![Singer KS Chithra Gets Criticised on Social Media For Supporting Ayodhya Ram Mandir Launch - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/chitra-singer.jpg.webp?itok=n5Hb3SvK)
తిరువనంతపురం: జాతీయ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయని కేఎస్ చిత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభ ఉత్సవాన్ని స్వాగతిస్తూ ఒక వీడియోను రెండు రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఇందుకు కారణం. ఈ నెల 22న ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రజలంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే రామమంత్రం జపించాలని, సాయంత్రం ఇళ్లల్లో ఐదు దీపాలు వెలిగించాలని చిత్ర పిలుపునిచ్చారు.
ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ‘లోకస్సమస్త సుఖినోభవంతు’ అంటూ తన సందేశాన్ని ముగించారు. అయితే, ఈ వీడియో సందేశంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, దాన్ని ప్రచారం చేయడం, అయోధ్య రామమందిరానికి ప్రాచుర్యం కలి్పంచడం తప్పు అంటూ ఆక్షేపిస్తున్నారు. మరోవైపు చిత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. పారీ్టలకు అతీతంగా రాజకీయ నాయకులు, గాయనీ గాయకులు, రచయితలు, వివిధ వర్గాల ప్రజలు ఆమెకు అండగా నిలుస్తున్నారు.
అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు చిత్రకు ఉందని తేలి్చచెప్పారు. ట్రోలింగ్ చేసేవారి పట్ల మండిపడుతున్నారు. చిత్రకు కేరళకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. చిత్ర ఇచి్చన సందేశాన్ని వివాదాస్పదం చేయొద్దని హితవు పలికారు. రాముడి పట్ల విశ్వాసం ఉన్నవారు ఆయనను పూజిస్తారని, అందులో తప్పేముందని చిత్రకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ సైతం చిత్రకు మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment