
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు.
ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్‌లైన్‌లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్.. తన సంగీత కచేరిని వాయిదా వేస్తాడా? లేదా వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్..