Ayodhya Ram Mandir Ceremony
-
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
Maa Shabri..రామ సన్నిధిలో శబరి గీతం: మైథిలీ ఠాకూర్
అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో మంత్రాలు, స్తోత్రాలతోపాటు భక్తి సంగీతం కూడా భక్తులను తన్మయత్వానికి గురి చేసింది. శంకర్ మహదేవన్, సోను నిగమ్ వంటి సీనియర్ గాయకులతో పాటు రామ సన్నిధిలో ‘శబరి గీతం’ వినిపించిన బిహార్ గాయని మైథిలీ ఠాకూర్ ప్రత్యేక ప్రశంసలు పొందింది. నరేంద్ర మోడీ ఆమె గురించే ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆరేళ్ల వయసు నుంచి భక్తి సంగీతాన్ని వినిపిస్తున్న మైథిలీ ఠాకూర్ పరిచయం. ‘శబరీ సవారె రాస్తా ఆయేంగె రామ్‌జీ’... (శబరి వీధుల్ని అలంకరిస్తోంది రాముని రాక కోసం)... అని పాడిన మైథిలీ ఠాకూర్ పాటను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మైథిలీ ఠాకూర్ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయడమే కాదు... ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయప్రాంగణంలో రాముని భజనలు కూడా పాడింది. దేశం మొత్తంలో ఇలాంటి అవకాశం పొందిన అతి చిన్న వయసు గాయని మైథిలి. 21 ఏళ్ల వయసులో ఇంత గుర్తింపు పొందడానికి కారణం ఎడతెగని సాధన, సంగీతం పట్ల ఆరాధనే. బిహార్ అమ్మాయి మైథిలీ ఠాకూర్‌ది బిహార్‌లోని మధుబని. తండ్రి రమేష్ ఠాకూర్ భజన గాయకుడు. అందువల్ల బాల్యం నుంచి తండ్రితో పాటు భజనలు పాడేది మైథిలి. ఇంట్లో ఏదో ఒక సమయంలో రామ్సీతా కీర్తనలు కొనసాగుతుండేవి. మైథిలిని తన వారసురాలిగా చేయాలని తండ్రికి ఉండేది. అందుకుని పదేళ్ల వరకూ స్కూల్‌కే పంపకుండా సంగీతంలో సాధన చేయించాడు. అయితే మైథిలికి గుర్తింపు మాత్రం వెంటనే రాలేదు. గెలుపూ ఓటమి మైధిలి భవిష్యత్తు కోసం ఢిల్లీకి మకాం మార్చాడు తండ్రి. ఢిల్లీలోని బాలభవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నేరుగా ఆరవ తరగతిలో చేరిన మైథిలి మొదటిసారి స్కూల్ ముఖం చూడటం, అక్కడ ఇంగ్లిష్ రాక అవస్థ పడటం కొనసాగిస్తూనే సంగీతాన్ని సాధన చేసింది. ఢిల్లీలో మైథిలి కచ్చేరీలు చేసినా అందరికీ తెలిసేటంతటి పేరు రాలేదు. ఆ సమయంలోనే అంటే 11 ఏళ్ల వయసులో ‘లిటిల్ చాంప్’, ‘ఇండియన్ ఐడల్ 2’ వంటి రియాలిటీ షోస్‌కు వెళ్లి ఫెయిల్ అయ్యి తిరిగి వచ్చింది మైథిలి. దశ తిరిగింది 2017లో కలర్స్ టీవీలో ‘రైజింగ్ స్టార్’ అనే సింగింగ్ రియాలిటీ షో మైథిలి దశ తిప్పింది. ఆ షోలో మైథిలి రన్నర్ అప్‌గా నిలిచింది. ముంబైలో ఈ షో చేసి తిరిగి వచ్చాక ఢిల్లీ నుంచే తాను లోకానికి తెలియానుకుంది. వెంటనే సోషల్ మీడియాలో తన పాటలను పోస్ట్ చేయడం మొదలెట్టింది. మైథిలికి ఇద్దరు తమ్ముళ్లు–రిషబ్, అయాచి ఉన్నారు. వారిద్దరు తబలా, డోలక్ వాయిస్తారు. మైథిలి హార్మోనియం వాయిస్తుంది. వీరు ముగ్గురు కలసి పాటల వీడియోలు రిలీజ్ చేయడం మొదలెట్టారు. పెద్ద హిట్ అయ్యాయి. సినిమా పాటలే కాకుండా బిహార్‌లోని జానపద సంగీతాన్ని, పంజాబీ, గుజరాతీ, కేసరియా, బజ్జిక వంటి సంగీత ధోరణులను వీడియోలుగా రిలీజ్ చేసింది మైథిలి. అంతేకాదు భజన సంగీతాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు యూట్యూబ్‌లో 20 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో, ఫేస్బుక్లో లక్షల ఫాలోయెర్లు ఉన్నారు. ఆ ప్రఖ్యాతి మైథిలిని రాముని పాదాల వరకూ చేర్చింది. -
Union Cabinet: జన నాయకుడు మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర కేబినెట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు మోదీపై కనబరచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. ‘‘రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది. ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది’’ అని పేర్కొంది. భరత జాతి శతాబ్దాల కలను సాకారం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చదివి విని్పంచారు. ‘‘1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్య్రం వచి్చంది. దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్ర ప్రతిష్టాపన ద్వారా ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టితులయ్యారు. రామ మందిర ప్రతిష్టాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు’’ అంటూ మోదీపై తీర్మానం ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రజల్లో ఇంతటి ఐక్యత గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా కని్పంచింది. అది ఒక నియంతను ఎదిరించేందుకు జరిగిన ఉద్యమం. ఇదేమో దేశంలో నూతన శకానికి అయోధ్య రాముని సాక్షిగా నాంది పలికిన చరిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిన ఐక్యత’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ఆసాంతం భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. రాముని ప్రాణప్రతిష్టకు సాక్షిగా నిలిచిన మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని కేబినెట్ సభ్యులంతా అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఇది కొన్ని జన్మలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన అవకాశమన్నారు. ఆ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం ద్వారా వాటి దిగుమతిని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అలాగే కోల్ ఇండియా, గెయిల్ భాగస్వామ్యంలో రూ.13,052 కోట్ల కోల్–ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్), సీఐఎల్, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంలో రూ.11,782 కోట్ల కోల్–అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. -
Ayodhya Ram Mandir: కొనసాగుతున్న భక్తుల వరద
అయోధ్య/లఖ్‌నవూ: అయోధ్యకు భక్తుల వరద కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మధ్యాహ్న సమయానికే దాదాపు 3 లక్షల మంది బాలక్ రామ్ దర్శనం చేసుకున్నట్టు శ్రీరామ జన్మభూమి ట్రస్టు వర్గాలు తెలిపాయి. మంగళవారం తొలి రోజు 5 లక్షల మందికి పైగా దర్శనాలు చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా క్యూ లైన్లలో భారీగా బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వారికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. మరోవైపు, అయోధ్యకు దారితీసే హైవేలు, ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో భక్తుల ప్రవాహం మరింత పెరిగేలా ఉండటంతో ఉత్తరప్రదేశ్ సర్కారు రంగంలోకి దిగింది. భక్తుల సంఖ్యను నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. వాటిలో భాగంగా అయోధ్యకు యూపీ రోడ్డు రవాణా సంస్థ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేసింది. నగరానికి ప్రైవేటు బస్సుల రాకపోకలపైనా నిషేధం విధించారు. వీఐపీలు అయోధ్య సందర్శనను వీలైనంత కాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులూ, ఫిబ్రవరిలో వెళ్లొద్దు: మోదీ భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అయోధ్య సందర్శన యోచన మానుకోవాల్సిందిగా కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ఇందుకు వేదికైంది. ఇప్పటికిప్పుడు వారు అయోధ్యలో పర్యటిస్తే ప్రొటోకాల్స్ తదితరాలతో భారీగా వస్తున్న సాధారణ భక్తులకు ఇబ్బందికరంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రారంభం, రామ్ లల్లా ప్రాణప్రతిష్టపై భక్తుల ఫీడ్‌బ్యాక్ గురించి మంత్రులను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయంలోకి వానరం హనుమ ఆశీర్వాదమే: ట్రస్టు అయోధ్య రామాలయంలో ఆసక్తికర సన్నవేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వేళ ఓ వానరం దక్షిణ ద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశించింది. లోపల కలియదిరిగింది. రామల్ లల్లా ఉత్సవ విగ్రహం చెంతకు వెళ్లింది. విగ్రహాన్ని పడేస్తుందేమోనని లోనికొచ్చిన భద్రతా సిబ్బందిని చూస్తూ నింపాదిగా తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్లింది. బారులు తీరిన భక్తుల కేసి చూస్తూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను క్షేత్ర ట్రస్టు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆ వానరం తీరు అచ్చం మనిíÙనే తలపించిందని భద్రతా సిబ్బంది గుర్తు చేసుకున్నారు. బహుశా హనుమంతుడే బాలక్ రామ్ దర్శనార్థం వచ్చినట్టుందని వారు అభిప్రాయపడ్డారు. అయోధ్యలో హెలికాప్టర్ దర్శనాలు సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య సందర్శనార్థం యూపీలో పలు నగరాల నుంచి హెలికాప్టర్ సరీ్వసులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్‌పూర్, వారణాసి, లక్నో, మధుర, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ నుంచి ఈ సేవలుంటాయి. ఆయా నగరాల నుంచి వచ్చే హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం అయోధ్యలో సరయూ నదీ తీరంలో నూతన హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. అయోధ్య, హనుమాన్ గఢి, సరయూ నదీ ప్రాంతాల విహంగ వీక్షణంకు అవకాశం కలి్పస్తున్నారు. ఈ ఏరియల్ టూర్‌కు ఒక్కొక్కరికి రూ.3,539 వసూలు చేస్తారు. ఏరియల్ టూర్ ఒకేసారి ఐదుగురు చూడొచ్చు. -
అయోధ్యలో కోహ్లిని పోలిన వ్యక్తి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం! వీడియో
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కనుల పండువగా జరిగింది. యావత్తు దేశం మొత్తం రామనామ జపంతో మార్మోగిపోయింది. ఈ ప్రాణప్రతిష్ట వేడుకను ప్రత్యేకంగా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. పలువరు క్రికెట్లరు సైతం ఈ అద్బత ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు అయోద్యకు వెళ్లారు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ వంటి క్రికెట్ దిగ్గజాలతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అయోద్య పుర వీధుల్లో కన్పించారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి ఆహ్వానం అందినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ హాజరు కాలేకపోయారు. కానీ విరాట్ కోహ్లిని పోలిన ఓ వ్యక్తి మాత్రం అయోద్యలో సందడి చేశాడు. అచ్చెం విరాట్లనే అతడు ఉండడంతో అభిమానులు సెల్ఫీలు కోసం ఎగబడ్డారు. అతడు తను కోహ్లిని కాదని చెబుతునప్పటికీ.. జనం మాత్రం ఫోటోల కోసం వెంటబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా దూరమయ్యాడు. చదవండి: IND vs ENG: వారిద్దరూ కాదు.. కోహ్లి స్ధానంలో ఎవరూ ఊహించని ఆటగాడు! This is what happened to duplicate Virat Kohli in Ayodhya. pic.twitter.com/LdHJhQzKqX — Piyush Rai (@Benarasiyaa) January 22, 2024 -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్‌స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ రియాక్షన్
-
Ayodhya Ram Mandir: ఆహూతులను ఆకట్టుకున్న నృత్య, సంగీత ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన నృత్య, సంగీత,నాటక ప్రదర్శనలు మంత్రిముగ్ధుల్ని చేశాయి. రామ చరితతోపాటు, 500 ఏళ్ల నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ట వరకు జరిగిన విశేషాలను ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. ‘బధాయ్, చారీ, గూమర్, భవాయ్, ఝుమర్, ధోబియా, రాయ్, రస్లీల, మయూర్, ఖయాల్ నృత్యం, సతారియా’వంటి జానపద నృత్యాలతో కళాకారులు అమితానందం కల్గించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి, మోహని ఆట్టం, కథాకళి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగిసేదాకా ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు ఈ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలను సెల్ఫోన్లలో బంధించారు. చలనచిత్ర, సంగీత కళాకారులు బాల రాముడిపై అభిమానాన్ని పాటల రూపంలో చాటారు. ప్రముఖ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, సోను నిగమ్ ‘రామ్ భజన్’ చేశారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తీ ‘రామాష్టకం’తో అలరించారు. ‘రాం సియా రాం’ అంటూ సోను నిగం పాడిన పాట ఆకట్టుకుంది. -
Ayodhya Ram Mandir: ప్రపంచ నలుమూలల్లోనూ ఘనంగా ప్రాణప్రతిష్ట వేడుకలు
వాషింగ్టన్/పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా సంబరాలు జరుపుకున్నారు. న్యూయార్క్‌లో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద భారీ తెరలపై వందలాది భారతీయ అమెరికన్లు వేడుకను వీక్షించారు. సంప్రదాయ వస్త్రధారణలో భజనలు, కీర్తనలు చేశారు. పాకిస్తానీ ముస్లింలు సైతం.. అమెరికాలో వర్జీనియా రాష్ట్రం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలోని శ్రీవెంకటేశ్వర లోటస్ టెంపుల్ వద్ద సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీ అమెరికన్లు, క్రైస్తవులు సైతం వేడుకల్లో పాలుపంచుకున్నారు. అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్డాక్’ స్క్రీన్ మీదా కోదండరాముని చిత్రాన్ని ప్రదర్శించారు. లాస్ఏంజిలెస్లో 1,000 మందికిపైగా 250 కార్ల ర్యాలీ చేపట్టారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద భారతీయులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ట్రినిడాడ్, టొబాగో, మారిషస్, ఫిజీ, స్పెయిన్ తదితర దేశాల్లో సంబరాలు జరిగాయి. మెక్సికోలో తొలి రామాలయాన్ని అయోధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తంలోనే ప్రారంభించారు. -
Jefferies report: ఆర్థిక వ్యవస్థకు శ్రీరామజయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా శోభిల్లనుంది. దేశంలోని ఇతర ప్రముఖ ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలను దాటి పర్యాటకుల సందర్శన పరంగా అయోధ్య మొదటి స్థానానికి చేరుకోనుంది. బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ వేసిన అంచనా ప్రకారం ఏటా సుమారు 5 కోట్ల మంది సందర్శకులు అయోధ్యకు రానున్నారు. నూతన విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్షిప్, రహదారుల అనుసంధానం కోసం చేసిన 10 బిలియన్ డాలర్ల వ్యయానికి తోడు కొత్త హోటళ్ల రాక ఇవన్నీ అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాల విస్తృతిని పెంచుతాయని జెఫరీస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య విలసిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఎంతో విశిష్టత కలిగిన తిరుమల ఆలయాన్ని ఏటా 3 కోట్ల మంది వరకు భక్తులు సందర్శిస్తున్నారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు సైతం ఇదే స్థాయిలో సందర్శకులు వస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే వాటికన్ సిటీని ఏటా 90 లక్షల మంది, సౌదీ అరేబియాలోని మక్కాను 2 కోట్ల మంది సందర్శిస్తున్నారు. ఊపందుకోనున్న టూరిజం ‘‘ఆధ్యాత్మిక పర్యాటకం అనేది భారత పర్యాటక రంగంలో అతిపెద్ద విభాగంగా ఉంది. మౌలిక వసతుల సమస్యలు ఉన్నప్పటికీ పలు ప్రముఖ ఆధాతి్మక కేంద్రాలకు ఏటా 1–3 కోట్ల మధ్య పర్యాటకులు విచ్చేస్తున్నారు. మరింత మెరుగైన వసతులు, అనుసంధానంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రం (అయోధ్య) చెప్పుకోతగ్గ స్థాయిలో ఆర్థిక ప్రభావం చూపించనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. కరోనాకు ముందు 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో పర్యాటక రంగం 194 బిలియన్ డాలర్ల వాటా కలిగి ఉంటే, అది ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధితో 2022–23 నాటికి 443 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా 6.8 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన, ప్రముఖ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు వివరించింది. ‘‘పర్యాటకం అయోధ్యకు ఆర్థికపరమైన, మతపరమైన వలసలను పెంచుతుంది. దీంతో హోటళ్లు, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఎఫ్ఎంసీజీ, పర్యాటక అనుబంధ రంగాలు, సిమెంట్ రంగాలు లాభపడనున్నాయి’’అని జెఫరీస్ పేర్కొంది. అయోధ్యలో వసతులు అయోధ్య ఎయిర్పోర్ట్ మొదటి దశ అందుబాటులోకి రాగా, ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యానికి సేవలు అందించే అదనపు దేశీయ, అంతర్జాతీయ టెరి్మనల్ 2025 నాటికి రానుంది. రోజువారీ 60 వేల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. 1,200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్షిప్ నిర్మాణాన్ని తలపెట్టారు. రోడ్ల కనెక్టివిటీని పెంచారు. ప్రస్తుతం 17 హోటళ్లు 590 రూమ్‌లను కలిగి ఉన్నాయి. కొత్తగా 73 హోటళ్లకు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో 40 హోటళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇండియన్ హోటల్స్, మారియట్, విందమ్ ఇప్పటికే హోటళ్ల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీసీ సైతం హోటల్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ఓయో సైతం 1,000 హోటల్ రూమ్‌లను తన ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలని భావిస్తోంది. -
Ayodhya Ram Mandir: వైభవోజ్వల ప్రాణప్రతిష్ట
సాక్షి, అయోధ్య: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన అద్భుత, చరిత్రాత్మక ఘట్టం వైభవోపేతంగా, నిరి్వఘ్నంగా జరిగింది. అయోధ్య భవ్య మందిరంలో రామ్‌లల్లా సోమవారం మధ్యాహ్నం ప్రాణప్రతిష్ట జరుపుకున్నాడు. దివ్యమంగళ రూపంతో, మందస్మిత వదనంతో ఐదేళ్ల నీలమేఘ రాముడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ప్రత్యక్షంగా వేలాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో ఈ వేడుకను కనులారా తిలకించి ఆనంద పరవశులయ్యారు. బంగారు ధనస్సు, బాణంతోపాటు విలువైన స్వర్ణ వజ్రాభరణాలు, పూల దండలు, తులసి మాలలతో అద్భుతంగా అలంకరించిన మర్యాద పురుషోత్తముడి విగ్రహం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ప్రధాన యజమాని(కర్త) హోదాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు. అటంకాలేవీ లేకుండా అనుకున్న ముహూర్తానికే గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత నూతన భవ్య మందిరంపై సైనిక హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడంటూ ప్రధానమంత్రి మోదీ అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అయోధ్యలో జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు అయోధ్యలో ప్రాణప్రతిష్ట ఉత్సవాలు సోమవారం ఉదయమే మొదలయ్యాయి. అతిథులు, ప్రముఖులు ఉదయం నుంచే బారులు తీరారు. సంప్రదాయ సంగీత కళాకారులు రాముడి భక్తి గీతాలు ఆలపించారు. సంగీత వాయిద్యాలతో ఆహూతులకు ఆధ్యాతి్మక పరిమళాలు పంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి తొలుత అయోధ్య ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. పట్టు వ్రస్తాలు, పూజా ద్రవ్యాలతో మధ్యాహ్నం ఆలయం లోపలికి అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్‌తో కలిసి గర్భగుడి ఎదుట కొన్ని క్రతువులు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించారు. మోదీ వెంట భాగవత్‌తో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా, జైశ్రీరామ్ అనే నినాదాలు మార్మోగుతుండగా గర్భాలయం లోపల నరేంద్ర మోదీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల వ్యవధిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించారు. విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికనుంచి మోదీ ప్రసంగించారు. కుబేర తిల శివాలయంలో మోదీ పూజలు రామమందిరంలో ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. శివలింగానికి జలాభిõÙకం నిర్వహించారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రాచీన కుబేర తిల ఆలయాన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. బాధ్యతల నిర్వహణలో జటాయువు పట్టుదలను ఆయన గుర్తుచేసుకున్నారు. 11 రోజుల అనుష్ఠానం విరమించిన ప్రధాని మోదీ అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను ముగించారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్గిరి మహారాజ్ ప్రధానికి చరణామృతం (ఉపచారాలకు వాడే పాలతో చేసిన తీపి పానీయం) ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన పాదాలకు ప్రధాని పాదాలకు సమస్కరించారు. ఉపవాస దీక్షను కొనసాగించిన మోదీ భక్తిని దేవ్గిరి ప్రశంసించారు. అనుష్ఠానం ఆసాంతం మోదీ కటిక నేలపై శయనిస్తూ కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. రోజూ గంటా 11 నిమిషాల పాటు మంత్ర జపం, ధ్యానం చేశారు. రామాలయ కారి్మకులకు ఘనంగా సన్మానం అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన కారి్మకులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. ప్రాణప్రతిష్ట అనంతరం కారి్మకులపై ఆయన కృతజ్ఞతాపూర్వకంగా పూలు చల్లారు. దాంతో ప్రాణప్రతిష్టకు హాజరైన వంద మందికి పైగా కార్మికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
Ayodhya Ram Mandir: మన రాముడొచ్చాడు
జగదానందకారకం.. దివ్యమంగళ స్వరూపం.. మందస్మిత వదనం.. చేత బంగారు ధనుస్సు, బాణం.. స్వర్ణవజ్రాభరణాలు, తులసీమాలల అలంకారం.. కార్యక్రమ ప్రధాన యజమాని (కర్త) హోదాలో ఐదేళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరిగింది. సోమవారం గర్భాలయం లోపల నరేంద్ర మోదీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకన్ల వ్యవధిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించి, విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ‘మన రామయ్య అయోధ్య నగరానికి వచ్చేశాడం’టూ ప్రధాని అతిథుల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన మరుక్షణమే దేశ విదేశాల్లో లక్షలాది మంది భక్తులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాత్రి తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ ఇదే ప్రాంగణంలో ఉన్న కుబేర తిల శివాలయాన్ని దర్శించుకొని, పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయువు పక్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రతువు పూర్తికాగానే మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షను విరమించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆయన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ప్రసంగించారు. సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యకు మన రాముడు వచ్చేశాడని ప్రధానమంత్రినరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సాకారమైన వేళ ప్రతి పౌరుడు ఇకపై దేశ భవిష్యత్ నిర్మాణ మార్గాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశ పురోగమనానికి, ప్రగతికి రామ మందిరం గొప్ప సాక్షిగా ఉంటుందని చెప్పారు. ‘వికసిత్ భారత్’కు ఈ రామ మందిరం సాక్షి అవుతుందని పేర్కొన్నారు. రాముడు ఈ దేశ విశ్వాసం, ఆలోచన, చట్టం, ప్రతిష్ట, వైభవం అని ఉద్ఘాటించారు. రాముడి ప్రభావం ఈ భూమిపై వేల సంవత్సరాలు పాటు కొనసాగిందని గుర్తుచేశారు. ఇదే సరైన సమయమని, రాబోయే వెయ్యేళ్ల భారతదేశానికి పునాది వేయాలని సూచించారు. అయోధ్య ఆలయంలోసోమవారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ అతిథులు, ప్రముఖులు, సాధుసంతులు, భక్త జనులను ఉద్దేశించి దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. భవ్య మందిరం నిర్మాణం పూర్తయ్యిందని, ఒక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. బలమైన, సమర్థవంతమైన, దివ్య, భవ్య భారతదేశాన్ని నిర్మించడానికి మనం ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రజల మనస్సాక్షిలో రాముడి ఆదర్శం ఉండాలని ఉద్బోధించారు. అయోధ్య సభలో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రజల త్యాగానికి నా కృతజ్ఞతలు ‘‘సమిష్టి తత్వంతో సంఘటితంగా, సమర్థవంతంగా పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇది భారతదేశ సమయం. దేశం మరింత ముందుకు సాగబోతోంది. శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడికి చేరుకున్నాం. మనమందరం ఈ యుగం కోసం, ఈ కాలం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు మనం పరుగు ఆపబోం. అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. రామాలయాన్ని సుసాధ్యం చేసిన ప్రజల త్యాగానికి నా కృతజ్ఞతలు. సాధువులు, కర సేవకులు, రామభక్తులకు నా అభినందనలు. ఇది కేవలం శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట మాత్రమే కాదు. శ్రీరాముడి రూపంలో వ్యక్తమయ్యే భారతీయ సంస్కృతిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిష్టించుకొనే కార్యక్రమం. మానవీయ విలువలు, అత్యున్నత ఆశయాలకు భారతీయ సంస్కృతి ప్రతిరూపం. ఇది యావత్ ప్రపంచానికీ అవసరం. ఇది రాముడి రూపంలో ఉన్న జాతీయ చైతన్య ఆలయం. శ్రీరాముడు భారతదేశ విశ్వాసం, పునాది, ఆలోచన, చట్టం, స్పృహ, ఆలోచన, ప్రతిష్ట, కీర్తి. రామ్ అనేది ఓ ప్రవాహం, ఓ ప్రభావం, ఓ నీతి, విశ్వవ్యాప్త ఆత్మ. శ్రీరాముని ప్రాణప్రతిష్ట ప్రభావం వేల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నూతన కాలచక్రానికి నాంది శతాబ్దాల ఎదురు చూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్లీ అయోధ్యకు చేరుకున్నాడు. ఈ శుభ సందర్భాన దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మన రామ్‌లల్లా ఇకపై డేరాలో ఉండడు. దివ్య మందిరంలో ఆయనకు శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. రామజన్మభూమి ఆలయ పూజ, అభివృద్ధి పనులు దేశ పౌరుల్లో కొత్త శక్తిని నింపాయి. రామ భగవానుడి ఆశీర్వాదం వల్లే ఈ మహత్తర సందర్భానికి మనం సాక్షిగా ఉన్నాం. రోజులు, దిశలు, ఆకాశాలు సహా ప్రతిదీ ఈ రోజు దైవత్వంతో నిండి ఉంది. ఇది సాధారణ కాలం కాదు. కాలక్రమేణా ముద్రించబడుతున్న చెరగని స్మృతి మార్గం. బానిస మనస్తత్వపు సంకెళ్లను తెంచుకుని, గత అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది, చరిత్రను లిఖించే గొప్ప సందర్భమిది. భారతీయుల హృదయాల్లో కొలువయ్యాడు బాలరాముడి ప్రాణప్రతిష్టతో చిన్న చిన్న గ్రామాలతో సహా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. దేవాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం ఈ రోజు దీపావళిని జరుపుకుంటోంది. సాయంత్రం వేళల్లో ప్రతి ఇంట్లో ‘రామజ్యోతి’ వెలిగించబోతున్నారు. రామసేతు ప్రారంభ బిందువు అయిన అరిచల్ మునైలో ఇటీవల పర్యటించా. రాముడు పాదం మోపిన అన్ని పవిత్ర ప్రదేశాలను 11 రోజుల అనుష్ఠాన సమయంలో సందర్శించా. నాసిక్‌లోని పంచవటీ ధామ్, కేరళలోని త్రిప్రయార్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వా మి దేవాలయం, రామేశ్వరంలోని శ్రీరామనాథస్వామి దేవాలయం, ధనుషో్కటీని సందర్శించా. సముద్రం నుండి సరయూ నది వరకు నా ప్రయా ణం సాగింది. రఘుకులోత్తమ రాముడు భారతదేశ ఆత్మకు చెందిన ప్రతి కణంతో అనుసంధానమై ఉన్నాడు. రాముడు భారతీయుల హృదయాల్లో కొలువయ్యాడు. భారతదేశంలో ఎక్కడైనా ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో ఏకత్వ భావన కనిపిసుంది. సామూహికతకు ఇంతకంటే కచ్చితమైన సూత్రం మరొకటి లేదు. శ్రీరామ కథను అనేక భాషల్లో నేను ఆలకించాను. మన సంప్రదాయాలు, పండుగల్లో రాముడు ఉన్నాడు. ప్రతి యుగంలో ప్రజలు రాముడిని తలిచారు. తమదైన శైలిలో, మాటల్లో ఆ భగవంతుడిని వ్యక్తీకరించారు. ఈ ‘రామ్రస్’ జీవన ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. రామకథ అనంతం. రామాయణం అంతులేనిది. రాముడి ఆదర్శాలు, విలువలు, బోధనలు ప్రతిచోటా ఒకే విధంగా ఉంటాయి. ప్రతి ప్రయత్నానికీ బలం, సహకారం ప్రతి భారతీయుడిలోని భక్తి, సేవ, అంకితభావం, ఏకత్వం, ఐక్యత అనే భావాలు సమర్థవంతమైన, గొప్ప, దైవిక భారతావనికి ఆధారమవుతాయి. ప్రజలు దేవుడి నుండి దేశానికి(దేవ్ టూ దేశ్), రాముడి నుండి రాజ్యానికి(రామ్ టూ రా్ర‹Ù్ట) చైతన్యాన్ని విస్తరింపజేయాలి. రామభక్త హనుమాన్ సేవ, భక్తి, అంకితభావాన్ని చూసి ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చు. దేశంలో నిరాశకు తావు లేదు. తమ ను తాము చిన్నవారుగా, సామాన్యులుగా భావించే వారు రామాయణంలో రామయ్యకు ఉడుత అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. సంకోచాన్ని వదులుకోవాలి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ప్రయ త్నానికీ బలం, సహకారం ఉంటుంది. విపరీతమైన జ్ఞానం, అపారమైన శక్తి కలిగిన లంకా«దీశుడు రావణుడితో పోరాడి ఓడిపోతానని తెలిసి కూడా చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వర్తించిన జటాయువును ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత అమృత కాలంలో యువత అకుంఠిత విశ్వాసంతో ముందుకు సాగాలి. సంప్రదాయ స్వచ్ఛత, ఆధునికతలను మేళవించడం ద్వారా భారతదేశం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. శ్రీరాముడి తోడ్పాటు, ఆశీస్సులతో దేశం కోసం పని చేస్తామంటూ మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు శ్రీరాముడి ప్రతి పనిలో హనుమంతుడి ఉనికి తప్పనిసరిగా ఉంటుంది. సీతమ్మతోపాటు హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడిని సైతం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఈ ఆలయ నిర్మాణ ప్రధాన ఘట్టంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర మరువలేనిది. రామయ్యా.. నన్ను క్షమించు. అయోధ్యలో ఆలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ట ఆలస్యమైనందుకు ప్రభు శ్రీరాముడిని క్షమాపణలు కోరుతున్నా. మన ప్రయత్నాలు, త్యాగాలు, తపస్సులో ఏదో లోటు జరిగిన కారణంగానే ఇన్ని శతాబ్దాలుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయలేకపోయాం. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో నేడు ఆ లోటు తీరింది. శ్రీరాముడు మనల్ని తప్పకుండా ఈ రోజు క్షమిస్తాడని నమ్ముతున్నా. రామాయణ కాలంలో అయోధ్య నగరం శ్రీరాముడితో 14 ఏళ్ల పాటు వియోగం పొందింది. ఈ యుగంలో అయోధ్యవాసులు, దేశ ప్రజలు రాముడి వియోగాన్ని వందల ఏళ్లపాటు అనుభవించారు. మన దేశ రాజ్యాంగం అసలు ప్రతిలో శ్రీరాముడు ఉన్నప్పటికీ, మందిర నిర్మాణం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. న్యాయం గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచినందుకు భారతదేశ న్యాయ వ్యవస్థకు నా ధన్యవాదాలు. శ్రీరాముడి ఆలయ నిర్మాణం రాజ్యాంగబద్ధంగానే జరిగింది. దైవ ఆశీర్వాదం, దైవిక ఆత్మల వల్లనే మందిర నిర్మాణం పూర్తయ్యింది. నిప్పు కాదు శక్తి పుట్టింది శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భం కేవలం విజయానికి సంబంధించిన అంశం కాదు. ఇది వినయానికి సంబంధించినది. రామ్‌లల్లా ఆలయ నిర్మాణం శాంతి, సహనం, పరస్పర సామరస్యం, భారతీయ సమాజంలోని సమన్వయానికి ప్రతీక. అయోధ్యలో ఆలయం నిర్మిస్తే దేశం అగ్నిగుండం అవుతుందని కొందరు హెచ్చరించారు. పునరాలోచన చేయాలని వారిని కోరుతున్నా. ఈ కట్టడం వల్ల ఏ నిప్పూ పుట్టడం లేదు, శక్తి పుట్టడం చూస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు బాటలో ముందుకు సాగేందుకు రామమందిరం సమాజంలోని ప్రతి వర్గానికీ స్ఫూర్తినిస్తోంది. రాముడు నిప్పు కాదు.. అతడొక శక్తి. అతడు వివాదం కాదు.. పరిష్కారం. రాముడు మనకు మాత్రమే కాదు, అందరికీ చెందినవాడు. రాముడు అనంతుడు. ‘వసుదైవ కుటుంబకమ్’ ఆలోచనే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట. దేశంలో నేడు నిరాశావాదానికి చోటు లేదు. హనుమ, ఉడత, జటాయువుల నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకుందాం. శతాబ్దాల ఎదురుచూపులు, ఎన్నో బలిదానాలు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సుల తర్వాత ఎట్టకేలకు రాముడు మళ్లీ అయోధ్యకు చేరుకున్నాడు. మన రామ్‌లల్లా ఇకపై డేరాలో ఉండడు. దివ్య మందిరంలో ఆయనకు శాశ్వత స్థానం లభించింది. జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక, నవశకానికి నాంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ‘వికసిత్ భారత్’కు ఈ రామ మందిరం సాక్షి. భవ్య మందిర నిర్మాణం పూర్తయింది. ఇక దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఇది భారతదేశ సమయం. – ప్రధాని మోదీ -
‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’
కోల్‌కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ -
Ram Mandir: ‘ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడను నేనే’
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ సుందరంగా చెక్కిన విషయం తెలిసిందే. సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీ రామ్ లల్లా, మా పూర్వికులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఎల్లప్పడూ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఊహాలోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది’ అని యోగిరాజ్ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించి విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగి రాజు చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. రామ్ లల్లా విగ్రహ విశేషాలు.. ► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు. ► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ► ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు. ► స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు. ► శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ► శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
అయోధ్యలో పుట్టిన నేను.. లావణ్య ఎమోషనల్ పోస్ట్
కష్టాలు వస్తే మానవులు చిగురుటాకులా వణికిపోతుంటారు. కానీ సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడికీ కష్టాలు తప్పలేవు. తన ఇంటిని, రాజ్యాన్ని వదిలి పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేశాడు. ఎన్నో గడ్డు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు, విషమ పరీక్షలను దాటాడు. ఆ ధీశాలి అయోధ్యవాసి. కానీ అక్కడేం జరిగింది. దాదాపు 500 ఏళ్లుగా తనకంటూ నిలువనీడ లేకుండా పోయింది. ఈసారి రాములవారికి కష్టం వచ్చిందని మానవులే ఒక్కటయ్యారు, పోరాడారు. శతాబ్దాల పోరాటం అనంతరం ఆయనకు గుడి నిర్మించారు. అయోధ్యలో పుట్టిన నేను.. సోమవారం (జనవరి 22న) శ్రీరాముడి విగ్రహప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా జరుపుకుంటోంది అశేష జనం. ఈ సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. 'రాముని జన్మస్థలమైన అయోధ్యలో పుట్టిన నేను ప్రాణ ప్రతిష్ట వేడుకను తిలకించటం అదృష్టంగా భావిస్తున్నాను. నాతో సహా భారతీయులందరికీ ఇది గర్వించదగ్గ విషయం. ఈ పండగ వాతావరణంలో నేను రామ్ పరివార్ జ్యువెలరీ ధరించడం సంతోషంగా ఉంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కేవలం అయోధ్యలోనే కాదు దేశమంతా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతా ఒక్కటే దేశమంతా ఏకతాటిపైకి వచ్చి రాముడి రాకను సంబరాలు చేసుకుంటోంది. ఇది మనందరినీ ఏకం చేసే ఉత్సవం. ఇది మనలో ఐకమత్యాన్ని, అన్ని వర్గాలవారూ ఒక్కటే అన్న భావాన్ని పెంపొందిస్తుంది. మనసులో భక్తిని నింపుకుందాం.. అయోధ్యలోనే కాకుండా దేశమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం.. జై శ్రీరామ్' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు చీరకట్టులో ఉన్న ఫోటోను జత చేసింది. ఇందులో అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఆమె ధరించిన రామ్ పరివార్. శ్రీరామపట్టాభిషేకాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్న ఈ ఆభరణాన్ని ధరించి అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది లావణ్య. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
Ayodhya Ram Mandir: 32 ఏళ్ల తర్వాత అయోధ్యకు ఉమాభారతి
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH — Uma Bharti (@umasribharti) January 22, 2024 సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే -
అయోధ్యలో అద్భుత ఘట్టం.. సెలబ్రిటీల సంతోషం
భారతీయులు శతాబ్దాల కాలంగా ఎదురుచూసిన కల సాకారమైంది. ఆనాడు రాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే ఈనాడు.. 500 ఏళ్లకు తాను పుట్టిన అయోధ్యలో కొలువుదీరాడు. సోమవారం (జనవరి 22న) రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతఘట్టంతో హిందువుల ఒళ్లు పులకరించిపోతోంది. బాలరాముడిని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. సినీతారలు సైతం అయోధ్య రామమందిర ఆలయ ప్రారంభోత్సవ వేడుకపై సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభం.. ఐక్యత, ఆధ్యాత్మికతకు చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఈ రామమందిర చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. - మహేశ్‌బాబు మనందరికీ ఎంత అద్భుతమైన రోజు ఇది.. జై శ్రీరామ్.. -విజయ్ దేవరకొండ Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024 What a beautiful day for all of us ❤️ Jai Shree Ram! — Vijay Deverakonda (@TheDeverakonda) January 22, 2024 Congrats dearest honourable prime minister Modi Saab on another great achievement and another feather in your cap, Jai Shri Ram. Ram mandir will be remembered for years and generations to come and a tribute to all those who laid their lives and sacrificed themselves for this… — Vishal (@VishalKOfficial) January 22, 2024 Bharat has been waiting for this day for over 500 years 🙏 A heartfelt thanks to Sri @narendramodi ji for making this happen 🙏. Jai Sri Ram! #AyodhaRamMandir #PranaPratishta — Vishnu Manchu (@iVishnuManchu) January 22, 2024 #JaiShriRam 🙏🏼 https://t.co/ez0hwECLqs — Brahmaji (@actorbrahmaji) January 22, 2024 Today is truly historic. Euphoria has engulfed the entire world. Am a proud to be a voice amongst the billion chants as our Ram Lalla comes home to Ayodhya. Sare bolo #JaiShriRam !!! #RamMandirPranPrathistha pic.twitter.com/dNdHQdRlhm — Genelia Deshmukh (@geneliad) January 22, 2024 Can't believe I'm lucky enough to witness something as historic & auspicious as #RamMandirPranPrathistha in my lifetime. Proud to see how our entire nation has united to welcome our Ram Lalla back home in Ayodhya! यह दिन इतिहास में उस दिन के रूप में याद रखा जाएगा जब हमारे देश की… pic.twitter.com/GalftZD1Lq — Ajay Devgn (@ajaydevgn) January 22, 2024 From the sacred grounds of Ram Janmabhoomi to the majestic Ram Mandir, a journey woven with faith and resilience 💫 May today usher blessings and prosperity for all. जय भोलेनाथ, जय श्री राम 🙏🏻 pic.twitter.com/KSwE3v5kRo — Sanjay Dutt (@duttsanjay) January 22, 2024 చదవండి: టాలీవుడ్ టూ బాలీవుడ్.. అయోధ్యలో అగ్ర సినీ తారల సందడి -
అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం!
అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా సాగుతోంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాదిమంది ప్రముఖులు అయోధ్యకు విచ్చేశారు. వీరిలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రముఖులు సైతం ఉన్నారు. భారతీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ వెంబు కుటుంబంతోపాటు ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఒక రోజు ముందే అయోధ్యకు చేరుకున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న సుమారు 500 మంది స్టేట్ గెస్ట్స్ లిస్ట్‌లో శ్రీధర్ వెంబు కూడా ఉన్నారు. తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్న ఆయన తమకు కలిగిన భక్తి పారవశ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్ తన అమ్మ జానకి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో అయోధ్య చేరుకున్నానని ‘ఎక్స్’(ట్విటర్)లో శ్రీధర్ వెంబు తెలియజేశారు. ‘అమ్మ శ్రీరామునికి జీవితాంతం భక్తురాలు. అయోధ్యను దర్శించడం గొప్ప అదృష్టం. జై శ్రీరామ్’ అని పేర్కొంటూ తల్లి, కుటుంబ సభ్యులతో అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. In Ayodhya with my amma Janaki and my brother Kumar and his wife Anu. Amma is a life-long devotee of Lord Shri Ram. Very blessed to be here. Jai Shri Ram 🙏🙏🙏 pic.twitter.com/gwFIE8mZJb — Sridhar Vembu (@svembu) January 21, 2024 -
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ : భక్తులకు బంపరాఫర్
అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యను దర్శించుకునే భక్తుల కోసం పలు విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకునే భక్తుల కోసం విమాన ఛార్జీలపై రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భక్తులు రామ మందిర దర్శన కోసం విమాన టికెట్‌ను ప్రారంభ ధర రూ.1622గా నిర్ధేశించింది. నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు బుక్ చేసుకున్న తేదీని మార్చుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించే అవసరం లేదని తెలిపింది. ఫిబ్రవరి 1, 2024 నుంచి దేశంలో చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై,బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్భంగా నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక అయోధ్య నుంచి వారి నివాస ప్రాంతాలు చేరుకునేందుకు వీలుగా కొత్త విమానాల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి దాదాపూ 200 విమానాల్లో అయోధ్యకు చేరుకునే సౌకర్యం ఉంది. భారత్‌లో ప్రారంభ విమాన టికెట్ ధర రూ.5000 ఉండగా.. ఇతర దేశాల నుంచి అయోధ్యకు చేరుకునేందుకు విమానయాన సంస్థను బట్టి టికెట్ ధర మారుతుంది. కానీ, స్పైస్‌జెట్ మాత్రం ప్రత్యేక ఆఫర్ కింద రూ.1622కే అందిస్తుంది. జనవరి 22 నుంచి జనవరి 28 మధ్య బుక్ చేసుకుంటే జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30,2024లోపు మీరు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. తేదీలను మార్చుకోవచ్చు. -
అయోధ్యలో బాలరాముడి తొలి దర్శనం
-
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్పెషల్ వీడియో!
ఎటు చూసినా జై శ్రీరామ్ పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆ అయోధ్య రాముని నామ జపం చేస్తోంది భారతావని. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహాత్తరమైన అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 500 ఏళ్ల నాటి ప్రతి భారతీయుని కల నెరవేరింది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో అయోధ్య కళకళలాడుతోంది. ఈ అద్భుతమైన కార్యాన్ని వీక్షిస్తూ 140 కోట్లకు పైగా ఉన్నా భారతీయులు ఆ రాముని పట్ల తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. జై శ్రీరామ్ అంటూ తన భార్య జ్యోతిరాజ్ సందీప్‌తో కలిసి నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు మీ కొరియోగ్రఫీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు జై శ్రీరామ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే..
ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించారు. #WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g — ANI (@ANI) January 22, 2024 రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. దర్శన వేళలు ఇవే అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాలరాముడి సన్నిధిలో వ్యాపారవేత్తలు..
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ శుభకార్యానికి దేశంలోని దాదాపు 7000 మంది హాజరుకానున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. మరికొందరు కాసేపట్లో చేరుకుంటారని తెలిసింది. కార్యక్రమానికి హాజరైన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల గురించి తెలుసుకుందాం. ముఖేశ్ అంబానీ దంపతులు Mukesh Ambani, chairperson of Reliance Industries, and Nita Ambani, founder and chairperson of Reliance Foundation, arrived at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya for the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha #Ambani pic.twitter.com/6JrXhw41yG — Jist (@jist_news) January 22, 2024 #Thalaivar #Superstar #Rajinikanth - @sachin_rt - #Ambani #NitaAmbanipic.twitter.com/F7v7kKcqu2 — Rajinikanth Fans (@Rajni_FC) January 22, 2024 ఆకాశ్ అంబానీ దంపతులు #WATCH | Akash #Ambani, Chairman of #RelianceJio Infocomm Ltd along with his wife #ShlokaMehta, arrives at Shri Ram Janmabhoomi Temple in #Ayodhya to attend #RamMandirPranPrathistha ceremony He says, “This day will be written in the pages of history, we are happy to be here.”… pic.twitter.com/etNXVXYBUM — Hindustan Times (@htTweets) January 22, 2024 జోహో వ్యవస్థాపకులు శ్రీధర్వెంబు దంపతులు #AyodhyaRamMandir consecration: 'Very blessed to be here,' says Zoho founder Sridhar Vembu | #RamMandirPranPrathistha #Ayodhya |https://t.co/Ojp14JxdIA — Business Today (@business_today) January 22, 2024 ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకులు, నిశాంత్పిట్టి #WATCH | Ayodhya, Uttar Pradesh: Co-founder of EaseMyTrip, Nishant Pitti says "This is like a historic moment for every Indian. We got goosebumps as soon as we came here..." pic.twitter.com/dDHkUzuzIz — ANI (@ANI) January 22, 2024 జీ సంస్థల ఎండీ, పునీత్గోయెంకా As I arrived at Ayodhya early this morning for the auspicious occasion of Pran Pratishtha, I received a message that the deal that I have spent 2 years envisioning and working towards had fallen through, despite my best and most honest efforts. I believe this to be a sign from… pic.twitter.com/gASsM4NdKq — Punit Goenka (@punitgoenka) January 22, 2024 -
వేయి టన్నుల పూలతో అయోధ్య రామాలయం అలంకరణ
-
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ స్పెషల్ విషెస్
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు. చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!? Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ — Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024 -
అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ.. హాజరైన అగ్ర సినీ తారలు వీళ్లే!
ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరుతున్న రోజు ఇది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది. అయోధ్యలో శ్రీరామమందర నిర్మాణం 500 ఏళ్లనాటి కల నేడు నెరవేరబోతోంది. ఇంతటి అద్భుతమైన ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్య వైపే. ఆ క్షణాలను భక్తితో ఆస్తాదించేందుకు ఇప్పటికే అయోధ్యాపురికి చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ అగ్ర సినీ తారలంతా శ్రీరామనామం జపిస్తూ అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ అద్భుతమైన మహాత్తర వేడుకను వీక్షించేందుకు వెళ్లిన సినీతారలపై ఓ లుక్కేద్దాం. అయోధ్యకు మెగాస్టార్ దంపతులు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరిన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్‌కు అయోధ్యలో ఘనస్వాగతం లభించింది. వీరితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. టాలీవుడ్ హీరో సుమన్ ఇప్పటికే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. అయోధ్యలో బాలీవుడ్ తారల సందడి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీక్షించేందుకు బాలీవుడ్ అగ్రతారలంతా హాజరవుతున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ నానే, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్ నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, మహావీర్ జైన్, రోహిత్ శెట్టి రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్లారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, సినీ నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్, సింగర్ సోనూ నిగమ్, మనోజ్ జోషి ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. అయోధ్యలో తలైవా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ సైతం ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను తిలకించేందుకు నటుడు ధనుశ్ కూడా బయలుదేరి వెళ్లారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Actor Suman says, "Congratulations and best wishes to PM Modi and CM Yogi Adityanath. These two are like Ram and Lakshman and had this temple come up here, I think has been God's doing. He created them to build this temple...This will be the… pic.twitter.com/bvi94YgnfN — ANI (@ANI) January 22, 2024 VIDEO | Actors @SrBachchan, @juniorbachchan, BJP leader @rsprasad, industrialist Anil Ambani reach Ayodhya Ram Mandir to attend the Pran Pratishtha ceremony.#RamMandirPranPratishtha #AyodhyaRamMandir pic.twitter.com/yibxh5Xbuf — Press Trust of India (@PTI_News) January 22, 2024 #WATCH | Telegu superstars Chiranjeevi and Ram Charan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/1vhq7yhX1Z — ANI (@ANI) January 22, 2024 MegaStars ✨ #RamCharan and #Chiranjeevi garu are being Welcomed in Ayodhya 🚩#RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/WbUcOsvtaQ — Ujjwal Reddy (@HumanTsunaME) January 22, 2024 Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 Actors Madhuri Dixit Nane, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmakers Rajkumar Hirani, Mahaveer Jain and Rohit Shetty left for Ayodhya to attend the Pran Pratishtha ceremony at the Ram Temple. pic.twitter.com/WDpI9cWCPT — ANI (@ANI) January 22, 2024 -
నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచిన టెలికాం కంపెనీలు.. ఎందుకంటే..
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కాసేపట్లో జరగబోతుంది. రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు సందడిగా పాల్గొంటున్నాయి. దాదాపు 7000 మంది అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని కోట్లమంది ఈ క్రతువును పరోక్షంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాల్లో వీక్షించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే టెలికాం సంస్థలు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అయోధ్యలో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా, వీడియో స్ట్రీమింగ్ వంటి సదుపాయాల్ని పొందొచ్చని చెప్పాయి. ఇదీ చదవండి: అయోధ్యలో హూటల్ రూం ధర ఎంతంటే..? అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్‌నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పటిష్ట సిగ్నలింగ్ కోసం స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అదనపు నెట్వర్క్ సైట్లు, అంతరాయం లేని నెట్వర్క్ అందించటం కోసం ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. -
అయోధ్య చేరుకున్న మెగాస్టార్ దంపతులు
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరు కానున్నారు. 500 ఏళ్లనాటి భారతీయుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం పాల్గొననుంది. మెగాస్టార్, రామ్ చరణ్ అయోధ్యకు పయనమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే అయోధ్య ఆహ్వానం రావడాన్ని తన పూర్వ జన్మ సుకృతమని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని చిరంజీవి తన్మయత్వానికి లోనయ్యారు. MegaStars ✨ #RamCharan and #Chiranjeevi garu are being Welcomed in Ayodhya 🚩#RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/WbUcOsvtaQ — Ujjwal Reddy (@HumanTsunaME) January 22, 2024 Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
Antilia: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్
అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7000 మంది ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు, దేశం మొత్తం చిన్నా.. పెద్దా దేవాలయాలు సైతం సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) ముంబైలోని తన నివాస భవనాన్ని రామ నామంతో నింపేశారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ముఖేష్ అంబానీ తన యాంటిలియా భవనాన్ని చాలా అందంగా డెకరేట్ చేయించారు. మొత్తం భవనం దీపాలతో, జై శ్రీరామ్ అనే నామాలతో సెట్ చేయించారు. అద్భుతమైన లైటింగ్‌తో కనిపించే ఈ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సుందరంగా తయారైన యాంటాలియా భవనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తం 27 అంతస్తులు రామ నామాలతో కనిపించడం వీడియోలలో చూడవచ్చు. ఇదీ చదవండి: ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా? అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యే అతిధులలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఈయన ఈ రోజు రామ మందిరంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అంబానీ మాత్రమే కాకుండా దేశంలో ఇతర పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరు కానున్నారు. -
శ్రీరాముని కోసం సీనియర్ నటి ప్రత్యేక గీతం..!
సీనియర్ నటి సుకన్య దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయకిగా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా నటి సుకన్య శ్రీరాముని కోసం ఓ భక్తి గీతాన్ని రూపొందించింది. అయోధ్య శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో దీపోత్సవం
Ram mandir pran pratishtha Live Updates సాయంత్రం 5.30:.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో దీపోత్సవం సరయూ నది ఒడ్డున 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు దీప కాంతులతో వెలిగిపోతున్న సరయూ తీరం దేశ వ్యాప్తంగా ఇంటింటా రామజ్యోతి రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మనిరామ్ దాస్ చావ్నీ దీపాలతో అలంకరణ रामज्योति! #RamJyoti pic.twitter.com/DTxg2QquTT — Narendra Modi (@narendramodi) January 22, 2024 సాయంత్రం 4గం.. సోమవారం, జనవరి 22 బాల రాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తి రేపటి నుంచి సామాన్య భక్తులకు భగవాన్ రామ్ లల్లా దర్శనం వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం మొదటి స్లాట్ ఉదయం 7 నుండి 11:30 వరకు రెండో స్లాట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉదయం 6:30కు ఆలయంలో జాగ్రన్ , శృంగార్ హరతి హరతికి ఒక రోజు ముందుగానే బుకింగ్. రాత్రి 7 గంటలకు సాయంత్రం హారతి సమయం ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ వెబ్సైట్లో బుకింగ్ 3గం:10ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి ప్రధాని మోదీ సన్మానం పూలు జల్లి కృతజ్ఞతలు తెలిపిన మోదీ. 2గం:12ని.. సోమవారం, జనవరి 22 ఈరోజు మన రాముడు వచ్చేశాడు: ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామచంద్రమూర్తి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ రామ భక్తులందరికీ నా ప్రణామాలు ఈరోజు మన రాముడు వచ్చేశాడు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు వచ్చేశాడు ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనది ఇది సామాన్యమైన సమయం కాదు రాముడు భారతదేశ ఆత్మ రాముడు భారతదేశానికి ఆధారం ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఎంతో చెప్పాలని ఉన్నా.. నా గొంతు గద్గదంగా ఉంది నా శరీరం ఇంకా స్పందించే స్థితిలో లేదు ఎంతో అలౌకిక ఆనందంలో ఉన్నాను అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నా చేతులు మీదుగా జరగడం నా అదృష్టం జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది మన రాముడు టెంట్లో ఉండే పరిస్థితులు ఇక లేవు మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారు రాముడి దయవల్ల మనమందరం ఈ క్షణానికి సాక్షులమయ్యాం ఈ నేల, గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయం ఇంత ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా త్రేతాయుగంలో శ్రీరాముడు కేవలం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాడు కలియుగంలో రాముడు వందలయేళ్లపాటు వనవాసం చేశాడు భారత న్యాయవ్యవస్థకు ఈరోజు నేను నమస్కరిస్తున్నా న్యాయబద్ధంగానే శ్రీరాముడి మందిర నిర్మాణం జరిగింది ఈరోజు దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి దేశ ప్రజలందరూ ఇవాళ దీపావళి జరుపుకుంటున్నారు ఇంటింటా రాముడి దీపజ్యోతి వెలిగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికింది బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భించింది ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు రాముడు వివాదం కాదు.. ఒక సమాధానం రాముడు వర్తమానమే కాదు.. అనంతం రాముడు అందరివాడు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారిని అయోధ్యకు ఆహ్వానిస్తున్నా ఇవాళ్టి ఈ చరిత్ర వేలయేళ్లపాటు నిలిచిపోతుంది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం సేవా, చింతన భక్తిని.. హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలి రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం నేను సామాన్యుడిని, బలహీనుడినని భావిస్తే.. ఉడత నుంచి ప్రేరణ పొందండి 2గం:10ని.. సోమవారం, జనవరి 22 మోదీ గొప్ప తపస్వి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయోధ్యలో బాలరాముడితోపాటు భారత కీర్తి తిరిగొచ్చింది. మోదీ గొప్ప తపస్వి ప్రధాని మోదీ కఠిన నియమాలు పాటించారు. ఈ కార్యక్రమాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదు కష్టకాలలంలో ప్రపంచశాంతికి ఇది దిక్సూచిలాంటింది ఎందరో త్యాగాల ఫలితం ఇవాళ్టి సువర్ణ ఆధ్యాయం 1గం:58ని.. సోమవారం, జనవరి 22 యోగి భావోద్వేగ ప్రసంగం 50ం ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది ఎన్నో తరాలు ఈ క్షణం కోసం నిరీక్షించాయి ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు దేశంలోని ప్రతీ పట్టణం, గ్రామం అయోధ్యగా మారింది ప్రతీ ఒక్కరూ ఆనంద భాష్పాలతో అయోధ్య వైపు చూశారు కలియుగం నుంచి త్రేతాయుగంలోకి వచ్చామ్మా? అనే భావన నెలకొంది ప్రతీ రామ భక్తుడు సంతృప్తి.. గర్వంతో ఉన్నాడు తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చింది ఆ మహాసంకల్పం మోదీ చేతుల మీదుగా పూర్తయ్యాయింది బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైంది #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The entire country has become 'Rammay'. It seems that we have entered Treta Yug..."#RamMandirPranPrathistha pic.twitter.com/6Sd7lJrOy8 — ANI (@ANI) January 22, 2024 1గం:55ని.. సోమవారం, జనవరి 22 మోదీ కఠోర దీక్ష విరమణ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం నరేంద్ర మోదీ కఠోర ఉపవాసం ప్రధాని మోదీ 11 రోజుల కఠోర దీక్ష దీక్ష విరమింపజేసిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మోదీకి వెండి ఆలయ నమునా ఇచ్చిన.. బంగారు ఉంగం ఇచ్చిన ట్రస్ట్ 11 రోజులపాటు మోదీ కఠోర దీక్ష చేశారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ దేశవ్యాప్తంగా ఆయన అన్ని ఆలయాలు తిరిగారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొబ్బరి నీళ్లు తాగి నేల మీద పడుకున్నారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఇలాంటి సంకల్ప బలం ఉన్న వ్యక్తి దేశ నాయకుడు కావడం గర్వకారణం: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ #WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ — ANI (@ANI) January 22, 2024 1గం:33ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే అయోధ్యలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపటి నుంచి సామాన్యుల సందర్శనకు అనుమతి రెండు స్లాట్ల కేటాయింపు ఉదయం 7 నుంచి 11గం.30ని వరకు.. మధ్యాహ్నాం 2గం. నుంచి 7 గం. వరకు అనుమతి 1గం:28ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా భావోద్వేగమే! అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశమంతటా భావోద్వేగ సన్నివేశాలుఔ దేశమంతటా రామ నామ స్మరణం కాషాయ వర్ణంతో మురిసిపోతున్న హిందూ శ్రేణులు ఆలింగనంతో కంటతడిపెట్టిన బీజేపీ నేత ఉమాభారతి, సాధ్వీ రీతాంభరలు రామ మందిర ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ఈ ఇద్దరూ 1గం:16ని.. సోమవారం, జనవరి 22 రామ్ లల్లాకు తొలి హారతి అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన శ్రీరామ చంద్రుడు రమణీయంగా సాగిన ప్రాణప్రతిష్ట క్రతువు కర్తగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి అవతారంలో కొలువు దీరిన వైనం పసిడి కిరీటం, పట్టు వస్త్రం సమర్పణ దేశమంతటా రామ భక్తుల సందడి రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ రామయ్యకు మోదీ సాష్టాంగ నమస్కారం #WATCH | PM Modi performs 'Dandavat Pranam' at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/kAw0eNjXRb — ANI (@ANI) January 22, 2024 12గం:54ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం.. తొలి దర్శనం అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రామ్ లల్లా తొలి దర్శనం రామనామస్మరణతో ఉప్పొంగిపోతున్న హిందూ హృదయాలు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహాగంభీరంగా జరిగిన ప్రాణప్రతిష్ట క్రతువు పద్మపీఠంపై ధనుర్ధారియై బాలరాముడి తొలి దర్శనం మెడలో రత్నాల కాసుల మాల స్వర్ణాభరణాలతో బాలరాముడు తలపై వజ్రవైడ్యూరాల్యతో పొదిగిన కిరీటం పాదాల వద్ద స్వర్ణ కమలాలు సకలాభరణాలతో బాలరాముడి నుదుట వజ్రనామం 84 సెకన్ల దివ్య ముహూర్తంలో సాగిన ప్రాణ ప్రతిష్ట క్రతువు ఆ సమయంలో అయోధ్య ఆలయంపై హెలికాఫ్టర్లతో పూల వర్షం Prime Minister Narendra Modi performs 'aarti' of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/EDjYa3yw7V — ANI (@ANI) January 22, 2024 12గం:30ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయోధ్యలో నూతన రామ మందిరంలో కొలువుదీరనున్న బాలరాముడు రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కర్తగా ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతున్న దేశం మరికొద్ది నిమిషాల్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట 12గం:26ని.. సోమవారం, జనవరి 22 గర్భాలయంలోకి ప్రధాని మోదీ ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలోకి మోదీ గర్భాలయంలో ప్రాణప్రతిష్ట పూజల్లో ప్రధాని మోదీ మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వేదమంత్రాల నడుమ కొనసాగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు 12గం:20ని.. సోమవారం, జనవరి 22 ప్రారంభమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం అయోధ్య రామ మందిరంలోకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకొచ్చిన మోదీ వెంట ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ #WATCH | Prime Minister Narendra Modi arrives at Shri Ram Janmaboomi Temple in Ayodhya to participate in the Ram Temple Pran Pratishtha ceremony pic.twitter.com/XkLf1aV1hh — ANI (@ANI) January 22, 2024 12గం:00ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపురూప క్షణాలు అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నం మరికాసేపట్లో రామ మందిరంలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహణ మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు దివ్యముహూర్తం ముందుగా రామ్‌లల్లా విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగింపు బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దడం ఆపై రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది 11గం:43ని.. సోమవారం, జనవరి 22 ఆలయంపై పుష్పవర్షం.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగిస్తారు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరిస్తాయి ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు వారిద్దరు రామలక్ష్మణుల్లా రామమందిరాన్ని నిర్మించారు: సినీ నటుడు సుమన్ సినీనటుడు సుమన్ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు: సుమన్ వారిద్దరు రామలక్ష్మణుల మాదిరిగా కష్టపడి రామాలయాన్ని నిర్మించారు రామాలయ నిర్మాణానికి భగవంతుడు వారికి సహకరించారు శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన మహావ్యక్తి రాముడు అనే భావనకు ఆకర్షితులవుతాం ఆయన బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి ‘రామరాజ్యం’ అనే ఆదర్శ పాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష ఇప్పుడు ‘రామ్’ అనే పదం యావత్ ప్రపంచానికి చెందింది: ఆనంద్ మహీంద్రా 11గం:29ని.. సోమవారం, జనవరి 22 సాయంత్రం దాకా మోదీ ఇక్కడే ఉదయం 11 గంటల ప్రాంతంలో రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్ తిలాలో ఉన్న శివ మందిర్‌ను సందర్శన సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి పయనం అయోధ్య ప్రాణప్రతిష్ట.. అంతటా ఇలా.. New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 At Eiffel tower Paris. 🥳 Jai Shri Ram 🚩#JaiShriRam #RamLallaVirajman #RamMandirPranPratishta #AyodhaRamMandir #Ayodhya #AyodhyaRamMandir pic.twitter.com/mOZVCBZJF1 — Secular Chad (@SachabhartiyaRW) January 22, 2024 New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 San Francisco 🇺🇸 turned into Ayodhya 🇮🇳 for a night to celebrate the RamMandir Inauguration 🚩 Jai Shree Ram 🙏#RamMandirPranPrathistha pic.twitter.com/M3eQQMFym1 — SaNaTaNi ~ 𝕏𝐎𝐍𝐄 🚩 (@xonesanatani) January 22, 2024 श्री राम के दर्शन करने पहुंचे भारतीय क्रिकेटर।।।#जयश्रीराम #अयोध्या #JaiSriRam #AyodhyaRamMandir pic.twitter.com/DedGNBdMs6 — Hriday Singh (@hridaysingh16) January 22, 2024 11గం:22ని.. సోమవారం, జనవరి 22 కాసేపట్లో ప్రాణప్రతిష్ట అయోధ్యలో ప్రధాని మోదీ దేశమంతటా రామనామస్మరణ సర్వోన్నతంగా నిర్మించిన రామ మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం జాబితాలో చోటు ఐదేళ్ల బాలరాముడి అవతారంలో రామ్ లల్లా కాసేపట్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇప్పటికే రామజన్మ భూమికి భారీగా భక్తజనం 11గం:00ని.. సోమవారం, జనవరి 22 మరో దీపావళిలా.. దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు అన్ని ఆలయాల్లో.. ప్రత్యేకించి రామాలయం, హనుమాన్ గుడిలలో ప్రత్యేక పూజలు జై శ్రీరామ్ నినాదాలతో.. భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆలయాల్లోనే కాదు.. ప్రతీ ఇంటా దీపం రావణుడిపై జయం తర్వాత శ్రీరాముడు రాక సందర్భంగా దీపావళి ఇప్పుడు అయోధ్య మందిర నేపథ్యంలో దీపాలంకరణలతో.. మరో దీపావళిలా దివ్యోత్సవం 10గం:45ని.. సోమవారం, జనవరి 22 భారీగా ప్రముఖులు.. భద్రత కాసేపట్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట పాల్గొననున్న ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్న అన్ని రంగాల ప్రముఖులు అన్ని రాష్ట్రాల నుంచి సినీ రంగాల ప్రముఖులు పలువురు రాజకీయ ప్రముఖులు 12 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభం 10గం:40ని.. సోమవారం, జనవరి 22 తెలంగాణ అంతటా.. ఆధ్యాత్మిక శోభ అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణలో కోలాహలం పలు ఆలయాలు సుందరంగా ముస్తాబు అర్ధరాత్రి నుంచి మైక్ సెట్లతో హడావిడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీరామచంద్రుడి పల్లకి ఊరేగింపు లొ పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ 10గం:35ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న ప్రధాని మోదీ కాసేపట్లో అయోధ్య రామజన్మభూమికి మోదీ మ.1.15ని. విశిష్ట సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. జై శ్రీరామ్ నినాదాలతో.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్న రామ భక్తులు వేలాది మంది సాధువులు దేశం నుంచి అయోధ్యకు వెయ్యి రైళ్లు ఇప్పటికే అయోధ్యలో హోటళ్లు ఫుల్లు పవిత్రోత్సవం తర్వాత దేదీప్యమానంగా అయోధ్య సాయంత్రం 10 లక్షల దీపాలతో శ్రీరామ జ్యోతి 10గం:10ని.. సోమవారం, జనవరి 22 భక్తితో పురిటి నొప్పులు ఓర్చుకుంటూ..?! దేశమంతా రామమయం అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట ఆ శుభముహూర్తం కోసం గర్బిణీల ఎదురు చూపులు పుత్రుడు జన్మిస్తే రాముడు.. ఆడపిల్ల జన్మిస్తే సీత పేరు పెడతారట మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఆ శుభ గడియ కోసం గర్భిణీలు ఇక్కడే కాదు.. దేశమంతా శుభముహూర్తం కోసం ఎదురు చూపులు పురిటి నొప్పులు వస్తున్నా.. ఓపిక పడుతున్న గర్బిణీలు 10గం:10ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో టైట్ సెక్యూరిటీ ఏడెంచెల భద్రతా వలయం నడుమ అయోధ్య రామ మందిరం వేల మంది యూపీ పోలీసులు వందల సంఖ్యలో కేంద్ర బలగాల సిబ్బంది ప్రధాని రాక నేపథ్యంలో ప్రత్యేక సిబ్బంది మోహరింపు ప్రతీ ఒక్కరిపై కన్నేసేలా ఏఐ టెక్నాలజీ 10వేలకు పైగా సీసీ కెమెరాలు.. డ్రోన్ల నిఘా 10గం:02ని.. సోమవారం, జనవరి 22 బాలరాముడ్ని అద్దంలో చూపిస్తూ.. కాసేపట్లో అయోధ్యకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నంతా రామేశ్వరంలో మోదీ ప్రత్యేక పూజలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కఠిన ఉపవాస.. కఠోర నియమాలు పాటిస్తున్న మోదీ గత 74 ఏళ్లుగా అయోధ్యలో తాత్కాలిక విగ్రహానికి పూజలు ఉత్తరాది నాగర స్టయిలో కొత్త రామ మందిర ఆలయ నిర్మాణం 392 పిల్లర్లు.. ఆలయానికి 44 తలుపులు నేడు ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడి విగ్రహం ముందుగా దశ దర్శనాలు తొలుత అద్దంలో బాలరాముడ్ని.. బాలరాముడికే చూపించనున్న ప్రధాని మోదీ 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ట క్రతువు థాయ్‌లాండ్‌లో ఇలా.. Thailand pic.twitter.com/ZqaIxPW8gh — Megh Updates 🚨™ (@MeghUpdates) January 21, 2024 09గం:49ని.. సోమవారం, జనవరి 22 ఏపీలో ఇలా.. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేళ.. ఏపీలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతున్న రామ మందిరాలు, ఆలయాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్న సమారాధనలు జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు చేస్తున్న రామభక్తులు.. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో యల్.ఇ.డి స్క్రీన్ లు ఏర్పాటు ఏలూరు ధర్మభేరి ప్రాంగణంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని పురవీధుల్లో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపు శ్రీరామ నామస్మరణం చేస్తూ పాల్గొన్న భక్తాదులు 09గం:45ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు అయోధ్య చేరుకున్న చిరంజీవి దంపతులు.. తనయుడు రామ్ చరణ్ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను: చిరంజీవి నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడుఅని భావిస్తున్నా: చిరంజీవి అయోధ్యలో రామ మందిరం కోట్లమంది చిరకాల స్వప్నం.. ఎంతో ఉద్వేగభరితంగా ఉంది: రామ్‌చరణ్ #WATCH | Uttar Pradesh: Telegu superstars Chiranjeevi and Ram Charan arrive in Ayodhya. Ayodhya Ram Temple Pran Pratishtha ceremony is taking place today. pic.twitter.com/wT0gvlLPiS — ANI (@ANI) January 22, 2024 #WATCH | Telangana | Actor Chiranjeevi leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today. He says, "That is really great. Overwhelming. We feel it's a rare opportunity. I feel Lord Hanuman who is my deity, has… pic.twitter.com/FjKoA7BBkQ — ANI (@ANI) January 22, 2024 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అద్వానీ రావట్లేదు బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య వేడుకకు గైర్హాజరు 96 ఏళ్ల వయసురిత్యా తొలుత దూరంగా ఉండాలని నిర్ణయం ఆ వెంటనే మనుసు మార్చుకుని హాజరవుతానని ప్రకటించిన అద్వానీ తీవ్ర చలి ప్రభావంతోనే హాజరు కావట్లేదని తాజా ప్రకటన అద్వానీకి ఆహ్వానం అందకపోవడంపైనా రాజకీయ విమర్శలు ఆహ్వానం స్వయంగా అందించినట్లు వెల్లడించిన ట్రస్ట్ సభ్యులు 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. అమృత్‌సర్‌లో శోభాయాత్ర #WATCH | Punjab: 'Shobha yatra' being taken out in Amritsar, ahead of Pran Pratishtha ceremony of the Ram Temple in Ayodhya today. pic.twitter.com/6EfSbJhNDQ — ANI (@ANI) January 22, 2024 08గం:35ని.. సోమవారం, జనవరి 22 ప్రముఖ నటుడి ప్రత్యేక పూజలు సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ ప్రత్యేక పూజలు హనుమంతుడికి పూజలు చేసిన అనుపమ్ ఖేర్ మరో దీపావళి పండుగలా ఉందంటూ వ్యాఖ్య #WATCH | Ayodhya | Actor Anupam Kher says, "Before going to Lord Ram, it is very important to have the darshan of Lord Hanuman...The atmosphere in Ayodhya is so graceful. There is slogan of Jai Sri Ram in the air everywhere...Diwali has come again, this is the real Diwali." pic.twitter.com/GCskErgi1Z — ANI (@ANI) January 22, 2024 08గం:31ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో ఇవాళ.. కాసేపట్లో.. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం అయోధ్యలో వంద చోట్ల ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శన రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చి సందడి కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం 08గం:18ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా డ్రోన్లే మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ప్రధాని సహా వీవీఐపీలు, వీఐపీల రాక నేపథ్యంలో.. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోల మోహరింపు వేల మంది యూపీ పోలీసుల మోహరింపు కేంద్ర బలగాల పహారా నడుమ అయోధ్యాపురి డ్రోన్ నిఘా నీడలో అయోధ్య 08గం:00ని.. సోమవారం, జనవరి 22 ప్రాణప్రతిష్ట క్రతువు కొన్ని సెకన్లే.. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట మధ్యాహ్నాం 12గం.29ని.. నుంచి 12గం.30ని.. మధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తం నూతన రామాలయంలో 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట రామ్‌లల్లా విగ్రహానికి జరగనున్న ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేయించనున్న వారణాసి అర్చకులు అయోధ్యలో విశిష్ట సభలో 1గం. నుంచి 2గం. మధ్య ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రసంగాలు హాజరు కానున్న అన్ని రాష్ట్రాల రామ భక్తులు 7 వేలమందికి ఆహ్వానం.. భారీగా ప్రముఖుల రాక కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు 07గం:55ని.. సోమవారం, జనవరి 22 ‘రామ’కు వెలుగులు దేశవ్యాప్తంగా రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లకు ప్రత్యేక ముస్తాబు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 343 రైల్వేస్టేషన్లకు హంగులు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న స్టేషన్లు రైల్వే శాఖ నిర్ణయంపై సర్వత్రా హర్షం రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 07గం:48ని.. సోమవారం, జనవరి 22 500 ఏళ్ల హిందువుల కల నెరవేరుతున్న వేళ.. మరికొద్ది గంటల్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మ.12 నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట అనంతరం కుబేర్ తిలక్‌లో భగవాన్ శివుని పురాతన మందిరాన్ని సందర్శించనున్న మోదీ ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొననున్న దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, ధార్మిక శాఖల ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రాణ ప్రతిష్ట అనంతరం విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతోనూ ప్రధాని మోదీ ముచ్చట్లు విదేశాల్లోనూ శ్రీరామం అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేడుకలు పలు దేశాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు 50కి పైగా దేశాల్లో అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల కార్ల ర్యాలీలు టైమ్స్ స్క్వేర్ సహా పలు చోట్ల లైవ్ టెలికాస్టింగ్‌కు ఏర్పాట్లు ఫ్రాన్స్‌లో రథయాత్ర.. ఈఫిల్ టవర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం US: 'Overseas Friends of Ram Mandir' distributes laddoos at Times Square ahead of Pran Pratishtha Read @ANI Story | https://t.co/tJPnNvaKt2#TimesSquare #PranPratishthaRamMandir #NewYork pic.twitter.com/IWAMSJWAYy — ANI Digital (@ani_digital) January 22, 2024 #WATCH | Indian diaspora in the United States offer prayers at Shree Siddhi Vinayak temple in New Jersey ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/gCt2EZL7qL — ANI (@ANI) January 22, 2024 07గం:35ని.. సోమవారం, జనవరి 22 ఈ ఉదయం రామజన్మభూమి ఇలా.. #WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/O1Iuay8Dd7 — ANI (@ANI) January 22, 2024 07గం:28ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు బిగ్‌బీ అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు అమితాబ్ బచ్చన్ రామమందిర వేడుక కోసం భారీగా తరలిన వీవీఐపీలు #WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya. Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ — ANI (@ANI) January 22, 2024 07గం:15ని.. సోమవారం, జనవరి 22 50 వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహించేందుకు సిద్ధమైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం 06గం:55ని.. సోమవారం, జనవరి 22 వైద్య సేవలతో సహా.. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం సర్వాంగ సుందరంగా అయోధ్య అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసుల మోహరింపు ప్రతి వీధిలో బారికేడ్ల ఏర్పాటు రసాయన, బయో, రేడియోధార్మిక, అణు దాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరించింది భూకంప సహాయక బృందాల నియామకం ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్ల ఏర్పాటు ఎయిమ్స్ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలు అయోధ్యలో ప్రధాని అయోధ్య షెడ్యూల్: 10గం:25ని అయోధ్య విమానాశ్రయానికి చేరిక 10గం:45ని అయోధ్య హెలిప్యాడ్‌కు చేరుకోవడం 10గం:55ని. శ్రీరామ జన్మభూమికి రాక.. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: రిజర్వ్ మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు: ప్రతిష్ఠాపన కార్యక్రమం.. మధ్యాహ్నం 12:55: పూజా స్థలం నుండి బయటకు మధ్యాహ్నం 1:00: బహిరంగ వేదిక వద్దకు చేరిక మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.. అయోధ్యలో పబ్లిక్ ఫంక్షన్‌కు హాజరు విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. పలువురు మధ్యాహ్నం 2:10: కుబేర్ తిల దర్శనం 06గం:49ని.. సోమవారం, జనవరి 22 దేదీప్యమానంగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో.. సర్వాంగ సుందరంగా అయోధ్య రకరకాల పూలతో.. రంగు రంగుల విద్యుద్దీపాలతో రామమందిర అలంకరణ శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాల ఏర్పాటు విల్లంబుల కటౌట్ల ఏర్పాటు సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలు మంచి ఘడియలు వచ్చాయి (శుభ్ ఘడీ ఆయీ), అయోధ్య ధామం తయారైంది (తయ్యార్ హై అయోధ్య ధామ్), శ్రీరాముడు ఆసీనులవుతారు (విరాజేంగే శ్రీరామ్), రాముడు మళ్లీ తిరిగొస్తారు (రామ్ ఫిర్ లౌటేంగే), అయోధ్యలో రామరాజ్యం వచ్చింది (అయోధ్యమే రామ్ రాజ్య) అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు రామాయణంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరణ రామ్ మార్గ్, సరయూ నది తీరం, లతా మంగేష్కర్ చౌక్‌లలో కటౌట్ల ఏర్పాటు అయోధ్య నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు సరయూ తీరంలో ప్రతి రోజూ హారతి ఇచ్చే ఏర్పాట్లు What a goosebumps view from Mundra (Kutch, Gujarat)... No sanathan will pass without liking this ♥️ Jai shree ram 🛐#JaiShriRam #RamMandirPranPrathistha #ShriRam #AyodhyaRamMandir#RamLallaVirajman#RamMandir #RamLallaVirajman#WorldInAyodhya pic.twitter.com/48WssugiGv pic.twitter.com/DZhGfFXNWf — BRAKING NEWS 🤯 (@Jamesneeesham) January 22, 2024 06గం:45ని.. సోమవారం, జనవరి 22 పలు చోట్ల సెలవు అయోధ్య ఉత్సవం నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేడు సెలవు ఒడిశాలోనూ సెలవు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ ఒక పూట సెలవు స్టాక్ మార్కెట్లు బంద్ పలు బీజేపీ యేతర రాష్ట్రాల్లోనూ స్కూళ్ల స్వచ్ఛంద సెలవు 06గం:42ని.. సోమవారం, జనవరి 22 నలుమూలల నుంచి భారీ కానుకలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్ నుంచి పూలు చింధ్వారా నుంచి 4.31 కోట్ల రామ నామాల ప్రతి అయోధ్యకు చేరిక సీతాదేవి కోసం ప్రత్యేకంగా గాజులు 108 అడుగుల అగర్బత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులు నేపాల్‌లోని సీతాదేవి జన్మ స్థలి నుంచి 3,000 బహుమతులు 06గం:40ని.. సోమవారం, జనవరి 22 భారీగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు అయోధ్య ఈవెంట్ కోసం 22,825 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఏర్పాట్లు 51 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు పూర్తి డ్రోన్లతో గస్తీ నిర్వహణ 06గం:34ని.. సోమవారం, జనవరి 22 ఏడు వేల మంది అతిథులు మతాలకతీతకంగా అయోధ్య వేల మంది గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పాదయాత్ర, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరిక రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులకు ఆహ్వానం ఆహ్వానితుల్లో 506 మంది అత్యంత ప్రముఖులు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్లకు ప్రత్యేక ఆహ్వానం సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులకూ ఆహ్వానం.. ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరిక ప్రతిపక్ష నేతలనూ ఆహ్వానించినా.. గైర్హాజరుకే మొగ్గు 06గం:28ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర విశేషాలు.. రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనం ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుంది మూడు అంతస్థుల్లో ఆలయ నిర్మాణం ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు.. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు 06గం:22ని.. సోమవారం, జనవరి 22 ముహూర్తం ఎప్పుడంటే.. అభిజిల్లగ్నంలో బాలరాముడిని ప్రతిష్టించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగింపు ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా పూజాది కార్యక్రమాలు 16వ తేదీన ప్రారంభం.. ఆదివారంతో ముగింపు 06గం:15ని.. సోమవారం, జనవరి 22 అంతా రామమయం రామ నామ స్మరణతో మారుమోగుతున్న భారత్ దేశ, విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను వీక్షణ పవిత్రోత్సవం అనంతరం దేదీప్యోమానంగా అయోధ్య వాషింగ్టన్ డీసీ, పారిస్ నుంచి సిడ్నీదాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ. దాదాపు 60 దేశాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక కార్యక్రమాలు 06గం:12ని.. సోమవారం, జనవరి 22 అల అయోధ్యాపురములో.. అపురూప మందిరం నేడే ఆవిష్కృతం ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగరంలో కొలువుదీరనున్న రామయ్య మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లు రామ నామ స్మరణతో మార్మోగుతున్న ఊరూవాడా 06:00.. సోమవారం, జనవరి 22 తెలుగు రాష్ట్రాల నుంచి.. అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు తిరుమల శ్రీవారి తరఫున లక్ష లడ్డూలు సిరిసిల్ల నుంచి సీతమమ్మకు చీర కానుక హైదరాబాద్ నుంచి 1265 కేజీల లడ్డూ హైదరాబాద్ నుంచి అయోధ్య రామయ్యకు ఎనిమిదడుగుల ముత్యాల గజమాల.. అందించనున్న చినజీయర్‌స్వామి -
Ayodhya Ram mandir: కార్పొరేట్ల జై శ్రీరామ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు కూడా సందడిగా పాల్గొంటున్నాయి. కార్యక్రమాన్ని మలీ్టప్లెక్సుల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుకుని లాభాల్లో కొంత వాటాను అయోధ్యలో ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వడం వరకు వివిధ రకాలుగా పాలు పంచుకుంటున్నాయి. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు, గేట్ బ్రాండింగ్, షాప్ బోర్డులు, కియోస్‌్కలు మొదలైనవి ఏర్పాటు చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నేడు (జనవరి 22న) రామ మందిర ప్రారంభ వేడుకలను 70 నగరాల్లోని 160 స్క్రీన్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మలీ్టప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. జనవరి 17 నుంచి జనవరి 31 వరకు తమ ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. భక్తుల రాకతో అయోధ్యలో నిత్యావసరాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఉత్పత్తుల సరఫరాను డాబర్ మరింతగా పెంచింది. వెయ్యేళ్లైనా చెక్కుచెదరని నిర్మాణం: ఎల్అండ్టీ శ్రీ రామ మందిరాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరనంత పటిష్టంగా నిర్మించామని దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదితర వర్గాలు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక ఆలయంగా మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతంగా కూడా నిలి్చపోతుందని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► ఐటీసీలో భాగమైన మంగళదీప్ అగరబత్తీ బ్రాండ్ ఆరు నెలల పాటు ధూపాన్ని విరాళంగా అందించింది. అలాగే ‘రామ్ కీ ఫేడీ’ వద్ద రెండు అగరబత్తీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. నదీ ఘాట్లలో పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పూజారులకు వేదికలను, మార్కెట్లో నీడకు గొడుగులు మొదలైనవి నెలకొలి్పంది. భారీ భక్త సందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన ఆలయం దగ్గర 300 బ్యారికేడ్లు, ఆలయ ముఖ ద్వారం దగ్గర 100 పైచిలుకు బాకేడ్లను కూడా ఐటీసీ అందిస్తోంది. ► అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటోల సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. త్వరలో ఉబెర్‌గో, ఇంటర్సిటీ ఉబెర్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. ► రామ మందిరంలో లైటింగ్ ఉత్పత్తుల సరఫరా, ఇన్స్టాలేషన్ పనులను నిర్వహించడం తమకు గర్వకారణమని హ్యావెల్స్ తెలిపింది. ► తాము భారత్‌లో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ రామ మందిరం వాటన్నింటిలోకెల్లా విశిష్టమైనదని యూఏఈకి చెందిన ఆర్ఏకే సెరామిక్స్ అభివరి్ణంచింది. కొత్త ఆభరణాల కలెక్షన్లు.. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘సియారామ్’ పేరిట, కల్యాణ్ జ్యుయలర్స్ ‘నిమహ్’ పేరిట హెరిటేజ్ జ్యుయలరీ కలెక్షన్‌ను ఆవిష్కరించాయి. మందిర వైభవాన్ని, సీతారాముల పట్టాభిõÙక ఘట్టాన్ని అవిష్కృతం చేసేలా డిజైన్లను తీర్చిదిద్దినట్లు సెన్కో గోల్డ్ ఎండీ సేన్ తెలిపారు. సుసంపన్న వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్స్‌తో నిమహ్ కలెక్షన్‌ను రూపొందించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు. -
Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అయోధ్య: బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలో నగరమంతటా పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ట వేదిక వద్ద, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో మోహరించారు. ఆలయం చుట్టూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు బిగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆయోధ్యకు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్ కారిడర్లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. ఫైజాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాంటీ డ్రోన్ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని చెప్పారు. -
AIIMS: నేడు సగం రోజు సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం అవుట్ పేషెంట్ విభాగాన్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసి ఉంచాలంటూ శనివారం జారీ చేసిన మెమోరాండంను ఢిల్లీ ఎయిమ్స్ వెనక్కి తీసుకుంది. అవుట్ పేషెంట్ సేవలు(ఓపీడీ)సహా అన్ని విభాగాలు యథావిధిగా తెరిచి ఉంచాలంటూ ఆదివారం తాజాగా మెమోరాండం జారీ చేసింది. అన్ని కేంద్రాల, విభాగాల అధిపతులు, యూనిట్లు, బ్రాంచ్ ఆఫీసర్లు తమ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఈ సమాచారం అందజేయాలని కోరింది. రోగులకు అసౌకర్యం కలగరాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓపీడీ సహా అన్ని సేవలు సోమవారం రోజంతా యథావిధిగా కొనసాగుతాయని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ కూడా తెలిపింది. -
Ayodhya Ram mandir: ‘భరతవర్ష’ పునర్నిర్మాణానికి నాంది
న్యూఢిల్లీ: అయోధ్యలోని జన్మస్థలానికి శ్రీరాముడి ప్రవేశం, ఆలయ ప్రాణప్రతిష్ట ఉత్సవం ‘భరతవర్ష’పునర్నిర్మాణానికి నాంది అని రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ‘భరతవర్ష’లో సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత, సామరస్య సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వెబ్సైట్లో ఆదివారం ఆయన రాసిన వ్యాసం పోస్ట్ అయ్యింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజం పోరాటం, సంక్షోభాలు ఇక ముగిసి పోవాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్య పునర్నిర్మాణం ఇక మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికులు పూజించే దైవం శ్రీరాముడేనని ఆయన తెలిపారు. మందిర నిర్మాణం ‘జాతి గౌరవానికి పునరుజ్జీవనం’గా ఆయన అభివర్ణించారు. ‘‘రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రవేశం, ప్రాణ ప్రతిష్ట భరతవర్ష పునర్నిర్మాణానికి నాంది. ఇది అందరి శ్రేయస్సు కోసం, భేదభావం లేకుండా అందరినీ అంగీకరించడం, సామరస్యం, ఐక్యత, పురోగతి, శాంతి మార్గాన్ని చూపుతుంది. యావత్ ప్రపంచ పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది’’ అని భాగవత్ అన్నారు. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో నేడే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. మొత్తం 84 సెకన్లలో గర్భగుడిలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. అపూర్వమైన ఈ వేడుకలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు తదితర అన్ని ప్రాంతాలకు చెందినవారు ఒకే చోట ఒక కార్యక్రమంలో పాల్గొంటుండడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో సోమవారం ఉత్సవాలు జరగబోతున్నాయి. నేడు గర్భాలయం లోపల.. ఉదయం 10:00 మంగళ ధ్వనితో శ్రీకారం మధ్యాహ్నం 12.20 ప్రధాన వేడుక ప్రారంభం 12:29:08, 12:30:32 84 సెకన్లలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట 7,000 హాజరుకానున్న అతిథులు ఏకకాలంలో వెలిగించనున్న ప్రమిదలు 10,00,000 అయోధ్యలో నేడు కొలువుదీరనున్న బాలరాముడు అద్భుత వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు ‘మంగళ ధ్వని’తో శ్రీకారం చుడతారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించనుంది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం రామమందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడింటి నుంచే ప్రసారాలు మొదలవు తాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన వేడుక జరుగుతుంది. వీటిని డీడీ న్యూస్, డీడీ జాతీయ చానళ్లతోపాటు ప్రైవేట్ చానళ్లలోనూ తిలకించవచ్చు. 84 సెకన్ల శుభ ముహూర్తం గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు శుభ ముహూర్తం నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు మొత్తం 84 సెకన్లలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రుతి్వక్కులు వేడుక నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, వాల్మీకి, వీర శైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికిపైగా సంప్రదాయాల సాధువులు, మహామండలేశ్వర్, మహంత్, నాగాలతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. ఇలా పర్వతాలు, అడవులు, తీర, ద్వీప వంటి అన్ని ప్రాంతాలకు వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. నగర వీధుల్లో తోరణాలు, కాషాయ జెండాలు అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండా, తోరణాలతోపాటు విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్‌పథ్, ధర్మపథ్‌ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. అయోధ్యలో రామచరిత మానస్, రామాయణం పుస్తకాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామయ్య పండుగ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కేవలం ఆయోధ్యకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకోబోతున్నారు. సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. పారిస్‌లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే విశ్వ కల్యాణ యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆ్రస్టేలియా, కెనడా, మారిషస్ సహా 60కిపైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించగబోతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలతో ఆలయాలను అందంగా అలకరించారు. అలాగే రామాయణ పారాయణం కోసం ఏర్పాట్లు చేశారు. నేటితో ముగియనున్న ప్రత్యేక క్రతువులు ప్రత్యేక క్రతువుల్లో భాగంగా ఆదివారం ఔషధ జలంతోపాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల తెచి్చన పవిత్ర జలాలతో రామ్‌లల్లాను శుద్ధి చేశారు. రాత్రి జాగరణ అధివస్ జరిపారు. 16న మొదలైన క్రతువులు సోమవారం ముగుస్తాయి. మూడు నిత్య హారతులు ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించడానికి ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12.00 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇవ్వనున్నారు. గర్భాలయంలో ఇలా... ► ఉదయం 10 గంటలు: మంగళ ధ్వని ► మధ్యాహ్నం 12.05 నుంచి 12.55: ప్రాణప్రతిష్ట జరుగుతుంది. రామ్‌లల్లా నేత్రాలు తెరిచిన తర్వాత ప్రధాని మోదీ కాటుక దిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు. ► మధ్యాహ్నం 12.55: ప్రధాన ఆలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు. గర్భగుడిలోకి ఆ ఐదుగురు గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్‌లల్లా దర్శనం కల్పిస్తారు. మోదీ పర్యటన ఇలా.. ► ఉదయం 10.25: అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి ► మధ్యాహ్నం 12: గర్భగృహం ఎదుట అతిథులకు పలకరింపు ► మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు: బహిరంగ సభలో మోదీ ప్రసంగం. ఆరెస్సెస్ చీఫ్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. ► మధ్యాహ్నం 2 గంటలు: శివ మందిరం, కుబేర తిల సందర్శన ► మధ్యాహ్నం 3.30: మోదీ ఢిల్లీకి పయనమవుతారు. 10 లక్షల ప్రమిదల కాంతులు అయోధ్య నగరం సోమవారం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 10 లక్షలు ప్రమిదలను ఏకకాలంలో వెలిగించబోతున్నారు. నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలు వెలుగులు పంచబోతున్నాయి. ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామమందిరంతోపాటు రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చౌనీ తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్య వాసులు తమ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగించబోతున్నారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం కాబోతోంది. రామాలయ ఉపగ్రహ చిత్రాలు విడుదల అయోధ్యలో నూతన రామాలయ ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ అంతరిక్షం నుంచి గత ఏడాది డిసెంబర్ 16న ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రధాన ఆలయంతోపాటు దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటివి ఈ చిత్రాల్లో చక్కగా కనిపిస్తున్నాయి. వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట ► మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం ► ఉత్సవానికి ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోదీ ► ప్రాణప్రతిష్ట అనంతరం ప్రముఖులకు బాలరాముని దర్శనం శుభ ఘడియలు సమీపించాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వైభవోజ్వల చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఐదు శతాబ్దాల వనవాసం వీడి, భవ్య మందిరానికి చేరుకున్న రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కమనీయ వేడుకను కనులారా తిలకించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లో రామనామ స్మరణతో భక్తులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 7 వేల మందికిపైగా అతిథులు, ప్రముఖులు హాజరుకాబోతున్నారు. 150 మందికిపైగా ప్రముఖులు ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. సామాన్య భక్తజనం అయోధ్య బాటపట్టారు. కాషాయ పతాకాల రెపరెపలు, రాముడి గీతాలు, భజనలు, స్తోత్రాలు, జైశ్రీరామ్ నినాదాలతో, అందంగా తీర్చిదిద్దిన ప్రధాన భవ్య మందిరంతోపాటు ఇతర ఆలయాలతో అయోధ్య అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. నగరం ఇప్పటికే జనసంద్రంగా మారింది. భక్తుల పూజలు, వేదమంత్రాల ఘోషతో సరయూ నదీ తీరం కనువిందు చేస్తోంది. నగరంలోని చరిత్రాత్మక కట్టడాలను సైతం సుందరంగా అలంకరించారు. దేశమంతా అయోధ్య నామస్మరణతో సర్వం రామమయంగా మారిపోయింది. – సాక్షి, న్యూఢిల్లీ -
Ayodhya Ram Mandir: జగదానంద కారకునికి జేజేలు
తండ్రి మాటను జవదాటని తనయుడు, సోదరులను అభిమానించిన అన్న, ఆలిని అనునిత్యం మనుసులో నిలుపుకున్న భర్త, స్నేహధర్మాన్ని పాటించిన మిత్రోత్తముడు. ఈ బంధాలు ఎన్ని ఉన్నా... ధర్మం తప్పకుండా ప్రజల కోసమే నిరంతరం పాటుపడిన ప్రభువు. మొత్తంగా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడని రామాయణ మహాకావ్యం చెబుతోంది. మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ ఎక్కడా మహిమలు చూపలేదు. మాయలు చేయలేదు. ముమ్మూర్తులా మానవుడిలాగే వ్యవహరించాడు. మానవులలాగే కష్టాలననుభవించాడు. నిందలు మోశాడు. బాధలు పడ్డాడు. చిన్న చిన్న సంతోషాలనూ, సరదాలనూ కూడా మామూలు మనుషులలాగే అనుభవించాడు. అయితే ఎక్కడా ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. ఆపత్సమయంలోనూ ధర్మాన్నే అనుసరించాడు. ధర్మాన్నే ఆచరించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ధర్మమంటే ఇదే అన్నట్టుగా ప్రవర్తించాడు. రాముడు అనుసరించిన మార్గం కనుకనే ఆయన చరితామృతానికి రామాయణమనే పేరు వచ్చింది. షోడశ మహాగుణ సంపన్నుడు వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపాడు. పితృవాక్పాలకుడిగా పేరు పొందాడు. తండ్రి దశరథుడి మాటను ఎన్నడూ జవదాటలేదు. కన్నతల్లి కౌసల్యతో సమానంగా సవతి తల్లులైన సుమిత్రతోనూ, తనను అడవులకు పంపిన కైకతోనూ కూడా ప్రియంగానే మెలిగాడు. సోదర ప్రేమకు పెట్టింది పేరు సోదర ప్రేమ రాముని చూసి నేర్చుకోవలసిందే. తమ్ముడు లక్ష్మణుని ఎంతగానో ప్రేమించాడు. కొద్దిపాటి దుడుకు స్వభావి అయినప్పటికీ అతడిని ఏనాడూ పల్లెత్తు మాటనలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లితే ఒక అతి సాధారణమైన అన్నయ్యలాగే తల్లడిల్లాడు. తమ్ముణ్ణి తిరిగి మామూలుగా చూసేంత వరకు స్థిమిత పడలేకపోయాడు. భరతునితో కూడా ఎంతో వాత్సల్యంతో మెలిగాడు. తాను వనవాసం పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తాను వస్తున్న వార్తను భరతుడికి చేరవేసి, అతడి ముఖ కవళికలలో ఏమైనా మార్పు వచ్చిందేమో జాగ్రత్తగా గమనించి తనకు చెప్పమంటూ నమ్మిన బంటు హనుమను అందుకు నియోగించాడు. ఒకవేళ భరతుడు గనక రాజుగా ఉండేందుకు ఇష్టపడితే అందుకు తానేమీ అడ్డుపడదలచుకోలేదు. అంతేకాదు, శత్రుఘ్నుని కూడా అమితంగా ప్రేమించాడు. లవణాసురుడనే రాక్షసుని వధకు శత్రుఘ్నునే నియోగించాడు. అతడు జయించిన రాజ్యాన్ని అతడికే అప్పగించాడు. అందుకే ఆదర్శవంతులైన అన్నదమ్ములను రామలక్ష్మణుల్లా ఉన్నారంటారు. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు. అహంకారం లేని వాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాద స్పర్శతో అయోధ్యా నగరం పావనమైంది. అడవులు ధన్యమైనాయి. ఆత్మశతృవుని అధిగమించాడు కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని రామాయణం రుజువు చేస్తుంది. ఏక పత్నీవ్రతుడు నేటి సమాజంలో ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. మనసావాచా కర్మణా ప్రేమించిన సీతాదేవిని తప్ప మరొక మహిళ వంక కన్నెత్తి చూడలేదు. ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. స్మిత పూర్వభాషిగా శ్రీరాముడికి పేరు. అంటే అవతలి వారు తనను పలకరించేవరకు వేచి చూడాలని అనుకోడు. ముందుగా తానే వారిని మాట్లాడించేవాడు. అంతటి మర్యాదా పురుషోత్తముడు. అటువంటి ఆదర్శమూర్తి, ధర్మప్రభువు... ఆయన నడయాడిన పుణ్యపుడమిగా పేర్కొంటున్న అయోధ్యలో బాల రాముడిగా నేడు విగ్రహ రూపంలో కొలువుతీరనున్నాడు. ఈ శుభ సందర్భంలో ఆ జగదానంద కారకుడికి జేజేలు చెబుదాం... – డి.వి.ఆర్. -
అయోధ్యలో నూతనోదయం: యోగి ఆదిత్యానాథ్
జాసు బిరహ సోచహు దిన రాతీ! రటహు నిరంతర గున్ గన్ పాంతి!! రఘుకుల తిలక సుజన్ సుఖదాత! ఆయౌ కుసల్ దేవ ముని త్రాతా!! శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్ రాఘవ్ రామ్‌లల్లా’ తన జన్మస్థలమైన అవధ్‌పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగు తున్న ఈ చరిత్రాత్మకమైన, పవిత్రమైన సందర్భం... భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ‘మోక్షదాయని’ అయోధ్యపై చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారీ శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనందబాష్పాలతో తడిసిపోతుంది. అందరూ ‘రామ్–రామ్’ అని జపిస్తారు. తరతరాలుగా విశ్వాసులు, లోకాన్ని విడిచిపెట్టిన రామభక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. 2024 జనవరి 22 ప్రాముఖ్యత బాలరూప రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మించినది. ఇది ప్రజల విశ్వాస పునఃస్థాపనను సూచిస్తుంది. అయోధ్య ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శ్రీరామ జన్మభూమి ముక్తి మహాయజ్ఞం’ అనేది కేవలం సనాతన విశ్వాసానికి పరీక్ష కాదు; ఇది విజయవంతంగా దేశ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పింది. భారత దేశాన్ని ఐక్యతా సూత్రంతో కలిపింది. రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ప్రత్యేక ఐక్యత అసమానమైనది. సాధువులు, సన్యాసులు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సామాజిక సాంస్కృతిక సంస్థలు రోడ్‌మ్యాప్‌ను రూపొందించి ప్రజలను ఏకం చేశాయి. ఆ తీర్మానం ఎట్టకేలకు నెర వేరింది. భారతదేశంలో కొత్త ఉషస్సు వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు ‘అవని అమరావతి’ అనీ, ‘భూలోక వైకుంఠం’ అనీ పిలి చిన అయోధ్య శతాబ్దాల పాటు శాప గ్రస్తంగా ఉండిపోయింది. ‘రామ రాజ్యం’ ఒక ఆదర్శ భావనగా ఉన్న దేశంలోనే రాముడు తన ఉనికిని నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చింది. అతని జన్మస్థలానికి ఆధారాలు కావాల్సి వచ్చింది. కానీ శ్రీరాముని జీవితం మర్యాదగా ప్రవర్తించడం, స్వీయ నిగ్రహాన్ని పాటించడం నేర్పుతుంది. రాముని భక్తులు ఓర్పు, పట్టుదలను ప్రదర్శించారు. నేడు అయోధ్య తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడంతో యావత్ జాతి సంతోషిస్తోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు! 2024 జనవరి 22 వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన సందర్భం. నేను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు, రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు నా మనస్సును ముంచెత్తుతున్నాయి. ఈ సంకల్పమే నన్ను గౌరవనీయులైన గురుదేవ్ మహంత్ వైద్యనాథ్ జీ మహారాజ్ సద్గుణ సాంగత్యంలోకి నడిపించింది. విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మా తాత బ్రహ్మలీన్ మహంత్ శ్రీ దిగ్విజయ్నాథ్ జీ మహారాజ్, గౌరవనీయులైన గురుదేవ్ బ్రహ్మలీన్ మహంత్ శ్రీ వైద్యనాథ్ జీ మహారాజ్‌తో పాటు ఇతర గౌరవనీయులైన సాధువులు భౌతికంగా లేరని నాకు తెలుసు. కానీ వారి ఆత్మలు కచ్చితంగా అపారమైన సంతృప్తిని అనుభవిస్తాయి. గౌరవనీయులైన నా గురువులు జీవితాంతం అంకితభావంతో చేసిన తీర్మానం నెరవేరడానికి సాక్షిగా నిలవడం నా అదృష్టం. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా ప్రతిష్ఠాపన గురించి ప్రకటించినప్పటి నుండి, ప్రతి సనాతన విశ్వాసిలో నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనంద వాతావరణం దేశమంతటా వ్యాపించింది. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, రామసనేహి, ఘీసాపంథ్, గరీబ్దాసి, అకాలీ, నిరంకారీ, గౌడీయ, కబీర్పంథ్ వంటి విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు... అనేక సంఖ్యలో ఉన్న శాఖలు, ఆరాధన పద్ధతుల వారు... 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు... అటవీ – గిరి నివాసులు, గిరిజన సమూహాలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు... రాజకీయాలు, సైన్స్, పరిశ్రమలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలవారు అందరూ ఒకే గొడుగు కిందకు చేరడం నిజంగా అపూర్వమైనది, అరుదైనది. ఈ మహత్తరమైన సందర్భం ఎంతో గర్వకారణం. ఉత్తరప్రదేశ్‌లోని 25 కోట్ల మంది ప్రజల తరఫున పవిత్ర అయోధ్యధామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తరువాత, అయోధ్యధామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, పర్యా టకులకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ప్రణాళికలకు అనుగుణంగా అయో«ధ్యాపురి కచ్చితమైన సన్నాహాలు చేస్తోంది. నగరం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన రైల్వే స్టేషన్, అన్ని దిశల నుండి కలుస్తున్న 4–6 లేన్ రోడ్లతో బాగా అనుసంధానించబడిన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అదనంగా హెలిపోర్ట్ సేవ, సందర్శకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలమైన హోటళ్లు, అతిథి గృహాల శ్రేణి ఏర్పాటైనాయి. కొత్త అయోధ్యలో, పురాతన సంస్కృతి, నాగరికత పరిరక్షణ జరుగుతూనే అత్యాధునిక నగర సౌక ర్యాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగినట్టుగా నిర్మాణం జరుగుతోంది. ఈ చొరవలో భాగంగా అయోధ్యలోని పంచకోసి, 14 కోసి, 84 కోసి పరిక్రమ పరిధిలోని మతపరమైన, పౌరాణిక. చారిత్రక ప్రదేశాలకు వేగవంతమైన పునరుజ్జీవనం కలిగించడం జరిగింది. ఈ సమష్టి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా పర్యాటకాన్ని పెంచడానికీ, ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ ఉపయోగపడతాయి. శ్రీరామ జన్మభూమి ఆలయ స్థాపన ఒక లోతైన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సూచిక. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జాతీయ దేవాలయం. శ్రీరామ్లలా పవిత్రోత్సవం యావత్ జాతి జనుల హృదయాన్ని గర్వంతో ఉప్పొంగించే ఒక ముఖ్యమైన సందర్భం. రాముడి దయతో, అయోధ్య సంప్రదాయ పరిక్రమ పవిత్రత ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలూ దాని పవిత్ర మార్గాన్ని నాశనం చేయలేవు. అయోధ్య వీధులలో ఇక బుల్లెట్లు ప్రతి ధ్వనించవు, సరయూ నది రక్తపు మరకను భరించదు, కర్ఫ్యూ విధ్వంసం జరగదు. బదులుగా ఆనందో త్సవ వేడుకలు జరుపుకొంటూ, రామనామ సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది. అవధ్పురిలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ భారతదేశంలో రామరాజ్య స్థాపన తాలూకు ప్రకటనను తెలియజేస్తుంది. ఇది ఆదర్శానికి స్వరూపం. ఇక్కడ ‘సబ్ నర్ కరహీ పరస్పర ప్రీతి చలహీ స్వధర్మం నిరత శుతి నీతి’ అవుతుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరూప రాముని విగ్రహం మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రతి సనాతన విశ్వాసి తన మతపరమైన సూత్రాలను అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ శుభ సందర్భంగా 140 కోట్ల మంది తోటి పౌరులకు అభినందనలు! మన పూర్వీకులు నెలకొల్పుతామని గంభీరంగా ప్రమాణం చేసిన ఆలయాన్ని నిర్మించాలనే నిబద్ధత నెరవేరడం చూసి మనం ఎనలేని సంతృప్తిని పొందుదాం. భగవంతుడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి. శ్రీ రామః శరణం మమ జయ–జయ శ్రీసీతారామ్! యోగి ఆదిత్యనాథ్ వ్యాసకర్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి -
ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ అవకాశం: మెగాస్టార్ ట్వీట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు అయోధ్య వైపే ఉన్నాయి. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అయోధ్యకు చేరుకున్నారు. జనవరి 22న జరగనున్న మహా ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకానికి ఆహ్వనం రావడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రను ఉర్రూతలూగిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకం చూసే ఆహ్వానం రావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. ఐదు వందల సంవత్సరాలకుపైగా తరతరాలుగా వేచి చూస్తోన్న భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన 'చిరంజీవి' అయిన హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే.. స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు అనిపిస్తోంది.' అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. అంతే కాకుండా..' ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ యోగి జీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. జై శ్రీరామ్ ' అని తెలిపారు. Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
కౌంట్‌డౌన్: సర్వాంగ సుందరంగా అయోధ్య
మరికొద్ది గంటల్లో ఓ మహాఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రుల వారు కొలువుతీరనున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రేపు(సోమవారం)మధ్యాహ్నం 12 :15 నిమిషాల నుంచి 12: 45 నిమిషాల మధ్య జరుగనుంది. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు చేసే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ట అనగా స్థాపన. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు. దీంతో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా, ఎక్కడా చూసినా రాముడు, సీత, హనుమంతుడు, రామయాణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఇవి కూడా చదవండి: అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు.. ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా చూడటం ఎలా? అయోధ్యకు ఎలా వెళ్లాలి?.. దర్శనానికి ఏం చేయాలి అంతా రామమయం.. ఈ సంగతులు మీకు తెలుసా? -
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్‌ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్ చేశారు. అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir! Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world! Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm — KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024 ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. -
గుడిని శుభ్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ వచ్చేయ్ అంటూ..
శతాబ్దాల కల సాకారం కానుంది. సోమవారం(జనవరి 22) అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానాలు అందాయి. అందులో కంగనా రనౌత్ కూడా పేరు కూడా ఉంది. ఇంకేముంది, వెంటనే అక్కడ వాలిపోయిందీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. సిల్క్ చీర కట్టుకుని బంగారు నగలు ధరించి అయోధ్యలో హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటి గుడి ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేసింది. అనంతరం అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రామా.. ఇకనైనా వచ్చేయ్.. ఈ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన ఆధ్వర్యంలో హనుమంతుడి యాగం చేశాను. అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలో.. చాలా కాలం తర్వాత అయోధ్య రాజు తన స్వస్థలానికి రేపు తిరిగివస్తున్నాడు. వచ్చేయ్ రామా.. వచ్చేయ్' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. కాగా కంగనా రనౌత్ చివరగా తేజస్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె ప్రస్తుతం ఎమర్జన్సీ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు కావాలి.. అప్పుడు సంతోషంగా లేను, అందుకే.. -
రామసేతు ఒడిలో మోదీ ప్రాణాయామం
చెన్నై: రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాయామం చేశారు. సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాల మూడు రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. శుక్రవారం చెన్నైలో ఖేలో ఇండియా గేమ్స్ 2023ను ప్రారంభించారు. శనివారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడు ఆలయాలను మోదీ సందర్శించారు. #WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi visits Arichal Munai point in Dhanushkodi, which is said to be the place from where the Ram Setu was built. pic.twitter.com/GGFRwdhwSH— ANI (@ANI) January 21, 2024 అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7000 మంది ప్రముఖులు హాజరవుతారు. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు..!
లక్నో: రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22(సోమవారం)న జరగనుంది. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన రామ మందిర దృశ్యాలను ఇస్రో పంచుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ఈ దృశ్యాలను తీసింది. డిసెంబర్ 16, 2023న నిర్మాణంలో ఉన్న ఆలయం ఫొటోలు తీసింది. ఉపగ్రహ చిత్రాలలో నూతనంగా అభివృద్ధి చేసిన దశరథ్ మహల్, సరయు నది కూడా రామమందిరం సమీపంలో చూడవచ్చు. కొత్తగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను NRSC షేర్ చేసిన చిత్రాలలో కూడా చూడవచ్చు. ఆలయ మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశంలో ప్రముఖులతో కలిపి మొత్తం 7000 మందికి ఆహ్వానాలు అందాయి. సాంప్రదాయ నగారా శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
Ayodhya Event: సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్‌లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్‌లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
అయోధ్య రామయ్య దర్శనం ఉచితమే..!
లక్నో: రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్‌లు ఇవే..! -
అయోధ్యలో హూటల్ రూం ధర లక్ష!
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. హోటల్లో ఒక్క రూమ్ ధర లక్ష రాముడి సుగుణాలు అనేకం.. ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన నాటి నుంచి అయోధ్య రూపు రేకలు మారిపోయాయి. ముఖ్యంగా టూరిజం రంగం అనూహ్యంగా వృద్ది సాధిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక బాలరాముడు దర్శనం కోసం భక్తులు అయోధ్యకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ తరుణంలో అయోధ్యలోని హోటల్ ధరలు రాత్రికి రూ. లక్షకు పెరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఐదు రెట్లు పెరిగిన అద్దెలు అద్దెలు సగటు కంటే ఐదు రెట్లు పెరిగాయి. అందుకు స్థానికంగా ఉన్న పార్క్ ఇన్ రాడిసన్ హోటల్ టాప్ రూమ్ ధర రూ.లక్ష మార్క్ దాటినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఉన్న హోటల్ రామాయణ ప్రతినిధులు మాట్లాడుతూ.. జనవరి 20-25 మధ్యలో హోటల్ గదులు పూర్తిగా బుక్ అయ్యాయి. పార్క్ ఇన్ హోటల్, డిసెంబర్ మధ్య నుండి బుకింగ్‌ల జోరందుకుంది. అందుబాటులోకి హోమ్ స్టేలు రామమందిరం కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, రామమందిరం ప్రారంభమైన తర్వాత హోటల్ గదలు ధరలు రాత్రికి రూ. 7,000 నుండి రూ. 25,000 వరకు పెరిగాయని సిగ్నెట్ కలెక్షన్ హోటల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో అనేక హోమ్‌స్టేలు కూడా వచ్చాయి. రూ.4 వేల నుంచి సరసమైన ధరకే గదులు అందిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్‌లు ఇవే..!
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణం చిన్న స్టాక్‌లకు వరంగా మారింది. ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. అయోధ్య సమీపంలో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసిన ప్రవేగ్ లిమిటెడ్, సీసీటీవీ నిఘా నెట్వర్క్ కోసం కాంట్రాక్ట్ పొందిన అలైడ్ డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ రెండు స్టాక్స్ గత నెలలో 55% కంటే ఎక్కువ పెరిగాయి. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ కూడా దాదాపు 35% లాభపడింది. అయోధ్య ప్రారంభోత్సవానికి ముందే అక్కడ భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ప్రవేగ్ లిమిటెడ్ తెలిపింది. స్థలం కోసం ఇప్పటికే అక్కడ ట్రావెల్ ఏజెంట్లు పోటీ పడుతున్నారని పేర్కొంది. అయోధ్యలో సీసీటీవీ ఒప్పందంతోనే అలైడ్ డిజిటల్ వెలుగులోకి వచ్చిందని బ్రోకరేజ్ బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ విశ్లేషకుడు వైభవ్ విద్వానీ తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ పుణ్యక్షేత్రంతో పర్యాటకం అభివృద్ధి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కొత్త విమానాశ్రయం, రైలు స్టేషన్ గత నెలలో ప్రారంభమైంది. హోటళ్ళు, రిటైలర్లు, బ్యాంకింగ్ సెక్టార్ కూడా విస్తరించడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఆలయం చుట్టూ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఎంతో ప్రాముఖ్యతగా మారనుంది. అయెధ్యలో స్థిరమైన వృద్ధి జరుగుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీలో పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ డైరెక్టర్ సుకుమార్ రాజా తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రయాణ, వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా అయోధ్య ఉద్భవించగలదని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
రాముని విగ్రహం ఫొటోలు లీకు..! ప్రధాన పూజారి ఆగ్రహం
లక్నో: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు." అని తెలిపారు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలని ఆచార్య సత్యేంద్ర దాస్ కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. #WATCH | Ayodhya: On the idol of Lord Ram, Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, "...The eyes of Lord Ram's idol cannot be revealed before Pran Pratishtha is completed. The idol where the eyes of Lord Ram can be seen is not the real idol. If… pic.twitter.com/I0FjRfCQRp — ANI (@ANI) January 20, 2024 రేపు (జనవరి 22)న అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలో ప్రముఖ నేతలు హాజరుకావడానికి ఆహ్వానాలు అందాయి. దాదాపు 7,000 మంది హాజరుకానున్నారు. ఈ వేడుకకు విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆందోళనలు..అవన్నీ సమసిపోయాయి. రాముడు పుట్టిందక్కడే అని బలంగా నమ్మే కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా, భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు దీరబోతున్నాడు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక, ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావటంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. బాలరాముడిని ప్రతిష్ఠించే గర్భాలయం; 1947 నుంచి పూజలందుకుంటున్న విగ్రహం; ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తులో రామదర్బార్ రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగవైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర, ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందన్నది పురాణగాధ. బాలరాముడితో దర్శనం సమాప్తమైతే.. సీతారాములను కనులారా వీక్షించాలని ఉబలాటపడే భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంతస్తులో ‘రామదర్బార్’ రూపంలో అద్భుత దర్శనభాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రులు లక్ష్మణ, భరత, శత్రఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్ విగ్రహాలను రాజస్థాన్ తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఆ దివ్య మందిరంపై నిర్మించే రెండో అంతస్తులో ఎలాంటి దర్శన ఏర్పాట్లు చేయాలన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి మొదటి రెండు అంతస్తులను పూర్తి చేసి రామ దర్బార్ దర్శనం కలిగించనున్నారు. బాలరాముడి రూపునకు మూడు విగ్రహాల పరిశీలన బాలరాముడి రూపు కోసం మూడు విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్ , కర్నాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్నాటక నుంచి మూడు కృష్ణ శిలలు, ఓంకారేశ్వర్పూజ్య అవధూత నర్మదానంద్జీ మహరాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన మూడు బాల రాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మూల విరాట్‌గా కొత్త విగ్రహం... ఉత్సవమూర్తిగా పాత విగ్రహం దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభి రాముడు దర్శనం ఇవ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఆ విగ్రహమే పూజలందుకుంటోంది. కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో, పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్గానూ, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా మారుస్తున్నారు. ప్రత్యేక పూజాదికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్టు స్పష్టం చేసింది. అయోధ్యలో సరయూ నదికి హారతి లేజర్ షో జటాయువు కంచు విగ్రహం కూడా... 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో జటాయువు కంచు విగ్రహాన్ని కూడా రూపొందిస్తున్నారు. అక్కడి కుబేర్టీలాపై ప్రతిష్ఠించే ఈ విగ్రహం మూలమూర్తి వైపు ధ్యానముద్రలో చూస్తూ వినమ్రంగా ఉండేలా దీనిని ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్రామ్ సుతార్ సిద్ధం చేస్తున్నారు. దక్షిణ భారతశైలిలో గాలిగోపురం దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామజన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే నాగరశైలిలో గాలి గోపురాలకు చోటు లేదు. కానీ రామజన్మభూమి ఆలయ ప్రవేశం వద్ద మాత్రం భారీ గాలిగోపురం నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థల సేకరణ సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుకవైపు కొంత భూమిని ప్రైవేట్వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వీలుగా సిద్ధం చేసింది. ఏఏఏ ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్నందున ఇటుకల వాడకం సాధ్యం కాదు. అలా అని మరోచోట ఈ ఇటుకలను వినియోగిస్తే.. భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. దీంతో వాటికి ప్రత్యేకస్థానం దక్కాల్సిందేని భావించిన ట్రస్టు, వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. దిగువ అంతస్తులో బాలరాముడు ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి 20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణ పథ (పరిక్రమ్) నిర్మించారు. దాని మీద ప్రధాన ఆలయం దిగువ అంతస్తు ఉంటుంది. ఈ దిగువ అంతస్తులోనే బాల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడు పుట్టినట్టుగా భావిస్తున్న చోటనే ఈ ఆలయం నిర్మిస్తున్నందున అక్కడే బాలరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి రూపం 51 అంగుళాల విగ్రహంగా భక్తజనానికి దర్శనమివ్వనుంది. ఎన్నో ప్రత్యేకతలు రాముడి సుగుణాలు అనేకం..ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో న భవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతి పెద్ద దేవాలయం కూడా ఇదే. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ఆలయం, పరిసరాలన్నీ కలుపుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంక్రమించినది 72 ఎకరాలు. మిగతా భూమిని ప్రైవేట్సంస్థలు, వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందులో 2.7 ఎకరాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం రూపుదిద్దుకుంటోంది. 2025 నాటికి మొత్తం ఆలయం సిద్ధం ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయంతోపాటు ఆ ప్రాంగణంలో పర్కోట (ప్రాకారం) ఆవల మరో ఎనిమిది మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్నవర్గాలకు చెందిన వారి ఆలయాలు నిర్మిస్తారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు..లాంటి వారితో కూడిన ఎనిమిది గుళ్లుంటాయి. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టి కోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన జరిగిందన్నది ట్రస్టు మాట. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభమైన వేడుకలు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16 నుంచే మొదలయ్యాయి. హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతోపాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. వాస్తుశిల్పి ‘సోమ్‌పురా’ సారథ్యంలో నిర్మాణ పనులు దేవాలయ ఆర్కిటెక్ట్‌గా ప్రఖ్యాత ‘సోమ్‌పురా’ కుటుంబమే వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కుటుంబం వందకుపైగా ఆలయాలను రూపొందించింది. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయానికి కూడా వాస్తుశిల్పిగా పనిచేసిన ఆ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్ సోమ్‌పురా చీఫ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షర్‌ధామ్‌ను రూపొందించారు. ఆయన ఇద్దరు కుమారులు నిఖిల్ సోమ్‌పురా, ఆశిష్ సోమ్పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన ఆలయం 235 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు. ► ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం నాగర విధాన గుర్జర చాళుక్య శైలిలో రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఒక్కో అంతస్తులో నృత్య, రంగ, కుడు, కీర్తన, ప్రార్థన పేర్లతో ఐదు మండపాలుంటాయి. ► ప్రధాన ఆలయంలో 366 స్తంభాలుంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలు, ఇతర నగిషీలు ఉంటాయి. ► స్తంభాలపై శివుడు, వినాయకుడు, దశావతారాలు, యోగినులు, సరస్వతి ఇతర దేవతా రూపాలను చిత్రీకరించారు. ► గర్భాలయం అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► దేవాలయాన్ని లేత గులాబీరంగు ఇసుక రాయితో నిర్మించారు. ఇందుకు రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లా బన్సీపహాడ్‌పూర్ క్వారీ నుంచి 5 లక్షల ఘనపుటడుగుల లేత గులాబీ రంగు రాయి, గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా నుంచి లక్ష ఘనపుటడుగుల తెలుపురంగు చలవరాతిని తెప్పించారు. ► రామ జన్మభూమికి సంబంధించి 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పు రాగా, 2020 ఫిబ్రవరిలో దేవాలయ కమిటీ ఏర్పాటైంది. ఆలయానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ► ఆలయ పనులు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3500 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ► ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. ► శిల్పాలను తీర్చిదిద్దేందుకు ఒడిషా నుంచి ఎక్కువమంది శిల్పులు వచ్చారు. సిమెంట్ లాంటి బైండింగ్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. ఇందులో రాళ్లు జోడించటం అనేది క్లిష్టమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్ నిపుణులకు ఆ బాధ్యత అప్పగించారు. కాపర్ క్లిప్స్ మాత్రమే వాడి రాళ్లను అనుసంధానిస్తున్నారు. ► ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ మందిరం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక ‘‘రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం పదేళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనానికి నోచుకోబోతున్నాం. అందుకే రామజన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ సంకల్పమని నేను నమ్ముతాను. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య మందిరం ఓ సాధారణ దేవాలయం కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడి ముందు అంతా సమానులే, అందరిపట్లా ఆ రాముడిది సమభావనే. అందుకే ఈ నిర్మాణం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల ఆలయ నిర్మాణ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామ చొరవ అందులో కనిపిస్తుంది. దాదాపు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ ఖర్చులో ప్రభుత్వాలది నయా పైసా లేదు. అంతా భక్తుల విరాళమే. అందుకే మన దేవుడు, మన మందిరం.’’ – నృపేంద్ర మిశ్రా, శ్రీ రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ . ప్రధానమంత్రి కార్యాలయ మాజీ ముఖ్య కార్యదర్శి ఆ తలుపుల తయారీలో తెలుగువారు... ప్రధాన ఆలయానికి తలుపులు అమర్చే అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధా టింబర్ డిపోకు దక్కింది. డిపో నిర్వాహకుడు శరత్ బాబు చదలవాడ గతంలో యాదాద్రి మందిరానికి తలుపు చేయించారు. అయోధ్య రామ మందిరానికి తలుపుల నమూనా కావాలంటూ ట్రస్టు సభ్యుల నుంచి పిలుపు రావటంతో ఆయన టేకుతో దాన్ని సిద్ధం చేయించారు. ఆ పనితనానికి సంతృప్తి చెందిన కమిటీ ఆయనతో చర్చించి తలుపులు సిద్ధం చేసే బాధ్యత అప్పగించింది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన మేలిమి రకం టేకు చెక్కతో తలుపులు రూపొందిస్తున్నారు. శరత్ బాబు చదలవాడ అయోధ్యలోని కరసేవక్ పురంలోని కార్యశాలలో ఈ తలుపులను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఇన్ చార్జ్ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు వాటిని రూపొందిస్తున్నారు. మొత్తం 44 తలుపులకుగాను ప్రస్తుతానికి 18 సిద్ధమయ్యాయి. వీటిని దిగువ అంతస్తులో వినియోగిస్తారు. బాలరాముడు ఉండే గర్భాలయానికి సంబంధించి రెండు జతలు పూర్తి చేసి ఆలయానికి చేర్చారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇవి రూపొందాయి. నెమలి పురి విప్పుకున్నట్టు వీటిపై నగిషీలద్దారు. ఇక అంతస్తులోని ఇతర ప్రాంతాల్లో వాడే తలుపులకు ఏనుగు అర్చిస్తున్నట్టుగా.. పద్మాలు విచ్చుకున్నట్టుగా... ఇలా పలు చెక్కడాలతో అద్భుతంగా రూపొందించారు. వెయ్యేళ్లపాటు వర్థిల్లే దేవాలయానికి తలుపులు సిద్ధం చేసే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చదలవాడ శరత్‌బాబు ‘సాక్షి’తో చెప్పారు. అన్నీ ఉచితమే... అందరూ సమానమే! రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 60 కిలోల బంగారంతో తాపడం ఆలయంలోని తలుపులకు బంగారంతో తాపడం చేయించనున్నారు. అన్ని తలుపులకు కలిపి 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. దిగువ అంతస్తు బాలరాముడి ఆలయ తలుపులకు తాపడం పనులు ప్రారంభించారు. అనంతరం తాపడం కోసం సిద్ధం చేశారు. తలుపులపై ఉన్న నగిషీల తరహాలోనే బంగారు తాపడంపై కూడా సిద్ధం చేస్తున్నారు. భారీ భూకంపాలను తట్టుకునేలా... రామమందిర ప్రత్యేకతల్లో పునాది కూడా ఒకటి. 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతున్న దివ్యభవ్య మందిరానికి 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. అయోధ్య పట్టణ శివారు నుంచి సరయూ నది ప్రవహిస్తోంది. అయితే 400 ఏళ్ల క్రితం సరయూ ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న ప్రాంతానికి అతి చేరువగా ప్రవహించేది. దీంతో ఆ ప్రాంత భూగర్భం ఇసుక మేటలతో నిండి ఉంది. భారీ నిర్మాణానికి పునాది పడాలంటే ఆ ఇసుకనంతా తొలగించాలి. ఇందుకోసం ఐఐటీ, ఎన్ ఐటీ నిపుణులు, రిమోట్ సెన్సింగ్ సెంటర్ పరిశోధకులు కలిసి దీనికి ప్రత్యేక పునాది నిర్మాణానికి డిజైన్ చేశారు. 50 అడుగుల లోతు నుంచి ఇసుక, మట్టిని తొలగించి వాటికి రీయింజనీర్ ఇసుక, కొన్ని రసాయనాలు, 10 శాతం ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పారలుగా వేసి వాటిని కాంపాక్ట్‌గా మార్చి 47 పొరలుగా పైవరకు నిర్మించారు. ఆ ఇసుక, మట్టి భాగం పూర్తిగా గట్టిబడి 50 అడుగుల ఏకశిలగా మారింది. దాని మీద రెండున్నర మీటర్ల మందంతో రాఫ్ట్ నిర్మించారు. ఆ పైన ఒకటిన్నర మీటరు మందంతో గ్రానైట్ రాతిని పరిచి దాని మీద ప్రధాన నిర్మాణం జరిపారు. ఇప్పుడు భూ ఉపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 అడుగుల ఎత్తులో మొదలవుతుంది. అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పునాది డిజైన్ మార్చింది తెలుగు ఇంజినీరింగ్ నిపుణుడే..! అయోధ్య మందిరానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన పునాదికి డిజైన్ చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుడే కావటం విశేషం. తొలుత ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్ పైల్స్ డిజైన్ ఇచ్చారు. ఆలయ ట్రస్టు దానికి సమ్మతించి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి మీటర్ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్కాంక్రీట్పైల్స్ను పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్ ఏర్పాటు చేసి దాని మీద ప్రధాన నిర్మాణం చేపట్టాలన్నది వారి ఆలోచన. కానీ, సిమెంటు కాంక్రీట్పైల్స్ వయసు కేవలం వందేళ్లలోపు మాత్రమే ఉంటుందని పేర్కొంటూ, వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దాని బదులు కాకతీయులు అనుసరించిన శాండ్బాక్స్ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యేళ్ల జీవిత కాలం ఉంటుందని రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు. నిర్మాణ ప్రాంతం గుండా వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాది డిజైన్ ను తిరస్కరించింది. తర్వాత 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీయింజనీర్డ్ ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసింది. అలా చేస్తేనే పునాది కనీసం వెయ్యేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. పాండురంగారావు సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి, వెయ్యేళ్లపాటు నిలిచే రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మందిర పునాది ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు వేయేళ్లు ఉండేలా... అయోధ్య రామాలయం వేయి సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్దపెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలుపంచుకున్నారు. నేపాల్నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. వరదలను తట్టుకునేలా... అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తోంది. ప్రతి వేయి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్దపెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల సిఫారసులను అనుసరించారు. 25 వేల మంది సామర్థ్యంతో త్వరలో బస ఏర్పాట్లు... ఆలయానికి చేరువలో భక్తులకు వసతి మందిరం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీంట్లో 25 వేల మంది వరకూ ఉండొచ్చు. ఈ గదులను ఉచితంగా అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. లక్షమంది భక్తులకు వసతి ఉండేలా గదులు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ట్రస్టు ఉంది. అయితే సొంతంగా ఏర్పాటు చేయాలా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రతి శ్రీరామనవమీ ప్రత్యేకమే! ► నవమి నాడు బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు ► ప్రధాని మోదీ కోరికకు తగ్గట్టుగా నిర్మాణం అయోధ్య రామమందిరంలో ప్రతి శ్రీరామనవమి ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాల రాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆకాంక్షను ట్రస్టు ముందర ఉంచారు. ఆ మేరకు నిర్మాణం జరుగుతోంది. కిరణాలు దిగువ అంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు, విగ్రహ ఎత్తును ఖరారు చేశారు. చాలా విశాలమైన దేవాలయం కావటంతో సహజసిద్ధంగా సూర్యకిరణాలు లోనికి వచ్చే వీలు ఉండదేమోనన్న ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యకాంతి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో రోజుకు 2 వేల మంది.. ఇప్పుడు 50 వేల మంది.. రేపు లక్ష? అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్య రాముడి విరాళాలు రూ.3500 కోట్ల పైమాటే... ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. (అయోధ్య నుంచి ‘సాక్షి’ ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి) ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
రంగనాథుని సేవలో మోదీ
సాక్షి, చెన్నై/ తిరుచిరాపల్లి: కొద్దిరోజులుగా శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ అందులో భాగంగా శనివారం తమిళనాడులోని ద్వీప పట్టణం ‘శ్రీరంగం’లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ధోతి, అంగవస్త్రం, రుద్రాక్షమాలతో తమిళ సంప్రదాయ ఆహార్యంలో ఆలయానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆలయ నిర్వహణ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి వేదాలు పఠిస్తూ పండితులు తోడు వచ్చారు. మోదీ ఆ తర్వాత రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. రామానుజాచార్య, చక్రత్తాళ్వార్ సన్నిధాలను సందర్శించారు. ఆలయ ఏనుగు ఆండాళ్ ఆశీ్వరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌతార్గాన్ వాయిస్తూ ఆహ్వానం పలకడం విశేషం. భారత ప్రధాని రంగనాథ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి కంబ రచించిన కంబ రామాయణాన్ని ఈ సందర్భంగా మోదీ పారాయణం చేశారు. తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవదేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. రామేశ్వరం ఆలయంలోనూ... శనివారం మధ్యాహ్నం మోదీ రామేశ్వరం వెళ్లారు. అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 22 పవిత్ర తీర్థాలలో స్నానం చేశారు. ప్రాచీన శివాలయమైన ప్రఖ్యాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి, భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన చేశారు. రామయణ గాథతో ఈ ఆలయానికి గాఢానుబంధం ఉంది. అనంతరం పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు, స్థానికులతో మోదీ మాట్లాడారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మళ్లీ రామేశ్వరం అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేసి మరోమారు రామనాథస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సమీప గ్రామంలోని కోడండరామస్వామి దర్శనంతో మోదీ మూడు రోజుల తమిళనాడు పర్యటన పూర్తవుతుంది. తిరుచిరాపల్లిలో రోడ్ షో తిరుచిరాపల్లి పురవీధుల్లో జనం మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలవర్షం కురిపించారు. వారందరికీ వనక్కమ్ అంటూ మోదీ అభివాదం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ మార్గమంతా మార్మోగిపోయింది. అక్కడి నుంచి శ్రీరంగం వైపుగా మోదీ రోడ్‌షో కొనసాగింది. -
Ayodhya: శోభాయమానం.. రామమయం
అయోధ్య/న్యూఢిల్లీ: రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’, ‘అయోధ్య సిద్ధమైంది’ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆహూతులకు హార్దిక స్వాగతం పలుకుతున్నాయి. లౌడ్‌స్పీకర్ల నిండా రామ నామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అణువణువూ రామమయంగా మారింది. రామాలయ ప్రారంభ సన్నాహాలు తుది దశకు చేరుతున్నాయి. గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముని విగ్రహాన్ని శనివారం పవిత్ర సరయూ నదీజలాలతో అభిషేకించారు. గర్భాలయాన్ని కూడా నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. మంత్రోచ్చారణ నడుమ శుదీ్ధకరణ కార్యక్రమాలు ముగిశాయి. అనంతరం శా్రస్తోక్తంగా వాస్తు శాంతి, అన్నాధివాస, పుష్పాధివాస క్రతువులు జరిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రసాదాలు, పుష్పాలతో బాలరామునికి నివేదన జరిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలరామునికి ఆదివారం 125 కలశాలతో మంగళస్నానం జరగనుంది... దర్శనాలకు బ్రేక్ తాత్కాలిక మందిరంలో పూజలందుకుంటున్న ప్రస్తుత రామ్‌లల్లా విగ్రహాన్ని నూతన గర్భాలయంలోకి చేర్చే ప్రక్రియకు కూడా అర్చకులు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహంతో పాటు ఈ విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్టించనుండటం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నుంచే తాత్కాలిక ఆలయంలో దర్శనాలు నిలిపేశారు. ఈ విగ్రహాన్ని బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా గర్భాలయంలోకి తీసుకెళ్తారని అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభిప్రాయపడ్డారు. గుడారం నుంచి తాత్కాలిక మందిరంలోకి కూడా ఈ విగ్రహాన్ని ఆదిత్యనాథే తీసుకెళ్లారు. విమానాల వరద... అయోధ్యకు వీఐపీల రాక ఇప్పటికే మొదలైంది. ఆదివారం నాటికి ఇది ఊపందుకోనుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దాదాపు 7,000 మందికి ఆహా్వనాలు అందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అయోధ్యకు చేరవేసేందుకు సోమవారం ఏకంగా 100కు పైగా చార్టర్డ్ ఫ్లైట్లు రానున్నట్టు చెబుతున్నారు. వీటి తాకిడిని తట్టుకోవడం కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి శక్తికి మించిన పనే కానుంది. ఇప్పటికే 40కి పైగా విమానాల ల్యాండింగ్‌కు విజ్ఞప్తులు అందినట్టు చెబుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా వన్ ల్యాండయ్యాక విమానాశ్రయంలోకి మరే విమానాన్నీ అనుమతించరు. ఈ నేపథ్యంలో వీఐపీలు దిగీ దిగగానే వచి్చన విమానాన్ని వచి్చనట్టే వారణాసి, లఖ్‌నవూ తదితర సమీప విమానాశ్రయాలకు పంపనున్నారు. ప్రధాని వెనుదిరిగాక వాటిని ఒక్కొక్కటిగా తిరిగి అయోధ్యకు అనుమతిస్తారు. 2 నెలలు..2 కోట్ల మంది! రామాలయ ప్రారంభం అనంతరం అయోధ్యకు దేశ నలుమూలల నుంచీ భారీగా భక్తులను తరలించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జనవరి 25 నుంచి మార్చి 25 దాకా 2 కోట్ల మందికి దర్శనం కలి్పంచనుంది. ఒక్కో లోక్‌సభ నియోజవర్గం నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 543 లోక్‌సభ స్థానాల నుంచీ భక్తులను తరలించనుంది. ఇందుకోసం వందలాది ప్రత్యేక రైళ్లతో పాటు బస్సులు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఫొటోలు లీకయ్యాయి: పూజారి ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అని కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్‌నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. యజమానులుగా 14 మంది దంపతులు ప్రాణప్రతిçష్ట క్రతువులో 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొననున్నారు. వీరిని దేశవ్యాప్తంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. వీరందరి సమగ్ర భాగస్వామ్యంలో పూజలు, క్రతువులు జరుగుతాయని రామ జన్మభూమి ట్రస్టు వర్గాలను ఉటంకిస్తూ ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ వివరించారు. జైషే బెదిరింపులు ప్రాణప్రతిష్ట సమీపిస్తున్న వేళ అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చేసిన హెచ్చరిక అలజడి రేపుతోంది. హింసాత్మక ప్రతీకారం తప్పదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలు పరిస్థితిని డేగ కళ్లతో గమనిస్తున్నాయి. ‘రామ’ రైల్వేస్టేషన్లకు విద్యుత్ వెలుగులు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 343 రైల్వేస్టేషన్లున్నాయి. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవన్నీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్నాయి. రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం అయోధ్య రామునికి దేశ విదేశాల నుంచి వినూత్న కానుకల వరద కొనసాగుతూనే ఉంది. వీటిలో భాగంగా ఏకంగా 1,265 కిలోల లడ్డూ, 400 కిలోల తాళం శనివారం అయోధ్య చేరాయి. లడ్డూను హైదరాబాద్‌కు చెందిన నాగభూషణంరెడ్డి అనే భక్తుడు, తాళాన్ని యూపీలోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ దంపతులు తయారు చేయించారు. శర్మ ఇటీవలే మరణించారు. తాళాన్ని రామునికి సమరి్పంచాలంటూ చివరి కోరిక కోరారు. ఆ మేరకు ఆయన భార్య దాన్ని అయోధ్య చేర్చారు. దీన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తాళంగా చెబుతున్నారు. తాళాల తయారీకి అలీగఢ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 25 మంది 3 రోజుల పాటు శ్రమించి లడ్డూను తయారు చేసినట్టు నాగభూషణంరెడ్డి చెప్పారు. ఇది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రసాదాలు ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. టెప్లా, బాదం మిఠాయి, మటర్ కచోరీ తదితరాలను సోమవారం బాలరామునికి నివేదిస్తారు. అనంతరం వాటిని, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1,265 కిలోల భారీ లడ్డూతో పాటు దేశ నలుమూలల నుంచి వచి్చన ఇతర ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్ (56 రకాల భోజన పదార్థాల)తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. -
Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న వైభవంగా జరగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్ పుణ్యంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకునే మార్గం ఇక్కడ ఉంది. పన్ను చెల్లింపుదారులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రామమందిరానికి నగదు విరాళం అందించవచ్చు. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ ట్రస్ట్‌లో 15 మంది ట్రస్టీలు ఉన్నారు. ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (PAN:AAZTS6197B)ను చారిత్రక ప్రాముఖ్యత, పూజా స్థలంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని, మందిర పునర్నిర్మాణం/మరమ్మతు కోసం ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80G (2)(b) కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవని వెబ్సైట్ పేర్కొంది. -
కన్నయ్య..రామయ్య ఒక్కడేగా: రామ్ లల్లాకు ముస్లిం మహిళ అద్భుత కానుక
అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అనేక విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ శ్రీరాముడి పట్ల తన భక్తిని చాటుకోవడం విశేషంగా నిలిచింది.అయోధ్య బాలరామునికి 21.6 అడుగుల భారీ వేణువును రూపొందించింది.ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువును తయారు చేసింది . కన్నయ్య అయినా రామయ్య అయినా ఒకటేగా అంటోంది భక్తి పారవశ్యంతో. అద్వితీయమైన భక్తితో దీన్ని తానే తయారు చేశానని పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్ పేర్కొంది. ఇంతకు ముందు పిలిభిత్‌లో 16 అడుగుల వేణువు రికార్డు ఉండేది. తాజాగా రామయ్యకోసం ఈ రికార్డును బ్రేక్ చేసింది. కుమారుడు అర్మాన్ నబీ,సమీప బంధువు షంషాద్ సాయంతో అతి పెద్ద వేణువును తయారు చేసింది. జనవరి 22న రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో పిలిభిత్ వేణు నాదం ప్రతిధ్వనించనుంది. అంతేకాదు పర్వీన్ కుటుంబం మూడు తరాలుగా కన్నయ్య వేణువును తయారు చేస్తోంది. Muslim artisan Hina Parveen has made a 21 feet long Bansuri for Bhagawan Ram in Pilibhit This world's largest playable flute has been sent to Ayodhya Dham#RamMandir #RamMandirPranPratishtha pic.twitter.com/xLlOugj4Y5 — Organiser Weekly (@eOrganiser) January 20, 2024 ఈ వేణువును స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుందట. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామని పర్వీన్ కుటుంబం తెలిపింది. రెండు వైపుల నుంచి వాయించ గలిగే ఈ వేణువు తయారీకి 10 రోజులు పట్టిందని అలాగే తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని వెల్లడించింది. -
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!
అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది. ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు. ఉషశ్రీ నేపథ్యం.. పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా.. తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం. అయోధ్య అంతటా.. ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు. ఆటుపోట్ల నడుమ ఆ గళం.. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు. ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. -
Jan 22: రామ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు
టొరంటో: జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక ఎప్పుడెప్పుడా అని ప్రపంచంలోని రామ భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కెనాడాలోని మూడు మునిసిపాలిటీలు జనవరి 22వ తేదీని రామ మందిర్ డే గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. బ్రాంప్టన్, ఓక్ విల్లే, బ్రాంట్‌ఫోర్డ్ మునిసిపాలిటీలు 22ను రామ మందిర్ డేగా అధికారికంగా ప్రకటించాయి. మూడు మునిసిపాలిటీల నుంచి 22వ తేదీని అధికారిక రామ మందిర్ డేగా గుర్తించినట్లు ఉత్తర్వులు తీసుకోవడంలో విజయవంతమైనట్లు హిందూ కెనడియన్ ఫౌండేషన్(హెచ్‌సీఎఫ్) అధ్యక్షుడు అరుణేష్ గిరి తెలిపారు. గ్రేటర్ టొరంటో ఏరియా(జీటీఏ)లోనూ రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు సంబంధించి హోర్డింగులు పెట్టినట్లు ఇవి పండుగ వాతావరణాన్ని వ్యాప్తి చేస్తున్నాయని గిరి చెప్పారు. కెనడా వ్యాప్తంగా హిందూ సంఘాలతో కలిసి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
అయోధ్య వేడుక.. ఆహ్వానం అందింది: మోహన్‌బాబు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుండగా ఇందుకోసం రాజకీయ, సినీ, క్రీడా రంగంలోని తదితర సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపారు. తాజాగా తనకూ ఆహ్వానం అందిందని చెప్తున్నాడు డైలాగ్ కింగ్ మోహన్‌బాబు. శనివారం నాడు ఫిలిం నగర్లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్టపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులున్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు(రాములవారి ప్రాణప్రతిష్ట పూర్తయ్యేవరకు) అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఆయన మంచి పర్ఫార్మర్.. తనతో నటించేందుకు ఎదురు చూస్తున్నా.. -
కాంగ్రెస్‌లో ‘అయోధ్య’ చిచ్చు..!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర అంశం పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీజే చావ్డా రామ మందిరంపై పార్టీ వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు తన రాజీనామాను కూడా సమర్పించడం సంచలనం రేపింది. చావ్డా రాజీనామాతో గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం కేవలం 15కు పడిపోయింది. మూడుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చావ్డా ఎన్నికల్లో బీజేపీ హవాను సైతం తట్టుకొని నిలబడ్డారు. రాజీనామా సందర్భంగా చావ్డా మాట్లాడుతూ ‘నేనెప్పుడూ అధికార పార్టీ విధానాల్లో లోపాలను ఎత్తి చూపడాన్ని బలంగా నమ్ముతాను. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోదీని అనవసరంగా టార్గెట్ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజారంజకంగా ఉన్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చావ్డా త్వరలో బీజేపీలో చేరతారనే పుకార్లు జోరందుకున్నాయి. ఇక గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీశ్ దేర్ రామందిరంపై పార్టీ నిర్ణయాన్ని ఇటీవల ఎక్స్(ట్విటర్)లో తప్పుపట్టారు. ఈయనతో పాటు పోర్బందర్ ఎమ్మెల్యే గుజరాత్ పీసీసీ మాజీ చీఫ్ అర్జున్ మోత్వాడా కూడా రామమందిరంపై పార్టీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. రాముని ప్రతిష్టాపన వేడుకకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకోకుండా ఉండాల్సిందని అన్నారు. मर्यादा पुरूषोत्तम भगवान श्री राम हमारे आराध्य देव हैं इसलिए यह स्वाभाविक है कि भारत भर में अनगिनत लोगों की आस्था इस नवनिर्मित मंदिर से वर्षों से जुड़ी हुई है।@INCIndia के कुछ लोगों को उस खास तरह के बयान से दूरी बनाए रखनी चाहिए और जनभावना का दिल से सम्मान करना चाहिए। (1/2) pic.twitter.com/elzFFyRHoe — Ambarish Der (@Ambarish_Der) January 10, 2024 भगवान श्री राम आराध्य देव हैं। यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc — Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024 కాగా, ఉత్తర్‌ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అయోధ్య రామ మందిర వేడుకపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఆత్మహత్యా సదృశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అయోధ్య రాముని గుడి ప్రారంభోత్సవం లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి.. అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత -
అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్
Ayodhya Ram Mandir Ceremony: తాను అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు. కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. జనవరి 22 తర్వాత వెళ్తా: కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘వాళ్లు(రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు) నాకొక లేఖ పంపించారు. ఆతర్వాత మేము వాళ్లకు ఫోన్ చేసి విషయం ఏమిటని కనుక్కున్నాం. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా, మరేం పర్లేదు. అయితే, అక్కడికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఆ లేఖలో వాళ్లు స్పష్టంగా పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఇది భక్తిభావానికి సంబంధించిన విషయం. ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే, తాను తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను గనుక జనవరి 22 తర్వాత అక్కడికి వెళ్తానని కేజ్రీవాల్ చెప్పడం కొసమెరుపు. వాళ్లే వెళ్లడం లేదు కదా మరోవైపు.. ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాత్రం శంకరాచార్యల వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ‘‘అంతటి వ్యక్తులే అక్కడికి వెళ్లడం లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. రామ మందిరం దేశ ప్రజలందరిదని... ఇందులో బీజేపీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీలు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే అది వాళ్లిష్టం. నేను మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తా. వ్యక్తిగా ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేనేమీ చేయలేను. నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పట్టించుకోను’’ అని పరోక్షంగా సొంత పార్టీకే సవాల్ విసిరాడు. కాగా భజ్జీ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. #WATCH | On opposition parties declining invitation to Ayodhya Ram Temple ‘Pran Pratishtha’ ceremony, former Cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, " It is our good fortune that this temple is being built at this time, so we all should go and get the blessings.… pic.twitter.com/YUAplDGMNk — ANI (@ANI) January 19, 2024 వాళ్లకు ఆహ్వానాలు కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన -
Ayodhya: 22న బ్యాంక్యులు పనిచేసేది సగం రోజే!
ముంబై: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) జనవరి 22న సగం రోజు మాత్రమే పనిచేస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత వ్యవహారాలు, శిక్షణా శాఖ కూడా ఒక కీలక ఉత్వర్వులు జారీచేస్తూ, జనవరి 22న కేంద్ర ప్రభుత్వ స్థాపనను సగం రోజు పనిదినాన్ని ప్రకటించింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న మనీ మార్కెట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు (ప్రాధమిక– ద్వితీయ), విదేశీ మారకద్రవ్యం, ద్రవ్య మార్కెట్లు, రూపీ ఇంట్రస్ట్ డెరివేటివ్‌లలో ఎటువంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఇక రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే, డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కూడా 22వ తేదీ ఉండదని ఆర్బీఐ మరో సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ సౌలభ్యం తిరిగి జనవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. ‘‘భారత ప్రభుత్వం ప్రకటించిన సగం రోజు పని దినం కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనూ 2024 జనవరి 22, సోమవారం రూ. 2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు’’ అని సెంట్రల్ బ్యాంక్ ప్రకటన తెలిపింది. -
Ayodhya Ram Mandir: బాలరాముడి తొలి దర్శనం
అయోధ్య/న్యూఢిల్లీ: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రాణప్రతిష్ట కంటే ముందే రామ్‌లల్లా విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. గర్భగుడిలోకి చేర్చకముందు వీటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాలరాముడి చేతిలో బాణం, విల్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నల్లరాయితో రూపొందించిన ఐదు సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ విధంగా రామ్‌లల్లా విగ్రహ తొలి దర్శనం ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రజలకు లభించింది. ఇక గర్భగుడిలో ప్రధాన వేదికపై ప్రతిష్టించిన తర్వాత కళ్లకు గంతలు కట్టి ఉన్న రామ్‌లల్లా విగ్రహం ఫొటోను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) విడుదల చేసింది. ప్రాణప్రతిష్ట పూర్తవకపోవడంతో విగ్రహం కళ్ల చుట్టూ పసుపు రంగు వస్త్రం చుట్టారు. రామ్‌లల్లాను గులాబీల దండతో అలంకరించారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముడిని దర్శించుకోవచ్చు. ఏర్పాట్లపై సీఎం యోగి సమీక్ష ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యలోని హనుమా న్ గార్హీ ఆలయంలో పూజలు చేశారు. అలాగే భవ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. ప్రాణప్రతిష్ట వేడుక కోసం జరుగుతున్న ఏర్పాట్లు సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సరయూ నదిలో సోలార్ బోటును ప్రారంభించారు. 1,008 కుండియా హనుమాన్ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. కాలర్ ట్యూన్లుగా రాముని పాటలు రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాతి్మక వాతావరణం కనిపిస్తోంది. వీధుల్లో రాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రజలు పరస్పరం పలుకరింపుల్లోనూ రామనామం ప్రస్తావిస్తున్నారు. అయోధ్య పౌరులు తమ ఫోన్లలో రాముడి పాటలనే కాలర్ ట్యూన్లు, రింగ్ టోన్లుగా మార్చుకుంటున్నారు. ఎవరికైనా ఫోన్ చేస్తే ‘యుగ్ రామ్ రాజ్ కా’, ‘రామ్ ఆయే హై అయోధ్య మే’, ‘హరి అనంత్ హరి కథ’ వంటి పాటలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి 5 లక్షల లడ్డూలు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం మధ్యప్రదేశ్ భక్తులు 5 లక్షల లడ్డూలు పంపించారు. ఈ లడ్డూలతో ఐదు వాహనా లు శుక్రవారం భోపాల్ నుంచి అయోధ్యకు బయలుదేరాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ వాహనాలకు పచ్చజెండా ఊపారు. 5 లక్షల లడ్డూలు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తయారు చేశారు. ఉత్తరప్రదేశ్ జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం రామమందిర ప్రారంభోత్సవం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించాలని నిర్ణయించుకున్నారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సైతం ఈ అవకాశం కలి్పంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణప్రతిష్ట వేడుక ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారక్‌లలో టీవీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పలు రాష్ట్రాల్లో సోమవారం సెలవు రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. రాష్ట్రమంతటా కార్యాలయా లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలకు సెలవు అమలు చేస్తున్నట్లు తెలియజేసింది. మధ్యప్రదేశ్‌లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తమ విద్యాసంస్థలకు 22న హాఫ్ డే సెలవు ఇస్తున్నట్లు జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రకటించింది. అంబానీ నుంచి బచ్చన్ దాకా.. బాలరాముడి ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అత్యంత ప్రముఖులు హాజరుకాబోతున్నారు. బిలియనీర్ ముకేష్ అంబానీ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దాకా చాలామంది ప్రముఖులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపించింది. ఆహ్వానితుల జాబితాలో దాదాపు 7,000 మందికి చోటు దక్కింది. ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, అధికారులు, దౌత్యవేత్తలకు ఆహా్వనాలు అందాయి. ముకేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ తమ కుటుంబ సభ్యులతో సహా హాజరుకాబోతున్నారు. సినీ ప్రముఖులు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, మోహన్‌లాల్, అలియా భట్, సరోద్ కళాకారుడు అంజాద్ అలీ, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తదితరులను ఆహా్వనించారు. ఆ న్యాయమూర్తులకూ... అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకాబోతున్నారు. అయోధ్య వివాదంపై తుది తీర్పునిచి్చ, భవ్య మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సభ్యులకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహా్వనం పంపించారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదంపై 2019 నవంబర్ 9న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రాణప్రతిష్టకు హాజరు కావాలని కోరుతూ రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యులతోపాటు 50 మందికిపైగా ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులను సైతం ఆహా్వనించారు. శిల్పికి ‘తీపి బహుమతి’ రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు తియ్యటి బహుమతి లభించింది. మైసూరులోని మహాలక్ష్మీ స్వీట్స్ దుకాణం యజమాన్యం ఆయనకు అయోధ్య రామమందిరం ప్రతిరూపంగా తయారు చేసిన మిఠాయిని బహూకరించింది. రకరకాల స్వీట్లతో ఈ బహుమతిని తయారు చేశారు. 22న ఒడిశా రామాలయ ప్రాణప్రతిష్ట అయోధ్యలో నిర్మించిన భవ్య రామమందిరంలో ఈ నెల 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరుగనుంది. అదే రోజు మరో రామాలయ ప్రాణప్రతిష్ట సైతం జరగబోతోంది. ఒడిశాలో నయాగఢ్ జిల్లా ఫతేగఢ్ గ్రామంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన గుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎగువన ఓ కొండపై 2017లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం ఎత్తు 165 అడుగులు. 150 మందికిపైగా కారి్మకులు ఏడేళ్లలో నిర్మాణం పూర్తిచేశారు. కళింగ శైలిలో ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు ఈ కొండపై తపస్సు చేశాడని చెబుతుంటారు. శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో అయోధ్య రామాలయం. (ఇన్సెట్లో) శుక్రవారం వీహెచ్‌పీ విడుదల చేసిన రామ్‌లల్లా విగ్రహం ఫొటో -
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. అతిథుల జాబితా ఇదే!
ఎక్కడ, ఎవరి నోట విన్న పవిత్రమైన అయోధ్య, రామ మందిరం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట, ఈ మాటలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని వేలాది మంది అతిథులకు ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ప్రముఖుల నివాసాలకు వెళ్లి అయోధ్యలో జరిగే రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్‌లో కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజద్ అలీ ఖాన్, గీత రచయిత మనోజ్ ముంతాషీర్, అతని భార్య ప్రసూన్ జోషి, డైరెక్టర్లు సంజయ్ భన్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు పలువురు ఉన్నారు. పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూప్ చైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజయ్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివసన్ హాజరు కానున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కే సతీశ్ రెడ్డి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఆయన భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ హెడ్ నవీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మన్ నరేశ్ త్రెహాన్ ఉన్నారు. అలాగే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జనరల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ జెట్లలో అయోధ్యకు వెళ్లనుండగా.. మరికొందరు సాధారణ విమానాల్లో ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రి అయోధ్య, లక్నో వంటి సమీప నగరాల్లో బసచేయనున్నారు. -
అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్
డార్లింగ్ ప్రభాస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఫుడ్. ఎందుకంటే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారంటే తోటి నటీనటులకు వెరైటీ ఫుడ్ పెట్టి షాకయ్యేలా చేస్తారు. అయితే గత కొన్నిరోజుల నుంచి ప్రభాస్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఇచ్చే ఫుడ్ కోసం కోట్ల రూపాయాలు విరాళమిచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్టాత్మక రామ మందిర ప్రారంభోత్సవం.. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరనుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌కి కూడా ఇన్విటేషన్ వచ్చిందని తెలుస్తోంది. అయితే డార్లింగ్ మాత్రం ప్రారంభోత్సవం రోజు.. అయోధ్యకు వచ్చే భక్తులకు ఇచ్చే ఫుడ్ ఖర్చంతా భరిస్తున్నాడని.. దీనికి మొత్తంగా రూ.50 కోట్లు అయ్యిందని మాట్లాడుకున్నారు. ఈ వార్తలపై ఇంగ్లీష్ మీడియా, ప్రభాస్ టీమ్‌ని సంప్రదించగా.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ స్పష్టత వచ్చేసినట్లు అయింది. ఇకపోతే తెలుగు సినీ ప్రముఖుల్లో చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులకు ఆహ్వానాలు అయితే వచ్చాయి. వీళ్లలో ఎవరెవరు అయోధ్యకు వెళ్తారనేది చూడాలి. (ఇదీ చదవండి: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. అతిథుల జాబితా ఇదే! -
Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం
అయోధ్య: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. కాగా గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్ అంటూ పులకించిపోతున్నారు. రామ్‌లల్లా విశిష్టతలివే.. ►అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ►కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట పూజలు ► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్‌లల్లా దర్శనమిస్తాడు. ► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ►శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ►శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు ► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. ► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు. ► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. -
అంతా రామమయం..ఇంట్రస్టింగ్ సంగతులు తెలుసా మీకు?
అయోధ్యలో శ్రీరాముడి (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం (2024, జనవరి 22) ఆసన్నమవుతోంది. ఈ పుణ్యకార్యానికి సంబంధించిన అన్ని క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రామభక్తుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది. సోమవారం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు జై శ్రీరామ్ అంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు ,తమ ఇష్టదైవం శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు అయోధ్య వరకూ వెళ్లలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యేక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎటు చూసిన రామనామ జపం మారుమోగుతోంది. అసలు ఏంటీ అయోధ్య రాముని జన్మభూమి దేవాలయ చరిత్ర ఏంటి? ఎందుకంత విశిష్టత? మరి అక్కడికి ఎలా వెళ్లాలి, చూడాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం! ఇదీ చరిత్ర ⇒ 1885లో అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949లో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. ⇒ 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. ⇒ 1950లో పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. ⇒ 1959లో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. ⇒ 1981లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986లో ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ⇒ 1989లో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ⇒ 1992లో డిసెంబర్ 6 తర్వాత రామ మందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ⇒ 2002లో ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ⇒ 2010లో అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ⇒ 2011లో మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018లో ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ⇒ 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. ⇒ 2019లో ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కీలక సుప్రీంకోర్టు తీర్పు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. ఎలా వెళ్లాలి? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీ ప్రూఫ్నుకచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకదుస్తులు స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా, మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించాలి. దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఈ సందర్భంగా అయోధ్య ప్రయాణంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామభక్తుడైన ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ గర్హి. అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్-ఉద్-దౌలా ఈ ఆలయాన్ని స్థాపించారట. అలాగే అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని భక్తువల విశ్వాసం. సుమారు 76 మెట్లు ఎక్కి మరీ వాయుపుత్రుడిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో శుక్రవారం ప్రార్థనలు చేశారు. #WATCH | Uttar Pradesh Yogi Adityanath offers prayers at Hanuman Garhi temple in Ayodhya pic.twitter.com/VdRBr93kic — ANI (@ANI) January 19, 2024 రెండోది దేవకాళీ ఆలయం. సాక్షాత్తూ సీతమ్మవారు తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారట నమ్ముతారు. అలాగే గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరో ఘాట్. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది. రామ్ కీ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఛోటి దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని విశ్వసించే ప్రసిద్ధి చెందిన ఆలయం నాగేశ్వరనాథ్ దేవాలయం. ఆ తర్వాత శ్రీరాముని జంట కుమారుల్లో ఒకరైన కుశుడు అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడట. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు దర్శనమిచ్చే కనక భవన్ మరో అద్భుతమైన దేవాలయం. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతా దేవికి ఈ భవనాన్ని కానుకగా ఇచ్చారు. ముఖ్యంగా ఆలయ శిల్పం, శిల్పకళా వైభవానికి సంకేతమని చూసి తీరాలని భక్తులు నమ్ముతారు. -
Ayodhya Ram Mandir Idol Photos: అరుణుడు చెక్కిన అయోధ్య బాలరాముడితడే (ఫొటోలు)
-
దశాబ్దాల కల నెరవేరుతోంది: మోదీ
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణంతో దశాబ్దాల కల నెలరవేరిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇన్నాళ్లుగా భక్తులు రామున్ని చిన్న గుడారంలోనే దర్శించుకున్నారని చెప్పారు రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న దేశ వ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు. ప్రజలు తమ జీవితాల నుంచి పేదరికాన్ని తొలగించుకోవడానికి రామ జ్యోతి స్ఫూర్తినిస్తుందని మోదీ అన్నారు. మూడోసారి బీజేపీ పాలనలో భారత్‌ను ప్రపంచంలోనే మూడో ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశ ప్రజలకు కచ్చితంగా హామీ ఇస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. #WATCH | PM Modi in Maharashtra's Solapur says, "In the 3rd term of our Central government, in my next term, India will be in the top three economies of the world. I have given this guarantee to the people of India that in my next term, I will bring India into the top three… pic.twitter.com/A4DEGrrVOR — ANI (@ANI) January 19, 2024 రామ భజనలో నిమగ్నమైన దృశ్యాలను ప్రధాని మోదీ షేర్ చేశారు. "అయోధ్య రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు దేశం మొత్తం శ్రీరాముని పట్ల భక్తితో తడిసిముద్దయింది. నేపథ్య గాయకులు సురేష్ వాడ్కర్, ఆర్య అంబేకర్ తమ మధురమైన పాట ద్వారా భక్తుల భావాలను చిత్రీకరించారు" అని ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi sings 'Shri Ram Jai Ram' bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN — ANI (@ANI) January 16, 2024 రామ మందిర కార్యక్రమానికి ముందు మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. ఇదీ చదవండి: రాముడి కోసం.. నిద్రాహారాలలో కఠిన నియమాలు పాటిస్తున్న మోదీ -
PM Modi: రాముడి కోసం కఠిన నియమాలు
లక్నో: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మందిర నిర్మాణం నుంచి ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. బీజేపీ పెద్దల ఆశయాల్లో ఒకటిగా ఉన్న రామమందిరం నిర్మాణం తన చేతులమీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అప్పటికే పలుమార్లు చెప్పారు. అయోధ్య ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందే జనవరి 12 అనుష్టాన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నాటి నుంచి మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాన యజమానిగా మోదీ వ్యవహరించనున్నారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. జనవరి 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మంది హాజరుకానున్నారు. 100 మంది విదేశీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారు. ఇదీ చదవండి: Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_6941921367.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్!
ఢిల్లీ: అయోధ్యలో రామ మందరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ.. ఉగ్ర కలకలం రేగింది. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది. భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో భాగంగా ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రరిస్ట్ స్వ్వాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. అయితే ఆ ముగ్గురి వివరాల్ని గానీ.. విచారణకు సంబంధించిన విషయాలపైగానీ ఇంకా ప్రకటన వెలువడలేదు. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్‌లల్లా పటిష్ట భద్రత జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి 11 వేల మంది అతిథులుగా హాజరు కానున్నారు. ఆహ్వానం వెళ్లిన వాళ్లలో రాజకీయ, సినీ, క్రీడా రంగానికి ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో యూపీ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. పది వేల మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పహారాలో.. సీసీ కెమెరాల నిఘా నీడలో అయోధ్య ఉందిప్పుడు. -
అయోధ్య: గర్భగుడిలోకి రామ్‌లల్లా
అయోధ్య/న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం కీలక ఘట్టం ముగిసింది. రామ్‌లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో భవ్యమందిరంలోని గర్భగుడిలోకి చేర్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య ప్రధాన వేదికపై ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అత్యంత కీలకమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగాల్సి ఉంది. గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచారు. బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేవకర్ సైతం ఎక్స్ ఖతాలో ఆ ఫొటోను ఉంచారు. सियावर रामचंद्र की जय।🙏 प्रतिक्षा 22 जनवरी 2024.. जय श्रीराम 🚩#RamMandirPranPratishta #RamLalla #RamMandir #RamMandirAyodhya #JaiShreeRam #ShriRam #Ayodhya #राम pic.twitter.com/0c6vO6ueJO — Prakash Javadekar (@PrakashJavdekar) January 18, 2024 మొబైల్ ఫోన్లు, కెమెరాలతో ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఆలయ ప్రాంగణంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా బలగాలు మోహరించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనధికార వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడికి నిత్యం ఐదుసార్లు ప్రత్యేక హారతి ఇస్తారు. విగ్రహంపై దుస్తులను ప్రతిరోజూ మారుస్తారు. మొదటి, చివరి హారతి సందర్భంగా రాముడు ప్రత్యేక దుస్తుల్లో దర్శనమిస్తాడు. నిర్విఘ్నంగా కొనసాగుతున్న క్రతువులు ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శా్రస్తోక్తంగా నిర్వహించారు. జలదివస్‌లో భాగంగా రామ్‌లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. రామ్‌లల్లా విశిష్టతలివే.. ► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్‌లల్లా దర్శనమిస్తాడు. ► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. ► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు. ► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. అయోధ్య ఆలయంపై పోస్టల్ స్టాంప్‌లు విడుదల అయోధ్య భవ్య రామమందిరానికి సంబంధించిన పోస్టల్ స్టాంప్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు శ్రీరాముడిపై జారీ చేసిన స్టాంప్‌లతో కూడిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇవి కేవలం కాగితం ముక్కలు కాదని, చరిత్రాత్మక సంఘటనలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడానికి ఉపయోగపడే మాధ్యమాలు అని చెప్పారు. చరిత్ర పుస్తకాలకు, పురాణ గాథలకు, గొప్ప ఆలోచనలకు సూక్ష్మరూపాలు అని తెలిపారు. మోదీ మొత్తం ఆరు రకాల స్టాంప్‌లను మోదీ విడుదల చేశారు. అయోధ్య రామాలయం, వినాయకుడు, హనుమంతుడు, జటాయు, శబరి మాత, కేవట్ రాజ్‌పై వీటిని ముద్రించారు. 48 పేజీల స్టాంప్ బుక్‌ను మోదీ విడుదల చేశారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా తదితర దేశాలు, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ముద్రించిన శ్రీరాముడి స్టాంప్‌ల చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. రాముడు, సీత, రామా యణం అనేవి సరిహద్దులకు, కాలానికి, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతం అని ప్రధాని మోదీ చెప్పారు. రామాయణం, రాముడి వ్యక్తిత్వం భూమి పై పర్వతాలు, నదులు ఉన్నంత కాలం ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. విదేశాలు సైతం రాముడిపై పోస్టల్ స్టాంప్‌లు ముద్రించాయని, వేర్వేరు నాగరికతలను రాముడు ప్రభావితం చేశాడని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భిన్న సంస్కృతుల ప్రజలకు రాముడు ఆరాధ్య దైవంగా మారాడని వివరించారు. ఫిరోజాబాద్ నుంచి 10 వేల గాజులు, బ్రేస్లెట్లు ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నుంచి 10,000కుపైగా ప్రత్యేక గాజులు, బ్రేస్లెట్లను గురువారం అయోధ్యకు చేర్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. మహిళలు, పురుషులు చేతులకు ధరించే గాజులు, బ్రేస్లెట్ల తయారీకి ఫిరోజాబాద్ ఎంతో పేరుగాంచింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కోసం ఫిరోజాబాద్ వ్యాపారులు రాముడు, సీత, హనుమంతుడి చిత్రాల తో కూడిన 10 వేల గాజులు, బ్రేస్లెట్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ప్రాణప్రతిష్ట వేడుక తర్వాత వీటిని ట్రస్టు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను పెళ్లిలో నూతన వధువులు ధరించాలని ఫిరోజాబాద్ వ్యాపారులు సూచించారు. దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడుక దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డీడీ న్యూస్‌తోపాటు డీడీ జాతీయ చానళ్లన్నింటిలో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. దూరదర్శన్ సౌజన్యంతో ప్రైవేట్ చానళ్లలోనూ ప్రసారమవుతుంది. అయోధ్యలో 40 కెమెరాలను దూరదర్శన్ ఏర్పాటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ‘సగం రోజు సెలవు’ దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలకు ఈ నెల 22వ తేదీన సగం రోజు సెలవు ప్రకటించారు. అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాణప్రతిష్టకు సంబంధించిన వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా వారి విజ్ఞప్తి మేరకు కార్యాలయాలకు సగం రోజు సెలవు ఇస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 02.30 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలకూ 22న సగం రోజు సెలవే. వాతావరణ శాఖ వెబ్‌పేజీ ప్రారంభం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. అయోధ్య నగరంతోపాటు పరిసర ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, తేమ, చలి తీవ్రత వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం ప్రత్యేక వెబ్పేజీను ప్రారంభించింది. హిందీ, ఇంగ్లి‹Ù, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఇందులో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఉజ్జయిని నుంచి 5 లక్షల లడ్డూలు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 5 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. శుక్రవారం వీటిని నాలుగు వాహనాల్లో అయోధ్యకు పంపించనున్నట్లు ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 22న ప్రాణప్రతిష్ట సందర్భంగా వీటిని భక్తులకు పంపిణీ చేస్తారు. -
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ -
అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ
అయోధ్య: శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగే ఈ నెల 22న అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఏకంగా ఒక ప్రత్యేక వెబ్‌పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ట వేడుక జరిగే 22న అయోధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్, అత్యధిక ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది. అయోధ్యలో 22వ తేదీన ఉండే ఉష్ణోగ్రతలతో పాటు తేమ, గాలి వేగం తదితర వాతావరణ సంబంధిత అంశాలను కూడా ఐఎండీ ఏర్పాటు చేసిన వెబ్‌పేజీ తెలియజేస్తోంది. 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు అయోధ్యలో ఉష్ణోగ్రతల ఫోర్క్యాస్ట్తో పాటు ఇక్కడ ఈ వారం రోజుల్లో ప్రతి రోజు ఏ సమయంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలవుతాయనే వివరాలను కూడా ఐఎండీ పొందుపరిచింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి IMD launched a dedicated page for Ayodhya weather forecast.#IMD #Ayodhya pic.twitter.com/wSEpUJr90K — Suresh Kumar (@journsuresh) January 18, 2024 ఈ వివరాలన్నింటని హిందీ, ఆంగ్లం, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఐఎండీ అందుబాటులో ఉంచింది. కేవలం అయోధ్యనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నోలతో పాటు రాజధాని న్యూ ఢిల్లీ నగరాల వాతావరణ వివరాలను కూడా ఐఎండీ వెబ్‌పేజీలో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. పర్యాటకుల సౌకర్యార్థమే ఐఎండీ ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు సమాచారం. ఇదీచదవండి.. రామాలయం పోస్టల్స్టాంపు విడుదల -
సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
లక్నో: అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజేఐని కోరారు. "అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి కోర్టు సిబ్బందికి సెలవు రోజు అవసరం అవుతోంది." అని బార్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా అన్నారు. తక్షణ విచారణ అవసరమయ్యే అంశాన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు లేదా తదుపరి రోజుకు రీషెడ్యూల్ చేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ -
Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు రెండో రోజుకు చేరాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు ‘యజమానులుగా’ సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు. రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. గురువారం గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ క్రతువులు ఈ నెల 21వ తేదీ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్యకు చేరుకున్న ‘రామ్‌లల్లా’ భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్‌లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్‌లల్లా ప్రతీకాత్మక (సింబాలిక్) విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 19 నుంచి ‘అఖండ్ పథ్’ అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కోసం హిందువులతోపాటు ఇతర మతాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ మూడు రోజులపాటు ‘అఖండ్ పథ్’ నిర్వహించేందుకు సిక్కు మతస్థులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలోని గురుద్వారా బ్రహ్మకుండ్ సాహిబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ అఖండ్ పథ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. అయోధ్య శ్రీరాముడితో సిక్కులకు చరిత్రాత్మక అనుబంధం ఉందని వివరించారు. 1510లో గురునానక్ అయోధ్యను దర్శించుకున్నారని గుర్తుచేశారు. 1858లో సిక్కు మత పెద్దలు అయోధ్య రామాలయంలో పూజలు చేశారని, గోడలపై రామ్ అని రాశారని చెప్పారు. సిక్కు మత ఆచారాలు, సంప్రదాయాల్లో అఖండ్ పథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను నిరంతరాయంగా భక్తితో పఠించడమే అఖండ్ పథ్. ఇందుకు 48 గంటలకుపైగా సమయం పడుతుంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్‌లో ‘రామ్’ అనే పదం 2,533 సార్లు ఉందని ఆర్పీ సింగ్ వెల్లడించారు. ప్రాణప్రతిష్టకు ‘ప్రధాన యజమాని’ ప్రధాని మోదీ అయోధ్య: రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రధాన యజమాని’గా వ్యవహరిస్తారని ప్రధాన ఆచార్యుడు పండిత లక్ష్మీకాంత్ దీక్షిత్ చెప్పారు. మొదట రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాను ప్రధాన యజమానిగా ఖరారు చేశారు. కానీ, ఈ విషయంలో మార్పు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతోపాటు కీలకమైన పూజలను ప్రధాన యజమాని తన చేతుల మీదుగా నిర్వహిస్తారు. అయోధ్యకు 200కుపైగా ఆస్థా ప్రత్యేక రైళ్లు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భక్తులు పోటెత్తనున్నారు. వారి సౌకర్యార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 2 వేల ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టయర్–1, టయర్–2 నగరాల నుంచి బయలుదేరి ఈ రైళ్లు అయోధ్య ధామ్ స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 100 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవి పరిమితమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణానికి ఐఆర్సీటీసీ ద్వారా మాత్ర మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 20 వేల ఉద్యోగాలు అయోధ్య ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను ప్రతిఏటా కోట్లాది మంది దర్శించుకోనున్నారు. అదేస్థాయిలో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి పెరగడం ఖాయం. ఆతిథ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో కలిపి 20 వేల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని సమాచారం. ప్రతిఏటా శ్రీరాముడికి ‘సూర్య తిలకం’ అయోధ్య రామ మందిరంలో ప్రతిఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజు భక్తులు అపూర్వమైన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ రోజు గర్భాలయంలో రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాలే తిలకంగా రామయ్యను అలంకరిస్తాయి. దీన్ని సూర్య తిలకంగా పిలుస్తారు. ఈ తిలకం వ్యవస్థను సీఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్ఐ) సైంటిస్టులు డిజైన్ చేశారు. ఇందుకోసం ఆలయంలో కటకాలు, అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకాన్ని దర్శించుకోవచ్చు. రామ భక్తులపై మోసాల వల సైబర్ నేరగాళ్లు అయోధ్య రామమందిర ప్రారం¿ోత్సవాన్ని కూడా అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. అయోధ్య నుంచి రామమందిర ప్రసాదం పంపిస్తామంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్ సైట్లలో ఇలాంటి ప్రసాదం కనిపిస్తోంది. డెలివరీ చార్జీల కింద కేవలం రూ.51 ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే చాలు ఈ నెల 22వ తేదీ నాటికి ఉచితంగా ప్రసాదం పంపిస్తామంటూ మరికొందరు నేరగాళ్లు వల విసురుతున్నారు. నిజానికి దీనికి, అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదు. అదంతా నకిలీ ప్రసాదమని అధికారులు అంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొందరైతే డొనేషన్లు సేకరిస్తున్నామంటూ రామ్ జన్మభూమి ట్రస్టు పేరిట వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. వాటిని స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లో నగదు గల్లంతవుతోంది. అలాగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యక్షంగా తిలకించడానికి వీఐపీ పాసులు అందజేస్తామంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. ‘రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్–ఏపీకే’ పేరిట ఇలాంటి సందేశాలను ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. నగదు బదిలీ చేయించుకొని ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. -
Ramayan: అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు
అయోధ్య: రామ మందిరంలో 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జరగనున్న ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి సీతారాములు, లక్ష్మణుడు బుధవారమే అయోధ్యకు చేరుకున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే వచ్చింది సీతారామలక్ష్మణులే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ సీరియల్ అయిన రామాయణ్‌లో నటించిన అరుణ్ గోవిల్(రాముడు), దీపిక చిక్లియా(సీత), సునీల్ లహ్రీ(లక్ష్మణుడు) రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేశారు. ఇంతేకాక సోను నిగమ్ పాడిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాట చిత్రీకరణలో వీరు పాల్గొననున్నారు. అయోధ్యలోని గుప్తార్‌ఘాట్, హానుమాన్గర్హి, లతాచౌక్‌లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలందిన వారిలో రామాయణ్ సీరియల్ నటులు కూడా ఉన్నారు. ఇదీచదవండి.. రామ్ మందిర ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్ -
Ayodhya: బాల రాముడి దర్శనం.. పులకించిన భక్తులు
అయోధ్య: అయోధ్యలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరించింది. మరో అయిదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా బుధవారం తొలిసారిగా బాలరాముడు భక్తులకు అయోధ్యలో దర్శనమిచ్చాడు. భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. Uttar Pradesh | Ramlalla's representative idol was carried across the Ram Temple premises in Ayodhya earlier today. (Pics: VHP spokesperson Sharad Sharma) pic.twitter.com/4M07BjV1yc — ANI (@ANI) January 17, 2024 గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 5 ఏళ్ల బాలుని రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు. ఇదీచదవండి.. ప్రధాని మోదీ రామ ప్రతిజ్ఞ నెరవేరింది -
అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్
చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు. చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.