మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. కాగా, మారుతీరావు అంత్యక్రియలు స్వస్థలం మిర్యాలగూడలో సోమవారం జరుగుతున్నాయి. అయితే, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమృత ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు ఆమె పోలీసుల భద్రత కోరారు. కాగా, ఆమె బాబాయ్, మారుతీరావు సోదరుడు శ్రవణ్ అమృత వచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. ఇక మారుతీరావు తల్లి, భార్య రోధిస్తున్న తీరు పలువురిని కలచి వేసింది. కూతురు కోసం ఎంతో శ్రమించి.. ఆమె బాగు కోసమే పరితపించిన మనిషి.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.
(చదవండి: మారుతిరావు ఆత్మహత్య)
అప్పుడేం జరిగింది..
తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడంతో మారుతీరావు 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల మిర్యాలగూడలో మారుతిరావుకు చెందిన ఓ షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో మారుతిరావు బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదనే ఆందోళనతోపాటు తన ఆస్తుల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో గొడవల వల్ల మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
(చదవండి: మిస్టరీగా మారుతీరావు మరణం!)
అమృతాప్రణయ్ అక్కడికి వెళ్లనుందా!?
Published Mon, Mar 9 2020 9:50 AM | Last Updated on Mon, Mar 9 2020 10:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment