మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, నల్గొండ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఈ క్రమంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల్లో హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువైన 13 కిలోల బంగారం పట్టుకున్నారు పోలీసులు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోల్డ్ డిస్టిబూటర్లకు సరాఫరా చేసే ఓ ఏజెన్సీకి చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: ED: కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్ విడుదల - -
ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి
సాక్షి, నల్గొండ: మిర్యాలగూడ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. నార్కట్‌పల్లి–అద్దంకి హైవేపై మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ వద్ద అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా.. మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన చెరుపల్లి చెరుపల్లి మహేష్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మూడురోజుల క్రితం అతని కుటుంబంతో పాటు బంధువులు కొందరు కలిసి కారులో తీర్థయాత్రలకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ఆదివారం రాత్రి గుంటూరు వైపు నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరతారనగా ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తుండగా కారు డివైడర్ దాటి రావడంతో అటుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (32), అతని భార్య చెరుపల్లి జ్యోతి (30), కుమార్తె రిషిక (6), మహేష్ షడ్డకుడు బొమ్మ మహేందర్ (38), అతని కుమారుడు లియాన్‡్ష (2) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహేందర్ భార్య మాధవిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మహేందర్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి అని తెలిసింది. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘అది వదంతి మాత్రమే.. ఆ వార్తలను నమ్మకండి’
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయనే వార్తలను మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే తనకేంటి సంబంధమని ప్రశ్నించారు. నా బంధువులపై, నా కుమారుల ఇంట్లో సోదాలు జరగట్లేదు.నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను. నాకు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఐటీ దాడులు అన్నది వదంతి మాత్రమే .నాపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండి. నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను’ అని తెలిపారు. -
ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాల కలకలం
-
Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా..
కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అనాథగా మారిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు అక్కడ నాయకుడు లేకుండా పోయాడని, ఇందుకు కారణం పార్టీ అధినాయకత్వం వైఖరేనని అక్కడి శ్రేణులు కుమిలిపోతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కానీ, గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో అక్కడ చాలాకాలం పాటు కేడర్‌ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చివరి క్షణంలో బీసీ పేరుతో హైదరాబాద్ నుంచి ఇంకో నాయకుడిని తెచ్చి కేడర్ నెత్తిన పెట్టారు. ఎన్నికలు అయ్యాక ఆయన పత్తా లేడు. ఇక, ఇప్పుడు పార్టీని కాపాడుకుంటూ, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పొత్తు పేరుతో కామ్రేడ్లు తమ నెత్తిన కూర్చుంటున్నారని అక్కడి కాంగ్రెస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కామ్రేడ్లకు సీట్లు ఇచ్చే విషయంలో ఇతర జిల్లాలకు చెందిన నేతలు తమ ఏరియాలో సీట్లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే నల్లగొండ జిల్లాకు చెందిన బడా నాయకులు మాత్రం తమకేమీ పట్టనట్టు మిర్యాలగూడను అనాథగా వదిలేశారని, కనీసం ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాల్సిందేనని పట్టుపట్టే నాయకుడే లేకుండా పోయాడని కేడర్ ఆవేదన వ్యక్తం చేసింది. అదే జరిగితే, కామ్రేడ్లతో పొత్తు కుదిరితే మళ్లీ ఐదేళ్ల పాటు తాము అనాథలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని నిట్టూరుస్తున్నారు. ఏం చేయగలరు.. ‘ఇండియా’ కూటమి కోసం త్యాగం చేయడం తప్ప...! చదవండి: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం.. మంత్రి అయినా సరే.. రఘునాథపాలెం: సామాన్య వ్యక్తి అయినా, మంత్రి అయినా ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు పక్కాగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీ చేశారు. వాహనాల్లో ఉన్న మంత్రి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇతర ప్రజాప్రతినిధులు పోలీసులకు పూర్తిగా సహకరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అధికారులు తనిఖీ చేయడం సహజమని, తాను ఎప్పుడైనా సహకరిస్తానని మంత్రి పువ్వాడ అన్నారు. వారం రోజుల క్రితం పుట్టకోట క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం అర్బన్ పోలీసులు, కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని సైతం తనిఖీ చేశారు. -
ప్రజలు నిర్మోహమాటంగా తీసుకోండి..మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్..!
-
వామ్మో..! చిరుత పులి పిల్లలా.. అడవి పిల్లులా ?
సాక్షి, నల్గొండ: దామరచర్ల మండలం ఇర్కిగూడెంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిరుత పులి పిల్లలవిగా భావిస్తున్న పాదముద్రలు కలకలం రేపాయి. స్థాని కులు ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇర్కిగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకి– నార్కట్‌పల్లి రహదారి పక్కన కృష్ణానది సమీపంలో రెండు చిరుతపులి పిల్లలు తిరుగుతున్నాయని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాలను గాలించారు. పాదముద్రలను పరిశీలించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అవి చిరుత పిల్లలు కావని అడవి పిల్లికి చెందిన పాదముద్రలుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ అటవీ సిబ్బందిని నిఘా ఉంచామని, అవి పులి పిల్లలా, అడవిపిల్లులా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఆనంద్‌రెడ్డి, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్ఐ రవికుమార్, బీట్ ఆఫీసర్ ముఖేష్, బీట్ ఆఫీసర్లు ప్రవీణ్‌కుమార్, ఆజం పాల్గొన్నారు. -
టైరు పేలి.. మంటలు చెలరేగి..
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్‌పేట ప్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ఎస్ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది. -
మిర్యాలగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మిస్సింగ్ విషాదాంతం
-
ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు
మిర్యాలగూడ టౌన్: మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకున్న డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించాడు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇటీవల మిర్యాలగూడకు వచ్చింది. పట్టణంలో ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించిన అనంతరం అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు అర్ధరాత్రి 12:30 గంటలకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. అదే బస్సులో మరో ఇద్దరు ప్రయాణికులతో పాటు మిర్యాలగూడకు చెందిన కిరణ్, మంగళ్‌సింగ్ కూడా ఎక్కా రు. బస్సు మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత ఇద్దరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో బాగా మద్యం తాగి ఉన్న కిరణ్, మంగళ్‌సింగ్ .. ఈవెంట్ ఆర్గనైజర్ సీటుపై కాళ్లు వేయడంతో పాటు వెకిలిచేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ వారి వేధింపులు తాళలేక బస్సు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంది. దీంతో వారు కూడా డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి ఆ ప్రయాణికురాలిని వేధించారు. దీంతో బస్సు డ్రైవర్ సైదులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నేరుగా నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. అనంతరం కిరణ్, మంగళ్‌సింగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా, కామాంధుల నుంచి తనను కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైదులుతో పాటు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఆదివారం ఆర్టీసీ మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌కు లేఖ అందించింది. -
మిర్యాలగూడ: కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన మందుబాబులు
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడలో గత రాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. డ్రంక్ డ్రైవ్ సందర్భంగా.. పోలీసుల మీదకు కారును పోనిచ్చారు. ఈ క్రమంలో కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తప్పతాగిన కొందరు మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా హల్ చల్ చేశారు. పోలీసులు చెబుతున్నా వినకుండా ముందుకు కారును పోనిచ్చారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని 50 మీటర్ల దూరం ఈడ్చుకుపోయారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లింగారెడ్డి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు.. పరారైన వాళ్ల కోసం గాలింపు చేపట్టారు. -
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుకు దారిపొడవునా ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో తొలిసారి రి తెలంగాణకు వచ్చారు. తన పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్ని ప్రారంభోత్సవాలు, పలు శంకుస్థాపనలు ఉన్నాయి. తొలుత సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో తిరుపతి వందే భారత్ రైలుకు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో స్వాగతం చెబుతూ.. వందే భారత్ రైలుతో సెల్ఫీలు దిగారు.స్టేషన్ల వద్ద స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా స్వాగతం పలికారు. కాగా శనివారం ఉదయం 11.30 నిమిషౠలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన మోదీని గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి వందే భారత్ రైలు ప్రారంభించడంతోపాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్‌టీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. అనంతరం చెన్నైకు ప్రయాణమయ్యారు. -
మళ్లీ రిపీట్.. మరో సారి నోరు జారిన ఎమ్మెల్యే భాస్కర్ రావు!
సాక్షి, నల్గొండ: వేములపల్లి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. నాలుగు చీరలిచ్చే కాంగ్రెస్ నాయకుడికి ఓట్లు వేయాలా.. అలా అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారేన్ని రేపుతున్నాయి. కాగా గతంలోనూ అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఈ ఎమ్మెల్యే విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
డామిట్, మాట జారిపోయింది.! తప్పయిపోయింది సారీ! ఆ ఎమ్మెల్యే పరేషాన్
ఎప్పుడూ మంత్రి కాలేదు. కాని మంత్రి కంటే ఎక్కువగానే అధికారాలు అనుభవించారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే రాజకీయ గురువుకు సున్నం పెట్టాడు. గెలిపించిన పార్టీకి పంగనామాలు పెట్టి అధికార పార్టీలో చేరిపోయాడు. మూడోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్న ఆ నేత ఇటీవల పదే పదే జనానికి సారీ చెబుతున్నాడు. అనవసరపు చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు. సీనియర్ ఎమ్మెల్యేకు సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ ఆ నేత ఎవరు? కాంగ్రెస్‌కు చేయిచ్చి.. ఆ వెంటనే కారెక్కి.! ఎంతటి నాయకులైనా నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేరు. ఒక ఎమ్మెల్యే స్థాయి నేత పబ్లిక్‌లో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తే అటు ఆయనకు.. ఇటు పార్టీకి కూడా నష్టం తప్పదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు ఇప్పుడదే జరిగింది. గతంలో రెండు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి షాడోగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన అండదండలతో.. 2014లో రాజకీయాల్లోకి వచ్చీరాగానే.. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ పొందారు. ఎమ్మెల్యే కాగానే గురువును వదిలేసి గులాబీ పార్టీలో చేరిపోయారు భాస్కరరావు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుని మరోసారి పోటీ చేసి గెలిచారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎమ్మెల్యే భాస్కరరావు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనతో పాటు గులాబీ పార్టీని కూడా ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోడ్లతో రాజకీయమా? ఆ మధ్య అడవిదేవులపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో..సీసీ రోడ్ల ప్రారంభోత్సం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారం రేపాయి. మేము వేయించిన రోడ్లపై నడవద్దు, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవద్దని.. తాను తలుచుకుంటే ఐదు నిమిషాల్లో డ్యాన్సులు చేయిస్తానంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు..పార్టీకీ డ్యామేజ్ చేసేవిగా మారాయి. జరిగిన నష్టం గమనించిన ఆయన తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఘటన మరిచిపోకముందే మరో కార్యక్రమంలోనూ ఇదేరకంగా నోటి దురుసును ప్రదర్శించారాయన. మిర్యాలగూడలో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఎంపీపీ సరళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండు కులాల పేర్లను ప్రస్తావిస్తూ... ఆ వర్గాలు చేసే పనులు కూడా నేనే చేయాలా అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో మరోసారి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు నోటి దురుసు గురించి చర్చ మొదలైంది. బీసీ సంఘాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరైతే ఎమ్మెల్యేకు ఫోన్లు చేసి నిరసన వ్యక్తం చేశారట. రెండు రోజులపాటు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో.. ఎవరికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆయనలో కన్పించిందని అనుచరులే చెప్పారు. సారీ.. ఆ ఒక్కటి పట్టించుకోవద్దు దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన భాస్కరరావు క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే.. కొంతకాలంగా పదే పదే నోరు జారడానికి ఆయనలో పెరుగుతున్న టెన్షన్ కారణం కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానం ఒకటైతే.. సీపీఎంతో పొత్తు కుదిరితే మిర్యాలగూడ కేటాయించాల్సి వస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందోనని భాస్కరరావు ఆందోళన చెందుతున్నారట. దీంతో పాటు ఈసారి తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సీటు సీపీఎంకు కేటాయిస్తే.. ఇటు తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కొడుకు రాజకీయ అరంగేట్రం కూడా ఆలస్యం అవుతుందన్న ఆందోళనే ఆయన నోరు జారుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. పైగా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఓ నేత అయితే ఏకంగా తన అనుచరులకు పార్టీ ఇచ్చారని మిర్యాలగూడలో ప్రచారం సాగింది. ఒకనాడు జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన నల్లమోతు భాస్కరరావు ఇప్పుడు ప్రతీ దానికి.. ఫోన్ చేసిన ప్రతీ వ్యక్తికి క్షమాపణలు చెప్పాల్సి రావడం అంటే.. ఆయన స్వయంకృతాపరాధమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
చిన్నపాటి ఘర్షణ.. భార్య ఆతహత్య.. సాగర్ కాల్వలో దూకిన భర్త?
సాక్షి, మిర్యాలగూడ: క్షణికావేశంలో ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. ఇందిరమ్మకాలనీకి చెందిన గుంటి శివరామకృష్ణ, యామిని భార్యాభర్తలు. వీరికి 11ళ్ల క్రితం వివాహం కాగా పట్టణంలోని రాజీవ్‌చౌక్ సమీ పంలో మీసేవా కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకోగా శివరామకృష్ణ తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం యామిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత కింద పోర్షన్లో ఉన్న అత్తామామ పైకి వెళ్లి తలుపు తెరిచి చూడగా యామిని చున్నీతో ఉరేసుకుని ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా భార్య యామిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న శివరామకృష్ణ మనస్తాపంతో నందిపాడు సమీపంలోని సాగర్ కాల్వలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్వ కట్ట వద్ద శివరామకృష్ణకు బైక్ ఉండటంతో వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా భార్యాభర్తలు ఇద్దరూ సెన్సిటివ్‌గా ఉంటారని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో వారి కుమారుడు ఒంటరి వాడయ్యాడని కాలనీవాసులు పేర్కొన్నారు. చదవండి: Medak: చేపల కూరతో భోజనం.. నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు · -
అదే జరిగితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోక తప్పదా?!
రాజకీయాల్లో కొన్ని సార్లు త్యాగాలు చేయక తప్పదు. అన్ని సార్లూ అనుకున్నట్లుగా జరగదు. మునుగోడు ఉప ఎన్నిక గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కష్టాలు తెచ్చిపెడుతోందట. వామపక్షాలతో పొత్తు కంటిన్యూ అయితే కొన్ని సిటింగ్ సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీకి ఏర్పడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఈ సీటు పోతే పోయింది.. మరో సీటు అడుగుదాం అనుకుంటున్నారట. లైన్లో జూలకంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈసారి గులాబీ పార్టీ పోటీ చేస్తుందా లేక పొత్తులో భాగంగా సీపీఎంకు సీటు కేటాయిస్తుందా అనే చర్చ మొదలైంది. సీపీఎం, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరితే జిల్లాలో మిర్యాలగూడ స్థానాన్ని తమకు ఖచ్చితంగా కోరే అవకాశం ఉంది. ఇప్పటికి ఐదు సార్లు సీపీఎం అక్కడ విజయం సాధించింది. పార్టీకి బలమైన కేడర్ కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి మంచి అనుచర గణం ఉంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు తీసుకుని జూలకంటిని బరిలో దించాలని సీపీఎం నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీపీఎం ప్రణాళికలు ఎలా ఉన్నా మిర్యాలగూడ టికెట్ వదులుకుంటే సిటింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. నీళ్లు వదులుకున్నారా? అవసరం అయితే తన స్థానాన్ని వదులుకుంటానని సిటింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు ముందే ప్రకటించేశారు. దీంతో ఈ సీటు సీపీఎంకు కేటాయించడం వల్ల బీఆర్ఎస్లో ఎలాంటి తల నొప్పులు రావని పార్టీ నాయకత్వానికి కూడా స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు నియోజకవర్గంలో పరిస్థితి ఏమంతా బాగాలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే సీపీఎంకు ఇవ్వొద్దని గట్టిగా అడిగితే జరిగే నష్టాన్ని అయన ముందే గ్రహించారు. అందుకే పొత్తు కుదిరితే తన సీటు ఇచ్చేసినా పర్లేదని ముందే ప్రకటించారు. ఆ విధంగా పార్టీ బాస్ దృష్టిలో పడొచ్చని ఆయన భావించారు. గతంలో ఓ సభలో మాట్లాడుతూ.. ఇప్పటికీ మిర్యాలగూడ ప్రజలు జూలకంటి రంగారెడ్డినే ఎమ్మెల్యేగా భావిస్తున్నారని వ్యాఖ్యానించడాన్ని బట్టి భాస్కర్ రావు సీటు వదులుకునేందుకు ఎప్పుడో మానసికంగా సిద్ధమయ్యారని అర్థం అవుతోంది. త్యాగం చేస్తా.. సాగర్ ఇవ్వండి సీటు విషయంలో పేచీ పెట్టకుండా వదులుకోవడం ద్వారా.. నాగార్జున సాగర్ అడుగుదామని ఆయన అనుకుంటున్నట్లు టాక్. సాగర్ నియోజకవర్గంలో సెటిలర్స్ అధికంగా ఉండటంతో ఎప్పటి నుంచో సాగర్ పై భాస్కర్ రావు కన్నేశారు. అయితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి భగత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరో నియోజకవర్గం నేతకు పార్టీ నాయకత్వం అవకాశం కల్పిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. -
పొద్దెక్కినా పావని నిద్ర లేవలేదు.. శరీరం పచ్చగా మారడంతో
సాక్షి, నల్గొండ: విష పురుగు కుట్టి చిన్నారి మృతిచెందిన ఘటన మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడుతండా సమీపంలో గల జగ్గుతండాలో చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... జగ్గుతండాకు చెందిన భూక్య హరి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె పావని(11)సంతానం. పావని తండాలోని పాఠశాలలోనే 4వ తరగతి చదువుతుంది. బుధవారం రాత్రి తల్లి సుజాతతో కలిసి పావని ఇంట్లో నేలపై నిద్రించింది. గురువారం తెల్లవారుజామున సుజాత నిద్ర లేచి రోజుమాదిరిగానే ఇంట్లో పనులు చేసుకుంటుంది. కాగా పొద్దెక్కినా కూడా పావని నిద్ర లేవకపోవడంతో పాటు ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరికి వెళ్లి చూసింది. పావనిలో ఎటువంటి చలనం లేకపోవడంతో వెంటనే భర్త హరికి విషయం చెప్పింది. అతడు వచ్చి చూడగా పావని శరీరం చల్లబడటంతో పాటు నాడీ స్పందన లేకపోవడంతో తమ కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్నారు. కాగా పావని శరీరం పచ్చగా మారడంతో ఏదైనా విష పురుగు కుట్టి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కుమార్తె మృతిని తట్టుకోలేక సుజాత స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించి ఆమెకు సెలైన్ బాటిల్ ఎక్కించారు. -
అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే..
గచ్చిబౌలి: మణికొండలో అదృశ్యమై కృష్ణా నదిలో హత్యకు పాల్పడిన కేసులో వివాహేతర సంబంధమే కారణమని, అడ్డుతొలగించుకునేందుకు తోడల్లుడు పథకం రచించగా.. మృతుడి భార్య అంగీరించినట్లు రాయదుర్గం సీఐ తిరుపతి తెలిపారు. కృష్ణా నదిలో గాలించినా మృతదేహం లభ్యం కాకపోయినప్పటికీ సాంకేతిక ఆధారాలతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ తిరుపతి తెలిపిన మేరకు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లావుతండాకు చెందిన ధనవత్ రాగ్యానాయక్(28) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ మణికొండ గార్డెన్లో భార్య రోజా(29)తో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజా అనారోగ్యానికి గురైంది. భర్త సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్క భర్త అయిన పుప్పాలగూడలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి సభావత్ లక్పతి అలియాస్ లక్కీ(34) మందులు ఇప్పించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచుగా రోజా కోసం ఇంటికి వస్తుండటంతో రోజా, రాగ్యానాయక్ మధ్య గొడవలు జరిగేవి. కొద్ది నెలల క్రితం రాగ్యానాయక్‌కు చెందిన 25 గుంటల స్థలాన్ని రూ.15 లక్షలకు లక్పతి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేయాలని అడగగా మరో రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. లావు తండాలో మే 23 పండుగ కోసం వచ్చిన లక్పతి రోజాతో ఓ గదిలో ఉండటం గమనించిన రాగ్యానాయక్ బంధువుల సమక్షంలోనే గొడవకు దిగాడు. కొన్న స్థలానికి పది లక్షలు ఎక్కువగా అడగడం, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి హత్య చేసేందుకు పథకం పన్నాడు. అందుకు రోజా కూడా అంగీకరించింది. దీంతో లక్పతి డబ్బులు ఇస్తానని నమ్మించి ఆగస్టు 19న షేక్ పేట్‌లోని భారత్ పెట్రోల్ బంక్ వద్దకు రావాలని రాగ్యానాయక్‌కు వేరే ఫోన్‌తో ఫోన్ చేశారు. నిద్రమాత్రలు కలిపి.. అక్కడికి రాగానే పది వేలు ఇచ్చి నాగార్జున సాగర్ వైజాగ్ కాలనీకి వెళితే మిగతా డబ్బు ఇస్తానని చెప్పాడు. బాచుపల్లిలో నివాసం ఉండె టీఎంఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వర్ రావు(30)తో కలిసి ముగ్గురూ కారులో వెళ్లారు. అలకాపురిలోని విజేత సూపర్ మార్కెట్లో బాధం మిల్క్ షేక్ బాటిళ్లు కొనుగోలు చేశారు. ఒక బాటిల్లో నిద్ర మాత్రలు పొడిచేసి కలిపారు. ఇబ్రాహీంపట్నం వెళ్లిన తరువాత ఎగ్‌పఫ్‌లు కొనుగోలు చేశారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత కారు ఆపి అందరూ కలిసి తిన్నారు. నిద్ర మాత్రలు కలిపిన బాదం మిల్్కషేక్ను రాగ్యానాయక్‌కు ఇచ్చారు. తాగిన 15 నిమిషాల లోపు అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నల్గొండ జిల్లాకు చెందిన చేపల వ్యాపారి పత్లావత్ మాన్సింగ్(32), వంకునావత్ బాలోజీ (23)లను రెడీగా ఉండాలని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న రాగ్యానాయక్ కాళ్లు, చేతులు కట్టి, బండ రాళ్లు ఉంచి చేపల వలలో చుట్టారు. అనంతరం పడవలో వేసుకొని కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో దాదాపు పది కిలో మీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ అందరు కలిసి రాగ్యానాయక్‌ను కృష్ణా నదిలో విసిరేశారు. షేక్‌పేట్‌లోని భారత్ పెట్రోల్‌బంక్ నుంచి బుగ్గ తండాకు వెళ్లే వరకు సీసీ పుటేజీలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. లక్పతి, రోజా, చెన్నుపల్లి వెంకట శివ నాగ మల్లేశ్వర్ రావు, పత్లావత్ మాన్ సింగ్, వంకునావత్ బాలోజీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు -
మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం
-
రెచ్చిపోయిన కౌన్సిలర్.. గ్యాంగ్‌తో కలిసి యువకులపై దాడి
సాక్షి, నల్లగొండ: జిల్లాలోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. కౌన్సిలర్ జానీ అండ్ గ్యాంగ్ ముగ్గురు యువకులను చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. స్థానిక వెంకటేశ్వర థియేటరలో సినిమా చూసేందుకు కౌన్సిలర్ జానీ బంధువులు వెళ్లారు. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా సినిమా చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమయంలో జానీ బంధువు, సదరు యువకుల(నాగరాజు, సతీష్, సాయితేజ) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఈ విషయాన్ని ఆ వ్యక్తి.. కౌన్సిలర్ జానీకి తెలియజేశాడు. తన బంధువుతోనే గొడవకు దిగాతారా అంటూ.. జానీ తన గ్యాంగ్(20మందితో)ని తీసుకొని థియేటర్ దగ్గరకు వచ్చి హల్చల్ చేశాడు. జానీతో పాటు గ్యాంగ్ కలిసి.. ముగ్గురు యువకులపై దాడి చేశాడు. వారి దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది కూడా చదవండి: సినిమా థియేటర్‌కు యువతులు.. ఓ వ్యక్తి ఫోటోలు తీసి అసభ్యకరంగా.. -
అమెరికాలో రోడ్డుప్రమాదం.. అన్నారం యువకుడి మృతి
సాక్షి, మిర్యాలగూడ టౌన్: అమెరికాలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి(24) మృతిచెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి–అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు సారెడ్డి చంద్రకాంత్‌రెడ్డి, సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు క్రాంతికిరణ్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీ.టెక్ పూర్తి చేశాడు. అదే సమయంలో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు 2021 జూలై 23వ తేదీన సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి వెళ్లాడు. ఆ తర్వాత తన అన్న సారెడ్డి చంద్రకాంత్‌రెడ్డి 2021 నవంబర్‌లో వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే దగ్గర ఉంటూ ఎంఎస్ చదువుతున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన తన స్నేహితులతో కలిసి క్రాంతికిరణ్‌రెడ్డి బయటికి వెళ్లగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని వెంటనే చెబితే తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని భయపడి.. అన్న చంద్రకాంత్‌రెడ్డి మంగళవారం ఈ సమాచారం అందించాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పరిసరాల ప్రజలు పెద్దఎత్తున వారి ఇంటికి తరలివచ్చారు. తల్లి అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదవండి: (పెళ్లి సంబధాలను చేడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని..) మా కుమారుడి మృతదేహాన్ని తీసుకురండి.. క్రాంతికిరణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మృతుడి తల్లిదండ్రులు సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. తన కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగిస్తే కళ్లారా చూసుకుంటామని బోరునవిలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు స్పందించి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహం తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం
-
ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో
సాక్షి, మిర్యాలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు కుమార్తె ప్రియాంక, అదే గ్రామానికి చెందిన తుర్క సందీప్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు మేజర్లు అయినప్పటికీ, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించి ఎవరికీ తెలియకుండా గత నెల 20న హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. బుధవారం ఈ విషయం ప్రియాంక ఇంట్లో తెలియడంతో ఇద్దరూ కలసి మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. చదవండి: మూడేళ్లుగా కానిస్టేబుల్‌తో ప్రేమ.. మాయమాటలతో లోబర్చుకొని.. మరో వ్యక్తితో పెళ్లైనప్పటికీ వారి వద్ద వివరాలు తీసుకున్న డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు కార్యాలయంలో మహిళా పోలీసులు లేనందున మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో వారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు డీఎస్పీ కార్యాలయం గేటు వద్దకు చేరుకునే లోగా అక్కడికి చేరుకున్న వైస్ ఎంపీపీ సైదులు అనుచరులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ జంట తిరిగి డీఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏఎస్ఐని రక్షణగా ఉంచి పోలీస్ వాహనంలో వారిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. కాగా ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని నిలదీయడంతో.. -
ఆ.. ఇల్లే ఒక ‘బృందా’వనం
మిర్యాలగూడ టౌన్: ఇంట్లో కొద్దిపాటి స్థలం ఉంటే చాలు..ఓ గది కట్టేద్దాం అనుకుంటాం. కానీ ఆ మహిళ తన ఇంటినే ఓ ఉద్యానవనంగా మార్చేసింది. తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి స్థలంలో పలు ఉద్యాన పంటలు వేశారు. పూల కుండీల్లో వివిధ రకాల మొక్కలు, కూరగాయాల మొక్కలను సాగు చేస్తూ అందరికి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. తన ఇంటిపైన వివిధ రకాల పూలు, కురగాయాలు, ఆకు కూరలు, పండ్లు పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాది ఓ మహిళ. ఎప్పుడు వంటింటిలో బీజీబీజీగా ఉండే ఈ మహిళకు మొక్కలు అంటే ఎంతో ప్రాణం. ఒక వైపు కుటుంబం కోసం మరో రెండు గంటల పాటు తన ఇంటిపై ఏర్పాటు చేపిన వనంపై సమయం కేటాయిస్తుంది పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ గోవర్ధనాచారి సతీమణి పద్మాగోవర్ధనాచారి గత కొంత కాలంగా సాంప్రదాయ ఎరువులను ఉపయోగించి మంచిదిగు సాగును చేస్తుంది. బృందావనంలా మారిన ఇల్లు: హనుమాన్‌పేటలో నివాసం ఉండే పయిడిమర్రి పద్మాగోవర్ధనాచారి ఇంటిపై అడుగుపెడితే చాలు అది ఒక బృందావనవనంగా ఉంటుంది. పచ్చదనం అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. తన ఇంటి స్లాబ్‌పై వివిధ రకాల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయాలు, పండ్ల మొక్కలు, రసాయన రహితంగా సహాసిద్దమైన పద్దతిలో పెంచుతుంది. అయితే ఏ జాతి మొక్కలకు ఎంత నీరు అవసరం, ఎంత వరకు సూర్యరష్మిపెరుగుతుంది. ఏ మొక్కకు ఎంత ఉష్ణోగ్రత ఉంటే తట్టుకుంది. ఎలా పండిస్తే భూసారం పెరుగుతుందనే విషయంపై తన భర్త సలహాలు, సూచనలు తీసుకుంటుంది. తన ఇంటి మూడవ ఆంతస్తుపై పర్మినెంట్‌గా గ్రీన్ సేట్‌ను ఇనుప సువ్వలతో తయారు చేసి పర్మినెంట్‌గా ఏర్పాటు చేసింది. కాగా ఐదారు డ్రమ్‌లు, 15 వరకు కుండీలు, బకెట్లలో రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టితో స్లాబ్ మీమ్‌లపై డ్రమ్ములు పెట్టి వివిధ రకాల మొక్కలతో పాటు ఆకుకూరలను వేసింది. వివిధ రకాల పంటలు: పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి తన ఇంటిపైన పందిరి వేయడంతో పాటు వివిధ కుండీలలో పూల మొక్కలు గులాబి, మల్లే, చామంతి, మందారం, లిల్లి, పారిజాతం, నూరు వరాల చెట్టులతో పాటు పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. అదే విధంగా ఆకు కూరలు అయిన పాలకూర, బచ్చలకూర, మోంతుకూరలను పెంచుతున్నారు. తీగ పాదులకు పందిరి వేసి బీర, సోర, కాకర, దొండ, చిక్కుడు, దోసకాయలను పందిరిపైకి ఎక్కించాడు. అదే విధంగా కూండీలలో వంగ, టమాట, మిర్చి, బెండ, కోతిమీర, పూదీనా, కరివేపాక, మిర్చి వంటివి పండిస్తున్నాడు. అదే విధంగా జామ, ద్రాక్షతో పాటు మరిన్ని పంటలను ఇంటిపై పెంచుతూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. వీటికి డ్రిఫ్తో ఖాళీ బాటిళ్లు, క్యాన్ల ద్వారా నీటి పోస్తున్నారు. మొక్కలతో ఎంతో ఆరోగ్యం తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో గ్రీన్ సెట్‌ను ఏర్పాటు చేసి ఈ మొక్కలకు ఎంత సూర్యరశ్మి అవసరం ఉంటుంది అనే దానిపై ఏర్పాటు చేశాం. ఇంటి మేడపై పూల మొక్కలు, కూరగాయాలతో పాటు వివిధ రకాల పండ్లను పెంచుతున్నాం. గత రెండేళ్లుగా తన ఇంటిపై పండిన కూరగాయాలు, పువ్వులను కూడా వాడుతున్నాం. అదే విధంగా పండ్లు కూడా మేము వేసిన చెట్టు ద్వారా వచ్చే పండ్లు, కూరగాయాలు తీనడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన కూరగాయాలను తీçనవచ్చు. దీని వలన ఒక వైపు పచ్చదనం, మరో వైపు మన ఇంటి అవసరాలు కూడా వెళ్లుతున్నాయి. – పగిడిమర్రి పద్మగోవర్ధనాచారి, మిర్యాలగూడ -
ధాన్యం కొనుగోలు చేయాలి
-
పోలీస్ వాహనంతో ఉడాయింపు
సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ యువకుడు పోలీసులకు షాకిచ్చాడు. రోడ్డుపై వాహనా లు నిలిపి మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను ప్రశ్నిస్తుండగా.. అందులో ఒకరు తప్పించుకుని ఏకంగా పోలీసుల వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మిర్యాలగూడ మండలం కొత్త గూడం గ్రామానికి చెందిన దైద మహేశ్, బాదలాపురం గ్రామానికి చెందిన బంటు సాయికిరణ్, నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సోమువంశీ స్నేహితులు. వీరు గురువారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తాలో రోడ్డుపై తమ వాహనాలను నిలిపి మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న రూరల్ సీఐ రమేశ్‌బాబు తన సిబ్బందితో కలిసి వెళ్తుండగా వారిని గమనించి ఆగారు. పోలీసులను గమనించిన ముగ్గురు స్నేహితులు పారిపోతుండగా పట్టుకుని వారి వద్ద నుంచి వివరాలు సేకరించే క్రమంలో సోమువంశీ పోలీసుల వాహనాన్ని స్టార్ట్ చేసుకుని కోదాడ రోడ్డు వైపునకు పారిపోయాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పోలీసులు..అదే రోడ్డులో విధులు నిర్వహిస్తున్న రూరల్ ఎస్ఐ పరమేశ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఎస్ఐ తన వాహనంలో సోమును వెంబడించారు. సినీ ఫక్కీలో చేజింగ్ జరుగుతుండగా వంశీ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో పోలీసు వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈలోగా వెనుకనుంచి వచ్చిన పో లీసులు సోమును అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు తమ వాహనం దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముగ్గురు యు వకులు మద్యం మత్తులో అర్ధరాత్రి వీరంగం సృష్టించడం సంచలనం కలిగించింది. ఆ యు వకులను అరెస్టుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపారు. -
వివాదంలో ఎమ్మెల్యే.. మహిళ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు భూ కబ్జాలను అడ్డుకున్నందుకు తన కుటుంబ సభ్యులపై కేసులు బనా యించి వేధిస్తున్నారని మిర్యాలగూడ పట్టణానికి చెందిన బంటు మణెమ్మ గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మిర్యాలగూడటౌన్ పోలీసులు కుమ్ముక్కై తమను వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నామని, ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని వివరించారు. ఎమ్మెల్యే, అతడి అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను అడ్డుకుని బాధితులకు అండగా నిలిచిన తన భర్త, న్యాయవాది బుచ్చిబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నట్లు తెలిపారు. (విలాసాల లేడీ.. రూ.4కోట్ల మోసం) ఎమ్మెల్యే ఒత్తిడితో మిర్యాలగూడ పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి ముఖ్యమైన ఫైళ్లు, కాగితాలు, పాస్ పుస్తకాలు, దస్తావేజులతో పాటుగా కీలకమైన పత్రాలను లాక్కెళ్లారని ఆమె వివరించారు. తన భర్త, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించిన మిర్యాలగూడ పోలీసులు, వేధింపులకు కారణమైన ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఒత్తిడితో సచ్చిపోతున్నా..
మిర్యాలగూడ అర్బన్: ‘చదివి.. చదివి ఒత్తిడితో సచ్చిపోతున్నాం కేసీఆర్ సార్.. పుస్తకం తీయాలంటే వణుకు వస్తుంది. త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వండి’అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు విషం తాగాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన సంపత్‌కుమార్ చాలా రోజులుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబానికి భారం అవుతున్నానని భావించి ఓ పురుగుల మందు డబ్బాను తెచ్చుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తను పడిన మానసిక వేదనను వివరించి ఆ పురుగుల మందు తాగేశాడు. తన తండ్రి సత్యనారాయణ టైలర్‌గా పనిచేస్తూ ఉన్నత చదువులు చదివించినా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియక, చేసేదిలేక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. విషం తాగి అపస్మారక స్థితిలోకి పోయిన సంపత్‌కుమార్‌ను గుర్తించిన తల్లితండ్రులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మా తాతగారు మాకెంతో స్ఫూర్తిదాయకం
శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి తాత, మీ గ్రేట్ సెన్సాఫ్ హ్యూమర్, పాజిటివ్ యాటిట్యూడ్, నాకు సులువుగా చెస్ నేర్పించిన తీరు, నన్ను ఎల్లప్పుడూ నవ్వించే విధానం నాకు చాలా ఇష్టం అందుకే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ తాత. మీకు 67వ పుట్టినరోజు శుభాకాంక్షలు - శ్రేయస్ - మనుమడు. శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి, మా తాతగారు, 1953 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని సికినాలలో రాఘవమ్మ - రామచంద్రయ్యగారి దంపతులకు జన్మించారు. వృత్తిపరంగా ఇంగ్లీష్ టీచర్ అయిన తనకు ఆంగ్ల భాష పట్ల, వ్యాకరణం పట్ల మక్కువ ఎక్కువ. విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, సరళంగా వివరించేవారు. అందులో ఉన్న మెలుకువలను వారికి నేర్పించి ఇంగ్లీష్ భాష పట్ల వారిలో ఉన్న భయాలను తొలగించేవారు. కేవలం చదువు మాత్రమే చెప్పి చేతులు దులుపుకునే వ్యక్తిత్వం కాదు తనది. అందుకే పుస్తకంలో ఉన్న పాఠాలతో పాటు ఎన్నో జీవితపాఠాలను కూడా విద్యార్థులకు నేర్పించేవారు. జీవితంలో ఎలా ఎదగాలి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని ఎదర్కొంటూ జీవితంలో పోరాడి ముందుకు ఎలా సాగాలి అనే విషయాలను కూడా చిన్ననాటి నుంచే తన విద్యార్థులకు చెప్పేవారు. తన బోధనలు కేవలం స్కూల్లో మార్కులు తెచ్చుకోవడానికే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను జయించడంలో ఎంతో ఉపయోగపడతాయి. (Advertorial) తను ఎన్నో విషయాలలో మాకు స్ఫూర్తిదాయకం. నాటకాలపట్ల తనకున్న ఆసక్తితో మహాభారతంలో శక్తిమంతుడైన భీముని పాత్రలు వేసి తన నటనతో అందరి మన్ననలు పొంది వారిచే, కళామతల్లి బిడ్డగా పేరు పొందిన ఓ గొప్ప కళాకారుడు. అంతేకాక, జిల్లా, డివిజినల్ స్థాయిలో అనేక క్రీడా టోర్నమెంట్లు నిర్వహించి శారీరక ధృఢత్వంపై తన ఆసక్తిని కనబరిచారు. గొప్ప నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా జీవితంలో అనుక్షణం కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఇప్పటికి 5 (తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ) భాషలలో తను నిష్ణాతులు అయినప్పటికీ, ఈ సంవత్సరం చివరిలోగా మొత్తం 10 భాషల్లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ఎందరినో ఆశ్చర్యపరిచి, మరెందరికో ఆదర్శంగా నిలిచారు. పెద్దల అక్షరాస్యత (వయోజన విద్య) కార్యక్రమంలో భాగమై, చిన్నతనంలో చదుకోవాలని ఉన్నా, పరిస్థితుల కారణంగా విద్యకు దూరమై అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న నిరక్షరాశ్యుల జీవితాలలో జ్ఞాన జ్యోతి నింపారు. జీవితంలో ఎదుగుదలకు అడ్డుతగులుతున్న విషయాలను అధిగమించడానికి విద్యావంతులుగా ఉండటం ఎంత అవసరమో వారికి వివరిస్తూ, విద్య పట్ల వారిలో ఆసక్తిని కలిగించి, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం అను ఈ కార్యక్రమ లక్ష్యాన్ని సాధించటానికి ఎనలేని కృషి చేసారు. కేవలం తన దగ్గరకు విధ్యాభ్యాసముకు వచ్చిన వారికి మాత్రమే కాకుండా, ఎందరో పట్టణ-పల్లెల్లో ఉన్న నిరక్షరాశ్యులకు అక్షర జ్ఞానం చేస్తున్న గొప్ప వ్యక్తి. ఎందరో ఉన్నత శిఖరాలకు చేరడానికి నిచ్చెనలా నిలిచిన మహోన్నత వ్యక్తి మా తాతగారు. తాను చేసిన కృషిని గుర్తించి విద్యా శాఖతోపాటు అనేక స్థానిక పాలక మండలి నిపుణులు తనను ప్రశంసించారు. (Advertorial) వీటిని మించి ముఖ్యంగా తన దాతృత్వం, పాజిటివ్ యాటిట్యూడ్, పట్టుదల, కొత్త విషయాల పట్ల తనకుండే ఆసక్తి, గెలుపు-ఓటములలో సమంగా వ్యవహరించడం వంటి లక్షణాలు తనను గొప్ప వ్యక్తిగా, మా అందరికి ఆదర్శంగా నిలిచేలా చేసాయి. తానొక గుప్త రచయిత, నిస్వార్థపరులు, మంచి పేరున్న కబడ్డీ ఛాంపియన్, తన ఇద్దరి కుమారులకు ఆప్యాయతను పంచే ఒక గొప్ప తండ్రి, నాన్నమ్మకు అన్నింటిలో అండగా-కష్టకాలంలో కొండంత బలంగా నిలిచే తోడు, అన్ని తెలిసిన ఎంతో వినయంతో ఒదిగి ఉండే మంచి మనస్తత్వం తన సొంతం; తానే మా తాతగారు. (Advertorial) నేను ఎదిగే కొద్ది, తను ఏర్పరుచుకున్న వారసత్వం యొక్క అంతర్భాగం మా కుటుంబం అని తెలుసుకున్నాను. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తను ప్రేమ, ఆప్యాయతలను పంచుతారు. ఏదేమైనా, చెప్పిన ఈ కారణాలు, చెప్పలేని అనేక కారణాల ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే… వి లవ్ యూ తాతగారు. చెరగని చిరునవ్వే తరగని ఆభరణంగా ధరించి, అందరి మంచిని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో వారి అభివృద్ధికై శ్రమించే ఉపాధ్యాయుడు మా తాతగారు శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి గారికి 67వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (Advertorial) ఇట్లు, ఆశ్చర్య చకిత - మనుమరాలు, శ్రేయస్ - మనుమడు, యోచన్ కుమార్ - మనుమడు. -
ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్
-
ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సంచలన చిత్రం ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రమ్ అనేది ట్యాగ్ లైన్) సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక ప్రేమ కథ రెండు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేసిందనేది సినిమాలో చూపిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాటలేం లేకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే ట్రైలర్‌ను చూపించారు దర్శకుడు. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి అనే టైటిల్స్‌తో సాగిన ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్ఎంసీ పెనాల్టీ) మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా మర్డర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఆర్జీవీ కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర రచనా, దర్శకత్వం వహిస్తున్నారు. (ఆర్జీవీ ట్వీట్: పవన్‌ను ఓదార్చిన బాబు) -
ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
-
అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..
సాక్షి, హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది వివాదాలు. ఎప్పుడు ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ మీడియాలో ఉండే వర్మ తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందులో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేస్తూ.. 'ఓ తండ్రి తన కూతురుని అమితంగా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇందులో చూపించబోతున్నా. ఫాదర్స్ డే రోజున ఒక విషాదభరితుడైన నాన్న పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నా' అంటూ వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై అమృతా ప్రణయ్ స్పందించినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ‘పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి దూరమయ్యాను. నా జీవితం తలకిందులైంది. నా వ్యక్తిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. నేను ఏంటనేది నాతో ఉన్న వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటన్నిటినీ భరిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతుంటే రామ్ గోపాల్ వర్మ రూపంలో నాకు మరో సమస్య ఎదురవుతోంది. దీనిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామనుకున్నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో సినిమా రూపంలో మరోసారి అందరి దృష్టి నాపై పడేలా చేస్తున్నావు. డబ్బు, పేరు కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఎన్నో బాధలను అనుభవించిన నాకు ఈ బాధ మరీ పెద్దది కాదు' అంటూ అమృత వ్యాఖ్యలు చేశారు. చదవండి: అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్ అయితే అమృత చేసిన వ్యాఖ్యలపై వర్మ తాజాగా స్పందిస్తూ.. మొదటగా నేను రిలీజ్ చేసిన పోస్టర్లో మర్డర్ ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్నది అని స్పష్టంగా చెప్పాను. కానీ నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. గతంలో కూడా నిజ జీవిత కథల ఆధారంగా నేను తీసిన ఎన్నో కథలను ప్రజలు ఆదరించారు. నేను కొందరిని మంచివారిగా.. మరికొందరిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిగా చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా మరెవరైనా సరే బాధ అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. నా చిత్తశుద్ధితో వారి బాధలను గౌరవిస్తూ.. మర్డర్ సినిమాలో వారు ఎదుర్కొన్న పరిస్థితులనే చూపిస్తున్నట్లు' వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వర్మ వరుసపెట్టి ట్వీట్స్ చేశారు. -
అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్
ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషాదగాథకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అని వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ లైన్ ఉంచారు. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. This is going to be a heart wrenching story based on the Amrutha and Maruthi Rao saga of the DANGERS of a father LOVING a daughter too much ..Launching the poster of a SAD FATHER’S film on HAPPY FATHER’S DAY #MURDERlove pic.twitter.com/t5Lwdz3zGZ — Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2020 -
నా కోసం ఎవరూ ఏడ్వకండి..
సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ వైద్యుడి భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రెడ్డి కాలనీలోని అహల్య అపార్ట్మెంట్లోని నివాసంలో దంత వైద్యురాలు శ్వేత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆమె భర్త బండారు కుమార్ పిల్లల వైద్య నిపుణులు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. పట్టణంలో భార్యాభర్తలకు మంచి పేరు ఉంది. కుటుంబ కలహాలు కారణంగా తరచుగా ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారని ఇరుగుపొరుగు చెబుతున్నారు. మనస్పర్థల కారణంగానే శ్వేత జీవితంపై విరక్తి చెంది ఈ ఘటనకు పాల్పడ్డారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితోనే ఈ ఘటనకు పాల్పడుతున్నానంటూ డైరీలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్లో...తనకు భర్తతో జీవితాంతం కలిసి జీవించాలని ఉన్నా ఆ కోరిక తీరడం లేదని, తన పేరు మీద ఉన్న ఆస్తి పాస్తులు తన కూతురికి చెందాలని, తనకోసం ఎవరూ కేసులు పెట్టుకుని గొడవలు పడొద్దని డైరీలో రాశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా భార్య మృతదేహం చూసి డాక్టర్ కుమార్ భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత
సాక్షి, మిర్యాలగూడ : ఈనెల 8న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఆత్మహత్య చేసుకున్న తిరుగనరు మారుతీరావు కుమార్తె అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను పోలీసుల రక్షణ మధ్య ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించి అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసి కొంత సమయం ఆమెతో గడిపింది. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియల వద్ద అమృతకు చేదు అనుభవం.. తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తండ్రి మృతదేహాన్ని చూడటానికి అంత్యక్రియల సమయంలో పోలీసుల భద్రత నడుమ శ్మశానవాటిక వద్దకు వచ్చిన అమృతను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అమృత గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పాటు తోపులాట జరిగింది. దాంతో తన తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగింది. అంత్యక్రియల అనంతరం అమృత బాబాయి శ్రవణ్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!) తల్లితో పది నిమిషాలు.. తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం నా లుగు రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో ప ట్టణంలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది. ('అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ') -
తల్లి గిరిజను కలిసిన అమృతా ప్రణయ్
సాక్షి, నల్లొండ : రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్ భార్య అమృత శనివారం సాయంత్రం ఆమె తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) ఈ నేపథ్యంలో తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి పరామర్శించారు. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మారుతీరావు మరణం అనంతరం అమృత బాబాయ్ శ్రవణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రవణ్ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో ) -
సమాజానికి ‘అమృత’ సందేశం
తండ్రి ఆత్మహత్య నేపథ్యంలో, హత్యకు గురైన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు అని అమృత మన సమాజానికి ఇస్తున్న సందేశం శాశ్వత విలువ కలిగినది. తెలంగాణలోని మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే 24 ఏళ్ల దళిత యువకుడిని గర్భిణి అయిన భార్య సమక్షంలోనే 2018 సెప్టెంబర్ 24న నరికి చంపారు. అమృత ఆ పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యువతి. తన తండ్రి మారుతిరావును ధిక్కరించి మరీ ఆమె ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. అమృతకు ఇప్పుడు 25 ఏళ్లు. సంపన్నులైన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్, తదితర వ్యాపారాలతో భారీ ఆస్తులు కూడగట్టుకున్నారు. పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయనకు 200 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న సంపన్న పట్టణమైన మిర్యాలగూడ.. తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగే పట్టణాల్లో ఒకటి. ఈ పరిస్థితిని మారుతిరావు సంపదను కూడగట్టుకోవడానికి అనువుగా మల్చుకున్నారు. ప్రణయ్ హత్యకేసులో అమృత తండ్రితో పాటు మరి కొందరు జైలుకెళ్లారు. కొన్నినెలల క్రితమే వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. తన భర్త హత్య తర్వాత అమృత మిర్యాలగూడలో తన అత్త, మామలతోటే వారి సొంత ఇంటిలో కలిసి ఉంటోంది. భర్త హత్యకు గురైనప్పుడు ఆమె ఆరునెలల గర్భిణి. అమృత తన అత్తతో కలిసి వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలోనే ఆమె భర్తను నరికి చంపారు. న్యాయంకోసం చెరగని నిబద్ధత తర్వాత ఆమె బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడతడు సంవత్సరం బిడ్డ. ఈ సమయంలోనే 2020 మార్చి 6న మారుతిరావు నోట్ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నోట్లో తన కుమార్తె తన ఇంటికి తిరిగి వచ్చి తల్లితో కలిసి ఉండాలని కోరుకున్నారు. తన తండ్రి ఆత్మహత్య తర్వాత, న్యాయంకోసం అమృత నిబద్ధత పట్ల మీడియాలో వస్తున్న కథనాలు నిజంగానే సినిమా కథను తలపిస్తున్నాయి. మారుతిరావు పక్షాన కేసు వాదిస్తున్న లాయర్ చెప్పిందాని ప్రకారం, తన కుమార్తె అమృతను తిరిగి తనవద్దకు తెచ్చుకునేందుకు కన్నతండ్రి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ అమృత తన భర్త హత్యకు న్యాయం జరగాలనే తన వైఖరినుంచి అంగుళం కూడా పక్కకు జరగడానికి తిరస్కరించింది. తన తండ్రి, నిజమైన హంతకుడు బిహార్‌కి చెందిన శుభాష్ శర్మ, ప్రణయ్ హత్యకు సహకారం అందించిన ఆమె చిన్నాన్న శ్రవణ్‌లకు కఠిన శిక్ష పడాలని ఆమె కోరుకుంది. ప్రణయ్ హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలని ఆమె తండ్రి ఎంతగా ప్రయత్నించాడో అంతకంటే దృఢంగా మారిన అమృత తనను బెదిరిస్తున్నారని ఆరోపించి మరిన్ని కేసులను దాఖలు చేసింది. తన తండ్రి చనిపోయిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె వెళ్లలేదు కానీ పోలీసు రక్షణ మధ్య శ్మశానవాటికలో తండ్రి మృతదేహాన్ని చూసి రావాలని ప్రయత్నించింది. కానీ ఆమె బంధువులు ఆమెను తండ్రి శవాన్ని చూడటానికి అనుమతించలేదు. దాంతో ఆమె మౌనంగా పోలీసు వ్యాన్‌లో వెనక్కి వెళ్లిపోయింది. ప్రణయ్ హత్య తర్వాత తన బాధను అర్థం చేసుకుని తన పక్కన నిలబడిన తన దళిత అత్త, మామతోనే ఆమె ఉంటోంది. తండ్రి ఆత్మహత్య అనంతరం ఆ తర్వాత శ్మశాన వాటికలో ఆమె మీడియాతో చెప్పిన మూడు విషయాలు టీవీ తెరపై చూస్తున్న ప్రతి ఒక్కరినీ నివ్వెరపర్చాయి. ఆమె చెప్పిన మాటలివి. 1. ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 2. కుటుంబ సభ్యుల పేర్లతో, బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్కచేయను. నా తండ్రికి అనేక ఆస్తులున్నాయని నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు. 3. ప్రధాన నిందితుడైన తండ్రి మరణించాక అమ్మవద్దకు వెళతావా అని మీడియా అడిగినప్పుడు ఆమె ‘నేను ఇప్పుడు నా కుటుంబంతో, నా కుమారుడితో, నా అత్తమామలతోనే ఉంటున్నాను. అమ్మ కూడా నావద్దకు వస్తే మేం ఆమెను బాగా చూసుకుంటాం. అంతే కానీ మా నాన్న ఇంటికి మాత్రం వెళ్లను’ అని చెప్పింది. కులతత్వానికి బలైన కుటుంబం మరణించిన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ప్రణయ్ దళితుడు కాకపోయి ఉంటే ఆమె తండ్రి బహుశా అతడిని చంపించి ఉండకపోవచ్చు. ప్రణయ్ మరో కులానికి చెంది ఉంటే వారిని మారుతిరావు వదిలివేసి ఉండేవాడు. కానీ కులం చుట్టూ అంటుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. చివరకు మారుతిరావు భార్య కూడా నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మారుతిరావు తన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమించారని చెబుతున్నారు. తన కుమార్తెకు ఇవ్వడం కోసమే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. కాని తన కుమార్తె ఒక యువకుడిని ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతడిని దారుణంగా హత్య చేసే వరకు కన్నతండ్రి తెగించారు. కానీ ఆయన కన్నకుమార్తె ఈ సమాజానికి ఒక విభిన్నమైన నైతిక సందేశాన్ని పంపింది. తమపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను ప్రదర్శించడం అంటే ఆ పిల్లల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించే హక్కు తమకు ఉంటుందని కాదు. అంతకు మించి కుల వ్యవస్థ మనిషి జీవితాన్ని, ప్రేమను, మానవ విలువలను అస్సలు నిర్ణయించకూడదు. మారుతిరావు మానవ జీవి తానికి సంబంధించిన చెడు ఉదాహరణగా నిలిచారు కానీ ఆయన కుమార్తె తన యవ్వన జీవితంలోనే అత్యంత విభిన్నమైన దారిలో నడుస్తోంది. తన భర్తను కోల్పోయింది. ఆ బాధను అనుభవిస్తూనే బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రినుంచి ఒత్తిళ్లకు గురైంది. మీడియా డేగచూపులను ఎదుర్కొంటోంది. పోలీసు రక్షణలోనే జీవిస్తోంది. చివరకు కన్నతండ్రి ఆత్మహత్యను కూడా భరిస్తోంది. ఒక అగ్రకుల సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని ఇన్ని రకాల విషాదాలు, గాయాలు ఇంత చిన్న జీవితంలో వెంటాడుతూ వచ్చాయి. కలకాలం నిలిచే సందేశం కన్నతండ్రి ఆత్మహత్య తర్వాత మీడియా ఆమెను విభిన్నమైన ప్రశ్నలతో వెంటాడుతోంది. అమృత నుంచి ఆశ్చర్యకరమెన విషయాలను వినాలని టీవీలకు అంటుకుపోయి చూస్తున్న ప్రజలను ప్రశాంతంగా, స్థిరంగా కనిపించిన అమృత నిశ్చేష్టులను చేసింది. ఇంటర్వ్యూలలో ఆమె అత్యంత పరిణతిని, మానవీయమైన, కుల వ్యతిరేక సంస్కృతిని, నడతను ప్రదర్శించింది. భర్తను చంపించిన కన్నతండ్రే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ ఘటనల మొత్తంలో ఏ పాత్రా లేని, ఏమీ చేయని కన్నతల్లి వద్దకు ఇప్పుడు మీరు ఎందుకు వెళ్లడం లేదు అని ఒక మీడియా వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు అందరి మతిపోగొట్టింది. ‘‘నా కోసం నా అత్తమామలు వారి కొడుకును పోగొట్టుకున్నారు. నా జీవితంలోని అత్యంత కఠిన పరిస్థితుల్లో వారే నాకు నా బిడ్డకు తోడుగా ఉన్నారు. నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వారే. మా అమ్మ నన్ను ప్రేమిస్తున్న్టట్లయితే, ఆమే మా వద్దకు వచ్చి మాతో కలిసి జీవించాలి’’. తన భర్త హత్యకు గురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. ‘నా పోరాటం మొత్తంలో నా భర్త కుటుంబంలోనే మానవీయతను నేను చూశాను. మా నాన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో ఘోరమైన చర్యలు చేపట్టారు. కానీ నా కష్టకాలంలో నా కుటుంబం నాతో వ్యవహరించిన దానికంటే ఎంతో బాగా నా అత్తమామలు నన్ను చూసుకున్నారు. వారిది దిగువ మధ్యతరగతికి చెందిన దళిత కుటుంబం. మా నాన్న చాలా సంపన్నుడు, పైగా అధికార బలం ఉన్నవాడు. కానీ నా అత్తమామలు తన కుమారుడికోసం, అతడి మరణం తర్వాత నా కోసం దేన్నయినా కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడే నేను నిజమైన మానవీయతను చూశాను. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు’. భారతీయ సమాజానికి అమృత ఇస్తున్న ఈ సందేశం కలకాలం నిలిచివుంటుంది. వ్యాసకర్త: ప్రొ'' కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ప్రణయ్ హత్య కేసు 23కు వాయిదా
సాక్షి, నల్లగొండ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విచారణ 23వ తేదీకి వాయిదా పడింది. నల్లగొ ండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో సాగుతున్న ఈ కేసుకు సంబంధించి చార్జీషీట్ వేశారు. అయితే వాదనలకు ముందుజరిగే చార్‌్జఫ్రేమ్ కార్యక్రమం మంగళవారం జరగాల్సి ఉంది. కాగా ప్రణ య్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సమాచారాన్ని పోలీసులు ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తికి అందజేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!) కాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. చార్‌్జఫ్రేమ్ చేస్తే ఇరుపక్షాల నుంచి పోలీసులు మోపిన అభియోగాలను నిందితులకు వినిపించి వాదనల షెడ్యూల్డ్‌ను ఖరారు చేయాల్సి ఉండగా మారుతీరావు ఆత్మహత్యతో వాయిదా పడింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కుమార్ మినహా సుభాష్‌శర్మ, అస్గర్‌అలీతో పాటు అబ్దుల్‌బారీ, కరీం, శివ, నిజాంలను పోలీసులు హాజరుపరిచారు. కేసు వాయిదా అనంతరం వారిని తిరిగి జిల్లా జైలుకు తీసుకెళ్లారు. ('అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ') -
అందరి దృష్టి ఆస్తులపైనే..
-
ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!
అతనో సాధారణ కిరోసిన్ వ్యాపారిగా మిర్యాలగూడ పట్టణవాసులకు సుపరిచితుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ అవతారమెత్తి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగెత్తాడు. పరువు హత్య అభియోగంతో అదే తరహాలో అథఃపాతాళానికీ పడిపోయాడు. చివరకు తన మరణశాసనాన్ని తానే లిఖించుకుని మరోమారు సంచలనంగా మారాడు.. అతనే తిరునగరు మారుతీరావు. ఆత్మహత్య ఉదంతం కూడా అతని ఆస్తుల చుట్టే తిరుగుతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, మిర్యాలగూడ : అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి... చివరికి ఆత్మహత్యతో ప్రస్తానం ముగిసింది. సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తిరునగరు మారుతిరావు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. మారుతీరావు కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్‌ని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లుగా మారుతీరావు అభియోగాలు ఎదదుర్కొని ఎ1 నిందితుడిగా ఏడు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మారుతిరావు తన ఆస్తులను చక్కబెట్టుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. చదవండి: డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు అందరి దృష్టి ఆస్తులపైనే.. మారుతిరావు కూతురు అమృత మీడియాతో మాట్లాడిన సమయంలో బినామీలు ఉన్నారని, ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్పడంతో అందరి దృష్టి అతడి ఆస్తి విషయంపైకి మళ్లింది. 25 ఏళ్ల క్రితం సాధారణ కిరోసిన్ వ్యాపారిగా పాత స్కూటర్‌పై తిరిగిన మారుతిరావు అనతి కాలంలోనే కోట్లాదిపతిగా మారాడు. అటు బిల్డర్ అవతారం ఎత్తి అద్దంకి – నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న శరణ్య గ్రీన్హోమ్స్లో సుమారు వంద నివాసాలు నిర్మించి విక్రయించాడు. దాంతో పాటు అక్కడే ఉన్న అపార్ట్మెంట్లు, ఈదులగూడలో రెండంతస్తుల షాపింగ్ మాల్స్ నిర్మించి విక్రయించినట్లు సమాచారం. అదే విధంగా పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌కు అతి సమీపంలో నటరాజ్ థియేటర్ స్థలంలో అతి పెద్ద మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉండగా అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉండేది. దాంతో పాటు అద్దంకి – నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో చింతపల్లి రోడ్డు సమీపంలో ఒకటి, ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో ఖాళీ స్థలాలు ఉన్నట్లు సమాచారం. తాళ్లగడ్డ సమీపంలో ఒక వెంచర్, దామరచర్ల మండలంలో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా సుమారుగా రూ.200 కోట్లకుపైగా ఆస్తులు సంపాధించిన మారుతీరావు చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని ముగించాడు. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ' బినామీలు సర్దుకున్నారా? బిల్డర్‌గా, రియల్టర్‌గా కొనసాగిన మారుతీరావు తనతో పాటు కొంతమందిని బినామీలుగా వాడుకున్నట్లు సమాచారం. బినామీలుగా ఆయన వద్ద గతంలో పని చేసిన వారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబసభ్యుల పేరున కూడా భూములు కొనుగోలు చేసి వారికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించినట్లు సమాచారం. వారి వద్ద నుంచి అవసరం వచ్చిన సమయంలో తిరిగి ఆయన పేరు మీదకి మార్చుకునే వారని తెలిసింది. కాగా ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత మంది బినామీలు భూములను విక్రయించుకోవడంతో పాటు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్తులను సర్దుకున్నట్లు సమాచారం. రూ.కోట్ల విలువల గల ఆస్తులను బినామీలు చక్కబెట్టుకోవడంతో ఆయన ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉండే వారని తెలిసింది. మారుతీరావు ఆస్తుల విషయంపై పోలీసులు విచారణ చేస్తే బినామీలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు ఉన్నట్లు ప్రచారం? ఆస్తుల విషయంలో కటుంబ సభ్యులకు వివాదాలు ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఏ కోణంలో చేసుకున్నాడనే విషయంపై పోలీసులు విచారించనున్నారు. ఆయన ఆస్తుల విషయంపై వివాదాలు ఉన్నాయని, ఇటీవలనే పంపకాలు కూడా చేసుకున్నట్లు తెలిసిందని అమృత మీడియా ముందు చెప్పడంతో మరింత చర్చ జరుగుతోంది. మారుతీరావు అప్పులుంటే వడ్డీతో సహా తీర్చుతానని, రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోతే చేస్తానని శ్రవణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు తన ఆస్తుల వీలునామా కూడా రాసినట్లుగా పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. చదవండి: కూతురు రాదనే... మనస్తాపంతోనే -
ప్రణయ్ హత్యకేసు: చార్జ్‌షీట్‌లో ఏముందంటే?
సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అహ్మద్ భారీ, కరీం, శివ, నిజాం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ-1)గా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలపడంతో.. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన.. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.(అమృతాప్రణయ్‌కు నిరాశ.. దక్కని చివరి చూపు!) కాగా సాక్షి టీవీ చేతికి చిక్కిన ప్రణయ్ హత్య కేసు చార్జ్‌షీట్ ప్రకారం.. ఈ కేసులో మారుతీరావు సహా 8 మంది నిందితుల పేర్లను పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఏ-1 గా మారుతీరావు, ఏ-6గా ఆయన తమ్ముడును శ్రవణ్‌ను పేరును చేర్చి.. 102 మంది సాక్షులను విచారించి... అమృత- ప్రణయ్‌ల ప్రేమ మొదలు.. ప్రణయ్ హత్య వరకు ప్రతీ అంశాన్ని1200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రణయ్ హత్య సమయంలో అతడి భార్య అమృత ఆరు పేజీల స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమెతో పాటు ప్రధాన నిందితుడు మారుతీరావు, శ్రవణ్, ప్రణయ్ తండ్రి బాలస్వామి తదితరుల ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. (డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు) ప్రణయ్ హత్య సమయంలో అమృత ఇచ్చిన ఆరు పేజీల స్టేట్మెంట్ ప్రకారం నేను స్కూళ్లో చదువుతున్నపుడే ప్రణయ్‌తో పరిచయం. మిర్యాలగూడ కాకతీయ స్కూల్ లో మా ప్రేమ మొదలు. నేను 9 వ తరగతి చదువుతున్నపుడు, ప్రణయ్10వ తరగతి చదువుతున్న సమయంలో స్నేహం మొదలైంది.. ఆ తరువాత ప్రేమగా మారింది. మేము ఇద్దరం చనువుగా ఉండటం చూసి ప్రణయ్ తక్కువ కులం వాడు, అతనితో మాట్లాడవద్దని మా నాన్న నన్ను బెదిరించాడు. చదువు మద్యలో ఆపించి ఇంటి నుండే పరీక్షలు రాయించాడు. ఇంటర్ కూడా మధ్యలో ఆపించేసి ఇంట్లోనే ఉంచాడు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో కూడా.. నేను ఇంకా ప్రణయ్‌తో మాట్లాడుతున్నా అని డిస్కంటిన్యూ చేయించాడు. ఒక రోజు మిర్యాలగూడ రాఘవ్ టాకీస్‌లో నేను, ప్రణయ్ సినిమాకి వెళ్ళినపుడు మా నాన్న, బాబాయ్ శ్రవణ్ అక్కడికి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళి బాగా కొట్టారు. ప్రణయ్ వాళ్ల తల్లిదండ్రులను పిలిచి బెదిరించారు. కొన్ని రోజులు ప్రణయ్ నాకు దూరంగా ఉన్నాడు. నేను ప్రణయ్‌తో మాట్లాడకుండా ఉండలేక పెళ్లి చేసుకుందాం లేకపోతే చచ్చిపోదాం అని చెప్పాను.(ఇలా చితికి..) ఆ తర్వాత ప్రణయ్ అంగీకరించడంతో 2018 జనవరి 30 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాం. మిర్యాలగూడలో నేను కనిపించలేదని మా నాన్న మారుతీరావు మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు నన్ను, ప్రణయ్‌ను మిర్యాలగూడ తీసుకొచ్చాక.. నేను ప్రణయ్ మేజర్లు కావడంతో ప్రణయ్ వాళ్ల ఇంట్లోనే ఉంటా అని చెప్పాను. 2018 ఆగస్ట్ 17 న ప్రణయ్ తలిదండ్రులు మా రిసెప్షన్ గ్రాండ్‌గా చేశారు. అప్పటి నుంచి పగ పెంచుకున్న మా నాన్న ప్రణయ్‌ను అంతం చేస్తా అని హెచ్చరించాడు. 2018 సెప్టెంబర్ 14 న చెకప్ కోసం జ్యోతి హాస్పిటల్‌కు వెళ్ళిన సమయంలో ప్రణయ్‌ను హత్య చేశారు. మారుతీరావు స్టేట్మెంట్ మా కంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుని నా కూతురు మా పరువు తీసింది. సమాజంలో తల ఎత్తుకోలేక పోయాం. స్కూల్ నుంచే వారి ప్రేమ నడుస్తుంది. ఎన్నోసార్లు ప్రణయ్‌ను మర్చిపొమ్మని నా కూతురికి చెప్పాను. అయినా వినలేదు. మాకు ఇష్టం లేకుండా హైదరాబాద్ పోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అయిన దగ్గరి బంధువులతో రాయబారం పంపినా నా కూతురు రాలేదు. అందుకే ప్రణయ్‌ను చంపాలనుకుని ప్లాన్ చేశాను. హత్యకు డబ్బు అవసరం అవుతుంది.. కాబట్టి నా తమ్ముడికి చెప్పి డబ్బు సమకూర్చాలని అడిగాను. ప్రణయ్‌ను హత్య చేయించమని కిరాయి ఇచ్చాను. మారుతీరావు తమ్ముడు శ్రవణ్ స్టేట్మెంట్ అమృత ప్రణయ్‌ల పెళ్లి మా అన్నయ్యను తల దించుకునేలా చేసింది. సమాజంలో మా పరువూ పోయేలా అమృత ప్రవర్తించింది. ప్రణయ్‌ను హత్య చేయించడానికి డబ్బు అవసరం అవుతుంది అని అన్నయ్య అన్నాడు. చింతపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఉన్న ప్లాట్ అమ్మి డబ్బు జమ అయ్యేలా చూస్తా అని చెప్పా. తాలకిల విజయ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ప్లాట్ అమ్మాలని పత్రాలు సిద్ధం చేసుకున్నాం.(డబ్బుల కోసం అమృత డ్రామాలు..) ప్రణయ్ తండ్రి బాలస్వామి స్టేట్మెంట్ స్కూల్ నుంచే అమృత- ప్రణయ్ స్నేహితులు. తనని ప్రేమించమని అమృత.. మా అబ్బాయి ప్రణయ్ నీ కోరింది. తన ప్రేమను కాదంటే అమృత అత్మహత్య చేసుకుంటా అని చెప్పింది. మా అబ్బాయి ప్రణయ్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అమృతను తీసుకుని ఆర్య సమాజ్ పోయి పెళ్లి చేసుకున్నారు. పలు మార్లు మా కుమారుడిని చంపుతామని బెదిరించారు. మారుతీరావు , శ్రవణ్ కుమార్ ఇద్దరు మా అబ్బాయిని చంపేందుకు కుట్ర పన్నారు. మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించేవారు. అమృత ప్రెగ్నెంట్ అయ్యాక జ్యోతి హాస్పిటల్‌కు వెళ్లి వస్తున్న టైంలో నా కొడుకు ప్రణయ్‌ను చంపేశారు.(అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు) -
'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ'
సాక్షి, మిర్యాలగూడ : కూతురు అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ.. ఆమె కోసం పడరాని పాట్లు పడ్డాడు. జైలు జీవితం గడిపినా.. శిక్ష పడుతుందని తెలిసినా.. కూతురు తనవద్దకు వస్తుందనే ఆశతోనే ఉండేవాడని ప్రతి ఒక్కరి నోళ్లలో ఇదే చర్చ. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ఆయన ఇంటి వద్ద గుమిగూడిన ప్రజల నోళ్లలో కూతురు అమృత తన వద్దకు వస్తుందని ఎదురు చూశాడనే చర్చించుకుంటున్నారు. మారుతీరావు మృతదేహం వద్ద ఆయన భార్య గిరిజ ఏడుస్తూ కూడా అమృత తన వద్దకు వస్తుందనే ఎదురు చూసి.. ఇక రాదని తెలిసి ఇలా చేశాడని రోదించింది. చనిపోయే సమయంలో రాసిన సూసైడ్ నోట్లో కూడా “ గిరిజా క్షమించు.. అమృత.. అమ్మ వద్దకు వెళ్లు’ అని రాసిన లెటర్ మారుతీరావుకు కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని చర్చించుకున్నారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన న్యాయవాది కూడా కూతురు కోసం వేచి చూశాడని పేర్కొన్నారు. శిక్ష తప్పనిసరిగా పడుతుందని తెలిసినా కూతురు తన వద్దకు వస్తే చాలని మారుతీరావు భావించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇష్టమైన గారెలు తిని.. మారుతీరావుకు గారెలంటె ఇష్టమని, చివరి క్షణంలో వాటిని తిని చనిపోయాడని మృతదేహం వద్ద బంధువులు విలపించారు. మిర్యాలగూడలోనే తన వ్యాపారాలు చేసుకుంటూ ఉండే మారుతీరావు న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగి రాలేదని ఆయన భార్య గిరిజ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: ఇలా చితికి.. అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు! -
'మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు'
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదని, భవిష్యత్తులో దానిపై ఎలాంటి న్యాయ పోరాటం చేయబోనని ఆయన కూతురు అమృత స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని ప్రణయ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక మనిషి మరో మనిషిని చంపడం మంచిది కాదన్నారు. ప్రణయ్‌ను చంపి మారుతీరావు తప్పు చేశాడని, అయినా చనిపోయిన వారిపై గౌరవంతోనే తాను శ్మాశానవాటిక వద్దకు వెళ్తే చూడనివ్వలేదని అన్నారు. (డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది..) ఆయన చివరి కోరిక ప్రకారం నేను అమ్మ వద్దకు వెళ్లేది లేదని, ఆమె నా వద్దకు వస్తే నా వద్దే ఉంచుకుంటానని తెలిపారు. తన బాబాయి శ్రవణ్ వలన ఆమెకు ప్రాణహానీ ఉండవచ్చని ఆరోపించారు. మారుతీరావు ఆస్తి తన పేరుపై లేదని తెలిపారు. అది బినామీల పేరుపై ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్‌ను చంపే వరకు కూడా ఆస్తి ఉమ్మడిగానే ఉందని జైలు నుంచి విడుదలైన తర్వాతే పంచుకున్నారని విన్నానని తెలిపారు. ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉన్న వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదని అన్నారు. భర్త పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని, మా అమ్మ బాధను అర్థం చేసుకోగలని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ఆ విషయంపై మా ఇంటికి వచ్చిన వారిని సీసీ కెమరాల్లో చూశానని, ఆ సమయంలో వచ్చిన వ్యక్తితో ఖరీం ఫోన్లో మాట్లాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీలునామా గురించి నాకు తెలియదని తెలిపారు. (చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం) తండ్రి అని సంబోధించని అమృత.. అమృత మీడియాతో మాట్లాడినంత సేపు మారుతీరావు, గిరిజ, శ్రవణ్ అని మాత్రమే సంబోధించారు. కానీ తండ్రి, తల్లి, బాబాయి అనే పదాలు కూడా ఆమె నోటి నుంచి రాలేదు. కూతురు కోసమే చనిపోయాడని బయట మాటలు వినిపిస్తున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు, వారి ప్రాణాలు వారు తీసుకునే హక్కు కూడా లేదన్నారు. తండ్ని అని సంబోధించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు దాట వేస్తూ వెళ్లిపోయారు. -
కూతురు రాదనే... మనస్తాపంతోనే
సాక్షి, మిర్యాలగూడ : కూతురు అమృత తన వద్దకు వస్తుందని మారుతీరావు చివరి వరకు ఆశపడ్డారు. కానీ ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందాడు. క్షణికావేశంలో అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేయించి జైలు పాలైన మారుతీరావు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మారుతీరావు మృతదేహానికి ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడలోని తన నివాసంలో ఉంచారు. కాగా ఉదయం బంధువులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. మారుతీరావు మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన భార్య గిరిజను పరామర్శించారు. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రాజీవ్‌చౌక్ మీదుగా షాబ్నగర్ శ్మశానవాటికకు చేరుకుంది. మారుతీరావు చితికి ఆయన తమ్ముడు తిరునగరు శ్రవణ్ తలకొరివి పెట్టాడు. (‘మొన్నరాత్రి మారుతిరావు నాకు ఫోన్ చేశాడు’) అమృతను అడ్డుకున్న బంధువులు తండ్రి మృతదేహాన్ని చూడటానికి షాబ్‌నగర్‌లోని శ్మశానవాటిక వద్దకు చేరుకున్న అమృతను మారుతీరావు బంధువులు అడ్డుకున్నారు. ఆమె ఇంటి నుంచే పోలీసు బందోబస్తుతో పోలీసుల వాహనంలోనే శ్మశానవాటికకు చేరుకుంది. కా గా ఆదివారం చనిపోతే ఇంటికి రాకుండా శ్మశానవాటిక వద్దకు రావడమేంటని, గో బ్యాక్ అ మృత.. మారుతీరావు అమర్ రహే అంటూ ని నాదాలు చేశారు. కాగా పోలీసులు కూడా చేసేది లేక అమృతను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. పరామర్శించిన పలువురు నాయకులు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో సోమవారం ఆయన నివాసం వద్ద పలువురు నాయకులు మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన భార్యను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు శ్మశానవాటిక వరకు చేరుకున్నారు. శ్మశాన వాటిక వద్దకు అమృత వచ్చే సందర్భంగా ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్రావుకు సూచించారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, నల్లమోతు భాస్కర్‌రా>వు తనయుడు సిద్ధార్థ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మి ల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, బీజేపీ నాయకులు కర్నాటి ప్రభాకర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య సంఘ నాయకులు రేణుకుంట్ల గణేష్‌గుప్తా, చిల్లంచర్ల విజయ్‌కుమార్, ముత్తింటి వెంకటేశ్వర్లు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మోసిన్‌అలీ, కాంగ్రెస్ మున్సిపల్‌ఫ్లోర్ లీడర్ బత్తుల లక్షా్మరెడ్డి తదితరులున్నారు. ('మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు') ఏరియా ఆస్పత్రికి అమృత... అమృత ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అస్వస్థతకు గురైంది సదరు టీవీ చానల్ వారు అమృత బాబాయ్ శ్రవణ్‌ను ఫోన్ ద్వారా లైన్లోకి తీసుకుని డిబెట్ ఏర్పాటు చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అమృత ఆవేషానికి లోనై కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో నీరసంతో పడిపోయిందని పోలీసులు తెలిపారు. -
ఇలా చితికి..
మిర్యాలగూడ: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతిరావు అంత్యక్రియలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. మారుతిరావు భార్య గిరిజ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఇంటి నుంచి మారుతిరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు షాబ్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మారుతిరావు చితికి ఆయన తమ్ముడు శ్రవణ్ నిప్పంటించారు. అమృతను అడ్డుకున్న బంధువులు.. ఇదిలా ఉండగా తన తండ్రిని కడసారి చూడటానికి అమృత పోలీసు బందోబస్తుతో శ్మశానవాటిక వద్దకు చేరుకుంది. పోలీసు వాహనంలోనే అమృతను ఇంటి వద్ద నుంచి శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కాగా అమృత అక్కడికి చేరుకునే లోగా మారుతిరావు మృతదేహాన్ని చితిపై ఉంచారు. చితివద్దకు పోలీసులతో కలసి వెళ్లిన అమృతను మారుతిరావు బంధువులు, పట్టణ వాసులు అడ్డుకున్నారు. అమృత గోబ్యాక్.. మారుతిరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించి పోలీసులు అమృతను వెంటనే తమ వాహనంలో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఆస్తి కోసం అమృత డ్రామాలు : శ్రవణ్ ‘మారుతిరావు చస్తే తనకు శుభవార్త’అని చెప్పిన అమృతకు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అతనిపై ప్రేమ పుట్టుకురావడం చూస్తే, ఆస్తికోసం డ్రామా ఆడుతున్నట్టు ఉందని మారుతిరావు తమ్ముడు శ్రవణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తన అన్న నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, మారుతిరావు భార్య పుస్తె తీసిన రోజే తాను పుస్తె తీస్తానని అమృత చెప్పిందని, అలాగే మారుతిరావును బహిరంగంగా ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసిందని అన్నారు. తన వల్ల ఎవరికీ ప్రాణహాని ఉండదని, అమృత తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రణయ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా శిక్ష అనుభవించానని, కేసు విషయంలో ఏనాడు కూడా రాజీ కోసం అమృత వద్దకు వెళ్లలేదని తెలిపారు. శ్మశానవాటిక వద్ద ఆమెను తాను అడ్డుకోలేదని, తల్లిపై ప్రేమ ఉంటే ఆమె అక్కడే ఉన్నా ఎందుకు మాట్లాడలేదన్నారు. తన అన్న మారుతిరావుకు అప్పులు ఉంటే వడ్డీతో సహా తీర్చుతానని వెల్లడించారు. ఆస్తిపై ఎలాంటి ఆశలు లేవు: అమృత తండ్రి ఆస్తిపై తనకు ఆశల్లేవని మారుతిరావు కూతురు అమృత చెప్పారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మారుతిరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. పశ్చాత్తాపం చెందో, శిక్షపడుతుందనో ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు అని అంది. ఆయనకు బినామీ పేర్లపై ఆస్తులున్న ట్లు తెలిసిందని, ఆస్తి విషయంలో మారుతిరావును బాబాయి శ్రవణ్ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది. శ్రవణ్ వల్ల తన తల్లికి కూడా ప్రాణ హాని ఉండొచ్చని అనుకుంటున్నానంది. తాను తల్లి వద్దకు వెళ్లనని, ఆమే తనవద్దకు వస్తే చూసుకుంటానని తెలిపింది. -
అమృతకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత అస్వస్థతకు గురయ్యారు. మిర్యాలగూడలోని తన నివాసంలో ఉన్న అమృత.. సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, అమృత తండ్రి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి : బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత డబ్బుల కోసం అమృత డ్రామాలు.. -
డబ్బుల కోసం అమృత డ్రామాలు..
సాక్షి, మిర్యాలగూడ : తనపై అమృత చేసిన ఆరోపణలను మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఖండించారు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. శ్రవణ్ సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అమృత తీరు మమ్మల్ని ఎంతో బాధించింది. నేను మా అన్నయను బెదిరించానని ఆరోపిస్తోంది. నా వల్ల ప్రాణహాని ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక ప్రణయ్ హత్యకేసులో నా ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. (బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత) మా అన్న మారుతీరావు చనిపోయే వరకూ ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసింది. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. ప్రణయ్ హత్యకు ముందు మా అన్నకు నాకు మాటలు లేవు. అమృత విషయంలోనే గొడవలు జరిగాయి. ఆమె చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయి. తండ్రి చనిపోతే ఆమె వ్యవహరించిన తీరు సరిగా లేదు. తండ్రి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదు? నేను బెదిరించే వాడిని అయితే నా పేరు ఎందుకు బయటకు రాలేదు? మా అన్న చనిపోయాక ..అమృతకు ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చింది? (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!) నాన్న అని పిలవడానికి కూడా అమృతకు మాట రావడం లేదు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు నా పై ఆరోపణలు చేస్తోంది. దయచేసి మీడియా కూడా అవాస్తవాలు రాయొద్దు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒకవేళ మా అన్న ఎవరికైనా అప్పు ఉంటే వాటిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు. (మిస్టరీగా మారుతీరావు మరణం!) -
బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత
సాక్షి, మిర్యాలగూడ : ‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మా నాన్న మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. మా నాన్న ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్ (శ్రవణ్) పేరు ఉంటే అనుమానం వస్తుందని పేరు తీయించేసి ఉండాలి’ అని మారుతీరావు కుమార్తె అమృతా ప్రణయ్ తెలిపారు. (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!) అమృత సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే నాన్న ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు. ప్రణయ్‌ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ఈ కేసులో చట్టపరంగా నాన్నకు శిక్ష పడాలని కోరుకున్నాను. వాళ్ల ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాటి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నేను బయటకు వచ్చాక వాళ్లు ఆస్తులు పంచుకున్నారు. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. గతంలో పరువు విషయంలో మా నాన్నను బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు. ఇవాళ ఉదయం శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు. తండ్రి అనే నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు. నన్ను అడ్డుకుంది కూడా బాబాయ్ వాళ్ల అమ్మాయి. (నిందితుడు, బాధితుడు మారుతీరావే) పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. బాబు పుట్టాక అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా. నేను అయితే ప్రణయ్ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లను. ఒకవేళ ఆమె నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటాను. నా భర్త ప్రణయ్ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో... ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాను. ప్రాణం తీసినా, తీసుకున్నా అందరికీ బాధే’ అని అన్నారు. (మారుతిరావు ఆత్మహత్య) -
అమృత గో బ్యాక్
-
మారుతీ రావు పోస్ట్‌మార్టం పూర్తి ...
-
అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!
మిర్యాలగూడ: తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. తండ్రి చావుకు కారణమైన ‘అమృత గో బ్యాక్’, ‘మారుతీరావ్ అమర్ రహే’ అంటూ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె తిరిగి వాహనం ఎక్కి కూర్చున్నారు. పోలీసుల సూచనమేరకు తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు. (చదవండి: మారుతిరావు ఆత్మహత్య) కాగా, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ప్రణయ్ అనే దలిత యువకుడిని మారుతీరావు హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. (చదవండి: చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం) ఇదిలాఉండగా.. మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషయం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (చదవండి: మారుతీరావు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక) -
నిందితుడు, బాధితుడు మారుతీరావే
సాక్షి, మిర్యాలగూడ : ఒక ప్రేమ వివాహం.. రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అటు కూతురు కుటుంబం.. ఇటు తన కుటుంబం చిన్నాభిన్నం అయింది. ఈ సంఘటనలో నిందితుడు, బాధితుడు కూడా మారుతీరావే కావడం గమనార్హం. మిర్యాలగూడలో రియల్టర్‌గా, బిల్టర్‌గా పేరు సంపాదించుకున్న తిరునగరు మారుతీరావుకు ఒక్కతే కూతురు అమృత. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకు యుక్తవయసు వచ్చే నాటికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమెకు నచ్చిన వ్యక్తి పెరుమాళ్ల ప్రణయ్‌ని 2018 జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్ మందిరంలో ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు చేసుకున్న ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో అల్లుడైన ప్రణయ్‌ని 2018 సెప్టెంబర్ 14వ తేదీన దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత జైలుకు వెళ్లడం.. ఏడు మాసాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. తిరిగి బెయిల్‌పై 2019 ఏప్రిల్ 28వ తేదీన మారుతీరావు మిర్యాలగూడకు వచ్చాడు. తన కూతురు అమృత భర్తను పోగొట్టుకున్న బాధలో అత్తగారింట్లోనే ఉంది. తన కుమారుడు ప్రణయ్‌ని అల్లారుమద్దుగా పెంచుకున్న పెరుమాళ్ల బాలస్వామి దంపతులు కొడుకు హత్యకు గురైన బాధ నుంచి తేరుకోలేకపోయారు. కోడలు అమృతకు పుట్టిన కుమారుడికి నిషాన్ ప్రణయ్ అని పేరుపెట్టుకొని తన కొడుకును చూసుకుంటున్నారు. అయినా ఆ కుటుంబం ప్రణయ్ లేడనే బాధ నుంచి తేరుకోలేదు. కాగా ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య ఒంటరైంది. అటు తన కూతురు అమృత కుటుంబం, ఇటు తన కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక్క ప్రేమ వివాహం రెండు కుటుంబాలను చిధ్రం చేసింది. (అదే మారుతీరావు ప్రాణాల మీదకు తెచ్చిందా?) -
అవి తిన్నందువల్లే మారుతీరావు మృతి..!
సాక్షి, మిర్యాలగూడ: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరునగరు మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక ప్రాథమిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (నిందితుడు, బాధితుడు మారుతీరావే) కాగా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాం నుంచి ఫోరెన్సిక్ వైద్యులు విస్రా శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు.. బలవన్మరణానికి పాల్పడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28న బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఆ తర్వాత తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కొనసాగించాడు. అయినా ఆమె నుంచి సానుకూల స్పందన రాలేదు.(మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?) ఇందుకు తోడు కోర్టు కేసు, ఆస్తి పంపకాలు, కూతురి కులాంతర వివాహం కారణంగా వేధింపులు తదితర ఒత్తిళ్ల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోమవారం మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో.. ఆయనను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఓవైపు కూతురు దూరమై.. ఇప్పుడు భర్త కూడా శాశ్వతంగా తనను వదిలిపోవడంతో మారుతీరావు భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.(మారుతీరావు ఆత్మహత్య!) -
మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?
సాక్షి, మిర్యాలగూడ: మారుతీరావు ఆత్మహత్య.. అనేక కారణాలను వెతుకుతుంది. అప్పట్లో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యాడు. మిర్యాలగూడలో తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మధ్యవర్తులను సైతం ఆమె వద్దకు పంపాడు. అయినా ఒప్పుకో ని అమృత మధ్యవర్తులతో పాటు మారుతీ రావుపై కూడా కేసు పెట్టింది. దాంతో మరోసారి జైలుకు వెళ్లాడు. కాగా ఎన్ని ఇబ్బందులు పడినా తన కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అంశం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా ప్రణయ్ కేసు ఈనెల నుంచి జిల్లా కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. మూడు రోజుల పాటు వరుసగా కోర్టుకు వెళ్లిన మారుతీరావు మంచి న్యాయవాదిని పెట్టుకోవాలని భావించినట్లు తెలి సింది. అయినా ప్రణయ్ హత్య సంచలనం కలగడం వల్ల తనకు శిక్ష పడితే జైలులో చనిపోయే కంటే ముందే మరణించడం మంచిదని ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆస్తి వివాదమా... మనస్తాపమా? ప్రణయ్ హత్య అనంతరం మారుతీరావుతో ఆయన తమ్ముడు శ్రవణ్‌కు ఆస్తి వివాదాలు వచ్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్యకు ముందే తన ఆస్తిలో తన తమ్ముడు శ్రవణ్ పేరున కొంత, మిగతా ట్రస్టుకు వీలునామా రాసినట్లు సమాచారం. కాగా హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత వీలునామాను మరోసారి మార్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో సంబంధం లేకున్నా తనపై కేసులు రావడం, జైలుకు వెళ్లడంపై శ్రవణ్ తన అన్న మారుతీరావుపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా మారుతీరావు స్పందించకుండా తన పని తాను చేసుకుంటుండగా కొంత కాలంగా ఇద్దరికి వివాదం కొనసాగుతుందని సమాచారం. ఆ క్రమంలోనే ఆస్తి విషయంలో మూడు నెలల క్రితం వీలునామాను తిరగరాసినట్లు తెలిసింది. రెండోసారి తిరగరాసిన వీలునామాలో శ్రవణ్ పేరు లేకుండా తన భార్య పేరున కొంత ఆస్తి, ట్రస్టుకు కొంత రాసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆస్తి వీలునామా తన ప్రాణాల మీదికి తెచ్చిందా? తన కూతురు తన వద్దకు రాలేదనే మనస్తాపమా? హత్య కేసులో శిక్ష పడుతుందనే ఆందోళనా? ప్రణయ్‌ని హత్య చేయించిన ప్రశ్చాత్తాపమా? అనే విషయాలు తేలాల్సి ఉంది. సుపారీ గ్యాంగ్ వేధింపులు కూడా కారణమేనా? ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో చేతులు కలిపిన మారుతీరావును ఆ గ్యాంగ్ సభ్యులు కూడా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు సమాచారం. మారుతీరావుతో పాటు నిందితుల్లో ముఖ్యులుగా ఉన్న అస్గర్‌అలీ, అబ్దుల్భారీలు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని, ఇంకా అదనంగా ఇవ్వాలంటూ వేధిస్తున్నట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల్లో ఏ 1 నిందితుడిగా మారుతీరావు ఉండగా ఏ 2 గా సుభాష్‌శర్మ, ఏ 3గా అస్గర్‌అలీ, ఏ 4గా అబ్దుల్ భారీ, ఏ 5గా ఎండీ. ఖరీం, ఏ 6గా తిరునగరు శ్రవణ్, ఏ 7గా శివ, ఏ 8గా నిజాం ఉన్నారు. (ప్రణయ్, మారుతీరావు నివాసాల వద్ద భారీ బందోబస్తు) -
ప్రణయ్, మారుతీరావు ఇళ్ల వద్ద భారీ భద్రత
సాక్షి, మిర్యాలగూడ టౌన్: తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో మారుతీరావు పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన పేరుమళ్ల ప్రణయ్‌ను ఇస్లాంపురలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద హత్య చేయించాడు. ఈ కేసులో ఎ–1 ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లో గల ఆర్య సమాజ భవనంలో మృతి చెందడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం మిర్యాలగూడలోని పేరుమళ్ల ప్రణయ్ నివాసం వద్ద పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏఎస్ఐ గౌసు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రణయ్ కుటుంబానికి 8 మంది గన్మెన్లను ఏర్పాటు చేయగా మారుతీరావు చనిపోవడంతో మరి కొంతమంది పోలీస్‌లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు మృతదేహం పట్టణంలోని రెడ్డికాలనీలో గల నివాసానికి వస్తుండటంతో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మారుతీరావు మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. (‘అమృతా.. అమ్మ దగ్గరకు వెళ్లు’) -
అమృతాప్రణయ్ అక్కడికి వెళ్లనుందా!?
మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. కాగా, మారుతీరావు అంత్యక్రియలు స్వస్థలం మిర్యాలగూడలో సోమవారం జరుగుతున్నాయి. అయితే, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమృత ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు ఆమె పోలీసుల భద్రత కోరారు. కాగా, ఆమె బాబాయ్, మారుతీరావు సోదరుడు శ్రవణ్ అమృత వచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. ఇక మారుతీరావు తల్లి, భార్య రోధిస్తున్న తీరు పలువురిని కలచి వేసింది. కూతురు కోసం ఎంతో శ్రమించి.. ఆమె బాగు కోసమే పరితపించిన మనిషి.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. (చదవండి: మారుతిరావు ఆత్మహత్య) అప్పుడేం జరిగింది.. తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడంతో మారుతీరావు 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల మిర్యాలగూడలో మారుతిరావుకు చెందిన ఓ షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో మారుతిరావు బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదనే ఆందోళనతోపాటు తన ఆస్తుల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో గొడవల వల్ల మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. (చదవండి: మిస్టరీగా మారుతీరావు మరణం!) -
మిస్టరీగా మారుతీరావు మరణం!
-
మిస్టరీగా మారుతీరావు మరణం!
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?... ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇక మారుతీరావు గదిలో ఆత్మహత్య ఆనవాళ్లు లభించలేదు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు నిన్నఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్‌ను పంపించి గదిలోకే అల్పాహారంగా గారెలు తెప్పించుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు పంపించేసి, గదికి గడియ పెట్టుకున్నారు. మారుతీరావు ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. గదితో పాటుగా వాష్ రూమ్ , బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) కాగా సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటులో ఉన్న చేతి రాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు చేపట్టారు. బయటికి వెళ్లిన మారుతీరావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఆయన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ వైపు ప్రణయ్ హత్యకేసు ట్రయల్‌కు రావడంతో మారుతీరావు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా కుటుంబంలో గొడవల కారణంగా ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) -
గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి ..తిరగరాశారు. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు తన కుమార్తె అమృతతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) అయితే రెండు రోజుల క్రితం మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు భోగట్టా. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. సూసైడ్ నోటులో ‘గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరకు రా’ అని రాశారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) మీడియా ఊహించి రాయొద్దు.. మారుతీరావు ఆత్మహత్యపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు శ్రవణ్ ఖండించారు. తన అన్నతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. విబేధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే ప్రణయ్ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే నేపథ్యంలోనే సోదరుడితో మాట్లాడటం లేదన్నారు. దీంతో తన తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో మారుతీరావుతో గత ఏడాది మే 15 నుంచి మాట్లాడటం లేదని తెలిపారు. మీడియా ఊహించి రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్న ఆత్మహత్య విషయం తెలియగానే తన వదినను తీసుకుని హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. సూసైడ్ నోట్లో ఏముందో తెలియదని, ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారో లేదా అనేది కూడా తనకు ఏమీ తెలియదని శ్రవణ్ పేర్కొన్నారు. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో విషంతాగి ఆత్మహత్య చేసుకున్న తిరునగరి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు రేపు (సోమవారం) మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మారుతీరావు నిన్నరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. (అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు) విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. మారుతీరావు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. (అమృత తండ్రి షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?) ఆ మృతదేహం ఎవరిది? తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ఆమె భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడని కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసులో మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. (అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్) -
అమృతాప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. (చదవండి : మారుతీ రావు షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?) మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ.కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో దారుణంగా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హత్య జరిగింది. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ కేసులోమారుతీరావు జైలుపాలయ్యారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపారు. కాగా, ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా వారం రోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావుకు చెందిన షెడ్డులో అనుమానాస్పదస్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో లభించింది. జైలు నుంచి విడుదలైన తరువాత మారుతీరావు ఎవరికి, ఎక్కడా పెద్దగా తారసపడకపోవడంతో చనిపోయింది మారుతీరావే అన్నట్లు ప్రచారాలు జరిగాయి. ఈ ఘటనలో మృతదేహం ఎవరిదన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతి
సాక్షి, మిర్యాలగూడ టౌన్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరునగరు గంగాధర్(89) అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు పొందిన నాయకుల్లో గంగాధర్ ఒకరు. 1971 నుంచి 1979 మార్చి వరకు సర్పంచ్‌గా పని చేశారు. అదే సమయంలో త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి మిర్యాలగూడకు పైపులైన్ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే మిలట్రీ పరిటాల క్యాంపులో పని చేస్తుండగా గంగాధర్ గురువు అయినా వంగాల మధుసూదన్‌రెడ్డి తీసుకువచ్చాడు. అదే సయయంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత మిర్యాలగూడ ప్రాంతంలో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతో పాటు హామాల సంఘాన్ని ఏర్పాటు చేసి 30 ఏళ్ల పాటు ఆ యూనియన్‌కు అధ్యక్షులుగా కొనసాగారు. 1995లో మున్సిపల్ చైర్మన్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గార్లపాటి నిరంజన్‌రెడ్డి చేతిలో, 1996లో నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2007 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సంవత్సరం పాటు బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ అసెంబ్లీకి పోటీ చేసి రెండు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఆర్యవైశ్య సంఘంలో కూడా గంగాధర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్యతో మంచి సంబంధాలు ఉన్నాయి. మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. చకిలం శ్రీనివాస్‌రావు 1983 నుంచి 1985వరకు ఉన్న కాలంలో పార్టీ కార్యక్రమాలు గంగాధర్ నివాసం నుంచే నిర్వహించేవారు. కాగా గంగాధర్ అంత్యక్రియలను మంగళవారం అన్నపూరెడ్డిగూడెంలో గల వారి సొంత పొలంలో నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, మంత్రి సంతాపం తిరునగరు గంగాధర్ మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హుటాహుటిన సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాధర్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. తిరునగరి గంగాధర్‌కి మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. -
పోలీసులు వేధిస్తున్నారని..
సాక్షి, మిర్యాలగూడ: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు గాజు ముక్కలు మింగాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే గాజుముక్కలు మింగినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సట్టు నాగేశ్వర్రావు గతంలో ఓ దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన చోరీ కేసులో అతడిని అనుమానితుడిగా గుర్తించిన వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం పోలీస్‌స్టేషన్ మరుగుదొడ్డికి వెళ్లిన అతను అందులోని విద్యుత్ బల్బును వెంట తెచ్చుకున్నాడు. సెల్‌లోకి వెళ్లి ముక్కలుగా చేసి మింగాడు. దీంతో అతనిని స్థానిక ఏరియా ఆస్పత్రికి.. పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించారు. తనను దొంగతనం కేసులో 13 రోజుల క్రితం తీసుకొచ్చారని, అప్పటినుంచి తీవ్రంగా హింసిస్తున్నారని నాగేశ్వర్రావు ఆరోపించాడు. తన కాళ్లు పనిచేయడం లేదని, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేకనే గాజు బల్బును పగులగొట్టి మింగానని ఆవేదన వ్యక్తం చేశాడు. -
5 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు చోరీ
మిర్యాలగూడ అర్బన్: ఎవరైనా ఏం దొంగతనం చేస్తారు? డబ్బు, బంగారం, విలువైన వస్తువుల కోసం అని చెబుతాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా విలువైనవిగా మారాయి. ఓ దుకాణంలో దొంగ లు పడి డబ్బు కాకుండా ఉల్లిగడ్డలను ఎత్తుకెళ్లారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఉల్లిగడ్డల వ్యాపారం నిర్వహిస్తున్న బక్కయ్య బుధవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూసేసరికి దుకాణం తాళం పగులగొట్టి ఉంది. లోపల పది బస్తాల ఉల్లిగడ్డలు (5 క్వింటాళ్లు) కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన బక్కయ్య, వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, పక్కనే డబ్బుల కౌంటర్ ఉన్నా దొంగలు దానిని ముట్టుకోలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. -
అమృతను బెదిరించిన రిటైర్డ్ తహసీల్దార్‌పై కేసు
సాక్షి, మిర్యాలగూడ: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతని భార్య అమృతను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్‌రావుపై బుధవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో తన తండ్రి మారుతీరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఇద్దరు వ్యక్తులు అమృతను బెదిరించడంతోపాటు తండ్రి ఆస్తులు దక్కుతాయని ప్రలోభపెట్టారు. ఈ విషయంపై అమృత ఫిర్యాదు మేరకు గత నెల 30వ తేదిన ప్రణయ్ హత్యలో ప్రధాన సూత్రధారులు తిరునగరు మారుతీరావు, ఎంఎ.ఖరీంలతో పాటు వెంకటేశ్వర్‌రావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విష యం విదితమే. మారుతీరావు సలహా మేరకు అమృతను కలిసేందుకు వెంటేశ్వర్రావుతోపా టు రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్‌రావు ఉన్నట్లుగా ఆలస్యంగా గుర్తించిన పోలీసులు నాలుగో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, వెంకటేశ్వర్రావుపై కేసు నమోదనైట్లు తెలుసుకున్న భాస్కర్‌రావు తనపై కూడా కేసు అవుతుందని భావించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న భాస్కర్‌రావును త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. -
మా అమ్మకు ఇల్లు కట్టించండి
మిర్యాలగూడ అర్బన్: ‘మా అమ్మకు ఇల్లు కట్టించి నేను లేని లోటు లేకుండా చూడండి. ఇది నా చివరి కోరిక. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మారడం లేదు. మా లాంటి పేదవారికి సాయం చేయండి. దేశంలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆకలి కేకలను దేశం నుంచి పారదోలలేమా..?’అంటూ లేఖ రాసి ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాళ్లగడ్డకు చెందిన సోమశంకర్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివప్రసాద్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు దేవేందర్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటూ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొనడంతో మనస్తాపానికి గురైన దేవేందర్ ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవేందర్ రాసిన లేఖ. సూసైడ్ నోట్ స్వాధీనం.. ఘటనా స్థలంలో దేవేందర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ఆర్థిక అసమానతల గురించి, ఇంట్లో తాము అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి లేఖలో వివరించాడు. ‘కోట్లు కూడబెట్టుకుని ధనంవంతులు ఏమి సాధిస్తారు. ఉన్నదాంట్లో మాలాంటి పేదలకు పంచి చూడండి. పేద వారికి సహాయం చేయండి. ఆ ఆనందం తెలుస్తుంది. మా అమ్మ, నాన్న మమ్మల్ని ఎంతగానో కష్టపడి పెంచుతున్నారు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ, నాన్న సంపాదించిన డబ్బులన్నీ ఇంటి అద్దెకే సరిపోతున్నాయి. మాలాంటి పేదవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదు. దేశంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇల్లు లేని పేదవారు ఉండకూడదు. నేను చనిపోయిన తర్వాత నన్ను పోస్టుమార్టం చేయండి. మా అమ్మకు ఇల్లు కట్టించి నేను లేని లోటు లేకుండా చూడండి. ఇదే నా చివరి కోరిక’అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ
సాక్షి, మిర్యాలగూడ : గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ పట్టణం మారింది. అత్యాశతో తక్కువ కాలంలో ఎక్కువగా సంపాదించాలనే కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అభం శుభం ఎరుగని మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ పట్టణంలో గంజాయి విక్రయాలు జోరందుకున్నాయి. విద్యార్థులు, యువకులు సైతం విక్రయాలు సాగిస్తూ దాని మైకంలో జరుగుతున్న దారుణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగాజి మత్తులో యువకులు చేస్తున్న దారిదోపిడీలు, చోరీలు పోలీసులకు సైతం సవాలుగా మారాయి. పోలీసుల విచారణలో మైనర్లు పట్టుబడడం ఆందోళన కలిగించే విషయం. వైజాగ్ నుంచి దిగుమతి.. కొంత మంది యువకులు ముఠాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. చిన్నచిన్న పొట్లాలలో ప్యాకింగ్ చేస్తూ స్థానిక యువకులకు విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.200 నుంచి వెయ్యి వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందుతూ జల్సాలు చేస్తున్నారు. గతంలో పట్టుబడి మైనర్లను విచారించిన పోలీసులకు విస్తు గొలిపే వాస్తవాలు తెలియడంతో నివ్వెరపోయారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారి వైఖరిని ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసుల ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. బైక్‌లకు ప్రత్యేక కోడ్..! మిర్యాలగూడ పట్టణంలో గంజాయిని విక్రయించే సింబల్‌గా కొంతమంది యువకులు తమ బైక్‌లకు గంజాయి ఆకుల గుర్తులు కలిగిన స్టిక్కర్లు వేయించారు. ఈ గుర్తుల ఆధారంగా పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. సరిహద్దులోని దాచేపల్లి, నాగార్జునసాగర్, సూ ర్యాపేట, హాలియా వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తూ యువకులను మత్తులో చిత్తు చేస్తున్నారు. కాగా పట్టణంలోని శివారు ప్రాం తాలైన రవీంద్రనగర్ కాలనీ, ప్రకాశ్‌నగర్, హనుమాన్‌పేట, నాగార్జుననగర్, రాజీవ్‌చౌక్, బైపాస్ దాబాల వద్ద గంజాయి విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. బైక్‌లపై ఉన్న సిక్కర్ ఆధారంగా గంజాయి కావాలనుకునే వారు ఆ బైక్‌ల వద్దకు వచ్చి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. దారిదోపిడీలకు పాల్పడుతున్న యువత గంజాయి మత్తుకు అలవాటు పడిన యు వత జల్సాల కోసం దారిదోపిడీలకు సైతం పాల్పడుతుంది. ఇటీవల అద్దంకి– నార్కెట్‌పల్లి బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డగించిన కొంతమంది యువకులు దాడిచేసి రూ.2వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించారు. పట్టణంలోని పలుచోట్ల బైక్‌లు, ఆటోలను సైతం దొంగిలించారు. తీగలాగితే డొంక కదిలినట్లు పట్టణంలోని శరణ్యగ్రీన్ హోంలో చైన్చోరీ విషయంలో సీసీ పుటేజిని పరిశీలించారు. పోలీసులు నింది తులను పసిగట్టే పనిలో భాగంగా పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయికి బానిసలుగా మారిన మైనర్లు ఈ దారిదోపిడీకి పాల్పడినట్లు గుర్తించి వారితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమార్జనకు ఆశపడి.. మిర్యాలగూడ అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జనకు ఆశపడిన యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. చివరకు కటకటాల పాలయ్యారు. గురువారం పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం జల్మాల్‌కుంట గ్రామానికి చెందిన నూనవత్ నాగయ్య అలియాస్ నాగరాజు, భూక్యా చందు, దుపాడు గ్రామానికి చెందిన కొప్పోజు సతీష్, న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నూనావత్ రమేష్ విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే తలంపుతో నునావత్ సుధాకర్, బానోతు సుధాకర్, గూగులోతు సైదా, జర్సుల మస్తాన్, ఆంగోతు నాగరాజు, ధీరావత్ ముని, బానోతు రమేష్‌ల వద్ద గత ఆగస్టు, జూలై నెలలో 70కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని కిలో ఒక్కంటికి వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన పై నలుగురు వ్యక్తులు 10నుంచి 15గ్రాములుగా చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో 52కిలోల గంజాయిని విక్రయించారు. మిగిలిన 18కిలోల గంజాయిని కూడా విక్రయించాలని గురువారం మధ్యాహ్నం స్విప్ట్ కారులో గల సైడ్ డోర్లో పెట్టి పట్టణంలోని రవీంద్రనగర్ గల నాగరాజు ఇంటికి తరలిస్తుండగా చిల్లాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఈ కేసులో నూనావత్ నాగయ్య అలియాస్ నాగరాజు, భూక్యా చందు, కొప్పోజు సతీష్, నూనావత్ రమేష్‌లను అరెస్టు చేసి వారి నుంచి 18కిలోల గంజాయి, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వారిపై నిఘా పెంచుతాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలపై కూడా నిఘా పెంచి విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతాం. మైనర్లు మత్తుకు బానిసలుగా మారకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెట్టాలి ఇతర వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూసుకోవాలి. – వై.వెంకటేశ్వర్రావు, డీఎస్పీ -
ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం
సాక్షి, మిర్యాలగూడ: ఆమె ఓ యాచకురాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో 30 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. ఆర్టీసీ కార్మికులంతా ఆ యాచకురాలికి సుపరిచితులు. కాగా 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పాటు చాలా మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందిన సైదమ్మ తాను భిక్షాటన చేసి పోగేసిన రూ.4 వేల 43లను వారికి అందించింది. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేపట్టిన టెంటు వద్దకు వెళ్లి ఆర్టీసీ నల్లగొండ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్‌కు రూ.4 వేలు అందజేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తాను 30 ఏళ్లుగా బస్టాండ్‌లో ఉంటూ యాచిస్తున్నానని.. ఆర్టీసీ కార్మికులంతా పరిచయస్తులు అని, వారి కడుపులు మాడుతుంటే తనకు ఎంతో బాధ కలిగిందని వివరించింది. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేశానని తెలిపింది. దీంతో అక్కడున్న వారు ఆమెను అభినందించారు. -
సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..
సాక్షి, మిర్యాలగూడ: కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఓ వ్యక్తి యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వజ్రం గతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక మిల్క్ సెంటర్లో పని చేసేవాడు. అక్కడ ఓ భర్త లేని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత వారిద్దరూ మిర్యాలగూడకు వచ్చి టాకారోడ్డులో నివాసముంటూ సహజీవనం చేస్తున్నారు. వజ్రం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారు అద్దెకు ఉండే ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న నకిరేకల్‌కు చెందిన తాండు రాజు ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వజ్రం గమనించాడు. అప్పటి నుంచి ఆమె అనుమానం పెంచుకుని తరుచూ కొట్టసాగాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆ మహిళ ఇక్కడి నుంచి తన తల్లి గారి ఊరు భూదాన్‌పోచంపల్లికి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజు కారణంగానే తాను సఖ్యతగా మెలుగుతున్న మహిళ తనను విడిచి వెళ్లిపోయిందని ఇటీవల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ చేసిన సీఐ ఆ మహిళను మూడు రోజుల క్రితం పిలిపించి వివరాలు సేకరించారు. ఆ మహిళ తాను ఎవరిని వివాహం చేసుకోలేదని, ఎవరితోనూ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి తిరిగి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజుపై కక్ష పెంచుకున్న బొల్లెపల్లి వజ్రం పథకం ప్రకారం రోడ్డుపై నడిచి వెళుతున్న రాజుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో వెనుకనుంచి నరికాడు. మరో సారి మరో వేటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గయపడిన రాజును స్థానికులు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు .. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండు రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు వజ్రం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా రాజు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
బంధువే సూత్రధారి..!
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం కిష్టాపురం ఎక్స్ రోడ్డు వద్ద గత నెల 17వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సమీప బంధువే సూత్రధారిగా వ్యవహరించి కిరాయి వ్యక్తులతో ఘాతుకానికి ఒడిగట్టినట్టు విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసులో సూత్రధారితో పాటు మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వై. వెంకటేశ్వర్రావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మల్రెడ్డి శివారెడ్డి కుటుంబానికి సమీప బంధువు అయిన మోర్తాల పద్మ, ఆమె భర్త సీతారాంరెడ్డి కుటుంబానికి 20 ఏళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఆ వివాదం కోర్టులో నడుస్తుండగా మోర్తాల పద్మ పేరుతో కిష్టాపురం గ్రామ శివారులో గల భూమిని కొన్నేళ్ల క్రితం కోర్టు ద్వారా శివారెడ్డి కుటుంబం స్వాధీనం చేసుకున్నారు. కక్ష పెంచుకుని.. రూ. లక్షలు విలువ చేసే రెండెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని సీతారాంరెడ్డి కుటుంబం శివారెడ్డి కుటుంబంపై కక్ష పెంచుకుంది. శివారెడ్డి అడ్డు తొలగించుకుంటే భూమిని స్వాధీనం చేసుకోవచ్చనే దురుద్దేశంతో సీతారాంరెడ్డి పథకం రచించాడు. అందుకు తన స్నేహితుడైన ఇజ్రాయిల్‌ను ఆశ్రయించాడు. అతను అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కలకొండ సత్యం అనే వ్యక్తిని పరిచయం చేశాడు. వీరు ముగ్గురు కలిసి పథకం వేసి కలకొండ సత్యం ద్వారా కిరాయి వ్యక్తులకు రూ. 3.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత అక్టోబర్ 17వ తేదీన కిరాయి వ్యక్తులు కొత్తపల్లి కళ్యాణ్, గుంజ వెంకన్న, వీర్ల మల్లేశ్ బైక్‌లపై వచ్చి శివారెడ్డిని కత్తి, గొడ్డలితో దారుణంగా హత్య చేశారు. పట్టుబడ్డారు ఇలా.. శివారెడ్డిని హత్య చేసిన అనంతరం కొత్తపల్లి కళ్యాణ్, గుంజ వెంకన్న, వీర్ల మల్లేశ్‌లు పట్టణంలోని ఈదులగూడ చౌరస్తాలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.3.6 లక్షలు ఇవ్వాలని సీతారాంరెడ్డికి ఫోన్ చేశారు. అయితే అప్పటికే శివారెడ్డి కుటుంబం సీతారాంరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. వెంటనే సీతారాంరెడ్డి కదలికలపై నిఘా పెట్టడంతో సుపారీ ఇచ్చేందుకు వెళ్లగా హత్య చేసిన ముగ్గురితో పాటు సీతారాంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో పాత్రదారులుగా వ్యవహరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితులు వీరే మల్రెడ్డి శివారెడ్డి హత్య కేసులో మిర్యాలగూడ పట్టణం విద్యానగర్‌కు చెందిన దుర్గంపూడి సీతారాంరెడ్డి, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కలకొండ సత్యం, హౌసింగ్‌బోర్డుకు చెందిన కొత్త కళ్యాణ్, డిండి మండలం బొగ్గుల దొన((పస్తుతం మిర్యాలగూడలోని హౌసింగ్‌బోర్డు)కు చెందిన గుంజ వెంకన్న, మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందిన వీర్ల మల్లేష్, కడియం గురువయ్య అలియాస్ ఇజ్రాయిల్, విద్యానగర్‌కు చెందిన మోర్తాల పద్మ, మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందిన మాక్టింగ్ డ్రైవర్ చనిమోల్ల మహేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రిపురారం మండలం రాగడప గ్రామానికి చెందిన అద్దంకి దుర్గా ప్రసాద్, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడేనికి చెందిన గట్టిగొర్ల లింగయ్య, మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన వల్లపు బాలా మల్లు, మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన బచ్చలకూరి నరేష్, మాటూరు గ్రామానికి చెందిన దనావత్ నాగు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరి నుంచి కత్తి, గొడ్డలితో బైక్, కారు, రూ.3.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్‌బాబు తదితరులున్నారు. -
చైనా షాపులో మహిళా దొంగల హల్చల్