Live Concert
-
లైవ్ కన్సర్ట్‌లో లవ్ ప్రపోజల్.. ఇలా ఉన్నారేంట్రా?
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తాజాగా కోల్‌కతాలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో తన మధురమైన వాయిస్‌తో పాటలు పాడి అలరించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో పెద్దఎత్తున అభిమానులు హాజరయ్యారు.అయితే లైవ్ కన్సర్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రేయా ఘోషల్ కచేరీ జరుగుతుండగా ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేసి తన ప్రియురాలికి సర్ప్రైజ్ ఇచ్చాడు. మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.అంతకుముందు అతను 'శ్రేయా ఘోషల్..యూ ఆర్ మై సెకండ్ లవ్' అనే ప్లకార్డును ప్రదర్శించాడు. ఇది చూసిన సింగర్ మ్యూజిక్ కాసేపు ఆపేసి నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటూ అతన్ని ప్రశ్నించింది. దీంతో అతను తన పక్కనే ఉన్నా అమ్మాయిని చూపిస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అందరిముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు.pic.twitter.com/hb7incZSLs— Oindrila💌 (@_pehlanasha_) October 20, 2024 -
లక్కీ అలి కన్సర్ట్.. సంగీతప్రియులూ.. రెడీయా?
ప్రముఖ సంగీతకారుడు లక్కీ అలీ హైదరాబాద్‌లో రేపు(మార్చి 4న) తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈయన పాడిన ‘ఓ సనమ్’, ‘ఏక్ పల్ కే జీనా’ ; ‘న తుమ్ జానో న హమ్’ సహా మరెన్నో పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్ధాయిగా నిలిచిపోయాయి. శనివారం నాడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద సంగీతాభివమానులను ఆలరించనున్నారు లక్కీ అలి. ‘‘నిరీక్షణ ముగిసింది ! ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న కన్సర్ట్ చివరకు హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఫెయిర్పార్క్) వద్ద జరుగనుంది. లక్కీ మెలోడియస్ ట్యూన్స్‌లో లీనం కావడానికి సిద్ధం కండి, హైదరాబాద్‌లో మరుపురాని రాత్రులను సొంతం చేసుకోండి’’అని ఈ కార్యక్రమ నిర్వాహకులు సౌండ్స్వర్త్ వెల్లడించారు. లక్కీ అలీ సంగీతాభిమానుల ఆరాధ్య గాయకులలో ఒకరు. యన 1996లో తన తొలి ఆల్బమ్ ‘సునో’ విడుదల చేశారు. అది ఇన్స్టెంట్ హిట్ కావడంతో పాటు పలు అవార్డులు ఆయన్ను వరించాయి. వీటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంటీవీ ఆసియా వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా ఉంది. ఆయన పాడిన పాటలలో చాలా వరకూ ఇప్పటికీ సంగీతాభిమానులకు ప్రీతిపాత్రంగా వెలుగొందుతున్నాయి. లక్కీ అలీ విడుదల చేసిన ఇతర ఆల్బమ్‌లలో సిఫార్, అక్స్, స్యుయీ వంటివి ఉన్నాయి. అవి కూడా అభిమానులు, విమర్శల ప్రశంసలు పొందాయి. -
మాస్ట్రో ఇళయరాజాకు ఘనంగా సన్మానం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో "ట్రిబ్యూట్ టు ఇళయరాజా " మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరగనున్న నేపథ్యంలో శనివారం "ట్రిబ్యూట్ టు ఇళయరాజా" ఈవెంట్ సాయంత్రం 6:30 నుంచి 10.00 గంటల వరకు రెడ్ కార్పెట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. అనంతరం ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినీదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరి రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు మురళీమోహన్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజా 80 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్‌తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా...వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రముఖులు కొనియాడారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది!
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనాలను హెచ్‌సీయూ బస్ డిపో వద్ద ఎస్ఎంఆర్ వినయ్సిటీ, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్‌బండ, హెచ్‌సీయూ బస్ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గోపీచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్‌పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వెళ్లాలన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా.. -
పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్
-
పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్
Veteran Singer Edava Basheer Dies At 78 During Music Live Concert: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బషీర్. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానే హో తుమ్ అనే హిందీ సాంగ్‌ను ఆలపిస్తుండంగా ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు బషీర్. ఈ సంఘటన శనివారం (మే 28) రాత్రి 9:30 గంటలకు జరిగింది. 78 ఏళ్ల ఎడవ బషీర్ 'గాన మేళా'తో ఎంతో పాపులర్ అయ్యారు. తిరువనంతపురం జిల్లాలోని వర్కాలకు సమీపంలో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో బషీర్ జన్మించారు. స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ 'గానభూషణం' అభ్యసించారు. అనంతరం 1972లో కొల్లంలో 'సంగీతాలయ' గాన మేళాన్ని స్థాపించారు. అంతేకాకుండా రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు. చదవండి: 👇 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం Warning: Disturbing Content Singer dies during live performance. Malayalam singer #EdavaBasheer died after collapsing on the stage while singing. The 78-year-old was performing at the Golden jubilee of Blue Diamonds orchestra. pic.twitter.com/k6CCfhafjO — Bobins Abraham Vayalil (@BobinsAbraham) May 29, 2022 -
షారుఖ్ పాట.. ఆపమన్న బేటా
కరోనా పోరాటంలో మేము సైతం అంటూ ఫేస్బుక్ వేదికగా "ఐ ఫర్ ఇండియా" వర్చువల్ కన్సర్ట్‌లో పాల్గొంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు జోయా అక్తర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే డబ్బును కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు గివ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ లిస్టులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే షారుఖ్ లైవ్ కన్సర్ట్‌లో పాల్గొంటున్న సమయంలో ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. షారుక్ పాట అందుకున్న కాసేపటికే కొడుకు అబ్రామ్ ఖాన్ చేరాడు. ఇంకేముందీ.. తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) ఈ పాట మొత్తం కూడా లాక్డౌన్లో ఏం జరుగుతుందో వివరిస్తూ సాగుతుంది. ఇక సాంగ్ పూర్తవగానే అబ్రామ్ను గట్టిగా హత్తుకుని లాలనగా ముద్దు పెట్టుకుంటాడు. అనంతరం మరో పాట పాడతానని రెడీ అవుతుండగా ఆ బుడ్డోడు వచ్చి పప్పా, ఇక చాలు ఆపుతావా.. అని చెప్పాడు. దీంతో ఎందుకొచ్చిన తంటాలే అని హీరో సైతం తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను షారుఖ్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హీరో "అంతా బాగవుతుంది.." అని చెప్పిన వ్యాఖ్యలు నిజమవుతాయంటూ ఆయన అభిమానులు ఆశాభావంతో కామెంట్లు చేస్తున్నారు. నిజానికైతే సైనీ రాజ్ రచించిన ఈ పాటను మనీ హేస్ట్ అద్భుతంగా ఆలపించాడు. దీనికి ర్యాపర్ బాద్షా సంగీతం రూపొందించాడు. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మూడున్నర కోట్లకు పైగా విరాళాలను సేకరించారు. (అడ్డు తప్పుకోండి: అబ్రామ్ అసహనం!) -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఫణినారాయణ వీణా మహా స్రవంతి
డాల్లస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఫణి నారాయణ వీణా వడలి ‘‘ శ్రీ ఫణి నారాయణ వీణా మహతీ స్రవంతి’’ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. సెయింట్ మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీలో సెప్టెంబర్ 14న ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులు ఫణి నారాయణ, విద్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్ని, చినసత్యం వీర్నపు తదితర టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం ఆలపించిన కృష్ణాష్టకం ప్రారంభ గీతం అందరినీ ఆకట్టుకుంది. గాయిని సాయితన్మయ అద్భుతమైన ప్రతిభతో మరికొన్ని శాస్త్రీయ గీతాలు పాడి అందరి మన్ననలు పొందారు. అనంతరం ఫణినారాయణ వీణా ప్రస్థానం వీనుల విందుగా సాగింది. ఆయన వీణపై వాయించిన ‘‘ వటపత్ర సాయికి వరహాల లాలి’’ ‘‘కథగా కల్పనగా కనిపించెను నాకొక యువరాణి’’ ‘‘పరువం వానగా’’ ‘‘సుభలేఖ రాసుకున్న’’ ‘‘తకిట తకిట తందాన’’ ‘‘ సామజ వరగమన’’ ‘‘ ఈగాలి ఈనేల’’ వంటి పాటలు అందరినీ తన్మయత్వానికి గురిచేశాయి. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహేశ్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుదుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం, కళ్యాణి తాడిమేటిలు ముఖ్య అతిధులు ఫణినారాయణ వీణా వడలి, విధ్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్నిలను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. ఫణినారాయణ టాంటెక్స్ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన రఘురాం బుర్ర, బాల గునపవరపు, జయ కళ్యాణి, పూజిత కడిమిశెట్టిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, మన టీవీ, టీఎన్ఐ, ఫన్ ఏషియా, దేసీప్లాజ, తెలుగు టైమ్స్, ఐఏసియాలకు, సెయింట్. మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నల గడ్డ, డా. తోటకూరి ప్రసాద్, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇళయరాజాకు ఏమైంది? వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. మైధోహక్కులపై గత కొంతకాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఇళయ రాజా సెక్యూరిటీ గార్డ్‌పై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే అక్కడున్న ఆడియన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇళయరాజా 76వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల(జూన్ 2) చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గానగంధర్వులు సుబ్రహ్మాణ్యం, జేసుదాసు, ఇతర ప్రముఖ గాయనీగాయకులు కూడా హాజరయ్యారు. ఈవీపీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన మ్యూజికల్ కన్సర్ట్‌లో ఇద్దరు లెజెండ్స్ (బాలు, ఇళయరాజా) ఒకే వేదిక ద్వారా ప్రేక్షకులను అలరించడం మరపురానిదిగా పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ స్టేజ్‌పై ఉన్న గాయకులకు మంచి నీళ్ళ సీసాలు ఇవ్వడానికి వెళ్లాడు. ఇదే ఇళయ రాజాకు కోపం తెప్పించింది. అనుమతి లేకుండా నువ్వు స్టేజ్‌పైకి వచ్చి ఎందుకు కార్యక్రమాన్ని నాశనం చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఫలించకపోవడంతో చివరకు ఇళయరాజాకి క్షమాపణలు చెప్పి కాళ్ళు మొక్కి వెళ్లిపోయారు. అయినా తన అసహనాన్ని కొనసాగించిన ఇళయరాజా ఆడియన్స్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారితోపాటు, వీడియోను వీక్షించిన నెటిజన్లు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. మరోవైపు సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నారు. செக்யூரிட்டு இளையராஜா கால்ல விழுந்தாரே அந்த வீடியோ இருக்கா ப்ரோ — sakthi (@imsakthi1) June 2, 2019 -
ట్యూన్ టోన్ కలిసెన్
కొన్ని కాంబినేషన్లు భలే కుదురుతాయి. అందులో ఎవర్గ్రీన్ కాంబినేషన్ అంటే ఇళయరాజా – యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకటి. రాజా కంపోజిషన్‌లో యస్పీబీ క్లాసిక్ సాంగ్స్ పాడారు. రాజా ట్యూన్, యస్పీబీ టోన్ అద్భుతః అనుకున్నారు ప్రేక్షకులు. అయితే ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్‌కు ఆ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నా పాటలను నా అనుమతి లేకుండా ఏ వేదిక మీద పాడినా నాకు రాయల్టీ ఇవ్వాలి’ అని ఇళయరాజా స్టేట్మెంట్ జారీ చేశారు. ‘రాజా పాటలు పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరు’ అని యస్పీబీ అన్నారు. ఈ వివాదం అలా సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించారట. చిన్న ఆలింగనంతో అలకలకు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ కలిసున్న ఫొటోలను యస్పీబీ తనయుడు యస్పీ చరణ్ షేర్ చేశారు. వచ్చే నెలలో ఇళయరాజా బర్త్‌డే (జూన్ 2) సందర్భంగా జరగబోయే లైవ్ కాన్సెర్ట్‌లో ఈ ఇద్దరూ కలసి పెర్ఫామ్ చేయబోతారని తెలిసింది. ఇది సంగీతప్రియులకు నిజంగా శుభవార్తే. -
'సైరా' మ్యూజిక్ డైరెక్టర్ లైవ్ కన్సర్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది నవంబర్ 24న తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జోనితా గాంధీ, దివ్యా కుమార్ తదితరులు పాల్గొనబోతున్నారు. సంగీత ప్రియులకు ఈ కార్యక్రమం వీనుల విందుగా ఉంటుందనడంలో సందేహం లేదని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. 'ఇంద్రధనుష్ - అమిత్ త్రివేది లైవ్ కాన్సర్ట్' అనే పేరుతో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనిషి తన జీవితంలో సంతోషం, బాధ, ప్రేమ ఇలాంటి ఎన్నో అనుభవాలను చవిచూస్తాడని, అలాంటి అనుభవాల కలయికనే ఇంద్రధనుస్సు అని సంబోధిస్తుంటారని అందుకే ఈ ప్రోగ్రామ్‌కు ఇంద్రధనుష్ అనే పేరుని పెట్టామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అమిత్ సౌండ్‌లో కొత్త టెక్నాలజీని అందరికీ పరిచయం చేయబోతున్నారు. థియేటర్స్‌లో మ్యూజిక్ కంపోజర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అమిత్ త్రివేది పలు జింగిల్స్, యాడ్ ఫిలింస్‌కు పనిచేశారు. 'ఆమిర్' చిత్రంతో 2008లో మ్యూజిక్ డైరెక్టర్‌గా అమిత్ త్రివేది ఎంట్రీ ఇచ్చారు. 'దేవ్ డి' చిత్రం కోసం అనురాగ్ కశ్యప్‌తో జత కట్టారు. ఈ చిత్రానికిగాను అమిత్ త్రివేదికి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఉడాన్, వేకప్ సిద్, మన్ మర్జియాన్ వంటి చిత్రాలకు ఈయన తన సంగీతాన్ని అందించారు. ఇండియన్ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్ చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇక అమిత్ త్రివేది తొలిసారి హైదరాబాద్‌కు రానుండటంతో ఘనస్వాగతం పలికేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఖేర్.. హుషార్..
-
సిటీ ఆఫ్ మ్యూజిక్
సిటీలో సంగీతం సాగరమై ఉప్పొంగుతోంది. వారంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ సరిగమల ఝరి వినిపిస్తూనే ఉంది. హైటెక్ సిటీలో పాశ్చాత్య రాకింగ్లతో పాటు ‘క్లాసికల్’ టచ్ కూడా మిళితమై ‘లైవ్ కన్సర్ట్’లు కళాభిమానులను ఆహ్లాదకర ప్రపంచంలో ఓలలాడిస్తున్నాయి. అందుకే దీన్ని ‘కేపిటల్ ఆఫ్ మ్యూజిక్’ అంటున్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు సెల్వగణేష్, పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్, అమెరికాకు చెందిన పెట్లాకెట్. శుక్రవారం మాదాపూర్ శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న ‘జల్సా- మ్యూజిక్ ఫర్ ది సోల్’లో పాల్గొనేందుకు వచ్చిన వీరిని ‘సిటీ ప్లస్’ పలుకరించింది... లైవ్ కన్సర్ట్‌లో పాల్గొనేందుకు ఈ సిటీకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ భారీ ఆదరణ లభిస్తోంది. గ్రామీ అవార్డు విన్నరైన మా నాన్న విక్కు వినాయక్రామ్ అభిమానులు నన్నూ ఆదరించడం కొండంత బలాన్నిస్తుంది. ఈసారి కొత్తగా ‘పండేరా’ డ్రమ్ తీసుకొచ్చా. తోలుతో కాకుండా డిఫరెంట్‌గా చేసిన దీనిపై మంచి సౌండ్ వస్తుంది. మ్యూజిక్‌ను ఇంతగా ప్రేమిస్తున్న ఈ సిటీకి హ్యాట్సాఫ్... అన్నారు కంజర విద్వాంసుడు సెల్వగణేష్. తొలి ప్రాధాన్యం... సంగీత కచేరీకి అంటే నా తొలి ఓటు హైదరాబాద్‌కే. మా పూర్వీకులు ఇక్కడ ఉండటం ఓ కారణమైతే, పీపుల్ మ్యూజిక్‌ను ఆస్వాదించే తీరు మరో కారణం. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. వారి కోసమే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. అందుకే ఏటా దాదాపు ఆరుసార్లు ఈ సిటీకి వస్తుంటా. ‘ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్స్’ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా సంగీత ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే పనిలో నిమగ్నమయ్యా. భావితరానికి మ్యూజిక్ విశిష్టతను తెలియజేస్తున్నా... అన్నారు దుర్గా జస్రాజ్. ఐ లవ్ ఇండియన్ మ్యూజిక్ భారత సంగీతమంటే నాకు ప్రాణం. వెస్ట్రన్ మ్యూజిక్ కంటే సరిగమపదనిసలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. హిందుస్థానీ సంగీతం సింప్లీ సూపర్బ్. గతంలో హైదరాబాద్‌కు వచ్చా. సంగీత కచేరీ కోసం మళ్లీ రావడం ఆనందంగా ఉంది. సంగీతానికి కేరాఫ్‌గా మారుతున్న సిటీని చూస్తే ముచ్చటేస్తుంది... అన్నారు అమెరికాకు చెందిన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ పెట్లాకెట్. - వాంకె శ్రీనివాస్