Pranay Murder Case
-
ఏంటీ సుపారీ..? ఏమా కథ..?
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు. అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది. ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు. ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్‌మెన్‌గా పిలిచే ప్రొఫెషనల్స్‌కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు. అతడి ద్వారానే బిహార్‌కు చెందిన సుభాష్‌కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్‌తో స్పర్థలు ఏర్పడ్డాయి. పటేల్‌ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్. దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్‌లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్‌లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు. ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్‌షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్‌లో పట్టుకుంది. హైదరాబాద్‌లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్‌లూ జరిగాయి. -
Amrutha Pranay: ఒకరి ప్రేమ.. మరొకరి అహం..
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్, అమృత వర్షిణి(Amrutha Pranay) ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ఈ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!కడుపుతో ఉన్నా కరుగని మనస్సు..కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్‌ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నాభిన్నమైన కుటుంబాలుప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్ఐసీ సంస్థలో విధులు నిర్వహిస్తుండగా.. పెద్ద కుమారుడు ప్రణయ్ డిగ్రీ వరకు చదివాడు. చిన్న కుమారుడు ఉక్రేయిన్ చదువుకుంటుండగా, యుద్ధ సమయంలో స్వదేశానికి వచ్చిన అతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. కాగా, కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. పెద్దకొడుకు ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చిన సమయంలో బాలస్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాకు నా కుమారుడు లేడు, అమృతకు భర్త లేడు, నా మనువడికి తండ్రి లేడు’ అంటూ కన్నీరుమున్నీరవుతూనే.. మారుతీరావు కూడా ఆత్మహత చేసుకోవడం కలిచి వేసిందన్నారు. ప్రణయ్ హత్య తరువాత కొద్ది నెలలు అత్తామామల వద్ద ఉన్న అమృత తన తండ్రి మరణం తరువాత తల్లిదగ్గరరకు వచ్చేసింది. ప్రస్తుతం తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. తన భర్త హత్య వెనక తన బాబాయి శ్రవణ్‌కుమార్ ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులకు చెప్పడంతో హత్య కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌కు సైతం యాజ్జీవ కారాగార శిక్ష పడటంతో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత, ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదంగా మారి ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. చదవండి: అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు -
Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర!
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకు కీలక సూత్రధారులుగా ఉండి, సోమవారం జీవితఖైదు పడిన అస్ఘర్ అలీ, అబ్దుల్ బారీ సామాన్యులు కారు. అత్యంత దారుణమైన నేరచరిత్ర కలిగిన వీరిపై నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. మీర్జా ఎస్కేప్, భారీ పేలుళ్లకు కుట్ర తదితరాలు వాటిలో ఓ మచ్చుతునకలు మాత్రమే. వీరిద్దరూ గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్యా హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అప్పట్లో ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది సైతం అస్ఘరే అని సీబీఐ ఆరోపించింది. పాకిస్తాన్‌లోనూ ఉగ్రవాద శిక్షణ... నల్లగొండలోని దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, చోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు.కాశ్మీర్ కు చెందిన ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రోద్భలంతో అక్కడకు వెళ్ళిన అస్ఘర్ ప్రాథమిక ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆపై అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లిన ఇతగాడు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో తుపాకులు కాల్చడం నుంచి నుంచి ఆర్డీఎక్స్తో తయారు చేసిన బాంబులను పేల్చడం వరకు వివిధ రకాలైన శిక్షణలు తీసుకున్నాడు. పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన అస్ఘర్ నల్లగొండలోని ప్యార్ çసూఖాబాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బారితో సహా మరికొందరితో ముఠా ఏర్పాటు చేశాడు. ఆ కేసుల్లో మీర్జా నిందితుడిగా... బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కర సేవకుల్ని టార్గెట్‌గా చేసుకుని నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను చాదర్‌ఘాట్‌లోని మహబూబ్ కాంప్లెక్స్ సమీపంలో, అదే ఏడాది ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. ఫసీ మాడ్యుల్ చేసిన ఈ దారుణాలకు మీర్జా ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్ బేగ్ సూత్రధారిగా, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇతడి పాత్ర దీనికి ముందూ అనేక కేసుల్లో ఉంది. పాపయ్య గౌడ్, నందరాజ్ గౌడ్లను హత్య చేసిన కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. తప్పించి తీసుకువెళ్లిన ద్వయం.. మీర్జాను తప్పించడానికి అస్ఘర్, బారీ తదితరులు పథక రచన చేశారు. 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి ఎస్కేప్ చేయించారు. అస్ఘర్ ఇతడిని తనకున్న పరిచయాల నేపథ్యంలో కాశీ్మర్కు పంపి ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసేలా చేశాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన కొన్ని రోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో మీర్జా హతమయ్యాడు. చాలాకాలం వరకు మీర్జాను ఎస్కేప్ చేసింది ఎవరనేది రహస్యంగానే ఉండిపోయింది. 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారీ సహా పది మంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి నుంచి మూడు కేజీల ఆర్డీఎక్స్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్, 40 రౌండ్లు స్వా«దీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి వచ్చినట్లు తేల్చారు. ఈ విచారణ నేపథ్యంలో మీర్జా ఎస్కేప్‌లోనూ అస్ఘర్, బారీల పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. ఐఎంఎంఎంలోనూ అస్ఘర్ పాత్ర.. ఆజం ఘోరీ అనే ఉగ్రవాది (జగిత్యాలలో 2000 ఏప్రిల్ 6న ఎన్కౌంటర్ అయ్యాడు) ఇండియన్ ముస్లిమ్ మహ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. బెయిల్‌పై బయటకు వచి్చన అస్ఘర్ దీనికి సానుభూతిపరుడిగా మారి తనకంటూ ఓ ప్రత్యేక మాడ్యుల్ (గ్యాంగ్) ఏర్పాటు చేసుకున్నాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని మధ్యవర్తుల ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. బారీ తదితరులతో కలిసి రంగంలోకి దిగిన ఇతడు ఆ ఏడాది మార్చి 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్ళి కాల్చి చంపాడు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్ఘర్ ఐదు రౌండ్లు పాండ్యపై కాల్చడంతో ఆయన కన్నుమూశారు.అప్పట్లో మేడ్చల్‌లో అరెస్టు... ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్, బారీలను పట్టుకున్నాయి. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిని కింది కోర్టు దోషులుగా తేలి్చనా..గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వీగిపోవడంతో 2011లో బయటపడ్డారు. ఆ తర్వాత నగరంలో వీరిపై నమోదైన కేసుల్లో కొన్ని వీగిపోవడం, మరికొన్నింటిలో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత మలక్‌పేటలోని సలీమ్నగర్లో ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 2011 తర్వాత వీరి పేర్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. 2018లో ప్రణయ్ హత్య కేసులో అరెస్టు కావడంతో పోలీసులు, నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. హరేన్ పాండ్యా కేసును గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ విచారణ అనంతరం అస్ఘర్‌కు జీవితఖైదు పడింది. దీంతో 2019 ఆగస్టులో ఇతడిని సబర్మతి జైలుకు తరలించారు. -
చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు!
-
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్ శ్రవణ్ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్(ఉగ్రవాది కూడా), సుభాష్ శర్మలు అండర్ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.ఇదీ చదవండి: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు -
ఏడేళ్ల తర్వాత అమృతకు న్యాయం.. ప్రణయ్ ఆత్మకు శాంతి
-
ప్రణయ్ హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు, ఏ -2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష
-
ప్రణయ్ హత్య కేసు నేడే తుది తీర్పు
-
ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
Pranay Amrutha: ప్రణయ్ అమృత కేసులో రేపే తుది తీర్పు
సాక్షి,నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు. -
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్
లక్డీకాపూల్: సంచలనం సృష్టించిన నల్లగొండ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. గుండె నొప్పి రావడంతో ఆయనను గత నెల 22వ తేదీన నల్లగొండ జైలు అధికారులు చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ సాయి సతీష్ అతని ఆరోగ్య పరిస్థితిని విచారించిన నేపథ్యంలో మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. దీంతో ఆయనను నిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ విభాగానికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ బారీకి సీటీ సర్జన్ డాక్టర్ అమరేష్‌రావు మాలెంపాటి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. అతనికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన బైపాస్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. (చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన) -
ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ
‘‘నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మొదటినుంచీ సినిమాలు తీస్తూనే ఉన్నాను. నా మొదటి సినిమా ‘శివ’ నుంచి కూడా అలానే చేశాను. ‘సర్కార్, 26/11, రక్తచరిత్ర’ సినిమాలు తీశాను. ‘మర్డర్’ సినిమా కూడా నిజ జీవితాల నుంచి తీసుకున్న కథాంశమే. ఏ కథ అయినా నిజజీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిందే’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం ‘మర్డర్’ వివాదంలో ఇరక్కుంది. ప్రణయ్, అమృతల ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారనే వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మర్డర్’ సినిమా ఫలానా వాళ్ల జీవితం అని ఎప్పుడూ చెప్పలేదు. ఒక కేసు చాలా పాపులర్ అయింది. అందరూ ఈ సినిమా అదే అనుకున్నారు. కానీ కాదని ఎప్పుడో చెప్పాను. కేసు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. నాకు ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, నట్టి కరుణ కూడా పాల్గొన్నారు. -
వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'మర్డర్' సినిమా విడుదలను ఆపేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి:వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) కాగా నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ 'మర్డర్' సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్, పాటలు చూస్తేనే అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రణయ్ తండ్రి బాలస్వామి మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఆగస్టు 6 తేదీన అమృత నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చేవరకు 'మర్డర్' చిత్రం విడుదల నిలిపివేయాలని తీర్పునిచ్చింది. (చదవండి: రామ్‌గోపాల్ వర్మకు షాక్..‘మర్డర్’కు బ్రేక్) -
వర్మకు షాక్..‘మర్డర్’కు బ్రేక్
ప్రముఖ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమాకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మర్డర్ సినిమా కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయ్యింది. (చదవండి : నటి ఇంట్లో విషాదం) కాగా,ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలయిన విషయం తెలిసిందే. దీనితో పాటు రెండు పాటలు కూడా విడుదల చేశారు. అందులో ఓ పాటను స్వయంగా వర్మనే పాడారు. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. -
వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం మర్డర్. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు మొత్తం దేశంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు వర్మ. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు.(చదవండి : ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్) ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన వర్మ.. తాజాగా ఓ పాటను విడుదల చేశారు. పిల్లల్ని ప్రేమించడం తప్పా అటూ సాగే ఈ పాటను స్వయంగా వర్మనే ఆలపించాడు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం హైదరాబాద్‌లో రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. . దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. -
యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత
సాక్షి, నల్గొండ : మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అమృత తండ్రి మారుతీరావు మరణం అనంతరం.. శనివారమే ఆమె తల్లి గిరిజను కలిశారు. ( పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత ) -
పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత
సాక్షి, మిర్యాలగూడ : ఈనెల 8న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఆత్మహత్య చేసుకున్న తిరుగనరు మారుతీరావు కుమార్తె అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను పోలీసుల రక్షణ మధ్య ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించి అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసి కొంత సమయం ఆమెతో గడిపింది. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియల వద్ద అమృతకు చేదు అనుభవం.. తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తండ్రి మృతదేహాన్ని చూడటానికి అంత్యక్రియల సమయంలో పోలీసుల భద్రత నడుమ శ్మశానవాటిక వద్దకు వచ్చిన అమృతను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అమృత గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పాటు తోపులాట జరిగింది. దాంతో తన తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగింది. అంత్యక్రియల అనంతరం అమృత బాబాయి శ్రవణ్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!) తల్లితో పది నిమిషాలు.. తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం నా లుగు రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో ప ట్టణంలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది. ('అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ') -
తల్లి గిరిజను కలిసిన అమృతా ప్రణయ్
సాక్షి, నల్లొండ : రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్ భార్య అమృత శనివారం సాయంత్రం ఆమె తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) ఈ నేపథ్యంలో తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి పరామర్శించారు. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మారుతీరావు మరణం అనంతరం అమృత బాబాయ్ శ్రవణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రవణ్ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో ) -
సమాజానికి ‘అమృత’ సందేశం
తండ్రి ఆత్మహత్య నేపథ్యంలో, హత్యకు గురైన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు అని అమృత మన సమాజానికి ఇస్తున్న సందేశం శాశ్వత విలువ కలిగినది. తెలంగాణలోని మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే 24 ఏళ్ల దళిత యువకుడిని గర్భిణి అయిన భార్య సమక్షంలోనే 2018 సెప్టెంబర్ 24న నరికి చంపారు. అమృత ఆ పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యువతి. తన తండ్రి మారుతిరావును ధిక్కరించి మరీ ఆమె ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. అమృతకు ఇప్పుడు 25 ఏళ్లు. సంపన్నులైన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్, తదితర వ్యాపారాలతో భారీ ఆస్తులు కూడగట్టుకున్నారు. పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయనకు 200 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న సంపన్న పట్టణమైన మిర్యాలగూడ.. తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగే పట్టణాల్లో ఒకటి. ఈ పరిస్థితిని మారుతిరావు సంపదను కూడగట్టుకోవడానికి అనువుగా మల్చుకున్నారు. ప్రణయ్ హత్యకేసులో అమృత తండ్రితో పాటు మరి కొందరు జైలుకెళ్లారు. కొన్నినెలల క్రితమే వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. తన భర్త హత్య తర్వాత అమృత మిర్యాలగూడలో తన అత్త, మామలతోటే వారి సొంత ఇంటిలో కలిసి ఉంటోంది. భర్త హత్యకు గురైనప్పుడు ఆమె ఆరునెలల గర్భిణి. అమృత తన అత్తతో కలిసి వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలోనే ఆమె భర్తను నరికి చంపారు. న్యాయంకోసం చెరగని నిబద్ధత తర్వాత ఆమె బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడతడు సంవత్సరం బిడ్డ. ఈ సమయంలోనే 2020 మార్చి 6న మారుతిరావు నోట్ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నోట్లో తన కుమార్తె తన ఇంటికి తిరిగి వచ్చి తల్లితో కలిసి ఉండాలని కోరుకున్నారు. తన తండ్రి ఆత్మహత్య తర్వాత, న్యాయంకోసం అమృత నిబద్ధత పట్ల మీడియాలో వస్తున్న కథనాలు నిజంగానే సినిమా కథను తలపిస్తున్నాయి. మారుతిరావు పక్షాన కేసు వాదిస్తున్న లాయర్ చెప్పిందాని ప్రకారం, తన కుమార్తె అమృతను తిరిగి తనవద్దకు తెచ్చుకునేందుకు కన్నతండ్రి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ అమృత తన భర్త హత్యకు న్యాయం జరగాలనే తన వైఖరినుంచి అంగుళం కూడా పక్కకు జరగడానికి తిరస్కరించింది. తన తండ్రి, నిజమైన హంతకుడు బిహార్‌కి చెందిన శుభాష్ శర్మ, ప్రణయ్ హత్యకు సహకారం అందించిన ఆమె చిన్నాన్న శ్రవణ్‌లకు కఠిన శిక్ష పడాలని ఆమె కోరుకుంది. ప్రణయ్ హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలని ఆమె తండ్రి ఎంతగా ప్రయత్నించాడో అంతకంటే దృఢంగా మారిన అమృత తనను బెదిరిస్తున్నారని ఆరోపించి మరిన్ని కేసులను దాఖలు చేసింది. తన తండ్రి చనిపోయిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె వెళ్లలేదు కానీ పోలీసు రక్షణ మధ్య శ్మశానవాటికలో తండ్రి మృతదేహాన్ని చూసి రావాలని ప్రయత్నించింది. కానీ ఆమె బంధువులు ఆమెను తండ్రి శవాన్ని చూడటానికి అనుమతించలేదు. దాంతో ఆమె మౌనంగా పోలీసు వ్యాన్‌లో వెనక్కి వెళ్లిపోయింది. ప్రణయ్ హత్య తర్వాత తన బాధను అర్థం చేసుకుని తన పక్కన నిలబడిన తన దళిత అత్త, మామతోనే ఆమె ఉంటోంది. తండ్రి ఆత్మహత్య అనంతరం ఆ తర్వాత శ్మశాన వాటికలో ఆమె మీడియాతో చెప్పిన మూడు విషయాలు టీవీ తెరపై చూస్తున్న ప్రతి ఒక్కరినీ నివ్వెరపర్చాయి. ఆమె చెప్పిన మాటలివి. 1. ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 2. కుటుంబ సభ్యుల పేర్లతో, బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్కచేయను. నా తండ్రికి అనేక ఆస్తులున్నాయని నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు. 3. ప్రధాన నిందితుడైన తండ్రి మరణించాక అమ్మవద్దకు వెళతావా అని మీడియా అడిగినప్పుడు ఆమె ‘నేను ఇప్పుడు నా కుటుంబంతో, నా కుమారుడితో, నా అత్తమామలతోనే ఉంటున్నాను. అమ్మ కూడా నావద్దకు వస్తే మేం ఆమెను బాగా చూసుకుంటాం. అంతే కానీ మా నాన్న ఇంటికి మాత్రం వెళ్లను’ అని చెప్పింది. కులతత్వానికి బలైన కుటుంబం మరణించిన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ప్రణయ్ దళితుడు కాకపోయి ఉంటే ఆమె తండ్రి బహుశా అతడిని చంపించి ఉండకపోవచ్చు. ప్రణయ్ మరో కులానికి చెంది ఉంటే వారిని మారుతిరావు వదిలివేసి ఉండేవాడు. కానీ కులం చుట్టూ అంటుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. చివరకు మారుతిరావు భార్య కూడా నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మారుతిరావు తన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమించారని చెబుతున్నారు. తన కుమార్తెకు ఇవ్వడం కోసమే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. కాని తన కుమార్తె ఒక యువకుడిని ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతడిని దారుణంగా హత్య చేసే వరకు కన్నతండ్రి తెగించారు. కానీ ఆయన కన్నకుమార్తె ఈ సమాజానికి ఒక విభిన్నమైన నైతిక సందేశాన్ని పంపింది. తమపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను ప్రదర్శించడం అంటే ఆ పిల్లల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించే హక్కు తమకు ఉంటుందని కాదు. అంతకు మించి కుల వ్యవస్థ మనిషి జీవితాన్ని, ప్రేమను, మానవ విలువలను అస్సలు నిర్ణయించకూడదు. మారుతిరావు మానవ జీవి తానికి సంబంధించిన చెడు ఉదాహరణగా నిలిచారు కానీ ఆయన కుమార్తె తన యవ్వన జీవితంలోనే అత్యంత విభిన్నమైన దారిలో నడుస్తోంది. తన భర్తను కోల్పోయింది. ఆ బాధను అనుభవిస్తూనే బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రినుంచి ఒత్తిళ్లకు గురైంది. మీడియా డేగచూపులను ఎదుర్కొంటోంది. పోలీసు రక్షణలోనే జీవిస్తోంది. చివరకు కన్నతండ్రి ఆత్మహత్యను కూడా భరిస్తోంది. ఒక అగ్రకుల సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని ఇన్ని రకాల విషాదాలు, గాయాలు ఇంత చిన్న జీవితంలో వెంటాడుతూ వచ్చాయి. కలకాలం నిలిచే సందేశం కన్నతండ్రి ఆత్మహత్య తర్వాత మీడియా ఆమెను విభిన్నమైన ప్రశ్నలతో వెంటాడుతోంది. అమృత నుంచి ఆశ్చర్యకరమెన విషయాలను వినాలని టీవీలకు అంటుకుపోయి చూస్తున్న ప్రజలను ప్రశాంతంగా, స్థిరంగా కనిపించిన అమృత నిశ్చేష్టులను చేసింది. ఇంటర్వ్యూలలో ఆమె అత్యంత పరిణతిని, మానవీయమైన, కుల వ్యతిరేక సంస్కృతిని, నడతను ప్రదర్శించింది. భర్తను చంపించిన కన్నతండ్రే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ ఘటనల మొత్తంలో ఏ పాత్రా లేని, ఏమీ చేయని కన్నతల్లి వద్దకు ఇప్పుడు మీరు ఎందుకు వెళ్లడం లేదు అని ఒక మీడియా వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు అందరి మతిపోగొట్టింది. ‘‘నా కోసం నా అత్తమామలు వారి కొడుకును పోగొట్టుకున్నారు. నా జీవితంలోని అత్యంత కఠిన పరిస్థితుల్లో వారే నాకు నా బిడ్డకు తోడుగా ఉన్నారు. నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వారే. మా అమ్మ నన్ను ప్రేమిస్తున్న్టట్లయితే, ఆమే మా వద్దకు వచ్చి మాతో కలిసి జీవించాలి’’. తన భర్త హత్యకు గురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. ‘నా పోరాటం మొత్తంలో నా భర్త కుటుంబంలోనే మానవీయతను నేను చూశాను. మా నాన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో ఘోరమైన చర్యలు చేపట్టారు. కానీ నా కష్టకాలంలో నా కుటుంబం నాతో వ్యవహరించిన దానికంటే ఎంతో బాగా నా అత్తమామలు నన్ను చూసుకున్నారు. వారిది దిగువ మధ్యతరగతికి చెందిన దళిత కుటుంబం. మా నాన్న చాలా సంపన్నుడు, పైగా అధికార బలం ఉన్నవాడు. కానీ నా అత్తమామలు తన కుమారుడికోసం, అతడి మరణం తర్వాత నా కోసం దేన్నయినా కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడే నేను నిజమైన మానవీయతను చూశాను. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు’. భారతీయ సమాజానికి అమృత ఇస్తున్న ఈ సందేశం కలకాలం నిలిచివుంటుంది. వ్యాసకర్త: ప్రొ'' కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
అందరి దృష్టి ఆస్తులపైనే..
-
ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!
అతనో సాధారణ కిరోసిన్ వ్యాపారిగా మిర్యాలగూడ పట్టణవాసులకు సుపరిచితుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ అవతారమెత్తి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగెత్తాడు. పరువు హత్య అభియోగంతో అదే తరహాలో అథఃపాతాళానికీ పడిపోయాడు. చివరకు తన మరణశాసనాన్ని తానే లిఖించుకుని మరోమారు సంచలనంగా మారాడు.. అతనే తిరునగరు మారుతీరావు. ఆత్మహత్య ఉదంతం కూడా అతని ఆస్తుల చుట్టే తిరుగుతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, మిర్యాలగూడ : అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి... చివరికి ఆత్మహత్యతో ప్రస్తానం ముగిసింది. సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తిరునగరు మారుతిరావు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. మారుతీరావు కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్‌ని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లుగా మారుతీరావు అభియోగాలు ఎదదుర్కొని ఎ1 నిందితుడిగా ఏడు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మారుతిరావు తన ఆస్తులను చక్కబెట్టుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. చదవండి: డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు అందరి దృష్టి ఆస్తులపైనే.. మారుతిరావు కూతురు అమృత మీడియాతో మాట్లాడిన సమయంలో బినామీలు ఉన్నారని, ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్పడంతో అందరి దృష్టి అతడి ఆస్తి విషయంపైకి మళ్లింది. 25 ఏళ్ల క్రితం సాధారణ కిరోసిన్ వ్యాపారిగా పాత స్కూటర్‌పై తిరిగిన మారుతిరావు అనతి కాలంలోనే కోట్లాదిపతిగా మారాడు. అటు బిల్డర్ అవతారం ఎత్తి అద్దంకి – నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న శరణ్య గ్రీన్హోమ్స్లో సుమారు వంద నివాసాలు నిర్మించి విక్రయించాడు. దాంతో పాటు అక్కడే ఉన్న అపార్ట్మెంట్లు, ఈదులగూడలో రెండంతస్తుల షాపింగ్ మాల్స్ నిర్మించి విక్రయించినట్లు సమాచారం. అదే విధంగా పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌కు అతి సమీపంలో నటరాజ్ థియేటర్ స్థలంలో అతి పెద్ద మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉండగా అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉండేది. దాంతో పాటు అద్దంకి – నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో చింతపల్లి రోడ్డు సమీపంలో ఒకటి, ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో ఖాళీ స్థలాలు ఉన్నట్లు సమాచారం. తాళ్లగడ్డ సమీపంలో ఒక వెంచర్, దామరచర్ల మండలంలో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా సుమారుగా రూ.200 కోట్లకుపైగా ఆస్తులు సంపాధించిన మారుతీరావు చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని ముగించాడు. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ' బినామీలు సర్దుకున్నారా? బిల్డర్‌గా, రియల్టర్‌గా కొనసాగిన మారుతీరావు తనతో పాటు కొంతమందిని బినామీలుగా వాడుకున్నట్లు సమాచారం. బినామీలుగా ఆయన వద్ద గతంలో పని చేసిన వారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబసభ్యుల పేరున కూడా భూములు కొనుగోలు చేసి వారికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించినట్లు సమాచారం. వారి వద్ద నుంచి అవసరం వచ్చిన సమయంలో తిరిగి ఆయన పేరు మీదకి మార్చుకునే వారని తెలిసింది. కాగా ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత మంది బినామీలు భూములను విక్రయించుకోవడంతో పాటు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్తులను సర్దుకున్నట్లు సమాచారం. రూ.కోట్ల విలువల గల ఆస్తులను బినామీలు చక్కబెట్టుకోవడంతో ఆయన ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉండే వారని తెలిసింది. మారుతీరావు ఆస్తుల విషయంపై పోలీసులు విచారణ చేస్తే బినామీలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు ఉన్నట్లు ప్రచారం? ఆస్తుల విషయంలో కటుంబ సభ్యులకు వివాదాలు ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఏ కోణంలో చేసుకున్నాడనే విషయంపై పోలీసులు విచారించనున్నారు. ఆయన ఆస్తుల విషయంపై వివాదాలు ఉన్నాయని, ఇటీవలనే పంపకాలు కూడా చేసుకున్నట్లు తెలిసిందని అమృత మీడియా ముందు చెప్పడంతో మరింత చర్చ జరుగుతోంది. మారుతీరావు అప్పులుంటే వడ్డీతో సహా తీర్చుతానని, రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోతే చేస్తానని శ్రవణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు తన ఆస్తుల వీలునామా కూడా రాసినట్లుగా పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. చదవండి: కూతురు రాదనే... మనస్తాపంతోనే -
మారుతీరావు ఆస్తుల చిట్టా ఇదే..!
సాక్షి, నల్గొండ: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తుల వివరాలను మంగళవారం పోలీపులు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా.. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకు పడ్డాయి. చదవండి: డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం.. మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లు ఉంటాయని వెల్లడించారు. మొదట కిరోసిన్ వ్యాపారం చేసిన మారుతీరావు.. ఆ తర్వాత రైస్ మిల్లుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 15 ఏళ్ల క్రితం రైస్ మిల్లులను అమ్మి రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రీన్‌హోమ్స్ పేరుతో 100 విల్లాలను అమ్మాడు. ఇక మిర్యాలగూడలో కూతురు అమృత పేరిటా 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఆయన భార్య గిరిజా పేరు మీద 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ' అంతేగాక మిర్యాలగూడ బైపాస్‌లో 22 గుంటల భూమి, హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం, ఈదులగూడ ఎక్స్‌రోడ్‌లో షాపింగ్ మాల్స్‌తో పాటు ఆయన తల్లి పేరు మీద రెండతస్తుల షాపింగ్‌మాల్ కూడా ఉంది. దామరచర్ల శాంతినగర్‌లో 20 ఎకరాల పట్టా భూమి, ఆయన పేరు మీద సొంతంగా 6 ఎకరాల భూమితో పాటు, సర్వే నెం 756తో మిర్యాలగూడలో ఎకరం 2గుంటల భూమి ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 5 అపార్టుమెంట్లు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వివరాలు సమర్పించారు. -
ప్రణయ్ హత్యకేసు: చార్జ్‌షీట్‌లో ఏముందంటే?
సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అహ్మద్ భారీ, కరీం, శివ, నిజాం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ-1)గా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలపడంతో.. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన.. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.(అమృతాప్రణయ్‌కు నిరాశ.. దక్కని చివరి చూపు!) కాగా సాక్షి టీవీ చేతికి చిక్కిన ప్రణయ్ హత్య కేసు చార్జ్‌షీట్ ప్రకారం.. ఈ కేసులో మారుతీరావు సహా 8 మంది నిందితుల పేర్లను పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఏ-1 గా మారుతీరావు, ఏ-6గా ఆయన తమ్ముడును శ్రవణ్‌ను పేరును చేర్చి.. 102 మంది సాక్షులను విచారించి... అమృత- ప్రణయ్‌ల ప్రేమ మొదలు.. ప్రణయ్ హత్య వరకు ప్రతీ అంశాన్ని1200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రణయ్ హత్య సమయంలో అతడి భార్య అమృత ఆరు పేజీల స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమెతో పాటు ప్రధాన నిందితుడు మారుతీరావు, శ్రవణ్, ప్రణయ్ తండ్రి బాలస్వామి తదితరుల ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. (డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు) ప్రణయ్ హత్య సమయంలో అమృత ఇచ్చిన ఆరు పేజీల స్టేట్మెంట్ ప్రకారం నేను స్కూళ్లో చదువుతున్నపుడే ప్రణయ్‌తో పరిచయం. మిర్యాలగూడ కాకతీయ స్కూల్ లో మా ప్రేమ మొదలు. నేను 9 వ తరగతి చదువుతున్నపుడు, ప్రణయ్10వ తరగతి చదువుతున్న సమయంలో స్నేహం మొదలైంది.. ఆ తరువాత ప్రేమగా మారింది. మేము ఇద్దరం చనువుగా ఉండటం చూసి ప్రణయ్ తక్కువ కులం వాడు, అతనితో మాట్లాడవద్దని మా నాన్న నన్ను బెదిరించాడు. చదువు మద్యలో ఆపించి ఇంటి నుండే పరీక్షలు రాయించాడు. ఇంటర్ కూడా మధ్యలో ఆపించేసి ఇంట్లోనే ఉంచాడు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో కూడా.. నేను ఇంకా ప్రణయ్‌తో మాట్లాడుతున్నా అని డిస్కంటిన్యూ చేయించాడు. ఒక రోజు మిర్యాలగూడ రాఘవ్ టాకీస్‌లో నేను, ప్రణయ్ సినిమాకి వెళ్ళినపుడు మా నాన్న, బాబాయ్ శ్రవణ్ అక్కడికి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళి బాగా కొట్టారు. ప్రణయ్ వాళ్ల తల్లిదండ్రులను పిలిచి బెదిరించారు. కొన్ని రోజులు ప్రణయ్ నాకు దూరంగా ఉన్నాడు. నేను ప్రణయ్‌తో మాట్లాడకుండా ఉండలేక పెళ్లి చేసుకుందాం లేకపోతే చచ్చిపోదాం అని చెప్పాను.(ఇలా చితికి..) ఆ తర్వాత ప్రణయ్ అంగీకరించడంతో 2018 జనవరి 30 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాం. మిర్యాలగూడలో నేను కనిపించలేదని మా నాన్న మారుతీరావు మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు నన్ను, ప్రణయ్‌ను మిర్యాలగూడ తీసుకొచ్చాక.. నేను ప్రణయ్ మేజర్లు కావడంతో ప్రణయ్ వాళ్ల ఇంట్లోనే ఉంటా అని చెప్పాను. 2018 ఆగస్ట్ 17 న ప్రణయ్ తలిదండ్రులు మా రిసెప్షన్ గ్రాండ్‌గా చేశారు. అప్పటి నుంచి పగ పెంచుకున్న మా నాన్న ప్రణయ్‌ను అంతం చేస్తా అని హెచ్చరించాడు. 2018 సెప్టెంబర్ 14 న చెకప్ కోసం జ్యోతి హాస్పిటల్‌కు వెళ్ళిన సమయంలో ప్రణయ్‌ను హత్య చేశారు. మారుతీరావు స్టేట్మెంట్ మా కంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుని నా కూతురు మా పరువు తీసింది. సమాజంలో తల ఎత్తుకోలేక పోయాం. స్కూల్ నుంచే వారి ప్రేమ నడుస్తుంది. ఎన్నోసార్లు ప్రణయ్‌ను మర్చిపొమ్మని నా కూతురికి చెప్పాను. అయినా వినలేదు. మాకు ఇష్టం లేకుండా హైదరాబాద్ పోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అయిన దగ్గరి బంధువులతో రాయబారం పంపినా నా కూతురు రాలేదు. అందుకే ప్రణయ్‌ను చంపాలనుకుని ప్లాన్ చేశాను. హత్యకు డబ్బు అవసరం అవుతుంది.. కాబట్టి నా తమ్ముడికి చెప్పి డబ్బు సమకూర్చాలని అడిగాను. ప్రణయ్‌ను హత్య చేయించమని కిరాయి ఇచ్చాను. మారుతీరావు తమ్ముడు శ్రవణ్ స్టేట్మెంట్ అమృత ప్రణయ్‌ల పెళ్లి మా అన్నయ్యను తల దించుకునేలా చేసింది. సమాజంలో మా పరువూ పోయేలా అమృత ప్రవర్తించింది. ప్రణయ్‌ను హత్య చేయించడానికి డబ్బు అవసరం అవుతుంది అని అన్నయ్య అన్నాడు. చింతపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఉన్న ప్లాట్ అమ్మి డబ్బు జమ అయ్యేలా చూస్తా అని చెప్పా. తాలకిల విజయ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ప్లాట్ అమ్మాలని పత్రాలు సిద్ధం చేసుకున్నాం.(డబ్బుల కోసం అమృత డ్రామాలు..) ప్రణయ్ తండ్రి బాలస్వామి స్టేట్మెంట్ స్కూల్ నుంచే అమృత- ప్రణయ్ స్నేహితులు. తనని ప్రేమించమని అమృత.. మా అబ్బాయి ప్రణయ్ నీ కోరింది. తన ప్రేమను కాదంటే అమృత అత్మహత్య చేసుకుంటా అని చెప్పింది. మా అబ్బాయి ప్రణయ్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అమృతను తీసుకుని ఆర్య సమాజ్ పోయి పెళ్లి చేసుకున్నారు. పలు మార్లు మా కుమారుడిని చంపుతామని బెదిరించారు. మారుతీరావు , శ్రవణ్ కుమార్ ఇద్దరు మా అబ్బాయిని చంపేందుకు కుట్ర పన్నారు. మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించేవారు. అమృత ప్రెగ్నెంట్ అయ్యాక జ్యోతి హాస్పిటల్‌కు వెళ్లి వస్తున్న టైంలో నా కొడుకు ప్రణయ్‌ను చంపేశారు.(అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు) -
అమృత విషయంలోనే బాధపడేవాడు
-
ప్రణయ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
-
డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు
సాక్షి, ఖెరతాబాద్: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును సైఫాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. విషం తాగడం వల్లే అతను మృతిచెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతడు ఏ విషం తాగాడన్నది విస్రా నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలియనుంది. అయితే ఈలోపు మారుతీరావు విషాన్ని ఎక్కడ ఖరీదు చేశారు? ఎక్కడ తాగారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. మారుతీరావు బస చేసిన వైశ్యాభవన్ రూమ్ నెం.306లో, ఆయన కారులో ఎలాంటి విషం డబ్బాలు, సీసాలు లభించకపోవడంతో విషయం జటిలంగా మారింది. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ' మారుతీరావు శనివారం మిర్యాలగూడ నుంచి తన కారులో డ్రైవర్ రాజేష్‌తో కలిసి బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ ఎరువులు, పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపాలని డ్రైవర్‌తో చెప్పారని తెలిసింది. ఆ దుకాణంలోకి వెళ్లిన ఆయన కొద్దిసేపటి తర్వాత వచ్చి తిరిగి బయలుదేరారు. అక్కడ నుంచి నేరుగా కారులో ఖైరతాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌కు వచ్చి బస చేశారు. రాజేష్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసుల ఆ దుకాణంలోనే పురుగు మందు లేదా గుళికలు ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. శనివారం రాత్రి డ్రైవర్‌తో గారెలు తెప్పించుకున్న మారుతీరావు వాటిలో కలుపుకుని విషాన్ని తిని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ విషం ప్రభావంతోనే ఆయన వాంతులు చేసుకుని ఉంటారని చెప్తున్నారు. విస్రా నివేదిక వచ్చి తర్వాతే విషం ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. మారుతీరావు కాల్ డిటైల్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులు శనివారం రాత్రి 8.22 గంటలకు ఆయన ఆఖరి ఫోన్ కాల్ చేశారని, మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకట సుబ్బారెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు తేల్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం న్యాయవాది కార్యాలయానికి వెళ్లి మారుతీరావు కలవాల్సి ఉందని చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆర్య వైశ్య భవన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌నీ పరిశీలిస్తున్నారు. మారుతీరావు మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, అయితే విష ప్రభావంతో శరీరం రంగు మారిందని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆ విషం కారణంగానే శ్వాస తీసుకోవడం ఆగిపోవడంతోపాటు శరీరంలోని అవయవాలు పని చేయకపోయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. విషం తీవ్రతను బట్టి దాని ప్రభావం శరీరంపై రెండు నిమిషాల నుంచి రెండు గంటల సమయంలో కనిపించి ప్రాణం పోతుందని పోలీసులు చెబుతున్నారు. చదవండి: 'మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు' కుమార్తె రాజీ అవుతుందని భావించాడు : న్యాయవాది మారుతీరావు మరణానికి సంబంధించి ఆయన న్యాయవాది వెంకట సుబ్బయ్య సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆయన వరంగల్ జైల్లో కలిసినప్పుడు వెళ్లి కలిశాను. ఎప్పటికైనా కుమార్తె అమృత తన వద్దకు వస్తుందని భావించాడు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న కారణంగా ఆమె రాజీకి ఒప్పుకోలేదు. ఇటీవల ఆధ్యాత్మిక భావన పెరిగింది. తన కుమార్తె కోర్టులో కాంప్రమైజ్ అవుతుందని అనుకున్నాడు. అలా కాకుండా ఆమె మరో కేసు పెట్టింది. ప్రణయ్ కేసులో తనకు శిక్ష పడుతుందని మారుతీరావుకు తెలుసు. ఆ భయం ఆయనలో ఉంది. జీవిత ఖైదుకు అవకాశం ఉందని అనుకున్నాడు. ఆస్తుల వివాదాల విషయాలపై మీడియాలో వచ్చిన వార్తలు విషయం ఆయన్ను అడిగితే నవ్వి ఊరుకున్నారు’ అని అన్నారు. చదవండి: కూతురు రాదనే... మనస్తాపంతోనే -
'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ'
సాక్షి, మిర్యాలగూడ : కూతురు అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ.. ఆమె కోసం పడరాని పాట్లు పడ్డాడు. జైలు జీవితం గడిపినా.. శిక్ష పడుతుందని తెలిసినా.. కూతురు తనవద్దకు వస్తుందనే ఆశతోనే ఉండేవాడని ప్రతి ఒక్కరి నోళ్లలో ఇదే చర్చ. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ఆయన ఇంటి వద్ద గుమిగూడిన ప్రజల నోళ్లలో కూతురు అమృత తన వద్దకు వస్తుందని ఎదురు చూశాడనే చర్చించుకుంటున్నారు. మారుతీరావు మృతదేహం వద్ద ఆయన భార్య గిరిజ ఏడుస్తూ కూడా అమృత తన వద్దకు వస్తుందనే ఎదురు చూసి.. ఇక రాదని తెలిసి ఇలా చేశాడని రోదించింది. చనిపోయే సమయంలో రాసిన సూసైడ్ నోట్లో కూడా “ గిరిజా క్షమించు.. అమృత.. అమ్మ వద్దకు వెళ్లు’ అని రాసిన లెటర్ మారుతీరావుకు కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని చర్చించుకున్నారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన న్యాయవాది కూడా కూతురు కోసం వేచి చూశాడని పేర్కొన్నారు. శిక్ష తప్పనిసరిగా పడుతుందని తెలిసినా కూతురు తన వద్దకు వస్తే చాలని మారుతీరావు భావించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇష్టమైన గారెలు తిని.. మారుతీరావుకు గారెలంటె ఇష్టమని, చివరి క్షణంలో వాటిని తిని చనిపోయాడని మృతదేహం వద్ద బంధువులు విలపించారు. మిర్యాలగూడలోనే తన వ్యాపారాలు చేసుకుంటూ ఉండే మారుతీరావు న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లి తిరిగి రాలేదని ఆయన భార్య గిరిజ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: ఇలా చితికి.. అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు! -
'మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు'
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదని, భవిష్యత్తులో దానిపై ఎలాంటి న్యాయ పోరాటం చేయబోనని ఆయన కూతురు అమృత స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని ప్రణయ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక మనిషి మరో మనిషిని చంపడం మంచిది కాదన్నారు. ప్రణయ్‌ను చంపి మారుతీరావు తప్పు చేశాడని, అయినా చనిపోయిన వారిపై గౌరవంతోనే తాను శ్మాశానవాటిక వద్దకు వెళ్తే చూడనివ్వలేదని అన్నారు. (డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది..) ఆయన చివరి కోరిక ప్రకారం నేను అమ్మ వద్దకు వెళ్లేది లేదని, ఆమె నా వద్దకు వస్తే నా వద్దే ఉంచుకుంటానని తెలిపారు. తన బాబాయి శ్రవణ్ వలన ఆమెకు ప్రాణహానీ ఉండవచ్చని ఆరోపించారు. మారుతీరావు ఆస్తి తన పేరుపై లేదని తెలిపారు. అది బినామీల పేరుపై ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్‌ను చంపే వరకు కూడా ఆస్తి ఉమ్మడిగానే ఉందని జైలు నుంచి విడుదలైన తర్వాతే పంచుకున్నారని విన్నానని తెలిపారు. ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉన్న వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదని అన్నారు. భర్త పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని, మా అమ్మ బాధను అర్థం చేసుకోగలని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ఆ విషయంపై మా ఇంటికి వచ్చిన వారిని సీసీ కెమరాల్లో చూశానని, ఆ సమయంలో వచ్చిన వ్యక్తితో ఖరీం ఫోన్లో మాట్లాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీలునామా గురించి నాకు తెలియదని తెలిపారు. (చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం) తండ్రి అని సంబోధించని అమృత.. అమృత మీడియాతో మాట్లాడినంత సేపు మారుతీరావు, గిరిజ, శ్రవణ్ అని మాత్రమే సంబోధించారు. కానీ తండ్రి, తల్లి, బాబాయి అనే పదాలు కూడా ఆమె నోటి నుంచి రాలేదు. కూతురు కోసమే చనిపోయాడని బయట మాటలు వినిపిస్తున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు, వారి ప్రాణాలు వారు తీసుకునే హక్కు కూడా లేదన్నారు. తండ్ని అని సంబోధించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు దాట వేస్తూ వెళ్లిపోయారు. -
కూతురు రాదనే... మనస్తాపంతోనే
సాక్షి, మిర్యాలగూడ : కూతురు అమృత తన వద్దకు వస్తుందని మారుతీరావు చివరి వరకు ఆశపడ్డారు. కానీ ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందాడు. క్షణికావేశంలో అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేయించి జైలు పాలైన మారుతీరావు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మారుతీరావు మృతదేహానికి ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడలోని తన నివాసంలో ఉంచారు. కాగా ఉదయం బంధువులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. మారుతీరావు మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన భార్య గిరిజను పరామర్శించారు. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రాజీవ్‌చౌక్ మీదుగా షాబ్నగర్ శ్మశానవాటికకు చేరుకుంది. మారుతీరావు చితికి ఆయన తమ్ముడు తిరునగరు శ్రవణ్ తలకొరివి పెట్టాడు. (‘మొన్నరాత్రి మారుతిరావు నాకు ఫోన్ చేశాడు’) అమృతను అడ్డుకున్న బంధువులు తండ్రి మృతదేహాన్ని చూడటానికి షాబ్‌నగర్‌లోని శ్మశానవాటిక వద్దకు చేరుకున్న అమృతను మారుతీరావు బంధువులు అడ్డుకున్నారు. ఆమె ఇంటి నుంచే పోలీసు బందోబస్తుతో పోలీసుల వాహనంలోనే శ్మశానవాటికకు చేరుకుంది. కా గా ఆదివారం చనిపోతే ఇంటికి రాకుండా శ్మశానవాటిక వద్దకు రావడమేంటని, గో బ్యాక్ అ మృత.. మారుతీరావు అమర్ రహే అంటూ ని నాదాలు చేశారు. కాగా పోలీసులు కూడా చేసేది లేక అమృతను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. పరామర్శించిన పలువురు నాయకులు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో సోమవారం ఆయన నివాసం వద్ద పలువురు నాయకులు మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన భార్యను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు శ్మశానవాటిక వరకు చేరుకున్నారు. శ్మశాన వాటిక వద్దకు అమృత వచ్చే సందర్భంగా ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్రావుకు సూచించారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, నల్లమోతు భాస్కర్‌రా>వు తనయుడు సిద్ధార్థ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైస్ మి ల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, బీజేపీ నాయకులు కర్నాటి ప్రభాకర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య సంఘ నాయకులు రేణుకుంట్ల గణేష్‌గుప్తా, చిల్లంచర్ల విజయ్‌కుమార్, ముత్తింటి వెంకటేశ్వర్లు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మోసిన్‌అలీ, కాంగ్రెస్ మున్సిపల్‌ఫ్లోర్ లీడర్ బత్తుల లక్షా్మరెడ్డి తదితరులున్నారు. ('మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు') ఏరియా ఆస్పత్రికి అమృత... అమృత ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా అస్వస్థతకు గురైంది సదరు టీవీ చానల్ వారు అమృత బాబాయ్ శ్రవణ్‌ను ఫోన్ ద్వారా లైన్లోకి తీసుకుని డిబెట్ ఏర్పాటు చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అమృత ఆవేషానికి లోనై కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో నీరసంతో పడిపోయిందని పోలీసులు తెలిపారు. -
ఇలా చితికి..
మిర్యాలగూడ: సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతిరావు అంత్యక్రియలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. మారుతిరావు భార్య గిరిజ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఇంటి నుంచి మారుతిరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు షాబ్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మారుతిరావు చితికి ఆయన తమ్ముడు శ్రవణ్ నిప్పంటించారు. అమృతను అడ్డుకున్న బంధువులు.. ఇదిలా ఉండగా తన తండ్రిని కడసారి చూడటానికి అమృత పోలీసు బందోబస్తుతో శ్మశానవాటిక వద్దకు చేరుకుంది. పోలీసు వాహనంలోనే అమృతను ఇంటి వద్ద నుంచి శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కాగా అమృత అక్కడికి చేరుకునే లోగా మారుతిరావు మృతదేహాన్ని చితిపై ఉంచారు. చితివద్దకు పోలీసులతో కలసి వెళ్లిన అమృతను మారుతిరావు బంధువులు, పట్టణ వాసులు అడ్డుకున్నారు. అమృత గోబ్యాక్.. మారుతిరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించి పోలీసులు అమృతను వెంటనే తమ వాహనంలో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఆస్తి కోసం అమృత డ్రామాలు : శ్రవణ్ ‘మారుతిరావు చస్తే తనకు శుభవార్త’అని చెప్పిన అమృతకు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అతనిపై ప్రేమ పుట్టుకురావడం చూస్తే, ఆస్తికోసం డ్రామా ఆడుతున్నట్టు ఉందని మారుతిరావు తమ్ముడు శ్రవణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తన అన్న నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, మారుతిరావు భార్య పుస్తె తీసిన రోజే తాను పుస్తె తీస్తానని అమృత చెప్పిందని, అలాగే మారుతిరావును బహిరంగంగా ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసిందని అన్నారు. తన వల్ల ఎవరికీ ప్రాణహాని ఉండదని, అమృత తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రణయ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా శిక్ష అనుభవించానని, కేసు విషయంలో ఏనాడు కూడా రాజీ కోసం అమృత వద్దకు వెళ్లలేదని తెలిపారు. శ్మశానవాటిక వద్ద ఆమెను తాను అడ్డుకోలేదని, తల్లిపై ప్రేమ ఉంటే ఆమె అక్కడే ఉన్నా ఎందుకు మాట్లాడలేదన్నారు. తన అన్న మారుతిరావుకు అప్పులు ఉంటే వడ్డీతో సహా తీర్చుతానని వెల్లడించారు. ఆస్తిపై ఎలాంటి ఆశలు లేవు: అమృత తండ్రి ఆస్తిపై తనకు ఆశల్లేవని మారుతిరావు కూతురు అమృత చెప్పారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మారుతిరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. పశ్చాత్తాపం చెందో, శిక్షపడుతుందనో ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు అని అంది. ఆయనకు బినామీ పేర్లపై ఆస్తులున్న ట్లు తెలిసిందని, ఆస్తి విషయంలో మారుతిరావును బాబాయి శ్రవణ్ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది. శ్రవణ్ వల్ల తన తల్లికి కూడా ప్రాణ హాని ఉండొచ్చని అనుకుంటున్నానంది. తాను తల్లి వద్దకు వెళ్లనని, ఆమే తనవద్దకు వస్తే చూసుకుంటానని తెలిపింది. -
అమృతకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత అస్వస్థతకు గురయ్యారు. మిర్యాలగూడలోని తన నివాసంలో ఉన్న అమృత.. సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, అమృత తండ్రి, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి : బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత డబ్బుల కోసం అమృత డ్రామాలు.. -
‘మొన్నరాత్రి మారుతిరావు నాకు ఫోన్ చేశాడు’
సాక్షి, హైదరాబాద్ : మారుతి రావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన వ్యక్తిగత లాయర్ వెంకట సుబ్బారెడ్డి అన్నారు. తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో మారుతిరావు తనతో మాట్లాడారని, కేసుపై చర్చించారని చెప్పారు. కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందుకు రావడం మారుతిరావును కలిచివేసిందని, విచారణను వాయిదా వేయించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రణయ్ ఎస్సీ కాదని నిరూపించేందుకు ప్రయత్నం చేశారని,కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి తనకు ఇచ్చినట్టు లాయర్ పేర్కొన్నారు. (చదవండి : బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత) ఎస్సీ, ఎస్టీ కేసుపై మంగళవారం హైకోర్టులో కేసు వేయాలకున్నామని.. ఇంతలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆస్తి పంపకాల విషయాలను ఎప్పుడు తనతో చర్చించలేదన్నారు. ప్రణయ్ కేసులో శిక్ష పడుతుందని మారుతీరావుకు తెలుసునని.. ఆ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడొచ్చని అభిప్రాయపడ్డారు. మారుతిరావుతో తనకు ఏడేళ్ల పరిచయం ఉందన్నారు. మారుతిరావు భార్య గిరిజ కూడా గతంలో తనను కలిసిందని, చాలా బాగా మాట్లేడదని వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చదవండి : డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది.. మారుతిరావు ఆత్మహత్య -
అమృత తీరు మమ్మల్ని బాధించింది
-
డబ్బుల కోసం అమృత డ్రామాలు..
సాక్షి, మిర్యాలగూడ : తనపై అమృత చేసిన ఆరోపణలను మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఖండించారు. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. శ్రవణ్ సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అమృత తీరు మమ్మల్ని ఎంతో బాధించింది. నేను మా అన్నయను బెదిరించానని ఆరోపిస్తోంది. నా వల్ల ప్రాణహాని ఉందనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక ప్రణయ్ హత్యకేసులో నా ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. (బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత) మా అన్న మారుతీరావు చనిపోయే వరకూ ఉరి తీయాలని అమృత డిమాండ్ చేసింది. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. ప్రణయ్ హత్యకు ముందు మా అన్నకు నాకు మాటలు లేవు. అమృత విషయంలోనే గొడవలు జరిగాయి. ఆమె చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయి. తండ్రి చనిపోతే ఆమె వ్యవహరించిన తీరు సరిగా లేదు. తండ్రి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదు? నేను బెదిరించే వాడిని అయితే నా పేరు ఎందుకు బయటకు రాలేదు? మా అన్న చనిపోయాక ..అమృతకు ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చింది? (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!) నాన్న అని పిలవడానికి కూడా అమృతకు మాట రావడం లేదు. మీడియాలో కనిపించడం కోసం డ్రామాలు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే నాకేం అభ్యంతరం లేదు. అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు నా పై ఆరోపణలు చేస్తోంది. దయచేసి మీడియా కూడా అవాస్తవాలు రాయొద్దు. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఒకవేళ మా అన్న ఎవరికైనా అప్పు ఉంటే వాటిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు. (మిస్టరీగా మారుతీరావు మరణం!) -
నన్ను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశాడు
-
బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు: అమృత
సాక్షి, మిర్యాలగూడ : ‘మా నాన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మా నాన్న మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. మా నాన్న ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. ఆస్తి తగాదాలే ఆత్మహత్యకు కారణం కావచ్చు. వీలునామాలో బాబాయ్ (శ్రవణ్) పేరు ఉంటే అనుమానం వస్తుందని పేరు తీయించేసి ఉండాలి’ అని మారుతీరావు కుమార్తె అమృతా ప్రణయ్ తెలిపారు. (అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!) అమృత సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే నాన్న ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. చనిపోవడానికి వేరే కారణాలు కూడా కావొచ్చు. ప్రణయ్‌ని చంపారు అని తప్ప..మా మధ్య వేరే గొడవలు లేవు. ఈ కేసులో చట్టపరంగా నాన్నకు శిక్ష పడాలని కోరుకున్నాను. వాళ్ల ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాటి మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నేను బయటకు వచ్చాక వాళ్లు ఆస్తులు పంచుకున్నారు. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. గతంలో పరువు విషయంలో మా నాన్నను బాబాయ్ చాలాసార్లు రెచ్చగొట్టాడు. ఇవాళ ఉదయం శ్మశానంలో నన్ను అడ్డుకోవడం సరికాదు. తండ్రి అనే నేను చూడటానికి వెళ్ళాను..నన్ను చూడనివలేదు. నన్ను అడ్డుకుంది కూడా బాబాయ్ వాళ్ల అమ్మాయి. (నిందితుడు, బాధితుడు మారుతీరావే) పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. భర్త చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మను పరామర్శించడానికి వెళ్లాను. బాబు పుట్టాక అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా. నేను అయితే ప్రణయ్ కుటుంబాన్ని వదిలి అమ్మ దగ్గరకు వెళ్లను. ఒకవేళ ఆమె నా దగ్గరకు వస్తే ఆమె బాధ్యత తీసుకుంటాను. నా భర్త ప్రణయ్ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో... ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నాను. ప్రాణం తీసినా, తీసుకున్నా అందరికీ బాధే’ అని అన్నారు. (మారుతిరావు ఆత్మహత్య) -
అమృత గో బ్యాక్
-
మారుతీ రావు పోస్ట్‌మార్టం పూర్తి ...
-
అమృతకు నిరాశ.. దక్కని చివరి చూపు!
మిర్యాలగూడ: తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. తండ్రి చావుకు కారణమైన ‘అమృత గో బ్యాక్’, ‘మారుతీరావ్ అమర్ రహే’ అంటూ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె తిరిగి వాహనం ఎక్కి కూర్చున్నారు. పోలీసుల సూచనమేరకు తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు. (చదవండి: మారుతిరావు ఆత్మహత్య) కాగా, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ప్రణయ్ అనే దలిత యువకుడిని మారుతీరావు హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే. (చదవండి: చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం) ఇదిలాఉండగా.. మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషయం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (చదవండి: మారుతీరావు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక) -
నిందితుడు, బాధితుడు మారుతీరావే
సాక్షి, మిర్యాలగూడ : ఒక ప్రేమ వివాహం.. రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అటు కూతురు కుటుంబం.. ఇటు తన కుటుంబం చిన్నాభిన్నం అయింది. ఈ సంఘటనలో నిందితుడు, బాధితుడు కూడా మారుతీరావే కావడం గమనార్హం. మిర్యాలగూడలో రియల్టర్‌గా, బిల్టర్‌గా పేరు సంపాదించుకున్న తిరునగరు మారుతీరావుకు ఒక్కతే కూతురు అమృత. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకు యుక్తవయసు వచ్చే నాటికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమెకు నచ్చిన వ్యక్తి పెరుమాళ్ల ప్రణయ్‌ని 2018 జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్ మందిరంలో ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు చేసుకున్న ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో అల్లుడైన ప్రణయ్‌ని 2018 సెప్టెంబర్ 14వ తేదీన దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత జైలుకు వెళ్లడం.. ఏడు మాసాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. తిరిగి బెయిల్‌పై 2019 ఏప్రిల్ 28వ తేదీన మారుతీరావు మిర్యాలగూడకు వచ్చాడు. తన కూతురు అమృత భర్తను పోగొట్టుకున్న బాధలో అత్తగారింట్లోనే ఉంది. తన కుమారుడు ప్రణయ్‌ని అల్లారుమద్దుగా పెంచుకున్న పెరుమాళ్ల బాలస్వామి దంపతులు కొడుకు హత్యకు గురైన బాధ నుంచి తేరుకోలేకపోయారు. కోడలు అమృతకు పుట్టిన కుమారుడికి నిషాన్ ప్రణయ్ అని పేరుపెట్టుకొని తన కొడుకును చూసుకుంటున్నారు. అయినా ఆ కుటుంబం ప్రణయ్ లేడనే బాధ నుంచి తేరుకోలేదు. కాగా ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన భార్య ఒంటరైంది. అటు తన కూతురు అమృత కుటుంబం, ఇటు తన కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక్క ప్రేమ వివాహం రెండు కుటుంబాలను చిధ్రం చేసింది. (అదే మారుతీరావు ప్రాణాల మీదకు తెచ్చిందా?) -
అవి తిన్నందువల్లే మారుతీరావు మృతి..!
సాక్షి, మిర్యాలగూడ: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరునగరు మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక ప్రాథమిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు. (నిందితుడు, బాధితుడు మారుతీరావే) కాగా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాం నుంచి ఫోరెన్సిక్ వైద్యులు విస్రా శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు.. బలవన్మరణానికి పాల్పడటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28న బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఆ తర్వాత తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు కొనసాగించాడు. అయినా ఆమె నుంచి సానుకూల స్పందన రాలేదు.(మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?) ఇందుకు తోడు కోర్టు కేసు, ఆస్తి పంపకాలు, కూతురి కులాంతర వివాహం కారణంగా వేధింపులు తదితర ఒత్తిళ్ల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోమవారం మారుతీరావు అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో.. ఆయనను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఓవైపు కూతురు దూరమై.. ఇప్పుడు భర్త కూడా శాశ్వతంగా తనను వదిలిపోవడంతో మారుతీరావు భార్య రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.(మారుతీరావు ఆత్మహత్య!) -
మారుతీరావు ఆత్మహత్య... వేధింపులే కారణమా?
సాక్షి, మిర్యాలగూడ: మారుతీరావు ఆత్మహత్య.. అనేక కారణాలను వెతుకుతుంది. అప్పట్లో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ప్రణయ్ హత్య తర్వాత జైలుకు వెళ్లిన మారుతీరావు గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యాడు. మిర్యాలగూడలో తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నాడు. ఎలాగైనా తన కూతురు అమృతను తన వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మధ్యవర్తులను సైతం ఆమె వద్దకు పంపాడు. అయినా ఒప్పుకో ని అమృత మధ్యవర్తులతో పాటు మారుతీ రావుపై కూడా కేసు పెట్టింది. దాంతో మరోసారి జైలుకు వెళ్లాడు. కాగా ఎన్ని ఇబ్బందులు పడినా తన కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అంశం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా ప్రణయ్ కేసు ఈనెల నుంచి జిల్లా కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. మూడు రోజుల పాటు వరుసగా కోర్టుకు వెళ్లిన మారుతీరావు మంచి న్యాయవాదిని పెట్టుకోవాలని భావించినట్లు తెలి సింది. అయినా ప్రణయ్ హత్య సంచలనం కలగడం వల్ల తనకు శిక్ష పడితే జైలులో చనిపోయే కంటే ముందే మరణించడం మంచిదని ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆస్తి వివాదమా... మనస్తాపమా? ప్రణయ్ హత్య అనంతరం మారుతీరావుతో ఆయన తమ్ముడు శ్రవణ్‌కు ఆస్తి వివాదాలు వచ్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్యకు ముందే తన ఆస్తిలో తన తమ్ముడు శ్రవణ్ పేరున కొంత, మిగతా ట్రస్టుకు వీలునామా రాసినట్లు సమాచారం. కాగా హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత వీలునామాను మరోసారి మార్చినట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో సంబంధం లేకున్నా తనపై కేసులు రావడం, జైలుకు వెళ్లడంపై శ్రవణ్ తన అన్న మారుతీరావుపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా మారుతీరావు స్పందించకుండా తన పని తాను చేసుకుంటుండగా కొంత కాలంగా ఇద్దరికి వివాదం కొనసాగుతుందని సమాచారం. ఆ క్రమంలోనే ఆస్తి విషయంలో మూడు నెలల క్రితం వీలునామాను తిరగరాసినట్లు తెలిసింది. రెండోసారి తిరగరాసిన వీలునామాలో శ్రవణ్ పేరు లేకుండా తన భార్య పేరున కొంత ఆస్తి, ట్రస్టుకు కొంత రాసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆస్తి వీలునామా తన ప్రాణాల మీదికి తెచ్చిందా? తన కూతురు తన వద్దకు రాలేదనే మనస్తాపమా? హత్య కేసులో శిక్ష పడుతుందనే ఆందోళనా? ప్రణయ్‌ని హత్య చేయించిన ప్రశ్చాత్తాపమా? అనే విషయాలు తేలాల్సి ఉంది. సుపారీ గ్యాంగ్ వేధింపులు కూడా కారణమేనా? ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో చేతులు కలిపిన మారుతీరావును ఆ గ్యాంగ్ సభ్యులు కూడా డబ్బుల కోసం వేధిస్తున్నట్లు సమాచారం. మారుతీరావుతో పాటు నిందితుల్లో ముఖ్యులుగా ఉన్న అస్గర్‌అలీ, అబ్దుల్భారీలు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని, ఇంకా అదనంగా ఇవ్వాలంటూ వేధిస్తున్నట్లు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల్లో ఏ 1 నిందితుడిగా మారుతీరావు ఉండగా ఏ 2 గా సుభాష్‌శర్మ, ఏ 3గా అస్గర్‌అలీ, ఏ 4గా అబ్దుల్ భారీ, ఏ 5గా ఎండీ. ఖరీం, ఏ 6గా తిరునగరు శ్రవణ్, ఏ 7గా శివ, ఏ 8గా నిజాం ఉన్నారు. (ప్రణయ్, మారుతీరావు నివాసాల వద్ద భారీ బందోబస్తు) -
ప్రణయ్, మారుతీరావు ఇళ్ల వద్ద భారీ భద్రత
సాక్షి, మిర్యాలగూడ టౌన్: తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో మారుతీరావు పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన పేరుమళ్ల ప్రణయ్‌ను ఇస్లాంపురలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద హత్య చేయించాడు. ఈ కేసులో ఎ–1 ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు శనివారం రాత్రి ఖైరతాబాద్‌లో గల ఆర్య సమాజ భవనంలో మృతి చెందడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం మిర్యాలగూడలోని పేరుమళ్ల ప్రణయ్ నివాసం వద్ద పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఏఎస్ఐ గౌసు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రణయ్ కుటుంబానికి 8 మంది గన్మెన్లను ఏర్పాటు చేయగా మారుతీరావు చనిపోవడంతో మరి కొంతమంది పోలీస్‌లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు మృతదేహం పట్టణంలోని రెడ్డికాలనీలో గల నివాసానికి వస్తుండటంతో అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మారుతీరావు మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. (‘అమృతా.. అమ్మ దగ్గరకు వెళ్లు’) -
అమృతాప్రణయ్ అక్కడికి వెళ్లనుందా!?
మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. కాగా, మారుతీరావు అంత్యక్రియలు స్వస్థలం మిర్యాలగూడలో సోమవారం జరుగుతున్నాయి. అయితే, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమృత ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు ఆమె పోలీసుల భద్రత కోరారు. కాగా, ఆమె బాబాయ్, మారుతీరావు సోదరుడు శ్రవణ్ అమృత వచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. ఇక మారుతీరావు తల్లి, భార్య రోధిస్తున్న తీరు పలువురిని కలచి వేసింది. కూతురు కోసం ఎంతో శ్రమించి.. ఆమె బాగు కోసమే పరితపించిన మనిషి.. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. (చదవండి: మారుతిరావు ఆత్మహత్య) అప్పుడేం జరిగింది.. తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడంతో మారుతీరావు 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల మిర్యాలగూడలో మారుతిరావుకు చెందిన ఓ షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో మారుతిరావు బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదనే ఆందోళనతోపాటు తన ఆస్తుల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో గొడవల వల్ల మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. (చదవండి: మిస్టరీగా మారుతీరావు మరణం!) -
మారుతిరావు ఆత్మహత్య
పంజగుట్ట/అఫ్జల్‌గంజ్: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. న్యాయవాదిని కలవడానికి నగరానికి వచ్చిన ఆయన ఖైరతాబాద్‌లోని వైశ్యభవన్‌లో బసచేశారు. ఆదివారం తాను ఉంటున్న గదిలో విగతజీవిగా కనిపించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆయన విషం తాగి ఆత్మహ త్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. మారుతిరావు బసచేసిన గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. న్యాయవాదిని కలుస్తానని నగరానికి.. మారుతిరావు న్యాయవాదిని కలిసివస్తానని కుటుంబసభ్యులకు చెప్పి శనివారం తన వాహనంలో డ్రైవర్ బెల్లంకొండ రాజేష్‌తో కలిసి నగరానికి వచ్చారు. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన ఆయన మూడో అంతస్తులోని 306 నంబర్ గదిలో బస చేశారు. న్యాయవాది వస్తారని డ్రైవర్‌తో చెప్పిన మారుతిరావు, డ్రైవర్‌ను కారులోనే ఉండమన్నారు. అనంతరం డ్రైవర్‌ను పిలిచి ఎదురుగా ఉన్న మిర్చిబండి నుంచి గారెలు, కారు లో ఉన్న కాగితాలు తేవాలని చెప్పారు. అవి తీసుకున్న మారుతిరావు.. అన్నం తిని కారులోనే పడుకోవాలని డ్రైవర్‌కు చెప్పి తన గదికి వెళ్లిపోయారు. రాత్రి 9 గంటలకు గదిలో ఏసీ పని చేయట్లేదని వైశ్యభవన్ రిసెప్షన్‌కు ఫోన్ చేయడంతో సిబ్బంది మరమ్మతులు చేసి వెళ్లారు. తర్వాత ఆయన గది తలుపులు వేసుకున్నారు. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆదివారం ఉదయం మిర్యాలగూడ నుంచి గిరిజ తన భర్త మారుతిరావుకు ఫోన్‌చేయగా, స్పందించలేదు. దీంతో ఆమె డ్రైవర్‌కు ఫోన్‌చేసి చెప్పారు. డ్రైవర్.. మారుతిరావు గది వద్దకు చేరుకుని డోర్ కొట్టగా, తీయలేదు. అతను గిరిజకు ఫోన్‌చేసి చెప్పగా, ఆమె మరోసారి ప్రయత్నించాలని చెప్పారు. అయినా స్పందించకపోవడంతో రాజేష్ రిసెప్షన్లో ఉన్న వైశ్యభవన్ ఉద్యోగి మల్లికార్జున్‌కు చెప్పాడు. ఆయన సైతం విఫలయత్నం చేసి.. విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనతో సైఫాబాద్ పోలీసులకు తెలిపారు. పోలీసులు మారుతిరావు గది డోర్‌ను గట్టిగా నెట్టడంతో లోపలి టవర్ బోల్ట్ ఊడి, తలుపు తెరుచుకుంది. గదిలో మంచంపై విగతజీవిగా పడి ఉన్న మారుతిరావును గుర్తించారు. అప్పటికే గిరిజ కొత్త్తపేటలో ఉండే మారుతిరావు సమీప బంధువు రఘుకు సమాచారమివ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులు 108ను పిలిపించారు. ఆ సిబ్బంది మారుతిరావు మరణించినట్లు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మారుతిరావు మరణాన్ని ధ్రువీకరించడంతో మార్చురీకి చేర్చారు. ‘అమృతా.. అమ్మ దగ్గరకు వెళ్లు’ మారుతిరావు గదిలో సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. అందులో ‘గిరిజా క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు రా అమ్మా’ అని ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మారుతిరావు తీసుకున్న విషం తాలూకు ఆనవాళ్లు, డబ్బా, సీసా గదిలో లభించలేదు. దీంతో ఆయన మరో ప్రాంతంలో విషం తీసుకుని గదిలోకి వచ్చి ఉంటా రని భావిస్తున్నారు. మారుతిరావు చనిపోయే ముందు తన రెండు చేతుల్నీ మూతి వద్దకు తీసుకువెళ్లడంతో అలానే ఉండిపోయాయి. విష ప్రభావాన్ని తట్టుకోలేక ఆయన అలా చేసి ఉంటారని, గదిలో వాంతులు సైతం చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వైశ్యభవన్‌కు వచ్చారు. పోలీసులు, క్లూస్‌టీం మారుతిరావు కారును, సెల్‌ఫోన్, బ్యాగులోని బట్టలు తదితరాలు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. మా కుటుంబానికి అన్యాయం జరిగింది.. మారుతిరావు కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నా రని, వైశ్యభవన్‌కు వచ్చిన ప్రతిసారీ తన డ్రైవర్‌కు కూడా గది తీసుకునే వారని తెలిసింది. ఈసారి అలా చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, భర్త మృతదేహాన్ని చూసిన గిరిజ కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే కూతురు దూరమైందని, ఇప్పడు భర్త ఆత్మహత్యతో తమకుటుంబానికి అన్యాయం జరిగిందని విలపించారు. మీడియాలో విస్తృత ప్రచారం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోదరుడు శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని, ఊహాకల్పనలతో రాయవద్దని కోరారు. చివరిసారిగా మారుతిరావుతో గత మే 17న మాట్లాడానని తెలిపారు. కేసుల విషయంలో మారుతిరావుపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఉస్మానియా మార్చురీలో మారుతిరావు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి స్వస్థలం మిర్యాలగూడకు తరలించారు. మారుతిరావు శరీరం నుంచి సేకరించిన విస్రాను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. ఆ నివేదికలు వస్తేనే మారుతిరావు ఏ విషం తాగారన్నది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. నాడేం జరిగిందంటే.. తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడంతో మారుతీరావు 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల మిర్యాలగూడలో మారుతిరావుకు చెందిన ఓ షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో మారుతిరావు బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదనే ఆందోళనతోపాటు తన ఆస్తుల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో గొడవల వల్ల మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. చనిపోయినట్టు తెలియదు తన తండ్రి మారుతిరావు చనిపోయిన విషయం తెలియదని, ఆయన కుమార్తె, ప్రణయ్ భార్య అమృత మీడియాకు తెలిపింది. మారుతిరావు హైదరాబాద్‌లో మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆదివారం ఉదయం మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీనిపై అమృతను ప్రశ్నించగా ‘పట్టణానికి చెందిన మారుతిరావు అనే వ్యక్తి చనిపోయాడని టీవీల్లో వచ్చింది. చనిపోయింది మా నాన్న మారుతిరావే అనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ ఆయన చనిపోతే సోమవారం నేనే మీడియా ముందుకు వస్తా’అని చెప్పింది. రెండు కుటుంబాలు ఆగం మారుతిరావు చనిపోయిన విషయం మాకు తెలియదు, ఒకవేళ ఆయన చనిపోతే మాత్రం రెండు కుటుంబాలు ఆగమైనట్లే. మారుతిరావు ఆత్మహత్యపై మాకెలాంటి సమాచారం లేదు. ఒకవైపు మా కుటుంబం, మరోవైపు ఆయన కుటుంబం ఆగమయ్యాయి. – బాలస్వామి, ప్రణయ్ తండ్రి -
మిస్టరీగా మారుతీరావు మరణం!
-
మిస్టరీగా మారుతీరావు మరణం!
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావు మరణంపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా?... ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇక మారుతీరావు గదిలో ఆత్మహత్య ఆనవాళ్లు లభించలేదు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి ఆనవాళ్లు బయటపడలేదు. మరోవైపు ఆయన బస చేసిన గదిలో పాయిజన్ కానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకూ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మారుతీరావు నిన్నఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వెళ్లి వచ్చారు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్‌ను పంపించి గదిలోకే అల్పాహారంగా గారెలు తెప్పించుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను కిందకు పంపించేసి, గదికి గడియ పెట్టుకున్నారు. మారుతీరావు ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. గదితో పాటుగా వాష్ రూమ్ , బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) కాగా సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటులో ఉన్న చేతి రాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు చేపట్టారు. బయటికి వెళ్లిన మారుతీరావు ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఆయన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ వైపు ప్రణయ్ హత్యకేసు ట్రయల్‌కు రావడంతో మారుతీరావు తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా కుటుంబంలో గొడవల కారణంగా ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) -
గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి ..తిరగరాశారు. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు తన కుమార్తె అమృతతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) అయితే రెండు రోజుల క్రితం మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు భోగట్టా. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. సూసైడ్ నోటులో ‘గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరకు రా’ అని రాశారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) మీడియా ఊహించి రాయొద్దు.. మారుతీరావు ఆత్మహత్యపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు శ్రవణ్ ఖండించారు. తన అన్నతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. విబేధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే ప్రణయ్ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే నేపథ్యంలోనే సోదరుడితో మాట్లాడటం లేదన్నారు. దీంతో తన తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో మారుతీరావుతో గత ఏడాది మే 15 నుంచి మాట్లాడటం లేదని తెలిపారు. మీడియా ఊహించి రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్న ఆత్మహత్య విషయం తెలియగానే తన వదినను తీసుకుని హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. సూసైడ్ నోట్లో ఏముందో తెలియదని, ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారో లేదా అనేది కూడా తనకు ఏమీ తెలియదని శ్రవణ్ పేర్కొన్నారు. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో విషంతాగి ఆత్మహత్య చేసుకున్న తిరునగరి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు రేపు (సోమవారం) మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మారుతీరావు నిన్నరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. (అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు) విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. మారుతీరావు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. (అమృత తండ్రి షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?) ఆ మృతదేహం ఎవరిది? తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ఆమె భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడని కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసులో మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. (అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్) -
నాన్న ఆత్మహత్య చేసుకున్నట్లు టీవీలో చూశా
-
అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు
సాక్షి, నల్గొండ : ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు. ప్రణయ్ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని పేర్కొన్నారు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. కాగా, శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి : అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..! మారుతీ రావు షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది? అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్ -
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య
-
అమృతాప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. (చదవండి : మారుతీ రావు షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?) మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ.కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో దారుణంగా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హత్య జరిగింది. గర్భిణిగా ఉన్న భార్య అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి ప్రణయ్‌ను హత్య చేశారు. ఈ కేసులోమారుతీరావు జైలుపాలయ్యారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపారు. కాగా, ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా వారం రోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావుకు చెందిన షెడ్డులో అనుమానాస్పదస్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో లభించింది. జైలు నుంచి విడుదలైన తరువాత మారుతీరావు ఎవరికి, ఎక్కడా పెద్దగా తారసపడకపోవడంతో చనిపోయింది మారుతీరావే అన్నట్లు ప్రచారాలు జరిగాయి. ఈ ఘటనలో మృతదేహం ఎవరిదన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమృత తండ్రి షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?
మిర్యాలగూడ అర్బన్ : పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో నిందితుడు మరుతీరావుకు చెందిన ఖాళీ షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డు ఫ్లైవర్ సమీపంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మారుతీరావుకు చెందిన ఖాళీ షెడ్డు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన స్థానికులు శనివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వారం రోజుల క్రితం మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుంది. కాగా మృతుడు నీలిరంగు చొక్కా, జీన్స్ పాయింట్ ధరించి ఉండగా చేతికి వాచ్ ఉంది. శవం గుర్తు పట్టకుండా ఉంది. శరీరం పూర్తిగా కుళ్లిపోయింది. మృతదేహంపై ఆయిల్ పోసినట్లుగా ఉండటంతో హత్య చేసిన అనంతరం ఆనవాళ్లు మాయం చేసేందుకు ప్రయత్నాలు చేశారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నల్లగొండ నుంచి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పట్టణంలో చర్చనీయాంశం.. పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో నిందితుడుగా ఉన్న మారుతీరావుకు చెందిన ఖాళీ స్థలంలోని షెడ్డులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం పట్టణంలో సంచలనం సృష్టించింది. దీంతో పట్టణ ప్రజలు భారీ ఎత్తున సంఘటనా స్థలానికి మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. మారుతీరావుకు చెందిన ఈ స్థలంలో గతంలో ఒక హోటల్ కోసం షెడ్లు వేయగా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించే సమయంలో వచ్చే దుమ్ముతో ఆ హోటల్ మూసి వేశారు. అప్పటి నుంచి ఆ షెడ్డు ఖాళీగా ఉండగా అందులో మృతదేహం లభ్యంకావడం చర్చనీయాంశమైంది. ఒక మృతదేహం..ప్రశ్నలు అనేకం.. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కడైనా హత్యచేసి ఇక్కడి షెడ్డులోకి తెచ్చి పడేశారా? లేక షెడ్డులోనే పథకం ప్రకారం హత్య చేసి గుర్తు పట్టకుండా ఆయిల్ పోశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి : అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి.. ‘చనిపోయే వరకు అమృత ప్రణయ్లానే ఉంటాను’ అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్ పరువు హత్యకేసులోబెయిల్.. -
పరువు హత్యకేసులోబెయిల్..
నల్లగొండ, మిర్యాలగూడ టౌన్ : పరువు హత్యకు గురైన పేరుమాళ్ల ప్రణయ్ భార్య అమృతను బెదిరించిన కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు గత నెలలో అమృత ఇంటికి వెళ్లి పరువు హత్య కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. తన తండ్రి ప్రోద్బలంతోనే వెంకటేశ్వర్లు బెదిరించాడని ఆరోపిస్తూ అమృత అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వన్ టౌన్ పోలీసులు అమృత తండ్రి తిరునగరు మారుతీరావు ఎ–1గా, మహ్మద్ ఖరీం ఎ–2గా, కందుల వెంకటేశ్వర్లు ఎ–3 నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఆ కేసులో వీరిని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించగా గడువు ముగియడంతో మరో 14రోజుల పొడిగించారు. తిరిగి సోమవారం 8వ అదనపు కోర్టులో బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల షూరిటీతో పాటు రెండు నెలల పాటు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల లోపు స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలనే షరతులను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
అమృతను బెదిరించిన రిటైర్డ్ తహసీల్దార్‌పై కేసు
సాక్షి, మిర్యాలగూడ: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతని భార్య అమృతను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్‌రావుపై బుధవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో తన తండ్రి మారుతీరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఇద్దరు వ్యక్తులు అమృతను బెదిరించడంతోపాటు తండ్రి ఆస్తులు దక్కుతాయని ప్రలోభపెట్టారు. ఈ విషయంపై అమృత ఫిర్యాదు మేరకు గత నెల 30వ తేదిన ప్రణయ్ హత్యలో ప్రధాన సూత్రధారులు తిరునగరు మారుతీరావు, ఎంఎ.ఖరీంలతో పాటు వెంకటేశ్వర్‌రావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విష యం విదితమే. మారుతీరావు సలహా మేరకు అమృతను కలిసేందుకు వెంటేశ్వర్రావుతోపా టు రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్‌రావు ఉన్నట్లుగా ఆలస్యంగా గుర్తించిన పోలీసులు నాలుగో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, వెంకటేశ్వర్రావుపై కేసు నమోదనైట్లు తెలుసుకున్న భాస్కర్‌రావు తనపై కూడా కేసు అవుతుందని భావించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న భాస్కర్‌రావును త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. -
అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్ : పరువు హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని కూతురుని బెరించారనే అభియోగం మేరకు అమృత తండ్రి తిరునగరు మారుతీరావుతో పాటు మరో ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది తన కూతురు అమృతను వివాహం చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు కిరాయి వ్యక్తులతో పెరుమాళ్ల ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడని అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులో మారుతీరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ నెల 11వ తేదీన కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అమృత ఇంటికి వెళ్లి తనను మారుతీరావు పంపించాడని తెలిపాడు. ప్రణయ్ హత్య కేసులో సహకరించి మీ తండ్రి వద్దకు వస్తే ఆస్తిని మొత్తం నీ పేరుపై రాసి ఇస్తాడని చెప్పాడు. దీంతో అమృత వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించింది. దీంతో స్పందించిన వన్‌టౌన్ పోలీసులు కందుల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో మారుతీరావు, ఎంఎ కరీం లు తనను పంపారని అంగీకరించడంతో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. అమృత ఫిర్యాదు మేరకు ఈ ముగ్గరు వ్యక్తులపై బెదిరింపులు, సాక్షిని ప్రలోభపెట్టడం వంటి కేసులను నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. చదవండి: అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి.. వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా? ‘చనిపోయే వరకు అమృత ప్రణయ్లానే ఉంటాను’ ప్రణయ్ కేసులో నిందితులకు బెయిల్ వారి వల్లే ఇంకా బ్రతికున్నాం: ప్రణయ్ తండ్రి ‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’ అతడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు: అమృత ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు! -
అమృత ఇంట్లోకి అపరిచిత వ్యక్తి..
సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఎవరూ లేని సమయంలో అమృత ఇంట్లోకి ప్రవేశించి ఓ పోస్ట్ కవర్‌ను పెట్టి వెళ్లాడు. ఆ లేఖను తెరచి చూడగా అందులో ఓ వ్యక్తి కలర్ ఫోటో, తన శరీర కొలతల వివరాలు ఉన్నాయి. అతని పుట్టిన తేది, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు లేఖలో రాసి ఉన్నాయి. సీసీ కెమెరా పుటేజీలో ఆగంతకుడు గేటు తీసి లోపలికి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ లేఖను ఇంట్లో పెట్టి వెళ్లాడు. అయితే ఎందుకు ఆ వ్యక్తి లేఖను పెట్టి వెళ్లాడు? ఆ వ్యక్తి ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
గుజరాత్‌కు ఉగ్రవాది అస్ఘర్అలీ
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది అస్ఘర్ అలీని గుజరాత్ పోలీసులు పీటీ వారెంట్‌పై అక్కడకు తరలించారు. ఆ రాష్ట్ర మాజీ హోమ్‌మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసులో అస్ఘర్‌ను సైతం దోషిగా నిర్థారిస్తూ సుప్రీం కోర్టు గత నెల మొదటి వారంలో తీర్పు ఇచ్చింది. దీంతో బయట ఉన్న ఇతర దోషులు వెళ్ళి గుజరాత్లో లొంగిపోగా... గంజాయి కేసులో అరెస్టై నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్ అలీని బుధవారం పీటీ వారెంట్‌పై తీసుకువెళ్ళారు. గురువారం అహ్మదాబాద్‌లోని పోటా ప్రత్యేక న్యాయస్థానంలో అస్ఘర్‌ను హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు శిక్ష పూర్తి చేయడం కోసం అతడిని సబర్మతి జైలుకు పంపారు. ప్రణయ్ హత్యకేసుతోపాటు పలు కేసుల్లో నిందితుడు నల్లగొండలోని దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్ఘర్ అలీ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. అప్పటి నుంచి పలు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో నిందితుడిగా మారాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్ ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. రసూల్ కొన్నాళ్ళ పాటు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తలదాచుకున్నాడు. అప్పట్లోనే అస్ఘర్‌తో ఇతడికి పరిచయం ఏర్పడింది. అప్పట్లో హరేన్‌పాండ్య హత్యకు నేరుగా రంగంలోకి దిగింది అస్ఘర్ అలీనే. హరేన్‌పాండ్య 2003 మార్చ్ 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్ళిన ఉగ్రవాదులు ఆయన్ను కాల్చి చంపాడు. స్వయంగా> తుపాకీ పట్టుకున్న అస్ఘర్ ఐదు రౌండ్లు పాండ్యపై కాల్చడంతో ఆయన కన్నుమూశారని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చెల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్ తదితరుల్ని పట్టుకుంది. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్న 15 మంది అరెస్టు అయ్యారు. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్ తదితరులను దోషులుగా తేల్చి అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్ హైకోర్టులో వీగిపోవడంతో వాళ్ళు బయటపడ్డారు. గుజరాత్ హైకోర్టు తీర్పును ఆ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ అమలు చేయాలని గత నెల మొదటి వారంలో ఆదేశించింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉండి దోషులుగా తేలిన గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన రెహాన్ పుథావాలా, పర్వేజ్ ఖాన్ పఠాన్, హాజీ ఫారూఖ్, కలీం కరీమి, అనాస్ మచ్చీస్ వాలా, పర్వేజ్ షేక్, మహ్మద్ రియాజ్ గోరు, యూనుస్ సర్వేష్ వాలా కొన్నాళ్ళ క్రితం నేరుగా వెళ్ళి అహ్మదాబాద్‌లోని పోటా కోర్టులో లొంగిపోయారు. గత ఏడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ పడిన అస్ఘర్ అలీపై ఇటీవలే బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే గంజాయి మత్తుకోసం ప్రయత్నించి ఆ మాదకద్రవ్యాన్ని ఖరీదు చేసి దగ్గర పెట్టుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నల్లగొండ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో ఇతడు నేరుగా వెళ్ళి లొంగిపోవడం సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందారు. దీన్ని త్వరలో తీసుకురానున్న ప్రత్యేక బృందం నల్లగొండకు వచ్చింది. బుధవారం ఇక్కడి జైలు అధికారులకు వారెంట్‌ను అందించి అస్ఘర్‌ను తీసుకువెళ్ళింది. -
ప్రణయ్ కేసులో నిందితుడిని గుజరాత్‌కు..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అస్ఘర్ అలీని గుజరాత్ తరలించేందుకు అక్కడి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసులో అస్ఘర్ సహా మరికొందరిని దోషులుగా నిర్థారిస్తూ సుప్రీం కోర్టు ఈ నెల మొదటి వారంలో తీర్పు ఇచ్చింది. దీంతో బయట ఉన్న వారు కోర్టులో లొంగిపోగా... గంజాయి కేసులో అరెస్టై నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్ అలీని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లనున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని పోటా ప్రత్యేక న్యాయస్థానం పీటీ వారెంట్ జారీ చేసింది. దీంతో త్వరలో అస్ఘర్‌ను త్వరలో గుజరాత్ తరలించడానికి అక్కడి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ, దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్ఘర్ అలీ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన అతను ప్యార్ సూఖాబాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బారి తదితరులతో ముఠా ఏర్పాటు చేశాడు. బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’ అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను, అదే ఏడాది ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్ అహ్మద్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకురాగా... అస్ఘర్, బారీ తదితరులు పథకం ప్రకారం 1996 డిసెంబర్ 19న ఎస్కేప్ చేయించారు. కాగా 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారీ సహా పది మంది నిందితులను సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పేలుడు పదార్థాలతో పట్టుకున్నారు. ఈ విచారణలోనే మీర్జా ఎస్కేప్‌లోనూ అస్ఘర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. హరేన్ పాండ్య హత్యలో కీలకం... గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్యను హత్య చేసేందుకు 2003లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్ ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చ్ 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్న హరేన్‌పాండ్యను కారులో వచ్చిన ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్ఘర్ ఐదు రౌండ్లు కాల్చడంతో ఆయన కన్నుమూశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్ఘర్ తదితరులను పట్టుకుంది. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు కాగా 15 మంది అరెస్టు అయ్యారు. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్ తదితరులను దోషులుగా తేల్చి అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్ హైకోర్టులో వీగిపోవడంతో వారు బయటపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ అమలు చేయాలని ఈ నెల మొదటి వారంలో ఆదేశించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన రెహాన్ పుథావాలా, పర్వేజ్ ఖాన్ పఠాన్, హాజీ ఫారూఖ్, కలీం కరీమి, అనాస్ మచ్చీస్ వాలా, పర్వేజ్ షేక్, మహ్మద్ రియాజ్ గోరు, యూనుస్ సర్వేష్ వాలా అహ్మదాబాద్‌లోని పోటా కోర్టులో లొంగిపోయారు. గత ఏడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ పడిన అస్ఘర్ అలీపై ఇటీవల బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే గంజాయికోసం ప్రయత్నించిన అతను దానిని కొనుగోలు చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నల్లగొండ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలోనే అతడిని గుజరాత్ తరలించడానికి అక్కడి పోలీసులు అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందారు. త్వరలో ఇక్కడికి రానున్న ప్రత్యేక బృందం అస్ఘర్‌ను తీసుకువెళ్ళనుంది. గరిష్టంగా పది రోజుల్లో ఈ తతంగం పూర్తి చేయడానికి గుజరాత్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా?
హైదరాబాద్ : కులాంతర వివాహాల కోసం తన జీవితాంతం పోరాటం చేస్తానని గత ఏడాది మిర్యాలగూడలో సంచలనాత్మక రీతిలో హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృత అన్నారు. ప్రస్తుతం పలువురు కులదురహంకార ధోరణితో వ్యక్తుల ప్రాణాలకుంటే కులానికే ప్రాధాన్యమివ్వడం దారుణమన్నారు. అందరి సహకారం వల్లనే తాను ఎంతో ధైర్యంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుశ్రుత, దేవార్ష్ల న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న ‘కులదురహంకార హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం–బాధితులకు న్యాయం కోసం జరగాల్సిన ఉద్యమం మన కర్తవ్యాలు’అనే అంశంపై ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమృ త మాట్లాడుతూ.. ప్రణయ్ హత్యలో భాగస్వాములైన 8 మందిలో ఒక్కరే జైలులో ఉన్నారని, మిగతా వారంతా బయట తిరుగుతున్నారని, అందరికీ శిక్ష పడేవరకు తాను రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. కులదురహంకార హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రేమ పేరుతో ఒక్కరు మోసం చేస్తే అందరూ అలా చేస్తారని భావించవద్దన్నారు. వ్యక్తుల ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమివ్వడం సరైంది కాదన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అనేక మంది బాధితులు తమకు డబ్బులు కాదు.. న్యాయం కావాలని కోరుకుంటున్నారన్నారు. సామాజిక వేత్త సాంబశివరావు మాట్లాడుతూ.. జనగామ జిల్లా గూడూరు మండ లానికి చెందిన సుశృత, ఆమె నాలుగేళ్ల కుమారుడు దేవార్ష్లను అతి కిరాతకంగా హత్య చేశారని, ఇలాంటి వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. కులనిర్మూలన సంఘం నేత గాంధీ మాట్లాడుతూ ఇప్పటివరకు 50 కులదురంహంకార హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాల ప్రోత్సాహానికి గాను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ... తన కొడుకుదే చివరి హత్య కావాలని కోరుకున్నానని కానీ ఇంకా అలాంటి హత్యలే కొనసాగడం బాధాకరమన్నారు. తన కోడలు అమృత చేస్తున్న పోరాటం అమోఘమైందని ఆమె తన కూతురైతే పాదాభివందనం చేసేవాడినన్నారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రణయ్ హత్యకేసు ; చార్జిషీటు దాఖలు
సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో మిర్యాలగూడ పోలీసులు జిల్లా కోర్టులో బుధవారం చార్జిషీటు దాఖలు చేశారు. మొత్తం 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1600 పేజీలతో చార్జిషీటు, 63 పేజీల్లో విచారణ నివేదిక కోర్టుకు సమర్పించారు. తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో ప్రణయ్‌ను అమృత తండ్రి తిరునగరు మారుతీరావు దారుణంగా హత్యచేయించిన సంగతి తెలిసిందే. (ప్రణయ్ హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదల) ఈ ఘటన గతేడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడ పట్టణంలో పట్టపగలే జరిగింది. ప్రణయ్ హత్యకేసులో అరెస్టయిన నిందితులు మారుతీరావు, అతని తమ్ముడు శ్రావణ్, మరొక నిందితుడు కరీంపై గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా... ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఈ ముగ్గురితోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా పోలీసులు చార్జిషీటులో చేర్చారు. హత్యజరిగిన 9 నెలల అనంతరం చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. -
మారుతీరావు సోదరుడి ఉంగరాలు మాయం
సాక్షి, నల్గొండ : ప్రణయ్ హత్య కేసు రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఇటీవలె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే శ్రవణ్‌కుమార్ నల్గొండ జైల్లో ఉన్నప్పుడు అతని చేతికి ఉన్న డైమండ్ ఉంగరాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. అవి ప్రస్తుతం మాయమవ్వడం కలకలం రేపుతోంది. డైమండ్ ఉంగరాలు మాయమయ్యాయని జైలు అధికారుల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జైలర్ జలంధర్ యాదవ్‌పై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉండొచ్చని బాధితులు తెలుపుతున్నారు. -
మారుతీరావు లెజండ్ ఎలా అవుతారు? : అమృత
మిర్యాలగూడ టౌన్ : పేరుమళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సాంబశివరావు డిమాండ్ చేశారు.బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని పేరుమళ్ల ప్రణయ్ కుటుంబ సభ్యులను పరమార్శించారు. అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పీడీ యాక్టు కేసులో బెయిల్‌పై విడుదల కావడం వలన బాధితులు అయిన అమృత వర్షిణి, బాలస్వామి, ప్రణయ్ కుమారుడు నిహాన్ ప్రణయ్‌లకు ప్రమాదం పొంచి ఉందన్నారు. మారుతిరావును ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బహిష్కరించాలన్నారు. ప్రత్యేక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి న్యాయ విచారణ ప్రారంభించాలన్నారు. నింధితులకు శిక్ష పడేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నిందితులు విడుదల కావడంతో నేర విచారణ, న్యాయ విచారణలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని, సాక్షాల బాధితులకు రక్షణ లేకుండా పోతుందన్నా రు. నిందితులు నేరం నుంచి తప్పించుకోకుండా పోలీసులు వెంటనే చార్జీషీట్‌ను వేయాలన్నారు. నిందితులకు కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఆలోచించాలని, నిందితులు కేవలం పీడీ యాక్టు కేసులో మాత్రమే బెయిల్‌పై వచ్చారని, హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఏ కేసు అయినా కూడా 90రోజుల్లో చార్జిషీట్‌ను పోలీసులు వేయాల్సి ఉంటుందన్నారు. అమృత విషయంలో సోషల్ మీడియాలో కొంత మంది ఆసభ్యకర పోస్టులు పెట్టుతున్నందున వారిపై చర్యలను తీసుకోవాలన్నారు. అమృత వర్షిణి మాట్లాడుతూ చాల మంది మారుతిరావు గురించి తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. కొంతమంది మారుతీరావు లెజండ్ తదితర పేర్లతో పోస్టులు చేస్తున్నారని, మారుతిరావు గత చరిత్ర తెలియకనే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ మా ప్రాణం ఉన్నంత వరకు నిందితులకు శిక్షపడేంత వరకు పోరాడుతామని అన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్తలు డాక్టర్ రాజు, శ్రీరాములు తదితరులున్నారు. -
ప్రణయ్ హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదల
వరంగల్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఆదివారం బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా నిందితుల బంధువులు ఆ ఉత్తర్వులను శనివారం రాత్రి తీసుకురావడంతో విడుదల ఆదివారానికి వాయిదా పడింది. ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు 8.20 గంటలకు మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలను విడుదల చేశారు. ఈ ముగ్గురిపై గత ఏడాది సెప్టెంబర్ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముగ్గురు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వీరు రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ మంజూరు చేయద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు కోర్టుకు విన్నవించడంతో బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత తిరిగి బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురూ ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ముగ్గురిని విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎన్.మురళీబాబు తెలిపారు. విడుదలైన వెంటనే నిందితులు రెండు వాహనాల్లో తమ బంధువులతో కలసి వెళ్లిపోయారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలి అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య డిమాండ్ చేసింది. తన కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని సమాఖ్య అధ్యక్షుడు ఆనందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ప్రణయ్ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి ఎలాంటిహాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన మారుతిరావు
సాక్షి, వరంగల్/ మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతిరావు ఆదివారం ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. ఆయనతోపాటు మరో ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలు కూడా విడుదలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఈ ముగ్గురికి హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతిరావు, ఆయన సోదరుడిని కుటుంబసభ్యులు వెంట తీసుకెళ్లారు. ప్రణయ్ హత్యకేసులో నిందితులైన వీరిపై గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్ కోసం రెండు నెలల క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు బెయిల్ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, పీడీ యాక్టు కేసులో బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురు ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖ లు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. చదవండి: మారుతీరావుతో మా కుటుంబానికి ముప్పు -
‘చనిపోయే వరకు అమృత ప్రణయ్లానే ఉంటాను’
మిర్యాలగూడ టౌన్: మారుతీరావుతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులు మారుతీరావు, శ్రవణ్‌కుమార్, కరీంలకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో శనివారం ఆమె నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మారుతీరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా బెయిల్ మంజూరు చేయడం సరికాదన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మారుతీరావు ఇళ్లు తనది కాదని.. తాను చనిపోయేవరకు ఈ ఫ్యామిలీతోనే ఉంటానని, అమృత ప్రణయ్‌గానే ఉంటానని పేర్కొన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ.. పీడీ యాక్టు కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితులు బయటకు రావడం వల్ల తమకు హాని ఉందని కోర్టుకు తెలియజేశామన్నారు. వారు బయటకు వస్తే అమృతను బలవంతంగా తీసుకెళ్తారని అనుమానం వ్యక్తం చేశారు. మారుతీరావు కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. రక్షణ కల్పిస్తాం: ఎస్పీ రంగనాథ్ నిందితుల బారి నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఎటువంటి ముప్పు కలగకుండా రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితులకు బెయిల్ లభించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. చదవండి: ప్రణయ్ కేసులో నిందితులకు బెయిల్ -
ప్రణయ్ కేసులో నిందితులకు బెయిల్
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలపై గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్ కోసం రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు బెయిల్ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. పీడీ యాక్టు కేసులో బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురు ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖ లు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులు వరంగల్ జైలుకు చేరిన తరువాత ఆ ముగ్గురు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
మీడియా, పోలీసుల వల్లే తాము ఈ రోజు బ్రతికున్నాం
-
వారి వల్లే ఇంకా బ్రతికున్నాం: ప్రణయ్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: మీడియా, పోలీసుల సహకారంతోనే తాము ఈ రోజు బ్రతికున్నామని ప్రణయ్ తండ్రి బాలస్వామి తెలిపారు. కొంతమంది వ్యక్తులు రకరకాలుగా తమ కుటుంబం వెంట పడుతున్నారని, అయినా అమృత తమ వెంటే ఉంటుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బాలస్వామి మాట్లాడుతూ.. తమను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో తెలియటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అమృత బాబుకి జన్మనిచ్చిందని తెలిపారు. బాబు ఆరోగ్యం కూడా చాలా బాగుందన్నారు. ప్రాణం పోయినా తాము పోరాడతామని, చిన్న కొడుకు కూడా ధైర్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. ‘న్యాయం వైపు వెళ్తున్నాం.. నాకు ఏమైనా.. నా కుటుంబానికి ఏం జరిగినా సరే మేము పోరాడుతా’ మని అన్నారు. కచ్చితంగా దోషులకి శిక్ష పడే వరకు తాము పోరాడతామని చెప్పారు. కులం కారణంగానే తమ కొడుకు చంపబడ్డాడన్నారు. మిర్యాలగూడలో కూడా ఇప్పటికి తమ గురించి వెతుకుతున్నారని తెలిపారు. -
‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’
మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట తమ పెళ్లి రోజును పురస్కరించుకుని అమృత తన ఫేస్బుక్లో ఒక ఫొటోతోపాటు సందేశాన్ని పోస్టు చేశారు. ‘నీకు (ప్రణయ్) మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మన వివాహమై నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజు నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. లవ్యూ లల్లు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను‘అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం అమృత మగబిడ్డకు జన్మినిచ్చినట్లు మరో పోస్టు పెట్టారు. -
అతడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు: అమృత
మిర్యాలగూడ అర్బన్ : సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన పెరుమాళ్ల ప్రణయ్ ఇంటికి వచ్చిన వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదైంది. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కార్తిక్ టెక్స్టైల్స్ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్ ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రణయ్ భార్య అమృత తల్లితో మాట్లాడినట్లు అతడిసెల్‌లో ఉంది. వారి ప్రోద్బలంతోనే వినోద్‌కుమార్ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం అమృత తమ అత్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ తరువాత పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సీఐ సదానాగరాజు తెలిపారు. -
ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు!
2018 సంవత్సరం.. తెలంగాణకు మాయని గాయాలను మిగిల్చింది. ప్రమాదాలు, పరువు హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొండగట్టు బస్సు ప్రమాదం కలవరపరిచింది. టపాసులు పేలి డజను మంది మృత్యువాత పడ్డారు. కులం కోసం ప్రేమించుకున్న వారిని, కన్న వారిని కూడా చూడకుండా కడతేర్చారు. చలికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కుంపటి జీవితాలను బుగ్గిపాలు చేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మారిన తీరును కొందరు అక్షరాల సత్యం చేశారు. నౌహీరా షేక్ డిపాజిట్ల కుంభకోణం వేల కుటుంబాలను ఆగం చేసింది. – సాక్షి, హైదరాబాద్ ప్రమాదపు చావులు.. దేశ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం కొండగట్టు బస్సు ప్రమాదంలో జరిగింది. సెప్టెంబర్ 12న జరిగిన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 62 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది మేలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 11 మందిని బలిగొంది. ప్రముఖ సినీ నటుడు, నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెరువుగట్టు వద్ద కారు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. అర్థంలేని పరువు హత్యలు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వాల్సింది. కానీ అర్థం లేని ఆవేశాలకు పోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతుర్ల జీవితాలనే కాలారాశారు. మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాలలో కూడా చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురినే తల్లిదండ్రులు, సోదరుడు కలసి గొంతు నులిమి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో కూతురు, అల్లుడిపై ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు ఓ తండ్రి. అదృష్టవశాత్తు వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. హవాలా హవా.. పైకి పార్శిళ్లలాగే ఉన్నా వాటిలో మాత్రం హవాలా డబ్బు సరఫరా అవుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి హవాలా డబ్బును ఆంధ్రా పార్శిళ్ల సంస్థ రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రూ.66 లక్షల హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఏకంగా రైళ్లలోనే హవాలా డబ్బు రవాణా జరగడం ఈ ఏడాది చర్చనీయాంశమైంది. వెయ్యి కోట్లు మింగేసింది.. హీరా గోల్డ్ పేరుతో 8 రాష్ట్రాల్లో డిపాజిట్లు వసూలు చేసినా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.వెయ్యి కోట్లకు పైగా పలు రకాల స్కీముల పేరుతో డిపాజిట్ల రూపంలో సేకరించింది ఆ సంస్థ యజమాని నౌహీరా షేక్. రాజకీయ వేడి.. ఏడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా డబ్బు ఏరులై పారింది. రూ.125 కోట్లకు పైగా నగదును పోలీస్ శాఖ స్వాధీనం చేసుకోగా, అందులో హవాలా డబ్బే దాదాపు 40 కోట్లకు పైగా ఉంది. వరంగల్ పెంబర్తిలో పట్టుబడ్డ కేసులో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేత మద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడటం కలవరం రేపాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, విచారణ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రోజు రేవంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్ పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు మాయని మచ్చగా మిగిలింది. ఈ అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సంచలన తీర్పులు.. 2007లో జరిగిన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఈ ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా, మరొకరికి జీవిత ఖైదు విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు జీవితఖైదు విధిస్తూ సీఐడీ కోర్టు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. నర్సింగ్ విద్యార్థులకు వేధింపులు.. నర్సింగ్ కాలేజీలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీలోని 11 మంది నర్సింగ్ విద్యార్థినులు దీనిపై నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు దుండగులు. ప్రాణాలు బలితీసుకున్న కుంపటి.. చలి వేస్తుండటంతో వెచ్చదనం కోసం ఇంటిలో పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఆరుగురి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పొగకు ఊపిరాడక మృతిచెందగా, ఆ మరుసటిరోజే శామీర్‌పేట బొమ్మరాసిపేట గ్రామంలో కోళ్లఫారంలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఇదే రీతిలో మరణించడం సంచలనం రేపింది. కాల్చేసిన బాణసంచా.. రోజువారీ కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివారులో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగా, హైదరాబాద్‌లోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బాసిత్‌తో పాటు నలుగురిని ఐసిస్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు!
సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఇంటి ఆవరణలోకి ఆదివారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు గోడ దూకి ప్రవేశించాడు. సీసీ కెమెరా ఫుటేజీలో ఆగంతకుడు గోడ దూకి వచ్చినట్టు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో అతను సుమారు 8 నిమిషాలు అటూ ఇటూ తచ్చాడినట్టు గుర్తించారు. ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించిన ఆగంతకుడు , ఓ గదికి ఉన్న కిటికీ తలుపును తెరిచి చూశాడని, అనంతరం తిరిగి గోడ దూకి చర్చిరోడ్డు వైపు వెళ్ళినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో ఉందని ప్రణయ్ తండ్రి బాలస్వామి తెలిపారు. అలికిడి విని లేచిన పోలీసులు ఆగంతకుడు వచ్చిన సమయంలో ప్రణయ్ కుటుంబ సభ్యులకు రక్షణగా ఉన్న పోలీసులు పైన గదిలో ఉన్నారు. తిరిగి వెళ్లే సమయంలో గోడ దూకిన అలికిడి విన్న పోలీసులు వెంటనే కిందకు వచ్చి బాలస్వామిని లేపారు. అనుమానం వచ్చిన బాలస్వామి వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఆగంతకుడు గోడ దూకి ఇంటి ఆవరణలో తిరిగిన దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని వన్‌టౌన్ స్టేషన్‌కు చేరవేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపడతామని ప్రణయ్ కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసులు లేకుంటే? ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడి నడుముకు నల్లని బెల్ట్ మాదిరిగా ఉందని, ఆ బెల్ట్‌కు ఏముందో అని.. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ఎస్పీ ముందు జాగ్రత్తగా ఇద్దరు సాయుధ పోలీసులతో ప్రణయ్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత ఉందని తెలిసినా ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడంటే పక్కా ప్రణాళికతోనే వచ్చాడా..? అనే అనుమానం కలుగుతోందని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడిని గుర్తిస్తే కాని అనుమానాలు నివృత్తి కావని అంటున్నారు. -
ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ టౌన్ మెయిన్ రోడ్డులో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అనుమతినివ్వలేదని ఆ జిల్లా పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అంతేకాక సంబంధిత అధికారుల నుంచి అనుమతి లేకుండా ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రణయ్ తండ్రికి స్పష్టం చేశామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రణయ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. -
వారికి బెయిలిస్తే నాకు రక్షణుండదు: అమృత
సాక్షి, మిర్యాలగూడ అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులకు నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ప్రణయ్ హత్య అనంతరం పోలీసులు నమో దు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 అబ్దుల్‌బారీ, ఏ5 కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్, ఏ7 శివ బెయిల్ కోసం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. వారికి బెయిల్ తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రణయ్ భా ర్య అమృతవర్శిణి, ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టుకు హాజరయ్యారు. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని ఎస్సీ, ఎస్టీ పబ్లిక్ ప్రాసిక్యుటర్ మోకిని సత్యనారాయణగౌడ్ వాదించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బెయిల్ ఇవ్వొద్దని న్యాయమూర్తిని వేడుకున్న అమృత నల్లగొండ లీగల్ : అమృత వర్షిణి న్యాయమూర్తి హుస్సైబ్ హైమద్ ఖాన్ ఎదుట హాజరై ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బెయిల్ ఇస్తే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తమకు రక్షణ ఉండదని ఆమె ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపింది. -
పరువు హత్యల నేపథ్యంలో...
రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కోటేంద్ర దుద్యాలను దర్శకునిగా పరిచయం చేస్తూ, కె.ఎం.డి.షఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. పరువు హత్యల నేపథ్యంలో ఉంటుంది. ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి. తాజాగా జరిగిన పరువు హత్య ప్రణయ్ విషయంలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన పద్ధతిలో ముగింపు ఎలా ఉండాలో మావంతు ప్రయత్నంగా ఈ సినిమాలో చూపించాం. మంచి ప్రేమ కథ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ మరువలేనిది’’ అన్నారు. -
‘ప్రణయ్ ఆత్మ మాతో మాట్లాడుతోంది.. మీతో మాట్లాడిస్తాం’
మిర్యాలగూడ అర్బన్ : ఇటీవల మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఆత్మ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెళ్లడించారు. హైదరాబాద్ పటాన్‌చెర్వుకు చెందిన నాగారావు, సత్యప్రియ, నర్సిం హ్మ అనే ముగ్గురు వ్యక్తుల ఆదివారం ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్ నివాసాసికి వ చ్చారు. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుం దని, మీతో కూడా మాట్లాడిస్తామని నమ్మబలి కారు. అనుమానం వచ్చిన ప్రణయ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి వారిపై పిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలి పారు. ఆత్మ ఉందనే పేరుతో ప్రణయ్ కుటుంబ సభ్యులను మోసం చేయడానికి వారు వచ్చారని సీఐ పేర్కొన్నారు. బెదిరింపు కేసులో కోర్టులో నిందితుల హాజరు మిర్యాలగూడ టౌన్ : బెదిరింపుల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం మిర్యాలగూడ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. శోభారాణి ఎదుట హాజరుపరిచారు. వివరాలు.. ప్రణయ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న తిరునగరు మారుతీరావు, శ్రవణ్, ఖరీంలు కొంతకాలం క్రితం ప్రణయ్, అమృత వివాహ రిసెప్షన్‌ను నిలిపివేయాలని పట్టణానికి చెందిన దినేశ్, అశోక్‌ను బెదిరించారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పీటీవారెంట్‌పై కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్న ట్టు తెలుసుకున్న మారుతీరావు అనుచరగణం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. భారీ బందోబస్తుతో పోలీసులు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు. -
‘ప్రణయ్’ నిందితులపై పీడీ యాక్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్ మోపాలని పోలీస్‌శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌తో వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ప్రణయ్ భార్య అమృతకు సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులపై స్టీఫెన్ రవీంద్ర ఆరా తీశారు. అమృతను బెదిరిస్తున్న వారి సోషల్‌మీడియా ఖాతా వివరాలు తెలుసుకోవటంతో పాటు హంతకులతో వారికేమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యా ప్తు చేపట్టాలని ఐజీ ఆదేశించినట్లు తెలిసింది. బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో ఆమెకు భద్రతగా ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్ని కూడా నియమించినట్లు నల్లగొండ పోలీసులు తెలిపారు. ఆమెకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారలపై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
ప్రణయ్ మా కళ్లలోనే ఉన్నాడు..
మిర్యాలగూడ అర్బన్ : ఇటీవల నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ తమకు కలలోకి వస్తున్నాడని, ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే ఉందని ఆదివారం ప్రణయ్ ఇంటికి వచ్చిన హైదరాబాద్ దంపతులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ పటాన్‌చెర్వుకు చెందిన నాగారా వు, సత్యప్రియ దంపతులు ఆదివారం తమ పిల్లలతో కలిసి మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్ నివాసానికి వచ్చారు. తాము కూడా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారమే అని, ప్రణయ్ ఆత్మ తమకు కలలోకి వస్తున్నాడని చెప్పి ప్రార్ధన చేశారు. అనంతరం ముందుగా ప్రణయ్ తల్లి, తండ్రులతో ప్రణయ్, మారుతీరావులు గత జన్మలో శత్రువులనీ, గత జన్మలో కోపాన్ని ఈ జన్మలో మారుతీరావు తీర్చుకున్నాడని వారితో చెప్పారు. అంతే కాకుండా ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందని, ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని, మీతో కూడా మాట్లాడిస్తామని వారితో చెప్పడంతో అనుమానం వచ్చిన ప్రణయ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రణయ్ భార్య అమృతతో ఒంటరిగా మాట్లాడాలని వారు చెప్పడంతో అందుకు ఒప్పుకోలేదు. ప్రణయ్ గురించిన కొన్ని విషయాలు అమృతకు చెప్పాలని అనడంతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు. అనంతరం ఆ దంపతులు ప్రణయ్ భార్య అమృతతో మాట్లాడుతూ ప్రణయ్ ఆత్మ నీ కోసం ఏడుస్తుందని, నీ కోసం ప్రణయ్ ఎదురుచూస్తున్నాడని చెప్పారు. ఈలోగా ప్రణయ్ ఇంటికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అన్ని కోణాల్లో విచారణ.. దంపతుల వివరాలను సేకరించే పనిలో పోలీసులున్నారు. ఆ ఇద్దరు దంపతులలో నాగరావు అనే వ్యక్తి కారుడ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, ఎవరైనా పంపించారా..? అనే కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. -
21న ప్రణయ్ సంస్మరణ సభ
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : పేరుమళ్ల ప్రణయ్ హత్య కేసు నిందితులపై రాజద్రోహం(120బీ)తో పాటు ఉపా కేసు నమోదు చే సి కఠినంగా శిక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడలోని ప్రణయ్ నివాసంలో ‘ప్రణయ్ అమృత న్యాయపోరాట సంఘీభావ కమిటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మిర్యాలగూడలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు, తుది తీర్పు వెలువడేంత వరకు కూడా నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దన్నారు. ప్రణయ్ హత్య కేసులో ఏ–6గా ఉన్న తిరునగరు శ్రవణ్‌కుమార్‌ను ఏ–2గా మార్చాలని డిమాండ్‌చేశా రు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలని, ప్రణయ్ కుటుంబానికి, అమృతప్రణయ్కి పోలీసులు పూర్తిస్థాయిలో రక్షణకల్పించాలన్నారు. ప్రణయ్ హత్యను ప్రపంచ మొత్తం ఖండించా యని, కానీ కొంతమంది మారుతీరా వుకు మద్దతు పలుకుతున్నారని తెలి పారు. అదేవిధంగా చాలా మంది అమృతతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. మిర్యాలగూడలో ఈనెల 14న ప్రణయ్ అమృత న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ప్రణయ్ సంస్మరణ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈనెల 21న భారీ ఎత్తున సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమావేశం ప్రకటించింది. ఈ సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముత్తిరెడ్డికుంటలోని ప్రణయ్ నివాసం నుంచి భారీ ర్యాలీని నిర్వహించనున్నట్టు చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు తాళ్లపల్లి రవి, దైద సత్యం, పేరుమళ్ల జోజి, నా గార్జునరావు, డాక్టర్ రాజు, ఉదయ. సీహెచ్. సుధాకర్, వేనేపల్లి పాండురంగా రావు, భిక్షమయ్య, గణేశ్, కస్తూరి ప్రభాకర్, ఏడుకొండలు, కిరణ్మయి, పద్మ, మల్లయ్య, పరశురాములు, శ్రీరాములు, నాగయ్య, వెంకట్, నాగయ్య, విజయ్ తదితరులు ఉన్నారు. చదవండి: ప్రణయ్ చట్టం కోసం పోరాడుతాం అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు అమృతను చట్టసభలకు పంపాలి -
‘ప్రణయ్’ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మిర్యాలగూడ టౌన్ : ప్రణయ్ హత్య కేసును హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెల్తుల మల్లయ్య, యామల సుదర్శనం డిమాండ్ చేశారు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్ నివాసం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ‘కులాంతర ప్రేమ వివా హాలు–కులదురహంకార హత్యలు–నివారణ పరి ష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా నేటికీ అంటరానితనం పోలేదని, ఎక్కడో ఒక చోట ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాటిని నియంత్రించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కులాంతర, మతాంతర వివాహాలను చేసుకున్న వారికి రక్షణగా ప్రత్యేక చట్టాలను తీసుకురా వాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కాస్ట్‌కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా దుర్మార్గంగా హత్య చేయించారని అన్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి) ప్రణయ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిం చేం దుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నా రు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, మారుతీరావు ప్రణయ్ హత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడాడో మారుతీరావు ఫోన్ కాల్ డేటా ప్రకారం దర్యాప్తు చేపట్టాలని చె ప్పారు. అందుకు సంబంధించిన వారిపై కూడా కేసులను నమోదు చేయాలని, హత్యతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరంజ్యోతిరావు, శివరాజు, అశోక్, కాంతయ్య, పేరుమళ్ల నర్సింహారా వు, జిల్లా అధ్యక్షులు కామర్ల జానయ్య, నగేష్, సోమరాజు, వెంకటరత్నం, స్వామి, కోటయ్య, దేవయ్య, ఏడుకొండలు, రవి, జోజి, విజయ్‌కుమార్, మట్టయ్య, రాజు, మల్లయ్య, బాలస్వామి, నాగయ్య, బెంజమన్, రాజరత్నం ఉన్నారు. (అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు) చదవండి: ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! ‘ప్రణయ్’ నిందితులను ఉరితీయాలి మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ -
ప్రణయ్ చట్టం కోసం పోరాడుతాం
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : ప్రణయ్ చట్టాన్ని తీసుకువచ్చేంత వరకూ పోరాడుతామని మాజీ ఎంపీ, విముక్తి చిరుతల కక్షి జాతీయ అధ్యక్షుడు తిరుమావలవన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలో గల ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ప్రణయ్ కుటుం బానికి 50వేల రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా ప్రణయ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమించి పెళ్లి చే సుకున్నందుకు హత్య చేయడం సరైంది కాదన్నారు. ప్రణయ్ కుటుం బా నికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆ యన వెంట కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు, మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి రవి, హరిజనవాడల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, మేడి కొండ విజయ్ తదితరులున్నారు. (అమృతను చట్టసభలకు పంపాలి) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అమృత మిర్యాలగూడ అర్బన్ : హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిని బుధవారం రాత్రి ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ సదానాగరాజును కలిశారు. ప్రణయ్ పోస్టుమార్టం రిపోర్టును ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు ఫేస్బుక్, వాట్సాప్‌లలో అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యుల గురించి వస్తున్న అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఫిర్యాదు చేస్తే ఫేస్బుక్, వాట్సాప్‌లలో అలాంటి పోస్టులు పెట్టేవారిని గుర్తిస్తామని సీఐ చెప్పడంతో త్వరలోనే ఫిర్యాదు అందచేస్తామని తెలిపినట్లు సమాచారం. ప్రణయ్‌కు సంబంధించిన డెత్ సర్టిఫికట్ కోసమే పోస్టుమార్టం రిపోర్టు కావాలని కోరినట్లు సీఐ తెలిపారు. (మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ) చదవండి: అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! -
ఆ ఇద్దరు నిందితులు ఎక్కడ?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరిని మాత్రం వదిలేశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో నివృత్తి కావాల్సిన మరికొన్ని అంశాలు ఇంకా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ఇద్దరు ఎవరు?: ప్రణయ్ హత్యకు జరిగిన ప్రణాళిక క్రమాన్ని పోలీసులు పూర్తి వివరాలతో బయట పెట్టారు.పక్కా ప్రణాళికతో ప్రణయ్, అమృతల కదలికలపై కన్నేసిన నిందితులు బ్యూటీ పార్లర్‌కు వచ్చిన అమృతను కిడ్నాప్ చేసి తీసుకుపోవాలని ప్లాన్ చేసుకున్నారని, ఆమె వెంట ప్రణయ్ వస్తాడు కాబట్టి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారని నిందితులు విచారణలో చెప్పిన విషయాలను మీడియాకు వివరించారు. అయితే బ్యూటీ పార్లర్‌కు ప్రణయ్‌తోపాటు ఆతని సోదరుడు కూడా రావడం, ఇద్దరిలో ప్రణయ్ ఎవరో తేల్చుకోలేక వెనక్కి తగ్గారని, అలా ఆ రోజు ఆపరేషన్ విఫలమైందని పోలీసులు ప్రకటించారు. అసలు బ్యూటీ పార్లర్ దగ్గర అమృతను కిడ్నాప్ చేసే పనిని మాత్రమే తనకు అప్ప జెప్పారని, హత్య కోసం వేరే ఇద్దరు యువకులను తీసుకువచ్చారని ప్రధాన నిందితుడు (ఏ–2) సుభాష్ శర్మ పోలీసుల విచారణలో బయట పెట్టాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌నుంచి తీసుకువచ్చిన ఆ యువకులు మద్యం సేవించడంతో, వారు అనుకున్న రీతిలో పనిచేయలేరని వారిని అస్గర్ అలీ ఈ పనినుంచి తప్పించాడని పోలీసులే ప్రకటించారు. అరెస్టు చేసిన నిందితుల్లో వారు లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు, బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, అస్గర్ అలీ, మహ్మద్ అబ్దుల్ బారీ, ఎండీ కరీం, తిరునగరు శ్రవణ్, సముద్రాల శివను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆ ఇద్దరు నిందితుల అరెస్టు చూపించలేదా? లేక అసలు నిందితులను పోలీసులు పట్టుకోలేక పోయారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు అస్గర్ ప్రయత్నాలు ఈ హత్యకు కొద్ది రోజుల ముందే మాజీ ఉగ్రవాది అస్గర్ అలీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఇందుకోసం పాస్‌పోర్టు తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అది బెడిసి కొట్టిందని తెలుస్తోంది. సాధారణ జీవితం గడుపుతున్నట్లు నమ్మించిన అస్గర్ అలీ తనకు పరిచయం ఉన్న నాయకుల ద్వారా పాస్‌పోర్టుకోసం ప్రయత్నించాడని, కానీ, ఎస్పీ ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాలకు చెక్ పడిందని అంటున్నారు. నిఘా ఏదీ?: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో లింకులు.., కలసి పనిచేసిన అనుభవం ఉన్న మాజీ ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా పోలీసు అధికారికి కళ్లు..చెవులుగా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులు ఇవేవీ పట్టించుకోకపోవడం, కనీసం వారి కదలికలు, ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టకపోవడంతో వారు యథేచ్ఛగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
మారుతీరావుకు మద్దతుగా శాంతి ర్యాలీ
సాక్షి, నల్లగొండ : మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావుకు మద్దతుగా తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించారు. స్థానిక వాసవీభవన్ నుంచి జిల్లా జైల్ వరకు ర్యాలీ నిర్వహించారు. జైల్లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్ కోరగా అందుకు పోలీస్ అధికారులు నిరాకరించారు. జైల్లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను ములాఖాత్ పై కలిసారు. ఆ తర్వాత కలెక్టర్, ఎస్పీలను కలిసి వేర్వేరుగా వినతిపత్రాలను అందజేసారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రణయ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విగ్రహం ఏర్పాటు వల్ల భావిసమాజానికి చెడుసంకేతాలు వెళతాయన్నరు.ఎస్సీ అట్రాసిటీ కేసు చెల్లదని మేజర్ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో యామ మురళి,రాజు, జనార్దన్, సురేందర్, భిక్షపతి, ఈశ్వర్, శ్ర్రీను, కోటగిరి దైవాదీనం, శేఖర్ పాల్గొన్నారు. ప్రణయ్ విగ్రహం పెట్టొద్దని ధర్నా మిర్యాలగూడ : పట్టణ నడిబొడ్డున ఇటీవల హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ విగ్రహం పెట్టొద్దని వ్యాపారులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కానీ పట్టణ నడిబొడ్డున ప్రణయ్ విగ్రహం పెడితే భవిష్యత్‌లో యువత అదేబాటలో నడుస్తారని భయపడుతున్నామని ఆందోళనవ్యక్తం చేశారు. అతను చేసిన త్యాగాలు ఉంటే విగ్రహం ప్రతిష్ఠించాలని, ఇలాంటి వారికి నడిరోడ్డుపై విగ్రహాలు పెడితే మహానుభావులకు చిన్నచూపుగా ఉంటుందన్నారు. అనంతరం ప్రణయ్ విగ్రహ ప్రతిష్ఠను ఆపాలని ఆర్డీఓ జగన్నాధరావుకు వినతిపత్రం అందేశారు. కార్యక్రమంలో సమీఖాద్రి, సత్యనారాయణ, శ్రీనివాస్, యాదగిరి, రాములు, నాగేందర్, కిష్టయ్య, వెంకటేశ్వర్లు, ఫయాజ్, సైదయ్య ఉన్నారు. ప్రణయ్ కుటుంబానికి పరిహారం వర్తించదు నల్లగొండ టూటౌన్ : మిర్యాలగూడలో ఇటీవల హత్యకు గురైన ప్రణయ్‌కు షెడ్యూల్ క్యాస్ట్‌కు వర్తించే వాటిని ఇవ్వవద్దని కోరుతూ తెలంగాణ మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్ సోమవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రణయ్ ఎస్సీ కాదని, అతని కుటుంబం క్రిష్టియన్ అని తెలిపారు. ప్రణయ్ అంత్యక్రియలు క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహిం చారని కలెక్టర్‌కు వివరించారు. ప్రణయ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు తదితర వాటిని ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఇచ్చే పరి హారం అతని కుటుంబానికి వర్తించదని పేర్కొన్నారు. చదవండి: అమృతను చట్టసభలకు పంపాలి అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి! -
ఆ ఇద్దరు నిందితులు ఎవరు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఇంకా కొన్ని శేష ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ సంఘటనపై ఇంకా నివృత్తి చేసుకోవాల్సిన అనుమానాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అసలు పోలీసుల విచారణ సక్రమంగానే సాగిందా? ఈ కేసులో వదిలేసిన అంశాల సంగతేమిటన్న దానిపై చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ఎక్కడ? ప్రణయ్ హత్యకు జరిగిన ప్రణాళికను పోలీసులు వివరంగా బయట పెట్టారు. ఇంతకు ముందే ఒకటికి రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగినా, అది సఫలం కాలేదని చెప్పుకొచ్చారు. పక్కా ప్రణాళికతో ప్రణయ్, అమృతల కదలికలపై కన్నేసిన నిందితులు బ్యూటీ పార్లర్‌కు వచ్చిన అమృతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని పథకం వేసుకున్నారని, ఆమె వెంట ప్రణయ్ వస్తాడు కాబట్టి అతనిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు చెప్పిన విషయం విదితమే. బ్యూటీ పార్లర్‌కు అమృత వెంట ప్రణయ్‌తోపాటు ఆతని సోదరుడు కూడా రావడం.., ఇద్దరిలో ప్రణయ్ ఎవరో తేల్చుకోలేక నిందితులు వెనక్కి తగ్గారని, అలా ఆ రోజు ఆపరేషన్ విఫలమైందని పోలీసులు ప్రకటించారు. అయితే, అసలు బ్యూటీ పార్లర్ దగ్గర అమృతను కిడ్నాప్ చేసే పనిని మాత్రమే తనకు అప్ప జెప్పారని, హత్య కోసం వేరే ఇద్దరు యువకులను తీసుకువచ్చారని పోలీసుల విచారణలో హత్యకు పాల్పడిన బిహారీ కిల్లర్ సుభాష్ శర్మ బయట పెట్టాడని చెబుతున్నారు. హైదరాబాద్‌నుంచి తీసుకువచ్చిన ఆ యువకులు మద్యం సేవించడంతో, వారు అనుకున్న రీతిలో పనిచేయలేరని వారిని అస్గర్ అలీ ఈ పనినుంచి తప్పించాడని పోలీసులే ప్రకటించారు. మరి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఆ యువకులు ఏమయ్యారు? వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు, బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, అస్గర్ అలీ, మహ్మద్ అబ్దుల్ బారీ, ఎండీ కరీం, తిరునగరు శ్రవణ్, సముద్రాల శివ .. ఇలా ఏడుగురిని అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం విచారణ జరిపేందుకు నిందితులను పోలీసు కస్టడీకి కోరారు. అయితే హైదరాబాద్ నుంచి ఈ ఆపరేషన్ కోసం తీసుకువచ్చిన యువకుల సంగతి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ప్రజల ప్రాణాలు పోతున్నా కేసీఆర్ తీరు మారదా’
సాక్షి, నల్గొండ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్ స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుంటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ఫామ్‌హౌక్‌కే పరిమితమయ్యే కేసీఆర్.. సచివాలయానికి రాకున్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్పు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాకపోవడం విస్మయం కలిగిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు. చదవండి : మిర్యాలగూడలో పరువు హత్య చదవండి : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 60 మంది దుర్మరణం -
ప్రణయ్ హత్యపై రాంగోపాల్‌వర్మ కామెంట్
సాక్షి, హైదరాబాద్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రణయ్ హత్య పై ట్విటర్లో స్పందించారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావు ముమ్మాటికీ హంతకుడేనని అన్నారు. ఏ మాత్రం ధైర్యంలేని పిరికిపంద అని పేర్కొన్నారు. పరువు కోసం ప్రణయ్‌ని చంపానని చెప్పుకుంటున్న మారుతీరావు ఏం సాధించాడని ప్రశ్నించారు. ‘ఒకవేళ పరువు కోసమే ప్రణయ్ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును చేజేతులా బజారుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చనిపోయేందుకు సిద్ధంగా ఉండాల’ని అన్నారు. నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం ఇతరుల ప్రాణాలు తీసేందుకు వెనకాడని వారిని చంపడమేనని చెప్పుకొచ్చారు. కాగా, తక్కువ కులానికి చెందిన వ్యక్తి తన కూతురుని వివాహం చేసుకున్నాడనే కారణంగా గతవారం యువతి తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా వర్మ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. Amrutha’s father Maruti Rao is just a plain cowardly dirty criminal and getting Pranay killed is nothing to do with his honour ..if it’s a honour killing he should be ready to die .. Real honour killing will be to kill all those who will kill for honour — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2018 -
అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు
సాక్షి, మిర్యాలగూడ : ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతవర్షిణిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అమృతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. అమృత భద్రత కోసం పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అమృతకు ప్రభుత్వం తరఫున రూ. ఎనిమిది లక్షల 25 వేలు సాయం అందిస్తామని వెల్లడించారు. అలాగే సాగుకు అనువైన వ్యవసాయ భూమిని, డబుల్ బెడ్ రూం ఇల్లుని ఇస్తామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రణయ్ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇది కులాంతర వివాహం కావడం, ప్రణయ్ దళితుడు కావడంతో అమృత తండ్రి మారుతీరావు అంత్యంత కిరాతకంగా ప్రణయ్‌ను పట్టపగలు నడిరోడ్డుమీద చంపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన అనంతరం ప్రేమవివాహం చేసుకున్న జంటలపై జరుగుతున్న దారుణాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మిర్యాలగూడలో ప్రణయ్ కుటుంబాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీరెడ్డి పరామర్శించారు. ప్రణయ్ కుటుంబానికి, అమృతకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. -
‘ప్రణయ్’ నిందితులను ఉరితీయాలి
మిర్యాలగూడ : పరువు కోసం పెరుమాళ్ల ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులను ఉరితీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. ప్రణయ్ హత్యను సీబీఐచే విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. మారుతీరావు అక్రమంగా సంపాదించిన సొమ్ముతను ప్రభుత్వం జప్తు చేయాలన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుండా మల్లేష్, పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 19 మంది దళితులు హత్యలకు గురయ్యారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షడు రమణ విమర్శించారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రణయ్, అమృతలు ప్రేమిం చుకున్న పాపానికి ప్రణయ్‌ని హత్య చేశారని అన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వం అమృతకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు కోటి రూపాయల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. రోమ్ నగరం కాలిపోతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండీ. యూసుఫ్, రాష్ట్ర కార్యనిర్వహాక కా ర్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీని వాస్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పెద్దిరెడ్డి రాజా, బీఎన్‌రెడ్డి, అంజయ్య, కాసుల సత్యం, పతూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పెరుమాళ్ల ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అదేవిధంగా ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని రాత్రి కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్‌ని హత్య చేయడం దారుణమైన సంఘటన అని అన్నారు. హంతకులను సమాజం క్షమించదన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు పురుషోత్తం, గాదె ఇన్నయ్య, రతన్‌రావు, పరుశురామ్, జిల్లా కన్వీనర్ గవ్వా విద్యాధర్‌రెడ్డి, నాయకులు శ్రీధర్, క్రాంతికుమార్, లింగస్వామి, అంజయ్య, పరందాములు, ప్రేమ్‌కుమార్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు. కులహంకార హత్య : ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ప్రణయ్‌ను కులహంకారంతో హత్య చేశారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. బుధవారం ప్రణయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ప్రణయ్ భార్య అమృత, తల్లితదండ్రులను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రేమించినందుకు కిరాయి హంతకులతో హత్య చేయిం చడం దారుణమన్నారు. అమృతకు అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆ యన వెంట మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, మాలమహానాడు జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, నాయకులు అన్నవరపు కిషోర్, డాక్టర్ ప్రవీణ్, నర్సింహ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అమృతకు అండగా నిలుస్తాం : సినీ దర్శకుడు పీసీ ఆదిత్య అమృతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని సినీ దర్శకుడు పీసీ ఆదిత్య డిమాండ్ చేశారు. బుధవారం ప్రణయ్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ భార్య అమృతను తల్లిదండ్రులను పరామర్శించారు. దేశంలోనే సంచలనం కలిగించి ఈ హత్యలో నిందితులు తప్పించుకోవడానికి వీలులేదన్నారు. ఆయన వెంట లఘుచిత్ర దర్శకులు కలీం తదితరులు ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కావొద్దు : జనసేన రాష్ట్ర నాయకుడు జగడం సుధాకర్ పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జగడం సుధాకర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్య హేయమైన చర్యఅని, నిందితులందరికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జనసేన పార్టీ నాయకులు రుషికేశ్వర్‌రాజు, ప్రవీణ్, నిమ్మల వెంకన్న, వేణు, శివ, శ్రీనివాస్‌నాయుడు, శ్రీనునాయక్, అశోక్ తదితరులు ఉన్నారు. -
ప్రణయ్ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
నల్లగొండ క్రైం: ప్రణయ్ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌లు ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని కలిశారు. కలెక్టర్, ఎస్పీలు వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. అమృత–ప్రణయ్‌ల మధ్య పరిచయం, చదువు మధ్యలో ఆపివేసిన పరిస్థితులు, వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల అభ్యంతరం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అమృతకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రూ.4లక్షలు అందజేశామని, ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేసులో ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలో చెప్పండని వారు అమృత, కుటుంబ సభ్యులను కోరగా నిందితులకు బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశం తర్వాత వారు మీడియాకు వివరాలు తెలిపారు. అంతకుముందు హత్య ఘటన, కేసు విచారణ, నిందితుల వివరాలు, చట్టం ప్రకారం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ.. వారికి వివరించినట్లు తెలిసింది. ప్రణయ్ ట్రస్టు ఏర్పాటు చేస్తా మారుతీరావు ఆస్తులన్నీ ట్రస్టుకు అప్పగించాలి: అమృత డిమాండ్ మిర్యాలగూడ: ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న పెరుమాళ్ల ప్రణయ్ పేరున ట్రస్టు ఏర్పాటు చేస్తానని అతని భార్య అమృత వర్షిణి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’తో ఆమె మాట్లాడుతూ... తన తండ్రి మారుతీరావు ఇంట్లో ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ట్రస్టుకు కార్యాలయంగా చేయాలని, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ట్రస్టుకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మారుతీరావు ద్వారా నష్టపోయిన బాధితులందరికీ ప్రణయ్ ట్రస్టు ద్వారా న్యాయం చేస్తానన్నారు. బెయిల్ ఇవ్వకుండా ఉరితీయాలి ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉరి తీయాలని ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి డిమాండ్ చేశారు. శ్రవణ్ బయటకు వస్తే తమను కూడా చంపుతాడని, నిందితులు బెయిల్‌పై వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు. -
కోర్టుకు ప్రణయ్ హత్య కేసు నిందితులు
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులను బుధవారం పోలీసులు మిర్యాలగూడలోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో తిరునగరు మారుతీరావు, సుభాష్‌శర్మ, అస్గర్‌అలీ, మహ్మద్ బారీ, ఎంఏ కరీం, తిరునగరు శ్రవణ్‌కుమార్, శివలపై హత్యా నేరం, కుట్ర వంటి కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు నిందితులను నల్లగొండ నుంచి మినీ బస్సులో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కోర్టుకు తీసుకువచ్చారు. ముందుగా నిందితులకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4.12 గంటలకు డీఎస్పీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ శోభారాణి కేసును పరిశీలించి నిందితులను అక్టోబర్ 3వ తేదీ వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. కాగా, ప్రణయ్‌ని హత్య చేసిన ఏ–2 నిందితుడు, బిహార్‌కు చెందిన సుభాష్‌శర్మను కోర్టులో హాజరు పరచలేదు. ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ ఫేస్బుక్ పేజీకి ఆదరణ ప్రణయ్‌కి న్యాయం జరగాలని ఆయన భార్య అమృత వర్షిణి ఫేస్బుక్లో పేజీ ఏర్పాటు చేశారు. ప్రణయ్ హత్యను ఖండిస్తూ, అమృతకు మద్దతుగా ఇప్పటివరకు 32,752 మంది పేజీని లైక్ చేశారు. -
వాళ్లే వీళ్లు
పేరుమోసిన ఉగ్రవాదులు అస్గర్ అలీ, అబ్దుల్ బారీలు నగరం కేంద్రంగా పలు నేర పూరిత చర్యలకు పాల్పడ్డారు. గతంలో వీరు గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యాను హత్య చేశారు. తాజాగా... రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యలోనూ పాలుపంచుకున్నారు. వీరు సుపారీ తీసుకుని మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకు కీలక సూత్రధారులుగా ఉన్న అస్గర్ అలీ, అబ్దుల్ బారీ సామాన్యులు కారు. అత్యంత దారుణమైన నేరచరిత్ర కలిగిన వీరిపై నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. మీర్జా ఎస్కేప్, భారీ పేలుళ్లకు కుట్ర తదితరాలు ఓ మచ్చుతునకలు మాత్రమే. వీరిద్దరూ గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్‌పాండ్యా హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అప్పట్లో ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది సైతం అస్గర్ అని సీబీఐ ఆరోపించింది. ప్రణయ్‌ను హత్య చేయడానికి వీరు సుపారీ తీసుకున్న విషయం వెలుగులోకి రావడంతో పోలీసు వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నల్లగొండ లోని దారుల్షిఫా కాలనీకి చెందిన మహ్మద్ అస్గర్ అలీకి జునైద్, అద్నాన్, చోటూ అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదానికి ఆకర్షితుడయ్యాడు. కాశ్మీర్‌కు చెందిన ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రోద్భలంతో అక్కడకు వెళ్ళిన అస్ఘర్ ప్రాథమిక ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆపై అక్రమంగా సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిన ఇతగాడు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో తుపాకులు కాల్చడం నుంచి నుంచి ఆర్డీఎక్స్తో తయారు చేసిన బాంబులను పేల్చడం వరకు వివిధ రకాలైన శిక్షణలు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత నల్లగొండలోని ప్యార్ సూఖాబాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ బారితో సహా మరికొందరితో ముఠా ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉండగా... బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’ అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణ హత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్య గౌడ్‌ను చాదర్‌ఘాట్‌లోని మహబూబ్ కాంప్లెక్స్ సమీపంలో, అదే ఏడాది ఫిబ్రవరి 2న అంబర్‌పేట్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్‌ను హత్య చేశారు. ఫసీ మాడ్యుల్ చేసిన ఈ దారుణాలకు మీర్జా ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్ బేగ్ సూత్రధారిగా, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇతడి పాత్ర దీనికి ముందూ అనేక కేసుల్లో ఉంది. పాపయ్య గౌడ్, నందరాజ్ గౌడ్లను హత్య చేసిన కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌కు జీవితఖైదు పడింది. మిగిలిన కేసుల విచారణ కోసం చర్లపల్లి జైలులో ఉన్న ఇతడిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. ఇతడిని తప్పించడానికి పథకం వేసిన అస్గర్, బారీ తదితరులు 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి ఎస్కేప్ చేయించారు. అస్గర్ ఇతడిని తనకున్న పరిచయాల నేపథ్యంలో కాశ్మీర్‌కు పంపి ఉగ్రవాదులతో కలిసి పని చేసేలా చేశాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన కొన్ని రోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు. చాలాకాలం వరకు మీర్జాను ఎస్కేప్ చేసింది ఎవరనేది రహస్యంగానే ఉండిపోయింది. 1997 ఫిబ్రవరిలో అస్గర్, బారీ సహా పది మంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి నుంచి మూడు కేజీల ఆర్డీఎక్స్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్, 40 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి వచ్చినట్లు తేల్చారు. ఈ విచారణ నేపథ్యంలో మీర్జా ఎస్కేప్‌లోనూ అస్గర్ పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. 1999లో ఆజం ఘోరీ అనే ఉగ్రవాది (జగిత్యాలలో 2000 ఏప్రిల్ 6న ఎన్కౌంటర్ అయ్యాడు) ఇండియన్ ముస్లిమ్ మహ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అస్గర్ దీనికి సానుభూతిపరుడిగా మారి తనకంటూ ఓ ప్రత్యేక మాడ్యుల్ (గ్యాంగ్) ఏర్పాటు చేసుకున్నాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్పాండ్యాను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని మధ్యవర్తుల ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. బారీ తదితరులతో కలిసి రంగంలోకి దిగిన ఇతడు ఆ ఏడాది మార్చి 26న తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్లి కాల్చి చంపాడు. స్వయంగా తుపాకీ పట్టుకున్న అస్గర్ ఐదు రౌండ్లు పాండ్యాపై కాల్చడంతో ఆయన కన్నుమూశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్న అస్గర్, బారీలను పట్టుకున్నాయి. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిని కింది కోర్టు దోషులుగా తేల్చినా... గుజరాత్ హైకోర్టులో ఈ కేసు వీగిపోవడంతో 2011లో బయటపడ్డారు. ఆ తర్వాత నగరంలో వీరిపై నమోదైన కేసుల్లో కొన్ని వీగిపోవడం, మరికొన్నింటిలో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత మలక్‌పేటలోని సలీమ్నగర్లో ఓ అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. 2011 తర్వాత వీరి పేర్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రణయ్ హత్యకు సుపారీతో వెలుగులోకి రావడం, ఇద్దరినీ నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేయడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. -
భయపడితే ప్రణయ్‌కు నచ్చదు : అమృత
మిర్యాలగూడ : ‘ఎక్కువ కులం ఏంటి.. తక్కువ కులం ఏంటి.. అసలు ఈ కులం అనేదాన్నే తొలగించాలి.. మన పిల్లల్ని మాత్రం ఈ కులం రొంపిలో పడకుండా బాధ్యాతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుదాం’.. ఇది ప్రణయ్ కల. ‘రిసెప్షన్‌కు ముందు రెండు రోజులు మేం వేర్వేరు గదుల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మా భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండు రోజులే రెండు యుగాలుగా అన్పించాయి. ఇప్పుడు నా పూర్తి జీవితం ప్రణయ్ లేకుండా గడపాలి. ఇది నాకు సాధ్యమవుతుందా..’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది అమృత. రెండు రోజులు ఒకరికి ఒకరు కనిపించకపోతేనే తట్టుకోలేని ఆ పసి హృదయాలు ఇప్పుడు జీవిత కాలం ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి. ‘పరువు’ అనే కనిపించని భూతం వారి నూరేళ్ల జీవితాన్ని మింగేసింది. ఇది నల్గొండ, మిర్యాలగూడలో జరిగిన విషాదాంత ప్రేమకథ చిత్రమ్. వైశ్య కులానికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే ప్రణయ్ చేసిన పాపం. కక్ష్య గట్టిన అమృత తండ్రి మారుతీరావ్ ప్రణయ్‌ని అతి కిరాతకంగా హత్య చేయించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తన భర్తను చంపిన తండ్రికి ఉరి శిక్ష పడాలని అమృత కోరుకుంటోంది. తాను తన పుట్టింటికి వెళ్లేది లేదని.. అత్తింట్లోనే ఉండి కుల రహిత సమాజం కోసం పోరాటం చేస్తానంటోంది. ఈ సందర్భంగా అమృత చెప్పిన అంశాలు... ‘ప్రణయ్‌కు మొదటి నుంచి కులం అంటే నచ్చేది కాదు. కుల రహిత సమాజం కోసం కలలు కనేవాడు. ఈ విషయం గురించి అనేక సార్లు నాతో చర్చించేవాడు. కానీ మా ప్రేమ నా తల్లిదండ్రులకు నచ్చలేదు. కారణం ప్రణయ్‌ది తక్కువ కులం కావడం. ఈ కులాల పిచ్చి మా నాన్న లాంటి సైకోలకే కానీ మాకు కాదు. అందుకే ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నాం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా బిడ్డ గురించి మేము ఎన్నో కలలు కన్నాం. మా బిడ్డను ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మంచి పౌరులుగా తీర్చి దిద్దుకోవాలని ఆశపడ్డాం’ అని తెలిపింది. అమృత మాట్లాడుతూ ‘ఇక్కడే ఉంటూ పాలీ హౌస్ ఏర్పాటు చేయాలనుకున్నాం. విదేశాలకు కూడా వెళ్లాలనుకున్నాం. మా కుటుంబ పరిస్థితుల వల్ల మేం చాలా త్వరగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు 21 ఏళ్లు.. ప్రణయ్‌కి 24 ఏళ్లు. మా జీవితం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ప్రపంచంలోని అన్ని సంతోషాలను పూర్తిగా అనుభవించాలనుకున్నాం. కానీ కులం మా కలల్ని చిధిమేసింది. నా ప్రణయ్‌ని నా నుంచి దూరం చేసింది. నన్ను, నా బిడ్డను ఒంటరి వాళ్లను చేసింది. కానీ నేను భయపడను. భయపడితే ప్రణయ్‌కు నచ్చదు. మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డను ప్రణయ్ ఆశాయాలకు అనుగుణంగా, కుల పిచ్చికి వ్యతిరేకంగా నేనే పెంచుతాను’ అంటూ వివరించింది. అంతేకాక ‘మా అత్త మామలకు తోడుగా ఇక్కడే ఉంటాను. నా పుట్టింటికి వెళ్లను. ప్రణయ్‌ని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ నా పోరటాన్ని కొనసాగిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. అమృత మామా గారు బాలాస్వామీ మాట్లాడుతూ.. ‘వీరిద్దరి ప్రేమ గురించి మాకు చెప్పినప్పుడు మేం వద్దని వారించాం. ఇలాంటి ప్రమాదాలు వస్తాయని ముందే హెచ్చరించాం. కానీ వారు తమ జీవితం గురించి, ప్రేమ గురించి చాలా నిజాయితీగా, బలంగా ఉన్నారు. ఇక చేసేదేం లేక వివాహనికి ఒప్పుకున్నాం. వారిద్దరూ ఎందో అన్యోనంగా ఉండేవారు. కానీ మేం ఊహించిందే జరిగింది. కులం మా అబ్బాయిని కాటేసింది. అమృత తన పుట్టింటికి వెళ్లనంటోంది. తనను మా దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాం’ అని తెలిపారు. ఈ హత్య గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రణయ్ - అమృతల వెడ్డింగ్ రిసెప్షన్ వీడియో అమృత నాన్నలో కోపాన్ని తీవ్రంగా పెంచింది. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కాక తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని తన బంధువులు కూడా చూడటం వల్ల ఆయనకు తీవ్రమైన కోపం వచ్చింది. అందువల్ల ప్రణయ్‌ని అడ్డుతొలగిస్తే.. తన కూతురు తన దగ్గరకు వస్తుందని భావించాడు. అందుకే ఈ నేరానికి పాల్పడినట్లుగా మారుతీ రావ్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రణయ్ హత్యపై స్పందించిన చరణ్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతంపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ లాంటి యువ కథానాయకులు ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా మేసేజ్ చేశారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ దారుణ ఘటనపై స్పందించారు. ‘పరువు కోసం ప్రాణం తీసిన ఘటన ఎంతో బాధ కలిగించింది. మనిషి ప్రాణం తీయటంలో పరువు ఎక్కడుంది..? సమాజం ఎటు పోతుంది..? ప్రణయ్ కుటుంబ సభ్యులకు, అమృత వర్షిణికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ప్రణయ్‌కి న్యాయం జరగాలి’ అంటూ తన ఫేస్బుక్లో కామెంట్ చేశారు. ఈ సంఘటనపై చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించారు. చరణ్ కామెంట్‌ను పోస్ట్ చేసిన ఉపాసన మన ఎటూ పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Sad times. Where r we going. #lovehasnoboundaries #justiceforpranay #RamCharan pic.twitter.com/2C4iVRgsTW — Upasana Kamineni (@upasanakonidela) 18 September 2018 -
దళితులకు రాజ్యాధికారం రావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రణయ్ హత్యోదంతం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదని, సమాజ సమస్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆగాలంటే అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ జరగాలని, ఆయన ఆశించినట్టు దళితులకు రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై జనచైతన్య వేదిక అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలలుగా అమ్మాయి కుటుంబం కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించిందని పేర్కొన్నారు. అయితే దీని వెనకున్న రాజకీయ నేతలు, పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే బాధిత కుటుంబానికే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందన్న నమ్మకం కలిగేదన్నారు. రాజకీయ హత్య అని ఎవరూ ఆరోపించకపోయినా పోలీసు శాఖ మాత్రం అది రాజకీయ హత్య కాదంటూ వెల్లడించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే పోలీసులు రాజకీయ హత్య కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. అలాగే దళితులను అణగదొక్కాలన్న ధోరణి మారాలని, ప్రణయ్ çఘటనను కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలే ఖండించడం కాకుండా యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దళితులకు కేటాయించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు అమలైనట్లు భావించాలని పేర్కొన్నారు. అఘాతం పెరుగుతోంది: చుక్కా రామయ్య పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం వల్ల ఇలాంటి కుల దురహంకారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రణయ్ హత్య నిందితుల అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారు ఒక్కరు కూడా ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఘటనను ఖండించకపోవడం పీడిత వర్గాలను మరింత అణగదొక్కే ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేయాల్సిందే: రమా మేల్కొటే ప్రణయ్ హత్యకు ముందు ఆ జంటను విడదీసేందుకు బెదిరింపులకు దిగిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేయాలని ప్రొఫెసర్ రమామేల్కొటే డిమాండ్ చేశారు. పరువు హత్యలు, కులహంకార హత్యలతో సమాజాన్ని విడదీసేలా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్నిచ్చినా ప్రణయ్లాంటి ఘటనలతో ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోతున్నాయన్నారు. పదవుల్లో ఉన్నవాళ్లు పరామర్శించాల్సింది: ‘సాక్షి’ఈడీ రామచంద్రమూర్తి ప్రణయ్ సంఘటనను పదవుల్లో ఉన్నవారు ఖండించపోవడం, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సీఎం కానీ, దళిత ఉపముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే దళితుల్లో ధైర్యం పెరిగేదన్నారు. ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పుడు బిహార్‌లో జరిగిన ఇలాంటి ఓ హత్య సమయంలో వేగంగా స్పందించారన్నారు. ఘటనా స్థలికి వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఏనుగుపై వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. నెహ్రూ, ఇందిర కుటుంబాలను దళితులు ఎప్పుడూ మరవలేరని చెప్పారు. ప్రణయ్ హత్యను సమాజం మొత్తం ఖండించాలని, ఇది దళిత హక్కులను కాలరాసేలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మేధావులు, పెద్దలు ఈ ఘటనను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేశ్‌చంద్ర హరి, సెంటర్ ఫర్దళిత్ స్టడీస్ ప్రతినిధులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఒకప్పుడు పరువు హత్యలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరిగేవని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరువు హత్యలు, కుల హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కులాలుండవని, అక్కడ 90 శాతం ప్రేమ వివాహాలే జరుగుతున్నట్లు చెప్పారు. సమాజ సమస్యగా మారుతున్న ప్రణయ్ హత్యలాంటి ఘటనలను నియంత్రించాలన్నా, నిరోధించాలన్నా కులాంతర వివాహాలను ప్రభుత్వాలే పోత్సహించాలని డిమాండ్ చేశారు. -
అమృతను చట్టసభలకు పంపాలి
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృతను ఏకగ్రీవంగా చట్టసభలకు పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ.మాస్ చైర్మన్ కంచె ఐలయ్య ప్రతిపాదించారు. మంగళవారం మిర్యాలగూడలో ప్రణయ్ నివాసంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులను పరామర్శించారు. కుల దురహంకారానికి ప్రణయ్ బలయ్యాడని, ఈ హత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అమృతను చట్టసభలకు పంపాలన్నారు. సీపీఎం, బీఎల్ఎఫ్ తరఫున మిర్యాలగూడ శాసనసభ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే సీఎం కనీసం ప్రకటన కూడా చేయలేదని, హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించడానికి రాలేదని ఆరోపించారు. ఈ హత్యలో ఆరోపణలెదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలను పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని, కానీ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతరపార్టీ నేతలు మజీదుల్లాఖాన్, జాన్‌వెస్లీ, తదితరులు ఉన్నారు. మారుతీరావును ఎన్కౌంటర్ చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఢిల్లీలో డిమాండ్ చేశారు. -
పగబట్టి.. బుసకొట్టి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నల్లగొండ క్రైమ్: షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావే అని తేలింది. తన కూతురు అమృత వర్షిణిని కులాంతర వివాహం చేసుకున్నాడని పగ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ నెల 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారం దరినీ అరెస్టు చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ప్రణయ్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ మీడియాకు వివరించారు. ‘పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేశాం. ఈ ఏడాది జనవరిలో ప్రణయ్, అమృతల వివాహంహైదరాబాద్ ఆర్య సమాజ్‌లో జరిగింది. వివాహం తరువాత తన కూతురిని అప్పగించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులపై అనేక రకాలుగా మారుతీరావు ఒత్తిడి తెచ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో ప్రణయ్‌ని అడ్డుతొలగించి అమృతను ఇంటికి తెచ్చుకోవాలని పధకం వేసుకున్నాడు. మిర్యాలగూడకు చెందిన తన స్నేహితుడు అబ్దుల్ కరీంతో ప్రణయ్ హత్య గురించి చర్చించాడు. గతంలో ఓ భూ వివాదంలో తనకు పరిచయమైన మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీని జూలైలో సంప్రదించి హత్య చేయాలని కోరారు. ఇదే విషయమై కరీంను హైదరాబాద్‌లో ఉంటున్న అబ్దుల్ బారీ వద్దకు పంపించాడు. రూ.కోటి ఒప్పందం... మాజీ ఉగ్రవాదులు అస్గర్ అలీ, అబ్దుల్ బారీ మిర్యాలగూడకు వచ్చి మారుతీరావు, కరీంను కలసి ప్రణయ్‌ని హత్య చేయడానికి రూ.కోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. జూలై 2వ వారంలో రూ.15 లక్షలను కరీంకు ఇచ్చి బారీకి అందజేయాల్సిందిగా తన కారులోనే డ్రైవరు శివతో పంపించాడు. గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో రాజమండ్రి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో బారీకి బిహార్‌కు చెందిన సుభాశ్‌కుమార్ అలియాస్ శర్మ పరిచయమయ్యాడు. ప్రణయ్ హత్య కోసం సుభాశ్‌ను అక్కడి నుంచి పిలిపించాడు. వీరు మాజీ ఉగ్రవాది అస్గర్‌అలీతో కలసి హత్యకు ప్లాన్ వేశారు. పలుమార్లు రెక్కి... ప్రణయ్ హత్య కోసం అస్గర్‌అలీ, బారీ అతన్ని నివాసాన్ని పరిశీలించారు. ఆగస్టు 22న ఇంటి వద్దనే ప్రణయ్‌ని హత్య చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అమృత గర్భవతి అని తెలియడం, ప్రణయ్ కుటుంబం రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో పరువు పోయిందని భావించిన మారుతీరావు.. ప్రణయ్‌ని త్వరగా కడతేర్చాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ప్రణయ్ ఇంటికి వెళ్లి కారు కిరాయికి కావాలని అతని తండ్రి బాలస్వామిని సుభాష్ అడిగాడు. ఆ రోజే హత్య చేయాలని అనుకున్నా.. వీలు కాలేదు. దీంతో అమృతను, ప్రణయ్‌ని కిడ్నాప్ చేయాలని, అతన్ని హత్య చేసి అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగించాలని రెక్కీ నిర్వహించారు. అదీ సాధ్యం కాలేదు. తర్వాత అమృత వెళ్లే బ్యూటీపార్లర్ వద్ద హత్యకు ప్లాన్ చేశారు. అక్కడికి అమృత, ప్రణయ్‌తోపాటు అతని సోదరుడు కూడా రావడంతో ఇద్దరిలో ఎవరిని చంపాలో గుర్తించడం కష్టమై విరమించుకున్నారు. అమృత తల్లి ద్వారా కదలికలు తెలుసుకుని... అమృత గర్భవతి కావడంతో ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది. జ్యోతి ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతున్నట్లు తెలియజేసింది. ఆ విషయాన్ని తన భార్య ద్వారా తెలుసుకున్న మారుతీరావు బారీకి వివరించాడు. ప్రతి వారం వారు ఆస్పత్రికి వస్తున్నట్లు గుర్తించిన నిందితులు ప్రణయ్‌ను అక్కడే హత్య చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 14న అజ్గర్ అలీ, సుభాష్ శర్మ ఆస్పత్రి వద్ద కాపు కాశారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా సుభాష్ కత్తితో వెళ్లి ప్రణయ్‌ను నరికి చంపాడు. స్కూటీతో రెడీగా ఉన్న అస్గర్‌తో కలసి అక్కడి నుంచి పారిపోయాడు. మిర్యాలగూడ శివారులో శర్మ తన దుస్తులను మార్చుకున్నాడు. తరువాత త్రిపురారం మీదుగా, సాగర్–నల్లగొండ మార్గంలో నల్లగొండకు చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు వెళ్లి చివరికి పట్నాకు పారిపోయాడు. అస్గర్ అలీ చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్‌కు చేరకున్నాడు. చౌటుప్పల్ దాటుతున్న సమయంలో అబ్దుల్ బారీకి ఫోన్‌చేసి పని పూర్తయిందని, డబ్బులు ఇవ్వాలని కోరాడు. వెంటనే బారీ మారుతీరావుకు విషయం తెలిపాడు. ‘దృశ్యం’ను అనుసరించిన మారుతీరావు... మిర్యాలగూడలో ప్రణయ్‌ని హత్య చేసిన రోజున.. తానక్కడ లేనని రుజువు చేసుకునేందుకు మారుతీరావు దృశ్యం సినిమాను అనుసరించి ఎలిబీ(సాక్ష్యం) సృష్టించుకునే ప్రయత్నం చేశాడు. నల్లగొండ కలెక్టరేట్లో పని ఉందని జేసీని కలిసేందుకు వచ్చాడు. దారిలో వేములపల్లి వద్ద మిర్యాలగూడ డీఎస్పీ, స్థానిక ఎస్ఐ కనిపిస్తే అవసరం లేకున్నా వాహనం దిగి వారికి కనిపించాడు. రాజకీయాలకు సంబంధం లేదు.. ఈ హత్యోదంతంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధమూ లేదు. అడ్వకేట్ సోమ భరత్ వారిని బెదిరించినట్లు విచారణలో తేలలేదు. అమృత గర్భం దాల్చడంతో మారుతీరావుకు బంధువు కూడా అయిన భరత్.. చిన్న వయస్సులో పిల్లలు ఎందుకు, ఇంకా కొంతకాలం ఆగిన తర్వాత ప్లాన్ చేసుకోండి, అని మాట్లాడినట్లు తేలింది. వీరేశం కూడా పెళ్లి విషయంలో బాలస్వామి, ఆయన సోదరడు జోజితో మాట్లాడినట్లు చెబుతున్నారు. తన కూతురుకు అబార్షన్ చేయాలని మారుతీరావు డాక్టర్ జ్యోతిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా ఆమె అంగీకరించలేదు. 9వ తరగతి నుంచే ప్రేమ... అమృత, ప్రణయ్ 9వ తరగతి నుంచే స్నేహితులు. అమృత 9వ తరగతిలో ఉండగా ప్రణయ్ 10వ తరగతిలో ఉన్నాడు. ఇంటర్ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం మారుతీరావు, సోదరుడు శ్రవణ్‌కుమార్‌కు తెలిసింది. తమ కూతురుతో తిరగవద్దని ప్రణయ్‌ను, అతని కుటుంబ సభ్యులను బెదిరించారు. అయినా అమృత, ప్రణయ్ కలుస్తుండటంతో ఇంటర్ తర్వాత ఒక ఏడాది ఖాళీగా ఇంట్లోనే ఉంచారు. అనంతరం హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. అదే సమయంలో ఘట్కేసర్ శ్రీనిధి కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రణయ్‌తో సంబంధాలు పెరిగాయి. వారిద్దరూ నిత్యం మాట్లాడుకుంటున్నారని మారుతీరావుకి తెలిసింది. దీంతో అమృత చదువు మానిపించి ఇంటి వద్ద ఉంచారు. ఫోన్లో ఇరువురి మధ్య చాటింగ్ గమనించిన అమృత బాబాయ్ శ్రవణ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. మరోసారి ప్రణయ్ తల్లిదండ్రులను మారుతీరావు పిలిచి అదుపులో ఉంచుకోవాలని భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత అమృత, ప్రణయ్ వాళ్ల ఇంట్లోవాళ్లకు చెప్పకుండా హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ మాజీ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడంలో విఫలమైన తీరుపై నిజానిజాలు తెలుసుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ కమిటీని వేశామని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ఐఎస్ఐ ఉగ్రవాదులుగా గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో శిక్ష కూడా అనుభవించిన అస్గర్ అలీ, అబ్దుల్ బారీ కదళికలపై నిఘా పెట్టకపోవడం, వారు స్వేచ్ఛగా తిరుగుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయినా గుర్తించలేకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. అలాగే మారుతీరావు భూ కబ్జాలు, తదితర నేరాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని, ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్‌కు సమాచారం కూడా ఇచ్చామని ఎస్పీ తెలిపారు. ఈ కేసుతో నయీం పేరును లింకు చేస్తున్నారని, అసలు నయీం లేనప్పుడు అతని గ్యాంగ్ ఎక్కడిదని ప్రశ్నించారు. అస్గర్ అలీ, నయీంలకు సంబంధం కూడా లేదని ఎస్పీ చెప్పారు. కాగా సుభాష్కుమార్ను బిహార్ పోలీసులు అరెస్టు చేశారని, కోర్టు అనుమతితో అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మారుతీరావు పోలీసులకు లొంగిపోగా, మిగిలిన ఆరుగురిని వివిధ ప్రాంతాల్లో మిర్యాలగూడ డీఎస్పీ, సీఐలు ధనుంజయ, భాష, క్యాస్ట్రోరెడ్డి, వేణు అరెస్ట్ చేశారు. నిందితులు వీరే.. ఏ.1 మారుతీరావు (అమృత తండ్రి) ఏ.2 శర్మ (చంపిన వ్యక్తి) ఏ.3 : అస్గర్‌అలీ ఏ.4 అబ్దుల్ బారీ ఏ.5 కరీం ఏ.6. శ్రవణ్ (అమృత బాబాయి) ఏ.7. శివ (కారుడ్రైవర్) ..................... ఆస్తులపై విచారణ... కిరోసిన్ వ్యాపారం చేసిన మారుతీరావు ఆస్తులపై విచారణ చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీరావు భూ దందాలు, ఆస్తులపైన కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. భూములు క్రయవిక్రయాలతో పాటు అక్రమ వ్యాపారాలపైన సమాచారాన్ని సేకరించామన్నారు. అస్గర్, బారీలకు ఉగ్రవాద మూలాలు(బాక్స్) నల్లగొండ క్రైం: ప్రణయ్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో అబ్దుల్ బారీ, అస్గర్ అలీలకు ఉగ్రవాద మూలాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ నిర్వహించిన శిక్షణలో పాల్గొని నల్లగొండ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పూనుకున్నారు. 10వ తరగతి చదివిన అస్గర్ అలీ తొలుత చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. క్రమంగా ఉగ్రవాద కార్యక్రమాలకు ఆకర్షితుడై.. నల్లగొండకు చెందిన షేక్ ఫరీద్, షేక్ అవద్, అబ్ధుల్‌బారీ, షేక్ ఒబైద్లను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గేలా చేశాడు. అనంతరం బారీ, షీఫీ, ఇంతియాజ్, నూర్ రెహ్మాన్‌లతో కలసి 2003లో గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో 2003, ఏప్రిల్ 16న అస్గర్ అలీ, రవూఫ్ (సైదాబాద్), సయ్యద్ ఇప్తేఖర్ (టోలీచౌకి–హైదరాబాద్), అబ్దుల్ బారీ, షఫీ (నల్లగొండ)లను సీబీఐ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. 2013, అక్టోబర్ 16న బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. అస్గర్ అలీపై మొత్తం 14 కేసులు ఉన్నాయి. బారీ కూడా నల్లగొండకు చెందిన పలువురు ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ప్రేరేపించాడు. వీరంతా తారీఖ్ ముస్లీం షబాక్ (టీఎంఎస్) అనే మత చాందసవాద సంస్థలో పనిచేశారు. అమృత తండ్రి మారుతీరావు భూ వివాదంలో జోక్యం చేసుకొని బెదిరించడంతో 2011లో మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో బారీపై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తంలో అతడిపై 9 కేసులున్నాయి. -
కులం రగిలిస్తున్న రక్తచరిత్ర
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తమిళనాడులో కౌసల్య, తెలంగాణలో అమృత వంటి అమ్మాయిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తుతోంది. కులం రాతిపై చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. ఓ పక్క కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నా, తమిళనాట రాజకీయంగా శక్తిమంతమైన వెనుకబడిన, అగ్రకులాలు తమ పిల్లలు దళితులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని సహించడం లేదు. ఇప్పుడు అమృత జీవితం ఎటు తిరుగుతుంది? ఆమెకూడా కౌసల్య మార్గంలోనే పయనించబోతోంది. ప్రణయ్ మరణం మతిమాలిన రక్తపాతానికి పాల్పడకూడదనే సందేశం ఇవ్వాలని అమృత కోరుకుంటోంది. కౌసల్య, అమృత–ఇద్దరూ దళిత యువకు లను ప్రేమించి పెళ్లాడారు. వారి తిరుగుబాటు ఫలితంగా వారి భర్తలు ప్రాణాలు కోల్పో యారు. తమిళనాడులోని ఉడుమలపేటలో జరిగిందే తెలంగాణ మిర్యా లగూడలో పునరావృతమైంది. తమకంటే ఉన్నత కులంగా భావించే దేవర్ వర్గానికి చెందిన కౌసల్యను దళిత ఇంజనీర్ శంకర్ 2016 మార్చిలో పెళ్లిచేసుకున్నాడు. తిరుపూర్ జిల్లా ఉడుమలపేట మార్కెట్ సెంటర్లో అతన్ని పొడిచి చంపారు. కౌసల్య కళ్లముందే జరిగిన ఈ హత్య సీసీటీవీలో రికార్డయింది. అల్లుడిని చంపడానికి కిరాయి హంత కులను పంపిన కౌసల్య తండ్రికి కిందటి డిసెంబర్లో తిరుపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే దళిత యువకుడిని కిరాయి హంతకుడు నరికి చంపాడు. వైశ్య కులా నికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే 23 ఏళ్ల ప్రణయ్ చేసిన పాపం. ఆస్పత్రి ముందు జరిగిన ఈ హత్య కూడా సీసీటీవీలో నమోదయింది. తండ్రి మారుతీరావే ప్రణయ్‌ను చంపించాడని అమృత ఆరోపించింది. ప్రణయ్‌ను కత్తితో తల నరికి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే ఈ హంతకుడిని వినియోగించి ప్రణయ్‌ను చంపడానికి కోటి రూపాయలు ఖర్చుచేశారని తెలుస్తోంది. ప్రణయ్, అమృత జనవరిలో వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. పెళ్లిని వ్యతిరేకించిన ఆమె తండ్రి గర్భస్రావం చేయించుకోమని ఒత్తిడి తేగా అందుకు అమృత అంగీక రించలేదు. శంకర్ హత్య జరిగిన కొద్ది రోజులకు కౌసల్యను కలిశాను. అప్పు డామె తన అత్తవారింట్లో శంకర్ నాయనమ్మ, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఉంటోంది. అది ఒకే గది ఉన్న పూరిల్లు. కన్నవారింట్లో మరింత సౌఖ్యంగా కౌసల్య బతికింది. ‘‘శంకర్ లేకుండా బతకలేను. చాలా ఒంట రినయ్యా’’ అని కౌసల్య చెప్పింది. కులం సజీవంగా ఉన్న తమిళనా డులో దళితుడిని చంపి జైలుకెళ్లడాన్ని గర్వపడే చర్యగా పరిగణిస్తారు. తన భర్తను చంపిన కిరాయి హంతకుడు చేసిన గాయాల గుర్తులను దాచుకునేందుకు తన తలకు కౌసల్య గుడ్డ కట్టుకుంది. ఇలాంటి పరువు హత్యల వల్ల ప్రయోజనం లేదంటూ రక్తానికి కులం ఉంటుందా? అని ప్రశ్నించింది. ‘‘తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకుని పిల్లలను ఇష్ట ప్రకారం పెళ్లిచేసుకోనివ్వాలి. ఇలా చంపడం వల్ల ఏం సాధిస్తారు? నా సంగతే చూడండి. శంకర్‌ను చంపేశారు. నా తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు. నేనేమో ఒంటరినై ఇక్కడున్నాను’’ అని కౌసల్య బాధపడుతూ చెప్పింది. ఇప్పుడు అమృత మాటలు వింటుంటే కౌసల్య మరోసారి మాట్లాడినట్టే అనిపిస్తుంది. బిడ్డను కనాలనే పట్టుదలతో ఉన్న అమృత తన భర్త ప్రణయ్‌కు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. ‘‘కులాంతర పెళ్లిళ్లతోనే మనం కుల వ్యవ స్థను నిర్మూలించగలం. కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ బీఆర్ అంబేడ్కర్ ఆశించినట్టు దీన్ని సాధించాలి. అమానుష కుల వ్యవస్థను మనం సవాలుచేయాలి’’ అని అమృత చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కౌసల్య, అమృత వంటి అమ్మా యిలకు పౌరసమాజం ఇంతటి కఠిన శిక్షలు వేయడాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తుతోంది. కులం రాతిపై చెక్కిన బొమ్మలా నిలబడిపోయింది. ఓ పక్క దళితుల కోసం ప్రగతిశీల ఉద్య మాలు నడుస్తూ కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నా తమిళనాట రాజకీయంగా శక్తిమంతమైన వెనుకబడిన, అగ్రకులాలు తమ పిల్లలు దళితులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని సహించడం లేదు. తమ మాట వినని పిల్లలు దళితులను పెళ్లాడితే పెద్ద అవమానం జరిగినట్టు భావించే ఈ పెత్తందారీ కులాలు దళితులపై దాడులకు దిగుతున్నాయి. పైకి సాత్వికులుగా కనిపించే వ్యక్తులు ఇలాంటి పెళ్లిళ్ల కారణంగా హంత కులుగా మారుతున్నారు. దళితులను పెళ్లాడిన తమ కూతుళ్లు ఏదేమైనా తిరిగి తమ ఇళ్లకే తిరిగి రావాలని అమృత, కౌసల్య తండ్రులు కోరు కున్నారు. అది తాము విధించే పరిమితుల్లోనే కుమార్తెలు బతకడమే వారు ఆశించింది. తండ్రుల మాటే అక్కడ చెల్లుతుంది. కోర్టు తీర్పు వచ్చిన రోజున కూడా తండ్రి ముఖం చూడటానికి కౌసల్య నిరాకరిం చింది. అమృత తన తండ్రికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. కులభేదం కారణంగా తండ్రీకూతుళ్ల అందమైన బంధం నాశనమైంది. కులాంతర పెళ్లిళ్లకు సర్కారీ ప్రోత్సాహం! కులాంతర వివాహాల ప్రోత్సాహానికి తాను చేయాల్సిందంతా చేస్తున్నా నని భారత ప్రభుత్వం చెబుతోంది. వధూవరుల్లో ఒకరు దళితులైతే కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ రెండున్నర లక్షల రూపా యలు ఇస్తోంది. పైకి ఇంత చేస్తున్నట్టు కనిపిస్తున్నా రాజకీయ నాయ కులు తమ కార్యక్షేత్రాల్లో కులాంతర వివాహాలు ప్రోత్సహించడం లేదు. సంపన్న వన్నియార్, దేవర్, గౌండర్ కుటుంబాలకు చెందిన ఆడపిల్ల లను ఆకర్షించడానికి దళిత కుర్రాళ్లు రోమియోల్లాగా దుస్తులు ధరిస్తున్నా రని పీఎంకే నేత, వన్నియార్ల నాయకుడు డాక్టర్ ఎస్.రాందాస్ కొన్నేళ్ల క్రితం ఆరోపించారు. ఈ మూడు ఓబీసీ కులాలూ తమిళనాట రాజ కీయంగా శక్తిమంతమైనవి. అనేక బీసీ కులాల నేతలు రాందాస్ అభిప్రాయంతో ఏకీభవించారు. గౌండర్ కులానికి చెందిన సీకే నాగ రాజ్ తమ వర్గం కోసం కొంగు జన నాయక పార్టీ స్థాపించి 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేశారు. రాందాస్ మాదిరిగానే కులాంతర వివాహాలను నాగరాజ్ తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ‘‘అమ్మాయి వెనకాల ఒకటి రెండు నెలలు తిరుగుతారు. ఆ పిల్ల ప్రేమలో పడినాక ఆమెను తీసుకుపోతారు. ఆ అమ్మాయి పుట్టింటి నుంచి డబ్బుతోనో బంగారంతోనో వస్తుంది. లేదా ఆ యువతిని తిరిగి తమ ఇంటికి రప్పించడానికి ఆమె తల్లిదండ్రులు ఎంత సొమ్మయినా చెల్లించడానికి సిద్ధమౌతారు’’ అంటూ దళిత యువకులు బీసీ, అగ్రకులాల యువతులను వలవేసి పట్టుకుంటారని నాగరాజ్ వివ రించారు. దళితులతో ఇలాంటి పెళ్లిళ్లు మాకు అవమానం! దళిత కుర్రాళ్లతో పైన చెప్పిన ఓబీసీ కులాల యువతుల ప్రేమ పెళ్లిళ్ల గురించి నాగరాజ్ చర్చిస్తూ ‘‘ఇలాంటి పెళ్లిళ్లు మా కుటుంబానికి పెద్ద అవమానం. ఈ వివాహం జరిగాక యువతి తల్లిదండ్రులు వీ«ధుల్లో తిరగలేరు. మరో కూతురు ఉంటే ఆ అమ్మాయిని కులంలో ఎవరూ పెళ్లా డరు’’అంటూ చెప్పుకొచ్చారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని కుటుంబాలు కూడా కులానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోయంబత్తూరులోని మారియమ్మన్ గుడిలో వాచ్‌మన్‌గా పనిచేసే ముత్తుస్వామి గౌండర్‌ను కలిశాను. కులాంతర వివాహాలను మీరు సమర్థిస్తారా? అని ఆయనను ప్రశ్నించాను. ‘‘నా కొడుకు ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను అతనికి తండ్రిని కాకుండా పోతాను. నా కొడుకు జీవితం నాశనమైతే నేనెలా సంతోషంగా ఉంటాను?’’ అని గౌండర్ అడిగాడు. కులం పరువే ముఖ్యమన్న మారుతీరావు! మిర్యాలగూడలో తన కూతురు పెళ్లాడిన దళిత యువకుడు ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు కూడా పైన చెప్పినట్టే మాట్లాడాడు. తనకు కులం పరువే ముఖ్యమని మిర్యాలగూడ పోలీసులకు ఆయన చెప్పాడని తెలుస్తోంది. మారుతీరావుకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. జిల్లా రాజకీయ నాయకులందరితో అతనికి మంచి సంబంధాలున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా తమను బెదిరించారని అమృత చెప్పింది. అయితే, ఈ ఆరోపణపై పోలీసులకు ఆధారాలు లభించలేదు. తమిళనాడులో 2013–2016 మధ్య 80 వరకూ పరువు హత్యలు జరిగినట్టు వార్తలొచ్చాయి. ప్రభుత్వం మాత్రం అన్ని జరగ లేదని చెబుతోంది. తెలంగాణలో 2014 జూన్ నుంచి 19 పరువు హత్యలు జరిగాయని దళిత ఉద్యమకారులు చెప్పారు. ఈ హత్యలు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో అంటే పెద్దపల్లి నుంచి నల్లగొండ వరకూ జరిగాయి. కుల స్పృహ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థమౌ తోంది. మీడియా, ప్రజల దృష్టి అమృత–ప్రణయ్ కేసుపై నిలిచి పోవడంతో పోలీసులు ఈ కేసులో బాగా కష్టపడి నేరస్తులను గుర్తించ డానికి ప్రయత్నించారు. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలూ సహజం గానే కుల హింసను ఖండిస్తున్నారు. ప్రణయ్ హత్యను ఐటీ మంత్రి కె.తారక రామారావు ఖండిస్తూ, ఇది క్రూరమైన నేరమనీ, న్యాయం జరిగేలా చూస్తామని ట్విట్టర్లో తెలిపారు. ఈ హత్యపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడకపోవడంపై దళిత ఉద్యమకారులు అసం తృప్తితో ఉన్నారు. ఇలాంటి హత్యలు సహించేది లేదని కేసీఆర్ బాహా టంగా ఈ విషయంపై మాట్లాడితే ప్రజలకు ఇది బలమైన సందే శమౌతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి మౌనం కారణంగా ఇలాంటి దారుణ హత్యలు చేయడానికి కొందరికి ధైర్యం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమృత జీవితం ఎటు తిరుగు తుంది? ఆమె కౌసల్య మార్గంలోనే పయనించబోతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడంతో పాటు కుల హింసపై జరిగే సమావేశాల్లో మాట్లాడే అవకాశాలు లెక్కలేనన్ని వస్తాయి. ప్రణయ్ మరణం మతి మాలిన రక్తపాతానికి పాల్పడకూడదనే సందేశం ఇవ్వాలని అమృత కోరుకుంటోంది. ఇండియాలో పెళ్లిసంబంధాలు, రాజకీయాలు సైతం కులం ప్రాతిపదికనే జరుగుతున్నందున బాగా పాతుకుపోయిన కుల భేదాలు తొలగించడం అంత తేలిక కాదు. వ్యాసకర్త : టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
ప్రణయ్ హత్య కేసు : రాజకీయ నాయకులకు సంబంధం లేదు
-
ప్రణయ్ కేసు: మీడియా ముందుకు నిందితులు
సాక్షి, మిర్యాలగూడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు తెలియజేశారు. కులాలు వేర్వేరు కావడంతోనే మారుతీరావు ప్రణయ్‌ను హత్యచేయించినట్లు తెలిపారు. ‘ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం. హత్య చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ. అతన్ని సమస్తిపూర్ కోర్టులో హాజరుపరిచాం. అమృత తండ్రి మారుతీరావు రూ. కోటి రూపాయల ఒప్పందంతో హత్య చేయించారు. ఈ కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 సుభాష్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 మహ్మద్ బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఏ7 మారుతీ రావు డ్రైవర్ శివకుమార్‌లలో ఏ2 మినహా మిగతావారిని మీడియా ముందుకు తీసుకొచ్చాం. సుభాష్‌శర్మను రేపు మీడియా ముందు ప్రవేశపెడతాం. అస్గర్ అలీ, మహ్మద్ బారీలపై గతంలోనే కేసులున్నాయి. మహ్మద్ బారీ ప్రస్తుతం హైదరాబాద్ మలక్ పేటలో నివసిస్తున్నాడు. 2012 నుంచి మారుతీరావుకు బారీతో పరిచయం ఉంది. రాజమండ్రి జైలులో మహ్మద్‌బారీ, సుభాష్‌శర్మలకు పరిచయం ఏర్పడింది. ప్రణయ్ హత్యా ఒప్పందానికి కరీం సహకరించాడు. జనవరిలో ప్రణయ్, అమృతలు పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వల్ల వారి చదువులను మధ్యలోనే ఆపేశారు. మారుతీరావు కొన్నిసార్లు ప్రణయ్‌ను బెదిరించాడు. సెక్యూరిటీ కోసం ప్రణయ్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. జూలై తొలి వారంలోనే హత్యకు ప్లాన్ చేశారు. మారుతీరావు తరుపున కరీం హంతకులతో మాట్లాడారు. కరీం, అస్గర్, బారీ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారు. మిర్యాలగూడ ఆటోనగర్‌లో కారులో కూర్చుని డీల్ మాట్లాడారు. రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని ఒప్పందం కుదర్చుకొని రూ.15 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బులను కరీం,అస్గర్,బారీలు పంచుకున్నారు. హత్య తర్వాత పారిపోయేందుకు వీలుగా ముందే స్కూటీ కొన్నారు. మాట్లాడుకునేందుకు ఫేక్ అడ్రస్‌లతో మూడు సిమ్‌కార్డులు కొన్నారు. అమృతకు అబార్షన్ చేయడానికి మారుతీరావు చాలా ప్రయత్నాలు చేశారు. అబార్షాన్ చేయడానికి డాక్టర్‌పై చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆగస్టు 17న మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది. దీంతో అతనికి పరువు పోయినట్లు భావించి మరింత కోపం పెంచుకున్నాడు. తొలి ప్రయత్నం విఫలం.. ఆగస్టు14న ప్రణయ్‌ను చంపేందుకు తొలి ప్రయత్నం చేశారు. బ్యూటీ పార్లర్ వద్ద ప్రణయ్ సోదరుడు అజయ్ కూడా ఉండటంతో ఎవరు ప్రణయో తెలియక అయోమయానికి గురై వెనక్కి వెళ్లారు. ఆగస్టు 22న సుభాష్ శర్మ మిర్యాలగూడ వచ్చాడు. అదే రోజున ప్రణయ్ ఇంటికెళ్లి అతని తండ్రిని కారు కిరాయికిస్తారా? అని అడిగాడు. సెప్టెంబర్ తొలి వారంలో అమ్మాయిని కిడ్నాప్ చేసి అనంతరం ప్రణయ్‌ను చంపుదామని కూడా వ్యూహం రంచించారు. దీనికోసం హైదరాబాద్ నుంచి కొంతమంది రౌడీలను పిలిపించారు. కానీ వారి వ్యవహారం నచ్చని అస్గర్ అలీ ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సెప్టెంబర్ 14న మధ్యాహ్నాం 1.30కు హత్య జరిగింది. ఆ రోజు శర్మ బైక్‌పై కారును ఫాలో చేసాడు. అనంతరం అస్గర్ అలీ డైరెక్షన్లో శర్మ ఒక్కడే వెళ్లి హత్య చేసాడు. అమృత బాబాయ్ శ్రవణ్‌కు మారుతీ రావుకు మధ్య మనస్పర్థాలు ఉన్నాయి. ఏ6, ఏ7 లకు ఈ కేసుతో అంతగా సంబంధం లేదు. పలు ఏజెన్సీల సాయంతో రెండు మూడు రోజుల్లో ఈ కేసును చేధించడం జరిగింది. రాజకీయ నాయకులకు సంబంధం లేదు ఈ కేసులో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆయన కూడా కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ప్రణయ్ తండ్రితో మాట్లాడినట్లు చెప్పారు. ఈ కేసుకు నయీం అనుచరులకు ఎలాంటి సంబంధం లేదు. మారుతీరావు ఇటీవలే టీఆర్ఎస్లో చేరాడు. కరీం కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. మహ్మద్ బారీ ఎంఐఎం పార్టీలో ఉన్నాడు. అంతేగానీ రాజకీయంగా ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు. అమృత తల్లికి కూడా ఈ హత్య గురించి తెలియదు. ఆమెను నమ్మించి కూతురుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని మారుతిరావు తెలుసుకున్నాడు.’ అని ఎస్పీ మీడియాకు వివరించారు. ఈ కేసు గురించి అసత్య వార్తాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మారుతీరావు భూదందాల గురించి త్వరలో దర్యాప్తు చేపడుతామన్నారు. -
ప్రణయ్ హత్య కేసు : హత్య చేసిన శర్మ అరెస్ట్
-
ప్రణయ్ హత్య కేసులో.. సుపారీ కిల్లర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు హత్య చేయించాడు. ఈ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉండగా బారీ తన గురువు అస్గర్ అలీతో ప్లాన్ చేసి బిహార్‌లోని సంస్థాన్ పూర్ జిల్లాకు చెందిన శర్మను ఈ ఆపరేషన్‌కు వినియోగించాడు. బిహార్‌లో అదుపులోకి తీసుకున్న శర్మను పోలీసులు నల్గొండ తరలిస్తున్నారు. హత్య జరిగిన రోజు శర్మతో పాటే అస్గర్ ఆసుపత్రికి వచ్చినట్టుతెలుస్తోంది. తన కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్గర్ డబ్బు కోసం ఈ డీల్ ఒప్పుకున్నట్టు సమాచారం. -
‘మాజీ ఎమ్మెల్యే వీరేశంను విచారిస్తాం’
సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు లో మొత్తం 7 గురు నిందితులు ఉన్నారని ఎస్పీ రంగనాథ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్యకు సంబంధించి మొత్తం కోటి రూపాయల డీల్ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 18 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు తెలిపాడు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసున్నారని వివరించారు. దీనిలో భాగమైన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరితో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తామని అన్నారు. నల్గొండ కి చెందిన మాజీ ఐసిస్ టెర్రరిస్ట్ లు ప్రణయ్ హత్య కేసు లో ఇన్వాల్వ్ అయ్యారని, ప్రణయ్‌ను చంపిన వాడు బీహార్‌కు చెందినవాడని తెలిపారు. -
ప్రణయ్ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది
-
కులం తక్కువ కావడంతోనే ప్రణయ్ హత్య
మిర్యాలగూడ (నల్గొండ): కుల దురహంకారంతోనే ప్రణయ్‌ని హత్య చేయించారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు విమలక్క అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కులం కంటే గుణం చాలా గొప్పదన్నారు. కులాంతర వివాహం చేసుకున్న కూతురును ఆ తండ్రికి మనసుంటే ఆశ్వీరదించాలి కానీ కులదురంహకారంతో హత్య చేయించే హక్కు అయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సమాజం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నప్పటికీ కుల వివక్షలో మాత్రం ముందుకు వెళ్లడం లేదన్నారు. ప్రణయ్ హత్యతో ఆ కుటుంబం కొడుకును కోల్పోవడంతో పాటు అమృత భర్తను ఆమె కడుపులో ఉన్న బిడ్డ తండ్రిని కోల్పోయిందన్నారు. ఇలాంటి హత్యలు చేయడం సరైంది కాదన్నారు. కుల రహిత సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం ప్రణయ్ హత్యపై ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. ఆమె వెంట మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు సుబ్బారావు, తెలంగాణా మట్టి మనుషుల వేదిక కన్వీనర్ వేనేపల్లి పాండురంగారావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, సాగర్, రాములు, సౌమ్య, శిరీష పలువరు నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రణయ్ డైరీలో ఏముంది?
మిర్యాలగూడ(నల్గొండ) : ‘‘అంకుల్ నేను మిస్టర్ ఫర్ఫెక్ట్.. మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే ఫర్ఫెక్ట్ లక్షణాలు ఏవి ఉండాలని కోరుకుంటున్నారో.. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి’’. అని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కు గురైన పెరుమాళ్ల ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రణయ్‌కి డైరీ రాసే అలవాటు ఉండడం వల్ల తాను అమృతను ప్రేమించిన విషయాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే విషయాలు రాసుకున్నట్లు తెలుస్తోంది. కులం, ఆస్తిపాస్తులు చూసి ప్రేమికులను విడదీయరాదని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే అని ప్రణయ్ డైరీలో రాసుకున్నాడు. మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లు ఉన్న వారిని రిజక్ట్ చేయాలని, చెడు అలవాట్లు ఉంటే ఆ అబ్బాయిని తిరస్కరించాలని కూడా డైరీలో రాసుకున్నట్లు తెలు స్తోంది. ఆస్తిపాస్తులు లేకున్నా మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని డైరీలో రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బేబీ పుట్టేలోపు ఉరితీయాలి: అమృత ప్రణయ్ భార్య ‘ఎస్పీ గారు నాకు బేబీ పుట్టే వరకు రక్షణ కల్పిస్తామని చెప్పారు’ అని ప్రణయ్ భార్య అమృత పేర్కొంటున్నారు. సోమవారం మిర్యాలగూడలోని ప్రణయ్ నివాసంలో ఆమె ‘సాక్షి’తో మా ట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రణయ్‌ని చంపిన వాళ్లు నా బిడ్డను కూడా చంపరని లేదు. బేబీ పుట్టే లోపు ప్రణయ్‌ని చంపినవాళ్లను ఉరి తీస్తే బెటర్. మేము పాఠశాల నుంచి ప్రేమించుకున్నాం. మా విషయాలు ఇంట్లో వారందరికి తెలుసు కానీ. మా డాడీ, బాబాయి ప్రణయ్‌ని బెది రించారు. నన్ను ఎన్నో పర్యాయాలు కొట్టారు. నన్ను చంపి సాగర్‌లో వేస్తామని కూడా చెప్పారు. ప్రణయ్‌ని హత్య చేసి న సమయంలో ఉన్న సీసీ ఫుటేజీని ధైర్యం లేక ఇప్పటివరకు చూడలేదు. ఈ రోజే సీసీ ఫుటేజీ చూశాను. ప్రణయ్‌ని కళ్లముందే చంపి వెళ్లారు. అలా నేను చూస్తానని అనుకోలేదు. మా డాడీ లాంటి సైకో లు చాలామంది ఉంటారు. 60 ఏళ్లు ఉన్న వారికి కూడా భర్త చనిపోతే కూడా ఎంతో బాధ ఉం టుంది. కానీ నాకు 21 ఏళ్లు. నాకు ఎంత బాధ ఉంటుందో..’’ అని కంట నీరు పెట్టుకున్నారు. -
ప్రణయ్‌కి అంకితమిస్తూ పాట!
మిర్యాలగూడ పరువు హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చే. ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం, అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అయితే ఈ పరువు హత్యపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాల్లోంచి మొదటి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌ను ప్రేమకోసం బలైన వారికి అంకితమిస్తున్నామని, తాజాగా జరిగిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌కు ఈ పాటను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఇంకేం పరువు?
-
ప్రణయ్ హత్యకేసు దర్యాప్తు కొలిక్కి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు ఈ హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుతో సబంధం ఉన్న దాదాపు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ప్రధాన నింది తుడిగా భావిస్తున్న మారుతీరావు పోలీసులకు చిక్కడంతో ఈ కేసులో చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోయాయని చెబుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు మృతుడి కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారని సమాచారం. ప్రణయ్ భార్య అమృత, కుటుంబ సభ్యులు పలువురిపై ఆరోపణలు చేశారు. దీంతో అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఆదివారం రాత్రి పొద్దుపోయే దాకా పోలీస్ అధికారులు ప్రణయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలిసింది. మారుతీరావుకు సన్నిహితుడిగా భావిస్తున్న సూర్యాపేటకు చెందిన ఓ న్యాయవాది, తాజా మాజీ ఎమ్మెల్యే పేర్లను అమృత పదేపదే ప్రస్తావించిన అంశాన్ని పోలీసులు సీరియస్‌గానే తీసుకున్నారు. మరోవైపు ఆమె తన తండ్రికి నయీం ముఠాతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం సంచలనం రేపింది. వీటన్నిటికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. హత్యకు పాల్పడింది బిహారీ! ప్రణయ్‌ను అంతమొందించేందుకు మారుతీరావు, మాజీ ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బారీ తన సహచరులను కాకుండా హైదరాబాద్‌లో ఉంటున్న ఒక బిహారీ వ్యక్తిని ఈ ఆపరేషన్‌కు వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. నేడు మీడియా ముందుకు నిందితులు ప్రణయ్ హత్య కేసు వివరాలతో మంగళవారం మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎస్పీ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించ నున్నారు. -
ప్రేమిస్తే చంపేస్తారా!.. ప్రతిధ్వనిస్తున్న ఆర్తనాదం!
‘ప్రేమిస్తే చంపేస్తారా!’ అంటూ ఒక యువతి చేసిన ఆర్తనాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... తెలుగువారున్న ప్రతి గడ్డపైనా ప్రతిధ్వనిస్తోంది. కొన్ని ఉదంతాలు మనం రోజూ చూస్తున్న సమాజంపై అపనమ్మకమూ, అవిశ్వాసమూ కలిగిస్తాయి. ఈ సమాజంలో ఇంత క్రౌర్యం, ఇంత రాక్షసం దాగున్నాయా అన్న దిగ్భ్రాంతిలో ముంచెత్తుతాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం పట్టపగలు చోటుచేసుకున్న దురంతం అటువంటిదే. ఒక్కగానొక్క కుమార్తెను ఎంతో అపురూపంగా చూసుకుని, ఆమె ఇష్టాయిష్టాలను అర్ధం చేసుకుని నెరవేర్చవలసిన కన్నతండ్రే కాలయముడిగా మారి ఆమె మనువాడినవాడిని మట్టుబెట్టిన ఉదంతమది. పట్టణంలో బాగా డబ్బు చేసిన రియల్ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు తన కుమార్తె అమృతవర్షిణితో ఆప్యాయత నటిస్తూనే అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకుడితో తుదముట్టించిన తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కంటతడి పెట్టించింది. పుట్టుకనుబట్టి ఎవరిపైనా వివక్ష చూపరాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ మన సమాజంలో అడుగడుగునా అది తారసపడుతూనే ఉంటుంది. కులాంతర వివాహాలు జరిగే సందర్భాల్లో అది మరింత వెర్రితలలు వేస్తోంది. ముఖ్యంగా అట్టడుగు కులాలకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇవి కులం పేరుతో, సంస్కృతి పేరుతో, వాటిని పరిరక్షించే సాకుతో సాగుతున్న హత్యలే అయినా వీటిని పరువు హత్యలనలేం. ఇవి ప్రపంచంలో మన సమాజం పరువు తీస్తున్న హత్యలు. వీటి మూలాలు నర నరానా ఆవరించిన కులోన్మాదంలో, ఆధిపత్య భావజాలంలో ఉన్నాయి. ఏటా వందలమంది బలవు తున్నా వీటిని నియంత్రించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. 2014–16 మధ్య ఈ మాదిరి హత్యలకు దేశంలో 356మంది ప్రాణాలు కోల్పోయారని మొన్న జూలైలో లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం చెప్పారు. ఈ జాబితాలోకి రాకుండా మరెం దరు బలయ్యారో ఊహించుకోవాల్సిందే. ఒకప్పుడు ఎక్కడో బిహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల్లో ఇవి జరిగాయని విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. వేరే కులానికి చెందినవాడిని పెళ్లాడిందన్న కక్షతో సొంత కూతుర్నే చంపుకుంటారా, అల్లుడిని హతమారు స్తారా అని విస్మయపడేవారు. ఇప్పుడు అవి అన్నిచోట్లా సాగుతూనే ఉన్నాయి. కనుకనే ప్రణయ్, అమృతలు వివాహం చేసుకున్నాక తమను ఆశ్రయించినప్పుడు పోలీసులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సింది. నల్లగొండ జిల్లా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఇలా ప్రేమ జంటల్ని ఇబ్బందులపాలు చేసిన ఉదంతాలు, హతమార్చిన ఉదంతాలు ఉన్నాయి. నయీం గ్యాంగ్‌తో మారుతీరావు బెదిరించాడని, ఒక ఎమ్మెల్యే ఫోన్‌చేసి ఆమెను తిరిగి తండ్రి దగ్గరకు పంపిం చకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడని కుటుంబసభ్యులు చెబు తున్నారు. కౌన్సెలింగ్ పేరిట రప్పించి కొంతమంది పోలీసు అధికారులే వేరుపడమని సలహా ఇచ్చే వారని వారి ఆరోపణ. తమకెలాంటి ముప్పు పొంచి ఉందో ప్రణయ్, అమృత జంటకు తెలుసు. దీనిపై తమ మధ్య ఎలాంటి సంభాషణ జరిగేదో అమృత వేర్వేరు చానెళ్లతో మాట్లాడిన సందర్భంలో వివరించింది. ఆఖరికి ఇక్క డినుంచి దూరంగా వెళ్లిపోవాలని కొందరు సలహా ఇచ్చినా అందువల్ల తమ కుటుంబసభ్యులు బలి కావాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రణయ్ దానికి అంగీకరించలేదని కూడా తెలిపింది. బహుశా ఈ విషయాలన్నీ వారు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చే ఉంటారు. వారు చెప్పకపో యినా నిరంతరం శాంతిభద్రతల వ్యవహారాల్లో తలమునకలయ్యేవారిగా ఆ అధికారులకు అర్ధమై ఉండాలి. వారికి వ్యక్తిగత భద్రత కల్పించాలి. కానీ ఆ పని జరగలేదు. పర్యవసానంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ జంట నిర్మించుకున్న అందమైన గూడు కూలిపోయింది. కొన్నేళ్లక్రితం సుప్రీంకోర్టే ఈ మాదిరి హత్యల విషయంలో కఠినంగా వ్యవహరించి, దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని తెలిపింది. కానీ పట్టించు కున్నవారేరి? అమృతవర్షిణి మాటలు ఆమె పరిణతిని పట్టిచూపుతున్నాయి. తోటి మనిషిని కుల చట్రంలో తప్ప చూడలేనివారు మనుషులెలా అవుతారని ప్రశ్నిస్తోంది. కోట్ల రూపాయల ఆస్తుల కన్నా మాన వీయ విలువలు ముఖ్యం కదా అంటున్నది. మెట్టినింటే ఉండి ప్రణయ్ ఆశయమైన కుల నిర్మూలనకు పాటు పడతానని ఆమె చెబుతోంది. రెండేళ్లక్రితం తమిళనాడులో సంచలనం రేపిన శంకర్ హత్యో దంతం ఈ సందర్భంలో ఎవరికైనా గుర్తుకురాకమానదు. తమిళనాడులోని ఉడుమల్పేట్ పట్టణంలో శంకర్‌ను తన తండ్రి కిరాయి ముఠాతో చంపించాక కౌసల్య అనే యువతి ఇదే తరహాలో పోరాడింది. ఆ హత్య కేసులో తండ్రితోసహా ఆరుగురికి మరణశిక్ష పడేలా చూడటమే కాదు... నిర్దోషిగా విడు దలైన తల్లికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, ఆమెకు సైతం శిక్ష పడాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లింది. విచారణ సమయంలో ఒకటి రెండుసార్లు తండ్రికి పెరోల్ అవకాశం లభించినా గట్టిగా వ్యతి రేకించి అది అమలు కాకుండా అడ్డుకుంది. కూలి పనిచేసుకుని పొట్టపోసుకునే శంకర్ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ పెరియార్ రామస్వామి స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం జరిగే ఉద్యమాల్లో పాలు పంచుకుంటోంది. ఇప్పుడు ఈ హత్యోదంతాన్ని లోతుగా దర్యాప్తు చేస్తామని, దోషులను వదిలిపెట్టబోమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మారుతీరావు ఆస్తులు పోగేసుకున్న వైనంపైనా దర్యాప్తు ఉంటుందంటున్నారు. ప్రణయ్ హత్య జరిగేవరకూ అతని అక్రమాలు పోలీసు, రెవెన్యూ యంత్రాం గాల దృష్టికి రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చర్య సంగతలా ఉంచి ఆ అక్రమాల సంగతి తెలిసి ఉంటే ఆయనెంతకు తెగించగలడో పోలీసులకు అర్ధమయ్యేది. ప్రణయ్, అమృత జంట క్షేమంగా ఉండగలిగేది. కనీసం దీన్నయినా గుణపాఠంగా తీసుకుని, అప్రమత్తతతో వ్యవహరించి కులోన్మాదా నికి మరే ప్రేమ జంటా బలి కాకుండా చూడటం ప్రభుత్వం కర్తవ్యం. -
ఫేస్బుక్ వేదికగా అమృత పోరాటం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి న్యాయం కోసం తన పోరాటాన్ని ప్రారంభించింది. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని.. ముఖ్యంగా ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే అమృత ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది. పురువు, కుల పిచ్చితో ప్రణయ్‌ను చంపిన అమృత తండ్రి మారుతీరావును, హత్యకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్, సుఫారీ కిల్లర్స్‌తో పాటు హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రణయ్ విగ్రహం: కేటీఆర్ అనుమతి ఇవ్వాలి!
వరంగల్ అర్బన్ : మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఆపధర్మ మంత్రి కేటీఆర్ అనుమతివ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రణయ్ కేసులో రాజకీయ, ఆర్థిక అండదండలతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి ఉందని, ఈ కేసును హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులకు నిజంగా శిక్ష పడాలనే ఆలోచన ఉంటే.. ట్విటర్ ద్వారా స్పందించండం కాదు.. ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిందితులను సస్పెండ్ చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు మారుతి రావు అన్ని పార్టీలను గుప్పిట్లో పెట్టుకున్నాడని విమర్శించారు. ప్రణయ్, అమృతలకు ప్రమాదం ఉందని తెలిసినా.. పోలీసులు కాపాడేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మారుతి రావు సెటిల్మెంట్లతో అక్రమాస్తులు కూడగట్టుకున్నాడన్నది అందరికీ తెలుసనని, అధికారుల అండదండలు చూసుకునే అతను ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. హత్యకు గంట ముందు మారుతిరావు వేములపల్లి కట్టమీద డీఎస్పీతో పదిహేను నిమిషాలు మాట్లాడడని అన్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితులందరికీ శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన వైఖరిని తెలుపాలని కోరారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు గ్రామ మండల స్థాయిలో ఉదయం నిరసనలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ప్రణయ్ కేసు: కాంగ్రెస్ నేతను సస్పెండ్ చేస్తున్నాం!
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత జానారెడ్డి ప్రణయ్ ఇంటికి వచ్చి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రణయ్ భార్య అమృతవర్షిణితో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్యలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ కరీంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రణయ్‌ను హత్య చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇలాంటి హత్యలు అత్యంత ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ప్రణయ్ భార్య అమృతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విమలక్క పరామర్శ ప్రణయ్ భార్య అమృతను, అతని తల్లిదండ్రులను ప్రముఖ ప్రజా గాయకురాలు విమలక్క సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులం కంటే గుణం గొప్పదన్నారు. ప్రణయ్ హత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేనినైనా శాంతితో జయించాలి తప్ప ద్వేషంతో కాదని హితవు పలికారు. ప్రణయ్ కుటుంబానికి సమాజం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రేమికులను విడదీసి చంపే హక్కు ఎవరికి లేదన్నారు. -
ప్రణయ్ హత్య వెనుక మాజీ ఉగ్రవాది
-
ప్రణయ్ ప్రతిరూపంగా పెంచుకుంటా!
మిర్యాలగూడ: ‘ప్రణయ్ హత్యలో ఎంత మంది ఉన్నారో, వారిని దారుణంగా చంపాలి. వాళ్లను ఉరి తీయొద్దు.. అతి దారుణంగా చంపితేనే అది చూసి ఎవరు ఇలాంటి హత్యలు చేయకుండా ఉంటారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా భావిస్తున్నా’అని అమృత పేర్కొంది. మిర్యాలగూడలో సంచలనం రేపిన పరువు హత్యకు సంబంధించి ప్రణయ్ భార్య అమృత సంచలన విషయాలు వెల్లడించింది. కొందరు నాయకుల పేర్లను బయటపెట్టింది. ఆదివారం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆమె ప్రణయ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ‘ప్రాణాలు తీస్తారని ప్రణయ్ భయపడేవాడు కాదు. నాకు నిత్యం తోడుగా ఉంటూ చాలా ధైర్యం చెప్పేవాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రణయ్ అంటే నాకు ఎంత ఇష్టమో అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. నేను వారి వద్దనే ఉంటా. నాకు పుట్టే బిడ్డను ప్రణయ్‌కి ప్రతిరూపంగా పెంచుకుంటా’ అని చెప్పింది. పరువు, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదని, వారిని ఎవరూ క్షమించరని, శిక్ష కఠినంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొంది. పలువురి పేర్లు వెల్లడి... ప్రణయ్ హత్యలో తన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ నేత, న్యాయ వాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారవేత్తలు రంగా శ్రీకర్, రంగా రంజిత్ ఉన్నట్లు అమృత వెల్లడించింది. ‘వివాహం చేసుకున్న తర్వాత వీరేశం నన్ను, ప్రణయ్‌ని పిలిపిస్తే వెళ్లలేదు. అంతకుముందు రోజు నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయాన్ని పత్రికల్లో చూసి వెళ్లలేదు. అందుకే కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి బాలస్వామిపై ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని కేసు పెట్టించారు. ఆయన ఎల్ఐసీ ఏజెంట్ కాకపోవడంతో మేము ఐజీ వద్దకు వెళ్లాం. ఆ తర్వాత ఎస్పీని కలసి పూర్తి వివరాలు చెప్పాం’ అని గతంలో జరిగిన విషయాలను తెలియజేసింది. బయట తిరిగితే ప్రజలే చంపుతారు ప్రణయ్ తమ్ముడు అజయ్ ‘నా అన్న ప్రణయ్‌ని చంపిన మారుతీరావు బయట తిరిగితే ప్రజలే చంపుతారు. ప్రణయ్ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తున్నాడు. ఇటీవల అమృతతో ఆమె తల్లి ఫోన్లో మాట్లాడేది. అలా నమ్మించి ప్రణయ్‌ని చంపారు. హత్యకు ముందురోజు వినాయచవితి నాడు నాతో ప్రణయ్ ఫోన్లో మాట్లాడాడు. ఇలా జరుగుతుందనుకోలేదు. అన్న, వదినలు అన్యోన్యంగా ఉండేవారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశాడు. నన్నూ చంపుతారు: ప్రణయ్ తండ్రి బాలస్వామి ‘నా కొడుకు ప్రణయ్‌ని చంపి తన కూతురిని తీసుకెళ్లాలనుకున్నాడు. అమృత అతని వద్దకు వెళ్లనంటోంది. మా వద్దనే ఉన్నా మంచిగా చూసుకుంటాం. కానీ ఆమెను తీసుకెళ్లడానికి నన్ను కూడా చంపుతాడు. మారుతీరావు, శ్రవణ్‌కుమార్‌లను శాశ్వతంగా మిర్యాలగూడ నుంచి బహిష్కరించాలి. నా కొడుకు అమృతను ప్రేమించిన నాటి నుంచే ఎన్నో సార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రణయ్ కళాశాలకు వెళ్లకుండానే పరీక్షలు రాశాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా వారిద్దరు మంచిగా ఉండేవారు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పేవాడు. వారి కోపం తగ్గిందని భావించాం. కానీ నమ్మించి ఇలా చంపుతాడనుకోలేదు’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. -
కన్నీటియాత్ర!
మిర్యాలగూడ: పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి మిర్యాలగూడ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల, కుల సంఘాల నాయకులు ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ మధ్యాహ్నం 2.40 గంటలకు ఇక్కడికి చేరుకున్నాడు. అనంతరం వినోభానగర్‌లోని నివాసం నుంచి 3.15 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర సాగుతున్నంత సేపూ ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత రోదిస్తూనే ఉన్నారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం.. 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావును ఉరితీయాలని అంతియయాత్రలో స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రణయ్ అంతిమయాత్రలో పాల్గొన్నగోరటి వెంకన్న, ఇతర ప్రజా సంఘాల నేతలు వదినను, తండ్రిని పట్టుకొని రోదిస్తున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు... ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాల్వాయి రజిని, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎల్లయ్య, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవర్ధన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనురాధ, తెలంగాణ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, విరసం నాయకురాలు ఉదయ కుమారి పాల్గొన్నారు. పలువురి పరామర్శ: ప్రణయ్ మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ రాములునాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు రామ్మూర్తి యాదవ్, చిరుమర్తి లింగయ్య, ఇండియన్ రైల్వే సర్వీసెస్ రిటైర్డ్ చీఫ్ జనరల్ భరత్ భూషణ్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మురళీమోహన్ ఉన్నారు. కఠినంగా శిక్షించాలి ప్రణయ్ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణయ్ మృతదేహాన్ని జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డితో కలసి సందర్శించి సంతాపం తెలిపారు. అనంతరం అమృత, ప్రణయ్ తల్లిదండ్రులను పరామర్శించి మాట్లాడారు. ఇంకా కులాల పేరుతో పరువు హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. -
ప్రణయ్ హత్య: ఎవరీ.. మహ్మద్ బారీ..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన కూతురు షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కసితోనే మిర్యాలగూడకు చెందిన రియల్టర్ తిరునగరు మారుతీరావు భారీ స్కెచ్ వేసి ప్రణయ్‌ను తుదముట్టించాడని తెలుస్తోంది. ఈ హత్య వెనుక మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీ హస్తం ఉన్నట్లు సమాచారం. రెండు రోజులుగా పోలీసులు పూర్తిగా ఈ కేసు విచారణ సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరి గిన తర్వాత సాయంత్రానికల్లా ప్రధాన నిందితుడు మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ దాదాపు సేకరించామని అధికారులు చెబుతున్నారు. ప్రణయ్, అమృతల వివాహం జరిగినప్పటి నుంచి వాళ్ల బంధాన్ని తెంచేందుకు మారుతీరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవి ఫలించకపోవడంతో ప్రణయ్‌ను మట్టుబెట్టాలని ఆలోచించి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. దీని కోసం రూ.కోటి వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదని, ఇంత భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని హత్యలు చేసే గ్యాంగ్‌లు తక్కువగానే ఉంటాయని, ఇందులో మరో కోణం దాగి ఉందన్న అంచనాతో విచారణ చేపట్టిన్నట్లు చెబుతున్నారు. మారుతీరావు చెప్పిన వివరాల తరువాత ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు స్టేషన్లలో పెట్టి విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎవరీ.. మహ్మద్ బారీ.. మారుతీరావు ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు హైదరాబాద్‌లో ఉంటూ నల్లగొండలో వ్యవహారాలు నడుపుతున్న మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మాజీ కానిస్టేబుల్ కొడుకైన బారీకి నేర చరిత్ర ఎక్కువగానే ఉందని పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో బారీ జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. నల్లగొండ పట్టణానికి చెందిన బారీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్‌ను ఈ హత్యలో వాడుకున్నాడని సమాచారం. 1998లోనే నల్లగొండ వన్‌టౌన్‌లో బారీపై రౌడీషీట్ తెరిచారు. బీజేపీ నేత గుండగోని మైసయ్య గౌడ్ హత్య కేసులో, మరో హత్య కేసులో, ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో బారీ నిందితుడు. అయిదారేళ్ల క్రితం ఓ భూ కబ్జా వివాదంలో బారీ మిర్యాలగూడకు రావడం, అందులో మారుతీరావు జోక్యం చేసుకుని సయోధ్య కుదర్చడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రణయ్ హత్యకు రూ.కోటి డిమాండ్ చేసిన బారీకి పెద్ద మొత్తంలోనే అడ్వాన్సు ముట్టజెప్పాడని తెలిసింది. హత్య చేయడానికి వచ్చిన వారికి మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మారుతీరావు దగ్గరి మిత్రుడు కరీం సహకరించి షెల్టర్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం కరీంను, మారుతీరావుతో సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీం ద్వారానే బారీకి డబ్బులు పంపించినట్లు అనుమానిస్తున్నారు. బారీతోపాటు రంగా రంజిత్, శ్రీకర్, షఫీ అనే యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. తుది దశకు విచారణ: ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రణయ్ హత్య కేసులో విచారణ తుది దశకు వచ్చింది. ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టం. కేసు పూర్వాపరాలను ఒకటీ రెండు రోజుల్లో బయటపెడతాం. విచారణ దశలో ఉన్న కేసులో ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేం. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు వారిని నమ్మించి దెబ్బకొట్టాడు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఇందులో నయీం గ్యాంగ్ హస్తం ఉందన్నది వాస్తవం కాదు. నయీమే లేడు ఇక గ్యాంగ్ ఎక్కడిది. ఇది పక్కా పరువు హత్య. సుపారీ గ్యాంగ్‌తో చేయించిన పని. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతాం. ఇంటి వద్దనే హత్య చేయడానికి రెక్కీ.. ప్రణయ్‌ని ఇంటి వద్దనే హత్య చేయడానికి నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 22న ఒకసారి ప్రణయ్ కారు వెనుకాల వచ్చి రెక్కీ నిర్వహించాడు. కారు అద్దెకు కావాలని ప్రణయ్ తండ్రి బాలస్వామిని అడిగిన నిందితుడు ఆ సమయంలో ప్రణయ్ ఉంటే హత్య చేయాలని వచ్చినట్లు సమాచారం. అలాగే మరోసారి ఇంటి ముందు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అయితే తనకు ప్రాణహాని ఉందని తెలిసిన ప్రణయ్ ఎప్పుడూ కారులో కూర్చున్న తరువాతే బయటికి వచ్చేవాడని, ఇలా ఇంటి వద్ద హత్య చేయడానికి అవకాశం రాకపోవడంతోనే ఆస్పత్రిని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత కరీం. (ఫైల్) -
ప్రణయ్ హత్య వెనుక పలువురు ప్రముఖులు!
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య వెనుక తన తండ్రి తిరునగరు మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌తో పాటు ఓ తాజా మాజీ ఎమ్మెల్యే, పలువురి ప్రముఖుల హస్తం ఉందని ఆయన భార్య అమృత అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య వెనుక టీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారస్తులు రంగా శ్రీకర్, రంగా రంజిత్ కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తమను విడగొట్టేందుకు వేముల వీరేశం, భరత్, గూడూరు శ్రీను గతంలో ప్రణయ్‌ను, తనను బెదిరించారని అమృత ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని గతంలో ప్రణయ్ నాన్నపై తప్పుడు కేసు పెట్టారని, ఈ విషయంలో తాము ఐజీ దగ్గరికి కూడా వెళ్లామని పేర్కొన్నారు. బిహార్ గ్యాంగ్‌తో తమను బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ప్రణయ్ హత్యలో ఎంతమంది ఉన్నారో, వారినీ దారుణంగా చంపాలని అమృత డిమాండ్ చేశారు. ఇక.. తనకు అత్తా,మామలే తల్లిదండ్రులని, వీళ్ల దగ్గరే ఉంటానని తెలిపారు. -
ప్రణయ్‌కి కన్నీటి వీడ్కోలు
సాక్షి, మిర్యాలగూడ : కుల అహంకారానికి బలైన పెరుమాళ్ల ప్రణయ్‌కి పట్టణ ప్రజలు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్ నుంచి ప్రణయ్ సోదరుడు అజయ్ వచ్చిన వెంటనే అంతిమయాత్ర ప్రారంభించారు. అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రణయ్ భార్య అమృత, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రణయ్ భౌతికకాయనికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. ప్రణయ్ భార్య అమృత, అతని కుటుంబం సభ్యులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని చూసి అమృత కన్నీరుమున్నీరుగా విలపించింది. మొన్నటి వరకు తనకు అండగా ఉన్న ప్రణయ్ ఇప్పడు విగతజీవిగా ఉండడాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి పెళ్లాడిన వాడు నూరేళ్లు అండగా ఉంటాడనుకున్న వాడి ఆయుష్షును తండ్రే తీయడంతో అమృత శోకసంద్రంలో మునిగిపోయింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ప్రణయ్ సోదరుడు అజయ్.. తన అన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. (చదవండి: జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు) అంతిమ యాత్రకు భారీ బందోబస్తు పరువు హత్యకు గురైన ప్రణయ్ అంతిమయాత్ర పోలీసుల భారీ బందోబస్తు నడుమ నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు జిల్లా కేంద్రం నుంచి భారీగా పోలీసు బలగాలను రప్పించారు. నల్లగొండ, మిర్యాలగూడ డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. చదవండి: ప్రణయ్ హత్యపై స్పందించిన కేటీఆర్