
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన వ్యక్తిని బిహార్‌లో అరెస్ట్ చేశారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు హత్య చేయించాడు. ఈ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉండగా బారీ తన గురువు అస్గర్ అలీతో ప్లాన్ చేసి బిహార్‌లోని సంస్థాన్ పూర్ జిల్లాకు చెందిన శర్మను ఈ ఆపరేషన్‌కు వినియోగించాడు. బిహార్‌లో అదుపులోకి తీసుకున్న శర్మను పోలీసులు నల్గొండ తరలిస్తున్నారు.
హత్య జరిగిన రోజు శర్మతో పాటే అస్గర్ ఆసుపత్రికి వచ్చినట్టుతెలుస్తోంది. తన కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్గర్ డబ్బు కోసం ఈ డీల్ ఒప్పుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment