
సాక్షి, హైదరాబాద్ : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పనలో తెరకెక్కిన మర్డర్ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రణయ్ సతీమణి అమృత హైకోర్టులో కంట్మెంట్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం దర్శకుడు రాంగోపాల్, మర్డర్ సినిమా ప్రివ్యూ షో వేశారు. తన కథనే చిత్రంగా తీసి... కోర్టును తప్పుదోవపట్టించారంటున్నారని ఆమె ఫిటిషన్‌లో పేర్కొన్నారు. లంచ్ పిటిషన్‌ను విచారించాలని న్యాయస్థానాన్ని అమృత కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది.
రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మర్డర్’ మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బుధవారం సినిమా విడుదలకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment