జమ్మూకశ్మీర్: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు.
రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు.
మతాలకు సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!
Comments
Please login to add a commentAdd a comment