playback singer
-
జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొన్నాళ్లుగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ అనే పాటతో ఆయన పాపులర్ అయ్యారు. ఆ పాటకిగానూ ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. వడ్డేపల్లి శ్రీనివాస్ మృతిపై పలువురు సినీ, జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
Ayodhya Ram Mandir: గాయని చిత్రపై ట్రోలింగ్
తిరువనంతపురం: జాతీయ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయని కేఎస్ చిత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభ ఉత్సవాన్ని స్వాగతిస్తూ ఒక వీడియోను రెండు రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఇందుకు కారణం. ఈ నెల 22న ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రజలంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే రామమంత్రం జపించాలని, సాయంత్రం ఇళ్లల్లో ఐదు దీపాలు వెలిగించాలని చిత్ర పిలుపునిచ్చారు. ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ‘లోకస్సమస్త సుఖినోభవంతు’ అంటూ తన సందేశాన్ని ముగించారు. అయితే, ఈ వీడియో సందేశంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, దాన్ని ప్రచారం చేయడం, అయోధ్య రామమందిరానికి ప్రాచుర్యం కలి్పంచడం తప్పు అంటూ ఆక్షేపిస్తున్నారు. మరోవైపు చిత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. పారీ్టలకు అతీతంగా రాజకీయ నాయకులు, గాయనీ గాయకులు, రచయితలు, వివిధ వర్గాల ప్రజలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు చిత్రకు ఉందని తేలి్చచెప్పారు. ట్రోలింగ్ చేసేవారి పట్ల మండిపడుతున్నారు. చిత్రకు కేరళకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. చిత్ర ఇచి్చన సందేశాన్ని వివాదాస్పదం చేయొద్దని హితవు పలికారు. రాముడి పట్ల విశ్వాసం ఉన్నవారు ఆయనను పూజిస్తారని, అందులో తప్పేముందని చిత్రకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ సైతం చిత్రకు మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోతోందని ఆరోపించారు. -
ఒక్క పాటతో బాలీవుడ్లో ఫేమస్ అయిన షల్మాలీ
చిన్న వయసులోనే తల్లి నుంచి సంగీతం నేర్చుకుంది షల్మాలీ ఖోల్గాడే. ఆమె తల్లి ఉమా ఖోల్గాడే శాస్త్రీయ గాయని. ప్రసిద్ధ రంగస్థల కళాకారిణి. యూఎస్‌లో వోకల్ మ్యూజిక్ కోర్సు చేసిన షల్మాలీ బాలీవుడ్ సినిమా ‘ఇష్క్‌జాదే’లో పరేషాన్ పాటతో బాగా పాపులర్ అయింది. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకుంది. ‘గతంలో పోల్చితే చాలామంది గాయకులు తమ స్వరాలకు తామే పాట రాసుకుంటున్నారు. గొంతు ఇస్తున్నారు. ఆ పాటల్లో ఒక్క పాట హిట్ అయినా అవకాశాలు మన అడ్రస్ వెదుక్కుంటూ వస్తాయి. కోవిడ్‌కు ముందు కోవిడ్ తరువాత సంగీతాన్ని గురించి చెప్పుకోవాలంటే కోవిడ్ విరామంలో చాలామంది తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకున్నారు. View this post on Instagram A post shared by Shalmali Kholgade (@shalmiaow) ఆడియో వోటీటీకి ఆదరణ పెరగడం శుభపరిణామం. మ్యూజిక్ అంటే ఫిల్మ్ మ్యూజికే కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్కు కూడా మంచి ఆదరణ ఉంది’ అంటుంది షల్మాలీ ఖోల్గాడే. View this post on Instagram A post shared by Shalmali Kholgade (@shalmiaow) -
తిరుపతి ఐఐటీలో సందడి చేసిన సింగర్ నిఖితా (ఫొటోలు)
-
హైదరాబాద్‌తో నాది జన్మజన్మల అనుబంధం: వాణీ జయరాం
సుప్రసిద్ధ గాయని వాణీ జయరాం మరణంతో అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఐదు దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో వేలాది పాటలు ఆలపించిన ఆ గొంతు.. ఆగిపోయిందన్న విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ.. హైదరాబాద్‌తో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. వాణీ జయరాం అన్నయ్య హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేసేవాడు. ఆమె కూడా కోఠీలోని ఎస్బీఐ బ్యాంకులో పని చేశారు. వాణీ జయరాం పెళ్లి కూడా సికింద్రాబాద్‌లోనే జరిగింది. ‘నా మనసులో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే బాంబే వెళ్లాను. అయితే, పీబీ శ్రీనివాస్ పురస్కారం, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి సత్కారాలను హైదరాబాద్‌లోనే అందుకున్నాను’ అని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరాం చెప్పారు. -
మిస్టరీగా వాణీ జయరాం మరణం.. హత్య చేశారా?
ప్రముఖ గాయని వాణీ జయరాం(78) మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై తీవ్రగాయాలు ఉండడంతో అమెది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత ఆమె ఆపస్మారక స్థితిలో పడి చనిపోయారని భావించారు. కానీ ఆమె ముఖంపై ఉన్న గాయాలు, పని మనిషి చెబుతున్న వివరాలు చూస్తుంటే వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని.. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అసలేం జరిగింది? చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో నివాసం ఉంటున్న వాణీ జయరాం చనిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పని మనిషి చెబుతున్నారు. శనివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే ఇంట్లో పని చేసేందుకు పని మనిషి వాణీ జయరాం ఫ్లాట్‌కి వచ్చింది. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్ బెల్ కొట్టారు. అయినా తలుపులు తీయలేదు. దాంతో పనిమనిషి భర్త తన ఫోన్లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్ చేశాడు. అయినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. అయితే ఆమె ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు. పనిమనిషి చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులుగా ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నాన్నట్లు తెలుసోంది. ఆమె పేరుమీద ఏవైనా విలువైన ఆస్తులున్నాయా? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బాల్కనీ నుంచి ఏఆర్ రెహమాన్ స్టుడియో వరకూ
అంతరా నందికి పాడటం ఇష్టం. లాక్డౌన్లో ఇంటి బాల్కనీలో నిలబడి కచ్చేరీలు ఇచ్చి వాటిని రీల్స్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ సంగతి రెహమాన్ వరకూ వెళ్లింది. రెహమాన్ ఆమెతో కొన్ని జింగిల్స్ పాడించాడు. కాని ఆ గుర్తింపు కాదు ఆమె కోరుకున్నది. ఆఖరుకు అసలైన పిలుపు వచ్చింది. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో పాటలు రికార్డు చేయడం ద్వారా ఆమెకు అతి పెద్ద బ్రేక్ ఇచ్చాడు రెహమాన్. కళ పట్ల నిజమైన తపన ఉంటే చేరవలసిన గమ్యానికి చేరతామని అంటోంది అంతరా. ‘జల సఖినై నేనే నిలిచా నెలరాజా ఏలే ఏలేలో’... పొన్నియన్ సెల్వన్ – 1 (పి.ఎస్.1)లో ఈ పాట యూ ట్యూబ్‌లో వినండి ఆ గొంతులో స్వచ్ఛమైన నీటి ధార ఉన్నట్టుంటుంది. అంతరా నంది స్వరం అది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో పాడాలని ప్రతి గాయనికి ఉంటుంది. అందరికీ ఆ అవకాశం రాదు. మణిరత్నం సినిమాకు పాడాలని ప్రతి గాయనికి ఉంటుంది. అందరికీ ఆ అవకాశం రాదు. మణిరత్నం సినిమా కోసం ఏ.ఆర్. రెహమాన్ చేసిన పాటను పాడే అవకాశం రావడం? నిజంగా అదృష్టమే. అదృష్టం కంటే కూడా ప్రతిభకు ఒక పతకాన్ని ఇవ్వడం. ఆ పతకంతో ఇక లోకాన ఎక్కడైనా పాడొచ్చు. కాని ఇక్కడ వరకూ రావడానికి 23 ఏళ్ల అంతరా నందీ ఎవరినీ నమ్ముకోలేదు. తనను తాను తప్ప. పాటను కనిపెట్టి నాలుగేళ్ల వయసులోనే పాడటం మొదలెట్టింది అంతరా. వాళ్లది అస్సామ్. తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లు. కోలకటా షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు పూణెలో ఉన్నారు. కోల్కటాలో సంగీతంలో శిక్షణ ఇప్పించారు అంతరాకు. దాంతో 9 ఏళ్ల వయసులో ‘స రి గ మ ప... లిటిల్ చాంప్స్’లో పాడి టాప్ 3 స్థాయికి వచ్చింది. దాంతో పేరు వచ్చింది. సెలబ్రిటీ హోదా వచ్చింది. ఇక తనకు తిరుగులేదనుకుంది. టీనేజ్ సమస్య టీనేజ్ వచ్చేసరికి గొంతులో మార్పులొచ్చాయి. అంతరా పాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. పాట ఏ మాత్రం శ్రావ్యంగా ఉండేది కాదు. స్నేహితులు ఆమెతో ‘ఇక ఎప్పటికీ పాడకు... మీ అమ్మా నాన్నల్లా ఇంజనీరువికా’ అని కూడా చెప్పేశారు. కాని అంతరా వినలేదు. పట్టుదలగా మళ్లీ సాధన చేసింది. గొంతును అదుపులోకి తెచ్చుకుంది. తన పాట కోకిల పాట అని నిరూపించుకుంది. సోషల్ మీడియాతో మన దగ్గర ప్రతిభ ఉన్నంత మాత్రాన మన దగ్గరకు అవకాశం రావాలని లేదు. అంతరా దగ్గర మంచి గొంతు ఉన్నా అది లోకానికి తెలిసేది ఎలా? నాకు నేను చెప్పుకుంటాను అనుకుంది అంతరా. తన చెల్లెలు అంకితాతో కలిసి ‘నంది సిస్టర్స్’ పేరుతో రీల్స్ మొదలెట్టింది. ఇద్దరూ కలిసి మంచి మంచి సినిమా పాటలు పాడుతూ ఇన్‌స్టా ద్వారా లక్షలాది అభిమానులను పొందారు. కేవలం సోషల్ మీడియా ద్వారానే అంతరా ప్రతిభ ఏ.ఆర్. రెహమాన్‌కు చేరింది. ఆ సమయంలో యూ ట్యూబ్‌లో వస్తున్న ‘అరైవ్డ్’ అనే సింగింగ్ కాంపిటిషన్లో ఏఆర్ రెహమాన్ ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమె గొంతును మెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత అడపా దడపా ఏవైనా జింగిల్స్‌కు సినిమాతో సంబంధం లేని ప్రాజెక్ట్స్‌కు అంతరా చేత పాడించాడు. కాని ఆమె ఓర్పు, కష్టం వృథా కాలేదు. ఇన్నాళ్లకు పిఎస్–1లో మంచి హిట్ పాట ఇచ్చాడు. ‘మా అమ్మా నాన్నలు నా పాట విని కన్నీళ్లు కార్చారు’ అంటుంది అంతరా. ‘మీ దగ్గర ప్రతిభ ఉంటే సోషల్ మీడియా ద్వారా అరిచి చెప్పండి. సిగ్గు పడకండి. మరో మార్గం లేదు’ అంటుంది అంతరా. ఆమె మాట వింటే ఫలితం ఎలా ఉంటుందో ఆమే ఉదాహరణ. (క్లిక్ చేయండి: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!) -
'గర్భం దాల్చిన మూడ్నెళ్లకే అబార్షన్'...సింగర్ చిన్మయి ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. 2014లో నటుడు రాహుల్‌ని పెళ్లాడిన చిన్మయి ఇటీవలె ట్విన్స్‌కు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. 'నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో అంతా అయోమయ పరిస్థితి. ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని చెప్పింది. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ తర్వాత కొన్నిరోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది. తన సలహాతో నా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను' అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. -
బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సింగర్ హఠాన్మరణం
కోల్‌కతా: బాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీ సహా బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by KK (@kk_live_now) Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 -
పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్
-
పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్
Veteran Singer Edava Basheer Dies At 78 During Music Live Concert: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బషీర్. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానే హో తుమ్ అనే హిందీ సాంగ్‌ను ఆలపిస్తుండంగా ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు బషీర్. ఈ సంఘటన శనివారం (మే 28) రాత్రి 9:30 గంటలకు జరిగింది. 78 ఏళ్ల ఎడవ బషీర్ 'గాన మేళా'తో ఎంతో పాపులర్ అయ్యారు. తిరువనంతపురం జిల్లాలోని వర్కాలకు సమీపంలో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో బషీర్ జన్మించారు. స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ 'గానభూషణం' అభ్యసించారు. అనంతరం 1972లో కొల్లంలో 'సంగీతాలయ' గాన మేళాన్ని స్థాపించారు. అంతేకాకుండా రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు. చదవండి: 👇 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం Warning: Disturbing Content Singer dies during live performance. Malayalam singer #EdavaBasheer died after collapsing on the stage while singing. The 78-year-old was performing at the Golden jubilee of Blue Diamonds orchestra. pic.twitter.com/k6CCfhafjO — Bobins Abraham Vayalil (@BobinsAbraham) May 29, 2022 -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత
Singer Sangeetha Sajith Passes Away Due To Kidney Ailment: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సంగీత సాజిత్ ఇకలేరు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కేరళలోని తిరువనంతపురంలో ఉన్న తన సోదరి నివాసంలో ఆదివారం (మే 22) కన్నుమూశారు. 46 ఏళ్ల సంగీత తన సోదరి వద్ద చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సంగీత మరణించారు. ఆమె అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం తిరువనంతపురం థైకాడ్‌లోని శాంతికవాదం పబ్లిక్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంగీతం అభిమానులు ప్రార్థిస్తున్నారు. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు సంగీత. దక్షిణాది పరిశ్రమల చిత్రాలన్ని కలిపి సుమారు 200కి పైగా పాటలను ఆలపించారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'మిస్టర్ రోమియో'లోని తమిళ సాంగ్ 'తన్నీరై కథలిక్కుమ్'తో మంచి గుర్తింపు పొందారు. ఇటీవల మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియమ్'లోని 'తాళం పోయి తప్పూమ్ పోయి' సాంగ్ ప్రేక్షకాదరణ పొందింది. చదవండి: మదురై దంపతులకు షాక్ ఇచ్చిన ధనుష్.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’ అలాగే 'కక్కకుయిల్'లోని 'అలరే గోవిందా', 'పజ్జస్సి రాజాలో'ని 'ఓడతండిల్ తాళం కొట్టుమ్', 'రక్కిలిపట్టు'లోని 'ధుమ్ ధుమ్ దూరే' హిట్ సాధించాయి. ఇటీవల పృథ్వీరాజ్ నటించిన 'కురితి' మూవీలో థీమ్ సాంగ్ పాడారు. తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డుల వేడుకలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఎదుట 'జ్ఞానపజాతే పిజింత్' పాటను ఆలపించారు సంగీత. ఆ పాట ఎంతగానో ఆకట్టుకున్నందుకు ఆమె 10 గ్రాముల బంగారు హారాన్ని బహుమతిగా పొందినట్లు సమాచారం. చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
ఓడిన కోకిల.. ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే..
విజేతల గాథలు లోకానికి తెలుస్తాయి. విజేతలు కాలేకపోయిన వారి కథ తెర వెనుక ఉండిపోతుంది. సుమన్ కల్యాణ్‌పూర్‌ను ‘పేదవాళ్ల లతా మంగేష్కర్’ అనేవారు. ఆమె అచ్చు లతా లాగే పాడేది. లతతో సరిసాటి అనేవారు అభిమానులు. ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే’ ‘ఆజ్ కల్ తెరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’... ఎన్నో పాటలు. ఆమెను ఇండస్ట్రీ దగా చేసింది. ఆమె మాత్రం హుందాగా తనకు వచ్చిన పాటే పాడింది. ఈ సున్నితమైన గాయని జీవితాన్ని ఒక తలుచుకోవాల్సిన రోజు ఇది. ‘ఆమె అంత బాగా పాడేది. మరిఎందుకు ఎక్కువ పాటలు పాడలేదు?’ అని సుమన్ కల్యాణ్‌పూర్ గురించి అభిమానులు నేటికీ అనుకుంటారు. ఎందుకు పాడలేదు? ఎందుకు ఉద్యోగంలో రాణించలేదు? ఎందుకు ఫలానా రంగంలో పైకి ఎదగలేదు? అనంటే ఆ రంగానికి సంబంధించిన ఆట సరిగా ఆడకపోవడమే కారణం. ఆడేంత మొరటుదనం లేకపోవడమే కారణం. మనం గెలవాలంటే మనం ప్రయత్నించి గెలవడం ఒక మార్గం. ప్రత్యర్థులను లేకుండా చేసి గెలవడం ఒక మార్గం. పైకి ఎదగాలంటే సినిమా పరిశ్రమలో ఇవన్నీ చేయాలి. సుమన్ కల్యాణ్‌పూర్ కేవలం పాడగలిగేదే తప్ప ఇన్ని రాజకీయాలు చేసేది కాదు. అందుకే ఆమె తక్కువ పాడింది. కాని పాడిన ప్రతిదీ ఎంత తీయగా పాడింది? గుర్తుందా నౌషాద్ సంగీతంలో ముఖేశ్‌తో పాడిన ఈ డ్యూయెట్– మేరా ప్యార్ భీ తూహై ఏ బహార్ భీ తూహై తూహీ నజరోంమే జానే తమన్నా తూహీ నజారోమే... (సాథీ) సుమన్ కల్యాణ్‌పూర్‌ది మంగళూరు. తండ్రి బ్యాంక్ ఉద్యోగి కావడంతో ముంబై వచ్చి స్థిరపడింది. చిన్న వయసులోనే పెళ్లయ్యింది. భర్త రామానంద్ కల్యాణ్‌పూర్ ఆమెను పాడనిచ్చాడు కాని ప్రతి రికార్డింగ్‌కూ తోడు వచ్చేవాడు. లతా గొంతును చూసి ఇన్‌స్పయిర్ అయ్యింది సుమన్. కాని విశేషం ఏమిటంటే ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే ఉండేది. కొన్ని పాటలు వింటే లతా ఎక్కువ మార్దవం గా పాడుతోందా సుమన్ ఎక్కువ మార్దవంగా పాడుతోందా అర్థమయ్యేది కాదు. కొన్ని రికార్డు లు రేడియోలో ప్లే చేస్తూ ఒకరి పేరు మరొకరి పేరుగా చెప్పేంతగా కన్ఫ్యూజన్ ఉండేది. ‘బ్రహ్మచారి’ లో రఫీతో ఈ డ్యూయెట్ లతా పాడింది అనుకుంటారు. కాని సుమన్ పాడింది. ఆజ్ కల్ తెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ తుజ్ కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి... సుమన్ కల్యాణ్‌పూర్‌ను చాలా మంది నిర్మాతలు ఇష్టపడేవారు. దానికి కారణం ఆమె ‘పూర్‌మేన్స్ లతా’ కావడమే. అంటే లతా 10 వేలు తీసుకుంటే అలాగే పాడే సుమన్ మూడు నాలుగు వేలకు పాట పూర్తి చేసేది. ‘బాత్ ఏక్ రాత్ కీ’లో హేమంత్ కుమార్‌తో ఆమె ఎంత అందమైన పాట పాడింది. నా తుమ్ హమే జానో నా హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్ గయా... కాని లతా మంగేష్కర్, ఆశా భోంస్లే... వీరిద్దరికీ ఉండే శక్తి ముందు ఇతర గాయనులు ఒదిగి ఉండక తప్పేది కాదు. సంగీత దర్శకులు కూడా వీరిద్దరిని కాదని సుమన్‌కు పాట ఇవ్వాలంటే జంకే వారు. నిర్మాతలు భయపడేవారు. లతా మార్కెట్ సినిమాకు ప్లస్ అయ్యేది. దానిని వదులుకోలేక సుమన్‌ను వదులుకున్నారు. అయితే ఒక సందర్భం వచ్చింది. సినిమా పాటల రాయల్టీ ఆ పాటలు రిలీజయ్యి ఎన్నాళ్లయినా గాయనీ గాయకులకు ఇవ్వాల్సిందే అని లతా వాదనకు దిగింది. రఫీ ఆమెతో విభేదించాడు. పాటకు ఒకసారి డబ్బు తీసుకున్నాక ఆ తర్వాత దాని గురించి ఆలోచించకూడదు అని అతని వాదన. ‘అయితే నీతో నేను పాడను’ అని రఫీతో పాటడం మానేసింది లత. రఫీ అప్పుడు సుమన్ కల్యాణ్‌పూర్‌తో బోలెడన్ని డ్యూయెట్లు పాడాడు. అన్నీ హిట్. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ఈ పాట– నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే... ఖయ్యాం కూడా సుమన్, రఫీలతో మంచి డ్యూయెట్లు పాడించాడు. ‘మొహబ్బద్ ఇస్కో కెహతే హై’లో ‘ఠెహరియే హోష్ మే ఆలూం’ పాట మధురాతి మధురం. ‘రాజ్‌కుమార్’లో సుమన్–రఫీల డ్యూయెట్ ‘తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ పెద్ద హిట్. కాని ఆ తర్వాత తిరిగి లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్‌కు పాటలు పోయాయి. సుమన్ పెద్దగా ఎవరినీ కలవదు. నేటికీ ఆమె ముంబైలో జీవిస్తోంది కాని చూసిన వారు తక్కువ. మాట్లాడినవారూ తక్కువే. ఎన్నో గొప్ప పాటలు పాడాల్సిన ఆమె కొద్ది తేనె చుక్కలు చిలకరించి మాయమైంది. ఆమె పాటకు పూల కానుక. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్ సూరత్ న హోతా అగర్ ఇస్ మే రంగే మొహబ్బత్ న హోతా (నూర్జహాన్). మొహమ్మద్ రఫీతో సుమన్ కల్యాణ్‌పూర్ -
విషాదం: ప్రముఖ సింగర్ కన్నుమూత
Manikka Vinayagam Passed Away: ప్రముఖ తమిళ సింగర్ మాణిక్య వినాయగం(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆదివారం నాడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తమిళ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. వినాయగం.. తమిళ దిల్ సినిమాలోని 'కన్నుక్కుల గెలతి' అనే పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ఆరంభించారు. 'తిరుద తిరుది' అనే సినిమాలో ధనుష్ తండ్రిగా నటించారు. నటనలో కూడా ప్రవేశం ఉన్నప్పటికీ పాటంటేనే ఆయనకు మక్కువ ఎక్కువ. అలా వినయగం అన్ని భాషల్లో కలుపుకుని ఇంచుమించు 800 పాటలు పాడారు. ఇవే కాకుండా ఆయన జానపదాలు, భక్తి పాటలు మరో 1000 దాకా ఆలపించారు. తెలుగులో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీలో పట్టు పట్టు చెయ్యే పట్టు సాంగ్ పాడి అలరించారు. -
ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, నాగోలు: నగరానికి చెందిన మెడికాయల నవీన్‌కుమార్ (34) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్‌తో నవీక్కుమార్ గతంలో ఇంటర్వ్యూ చేశాడు. ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీద ఒక యూట్యాబ్ చానెల్ ప్రారంభించాడు. తరువాత బాధితురాలి పేరు మీద ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అతను తన వెబ్ సిరీస్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు అప్లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సింగర్ ఇలాంటి కార్యకాపాలను ఆపమని అతడిని కోరింది. అయినా నిందితుడు ఆమె మాటలు పట్టించుకోలేదు. సింగర్ వ్యక్తిగత జీవితానికి సంబంధిన వీడియాలు అప్లోడ్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. -
టాలీవుడ్లో విషాదం: ప్లేబ్యాక్ సింగర్ కన్నుమూత
కరోనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ వల్ల చిత్రపరిశ్రమలో ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దీని ధాటి నుంచి తప్పించుకునేందుకు పలుచోట్ల షూటింగ్స్ సైతం రద్దు చేశారు. అయినప్పటికీ వలువురు సినీప్రముఖులు, వారి ఆత్మీయ బంధువులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూస్తున్నారు. ఇదే సమయంలో అనారోగ్యం చుట్టుముట్టడంతో మరికొందరు అసువులు బాస్తున్నారు. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో ఎంతో మంది ప్రముఖులకు డబ్బింగ్ చెప్పి, ఎన్నో పాటలు పాడిన సీనియర్ గాయకుడు ఏవిఎన్ మూర్తి మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఏవిఎన్ మూర్తి దాదాపు 100 సినిమాలకు పైగా పాటలు ఆలపించాడు. 40 సంవత్సరాలుగా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు శ్రీనివాసమూర్తి, రాజేష్ మూర్తి ఉన్నారు. కుమారులిద్దరూ డబ్బింగ్ కళాకారులుగా రాణిస్తున్నారు. సినిమా పాటలతో పాటు, కొన్ని భక్తి గీతాలను కూడా ఏవీఎన్ మూర్తి ఆలపించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చదవండి: ఆ దర్శకుడు నా స్టార్డమ్ పెంచారు: చిరంజీవి చిత్రసీమ ఆత్మబంధువు బి.ఎ. రాజు ఇకలేరు -
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్ ఉంటే ఆ రేడియో ద్వారా కొంతమంది మన ఇంటి మనుషులు అవుతారు. వారు పదే పదే నట్టింట్లో మోగుతూ మనకు ఆత్మీయులైపోతారు. వారిని మరిచిపోవడం కష్టం. ఇదిగో ఏదో ఒక ‘జనరంజని’లో ఒక వేణునాదంతో మొదలయ్యే ఈ తియ్యటి పాటనూ, గొంతునూ పుస్తకంలో దాచుకున్న నెమలీక లాంటి స్పర్శను ఎలా మర్చిపోవడం? ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక అందించెను నవరాగ మాలిక జి.ఆనంద్ తెలుగులో కొన్ని మంచి పాటలకు వాటాదారు అయ్యారు. అలా అవడం కష్టం. సినీ ప్లేబ్యాక్‌లో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్న సమయంలో... పి. రామకృష్ణ కూడా వెనుకంజ వేస్తున్న సమయంలో... తెలుగులో ఇద్దరు గాయకులు కొన్ని పాటలు పొందగలిగారు. వారు మాధవపెద్ది రమేశ్, జి. ఆనంద్. మాధవపెద్ది రమేశ్‌కు సినిమా రంగపు వెన్నుదన్నన్నా ఉంది. శ్రీకాకుళం నుంచి మద్రాసు చేరుకున్న జి. ఆనంద్‌కు అది కూడా లేదు. ఆయన ప్రధానంగా స్టేజ్ సింగర్. సినిమాల్లోకి రాకముందు ఆర్కెస్ట్రా సింగర్‌గా కళింగాంధ్రలో జి.ఆనంద్ పేరు మార్మోగేది. నంద్యాలలో జరిగిన ఒక పాటల పోటీలో ప్రైజ్ కొట్టి జడ్జ్‌గా వచ్చిన కె.వి. మహదేవన్ దృష్టిలో పడి మద్రాసు చేరుకున్నాడాయన. తొలి పాటను ‘పండంటి కాపురం’లో రాజబాబుకు పాడినా పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘అమెరికా అమ్మాయి’ సినిమా. సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ఆనంద్‌కు ‘ఒక వేణువు’ పాట ఇచ్చారు. ఆ పాట పెద్ద హిట్ అవడమే కాదు మరణించే క్షణాల వరకూ ఆనంద్‌కు ఒక అస్తిత్వంలా, వ్యక్తిత్వంలా నిలిచింది. ఈ పాట తర్వాత ఆనంద్ దాసరి దర్శకత్వంలోని ‘మా బంగారక్క’లో ‘దూరాన దూరాన తారాదీపం’ పాడారు. ఆ పాట గుర్తింపు పొందింది. సంగీత దర్శకుడు చక్రవర్తి బాలూ కెరీర్‌ను నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నా కొన్ని సందర్భాలలో కొత్త గాయకులకు అవకాశాలు ఇచ్చేవారు. ‘కల్పన’లో ఆనంద్‌కు మంచి డ్యూయెట్ పడింది. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మా ఆ తర్వాత ‘ఆమె కథ’లో ‘పువ్వులనడుగు నవ్వులనడుగు’ డ్యూయెట్ కూడా చక్రవర్తి సంగీతంలో హిట్ అయ్యింది. చక్రవర్తే ‘జూదగాడు’లో సుశీలతో చాలా మంచి డ్యూయెట్ ఇచ్చారు ఆనంద్‌కు. ఆ పాట కూడా జనరంజని హిట్టే. మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మథలీల జానపదాలకు నెలవైన ఉత్తరాంధ్ర నుంచి రావడం వల్ల ఆనంద్ అటువంటి పాటలు దొరికితే ఊపుగా న్యాయం చేసేవారు. చిరంజీవి తొలి డ్యూయెట్ ‘ప్రాణం ఖరీదు’లో ‘ఎన్నియెల్లో ఎన్నియెల్లో ఎందాక’ ఆనంద్ పాడిందే. ఇక ‘మనవూరి పాండవులు’ సినిమాలో మహదేవన్ పాడించిన ఈ పాట వినని రేడియో శ్రోత ఉండడు. నల్లా నల్లా మబ్బుల్లోన లగ్గోపిల్లా తెల్లాతెల్లని సందామామ లగ్గోపిల్లా చాలామందికి గుర్తుండదు కాని ‘ఒక వేణువు’ స్థాయిలోనే ఆనంద్ పాడిన ఒక సోలో ఉంది. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలోనిది. ‘పయనించే చిరుగాలి... నా చెలి చెంతకు చేరి’.... చాలా బాగుంటుంది. ఆనంద్‌కు తన పరిమితులు తెలుసు. శక్తులూ తెలుసు. అందుకే ఆయన గాయకుడిగా తనకు వచ్చిన గుర్తింపుతో ‘స్వరమాధురి’ ఆర్కెస్ట్రాను స్థాపించి దేశ విదేశాలలో ఎక్కడ తెలుగువారుంటే అక్కడ కచ్చేరీలు ఇవ్వడం ప్రారంభించారు. నిజానికి ప్లేబ్యాక్ సింగింగ్ కంటే కూడా ఈ కచ్చేరీల వల్లే ఆర్థికంగా ఆయన ఎక్కువ లబ్ధి పొందారు. అమెరికాలో 19 సార్లు టూర్లు నిర్వహించిన ఘనులు ఆనంద్. మధ్యలో ‘గాంధీనగర్ రెండవ వీధి’ లాంటి కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. ‘గాంధీనగర్’లో ‘కలకానిది విలువైనది ఒక కథ ఉన్నది వినిపించనా’ పాట పెద్ద హిట్. ‘అమెరికా అమ్మాయి’ సినిమాతో గుర్తింపు పొందిన ఆనంద్ ‘అమెరికా’తో తనకేదో బంధం ఉందని చెప్పుకునేవారు. ఆ అమెరికా అమ్మాయి హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన గాయని సుజాత పరిచయమై భార్యగా మారారు. ఆనంద్ ఇద్దరు అబ్బాయిలు. అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఒక మనవరాలు పుట్టింది కనుక ఆ పాప అమెరికా అమ్మాయి అని చెప్పుకునేవారు. అమెరికాలో చాలాకాలం ఉండి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆనంద్ కరోనాకు తన అంతిమ పాటను వినిపించారు. ఆయనకు నివాళి. కరోనాకు బలి అయిన కమ్మని కంఠం సీనియర్ సినీ గాయకుడు జి. ఆనంద్ (77) కరోనా బారిన పడి, గురువారం రాత్రి హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని తులగామ్ గ్రామంలో 1944 ఫిబ్రవరి 16న ఆనంద్ జన్మించారు. ఆయన తండ్రి రంగస్థలంపై అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆనంద్ కూడా తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకోవడంతో పాటు పలు పౌరాణిక నాటకాల్లో నటించారు. తండ్రి రాముడి పాత్ర పోషించినప్పుడు, ఆనంద్, ఆయన సోదరుడు లవ–కుశ పాత్రలు పోషించారు. తొలినాళ్లలో తమ ఇరుగు పొరుగు గ్రామాలలో పండగలు, ఇతర కార్యక్రమాల్లో, సంగీత విభావరుల్లో పాటలు పాడి, పలు బహుమతులు గెలుచుకున్నారు ఆనంద్. మదరాసు (ఇప్పుడు) చెన్నైలో రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ‘నీ గొంతు బావుంది’ అంటూ కె.వి.మహదేవన్‌కు ఆనంద్ గురించి సిఫార్సు లేఖ రాశారట కృష్ణశాస్త్రి. ఆ సమయంలోనే ‘అమెరికా అమ్మాయి’ లో ‘ఒక వేణువు వినిపించెను..’ పాట పాడే అవకాశం ఆనంద్కి వచ్చింది. అప్పటినుంచి పలు చిత్రాల్లో, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో 2500 పైచిలుకు పాటలు పాడిన ఆనంద్ 150 ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. టీవీ సీరియల్స్‌కూ, హిందీ నుంచి తెలుగు సహా అనేక అనువాద చిత్రాలకూ స్వరసారథ్యం వహించారు. ‘స్వర మాధురి’ బృందం ద్వారా ప్రపంచమంతటా సంగీత విభావరులు నిర్వహించారు. ఏకంగా 6500 పైగా ప్రదర్శనలిచ్చారు. ‘స్వరమాధురి’ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది యువ గాయనీ గాయకులను సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు. సుదీర్ఘకాలం చెన్నైలో ఉన్న ఆనంద్ ఆ మధ్య హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్ర మాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చారు. వీనులవిందైన పాటలు ఎన్నో పాడిన ఆనంద్ ఆ పాటల ద్వారానే గుర్తుండిపోతారు. ఆయన మృతిపట్ల హీరో చిరంజీవి సహా పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వనస్థలిపురం శ్మశానవాటికలో ఆనంద్ అంత్యక్రియలు జరిగాయి. – సాక్షి ఫ్యామిలీ -
మద్రాసు అమ్మాయితో హిందీలో పాట..
మల్లెలు, గులాబీల మధ్య ఎప్పుడూ ఒక సన్నజాజి పువ్వు ఉంటుంది. కోకిలలు, మైనాల మధ్య పేరును పట్టించుకోని ఒక పిట్ట గానం ఉంటుంది. పూజలు చేయ పూలు తెచ్చాను... విధి చేయు వింతలెన్నో... ఇన్ని రాశుల యునికి... తెలిమంచు కరిగింది తలుపు తీయరా... ఇన్ని పాటలతో వాణి జయరామ్ తెలుగు ప్రేక్షకులతో ఎన్నెన్నో జన్మల బంధం వేశారు. చెన్నైలో చదువుకుని, హైదరాబాద్‌లో బ్యాంక్ ఉద్యోగం చేసిన వాణి జయరాం తెలుగువారి ఇష్టగాయనిగా మారి దశాబ్దాలు అవుతోంది. నవంబర్ 30న ఆమెకు 75 నిండుతాయి. ప్రతి వసంతంలోనూ పాటల కొమ్మలను విస్తరించుకుంటూ వెళ్లిన ఈ నిరాడంబర వృక్షం తల ఎత్తి చూడదగ్గది. ఈ సందర్భాన తలుచుకోదగ్గది. రేడియో సిలోన్లో బినాకా గీత్‌మాలా ఊపేస్తోంది. అమిన్ సయానీ మొదలెట్టిన షో ప్రతి వారం హిందీలో విడుదలైన జనరంజకమైన పాటల్ని ప్లే చేసి టాప్ లిస్ట్‌ను ఇస్తూ ఉంటుంది. మేల్ సింగర్స్ అయితే దాదాపుగా రఫీ ఉంటాడు. ఫిమేల్ సింగర్స్ అయితే లతా మంగేష్కర్ సింహాసనం వేసుకుని కూచుని ఉంటుంది. అలాంటి షోలో ఒకవారం అయినా తమ పాట వినపడాలని ప్రతి గాయని, గీత కర్తా, సంగీత దర్శకుడు భావిస్తున్న సమయాన ఒక మద్రాసు అమ్మాయి హిందీలో ఒక పాట పాడింది. ఆ పాట ఆ అమ్మాయికి మొదటి పాట. అది బయటకు విడుదల అయ్యింది. లతా కాకుండా, ఆశా భోంస్లే కాకుండా హిందీలో మరొకరు, అందునా ఒక సౌత్ అమ్మాయి పాడటమా అని జనానికి వింత. అది బినాకాకు ఎక్కడం మరీ వింత. ఒక వారం కాదు రెండు వారాలు కాదు 16 వారాలు ఆ పాట చార్ట్ బస్టర్‌గా నిలవడం ఇంకా వింత. ఆ వింతను సాధించిన గాయని వాణి జయరామ్. బాలీవుడ్ ఎగిరిన తొలి దక్షిణాది గాన పతాక. ఆ సినిమా ‘గుడ్డి’. ఆ పాట ‘బోల్రే పపీ హరా’. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుదని అంటారు పెద్దలు. ఎదిగే బుద్ధి ఉన్న వారు మౌనంగా ఉంటారని కూడా అంటారు. వాణి జయరామ్‌కు సంగీతం ఎంత తెలుసో చాలామందికి తెలియదు. ఆమె ఎప్పుడూ పెద్దగా చెప్పుకోదు. కాని పాటను సాంతం తన చేతిలోకి తీసుకున్నట్టుగా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె తల్లి గాయని. తమిళనాడులోని వేలూరులో తన 9 మంది సంతానంలో ఐదవ బాలికగా జన్మించి వాణిలో ఆమె సంగీతాన్ని పసిగట్టింది. ఐదేళ్లకే వాణి కీర్తనలు పాడేది. చెదరకుండా ఆలాపన కొనసాగించేది. నేను అంతగా సక్సెస్ చూడలేకపోయాను నా కూతురైనా చూడాలి అని వాణికి పదేళ్లు వచ్చేసరికి కుటుంబాన్ని మద్రాసుకు మార్చిందామె. అక్కడే వాణి క్లాసికల్ గురుముఖతా నేర్చుకుంది. మరో ఒకటి రెండేళ్లకే మూడు గంటల కచేరీ ఇవ్వడం కూడా మొదలెట్టింది. మద్రాసులోని మహా సంగీతకారుల దగ్గర వాణి పాఠాలు నేర్చుకుని వచ్చిన విద్యను ఆడంబరంగా ప్రదర్శించరాదని గ్రహించి వినయంగా ఉండటం నేర్చుకుంది. వాణి చాలా చురుకైన స్టూడెంట్. మద్రాసులో బి.ఏ ఎకనామిక్స్ చేసింది. ఎన్నడూ ఏమీ మాట్లాడనట్టుగా కనిపించే ఆమె కాలేజీలో డిబేట్స్ కోసం వేదిక ఎక్కితే అవతలి పక్షం ఓటమి అంగీకరించి నోరు మెదపక దిగిపోయేది. చదువులో టాపర్ అయిన వాణికి స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఏదో కచేరిలో పాడుతుంటే చూసిన ఒకామె ఈమె నా కోడలు అని నిశ్చయించుకుని తన కుమారుడు జయరామ్‌ను ఆమెకు భర్తగా ఇచ్చింది. వాణి కొన్నాళ్లు హైదరాబాద్‌లో కూడా ఉద్యోగం చేసి ఆ తర్వాత ముంబై ట్రాన్స్ఫర్ అయితే ముంబైకి వెళ్లింది. అక్కడే ఆమె గాయనిగా మొదటిసారి వెలిగింది. వాణి భర్త జయరామ్‌కు సంగీతప్రియుడు. ఆయనకు సితార్ వాదన తెలుసు. ‘వాణి జయరామ్’గా మారిన భార్యకు హిందూస్తానీ కూడా వచ్చి ఉంటే బాగుంటుందని అక్కడే ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్ దగ్గర సంగీత పాఠాలకు పెట్టాడు. ఉస్తాద్ ఆమె పాటలు విని అమ్మా... ఇంకా ఆ దండగమారి బ్యాంకు ఉద్యోగం ఎందుకు... బంగారం లాంటి నీ గొంతు ఉండగా అని సంగీతం నేర్పించి, సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియాకు ఆమెను పరిచయం చేశాడు. వన్రాజ్ భాటియా అప్పుడే తాను సంగీతం చేస్తున్న ‘గుడ్డి’ సినిమా కోసం దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ, రచయిత గుల్జార్‌లను వాణి జయరామ్ తొలి పరిచయానికి ఒప్పించాడు. అలా వాణి జయరామ్ దేశానికి ఒక ప్రభాత గీతంగా, భక్తి గీతంగా దేశానికి తెలిసింది. కాని లతా మంగేశ్కర్, ఆశా భోంస్లే కెరీర్లో పోటాపోటీగా ఉన్న సమయంలో మరో చెల్లెలు ఇలా ప్రత్యక్షం కావడం అంత ప్రసన్నం కలిగించే విషయంగా భావించలేకపోయారు. సంగీత దర్శకుల, గాయకుల లాబీలో గొప్ప ప్రతిభ ఉన్నా అక్కడ వాణి జయరామ్ నిలువలేకపోయింది. పోనీ.. ఈ గంధం దక్షణాది గడపలకే సొంతమని విధి రాసి పెట్టి ఉందేమో మద్రాసుకు వచ్చేసింది. అటు పిమ్మట వాణి జయరామ్ గొంతు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పాలు కలిపిన మామిడి పండు రసం రుచిని పాటలలో పంచింది. ఎస్.పి.బాలూకు పాడే అవకాశం ఇచ్చిన కోదండపాణీయే ‘అభిమానవంతులు’ సినిమాతో వాణి జయరామ్‌కు తొలి అవకాశం ఇచ్చాడు. కాని ఈ గొంతు గాన పూజకు వచ్చిందని ‘పూజ’ సినిమాయే తెలుగు ప్రేక్షకులకు చెప్పింది. రాజన్ – నాగేంద్ర చేసిన ‘పూజ’ పాటలు తెలుగు దేశాన మోగిపోయాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటను ప్రతి ఉదయం నాష్టా పొయ్యి మీద పెడుతూ, మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తూ, రాత్రిళ్లు పిల్లలకు పక్కలు సిద్ధం చేస్తూ ఇల్లాళ్లు వేలాదిసార్లు విన్నారు. వింటున్నారు. ఆ సినిమాలోని ‘నింగి నేలా ఒకటాయెనే’, ‘పూజలు చేయ పూలు తెచ్చాను’... పాటలూ వాణి జయరామ్ గొంతు గిరాకీని శ్రోతల్లో పెంచాయి. అయితే తెలుగులో ఆమె ప్రవేశం, కొనసాగింపు స్థిరంగా లేదు. సుశీల, జానకీ ‘హీరోయిన్ల గొంతు’గా స్థిరపడి ఉన్నారు. వారిని దాటి వాణి జయరామ్‌కు చోటు దొరకడం అన్నిసార్లు జరిగేది కాదు. కాని జరిగిన ప్రతిసారీ చిన్న చిరునవ్వుతో, గోరింటాకు పెట్టుకుని పండిన ఎడమ చేతిని ఊపుతూ పాడి మార్కులు ఎగరేసుకొని పోయేది. ‘ఈ రోజు మంచి రోజు’ (ప్రేమ లేఖలు), ‘విధి చేయు వింతలెన్నో’ (మరో చరిత్ర), ‘నువ్వు వస్తావని బృందావని’ (మల్లెపూవు), ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ (మొరటోడు), ‘నీలి మేఘమా జాలి చూపుమా’ (అమ్మాయిల శపథం), ‘సీతే రాముడి కట్నం’ (మగధీరుడు)... ఈ పాటలన్నీ సిగన మల్లెలు ముడుచుకున్న వనితలా గుమగుమలాడుతూ భావతరంగాల కిందా మీదకు కారణమయ్యేవి. వాణి జయరామ్ గొంతులోని విశిష్టత ఏమిటంటే అది స్త్రీలకూ సరిపోయేది. యంగ్ అడల్ట్స్కూ సరిపోయేది. ఇది గమనించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’, ‘శృతిలయలు’ సినిమాలలో ఆమె గొంతును సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలకు ఆమె గొంతు కేవలం పాటగా మాత్రమే కాదు కథాబలంగా కూడా ఉపయోగపడింది. ‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’, ‘మానస సంచరరే’, ‘ఏ తీరుగ నను దయ చూసెదవో’.. ఈ పాటలన్నీ ఆమెకు అవార్డులు తెచ్చి పెట్టాయి. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్‌కు మేచ్ అయ్యేలా వాణి జయరామ్ పాడిన ‘తెలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి ప్రణతి ప్రణతి’, ‘కొండ కోనల్లో లోయల్లో’... అద్భుతం. పునరావృతం లేని కళ అది. వాణి జయరామ్ గొంతు భిన్న సందర్భాల పాటగా వెలిగింది. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా’ (వయసు పిలిచింది), ‘మిన్నేటి సూరీడు వచ్చెను మా పల్లె’ (సీతాకోకచిలుక), ‘నేనా పాడనా పాట’ (గుప్పెడు మనసు), గీతా ఓ గీతా (శివమెత్తిన సత్యం)... వీటన్నింటికి గట్టి అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్ పాటలే కాదు తెలుగు డబ్బింగ్ గీతాలు కూడా వాణి జయరామ్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంచాయ్. ఆమె పాడిన ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ) చిత్రలహరిలో జనం వేయిసార్లు చూశారు. వాణి జయరామ్ సింపుల్‌గా ఉండటమే ఘనత అని నమ్ముతారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. కవిత్వం రాస్తారు. భజనలు రాస్తారు. సినిమా కథలు కూడా తయారు చేస్తారు. ఆమె జగతితో తానుగా కాక పాటతో సంభాషించాలని కోరుకుంటారు. తీయటి గాయని వాణి జయరామ్ పాటకు ప్రత్యక్షంగా సేవ చేసి పరోక్షంగా మానవ స్వాంతనకు దోహదపడ్డారు. ఆమె 75 ఏళ్లు నిండిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హృదయాలను సంగీతమయం చేస్తూనే ఉండమని కోరుకోవాలి. దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ...– సాక్షి ఫ్యామిలీ -
నా డెత్ నోట్ అమ్మకు చూపించు: గాయని
యశవంతపుర: వర్ధమాన గాయకురాలు సుష్మిత సోమవారం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అదనపు కట్నం కోసం భర్త అత్త మామల వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్యకు ముందు తన తమ్ముడికి వాట్సాప్ మెసేజ్ పంపారు. బెంగళూరులోని నాగరబావి ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయారు. పలు కన్నడ చిత్రాలు, సీరియల్స్ ద్వారా సాండల్‌వుడ్‌లో గుర్తింపు పొందిన గాయని సుష్మిత (26) ఆత్మహత్య నగరంలో సంచలనం సృష్టించింది. అమ్మా నన్ను క్షమించు సుష్మిత ఆత్మహత్యకు ముందు తన తమ్ముడు సచిన్‌కు వాట్సాప్ మెసేజ్ పంపారు. ‘అమ్మా నన్ను క్షమించు, నా భర్త, వాళ్ల బంధువులు నన్ను మానసికంగా చిత్ర హింసలు పెడుతున్నారు, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. నా తప్పునకు నేనే శిక్ష అనుభవిస్తున్నా..’ అంటూ వాట్సాప్ మెసేజ్ పంపారు. తన మరణానికి భర్త శరత్‌తో పాటు ఇతర బంధువులు వైదేహి, గీతలే ప్రధాన కారణం. పెళ్లయిన ఏడాదిన్నర నుంచి కష్టాలు అనుభవిస్తున్నా, తనను వేధించిన ఎవ్వరినీ వదలొద్దు అంటూ మెసేజ్ పెట్టింది. ‘అమ్మ మిస్ యూ...నీ కోసం తమ్ముడు సచిన్ ఉన్నాడు. వాడిని బాగా చూసుకో, నా డెత్‌నోట్‌ను అమ్మకు చూపించు’ అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమని సుష్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (అమ్మా ఇది తగునా?) -
‘ఇండియన్ ఐడల్’కు ఎంపికైన శృతి
హైదరాబాద్: ఇండియన్ ఐడల్–2018కు సోనీ ఎంటర్టైన్మెంట్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంఎల్ఎన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఎంఎల్ఎన్ ఈవెంట్స్ సంయుక్తంగా అత్తాపూర్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌కు భారీ స్పందన లభించింది. ఇందులో సుమారు 1800కు పైగా ఔత్సాహిక సింగర్స్ పాల్గొన్నారు. నగరం నుంచి ఇండియన్ ఐడల్‌కు ప్లేబ్యాక్ సింగర్ శృతి ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. నేహా కక్కర్, విశాల్ దద్లానీ, అనూమాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ‘కబర్ పహలే దో’ నినాదంతో జరుగుతోంది. ఈవెంట్స్ నిర్వహణపై యువ సింగర్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారని ఎంఎల్ఎన్ అకాడమీ నిర్వాహకులు, ఇండియన్ ఐడల్ సౌతిండియా కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంఎస్‌రావు వెల్లడించారు. -
సంగీతమంటే ప్రాణం
♦ సరదాగా మా ఆయనతో షార్ట్ ఫిలింలో నటించా.. ♦ వరంగల్‌కు రావడమంటే ఇష్టం ♦ సినీ నేపథ్య గాయని గీతామాధురి ‘ఒకప్పుడు అందరు పాటలు పాడుతుంటే వినేదాన్ని.. ఇప్పుడు స్వయంగా సినిమాల్లో పాటలు పాడడం కొత్త అనుభూతిని ఇస్తోంది. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇక వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడకు వచ్చినప్పుడల్లా వేయిస్తంభాల దేవాలయాన్ని తప్పక దర్శిస్తాను..’ అంటూ చెప్పుకొచ్చారు సినీ నేపథ్య గాయని గీతామాధురి. వరంగల్ నిట్‌లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీకి శనివారం వచ్చిన ఆమె మధ్యాహ్నం విరామ సమయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా గీతామాధురి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... - పోచమ్మమైదాన్ వరంగల్‌కు చాలా కార్యక్రమాలకు హాజరయ్యాను. వరంగల్‌లోని ప్రజలు నా పాటలు వినేందుకు ఎంతగానో ఇష్టపడుతారు. వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. వరంగల్‌లో ఏదైన కార్యక్రమానికి ఆహ్వానిస్తే తప్పక వస్తున్నా. ఇక్కడి అభిమానులు నేను సినిమాలలో పాడిన పాటలను మళ్లీమళ్లీ పాడాలని కోరుతుంటారు. వరంగల్‌కు వస్తే హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని తప్పక ద ర్శిస్తారు. అలాగే, భద్రకాళి అమ్మ వారిని దర్శించుకుంటే చాలు ఒత్తిళ్లు అన్నీ తీసేసినట్లవుతుంది. ఇంకా ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నవయస్సులోనే హైదరాబాద్‌కు.. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే లిటిల్ మ్యుజీషియన్స్ కచ్చర్తకోట పద్మావతి, రామాచారి వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందాను. ఆ తర్వాత టీవీ చానల్లో ప్రసారమైన పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలవడం.. ఆ తర్వాత నా ప్రతిభ అవకాశాలు వస్తుండడంతో ఈ రంగంలోనే స్థిరపడిపోయా. మా నాన్న ఎస్బీహెచ్లో పని చేయడం వలన చాలా చిన్న వయస్సులోనే హైదరాబాద్‌కు మారిపోయాము. నేను వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో చదివాను. ‘ప్రేమలేఖ రాశా’తో.. ఇప్పటి వరకు 350 పాటలకు పైగా పాడాను. కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలో పాటతో సినీ రంగ ప్రవేశం చేశాను. అయితే, మా ఆయన నందు, నేను సరదాగా ‘అదితి’ షార్ట్ ఫిలింలో నటించాను. భవిష్యత్‌లో గాయకురాలిగా స్థిరపడతానే తప్ప నటనపై ఆసక్తి లేదు. నాకు ఇళయరాజా, కిర వాణి, ఏఆర్.రహమాన్ సంగీతం ఇష్టం. నేను పాడిన పాటలు ఎఫ్ఎంలో లేదా ఎక్కడైనా వింటే మనస్సుకు సంతోషంగా ఉంటుంది. కాగా.. సినీ రంగంలో ప్రతిభ ఉన్న గాయకులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే, పట్టుదలతో ముందుకు సాగితే అవకాశలు అవే లభిస్తాయి. అవార్డులు .. 2008 సంవత్సరంలో నచ్చావులే చిత్రంలోని నిన్నే నిన్నే.. పాటకు గాను ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నేపథ్య గాయని పురస్కారానికి నామినేట్ అయింది. అదే పాటకు నంది అవార్డు వచ్చింది. చిరుతలోని చమ్కా చమ్కా పాటకు మా టీవీ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. సంతోషం అవార్డు సైతం వచ్చింది. ఏక్ నిరంజన్లోని గుండెల్లో గిటార్ పాటకు గానూ సౌత్ స్కోప్ పురస్కారం అందుకున్నా. అలాగే, తమిళంలో బాహుబలి చిత్రంకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. -
నేపథ్య గాయనిగా సీఎం సతీమణి
ఆమె స్వయానా ఓ ముఖ్యమంత్రి భార్య. పేరు అమృతా ఫడ్నవీస్. ఇప్పుడు ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'జై గంగాజల్' అనే సినిమాలో నేపథ్య గాయని అవతారం ఎత్తారు. అవును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఈ సినిమాలో ఓ పాట పాడారు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ భక్తి పాట పాడారు. అయితే, దీనికి గానీ.. మరే ఇతర గాన కార్యక్రమాలకు గానీ తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, వాళ్లు ఇస్తామన్నా అంగీకరించలేదని అమృత చెప్పారు. సలీమ్ సులేమాన్ అందించిన స్వరాలు, మనోజ్ ముంతాషిర్ రాసిన పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అవి పాడుతున్నంత సేపూ తాను మైమరచిపోయానని అమృత తన అనుభవాన్ని వివరించారు. ఈ ఆఫర్ వచ్చేసరికి తాను మరో సినిమాలో పాట పాడుతున్నానని, తాను ఆ పాట పాడుతుండగా విన్న ప్రకాష్ ఝా.. ఆయన సినిమాలో పాటకు తన గొంతు సరిపోతుందని భావించి అడిగారని తెలిపారు. ఒకటిన్నర రోజులో రికార్డింగు పూర్తయింది. తన భర్త, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన పాటను ఎంతగానో మెచ్చుకున్నారని.. జై గంగాజల్ సినిమా మహిళా కేంద్రీకృతంగా ఉంటుందని ఆమె అన్నారు. అమృత స్వతహాగా బ్యాంకర్. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగానే ఆమె తన కుమార్తె దివిజతో కలిసి ముంబైకి మారిపోయారు. -
నగరంతో నాది సంగీత అనుబంధం
‘సాక్షి’తో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాద్ : ‘నగరంతో నాది సంగీత అనుబంధం.. భాగ్యనగర వాసులు సంగీత ప్రియులు.. బాగా ఆదరిస్తారు’ అని హైదరాబాదుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ అయిన మంగళంపల్లి సోమవారం రవీంద్రభారతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు. మిగతా విషయాలతో కన్నా నాకు హైదరాబాద్‌తో నాకు సంగీత అనుబంధమే ఉంది. ఎప్పటినుంచో ఇక్కడి వస్తున్నా..ప్రజలు నా సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు. నన్ను అభిమానిస్తున్నారు. యువత వెస్ట్రన్ సంగీతం విన్నా, ఆకర్షితులైనా, మరే సంగీతం వంటపట్టించుకున్నా అన్ని సంగీతాలు మనవే. మన సంగీతం నుంచి పుట్టినవే అన్నీ. అన్ని రాగాలు మనవే. వెస్ట్రన్ సంగీతం అలవాటు పడ్డ వారు కూడా మన పిల్లలే కదా. ఎటు తిరిగి ఎటుపోయినా మళ్లీ శాస్త్రీయ సంగీతం దగ్గర ఆగాల్సిందే. రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు, సంగీతం అంటూ ఏమీలేవు.. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీగతం విన్నా, నేర్చుకున్నా మంచే జరుగుతుంది. సంగీతప్రియులు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించి ప్రేమించారు. బాగా చూసుకున్నారు.. ఈ ఆదరాభిమానాలు నేను ఉన్నన్నాళ్లు లభించాలని కోరుకుంటున్నాను. -
పుకారు తెచ్చిన ప్రమాదం...
ప్లేబ్యాక్ సింగర్ కిశోర్ కుమార్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు కొత్త తరంగంలా వచ్చినవాడు శైలేంద్ర సింగ్. తన కొడుకు రిషి కపూర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త గొంతును పరిచయం చేయాలని రాజ్‌కపూర్ అనుకున్నప్పుడు శైలేంద్ర సింగ్ తారసపడ్డాడు. ‘బాబీ’ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత రిషి కపూర్ నటించిన చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ పాడాడు. రవీంద్రజైన్ వంటి సంగీతకారులు కూడా మంచి మంచి పాటలు ఇచ్చారు. కాని ఒకసారి డయాబిటిస్ వల్ల రెండు మూడు రోజులు శైలేంద్ర సింగ్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ప్రత్యర్థులు ముంబైలో పుకార్లు పుట్టించారు. శైలేంద్రకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని ఇక మీదట రికార్డింగులు చేయలేడని పాడలేడనీ.... అలా అలా అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. పుకార్లను పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించాను అంటుంటాడు ఈ మంచిపాటగాడు.