Veteran Malayali Singer Edava Basheer Dies At 78 During Music Live Concert - Sakshi
Sakshi News home page

Singer Edava Basheer Death: పాట పాడుతూ స్టేజ్‌పైనే కుప్పకూలిన సింగర్‌..

Published Sun, May 29 2022 8:36 PM | Last Updated on Mon, May 30 2022 9:06 AM

Veteran Singer Edava Basheer Dies At 78 During Music Live Concert - Sakshi

Veteran Singer Edava Basheer Dies At 78 During Music Live Concert: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్‌ కన్నుమూశారు. ఒక మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బషీర్‌. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్‌ ఆర్కెస్ట‍్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానే హో తుమ్‌ అనే హిందీ సాంగ్‌ను ఆలపిస్తుండంగా ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు బషీర్. ఈ సంఘటన శనివారం (మే 28) రాత్రి 9:30 గంటలకు జరిగింది. 

78 ఏళ్ల ఎడవ బషీర్‌ 'గాన మేళా'తో ఎంతో పాపులర్‌ అయ్యారు. తిరువనంతపురం జిల్లాలోని వర్కాలకు సమీపంలో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో బషీర్‌ జన్మించారు. స్వాతి తిరునాళ్‌ మ్యూజిక్‌ అకాడమీ నుంచి అకాడమిక్‌ డిగ్రీ 'గానభూషణం' అభ్యసించారు. అనంతరం 1972లో కొల్లంలో 'సంగీతాలయ' గాన మేళాన్ని స్థాపించారు. అంతేకాకుండా రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆల్‌ కేరళ మ్యూజిషియన్స్‌ అండ్‌ టెక్నిషియన్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్‌, ఉషుస్‌ సీత్తా ఉన్నారు.  

చదవండి: 👇
'సర్కారు వారి పాట'పై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌..
అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement