ayodya
-
అయోధ్య దీపోత్సవం.. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు
లక్నో: అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించిన దీపోత్సవ వేడుక బాల రాముడి సాక్షిగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. సరయూ నది తీరంలో అధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హారతి ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 25,12,585 దీపాలను భక్తులు వెలిగించి రికార్టు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నిస్ వరల్డ్ రికార్టును అయోధ్య దీపోత్సవం సాధించింది. గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కన్సల్టెంట్ నిశ్చల్ బరోట్ నేతృత్వంలోని 30 మంది బృందం 55 ఘాట్లలో డ్రోన్లను ఉపయోగించి దీపాలను లెక్కించింది. #WATCH | Ayodhya, Uttar Pradesh: 2 new Guinness World Records created during the #Deepotsav celebrations in AyodhyaGuinness World Record created for the most people performing 'diya' rotation simultaneously and the largest display of oil lamps with 25,12,585 achieved by… pic.twitter.com/ppvlbt17L1— ANI (@ANI) October 30, 2024 ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. లక్షల దీపాలతో సరయూ తీరం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. #WATCH | Uttar Pradesh: Lakhs of diyas illuminated along the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration here. #Diwali2024 pic.twitter.com/P29BPld9KO— ANI (@ANI) October 30, 2024గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంతో అధికారులు స్థానిక చేతివృత్తుల వారి నుంచి 28 లక్షల దీపాలు ఆర్డర్ చేశారు. ఈ వేడుక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అయోధ్య నగరం అంతటా సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అందులో సగం మంది సాధారణ దుస్తులలో ఉన్నారు. #WATCH | 'Aarti' being performed by Uttar Pradesh CM Yogi Adityanath, Union Minister Gajendra Singh Shekhawat, Deputy CM Brajesh Pathak and others on the banks of Saryu River in Ayodhya #Diwali2024 #Deepotsav pic.twitter.com/FMXzUzokbD— ANI (@ANI) October 30, 2024పదో నంబర్ ఘాట్ వద్ద కార్యక్రమానికి శుభసూచకంగా స్వస్తిక్ రూపంలో సుమారు 80 వేల దీపాలను పెట్టారు. ఘాట్ల వద్ద 5 వేల నుంచి 6 వేల మంది అతిథులు బస చేసేందుకు ఏర్పాటుపూర్తి చేసినట్లు దీపోత్సవ్ నోడల్ అధికారి సంత్ శరణ్ మిశ్రా తెలిపారు. కార్యక్రమానికి హాజరుకాలేని వారి కోసం నలభై జంబో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేశారు.#WATCH | Uttar Pradesh: Laser and light show underway at Saryu Ghat in Ayodhya. With the Ghat lit up with diyas and colourful lights, Ram Leela is being narrated through a sound-light show. #Diwali2024 #Deepotsav pic.twitter.com/pg05s5dX4H— ANI (@ANI) October 30, 2024 ఈ వేడుకలో మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా వంటి ఆరు దేశాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో ఆకట్టుకుంది. -
500 ఏళ్ల తరువాత అయోధ్యలో వైభవంగా దీపావళి
-
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు. -
అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..!
అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. అవేంటో సవివరంగా చూద్దామా..! శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. అందువల్ల ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి. దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. బాల రాముడికి సూర్యుడి తిలకం.. శ్రీరామ నమమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిట మీద పడే విధంగా ఏర్పాటు చేశారు. పురాణల ప్రకారం..చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాల రాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేగాదు అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు. శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు. రామాలయంలో భక్తుల దర్శనం కోసం ఏడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయని, మరో మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. దర్శనం త్వరగా జరిగేలా పలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచివుంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశప్రజలంతా ప్రసార భారతి ద్వారా, ఇంట్లో నుంచే రామ్‌లల్లాను దర్శించుకోవచ్చన్నారు. -
రామ్ లల్లాకు ఒక గంట విశ్రాంతి!
జనవరి 23న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహోత్సవాన్ని తిలికించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. అలాగే బాల రాముని దర్శనం కోసం బారుల తీరే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో నిర్విరామంగా దర్శనాలకు అవకాశం ఇచ్చారు. అలాగే రోజు చేసే కైంకర్యాలు, వీటికి తోడు భక్తుల దర్శనలతో బాల రామునికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన ఆలయ ట్రస్ట్ బాలరామునికి ఒక గంట విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రాముడు ఇక్కడ ఐదేళ్ల పిల్లవాడని అందువల్ల ఆయన అధిక ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదని ఆలయ పూజారులు అన్నారు. అందువల్ల రామ్ లల్లాకు ఒక గంట బ్రేక్ ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు. ఈమేరకు ఈ కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి అమలవుతుందని ప్రకటించింది ఆలయ ట్రస్ట్. అలాగే ఆలయ రోజువారీ కైంకర్యాల కోసం రాముల వారిని ఉదయం నాలుగు గంటలకే లేపడం నుంచి మొదలై రాత్రి 10 గంటలతో దర్శనాలు ముగుస్తాయి. అలాగే సాయంత్రం రాముల వారికి చేసే ఆచారాల కోసం మరో రెండు గంటలు సమయం కేటాయించారు. ఇలా రాముడు 18 గంటల పాటు ఒత్తడికి గురిచేస్తే తట్టుకోలేరని అన్నారు ఆలయ ట్రస్ట సభ్యులు సత్యేంద్ర దాస్ అన్నారు. ఆయన బాల రాముని సౌకర్యార్థం మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు విరామం ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు సత్యేంద్ర దాస్. (చదవండి: ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం! ఎన్ని రోజులు జరుగుతుందంటే..) -
ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందుకోసం అయోధ్య ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. ముఖ్యంగా పూలతో చేసిన అలంకరణ చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పుష్పలను వివిధ రాష్ట్రాలను తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తైన తర్వాత ఆ పూలు వృధాగా అయ్యే పోకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. అందుకోసం వారు ఏంచేస్తున్నారో తెలుసా! బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు పది టన్నుల పూజలు తెప్పించారు. ముఖ్యంగా బాలరాముడి గర్భలయాన్ని అలకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను మూడువేల కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని క్రిస్తానియం, గెర్బెరా, ఆర్కడ్లు, ప్రోమేథియం, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ తదితర పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ వంటి ఇతర నగరాల నుంచి కూడా ఈ కత్రువు కోసం పలు రకాల పూలను తెప్పించారు. ఈ ప్రాణప్రతిష్ట క్రతవు ముగిసిన తదనంతరం అయోధ్య ధామ్‌లో అన్ని దేవాలయాలల్లోని సుమారు 9 మెట్రిక్ టన్నుల పుష్పల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఈ రీసైకిల్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్ చేసి అగరుబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగానే అయోధ్యధామ్‌లోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వలన్నింటిని ఇలా ప్రాసెంసింగ్ చేసి ధూప్ స్టిక్‌లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్. ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట క్రతువు కూడా ముగిసింది. ఇక ఆ తతంగంలో వినియోగించిన పువ్వలన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త కంగా 2.3 మెట్రిక టన్నులకు పెరిగింది. ప్రసతుతం మున్సిపాలటీ సిబ్బంది ఆ పువ్వలన్నింటిని ప్రాసెస్ చేస్ ధూప్ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. View this post on Instagram A post shared by PHOOL (@phool.co) (చదవండి: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?) -
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం!
అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ డల్లాస్‌లోని ఇస్కాన్ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహించారు. ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధా కళాచంద్ జీ ఆలయం రామ నామ జపంతో మార్మోగింది. ఇక భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామ భజనలు, కీర్తనలతో ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డల్లాస్ ఇస్కాన్ టెంపులలో దీపావళిని తలపించే విధంగా దీపోత్సవాల సంబరం అంబరాన్ని తాకింది. (చదవండి: ఆఫ్రికాలో ఉద్యోగం.. ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు) -
న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం!
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాసులు భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఇక భారీ స్కీన్‌ను ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం. (చదవండి: మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు) -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్‌కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్‌తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్‌లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్‌లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్‌బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్‌తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్‌తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
మెగా స్టార్ చిరంజీవి రామ్ ఎంట్రీ అయోధ్యలో..!
-
Prana Pratishtha: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట?
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రాయశ్చిత్తం, సరయూనది ఒడ్డున దశవిద్ స్నానం, విష్ణుపూజ, గోదాన్, రామ్ లల్లా విగ్రహంతో నగరమంతా ఊరేగింపు తదితార కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవాళే మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. పైగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు రోజుగా ప్రకటించాయి కూడా. దేశమంతా ఈ వేడుక నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మహోత్సవ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోనున్నాయి కూడా. ఈ సందర్భంగా అస్సలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ? ఎందుకని చేస్తారు? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం! ప్రాణ ప్రతిష్ట అంటే.. ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవం ఇవ్వడం. ప్రాణ్ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్‌లాల్ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎలా జరుగుతుందంటే.. ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. ఆ తర్వాత ఆవుపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు. ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టడం జరగుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది. వేదాలు, పూర్ణాహుతి శ్లోకాలతో పుష్పాలు, ధూపం, నైవేధ్యం వంటివి దేవుడికి సమర్పించడం జరగుతుంది. అయితే ఈ వేడుక మాత్రం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఘట్టం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా ఆయన విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చిన్న బంగారు కర్రతో కాజల్‌ని బాలారాముని పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపుతారు. చివరిగా 108 దీపాలతో మహా ఆరతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించడం జరగుతుంది. గుడ్డతో ఎందుకు కప్పి ఉంచుతారంటే.. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహ స్వచ్ఛతను కాపాడుకునేందుకు ముఖాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట పూజ కార్యక్రమాలు జరిపేంత వరకు అలా గుడ్డతో కప్పి ఉంచుతారు. ఇలా దేవి నవరాత్రలప్పుడూ, గణపతి నవరాత్రుల్లో కూడా చేయడం మనం గమనించే ఉంటాం. అందులోనూ 500 నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ పవిత్రోత్సవాన్ని మరింత కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కన్నుల పండగగా జరుపుతోంది రామజన్మభూమి ట్రస్ట్. దీన్ని పురుస్కరించుకుని రాష్ట్రాలలోని ప్రతి రామాలయంలో ఘనంగా పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఎటూ చూసిన రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్‌లో ఇలా చూడండి!) -
ఆర్ట్‌లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్‌తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్‌తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇవాళే అయోధ్యలో కన్ను పండుగగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మరికొద్దిసేపటిలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. అంతేగాదు దేశ విదేశాల నుంచి సైతం రామభక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఆయోధ్య రాముడుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన ధరించే బట్టలను అందంగా డిజైన్ చేసి ఎవరూ ఇస్తారు? వాళ్లేవరూ? వంటి విశేషాలు గురించి తెలుసుకుందాం! అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబూ లాల్ టైలర్స్. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్, శంకర్ లాల్ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు వేసే బట్టలను అందంగా డిజైన్ చేస్తారు. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్, శంకర్ల తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతోంది. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసి కుడతారు. అలా..సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు. వాళ్లు కేవలం రాముడికి మాత్రమే గాక లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలిగ్రామాలకు కూడా బట్టలు కుట్టడం జరుగుతుంది. ఈ టైలర్లు అయోధ్యలోని బడి కుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు. ఈ అయోధ్య రామమందిరం భూమిపూజ రోజు రామునికి ఆకుపచ్చరంగు దుస్తులను కుట్టారు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలర్ దుస్తులను డిజైన్ చేశారు. అయితే ఆ సోదరులు రాముడుకి దుస్తులు కుట్టేందుకు సిల్క్‌ని వాడగా, బంగారం దారంతో కుట్టడం జరుగుతుంది. పైగా వాటిపై నవగ్రహాలు ఉండటం విశేషం. ఈ ఇరువురు సోదరులు రామ్‌లల్లా కోసం దుస్తులు కుట్టడంలో చాలా ప్రత్యేకతను చూపి తమ భక్తిని చాటుకుంటున్నారు. అంతేగాదు మా జీవితకాలంలో ఈ గొప్ప రామాలయాన్ని చూడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు ఆ సోదరులు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ట్రాన్స్జెండర్ల కమ్మూనిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ట్రాన్స్జెండర్లు జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని ఆ పవిత్రమైన రోజు జన్మించే పిల్లల తల్లిదండ్రుల వద్ద ఎటువంటి డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఆశీర్వాచనం అందజేస్తామని తెలిపింది. తాము చిన్న పిల్లలు జన్మించిన ఇళ్లకు వెళ్లి పాటలు పాడి.. పుట్టిన చిన్నపిల్లలు సంతోషంగా పెరగాలని ఆశీర్వదిస్తామని ట్రాన్స్ కమ్మూనిటీకి చెందిన ప్రతినిధి రాణీ తెలిపారు. అయితే జనవరి 22 రాముడి ప్రాణప్రతిష్ట రోజున జన్మించే చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, కానుకలను తీసుకోకుండానే ఉచితంగా ఆశీర్వచనం ఇస్తామని తెలిపారు. రాముడి ప్రణప్రతిష్ట రోజు పిల్లల తల్లిదండ్రులు తమకు డబ్బుల బదులుగా సంతోషంగా పండ్లు ఇచ్చినా తీసుకుంటామని మరో ట్రాన్‌జెండర్ శరదా తెలిపారు. రాముడిని దర్శించుంచుకునే అవకాశం రావటం తమ జీవితాల్లో ఎంతో అదృష్టమని తెలిపారు. 500 ఏళ్ల నుంచి జరిగిన పోరాటం.. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టతో కార్యరూపం దాల్చుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. జనవరి 22న పవిత్రమైన రోజుగా భావిస్తూ.. అయోధ్యతో పాటు పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడంట! -
ఏటా అయోధ్యకు దక్షిణ కొరియన్ల రాక! కారణం ఏంటంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశవిదేశాలను నుంచి రామ భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అయోధ్యకు ప్రతి ఏడాది వందల సంఖ్యలో దక్షిణ కొరియా దేశపు సందర్శకులు వస్తుంటారు. అయితే వారంతా వచ్చేది.. రామ జన్మభూమిని దర్శించుకోవడానికి వచ్చినవారు అయితే కాదు? మరి వారంతా అయోధ్యకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే... దక్షిణ కొరియాకు ఉత్తరప్రదేశ్‌లోని రాముడు పుట్టిన అయోధ్యకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. అయితే ఈ సంబంధం రాముడితో కాదు. ప్రతి ఏటా వందల మంది దక్షిణ కొరియన్లు రాణి హు హ్వాంగ్ ఓకేకు నివాళులు అర్పించడానికి అయోధ్య నగరాన్ని సందర్శిస్తారు. అయోధ్యతో తమకు పూర్వకాలపు సంబంధాలు ఉన్నట్లు దక్షిణ కొరియన్లు నమ్ముతున్నారు. దక్షిణ కొరియా ఇతిహాసాల ప్రకారం.. రాణి సూరిరత్న అని పిలువబడే క్వీన్ హు హ్వాంగ్ ఓకే దక్షిణ కొరియాకు వెళ్లక ముందు అయోధ్య యువరాణి. క్రీ.శ 48లో కరక్ వంశానికి చెందిన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారని దక్షిణ కొరియన్లు నమ్ముతారు. డాక్టర్ ఉదయ్ డోక్రాస్ పరిశోధనా ప్రకారం సుంగుక్ యుసా రాజు అయిన సురో అయుత రాజ్యానికి చెందినవారని తెలుపుతోంది. అప్పటి ‘అయుత’నే ప్రస్తుత అయోధ్య అని వివరించబడింది. అయితే దక్షిణ కొరియా రాణి స్మరకం 2001లో అయోధ్యలో ప్రారంభించారు. 2015లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ రాణి స్మారకం విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకాన్ని సుందరంగా తీర్చిదిద్ది 2022లో ప్రారంభించారు. ఇక రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకంగా 2019లో భారత్ ప్రభుత్వం రూ. 25, రూ.5 పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కరక్ వంశానికి చెందిన 60 లక్షల మంది ప్రజలు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తారని తెలుస్తోంది. చిన్న వయసులో రాణి సూరిరత్న పడవలో కొరియాకు చేరుకుందని, ఆమెకు 16 ఏళ్ల వయసులో వివాహం అయినట్లు కొరియా ప్రజలు నమ్ముతారని తెలుపుతోంది. మరోవైపు చైనా గ్రంథాల ప్రకారం.. అయోధ్యను పరిపాలించే రాజు తన 16 ఏళ్ల కూతురును దక్షిణ కొరియాకు చెందిన రాజు కిమ్ సూరోతో వివాహం జరిపించడానికి ఆమెను దక్షిణ కొరియాకు పంపాలని అతనికి కల వచ్చినట్లు ప్రచారంలో ఉంది. వారికి 10 మంది పిల్లలు పుట్టారని, వీరు 150 ఏళ్లు జీవించి ఉన్నారని చైనా గ్రంథాల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2020లో దక్షిణ కొరియా రాయబారి బాంగ్ కిల్.. అయోధ్యకు కొరియాతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొరియా పురాతన చరిత్ర గ్రంథాల్లో అయోధ్యకు చెందిన యువరాణి కొరియన్ రాజును వివాహం చేసుకున్నట్లు రాసి ఉందని తెలిపారు. రాజు కిమ్ సురో సమాధికి సంబంధించిన పురావస్తు పరిశోధనల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయనిపేర్కొన్నారు. View this post on Instagram A post shared by Uttar Pradesh Tourism (@uttarpradeshtourism) రాణి సూరిరత్న పార్క్ ప్రత్యేకతలు.. ►అయోధ్యలోని క్వీన్ హు హ్వాంగ్ ఓకే స్మారక పార్క్.. అయోధ్య నుంచి కొరియా వరకు యువరాణి సూరిరత్న ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లు ప్రతిబింబిస్తుంది. ►దక్షిణ కొరియా నుంచి రవాణా చేయబడిన రాతి నిర్మాణంపై పురాతన విషయాలు చెక్కారు. ►రూ. 21 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సరయు నది ఒడ్డున ఈ పార్క్ నిర్మించారు. ►స్మారక చిహ్నం యొక్క ఆగ్నేయ దిశలో క్వీన్ హు హ్వాంగ్ ఓక్ విగ్రహం ఉంది. ►ఈశాన్య దిశలో రాజు కిమ్ సురో విగ్రహం ఏర్పాటు చేశారు. ►పార్కులో గ్రానైట్‌తో చేసిన గుడ్డు ఆకారం ఉంటుంది. యువరాణి సూరిరత్న కొరియాకు తన ప్రయాణంలో బంగారు గుడ్డును తీసుకువెళ్లిందని కొరియన్లు నమ్ముతారు. -
సిక్కు వేర్పాటువాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్సర్ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు మూసివేయాలన్నాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ)సైతం రామ మందిరాన్ని ముస్లింలు వ్యతిరేకించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ‘ఇప్పుడు సమయం వచ్చింది.. ముస్లిలంతా రామ మందిరాన్ని వ్యతిరేకించాలి’ అని రెచ్చగొడుతూ.. గరుపత్వంత్ సింగ్ సోమవారం వీడియో రిలీజ్ చేశాడు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక.. అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: ‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు? -
Ayodhya Temple: కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
చిత్రదుర్గ: అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకలు మొదలైన వేళ రాజకీయపార్టీలు ఈ విషయంలో విమర్శలకు తెర తీశాయి. బీజేపీ రామమందిర పప్రారంభోత్సవాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక ప్లానింగ్, స్టాటిస్టిక్స్ మంత్రి దశరథయ్య సుధాకర్ ఇదే విషయమై బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘గత ఎన్నికల సమయంలో బీజేపీ పుల్వామాలో సైనికులపై జరిగిన దాడిని వాడుకుని ఓట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే తరహాలో రామ మందిర ఓపెనింగ్‌పై ఇదే వ్యూహాన్ని అవలంబిస్తోంది. రాముడు అందరి దేవుడు. బీజేపీ దేశంలో మత విశ్వాసాలను వాడుకొని ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోంది. రామ మందిర ఓపెనింగ్ ఒక ఎన్నికల స్టంట్. నేను కూడా మందిర నిర్మాణానికి విరాళంతో పాటు ఇటుకలు అందించా’ అని చిత్రదుర్గలో సుధాకర్ మీడియాతో అన్నారు. ఇదీచదవండి..అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’
జమ్మూకశ్మీర్: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు. రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మతాలకు సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సోనియా వెళ్తున్నారా?
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథుకు ఆహ్వానం అందింది. వీరిలో మత గురువులు, సినీ తారలు, రాజకీయనేతలు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేతల్లో ఎవరికి ఆహ్వానం అందిందనే విషయంపై స్పష్టత లేదు. విపక్ష నేతల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్, సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చైదరీలకు మాత్రం ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. మరి సోనియా ఈ కార్యక్రమానికి వెళ్తారా.. లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. తాజాగా సోనియా అయోధ్య రామలయ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. సోనియా ఆయోద్య రామలయానికి వెళ్తారా లేదా అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. తగిన సమయంలో తెలియజేస్తాం’ అని ఆపార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ వెల్లడించారు. అయితే రాజకీయంగా సున్నితమైనటువంటి ఈ అంశంపై మిత్రపక్షాలతో విస్తృత చర్చల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 16 నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవం జనవరి 22న రామ్ లాలా విగ్రహ ప్రతిష్టతో ముగుస్తుంది. ఈ వేడుక దేశవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామమందిర ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం రాజకీయ వివాదాన్ని రేపింది. చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు రామమందిర ఆలయ ప్రారంభోత్సవాన్ని కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల పావుగా వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో తమను ఆహ్వానించలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పారు. ఇక ఆహ్వానం అందిన పలువురు విపక్ష నేతలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మరోవైపు మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రామ మందిరం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందో, వ్యాపారం చేస్తుందో వారికే తెలియాలని విమర్శిస్తున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా, రాజకీయ ఎజెండాగా ఉపయోగించడం సరికాదని హితవు పలుకుతున్నారు. -
సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే అయోధ్య..!
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అత్యంత ఆధునాతనంగా, శోభాయమానంగా తీర్చిదిద్దిలే ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి రైల్వేలైన్లు, ఎయిర్పోర్ట్ వంటి ఆధునాత హంగులతో పర్యావరణ హితంగా అయోధ్యని బహు సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రాజుగా పిలిచే బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య నగర పునరుద్ధరణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సీతా మాత శాపం గురించి మాట్లాడారు. ఏంటా శాపం? ఆయన దశరథమహారాజు వంశానికి చెందిన వాడ? తదితరాల గురించే ఈ కథనం! బిమ్మేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య రాజకుటుంబానికి వారసుడు. ఆయన్ను అక్కడ ప్రజలు అయోద్య రాజు లేదా రాజా సాహెబ్ అని పిలుస్తుంటారు. ఆయన రామజన్మ భూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పైగా భూవివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత ట్రస్ట్ సభ్యుడు కూడా. ఈ సందర్భంగా ప్రతాప్ మిశ్రా మాట్లాడుతూ..సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తాత్కాలిక ఆలయన్ని నిర్మించారు. గానీ సెలువులప్పుడూ, మంగళవారాలు, ఏ పండగు సమయంలో అయినా నడిచివెళ్లడానికి అనువుగా స్థలం లేదు. అలాగే బస చేసేందుకు సరైన హోటల్ కూడా లేదు. ఇప్పుడు అయోధ్య స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండడంతో ఫైవ్ స్టార్ హోటళ్లు ప్రారభించేందుకు ఏకంగా 100కు పైగా దఖాస్తులు వచ్చాయని ఆనందంగా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలు కేవలం దర్శనం కోసమే గాక నగరాన్ని వీక్షించేందుకైనా వస్తారని భావిస్తున్నా అన్నారు. ప్రస్తుతం అయోధ్య దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా పేరు పొందుతుందని నమ్మకంగా చెప్పారు. జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికల్లా అయోధ్యలో భారీ పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పటికే కొత్త విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేస్లేషన్లకు అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రూపాన్ని ఇస్తున్నారు. అందువల్ల ఈ నగరాన్ని కోట్లాదిమంది యాత్రికుల వచ్చేలా అత్యాధునిక సౌకర్యాలతో శోభాయామానంగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పురాణ కథనాన్ని కూడా పంచుకున్నారు. రామాయాణ ఘటంలో ఓ సన్నివేశాన్ని వివరిస్తూ సీతా మాత గురించి ఓ చాకలి వాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాముడు ఆమె నగరం నుంచి బహిష్కరించిన ఘట్టం గురించి మాట్లాడారు. ఆమెను లక్ష్మణుడితో పంపించే అడవిలో వదిలేయడం జరగుతుంది. దీంతో సీత పట్టరాని దుఃఖంతో ఈ అయోధ్యను శపించిందని, అందువల్ల అయోధ్య ఇలా అభివృద్ధికి నోచుకోకుండా అయిపోందని ఇక్కడ ప్రజలంతా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు అయోధ్య సర్వతోముఖాభి వృద్ధిని చూస్తే బహుశా సీత తన శాపం ఉపసంహరించుకుందేమో అని అన్నారు. నా జీవితంలో ఇది చూడలేననుకున్నా! రామజన్మభూమి ఉద్యమంతో ప్రతాప్ మిశ్రాకు మూడు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. 1990లో అయోధ్యలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది కరసేవకులు మరణించారు. అపడు ఆయన చాలామంది కరసేవకులకు తన ప్యాలెస్‌లో ఆశ్రయం కల్పించారు. నా జీవిత కాలంలో ఈ రామ మందిరాన్ని చూడగలనని ఎప్పుడు అనుకోలేదన్నారు. బహుశా నా అదృష్టమో ఏమో గానీ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ రామమందిరాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అని అయోద్య కింగ్ ప్రతాప్ మిశ్రా భావోద్వేగంగా మాట్లాడారు. (చదవండి: మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు! సందర్శిస్తే మైమరచిపోవడం ఖాయం!) -
‘దేవాలయాలు.. ప్రభుత్వ విధి కాదు’ కాంగ్రెస్ ఎంపీ విమర్శలు
అయోధ్యలో జనవరి 22న ఘనంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వేల మంది ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేని తెలిపారు. మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అన్నారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల నుంచి పక్కదారి పడతాయని తెలిపారు. Was interrogated by the waiting press, wanting to know if I would be going to Ayodhya on January 22. I told them I hadn’t been invited but I saw religion as a personal attribute and not one for political (mis)use. I also pointed out that by making such a major news story of the… pic.twitter.com/LQpybKbT3t — Shashi Tharoor (@ShashiTharoor) December 27, 2023 దేవాలయాలను పర్యవేక్షించడం ప్రభుత్వం విధి కాదని అన్నారు. నిరుద్యోగం, ధర పెరుగదల, ప్రజల సంక్షేమం, దేశ భద్రత మొదలైన వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని తెలిపారు. అయితే మీడియా రామ మందిర ప్రారంభోత్సవం మీద దృష్టి పెట్టడంతో.. దేశంల్లో ఉన్న పలు సమస్యలు పక్కదారి పడతాయని ‘బీజేపీ’ పేరు ఎత్తకుండానే ‘ఎక్స్’ ట్వీటర్ వేదికగా శశి థరూర్ విమర్శలు గుప్పించడం గమనార్హం. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’ -
30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో డిసెంబర్ 30న శ్రీరామ్ విమానాశ్రయం నుంచి అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను స్థానిక అధికారులు రూపొందిస్తున్నారు. ఇదేవిధంగా ఎయిర్‌పోర్టు సమీపంలోని మైదానంలో జరగనున్న ప్రధాని మోదీ ర్యాలీకి సంబంధించిన బ్లూప్రింట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌సింగ్ మాట్లాడుతూ ప్రధాని సారధ్యంలో జరిగే ర్యాలీలో సుమారు లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కాగా స్థానిక కమిషనర్ గౌరవ్ దయాల్, ఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్పీ రాజ్‌కరణ్ నయ్యర్లు సంయుక్తంగా విమానాశ్రయాన్ని, ప్రధాని ప్రతిపాదిత ర్యాలీ వేదికను పరిశీలించారు. అక్కడి వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నగర ఎస్పీ మధుబన్ సింగ్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడులకు వచ్చే భక్తులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన 165 మంది వైద్యులు సేవలందించనున్నారు. జనవరి 15 నుంచి 30 వరకు ప్రతిరోజూ నలుగురు వైద్యులు భక్తులకు అందుబాటులో ఉండనున్నారు. ఇది కూడా చదవండి: బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం! -
అయోధ్య.. అంత వీజీ కాదు
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను ఓడించిన తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది. బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది. సమాజ్‌వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్‌లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది. కూల్చివేతలపై గుర్రు అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి. ఐదు దశలపై అంతటా ఆసక్తి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు -
అయోధ్య నుంచి యోగి పోటీ!
న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయోధ్యలో యోగిని నిలిపితే ఎలా ఉంటుందనే చర్చ అగ్రనేతల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం జరగలేదు. అయోధ్య, మథుర, గోరఖ్‌పూర్‌ల నుంచి ఒకచోట యోగి పోటీలో ఉండే అవకాశాలున్నాయి. చదవండి: యూపీ ఎన్నికల బరిలో శివసేన.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందంటే! -
ఏపీ సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే అప్పగిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దక్షిణ అయోధ్య భద్రాచలంను రామాయణ సర్క్యూట్లో చేరుస్తున్నామని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద భక్తుల మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. భద్రాచలం విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖతో మాట్లాడారని తెలిపారు. రామాయణ సర్క్యూట్లో ఏపీలోని అంజనాద్రిని చేర్చెందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందుకు వస్తే పరిశీలిస్తామని తెలిపారు. అలంపూర్ జోగులాంబ దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల మంజూరు చేశామని తెలిపారు. వందల ఏళ్ల కింద దేశం నుంచి కెనడా తరలిపోయిన అన్నపూర్ణ విగ్రహాన్ని యూపి ప్రభుత్వానికి అప్పగించామని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే రాష్ట్రానికి విగ్రహం ఇస్తామని చెప్పారు. వందల ఏళ్ల కిందట దేశం నుంచి అనేక విగ్రహాలు దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయని తెలిపారు. వాటిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
‘రాముడి పేరిట విరాళాలు..తాగి తందనాలు’
భోపాల్: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇటీవల తెలంగాణలో ఓ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో మరో సీనియర్ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. రామమందిరం పేరిట సేకరిస్తున్న విరాళాలతో బీజేపీ నాయకులు మద్యం కొనుగోలు చేసి తాగి ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయనెవరో కాదు మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతిలాల్ భూరియా. తాజాగా పెట్లవాడ్ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాలతో కొందరు బీజేపీ నేతలు మద్యం సేవిస్తున్నారు. రామాలయం పేరుతో కొందరు కాషాయ నేతలు విరాళాలు సేకరిస్తూ వాటితో మద్యం కొనుగోలు చేస్తున్నారు. పగలు రాముడి గుడి పేరు చెప్పి విరాళాలు సేకరించి రాత్రి కాగానే ఆ మొత్తంలో కొంత మద్యం సేవించేందుకు వాడుతున్నారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాంతిలాల్ భూరియా ఎవరో కాదు రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేయగా.. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాబువా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళాలను సేకరించే బాధ్యతను ఆరెస్సెస్, వీహెచ్‌పీలతో పాటు సమాజంలో విశ్వసనీయ సంస్థలకి శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అప్పగించిన విషయం తెలిసిందే. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా విరాళాల సేకరణపై స్పందించారు. విరాళాలను సేకరించే ర్యాలీల సందర్భంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఉజ్జయిని, మందసోర్, ఇండోర్ల్లో జరిగిన ర్యాలీల అనంతరం చెలరేగిన హింసపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
లక్నో: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి.. మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దాదాపు 5 ఎకరాల విస్తీరణంలో మసీదు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలను ప్రారంభించామని, దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చామని, ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గత నెలలోనే ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు నమూనాను ఆవిష్కరించిందని, సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం జరుగుతుందని, మసీదు నిర్మాణంపై భారీ గాజు గోపురం కలిగివుంటుందని ఆయన వివరించారు. మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే ట్రస్ట్ సభ్యులందరూ సమావేశమై మసీదు పేరును నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, మసీదు నిర్మించబోయే స్థలం.. రామ జన్మభూమిలోని రామ మందిర నిర్మాణ స్థలికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామమందిరం, మసీదు రెండూ ఒకే జిల్లాలో ఉండటం విశేషం. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, ఇందులో భాగంగానే ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధులను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రామాలయం నిర్మాణ నిధి కోసం తాము ఎవరిని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మందిర నిర్మాణానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు కలెక్షన్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. -
అయోధ్యకు ‘రామాయణ క్రూయిజ్ టూర్’
న్యూఢిల్లీ: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను సందర్శించే భక్తుల కోసం పర్యాటక శాఖ సరయూ నదిలో ‘రామాయణ క్రూయిజ్’ టూర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీనిపై డిసెంబర్ 1 న కేంద్ర షిప్పింగ్, జల మార్గాల శాఖామంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క్రూయిజ్ సేల అమలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది సరయూ నదిలో మొట్టమొదటి లగ్జరీ క్రూయిజ్ సేవ. ఈ సేవలతో పవిత్ర సరయు నదిలోన ప్రసిద్ధ ఘాట్ల గుండా సాగే ఈ ప్రయాణ ప్రధాన లక్ష్యం భక్తులకు ఆధ్యాత్మికతతో కూడిన అద్భుతమైన అనుభవానలు అందించడమే. ఈ క్రూయిజ్‌లో అన్ని లగ్జరీ సౌకర్యాలతో, భద్రతా ప్రమాణాలు గ్లోబల్ స్టాండర్డ్ తో సమానంగా ఉంటాయని.. క్రూయిజ్ లోపల, బోర్డింగ్ పాయింట్‌ని రామ్‌చరితమానస్ థీమ్ ఆధారంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ 80 సీట్ల క్రూయిజ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అని.. సుందరమైన ఘాట్ల సౌందర్యాన్ని చూడటానికి పెద్ద గాజు కిటికీలు ఉంటాయన్నారు. ఇక పర్యాటకుల సౌకర్యార్థం వంట గది, చిన్నగదితో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రామాయణాన్ని తలపించేలా కొన్ని సంఘటనా చిత్రాలు, సెల్ఫీ పాయింట్లు ఉంటాయన్నారు. (చదవండి: 1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?) అయోధ్య హిందువులు ఆరాధించే ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో మొదటిదని, యుపీ టూరిజం గణాంకాల ప్రకారం 2019 సంవత్సరంలో సుమారు రెండు కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారని, రామ్ మందిరం పూర్తయిన తర్వాత పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ‘రామాయణ క్రూయిజ్ టూర్’ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడమే కాక, ఈ ప్రాంతం ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని, ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ క్రూయిజ్ సేవ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తుందని తెలిపారు.. -
జై శ్రీరామ్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ మందిర భూమి పూజ గురించి ట్విటర్ ద్వారా కనేరియా స్పందించాడు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో డిస్ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్ చేసి దానికి ‘జై శ్రీరామ్’ అనే శీర్షికను జోడించాడు. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నాడు. Today is the Historical Day for Hindus across the world. Lord Ram is our ideal. https://t.co/6rgyfR8y3N — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ఆడిన రెండవ హిందూ క్రికెటర్ కనేరియా, అంతకు ముందు అనిల్ దల్పత్ అనే హిందూ బౌలర్ 1980 ప్రాంతంలో పాక్ జట్టు తరుపున ఆడిన హిందూ క్రికెటర్. అనిల్ దల్పత్, కనేరియాకు బంధువు. ఇక రామ మందిరం గురించి కనేరియా వ్యాఖ్యలపై ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆయన అభిమానులు మాత్రం కనేరియా భద్రత విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ... నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరానని, తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో మద్దతు దొరకడం లేదని చెప్పాడు. ఓ పాకిస్తాన్ ఆటగాడిపై మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించిందని, తన విషయంలో మాత్రం పీసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని డానిష్ కనేరియా వాపోయాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్ మాజీ క్రికెటర్) We are safe and no one should have any problem with our religious beliefs. Life of Prabhu Shri Ram teaches us unity and brotherhood. https://t.co/De7VaZ5QhS — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 చదవండి: అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of right over the evil. There is wave of happiness across the world today. It is a moment of great satisfaction. #JaiShriRam pic.twitter.com/wUahN0SjOk — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 -
అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు
గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్): బిస్రఖ్ గ్రామంలో రావణుడి ఆలయం వద్ద కొంతమంది భక్తులు అయోధ్య రామ మందిరానికి చెందిన భూమి పూజను జరుపుకున్నారు. పురాణాల ప్రకారం రావణుడు బిస్రఖ్ గ్రామంలో జన్మించాడని చెబుతారు. అందుకే ఈ గ్రామంలో రాక్షస రాజైన రావణుడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. రామాలయ భూమి పూజ కోసం దాదాపు 200లకు పైగా ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణం కోసం మట్టిని పంపిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ఈ రావణుడి ఆలయం నుంచి కూడా మట్టిని పంపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అశోకానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. ‘500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాములవారు తన ఇంటికి వెళ్ళబోతున్నాడు. రావణ గ్రామమైన బిస్రఖ్ నివాసులమైన మాకు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా దేవుడైన రాముడు స్వదేశానికి తిరిగి రావడానికి మేము రావణుడి ఆలయంలో మతపరమైన వేడుకలు నిర్వహించాము. రాముడు లేకుండా రావణుడు అసంపూర్ణం. ఎందుకంటే రాముడే రావణుడికి మోక్షం ప్రసాదించాడు’ అని తెలిపారు. (జగమంతా రామమయం) గ్రామవాసులు రావణుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు వేడుకలు జరుపుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు అశోకానంద్ సమాధానమిస్తూ.. ‘హిందూ మతం వైవిధ్యమైనది. దేవుని పట్ల భయం హిందూ మతంలో ఒక భావన కాదు, ఇదంతా కర్మ సిద్ధాంతం. భగవంతుడు ప్రతిచోటా, అన్ని జీవులలో, ప్రాణములేని వాటిలో, మంచిలో, చెడులో, మనందరిలో ఉన్నాడు. రావణుడు శివుని భక్తుడు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించే వరకు చెడ్డ వ్యక్తి కాదు. రావణుడు చాలా శక్తిమంతుడు. తనకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక వ్యక్తి రాముడని ఆయనకు తెలుసు. అందుకే రాముడితో వైరం పెట్టుకున్నాడు’ అని తెలిపారు. చదవండి: నూతన శకానికి నాందీ క్షణం -
టైమ్ స్క్వేర్‌పై రాముడి చిత్రాలు.. నిజమేనా?
నూయార్క్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల కల. ఆ అపురూప ఘట్టానికి బుధవారం (ఆగస్టు 5) అంకురార్పణ పడింది.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్స్ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో డిస్ప్లే చేసినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. అసలు చిత్రం అసలు టైమ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్స్ మీద రాముడు ఫోటోలు డిస్ప్లే చేయలేదని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నకిలీవని, డిజిటల్ మీడియా ద్వారా మార్ఫింగ్ చేశారని తేల్చిచెప్పారు. అసలు ఫోటోలు ఎలా ఉన్నాయో కూడా చూపించారు. దీంతో టైమ్స్‌స్క్వేర్ బిల్‌బోర్డ్స్ మీద డిస్ప్లే అయిన రాముడు ఫోటోలు ఫేక్ అని తేలిపోయింది. -
అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్ ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకకు అందరూ సన్నద్ధమయ్యారు. బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయలుదేరి రెండు గంటల పాటు అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుధవారం నాడు మోదీ ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మోదీ అయోధ్యకు బయలు దేరతారు. 11.30లకు ఆయన అయోధ్య చేరుకుంటారు. 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని, ఆ సమయంలోనే ప్రధాని ఆరోగ్యం బాగుండాలని, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు చదువుతామని హనుమాన్ గడి ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని పయనమవుతారు. భూమి పూజకు ఆహ్వానించిన వారే అయోధ్యకు రావాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు. నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో అయోధ్య భూమిపూజ జరిగే వేదికపై ప్రధానితో పాటు మరో నలుగురికి మాత్రమే చోటు కల్పించనున్నారు. మొత్తం 175 మంది అతిధులకు మాత్రమే ఆహ్వానం అందించారు. యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం అందలేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగించనున్నారు. చదవండి: ‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’ -
‘అయోధ్యలో భూమి పూజ ఆపండి’
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని తెలిపారు. బుధవారం జరగాలల్సిన ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని దిగ్విజయ్ కోరారు. మోదీ రామ మందిర నిర్మాణ ‘భూమి పూజ’ ఆచారాలతో ఎంత మందిని ఆస్పత్రులకు పంపాలనుకుంటున్నారని తీవ్రంగా ప్రశ్నించారు.(అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను) ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రధానితో చర్చించి భూమి పూజను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పూజారులు, యూపీ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా సోకిందన్నారు. ఇటువంటి సంక్లిష్టమైన సమయంలో సీఎం యోగి, ప్రధాని మోదీ కూడా 14రోజుల పాటు హోం కార్వటైన్‌కు పరిమితం కావాలన్నారు. ‘భూమి పూజ’ కార్యక్రమానికి ఏమాత్రం అనుకూలం కాని తేదీని నిర్ణయించారని మండిపడ్డారు. వేల ఏళ్లనాటి హిందువుల విశ్వాసం కంటే మోదీకి సౌకర్యమైన రోజు నిర్ణయించడం గొప్పదా అని ట్విటర్లో మండిపడ్డారు. -
నూతన శకానికి నాందీ క్షణం
సందర్భం అనేక తరాలు గత అయిదు శతాబ్దాల సుదీర్ఘకాలం నిరీక్షించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న సమయంలో భారతీయులందరూ ఈ శుభప్రదమైన, మంగళకరమైన సందర్భాన్ని సంతోషంతో తిలకిస్తారనడంలో సందేహం లేదు. ఇది ఒక ఆలయ నిర్మాణానికి నాంది మాత్రమే కాదు.. ఈ ఘనమైన దేశ చరిత్రలో ఒక నూతన శకానికి కూడా నాంది పలుకుతున్న క్షణం. భూమిపూజా కార్యక్రమంతో కోట్లాదిమంది రామ భక్తులు అయిదు శతాబ్దాలుగా సాగించిన పట్టుదల, భక్తి, తపస్సులు పరిసమాప్తి చెందినట్లవుతుంది. 2020 ఆగస్టు 5న జరగనున్న ఆ గొప్ప కార్యాన్ని వీక్షించనున్న కోట్లాదిమంది సనాతన హిందువులకు అదొక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగిస్తున్న క్షణంగా మిగులుతుంది. దేశాన్ని సౌభాగ్యవంతం చేయాలని. ప్రజలందరినీ ఆశీర్వదించాలని మనందరం శ్రీరాముడిని ప్రార్థిద్దాం రండి. ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12.30, 12.40 గంటల మధ్య శుభముహూర్తం వేళ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంఖుస్థాపన చేసినప్పుడు, కోట్లాదిమంది భక్తులు అయిదు శతాబ్దాలుగా సాగించిన పట్టుదల, భక్తి, తపస్సులు పరిసమాప్తి చెందినట్లవుతుంది. అయోధ్యలో రాముడి జన్మస్థలంలో రామాలయాన్ని చూడాలని దీర్ఘకాలంగా వేచి చూస్తున్న భక్తులకు ఇదొక మంగళప్రదమైన క్షణంగా చెప్పాలి. ఓర్పు తప్పకుండా ఫలితం సాధిస్తుంది. అయిదు శతాబ్దాల సామాజిక, న్యాయ, ఆధ్యాత్మక చిక్కులన్నీ ఇంత చక్కటి ఆధ్యాత్మక స్ఫూర్తితో, గొప్ప సందర్భంతో ముగియడం మానవుల విశ్వాసాలను, భావోద్వేగాలను అచ్చంగా నిజం చేసినట్లయింది. నిజానికి, 2020 ఆగస్టు 5న జరగనున్న ఆ గొప్ప కార్యాన్ని వీక్షించనున్న కోట్లాదిమంది సనాతన హిందువులకు అదొక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, అద్భుతమైన ఆధ్యాత్మక స్ఫూర్తిని కలిగిస్తున్న క్షణంగా మిగులుతుంది. ఈరోజు శ్రీరాముడు మన తరానికి మన జీవితపర్యంతమూ నిలుపుకోవలసిన గొప్ప అవకాశాన్ని ఇస్తూ, రాబోవు తరాలు ఆరాధించుకునే ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇవ్వడం అనేది మనం నిజంగా కృతజ్ఞత తెలుపాల్సిన సందర్భమే. ఈ చారిత్రక క్షణాన్ని మనతో చూడలేని వేలాది భక్తుల త్యాగాలను మనందరం స్మరించుకుని మదిలో నింపుకోవలసిన గొప్ప సమయం ఇది. దయాళువైన శ్రీరాముడు వారందరికీ తన పాదాల చెంత చోటు ఇస్తాడని మనం కోరుకుందాం. దేవుడిపై విశ్వాసం, నమ్మకం అనేవి భూమ్మీద ఏ శక్తీ తోసిపుచ్చలేనంత శక్తిని మీకు ఇస్తాయనడంలో ఆశ్చర్యపోవలసింది ఏదీ లేదు. చిరకాలంగా ఎదురుచూస్తున్న రామాలయ భూమి పూజ కార్యక్రమం నన్ను భావోద్వేగానికి గురిచేస్తూ దివంగత గోరక్షా పీఠేశ్వర్ మహంతి దిగ్విజయనాథ్, దివంగత గోరక్షా పీఠేశ్వర్ మహంతి అవైద్యనాథ్లను గుర్తుకు తీసుకొస్తున్నాయి. ఈ చారిత్రక సందర్భంలో తమ సంతోషాన్ని పంచుకోవడానికి వారు ఇప్పుడు మనతో లేరు కానీ వారి ఆత్మలు అత్యున్నత సంతృప్తినీ, అపరిమితానందాన్ని అనుభూతి చెందుతుంటాయని నేను నమ్ముతున్నాను. నిజానికి, 1934, 1949 సంవత్సరాల మధ్య రామాలయ నిర్మాణం అనే లక్ష్యాన్ని మొట్టమొదటిసారిగా మహంతి దిగ్విజయనాథ్ మహరాజ్ ప్రకటించారు. బ్రిటిష్ వారి పాలనలో 1949 డిసెంబర్ 22, 23 తేదీల మధ్య రాత్రిపూట వివాదాస్పద నిర్మాణంలో రామ్ లాలా విగ్రహాలు కనిపించినప్పుడు, మహంత్ దిగ్విజయనాథ్ మహరాజ్ కొంతమంది సన్యాసులతో కలిసి అక్కడే కీర్తనలు పాడారు. 1969 సెప్టెంబర్ 28న ఆయన పరమపదించిన తర్వాత మహంత్ అవైద్యనాథ్ తన గురుదేవుల దీక్షను తమదిగా చేసుకోవడమే కాకుండా, అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం నిర్ణయాత్మక ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మార్గదర్శకత్వంలో, విశ్వహిందూ పరిషత్ నాయకత్వంలో స్వాతంత్య్రానంతర భారతదేశంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమంగా అందరూ అభివర్ణించిన అయోధ్య ఉద్యమం ఘనమైన మన సంస్కృతి, వారసత్వం, నాగరికతల వైపుగా భారతీయుల విశ్వాసాన్ని తిరిగి జ్వలింపచేసింది. వాస్తవానికి మహంత్ అవైద్యనాథ్ని 1984 జూలై 21న శ్రీరామ జన్మ భూమి యజ్ఞ సమితి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మన గొప్ప రుషులు, సన్యాసులు సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన జాతీయవాద భావజాలానికి ప్రమాదకరంగా మారిన కొంతమంది కుహనా లౌకికవాదుల, మతపరమైన బుజ్జగింపు వాదుల పాక్షికతత్వాన్ని అయోధ్య ఉద్యమం మొత్తంగా ఎండగడుతూ వచ్చింది. ఇదేమంత సులభంగా జరిగిన పరిణామం కాదు. మహంత్ అవైద్యనాథ్, పరమపూజ్యులైన పరమహంస రామచంద్ర మహారాజ్ రామాలయ నిర్మాణం కోసం తొలిసారిగా భూమిని లాంఛనప్రాయంగా తవ్వినప్పుడు అది ఒక చారిత్రక క్షణానికి నాంది పలికినట్లయింది. పూజనీయులైన సన్యాసులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు అశోక్ సింఘాల్ ప్రారంభించిన చొరవతో, కామేశ్వర్ చౌపాల్ రామాలయ నిర్మాణం కోసం మొట్టమొదటి శిలను స్థాపించారు. అదృష్టవశాత్తూ కామేశ్వర్ ప్రస్తుతం శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాముడి జన్మభూమి ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన అయోధ్య ఉద్యమం సుదీర్ఘ కాలం కొనసాగి సత్యానికి, న్యాయానికి మహత్తర విజయంగా మారింది. ఇది రానున్న తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే గతానికి చెందిన చేదు అనుభవాలను మర్చిపోయి ఉల్లాసం, విశ్వాసం, అభివృద్దితో కూడిన కొత్త చరిత్రను రాయవలసిన సమయం ఇది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పరమపవిత్రమైన నగరానికి చెందిన గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నిబద్దతతో ఉంది. రాజకీయ శత్రుత్వం కారణంగా అయోధ్య చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. మేం అభివృద్ది, సౌకర్యాల కల్పన విషయంలో అయోధ్యను ప్రపంచ చిత్రపటంలో సమున్నతంగా నిలపడానికి ప్రణాళికా బద్ధమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. అయోధ్య నగరాన్ని ఆధునిక సంస్కృతికి నమూనాగా మార్చబోతున్నాం. గత మూడేళ్లుగా యావత్ ప్రపంచం అద్భుతమైన దీపావళి వేడుకలను చూస్తూ వచ్చింది. ఇప్పుడు అయోధ్యను మతం, అభివృద్ధిల మేలుకలయిగా తీర్చిదిద్దడానికి ఇది సరైన తరుణం. ఈ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరుగనున్న చారిత్రక కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంతో ఎదురుచూస్తుంటడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రపంచ మహమ్మారి అందుకు అనుమతించడం లేదు. మనం దీన్ని దైవేచ్చగానే గుర్తించి ఈ వాస్తవాన్ని అంగీరించాలి. దేశంలోని 125 కోట్లమంది ప్రజల సమష్టి ఆకాంక్షలకు ప్రతినిధిగా ప్రధాని నరేంద్రమోదీ ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. రామాలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆయన సంస్థాపించే సమయంలో మనందరికీ అది గర్వించదగిన క్షణం అవుతుంది. అనేక తరాలు గత అయిదు శతాబ్దాలపాటు సుదీర్ఘకాలం నిరీక్షించిన తర్వాత ప్రధాని భూమి పూజ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి భారతీయుడూ ఈ శుభప్రదమైన, మంగళకరమైన సందర్భాన్ని తిలకిస్తారనడంలో సందేహం లేదు. ఇది ఒక ఆలయనిర్మాణానికి నాంది మాత్రమే కాదు.. ఈ ఘనమైన దేశ చరిత్రలో ఒక నూతన శకానికి కూడా నాంది పలుకుతున్న క్షణం. మన దేశాన్ని రామరాజ్యం వంటి ఆదర్శపూరితమైన దేశంగా మార్చాలని ఈ నూతన శకం పిలుపునిస్తోంది. ఈ శుభసందర్భంగా మనందరం శ్రీరాముడి ఆదర్శాలను మనసు నిండా నింపుకోవాలి. ఈ సందర్భంగా ఓర్పు, పట్టుదల గురించి శ్రీరామచంద్రుడి జీవితం మనకు గుర్తు చేస్తుందని భావిస్తున్నాను. ఈ శుభసందర్భం జరిగే క్షణంకోసం మీరంతా ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు కానీ ఇప్పుడు కూడా మీరు నిగ్రహాన్ని పాటిస్తూ సంయమనంతో ఉండాలి. కరోనా నేపథ్యంలో మనందరికీ ఇది పరీక్షా సమయం కాబట్టి భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంది. రామభక్తులందరూ వారు ఎక్కడున్నా సరే, ఆగస్టు 4, 5 తేదీల్లో తమ తమ ఇళ్లలో ఒక దీపాన్ని వెలిగించాలని నేను అభ్యర్థిస్తున్నాను. అదే సమయానికి సన్యాసులు, ధర్మాచార్యులు కూడా దీపాలు వెలిగించి ఆలయాల్లో అఖండ రామాయణ పఠనాన్ని కొనసాగించాలి. ఈ చారిత్రక క్షణాన్ని చూడకముందే లోకం నుంచే తప్పుకుని మనల్ని వదిలి స్వర్గం చేరిన మన పూర్వీకులందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. దేశాన్ని సౌభాగ్యవంతం చేయాలని. ప్రజలందరినీ ఆశీర్వదించాలని మనందరం శ్రీరామచంద్రుడిని ప్రార్థిద్దాం రండి. శ్రీరాముడు ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూ, మన సంక్షేమాన్ని పట్టించుకుంటాడని ఆశిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం -
‘ఓవైసీ చవకబారు విమర్శలను ఖండిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ద్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రిపై అసదుద్దీన్ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు) దీనిపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారని తెలిపారు. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదని, ఇది భారతీయుల ఆలయయని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనడం భారతీయులందరికీ గర్వకారణమని బండి సంజయ్ కొనియాడారు. (కేసీఆర్ వల్లే వారికి కరోనా సోకింది’) 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం నిజమైతే మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. భారత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించిన మేరకు ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. దేశ ప్రధానిగా సర్వ మానవాళి క్షేమాన్ని కోరుకునే హిందూ మతానికి చెందిన వ్యక్తిగా మోదీ కోట్లాదిమంది ఆకాంక్షలకు అనుగుణంగా, అయోధ్యలో చేపట్టే భవ్య రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వ ఘట్టంలో పాల్గొనడం చారిత్రాత్మక అవసరమని ఆయన అన్నారు. (రాంమందిర నిర్మాణంపై శివసేన కీలక వ్యాఖ్యలు) -
రామ మందిరం: మొఘల్ వారసుడి కానుక
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ప్రకటించారు. కిలో బరువున్న ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీకి అందిస్తానని, దీన్ని ఆలయ నిర్మాణంలో వాడవచ్చని ఆయన ప్రకటించారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగబోతుంది. ఇది మనందరికి ఎంతో సంతోషకరమైన విషయం. నేను మాట ఇచ్చినట్లుగానే రామమందిర నిర్మాణానికి మొఘల్ వంశం తరపున కేజీ బంగారపు ఇటుకను ఇస్తున్నాను’ అని యాకుబ్ పేర్కొన్నారు. ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరానని ఆయన దగ్గర నుంచి పిలుపు రావాల్సి ఉందని చెప్పారు. చదవండి: మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం మొఘలుల వారసుడిగా చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరం తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆగస్టు 5వతేదీన మధ్యాహ్నం 12.15 గంటలకు అయోధ్య రామాలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. కరోనా మహమ్మరి నేపథ్యంలో దీని కోసం కొద్దిమంది ప్రముఖులనే ఆహ్వానిస్తున్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఆకాశాన్నంటే రామ మందిరం -
రామ మందిర శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం
పాట్నా: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే మందిరానికి భూమి పూజ జరగ్గా, త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో పర్యటించాలని ప్రధాని మోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖరాసింది. కరోనా వైరస్ కారణంగా ఎక్కువ మంది గుమిగూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ సంధర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ, ‘అయోధ్యలో పర్యటించి, రామమందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాశాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. రావడం వీలు కాకపోతే వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అయిన శంకుస్థాపన చేయాలని కోరాం’ అని తెలిపారు. (2022 నాటికి మందిర్ సిద్ధం..) ఆలయ నిర్మాణ పనులు శ్రావణ మాసం చివరి రోజు ఆగస్టు 5 న జరగవచ్చని నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఇది హిందూ క్యాలెండర్లో పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది.రామ జన్మ భూమి గ్రౌండ్ లెవలింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తున్నాయి. చెక్కిన రాళ్లను శుభ్రపరిచే పనులను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈ పనిని పూర్తి చేయడానికి రెండు డజన్లకు పైగా స్పెషలిస్ట్ కార్మికులు అయోధ్యకు చేరుకున్నారు. 1990 లో విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన వర్క్‌షాప్ లో ఈ రాళ్లను చెక్కారు.అంతకుముందు ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామ జన్మభూమి స్థలాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామ మందిర్ నిర్మాణం కోసం సీఎం తన వ్యక్తిగత సొమ్మును రూ .11 లక్షలు విరాళంగా ఇచ్చారు. (ఆకాశాన్నంటే రామ మందిరం) -
రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ దీక్షలు
విజయవాడ : మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో మార్చి 25 నుండి ఏప్రిల్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహా విద్యాపీఠం వ్యవస్ధాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శ్రీరామ దీక్ష చేపట్టడానికి దాదాపు లక్షమంది సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షకు సంబంధించిన శ్రీరామ రక్షా స్తోత్రం కరపత్రాలు, జపమాలలు, బ్యానర్లు, జెండాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు పంపిణీ చేశారన్నారు. తొలి ఏడాదే లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనన్నట్లు తెలిపారు. దీక్షలో భాగంగా ఏప్రిల్ 4న శ్రీరామ జన్మస్థానమైన అయోధ్యలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని మహా విద్యాపీఠం, ధర్మ జాగరణ సమితి ఆధ్వరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేడు సిటీ పోలీస్‌కు సవాల్!
సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు మిలియన్ మార్చ్‌తరహాలో తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్’ ఒక వైపు.. ఏళ్ల తరబడి నలుగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు శనివారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నెలరోజులకు పైగా ఆందోళనలతో పాటు ఆత్మహత్యలకు సైతం వెనుకాడకుండా ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న ఉద్యమంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ప్రభుత్వం ఎంతకూ దిగిరాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు సైతం మద్దతు పలికాయి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా విజయవంతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమైంది. మరోపక్క ఆయా డిపోల వద్ద కూడా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఇప్పటికే తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరానికి చేరుకోనున్నారు. అయితే, ఆందోళనలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నిరసన తెలిపేందుకు కార్మికులు ఏ మలుపు నుంచి ఎక్కడ ప్రత్యక్షమవుతారో.. ఏ గుంపు ఎటు నుంచి వస్తుందో తెలియకపోవడంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన మిలియన్ మార్చ్ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రే నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాతబస్తీలో మకాం వేశారు. పురానీ హవేలీలో ఉన్నతాధికారులతో సమావేశమై రాత్రి మొత్తం నగర వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అంతకుముందు కమిషనర్ కార్యాలయం నుంచి శాంతి భద్రతలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అయోధ్య తీర్పు కూడా నేడే.. దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడయ్యే క్షణం కూడా నేడే కావడంతో నగరంలోని సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు, పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా జనం గుమికూడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. మరోవైపు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ర్యాలీలు జరుగనున్నాయి. ఇంకోవైపు మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో ఆదివారం కూడా పాతబస్తీ రద్దీగా మారనుంది. గత నెల రోజులుగా ఆందోళనలు, ధర్నాల కట్టడిలో అలసిపోయిన పోలీసు సిబ్బందికి విశ్రాంతితో పాటు సెలవులు సైతం లేవు. శనివారం కూడా వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. కాగా, మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 20 వేల మంది బలగాలను మోహరించారు. ఘర్షణలకు అవకాశమున్న ప్రాంతాలకు ఆక్టోపస్ కమెండోలు, వాటర్ క్యాన్లు, వజ్ర వాహనాలను పంపించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలు పోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
రామ మందిరం కట్టకపోతే బీజేపీ కథ అంతే!
లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీకి అధికారం దక్కదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. రెండు రోజుల అయ్యోధ్య పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ఆదివారం ఉదయం వివాదాస్పద రామమందిరం-బాబ్రీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామ మందిర నిర్మాణం ఎప్పుడు చేపడతారో బీజేపీ చెప్పాలి. రాష్టంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. దశాబ్దాలుగా రామమందిర విషయాన్ని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో మందిర నిర్మాణం కష్టమే కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీలో ఉందన్నారు. ఆర్డినెన్స్ తెస్తారో చట్టం చేస్తారో మాకనవసరమని, రామ మందిర నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో మాత్రమే చెప్పండంటూ నిలదీశారు.‘ రామ మందిరాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిర్మించాలి, ఆ ఘనతను వారేనే తీసుకోమనండి. వారు నిర్మించకపోయినా.. రామమందిర నిర్మాణం జరుగుతుంది, కానీ బీజేపీ మాత్రం అధికారంలో కొనసాగదు’ అని హెచ్చరించారు. రామమందిరం ముందుండేది, ఇప్పుడు, ఎప్పుడు ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. ఈ ఆలయ నిర్మాణం హిందువుల మనోభావాలకు సంబంధించిందని, ఇంకెప్పుడు నిర్మిస్తారని, తామెప్పుడు చూడాలని ప్రశ్నించారు. తొలుత ఆర్ఎస్సెస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) రామమందిర నిర్మాణనికి ఆర్డినేన్సు తిసుకురావలంటూ డిమాండ్ చేయగా.. తాజాగా విశ్వహిందూ పరిషత్, శివసేనలు సైతం ఆలయ నిర్మాణం చేపట్టాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ ఆలయ స్థలం వివాదం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం ఈ కేసును జనవరికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
'రామమందిరం నిర్మించి తీరుతాం'
సాక్షి, నాగ్‌పూర్ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించడం కష్టమే అయినా, అక్కడ మందిరం నిర్మించడం మాత్రం ఖాయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఆదివారం స్పష్టం చేశారు. అయోధ్యలో మరే ఇతర కట్టడాన్నీ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ శనివారం జరిగిన సంఘ్ సమావేశంలో జోషి ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికవడం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సంఘ్ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్ క్షేత్రీయ సంఘ్ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు సంస్థ ప్రకటించింది. -
అయోధ్యలో రాహుల్
26 ఏళ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబ వ్యక్తి పర్యటన అయోధ్య: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అయోధ్యలో పర్యటించారు. 1992 నాటి బాబ్రీ మసీదు ఘటన తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం. అయితే ఆయన వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థలానికి మాత్రం వెళ్లలేదు. ఆ ప్రాంతానికి కిలో మీటరు దూరంలో ఉన్న హనుమాన్‌గడీ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు వీహెచ్‌పీకి వ్యతిరేకిగా పేరున్న మహంత్ జ్ఞాన్ దాస్‌తో చర్చలు జరిపారు. భేటీ తర్వాత జ్ఞాన్ దాస్ మాట్లాడుతూ..తన ఆశీస్సుల కోసం రాహుల్ వచ్చారని చెప్పారు. రామజన్మభూమి విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని రాహుల్ చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పై ఉన్న హిందూ వ్యతిరేకి అన్న విమర్శను తుడిచిపెట్టడానికే రాహుల్ అయోధ్యలో పర్యటించారని విమర్శకుల అంచనా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలో భాగంగా రాహుల్ హనుమాన్ గుడిని సందర్శించారని తెలుస్తోంది. ఇక తన రోడ్ షో ప్రారంభానికి ముందు కిచాయుచా షరీఫ్ దర్గాకు రాహుల్ వెళ్లారు. ఇది బ్రాహ్మణ, ముస్లిం, ఓబీసీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని కిశోర్ రూపొం దించిన వ్యూహమని భావిస్తున్నారు. -
'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోరారు. మందిర నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని అశోక్ సింఘాల్, సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని కోరారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. -
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి: స్వామి
న్యూఢిల్లీ: అయోధ్యలోని రావువుందిరాన్ని పునర్నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయుకుడు సుబ్రవుణ్య స్వామి ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. 2016లోగా ఆలయునిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయున కోరారు. ఈ మేరకు సుబ్రవుణ్యస్వామి ప్రధానికి లేఖ రాశారు. ఈ పనిని పూర్తిచేయుడానికి సుప్రీంకోర్టు వూజీ న్యాయువుూర్తిని నియుమించాలని సూచించారు.