newborn babies
-
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ట్రాన్స్జెండర్ల కమ్మూనిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ట్రాన్స్జెండర్లు జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని ఆ పవిత్రమైన రోజు జన్మించే పిల్లల తల్లిదండ్రుల వద్ద ఎటువంటి డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఆశీర్వాచనం అందజేస్తామని తెలిపింది. తాము చిన్న పిల్లలు జన్మించిన ఇళ్లకు వెళ్లి పాటలు పాడి.. పుట్టిన చిన్నపిల్లలు సంతోషంగా పెరగాలని ఆశీర్వదిస్తామని ట్రాన్స్ కమ్మూనిటీకి చెందిన ప్రతినిధి రాణీ తెలిపారు. అయితే జనవరి 22 రాముడి ప్రాణప్రతిష్ట రోజున జన్మించే చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, కానుకలను తీసుకోకుండానే ఉచితంగా ఆశీర్వచనం ఇస్తామని తెలిపారు. రాముడి ప్రణప్రతిష్ట రోజు పిల్లల తల్లిదండ్రులు తమకు డబ్బుల బదులుగా సంతోషంగా పండ్లు ఇచ్చినా తీసుకుంటామని మరో ట్రాన్‌జెండర్ శరదా తెలిపారు. రాముడిని దర్శించుంచుకునే అవకాశం రావటం తమ జీవితాల్లో ఎంతో అదృష్టమని తెలిపారు. 500 ఏళ్ల నుంచి జరిగిన పోరాటం.. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టతో కార్యరూపం దాల్చుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. జనవరి 22న పవిత్రమైన రోజుగా భావిస్తూ.. అయోధ్యతో పాటు పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడంట! -
దారుణం: విద్యుత్ నిలిచిపోవడంతో నలుగురు నవజాత శిశువులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదంచోటుచేసుకుంది. సర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అసుపత్రిలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక నలుగురు పసికందులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని మండిపడ్డారు. అయితే విద్యుత్ అంతరాయం కారణంగా పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది బయటపెట్టలేదు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన శిశువు ఒకరోజు నుంచి నలుగురు రోజుల వయసున్న వారని కలెక్టర్ కుందన్ కుమార్ పేర్కొన్నారు. ఆ నలుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచారని, వారిలో ఇద్దరినీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య నలుగురు చిన్నారులు చనిపోయారని ఆయన వెల్లండిచారు. అయితే కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు. చదవండి: బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
షాకింగ్ ఘటన: రోడ్డులేక డోలీలో ఆస్పత్రికి.. కవలలు మృతి!
ముంబై: దేశంలో ఇంకా చాలా గ్రామాలకు కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోడ్డు వసతి సరిగా లేకపోవటం వల్ల నెలలు నిండకముందే పుట్టిన కవల శిశువులు తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయారు. తన బిడ్డలను చూసుకుని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయిన ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది. సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో బాలింతను డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాల్ఘర్ జిల్లా మోఖడా తహసీల్‌కు చెందిన వందన బుధర్ అనే మహిళ ఏడు నెలల గర్భవతి. అయితే, నెలలు నిండకముందే తన ఇంటిలోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువులు బలహీనంగా ఉన్నారు. ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల వారికి సమయానికి సరైన వైద్య సహాయం అందలేదు. దీంతో తల్లి కళ్లెదుటే ఇద్దరు శిశువులు కన్నుమూశారు. మరోవైపు.. తీవ్ర రక్తస్రావంతో మహిళ పరిస్థితి సైతం విషమంగా మారింది. దీంతో బెడ్‌షీట్‌తో డోలీ తయారు చేసుకుని బాలింతను సుమారు 3 కిలోమీటర్లు దూరం మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మహిళ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్ర కిశోర్ వాగ్ ట్వీట్ చేశారు. సరైన సమయంలో వైద్యం అందకపోవటంతోనే కవల శిశువులు మరణించారని, అది దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు..! -
తల్లిలో బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే...?
కొత్తగా అమ్మగా మారిన తల్లిలో తగినన్ని పాలు పడకపోతే ఆమె తల్లడిల్లిపోతుంది. ఇలాంటివారు చిన్నారికి సరిపోయినంతగా పాలు పడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీంతో ఆమె ఆరోగ్యం బాగుపడటంతో పాటు, బిడ్డకూ తగినన్ని పాలు సమకూరతాయి. కొత్తగా తల్లి అయిన మహిళలు తమ ఆహారంలో పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త తల్లులు, అలాగే చాలామంది ఇళ్లలోని పెద్దవాళ్లలో ఓ అపోహ ఉంటుంది. సిజేరియన్ సహాయంతో బిడ్డను తీసిన మహిళల్లో, ఆ కుట్లు చీము పడతాయనే అపోహతో... వారికి పప్పుధాన్యాలు ఇవ్వరు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపప్రధ తో ద్రవపదార్థాలనూ, బిడ్డకు జలుబు చేస్తుందనే అభిప్రాయంతో పండ్లను తిననివ్వరు. దాంతో తల్లికి పాలు సరిగ్గా పడవు సరికదా... ఆమెకు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. ఇక కొందరు తల్లుల్లో తగినన్ని పాలు ఊరకపోవడంతో... బిడ్డకు సరిపడినన్ని పాలు అందించడం కోసం వెంటనే పోతపాలను అలవాటు చేస్తారు. పోతపాలు రుచిగా ఉండటంతో బిడ్డ వాటికి అలవాటు పడటం చాలా సాధారణం. అటు తర్వాత చిన్నారులు తల్లి దగ్గర తాగడానికి ఇష్టపడరు. దాంతో బిడ్డ పాలు తగడం తగ్గించడంతో తల్లి దగ్గర తగినన్ని పాలు ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. ఇలా పాలు ఊరడం తగ్గిపోడానికి ఇది కూడా ఒక కారణమే. బిడ్డకు తల్లిదగ్గరి పాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోడానికి ఓ మార్గం ఉంది. తాగిన తర్వాత బిడ్డ... రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రపోతున్నా, రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా, వయసుకు తగినట్లు బరువు పెరుగుతున్నా... తల్లి పాలు బిడ్డకు సరిపోతున్నట్లు లెక్క. ఒకవేళ నిజంగానే అమ్మ దగ్గర బిడ్డకు సరిపడినన్ని పాలు పడనట్లయితే... తల్లి తన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు అందేలా మంచి బలవర్థకమైన ఆహారంతోపాటు... అందులో మరీ ముఖ్యంగా నువ్వులు, వెల్లుల్లి, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగేలా చూడాలి. ఆ తర్వాత కూడా బిడ్డకు ఇంకా పాలు సరిపోక పోయినట్లయితే డాక్టర్ సలహా తీసుకోవాలి. -
యాంటీబాడీస్‌తో పుట్టిన మొదటి చిన్నారి!
మనందరికీ తెలుసు ఇప్పటివరకూ రకరకాల వయసుల వారికీ, ఎన్నోరకాల జబ్బులున్నవారికీ, మరెన్నో రకాల ఆరోగ్య సమస్యలున్నవారికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహించారు. కానీ ఎందుకైనా మంచిదంటూ మొదట్లో గర్భవతుల మీద, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మీద ట్రయల్స్ జరగలేదు. అయితే ఇప్పుడు ఆ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే దాదాపు ప్రసవానికి రెడీగా అంటే... తొమ్మిదినెలలప్పుడు నెలలుపూర్తిగా నిండిన గర్భవతికి (ఖచ్చితంగా చెప్పాలంటే 36 వారాల మూడురోజుల గర్భవతి గా ఉన్నప్పుడు) కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి చూశారు. ఆ గర్భవతికి మాడర్నాఎమ్ఆర్ఎన్ఏ తరహా వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించారు. మరో మూడు వారాల తర్వాత ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. చిన్నారి పాప పుట్టిన వెంటనే ఆమె నుంచి రక్తం సేకరించి పరిశీలించి చూశారు. విచిత్రం ఏమిటంటే... అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కూడా దేహంలో పుష్కలమైన యాంటీబాడీస్‌తో పుట్టడం చూసి ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతయ్యింది. దీన్ని బట్టి తేలుతున్నదేమిటంటే... గర్భవతిగా ఉన్న కాబోయే తల్లికి వ్యాక్సిన్ ఇచ్చినా లేదా గర్భవతిగా ఉన్న మహిళకు కోవిడ్ వచ్చినా... బొడ్డుతాడు (ప్లాసెంటా) ద్వారా ఆ యాంటీబాడీస్ చిన్నారుల్లోకి కూడా ప్రవేశించి, వారికీ రక్షణ కల్పిస్తాయని తేలింది. అంటే కాబోయే తల్లికి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కొంతమేర బిడ్డకు సైతం కరోనా వైరస్ నుంచి రక్షణ కలుగుతుందని చాలావరకు తేలిందంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పాల్ గిల్బర్ట్, చాడ్ రడ్నిక్లు. అయితే ఇలా ఇచ్చిన ఈ వ్యాక్సిన్ల ప్రభావం (ఎఫెకసీ) బిడ్డలో ఖచ్చితంగా ఎంత ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు... ఇలా గర్భవతులకు వ్యాక్సిన్ ఇచ్చాక... బిడ్డ పుట్టిన అనంతరం... ఆ చిన్నారులకు రొమ్ముపాలు పడుతూ... తద్వారా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉందో కూడా చూడాలంటున్నారు పరిశోధకులు. అయితే ఇవి కేవలం తొలి దశ పరిశోధనలు మాత్రమే కావడంతోనూ, ఇంకా పరిశోధనలూ, ట్రయల్స్ జరుగుతుండటం వల్లనూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం గర్భవతులూ... వారి గర్భస్థ శిశువులపై ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ ఆశారేఖగా కనిపించే విషయం ఒక్కటే... ఇప్పటికి వస్తున్న ఫలితాల మేరకు గర్భవతుల్లోనూ వ్యాక్సిన్ చాలావరకు సురక్షితమేననీ, బిడ్డకు సైతం గర్భస్థపిండానికీ, కడుపులో ఎదుగుతున్న శిశువుకూ అది హాని చేయకపోగా... ఎంతోకొంత సంరక్షణ ఇస్తుందనే సానుకూల ఫలితాలు వస్తుండటంతో పరిశోధకులు చాలా ఆశావహంగా, ఆనందంగానే ఉన్నట్లు తొలి పరిశీలనల ద్వారా తెలుస్తోంది. l -
కరోనా : తల్లినుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతున్న భారతావనికి మరో షాకింగ్ న్యూస్. గర్భిణీ తల్లి నుంచి గర్భంలో ఉండగానే, లేదా ప్రసవం ద్వారా శిశువుకు కరోనా వైరస్ సోకే ప్రమాదం వుందని భారతదేశ అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం తెలిపింది. అయితే గర్భిణీలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు, బిడ్డకు సంక్రమణ తీవ్రత ఏ మేరకు వుంటుందనేది ఇంకా గుర్తించలేదని ఐసీఎంఆర్ నొక్కి చెప్పింది. కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి నుండి బిడ్డకు పుట్టుకకు ముందు లేదా ప్రసవించేటప్పుడు సంభవించే అవకాశం ఉంది. అయితే తల్లి పాలల్లో ప్రాణాంతక వైరస్ లక్షణాలున్నాయని నిరూపించడానికి ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్ తెలిపింది. (కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) తల్లి నుండి బిడ్డకు డైరెక్టుగా (ప్రసూతి లేదా ఇంట్రాపార్టమ్) కోవిడ్-19 సోకినట్టుగా ఒక కేసులో సాక్ష్యాలున్నప్పటికీ, దీని తీవ్రతను ఇంకా నిర్ధారించలేకపోతున్నామని ఐసీఎంఆర్ వ్యాఖ్యానించింది. కానీ గర్భిణీలకు కరోనా సోకితే తీవ్రమైన సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. కనుక కరోనా పాజిటివ్, న్యుమోనియాలాంటి శ్వాసకోశ వ్యాధి తీవ్రంగా వుంటే, పుట్టిన తరువాత బిడ్డను తల్లినుంచి తాత్కాలికంగా (వేర్వేరు గదుల్లో ఉంచడం) వేరు చేయడం ఉత్తమమని సూచించింది. దీంతోపాటు గుండె జబ్బుతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు అత్యధిక ప్రమాదంలో ఉంటారని, ఎప్పటికంటే ఎక్కువగా వైద్యుల పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా గర్భస్రావమయ్యే ప్రమాదం ఉందని నిరూపించే డేటా ఏదీ ప్రస్తుతం లేదని పరిశోధనా సంస్థ వ్యాఖ్యానించింది. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ ) కరోనా వైరస్ గర్భిణీ స్త్రీల నిర్వహణకు సంబంధించి సోమవారం ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వైరస్ టెరాటోజెనిక్ అనేందుకు ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు కనుక దీర్ఘకాలిక డేటాకై ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ -19 సోకిన గర్భిణీలలో న్యుమోనియా లక్షణాలున్నప్పటికీ త్వరగా కోలుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో కరోనా సోకిన మహిళలందరి జాబితాను నమోదు చేయాలని, ఫలితాలతో సహా తల్లీబిడ్డల ఆరోగ్య రికార్డులు వివరంగా నింపి, భవిష్యత్తు విశ్లేషణ కోసం భద్రపరచాలని సూచించింది. అలాగే కరోనా వైరస్ సోకినంత మాత్రాన గర్భ విచ్ఛిత్తి చేసుకోవాల్పిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ఆడ శిశువు రక్షణ ఇలాగా?!
మన దేశంలో చడీచప్పుడూ లేకుండా నిత్యమూ సాగే నరమేథం ఒకటుంది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాక్షిగా... కాసుల కక్కుర్తి రోగంతో చెలరేగే వైద్యుల సాక్షిగా... చేతగానట్టు మిగిలిపోయే చట్టాల సాక్షిగా ‘గర్భ’గుడిలో ఆడ శిశువుల్ని చిదిమేసే భయంకర నరమేథమది. బాలిక పుడితే కుటుంబానికి భారమవుతుంద నుకునే పాపిష్టి ఆలోచన దేశంలో రోజుకు 1,370మంది ఆడ శిశువుల్ని కడతేరుస్తున్నదని ఆమధ్య కొన్ని గణాంకాలు వెల్లడించాయి. ఇంతటి దారుణాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలపై పౌర సమాజ కార్యకర్తలనుంచి, ఇతరుల నుంచి ఎన్నో సలహాలు, సూచనలు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటి మాటెలా ఉన్నా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ ఇటీవల చేసిన ప్రతిపాదన అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు నిషేధం అమలవుతున్న లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేయాలన్నదే ఆ ప్రతిపాదన సారాంశం. ఆ పరీక్షల అనంతరం గర్భంలో ఉన్నది ఆడ శిశువో, మగ శిశువో తేలాక ఆ వివరాలను ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని, పుట్టేది ఎవరైనా కనాల్సిందేనని వారికి నచ్చ జెప్పాలని ఆమె అభిప్రాయం. ఆ రిజిస్టర్‌లోని వివరాలకు అనుగుణంగా శిశు జననాలున్నాయో లేదో తనిఖీ చేయాలని కూడా ఆమె చెప్పారు. అలా చేస్తే అమ్మ కడుపులో ఉన్న ఆడ శిశువులకు రక్షణ ఉంటుందని ఆమె అంటున్నారు. ఈ మాట చెబుతూ ఇది కేవలం తన ఆలోచన మాత్రమేనని కూడా మేనక వివరించారు. ఈ ఆలోచన వెనకున్న కారణాన్ని కూడా ఆమె చెప్పారు. చట్టవిరుద్ధంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లు చేస్తున్న వారిని ఎంతకాలం అరెస్టు చేస్తూ పోతాం...అది శాశ్వత పరిష్కారం ఎలా అవుతుంది అన్నదే ఆమె ప్రశ్న. కానీ ఈ క్రమంలో గర్భిణులను నేరస్తులుగా పరిగణిస్తున్నామన్న సందేహం ఆమెకు కలగలేదు. బిడ్డను కనాలో లేదో నిర్ణయించుకునే హక్కును మహిళలకు లేకుండా చేసినట్టవుతుందన్న ఆలోచన కూడా రాలేదు. అందువల్లే మేనకాగాంధీ ప్రతిపాదనపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. బాలలు, బాలికల నిష్పత్తి విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా యన్నది వాస్తవం. 1991నాటికి ప్రతి వెయ్యిమంది బాలలకూ 945 బాలిక లుండగా...2011 జనాభా లెక్కల్లో అది 919కి పడిపోయింది. హైదరాబాద్ నగరంలో అది 914 మాత్రమే. వాస్తవానికి వెయ్యిమంది బాలురకూ 950 మంది ఆడపిల్లలు ఉండటం ఆరోగ్యకరమైన నిష్పత్తి అంటారు. కానీ మహిళలను గౌరవిస్తున్నామని, పూజిస్తున్నామని చెప్పే దేశంలోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీన్ని ఎంతో కొంత మార్చాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జనవరిలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేసే ధోరణి అత్యంత హీనమని ఆ సందర్భంగా మోదీ చెప్పారు. ఆడపిల్లల విషయంలో వివక్ష ప్రదర్శించడం అలవాటైన సమా జానికి ఆధునిక టెక్నాలజీ కూడా తోడ్పడుతున్నది. కనీస వైద్య సదుపాయాలు కరువైన మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పోర్టబుల్ స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉంటున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన ఒక ప్రొఫెసర్ జరిపిన అధ్యయనంలో తేలింది. చట్టాలున్నా వాటిని సమర్థవంతంగా అమలు పరిచే వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఈ జాడ్యం నానాటికీ ముదురుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల్ని నిషేధించే చట్టం వచ్చి రెండు దశాబ్దాలవుతున్నది. అయినా మెరుగైన ఫలితాలు రావడంలేదని జనాభా లెక్కలు చెబుతున్నాయి. మెరుగైన జీవనం, చదువు వంటివి భ్రూణ హత్యల్ని నివారిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఆర్ధిక సంస్కరణలు అమలై అవకాశాలు పెరిగాక కుటుంబాలు కుంచించుకుపోవడం, ఒక్కరితో సరిపెట్టుకోవాలను కోవడం, ఆ ఒక్కరూ మగపిల్లాడైతే బాగుంటుందని భావించడం పెరిగిందని సామాజిక అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలు మధ్య తరగతిలో ప్రబలంగా ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగు. సమాజంలో మహిళల స్థితిగతులకూ, వారిపట్ల చూపుతున్న వివక్షకూ...గర్భస్త శిశు పిండాలను చిదిమేయడానికీ ఉన్న సంబంధాన్ని గుర్తించనంతకాలమూ ఈ స్థితి మారదు. సామాన్య పౌరుల సంగతలా ఉంచి నాయకులుగా చలామణి అవుతున్నవారు సైతం మహిళల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, వారి సమస్యల విషయంలో ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే కుటుంబాల్లోనూ కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్ష మొదలుకొని భ్రూణ హత్యల వరకూ అన్నిటినీ నిర్దేశిస్తున్నది కుటుంబాల్లోని పురుషాధిక్యతే. ఇప్పుడు సాగుతున్న భ్రూణహత్యల్లో మహిళలు నేరస్తులు కాదు...బాధితులు. అయితే మేనకాగాంధీ తాజా ప్రతిపాదన బాధితుల్నే నేరస్తులుగా మార్చేట్టు కనబడుతోంది. పైగా ఇది ఆచరణసాధ్యం కూడా కాదు. కొన్ని లక్షల సంఖ్యలో ఉండే వైద్యులనూ, వారి కార్యకలాపాలనూ పసిగట్టలేని వ్యవస్థ కోట్లాదిమంది తల్లులపై నిఘా పెట్టి ఉంచడం కుదిరేపనేనా? రోజుకు 50,000 శిశు జననాలుండే మన దేశంలో గర్భిణుల డేటా సేకరణ, దానికనుగుణంగా ఆడ శిశువులు జన్మిస్తున్నారో లేదో చూడటమన్నది సాధ్యమేనా? మారుమూల పల్లెల్లో ఇప్పటికీ చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్నా వాటిల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. మాతాశిశు సంర క్షణకంటూ ఎన్నో పథకాలున్నా అవి సక్రమంగా అమలు కావడంలేదు. పౌష్టికాహార లేమితో, ప్రాణాంతక వ్యాధులతో శిశువులు కన్నుమూసే సిగ్గుమాలిన పరిస్థితులున్నాయి. వీటన్నిటినీ సరిచేయడమెలాగో ఆలోచించి చర్యలు తీసుకోవడం తక్షణావసరం. మేనకాగాంధీ అలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి. -
ఒక్క రక్తపు బొట్టు.. శిశువు గుట్టు విప్పు..
పిల్లలు పుట్టిన ఆనందం కంటే వాళ్లు బలహీనంగా ఉండటం లేదా మరో తీవ్రమైన సమస్యతో బాధపడటాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు.. చికిత్స నిమిత్తం లక్షల రూపాయలు ఖర్చుచేయడం తెలిసిందే. పిల్లలు పుడుతూనే ఆరోగ్యసమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతాయి? నవజాత శిశువులకు మెరుగైన చికిత్స అందించలేమా? అనే ప్రశ్నలతో ప్రారంభమైన పరిశోధన చివరికి సత్ఫలితాల్ని సాధించింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఆల్ట్రా వాయిలెట్ స్కానింగ్ విధానంలో కంటే ఒకే ఒక్క రక్తపు బొట్టుతో శిశువు వయసుతోపాటు వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. తద్వారా పసిపిల్లల అనారోగ్యానికి గల కారణాలనూ విశ్లేషించి వారికి నూతన విధానంలో చికిత్స అందించవచ్చు. ఈ పరిశోధనలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమస్యగా మారిన శిశుమరణాలను నివారించే వీలుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా పిండ దశ నుంచి 37 వారాల తర్వాత తల్లి గర్భం నుంచి వెలుపలికి వచ్చే శిశువుది ఆరోగ్యకరమైన జననంగా వైద్యులు భావిస్తారు. కానీ పౌష్టికాహారలోపం, వాతావరణకాలుష్యం, మానసిక, శారీరక ఒత్తిడి తదితర కారణాలతో కొందరు తల్లులు 37 వారలకంటే ముందే శిశువులకు జన్మనిస్తున్నారు. ఇలా సరైన సమయానికి ముందే(ప్రీ మెచ్యూర్ బేబీస్) పుట్టిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 వేల మంది ప్రీమెచ్యూర్ బేబీలు పుడుతున్నారు. వీరిలో చాలామంది బతికిబట్టకట్టలేకపోతున్నారు. తాజాగా అభివృద్ధి చేసిన వైద్య విధానంలో శిశువు నుంచి ఒకే ఒక చుక్క రక్తాన్నిసేకరిస్తారు. రకరకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ శిశువు ప్రీమెచ్యూర్ బేబీనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటంతోపాటు వారి ఆరోగ్యపరిస్థితికి తగిన చికిత్స అందించేవీలుంటుందని శాస్ర్తవేత్తల బృందానికి నేతృత్వం వహించిన కెల్లీ రైక్ మన్ తెలిపారు. అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన కెల్లీ బృందం దాదాపు ఐదేళ్లపాటు వివిధ దేశాలకు చెందిన మూడు లక్షల మంది నవజాత శిశువులకు పరీక్షలు నిర్వహించింది.