amrutha
-
మా అక్కను చూశాక పెళ్లంటేనే భయమేస్తోంది: నటి
మలయాళ నటి, సింగర్ అమృత సురేశ్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు కూడా పుట్టింది. కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత-బాలా విడిపోయారు. విడాకుల తర్వాత కూడా తనతో పాటు, కూతుర్ని వేధించాడని అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు బాలను అరెస్ట్ చేశారు. అదృష్టం కూడా ఉండాలితర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. అమృత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇదంతా చూశాక తనకు పెళ్లంటేనే భయమేస్తోందంటోంది అమృత సోదరి, నటి అభిరామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విడాకులే లేని పెళ్లి కావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ.. అందుకు అదృష్టం కూడా కలిసిరావాలి. పెళ్లి అంటేనే భయంపెళ్లికి నేను విరుద్ధం కాదు. కానీ మా అక్క పడ్డ కష్టాలు చూశాక వివాహమంటేనే భయమేస్తోంది. ఆ భయం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోను. ఏదో ఒకరోజు కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటాను. అయితే గుడ్డిగా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం కంటే ప్రమాదకరం మరొకటి లేదు. మా అక్క పెళ్లయినప్పటినుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా మా కుటుంబం బాధ అనుభవిస్తూనే ఉంది' అని అభిరామి చెప్పుకొచ్చింది.చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ -
‘రివైండ్’లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్
‘‘ఒక మంచి కథతో ‘రివైండ్’ సినిమా చేశాం. కల్యాణ్‌గారు మంచి కథతో ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరో సాయిరోనక్ అన్నారు. కల్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘రివైండ్’. సాయి రోనక్, అమృతా చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సాయి రోనక్ మాట్లాడుతూ.. ‘ చిన్న టీం అయినా ఒక మంచి లైన్‌తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. ప్రేక్షకులు అందరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’అన్నారు. కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తీసిన ప్రేమకథా చిత్రమిది. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది’’ అని తెలిపారు. ‘‘నాకు, మా డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్.. మా అందరికీ ‘రివైండ్’ తొలి చిత్రం’’ అని అమృతా చౌదరి పేర్కొన్నారు. -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్‌కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న బృందా శివకుమార్‌కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్‌ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
Vikky The Rockstar: వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా..?
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విక్కీ ది రాక్ స్టార్’. సిఎస్ గంటా దర్శకత్వంలో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం.. వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా.. అమృతా’ అంటూ ఎమోషనల్‌గా సాగే ఈ ఫస్ట్ షేడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.‘ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేశాం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా..సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
లాస్య దివాళీ స్పెషల్ : అమృత ప్రణయ్ సందడి చూశారా!
Lasya Manjunath Diwali Special Song: నటి లాస్య మంజునాథ్ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను లాంచ్ చేసింది. ఈ వీడియోలో ముఖ్యంగా అమృత ప్రణయ్, లాస్యతో కలిసి అడుగులు కలపడం విశేషంగా నిలిచింది. ఇంకా గలాటా గీతూ, అలేఖ్య కలిసి ఈ అద్భుతమైన వీడియోలో సందడి చేశారు. నవంబరు 3న ఈ వీడియో పోస్ట్ చేయగా ఇప్పటికే 6 లక్షల వ్యూస్ దాటేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. లాస్య తనదైన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా, తొలిసారి అమృత ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది. పింక్ డ్రెస్‌లో ముచ్చటగా కనిపించింది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను అమృత కూడా పోస్ట్ చేసింది. -
జూలై 30న థియేటర్లలో 'పరిగెత్తు పరిగెత్తు'
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా 'పరిగెత్తు పరిగెత్తు'. ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 30న 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ.. ‘పరిగెత్తు పరిగెత్తు' మూవీని థియేటర్ రిలీజ్ కు తీసుకురావడం సంతోషంగా ఉంది. ఇటీవలే సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ రిపోర్ట్ చాలా బాగుంది. వాళ్ల అభినందనలతో సినిమా మీద మాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ ఉత్సాహంలో ఈ నెల 30 న థియేటర్లలో ''పరిగెత్తు పరిగెత్తు'' మూవీని విడుదల చేయబోతున్నాం. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి’అని అన్నారు. -
అమృతకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పనలో తెరకెక్కిన మర్డర్ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రణయ్ సతీమణి అమృత హైకోర్టులో కంట్మెంట్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం దర్శకుడు రాంగోపాల్, మర్డర్ సినిమా ప్రివ్యూ షో వేశారు. తన కథనే చిత్రంగా తీసి... కోర్టును తప్పుదోవపట్టించారంటున్నారని ఆమె ఫిటిషన్లో పేర్కొన్నారు. లంచ్ పిటిషన్‌ను విచారించాలని న్యాయస్థానాన్ని అమృత కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మర్డర్’ మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బుధవారం సినిమా విడుదలకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. -
నన్ను చంపినా బావుండేది..!
(వెబ్ స్పెషల్): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి. ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్‌మహల్ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా? హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి. చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే చావేనా? తమ పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రేమే నేరమా? తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో ప్రణయ్, మంథని మధుకర్, ఇజ్రాయిల్ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. తల్లిదండ్రులే దోషులా? ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి. -
వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'మర్డర్' సినిమా విడుదలను ఆపేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి:వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) కాగా నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ 'మర్డర్' సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్, పాటలు చూస్తేనే అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రణయ్ తండ్రి బాలస్వామి మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఆగస్టు 6 తేదీన అమృత నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రణయ్ హత్య కేసులో తీర్పు వచ్చేవరకు 'మర్డర్' చిత్రం విడుదల నిలిపివేయాలని తీర్పునిచ్చింది. (చదవండి: రామ్‌గోపాల్ వర్మకు షాక్..‘మర్డర్’కు బ్రేక్) -
వర్మకు షాక్..‘మర్డర్’కు బ్రేక్
ప్రముఖ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమాకు బ్రేక్ పడింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మర్డర్ సినిమా కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయ్యింది. (చదవండి : నటి ఇంట్లో విషాదం) కాగా,ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలయిన విషయం తెలిసిందే. దీనితో పాటు రెండు పాటలు కూడా విడుదల చేశారు. అందులో ఓ పాటను స్వయంగా వర్మనే పాడారు. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. -
మర్డర్: ఎవరినీ కించపర్చలేదన్న ఆర్జీవీ
సాక్షి, మిర్యాలగూడ: ఓ యదార్థ సంఘటన ఆధారంగా తీసిన కల్పిత చిత్రం "మర్డర్" రిలీజ్‌పై ఇంకా సందిగ్ధత నెలకొంది. సందచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ అమృతా ప్రణయ్ కోర్టుకెక్కారు. ఈ సినిమాలో తన పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గత నెల 29న ఆ సినిమా దర్శక, నిర్మాతలపై సూట్ ఫైల్ చేశారు. ఇప్పటికే భర్త ప్రణయ్ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో సినిమా చిత్రీకరించి తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. దీంతో ఈ సినిమాను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. (వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమైన అమృత) తన భర్త హత్య ఘటన ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారని శుక్రవారం జరిగిన నల్లగొండ జిల్లా కోర్టు విచారణలో అమృత మరోసారి తెలిపారు. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్జీవీ తాను ఎవరినీ కించపరిచేలా సినిమా తీయలేదని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నానని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. (వర్మకు కరోనా పాజిటివ్, ఆగిన ‘మర్డర్’!) -
అడ్డంగా దొరికిన వర్మ, ఆగిన ‘మర్డర్’!
సాక్షి, నల్గొండ: తనకు కరోనా సోకలేదని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ట్విటర్లో వీడియో షేర్ చేసిన రామ్‌గోపాల్ వర్మ కోర్టు వ్యవహారంతో అడ్డంగా దొరికిపోయారు. ఆయన రూపొందిస్తున్న‘మర్డర్ సినిమా’పై అమృతా ప్రణయ్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. మర్డర్ సినిమాకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని నల్గొండలోని ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, రామ్‌గోపాల్ వర్మకు కరోనా సోకినందున...అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ మరో రోజుకు వాయిదా వేయాలని విన్నవించారు. దీంతో ఆగస్టు 14కి కోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అమృత ఆరోపించారు. కరోనా సోకలేదని రామ్‌గోపాల్ వర్మ ట్విటర్లో ప్రకటించారని కోర్టుకు తెలిపారు. కోర్టు దృష్టికి వాస్తవాలు తీసుకెళ్తామని అమృత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. (‘మర్డర్’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..) In the wake of malicious rumours from some media outlets like one below, just wanted to clarify to whoever concerned that I am SUPER FIT https://t.co/xajKM11Z1w pic.twitter.com/FB2Q1gaTtN — Ram Gopal Varma (@RGVzoomin) August 9, 2020 -
‘మర్డర్’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..
సాక్షి, మిర్యాలగూడ: మర్డర్ సినిమా దర్శక, నిర్మాతలు ఈ నెల 6న నల్లగొండ జిల్లా కోర్టుకు హాజరుకానున్నట్లు ప్రణయ్ భార్య అమృత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కల్పిత సినిమా మర్డర్‌లో తన పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గత నెల 29న ఆ సినిమా దర్శక, నిర్మతలపై సూట్ ఫైల్ చేసింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు అందగా వారు కోర్టుకు హాజరుకానున్నారని పేర్కొంది. తన భర్త ప్రణయ్ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో సినిమా చిత్రీకరించి తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. సినిమాలో తమ పేర్లు, ఫొటోలను వాడుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. -
వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమైన అమృత
సాక్షి, నల్లగొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం... ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు దూరంగా ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు అమృత. (వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) అమృత పిటిషన్‌ను న్యాయస్థానం.. ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ చిత్ర దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఈమెయిల్, వాట్స్అప్ ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు. -
‘వర్మ శాడిజానికి ప్రతీక మర్డర్ సినిమా’
సాక్షి, హైదరాబాద్: అమృత, మారుతీరావులపై మర్డర్ సినిమా తీయటం రామ్‌గోపాల్‌వర్మ శాడిజానికి ప్రతీక అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు.. వారి సామాజిక వర్గాన్ని బజారున పడేయటం హేయమైన చర్య. మర్డర్ సినిమాపై మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్) మారుతీరావు సాధుజీవి, అటువంటి వ్యక్తిని మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరం. అమృత, మారుతీరావులను.. ఒకరు ప్రేమించి తప్పు చేయటం, మరొకరు హత్య చేయించడం ద్వారా ఇద్దరినీ విలన్లుగా సృష్టించటం వర్మ పబ్లిసిటీకి పరాకాష్ట. మర్డర్ సినిమా ద్వారా రెండు కుటుంబాలను వర్మ బజారున పడేస్తున్నారు. వర్మ మా డిమాండ్‌కు తలొగ్గకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు' అంటూ రామకృష్ణ హెచ్చరించారు. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..) -
ఐదు భాషల్లో ‘మర్డర్’ : ట్రైలర్ డేట్ ఫిక్స్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే పవర్ స్టార్ చిత్రం విడుదలకు రెడీగా ఉండగా.. మరో సినిమా విడుదలకు సిద్దమయ్యాడు. ఆర్జీవీ కొద్ది రోజుల కిందట మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ ‘మర్డర్’(కుటుంబ కథా చిత్రం అనేది ట్యాగ్ లైన్) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు కూడా విడుదల చేశారు.(ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ రిలీజ్) తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదిని ఆర్జీవీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. జూలై 28వ తేదీ ఉదయం 9.08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఐదు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.(ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..) కాగా, ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘మర్డర్’ సినిమాపై ఇప్పటికే ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. -
ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
-
ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..
సాక్షి, నల్గొండ: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమాపై పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. బాలస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడ వన్‌టౌన్ సిఐ సదా నాగరాజు రాంగోపాల్ వర్మతో పాటు, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.(ఏడుపు కూడా రావడం లేదు: అమృతా ప్రణయ్) ఈ క్రమంలో అనేక పరిణామాలు, జైలు శిక్ష అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో జూన్ 21 ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ..‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అంటూ వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.(ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్) -
ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్
హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం ‘మర్డర్’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు. తాజాగా మరో పోస్టర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అమృత తన కుమారుడిని ఎత్తుకుని ఉంది. అంతేకాకుండా అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన భావోద్వేగానికి ఫిదా అయ్యానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (యాంకర్ని పొగిడిన ఆర్జీవీ..) ఇక ఫాదర్స్ డే సందర్భంగా చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘ఓ తండ్రి తన కుమార్తెను ఎక్కువ ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను విడుదల చేస్తున్నాను’ అని ఆర్జీవీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ’ ‘అతి ప్రేమే అతి ద్వేషానికి కారణమవుతుందని, తీవ్ర హింసకు దారి తీస్తుంది’ అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..) Am overwhelmed with the emotional intensity portrayed by @AvanchaSahithi in this pic from MURDER #LoveCanMURDER pic.twitter.com/AZvhM4EyaC — Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2020 MURDER is “మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ" #LoveCanMURDER pic.twitter.com/NEfVZp6NRJ — Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020 MURDER is a story of extremes ..EXTREME LOVE resulting in EXTREME HATE and culminating in EXTREME VIOLENCE #LoveCanMURDER pic.twitter.com/7SN7fS9uUZ — Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020 -
అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..
సాక్షి, హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది వివాదాలు. ఎప్పుడు ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ మీడియాలో ఉండే వర్మ తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వర్మ జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందులో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేస్తూ.. 'ఓ తండ్రి తన కూతురుని అమితంగా ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇందులో చూపించబోతున్నా. ఫాదర్స్ డే రోజున ఒక విషాదభరితుడైన నాన్న పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నా' అంటూ వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై అమృతా ప్రణయ్ స్పందించినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ‘పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి దూరమయ్యాను. నా జీవితం తలకిందులైంది. నా వ్యక్తిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. నేను ఏంటనేది నాతో ఉన్న వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటన్నిటినీ భరిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతుంటే రామ్ గోపాల్ వర్మ రూపంలో నాకు మరో సమస్య ఎదురవుతోంది. దీనిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామనుకున్నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో సినిమా రూపంలో మరోసారి అందరి దృష్టి నాపై పడేలా చేస్తున్నావు. డబ్బు, పేరు కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఎన్నో బాధలను అనుభవించిన నాకు ఈ బాధ మరీ పెద్దది కాదు' అంటూ అమృత వ్యాఖ్యలు చేశారు. చదవండి: అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్ అయితే అమృత చేసిన వ్యాఖ్యలపై వర్మ తాజాగా స్పందిస్తూ.. మొదటగా నేను రిలీజ్ చేసిన పోస్టర్లో మర్డర్ ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్నది అని స్పష్టంగా చెప్పాను. కానీ నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. గతంలో కూడా నిజ జీవిత కథల ఆధారంగా నేను తీసిన ఎన్నో కథలను ప్రజలు ఆదరించారు. నేను కొందరిని మంచివారిగా.. మరికొందరిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిగా చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా మరెవరైనా సరే బాధ అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. నా చిత్తశుద్ధితో వారి బాధలను గౌరవిస్తూ.. మర్డర్ సినిమాలో వారు ఎదుర్కొన్న పరిస్థితులనే చూపిస్తున్నట్లు' వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వర్మ వరుసపెట్టి ట్వీట్స్ చేశారు. -
అమృత, మారుతిరావుపై సినిమా.. ఫస్ట్‌లుక్
ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషాదగాథకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ‘ఓ తండ్రి అమితమైన ప్రేమ.. ఓ తండ్రి తన కుమార్తె అమితంగా వల్ల కలిగే ప్రమాదం.. అమృత, మారుతిరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను’ అని వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మర్డర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ లైన్ ఉంచారు. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి నిర్మాతలుగా ఉండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. This is going to be a heart wrenching story based on the Amrutha and Maruthi Rao saga of the DANGERS of a father LOVING a daughter too much ..Launching the poster of a SAD FATHER’S film on HAPPY FATHER’S DAY #MURDERlove pic.twitter.com/t5Lwdz3zGZ — Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2020 -
యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత
సాక్షి, నల్గొండ : మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అమృత తండ్రి మారుతీరావు మరణం అనంతరం.. శనివారమే ఆమె తల్లి గిరిజను కలిశారు. ( పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత ) -
పోలీసుల రక్షణతో తల్లిని కలిసిన అమృత
సాక్షి, మిర్యాలగూడ : ఈనెల 8న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఆత్మహత్య చేసుకున్న తిరుగనరు మారుతీరావు కుమార్తె అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను పోలీసుల రక్షణ మధ్య ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించి అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసి కొంత సమయం ఆమెతో గడిపింది. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియల వద్ద అమృతకు చేదు అనుభవం.. తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత తండ్రి మృతదేహాన్ని చూడటానికి అంత్యక్రియల సమయంలో పోలీసుల భద్రత నడుమ శ్మశానవాటిక వద్దకు వచ్చిన అమృతను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అమృత గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పాటు తోపులాట జరిగింది. దాంతో తన తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగింది. అంత్యక్రియల అనంతరం అమృత బాబాయి శ్రవణ్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. (ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!) తల్లితో పది నిమిషాలు.. తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం నా లుగు రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో ప ట్టణంలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది. ('అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ') -
తల్లి గిరిజను కలిసిన అమృతా ప్రణయ్
సాక్షి, నల్లొండ : రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్ భార్య అమృత శనివారం సాయంత్రం ఆమె తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా) ఈ నేపథ్యంలో తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి పరామర్శించారు. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మారుతీరావు మరణం అనంతరం అమృత బాబాయ్ శ్రవణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రవణ్ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో ) -
సమాజానికి ‘అమృత’ సందేశం
తండ్రి ఆత్మహత్య నేపథ్యంలో, హత్యకు గురైన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు అని అమృత మన సమాజానికి ఇస్తున్న సందేశం శాశ్వత విలువ కలిగినది. తెలంగాణలోని మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే 24 ఏళ్ల దళిత యువకుడిని గర్భిణి అయిన భార్య సమక్షంలోనే 2018 సెప్టెంబర్ 24న నరికి చంపారు. అమృత ఆ పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యువతి. తన తండ్రి మారుతిరావును ధిక్కరించి మరీ ఆమె ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. అమృతకు ఇప్పుడు 25 ఏళ్లు. సంపన్నులైన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్, తదితర వ్యాపారాలతో భారీ ఆస్తులు కూడగట్టుకున్నారు. పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయనకు 200 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న సంపన్న పట్టణమైన మిర్యాలగూడ.. తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగే పట్టణాల్లో ఒకటి. ఈ పరిస్థితిని మారుతిరావు సంపదను కూడగట్టుకోవడానికి అనువుగా మల్చుకున్నారు. ప్రణయ్ హత్యకేసులో అమృత తండ్రితో పాటు మరి కొందరు జైలుకెళ్లారు. కొన్నినెలల క్రితమే వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. తన భర్త హత్య తర్వాత అమృత మిర్యాలగూడలో తన అత్త, మామలతోటే వారి సొంత ఇంటిలో కలిసి ఉంటోంది. భర్త హత్యకు గురైనప్పుడు ఆమె ఆరునెలల గర్భిణి. అమృత తన అత్తతో కలిసి వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలోనే ఆమె భర్తను నరికి చంపారు. న్యాయంకోసం చెరగని నిబద్ధత తర్వాత ఆమె బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడతడు సంవత్సరం బిడ్డ. ఈ సమయంలోనే 2020 మార్చి 6న మారుతిరావు నోట్ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నోట్లో తన కుమార్తె తన ఇంటికి తిరిగి వచ్చి తల్లితో కలిసి ఉండాలని కోరుకున్నారు. తన తండ్రి ఆత్మహత్య తర్వాత, న్యాయంకోసం అమృత నిబద్ధత పట్ల మీడియాలో వస్తున్న కథనాలు నిజంగానే సినిమా కథను తలపిస్తున్నాయి. మారుతిరావు పక్షాన కేసు వాదిస్తున్న లాయర్ చెప్పిందాని ప్రకారం, తన కుమార్తె అమృతను తిరిగి తనవద్దకు తెచ్చుకునేందుకు కన్నతండ్రి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ అమృత తన భర్త హత్యకు న్యాయం జరగాలనే తన వైఖరినుంచి అంగుళం కూడా పక్కకు జరగడానికి తిరస్కరించింది. తన తండ్రి, నిజమైన హంతకుడు బిహార్‌కి చెందిన శుభాష్ శర్మ, ప్రణయ్ హత్యకు సహకారం అందించిన ఆమె చిన్నాన్న శ్రవణ్‌లకు కఠిన శిక్ష పడాలని ఆమె కోరుకుంది. ప్రణయ్ హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలని ఆమె తండ్రి ఎంతగా ప్రయత్నించాడో అంతకంటే దృఢంగా మారిన అమృత తనను బెదిరిస్తున్నారని ఆరోపించి మరిన్ని కేసులను దాఖలు చేసింది. తన తండ్రి చనిపోయిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె వెళ్లలేదు కానీ పోలీసు రక్షణ మధ్య శ్మశానవాటికలో తండ్రి మృతదేహాన్ని చూసి రావాలని ప్రయత్నించింది. కానీ ఆమె బంధువులు ఆమెను తండ్రి శవాన్ని చూడటానికి అనుమతించలేదు. దాంతో ఆమె మౌనంగా పోలీసు వ్యాన్‌లో వెనక్కి వెళ్లిపోయింది. ప్రణయ్ హత్య తర్వాత తన బాధను అర్థం చేసుకుని తన పక్కన నిలబడిన తన దళిత అత్త, మామతోనే ఆమె ఉంటోంది. తండ్రి ఆత్మహత్య అనంతరం ఆ తర్వాత శ్మశాన వాటికలో ఆమె మీడియాతో చెప్పిన మూడు విషయాలు టీవీ తెరపై చూస్తున్న ప్రతి ఒక్కరినీ నివ్వెరపర్చాయి. ఆమె చెప్పిన మాటలివి. 1. ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 2. కుటుంబ సభ్యుల పేర్లతో, బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్కచేయను. నా తండ్రికి అనేక ఆస్తులున్నాయని నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు. 3. ప్రధాన నిందితుడైన తండ్రి మరణించాక అమ్మవద్దకు వెళతావా అని మీడియా అడిగినప్పుడు ఆమె ‘నేను ఇప్పుడు నా కుటుంబంతో, నా కుమారుడితో, నా అత్తమామలతోనే ఉంటున్నాను. అమ్మ కూడా నావద్దకు వస్తే మేం ఆమెను బాగా చూసుకుంటాం. అంతే కానీ మా నాన్న ఇంటికి మాత్రం వెళ్లను’ అని చెప్పింది. కులతత్వానికి బలైన కుటుంబం మరణించిన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ప్రణయ్ దళితుడు కాకపోయి ఉంటే ఆమె తండ్రి బహుశా అతడిని చంపించి ఉండకపోవచ్చు. ప్రణయ్ మరో కులానికి చెంది ఉంటే వారిని మారుతిరావు వదిలివేసి ఉండేవాడు. కానీ కులం చుట్టూ అంటుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. చివరకు మారుతిరావు భార్య కూడా నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మారుతిరావు తన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమించారని చెబుతున్నారు. తన కుమార్తెకు ఇవ్వడం కోసమే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. కాని తన కుమార్తె ఒక యువకుడిని ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతడిని దారుణంగా హత్య చేసే వరకు కన్నతండ్రి తెగించారు. కానీ ఆయన కన్నకుమార్తె ఈ సమాజానికి ఒక విభిన్నమైన నైతిక సందేశాన్ని పంపింది. తమపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను ప్రదర్శించడం అంటే ఆ పిల్లల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించే హక్కు తమకు ఉంటుందని కాదు. అంతకు మించి కుల వ్యవస్థ మనిషి జీవితాన్ని, ప్రేమను, మానవ విలువలను అస్సలు నిర్ణయించకూడదు. మారుతిరావు మానవ జీవి తానికి సంబంధించిన చెడు ఉదాహరణగా నిలిచారు కానీ ఆయన కుమార్తె తన యవ్వన జీవితంలోనే అత్యంత విభిన్నమైన దారిలో నడుస్తోంది. తన భర్తను కోల్పోయింది. ఆ బాధను అనుభవిస్తూనే బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రినుంచి ఒత్తిళ్లకు గురైంది. మీడియా డేగచూపులను ఎదుర్కొంటోంది. పోలీసు రక్షణలోనే జీవిస్తోంది. చివరకు కన్నతండ్రి ఆత్మహత్యను కూడా భరిస్తోంది. ఒక అగ్రకుల సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని ఇన్ని రకాల విషాదాలు, గాయాలు ఇంత చిన్న జీవితంలో వెంటాడుతూ వచ్చాయి. కలకాలం నిలిచే సందేశం కన్నతండ్రి ఆత్మహత్య తర్వాత మీడియా ఆమెను విభిన్నమైన ప్రశ్నలతో వెంటాడుతోంది. అమృత నుంచి ఆశ్చర్యకరమెన విషయాలను వినాలని టీవీలకు అంటుకుపోయి చూస్తున్న ప్రజలను ప్రశాంతంగా, స్థిరంగా కనిపించిన అమృత నిశ్చేష్టులను చేసింది. ఇంటర్వ్యూలలో ఆమె అత్యంత పరిణతిని, మానవీయమైన, కుల వ్యతిరేక సంస్కృతిని, నడతను ప్రదర్శించింది. భర్తను చంపించిన కన్నతండ్రే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ ఘటనల మొత్తంలో ఏ పాత్రా లేని, ఏమీ చేయని కన్నతల్లి వద్దకు ఇప్పుడు మీరు ఎందుకు వెళ్లడం లేదు అని ఒక మీడియా వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు అందరి మతిపోగొట్టింది. ‘‘నా కోసం నా అత్తమామలు వారి కొడుకును పోగొట్టుకున్నారు. నా జీవితంలోని అత్యంత కఠిన పరిస్థితుల్లో వారే నాకు నా బిడ్డకు తోడుగా ఉన్నారు. నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వారే. మా అమ్మ నన్ను ప్రేమిస్తున్న్టట్లయితే, ఆమే మా వద్దకు వచ్చి మాతో కలిసి జీవించాలి’’. తన భర్త హత్యకు గురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. ‘నా పోరాటం మొత్తంలో నా భర్త కుటుంబంలోనే మానవీయతను నేను చూశాను. మా నాన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో ఘోరమైన చర్యలు చేపట్టారు. కానీ నా కష్టకాలంలో నా కుటుంబం నాతో వ్యవహరించిన దానికంటే ఎంతో బాగా నా అత్తమామలు నన్ను చూసుకున్నారు. వారిది దిగువ మధ్యతరగతికి చెందిన దళిత కుటుంబం. మా నాన్న చాలా సంపన్నుడు, పైగా అధికార బలం ఉన్నవాడు. కానీ నా అత్తమామలు తన కుమారుడికోసం, అతడి మరణం తర్వాత నా కోసం దేన్నయినా కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడే నేను నిజమైన మానవీయతను చూశాను. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు’. భారతీయ సమాజానికి అమృత ఇస్తున్న ఈ సందేశం కలకాలం నిలిచివుంటుంది. వ్యాసకర్త: ప్రొ'' కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ