ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ కాలేదు. ఈ మూవీపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు(జనవరి 22న) సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు పంపించింది. మూడు వారాల్లో సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా వ్యూహం సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 8న సెన్సార్ బోర్డ్.. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను న్యాయస్థానానికి అందజేసింది. అన్నింటిపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించమని సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment