అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ట్రాన్స్‌జెండర్ల కమ్మూనిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ట్రాన్స్‌జెండర్లు జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని ఆ పవిత్రమైన రోజు జన్మించే పిల్లల తల్లిదండ్రుల వద్ద ఎటువంటి డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఆశీర్వాచనం అందజేస్తామని తెలిపింది.
తాము చిన్న పిల్లలు జన్మించిన ఇళ్లకు వెళ్లి పాటలు పాడి.. పుట్టిన చిన్నపిల్లలు సంతోషంగా పెరగాలని ఆశీర్వదిస్తామని ట్రాన్స్ కమ్మూనిటీకి చెందిన ప్రతినిధి రాణీ తెలిపారు. అయితే జనవరి 22 రాముడి ప్రాణప్రతిష్ట రోజున జన్మించే చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, కానుకలను తీసుకోకుండానే ఉచితంగా ఆశీర్వచనం ఇస్తామని తెలిపారు.
రాముడి ప్రణప్రతిష్ట రోజు పిల్లల తల్లిదండ్రులు తమకు డబ్బుల బదులుగా సంతోషంగా పండ్లు ఇచ్చినా తీసుకుంటామని మరో ట్రాన్‌జెండర్ శరదా తెలిపారు. రాముడిని దర్శించుంచుకునే అవకాశం రావటం తమ జీవితాల్లో ఎంతో అదృష్టమని తెలిపారు. 500 ఏళ్ల నుంచి జరిగిన పోరాటం.. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టతో కార్యరూపం దాల్చుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. జనవరి 22న పవిత్రమైన రోజుగా భావిస్తూ.. అయోధ్యతో పాటు పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment