farooq abdullah
-
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
‘అది ఎప్పటికీ జరగదు’.. పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా వార్నింగ్!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా కలిసి ఉండేందుకు ఇస్లామాబాద్ మార్గాన్ని వెతకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు తమకు తెలుసని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నానని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. -
పాక్ సర్కార్‌కు ఫరూఖ్ అబ్దుల్లా వార్నింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఉగ్రవాదం వ్యాప్తి చేయటాన్ని పాకిస్తాన్ ఆపేయాలని అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదని తెలిపారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం విరవించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.‘‘భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలకాలని పాక్ నాయకత్వానికి చెప్పాలనుకుంటున్నా. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదు. కశ్మీర్ ప్రజలుగా మేము గౌరవంగా జీవించి.. విజయం సాధిస్తాం. 75 ఏళ్లుగా ఉగ్రవాదం లేని పాకిస్థాన్‌ను సృష్టించలేకపోతే ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది?. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. లేకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి...కశ్మీర్ అమాయకులను చంపితే ఇరు దేశాల మధ్య చర్చలు ఎలా జరుగుతాయి?. ఉగ్రవాదులు చేసిన దాడి చాలా దురదృష్టకరం. వలస వచ్చిన పేద కార్మికులు, ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఉగ్రవాదులకు ఏం ప్రయోజనం వస్తుంది? ఉగ్రవాదులు కశ్మీర్లో పాకిస్తాన్‌ను సృష్టించగలరని భావిస్తున్నారా.. మేము ఉగ్రవాదాన్నే అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.ఈ దాడికి కనీసం ఇద్దరు ఉగ్రవాదులు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు, ఓ డాక్టర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కశ్మీర్‌కు చేరుకుంది. -
జమ్మూకశ్మీర్ ఫలితంపై ఫరూక్ అబ్దుల్లా హర్షం
-
జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లానే: ఫరూఖ్ అబ్దులా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు వరకు ఏడు స్థానాల్లో గెలుపు నమోదు చేసుకొని 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యంలో మ్యాజిక్ దాటి ముందుకు వెళ్లుతోంది. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రజలు వారి తీర్పును ఇచ్చారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే అవుతారు. పదేళ్ల తర్వాత ప్రజలు మాకు తమ అవకాశం ఇచ్చారు. మేము ప్రజల అంచనాలను అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. #WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, "After 10 years the people have given their mandate to us. We pray to Allah that we meet their expectations...It will not be 'police raj' here but 'logon ka raj' here. We will try to bring out the innocent… pic.twitter.com/j4uYowTij4— ANI (@ANI) October 8, 2024ఇక.. ఇక్కడ ‘పోలీసుల రాజ్యం ఉండదు. ప్రజల రాజ్యం ఉంటుంది. మేము జైలులో ఉన్న అమాయకులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.. హిందువులు, ముస్లింల మధ్య విశ్వాసాన్ని పెంపొందించుతాం. ఇక.. హర్యానాలో కాంగ్రెస్ గెలవకపోవడం బాధాకరం. ఇక్కడ పార్టీలో అంతర్గత వివాదాల కారణంగానే ఇలాంటి ఫలితం వచ్చినట్లు భావిస్తున్నా’ అని అన్నారు.ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించడం లేదనే విషయం ఈ ఫలితాల ద్వారా అర్థమైందని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. బుడ్గామ్ నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లా ఘన విజయం సాధించారు.చదవండి: హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు -
జమ్ము కశ్మీర్: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#WATCH | Srinagar: JKNC chief Farooq Abdullah says, "Even if we don't need it, we will take the support (from PDP) because if we have to go ahead, we have to do it together. We all have to make an effort to save this state. This state is in a lot of difficulties..." pic.twitter.com/apwy9ZSry1— ANI (@ANI) October 7, 2024 ..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’ -
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
జమ్ములో కాల్పులు జరిపే ధైర్యం ఎవరికీ లేదు: అమిత్ షా
శ్రీనగర్: ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా నౌషేరాలో జరిగిన ర్యాలీని అమిత్ షా పాల్గొని మాట్లాడారు.‘‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విధంగా జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ప్రస్తుతం బంకర్లు అవసరం లేదు ఎందుకంటే ఎవరూ బుల్లెట్లు కాల్చడానికి ధైర్యం చేయలేరు. జమ్ము కశ్మీర్లో 30 ఏళ్లుగా కొనసాగిన ఉగ్రవాదం 40వేల మందిని బలి తీసుకుంది.కశ్మీర్ ఉగ్రవాదంతో కాలిపోతున్నప్పుడు.. ఫరూఖ్ అబ్దుల్లా లండన్‌లో హాలిడే గడిపారు.#WATCH | Rajouri, J&K: Addressing a public meeting in Nowshera, Union Home Minister Amit Shah says, "... Farooq Abdullah says that they will bring back Article 370. Farooq Sahab, nobody can bring back Article 370... Now, bunkers are not needed because no one can dare to fire… pic.twitter.com/cciMG6psOb— ANI (@ANI) September 22, 2024..పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్‌తో చర్చలు జరపబోం. ఉగ్రవాదులను జైళ్ల నుంచి విముక్తి చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా అంతం చేశాం. ఉగ్రవాది, రాళ్లదాడికి పాల్పడివారు జైలు నుంచి విడుదల కాలేరు. జమ్ము కశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా స్వేచ్ఛగా పరిస్థితి ఇకమీదట ఉండదని మీకు బీజేపీ హామి ఇస్తుంది’ అని అన్నారు.మరోవైపు..జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత)జరుగుతున్నాయి.అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
జమ్ముకు పర్యటకులు ఖైదీల్లా వచ్చి వెళ్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి టూరిజం అభివృద్ధి చెందినట్లు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. టూరిజం అభివృద్ధి చెందటం కాదు..టూరిస్టులు ఖైధీల వలే వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఆయన ఓ జాతీయా మీడియాతో వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఒకవైపు.. జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతూనే అమర్నాథ్ యాత్ర సందర్భంగా కేంద్రం భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నాయి.అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇంత భారీగా భద్రతా బలగాలను ఎప్పుడూ మోహరించలేదు. జమ్ము కశ్మీర్‌కు వచ్చే.. టూరిస్టులు భయం కుప్పిట్లో ఖైదాల వలే బస్సుల్లో వచ్చి.. వెళ్లిపోతున్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సుమారు 200 ఏళ్ల కాలం పట్టిందిర. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కూడా చాలా సమయం పడుతుంది. గత ఐదేళ్లుగా జమ్ము కశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కేంద్రం ఇక్కడ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీనికి రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జూన్‌లో జరిగిన ఉగ్రదాడే నిదర్శనం’ అని అన్నారు.ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ -
బంగ్లాదేశ్ సంక్షోభం.. ప్రతి నియంతకు ఒక గుణపాఠం: ఫరూక్ అబ్దుల్లా
బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, రాజకీయ అస్థిరతపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలు.. ఆ దేశానికే కాకుండా, ప్రతి నియంతకు ఒక హెచ్చరిక సందేశంగా పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత మాట్లాడుతూ.. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, దేశం విడిచి పారిపోవడం.. ప్రతి నియంతకు ఓ గుణపాఠమని పేర్కొన్నారు. ప్రజల ఓపిక నశించినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. నియంతృత్వం ఎప్పటికైనా ప్రజల అసంతృప్తతి, ఆగ్రహానికి కారణమవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా షేక్ హసీనా నిలబడలేదని, అందుకే ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చిందనిన్నారు.‘బంగ్లాదేశ్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదు. అందుకే అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు లేవనెత్తిన ఉద్యమాన్ని అణచివేయడం అక్కడి సైన్యానికి గానీ, ఇంకెవరికీ గానీ సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఒక గుణ పాఠం. బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదు. ప్రజల ఆగ్రహానికి గురైన ప్రతి నియంత దీనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఓపిక నశించే సమయం వస్తే ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా మరణించగా.. మొత్తంగా 300 మంది మృతి చెందారు. నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.హసీనా రాజీనామాతో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు. -
మా మతం ఎవరినీ తక్కువగా చూడదు
శ్రీనగర్: ముస్లింలు చొరబాటుదారులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ‘‘ ఇతర మతాలను కించపరచాలని మా మతం అస్సలు బోధించదు. హిందూ మహిళల మంగళసూత్రాలను ఏ ఒక్క ముస్లిం కూడా దోచుకోడు. అందరినీ సమానంగా చూడాలని ఇస్లాం ప్రభోదిస్తోంది. మేం నమ్మే మా మతం అన్ని మతాలకూ గౌరవం ఇవ్వాలనే చెబుతోంది. హిందూ తల్లి, సోదరి మంగళసూత్రాలను ముస్లిం దోచాడని నేను ఎక్కడా వినలేదు. అలా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే అతను ముస్లిమే కాదు. అతను ఇస్లాంను సరిగా అర్థంచేసుకోలేదని అర్థం’’ అని అన్నారు. మంగళవారం రాజసాŠథ్న్లోని బాంసవాడా పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫరూక్ మాట్లాడారు. ‘‘ ఒకరిని చంపితే మానవత్వాన్ని చంపేసినట్లేనని ఇస్లాం బోధనల్లో ఉంది. నేనూ ముస్లింనే. హిందువులను ద్వేషించాలని ఖురాన్లో ఎక్కడా లేదు. సిక్కులు, ముస్లింలను ఎంతగా ప్రేమిస్తానో హిందువుల పట్ల అంతే ప్రేమతో వ్యవహరిస్తా. ఇతర మతాల వాళ్లు అభివృద్ధిలోకి వస్తే వారితోపాటే మనమూ వృద్ధిలోకి వస్తాం. అప్పుడే దేశమే అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంది’’ అని అన్నారు. బీజేపీ 2047 విజన్‌పై ఫరూక్ ఆరోపణలు గుప్పించారు. ‘‘ విజన్ 2047పై బీజేపీ ఎప్పుడూ వల్లెవేస్తోంది. 2047ను ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు?. అప్పటికల్లా దేశంలో పారదర్శకమైన ఎన్నికలు అనేవే లేకుండా చేయడం బీజేపీ ఉద్దేశం. అధికారాన్ని హస్తగతం చేసుకుని నచ్చినట్లు దేశాన్ని ఏలాలని భావిస్తోంది. రష్యాలో పుతిన్‌లాగా మోదీని బతికున్నంతకాలం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ ఆశపడుతోంది’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. ‘‘ ముస్లింల పట్ల బీజేపీ వైఖరిని తెల్సుకోండి. ఆ తర్వాత ఆ పార్టీకి మద్దతు అవసరమా లేదా అని ఆలోచించండి’ అని కశ్మీర్ ప్రాంత పార్టీల నేతలను హెచ్చరించారు. -
‘ఓటమి భయంతోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించట్లేదు’
శ్రీనగర్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను ఈసీ విడుదల చేసింది. అయితే జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందని కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ.. శనివారం ఈసీ నుంచి అటువంటి ప్రకటన వెలువడలేదు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పలు అనుమానాలను వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవటంలో ఏదో తేడా కొడుతోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించాలని చూస్తోందని.. ఇది దానికి ఒక అవకాశంలా కనిపిస్తోందన్నారు. జమ్ము కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వమించగా లేని సమస్య అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలను ఆశించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర గ్రీన్ సిగ్నర్ ఇవ్వకపోవటం బాధకరమన్నారు. ఎన్సీతో పాటు బీజేపీ నేతలు సైతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహిచాలని డిమాండ్ చేశాయని తెలిపారు. ఇదీ చాలా బాధకరం.. ఇంకా ఎన్ని రోజులు ఇలా రాష్ట్ర ప్రజలు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పరిపాలనలో ఉండాలని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ప్రజల హృదయాలు గెలుచుకోవాంటే ఇదే సరైన సమయం ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ.. జమ్ము కశ్మీర్ రాష్ట్రం తన సొంతం ప్రభుత్వం ఎన్నుకోకుండా ఎందుకు నిరాకరిస్తున్నారని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర బీజేపీకి లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించపోవటానికి కారణం.. జమ్ము కశ్మీర్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇక.. వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం పూర్తిగా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఎన్సీ చీఫ్ ఫరూర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. -
కశ్మీర్లో సీట్ల సర్దుబాటు: ఒమర్ అబ్దుల్లాతో చర్చించనున్న కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమితో పొత్తు లేకుండా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇటీవల జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మూడు స్థానాల్లో పోటీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3-3 సీట్ల పంపకం ఫార్మూలాను ప్రతిపాదించింది. అయితే ఈ విషయంపై ఈరోజు (శుక్రవారం) నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రతిపాదనకు నేషనల్ కాన్ఫరెన్స్ అంగీకరిస్తే.. మెహబూబా ముఫ్తికి చెందిన పీడీపీ పార్టీకి పొత్తులో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. పీడీపీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం కావటం గమనార్హం. అయితే ఫిబ్రవరి 15న ఫరూక్ అబ్దుల్లా తాము లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రకటన అనంతరం.. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం తమ పార్టీ ఇండియా కూటమితో పొత్తుకు కట్టుబడి ఉందని తెలిపారు. జమ్మూలో రెండు, లడఖ్‌లో ఒక స్థానంలో తమ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. ఇక మరోవైపు పీడీపీ ఇండియా కూటమి నుంచి వైదొలిగి తన పార్టీ కూడా ఒంటరిగా బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. తాను ఇండియా కూటమితోనే ఉంటానని స్పష్టం చేశారు. -
నేషనల్ కాన్ఫరెన్స్ యూ టర్న్
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్‌లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్‌లోనూ కీలకంగా ఉంది. -
లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ..
ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్ స్వతహాగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దీని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని పేర్కొన్నారు. కాగా మూడుసార్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారుక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉంది. ప్రతిపక్ష కూటమి అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అయితే తన అనూహత్య నిర్ణయం వెనక కారణాలు మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు. చదవండి: బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు! సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు. గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశాన్ని రక్షించాలంటే, ముందుగా విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన దాటవేసారు. -
మనీలాండరింగ్ కేసు: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ:నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో విచారించేందుకు ఈడీ సోమవారం సమన్లు ఇచ్చింది. రేపు (మంగళవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గత నెల జనవరి 11న కూడా ఈడీ ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేయటం గమనార్హం. దేశంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫరూక్ అబ్దుల్లాకు రెండో సారి ఈడీ సమన్లు రావటంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరగటం గమనార్హం. ఇక.. 2004 నుంచి 2009 వరకు జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయని ఫరూక్ అబ్దుల్లాపై ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగి.. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. క్రికెట్ అసోసియేషన్‌లోని కొందరు ఆఫీస్ బేరర్లతో పాటు ఇతరుల బ్యాంకు నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా అయినట్లు ఈడీ విచారణలో నిర్ధారించింది. దీంతో 2022లో ఫరూక్‌పై సీబీఐ అభియోగాలు మోపింది. శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఉన్న సమయంలో ఫరూక్ అబ్దుల్లా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా.. తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీసీఐ స్పాన్సర్‌గా ఉన్న ఈ అసోసియేషన్‌లో నిధులు పక్కదారి పట్టేలా నియమకాలు జరిగాయని కూడా ఈడీ వెల్లడించింది. చదవండి: Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు -
Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జనవరి 11న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో జరిగిన అవకతవకలపై ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ 2022లో అధికారికంగా అభియోగాలు మోపింది. సంబంధం లేని పార్టీలు, JKCA ఆఫీస్ బేరర్లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం, అలాగే JKCA బ్యాంక్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణలు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. అబ్దుల్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన 2018 ఛార్జిషీట్లో దాఖలు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు దాఖలు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మోసం కేసులో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’
జమ్మూకశ్మీర్: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు. రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మతాలకు సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
'కశ్మీర్‌కూ గాజా గతే..' ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు
శ్రీనగర్: భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కాశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరుసటి రోజు ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'మన స్నేహితులను మనం మార్చగలం. కాని మన పొరుగు వారిని మార్చలేమని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. మనం మన పొరుగువారితో స్నేహ పూర్వకంగా ఉంటే, ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు' అని గుర్తు చేశారు. 'పాకిస్థాన్‌కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మనమే చర్చలకు సిద్ధంగా లేము. ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకపోతే.. కశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుంది.' అని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా మారిన గుహలను కూల్చివేయాలని సైనికులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
‘జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం సజీవంగానే ఉంది’
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించి బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా విర్శమలు గుప్పించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం అంతం కాలేదని.. దానిని పూర్తిగా కూకటివేళ్లతో నిర్మూలించడానికి గల మూల కారణాలు గుర్తించాలన్నారు. ఆయన ఆదివారం ఓ పుస్తకావిష్కరణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం అంతమైందని కేంద్ర చెబుతోందని మండిపడ్డారు. కానీ ఇక్కడ ఇంకా శాంతి నెలకొనలేదని.. ఉగ్రవాద సమస్య సజీవంగానే ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదం అంతమైనట్లు కేంద్రం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ఇక్కడ అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదం మూల కారణాన్ని గుర్తించాలన్నారు. ఉత్తర కశ్మీర్లో బారాముల్లాలో ఉగ్రవాదుల దాడుల్లో మాజీ పోలీసుల అధికారి మొహమ్మద్ షఫీ మరణం పట్ల తాను తీవ్రంగా చింతిస్తునట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్ శాంతి నెలకొందని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని మండిపడ్డారు. కేంద్ర కేవలం గాయాలకు మందు రాస్తుందని, దాని మూల కారణాన్ని గుర్తించడం లేదన్నారు. సామాన్యులకు సైతం తాము సైనికులను, అధికారులను కోల్పోతున్నామని అర్థం అవుతోందని తెలిపారు. కశ్మీర్లో రక్తపాతం అంతం చేడానికి కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయకుండా కశ్మీర్లో శాంతి నెలకొందని, పర్యటకం గురించి మాట్లాటం సరికాదని విమర్శించారు. చదవండి: తమిళనాడులో ఐటీ ఉద్యోగిని దారుణ హత్య.. ప్రియుడే కారణం -
నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్!
‘భూమా’ పేరు రాజకీయాల నుంచి కనుమరుగు కానుందా? నంద్యాల బరిలో నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని కాకుండా ఫరూక్‌ను బరిలోకి దించనున్నారా? ఆళ్లగడ్డలో కూడా అఖిల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? టీడీపీలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ అధినేతలు సాగిస్తున్న చర్చలు ఈ విషయాలనే వెల్లడి చేస్తోంది. పార్టీ నిర్ణయంతో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అత్యధికంగా గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో టీడీపీ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. పైగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ చేసిన సర్వేల్లో కూడా కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టమైనట్లు సమాచారం. ఈ క్రమంలో టిక్కెట్ల ఖారారుపై టీడీపీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. డోన్ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇదివరకే ప్రకటించారు. అయితే డోన్ బరిలో కచ్చితంగా కేఈ కుటుంబం ఉంటుందని, పోటీ చేసి తీరుతుందని కేఈ ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఈ టిక్కెట్ బీసీ జనార్దన్‌రెడ్డి సూచన మేరకే చంద్రబాబు ప్రకటించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మనందరెడ్డిపై చంద్రబాబుకు ప్రతీ సందర్భంలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది గ్రహించిన బ్రహ్మం ఇటీవల నంద్యాలకు వచ్చి అరెస్టయ్యే ముందురోజు బీసీ జనార్దన్రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల బహిరంగసభలో బ్రహ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ‘భూమా’ అనుచరులు నినాదాలు చేసినా చంద్రబాబు ఎవ్వరి పేరు ప్రకటించనని, సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫరూక్‌ను నంద్యాల అభ్యర్థిగా టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీని వీడాలని బ్రహ్మం నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. ఇది తెలిసి టీడీపీ అధిష్టానం ఫరూక్, బ్రహ్మంలను పిలిపించి ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు బ్రహ్మం ససేమిరా అని మధ్యలోనే లేచి వచ్చేశాడని సమాచారం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని జనసేనకు.. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేకపోవడం, మరోవైపు బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కట్టబెడదామనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఓడిపోయే సీటు, పొత్తులో ఇస్తే సరిపోతుంది, పైగా బలిజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ లాంటి కీలక స్థానం జనసేనకు ఇచ్చామని చెప్పుకునేందుకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీటలో చేరారు. పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్ తనకే వస్తుందని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకునేంత శక్తి తన నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గంలో లేరని, కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని ఇరిగెల తన వర్గీయులతో చెబుతుండటం గమనార్హం. ఏదిఏమైనా ఓ వైపు నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి, మరోవైపు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు టిక్కెట్లు దక్కకపోతే ‘భూమా’ కుటుంబం తొలిసారి పోటీలో లేని పరిస్థితి తలెత్తుంది. ఇదే జరిగితే రాజకీయాల్లో ‘భూమా’ కుటుంబం తెరమరుగైనట్లే! స్వయంకృతాపరాధం భూమా బ్రహ్మనందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్ విఖ్యాత్‌కు టిక్కెట్ దక్కించుకోవాలని అఖిల శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఖిల, బ్రహ్మనికి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇద్దరి విభేదాలతో పరస్పరం బలాన్ని తగ్గించుంటున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఘోర పరాభవం తప్పదని రాబిన్‌శర్మ టీం అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీంతో అఖిలకు కాకుండా భూమా కిషోర్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ తొలుత భావించింది. అయితే కిషోర్‌కు ఇచ్చినా అఖిల వర్గం మద్దతు ఇవ్వదని గ్రహించింది. ప్రజల్లో నిత్యం ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తోన్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ద్వయం చేతిలో కిషోర్ కూడా ఓటమిని తప్పించుకోలేరని తేలినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో 45వేల బలిజ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని, వారికి టిక్కెట్ ఇద్దామనే ఓ చర్చ నడిచింది. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇదే క్రమంలో బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం కూడా గెలుపును దక్కించుకునేది కాదని తేలినట్లు చర్చ జరుగుతోంది. అఖిలకు అందరూ దూరమే.. ► నాగిరెడ్డి మృతి తర్వాత రాజకీయంగా కీలకంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే దూరమయ్యాడు. ► ‘భూమా’కు అత్యంత సన్నిహితుడు శివరామిరెడ్డి, విజయడైరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో పాటు బంధువర్గం, సన్నిహితులు ఆ గుమ్మం తొక్కడమే మానేశారు. ► ‘భూమా’ కుటుంబం సొంత మండలం దొర్నిపాడులోనే వారికి వ్యతిరేకంగా సర్వేలు వచ్చాయంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
పేర్లు తొలగిస్తే చరిత్ర మారదు
శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్‌మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు. -
24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా?
జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు భారీ ఝలక్!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు భారీ ఝలక్ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా(84) రేసు నుంచి తప్పుకున్నారు. తాను వైదొలుగుతుండడంపై శనివారం మధ్యాహ్నాం స్వయంగా ఆయన ప్రకటించడం విశేషం. ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో షాక్ తగిలింది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సైతం రేసు నుంచి తప్పుకున్నారు. ‘‘జమ్ము కశ్మీర్ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నా సేవలు స్వరాష్ట్రానికి అవసరం అని భావిస్తున్నా. అందుకే రాష్ట్రపతి రేసు నుంచి మర్యాదపూర్వకంగా వైదొలుగుతున్నా’’ అని తెలిపారాయన. జమ్ము రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ సేవలో సానుకూల సహకారం అందించడానికి సిద్ధంగానే ఉన్నా అంటూ ప్రకటించారు ఫరూఖ్ అబ్దుల్లా. I withdraw my name from consideration as a possible joint opposition candidate for the President of India. I believe that Jammu & Kashmir is passing through a critical juncture & my efforts are required to help navigate these uncertain times: NC chief Farooq Abdullah (File pic) pic.twitter.com/yPyJNqmi1P — ANI (@ANI) June 18, 2022 అంతేకాదు.. తన పేరును రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల ఉమ్మడి ప్రతిపాదన చేసిన మమతా బెనర్జీకి, ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారాయన. రేసు నుంచి వైదొలిగినా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. ఇదిలా ఉంటే.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం జూన్ 15వ తేదీన మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు సమావేశం అయ్యాయి. అయితే శరద్ పవార్ ఆసక్తి చూపించకపోవడంతో.. రేసులో ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచాయి. జూన్ 21న మరోసారి భేటీ అయ్యి.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఓ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. లిస్ట్‌లో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకోవడం గమనార్హం. ఇక విపక్షాల జాబితాలో మిగిలింది గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే. చదవండి: మరీ ఇంత నిర్లక్ష్యమా? విపక్షాలపై సేన విసుర్లు -
రక్తపు కూడు తినమనడం ఏంటి? ఏం సినిమాలివి?
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్ధుల్లా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరిట దేశంలో మత ద్వేషాల్ని మరింత పెంచుతున్నారని, ఇలాంటి సినిమాలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ఉద్దేశిస్తూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి మతోన్మాద జాడ్యానికి ముగింపు పడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జమ్ము కశ్మీర్లో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపడం, కశ్మీరీ పండిట్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేడం, వాళ్లను కట్టడి చేసేందుకు బలగాలు కఠిన చర్యలు చేపట్టడం లాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో కశ్మీరి పండిట్లకు మద్ధతుగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు ఫరూక్ అబ్దుల్లా. ‘‘ఎల్జీ వద్ద కశ్మీర్ ఫైల్స్ ప్రస్తావన కూడా వచ్చింది. ఇలాంటి సినిమాలు దేశంలో ద్వేషాలను పెంచుతున్నాయి. ఒక ముస్లిం హిందువును చంపి.. అతని రక్తపు కూడును భార్యతో తినమనడం ఏంటి? ఇలాగ జరుగుతుందా? అసలు.. సినిమా పేరుతో ఇష్టమొచ్చినట్లు చూపించి.. మనుషుల మధ్య చిచ్చు పెడతారా? ఇలాంటి వాటికి ముగింపు పడాల్సిన అవసరం ఉంది’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్ధుల్లా అభిప్రాయపడ్డారు. #WATCH We met LG Manoj Sinha to raise the issue of the law & order situation in J&K. During the meeting, I told him that the film 'The Kashmir Files' has given birth to hate in the country. Such things (films) should be banned: Dr Farooq Abdullah, National Conference pic.twitter.com/Z1BkoNijRO — ANI (@ANI) May 16, 2022 కొందరు ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. వాళ్ల చర్యలు మంచివి కావు. కశ్మీరీలోని ముస్లిం యువత ఈ తీరుతో ఊగిపోతుంది అంటూ చెప్పుకొచ్చారాయన. అలాగే భద్రత కోరుతున్న కశ్మీరీ పండిట్లపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీ ప్రయోగించడం ఏంటి? ఆ అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ‘‘వాళ్లు(కశ్మీరీ పండిట్లు) రాళ్లు రువ్వారని భద్రతా సిబ్బంది చెప్తోంది. కానీ, ఈనాటికీ ఈ గడ్డపై కశ్మీరీ పండిట్లు రాళ్లు విసరడం నేను చూసింది లేదు’’ అని ఫరూఖ్ చెప్పారు. కశ్మీర్ పండిట్లతో కలిసిపోవాలనే మేం అనుకుంటాం. ఒకటి కలిసి బతకాలనే అనుకుంటున్నాం. బుద్గంలో నిరసనలు చెబుతున్న కశ్మీర్ పండిట్లకు సానుభూతి తెలిపేందుకు మమ్మల్ని అనుమతించడం లేదు. అనుమతించకపోతే.. అసలు వాళ్లకు దగ్గర అయ్యే అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుందని ఫరూఖ్ అన్నారు. చదవండి: చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు -
సారూ శశిథరూర్ అదేం పని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ఎక్కడున్నా, ఏం చేసినా కెమెరాలు వారిపై ఫోకస్ పెడుతూనే ఉంటాయి. సభ జరుగుతుండగా కొందరు నేతలు నిద్రపోవడం, ఇంకేదైనా చేయడం చూస్తుంటాం. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అలాంటి ఓ ఘటనతో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో ఆయన ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడటమే ఇందుకు కారణం. దీనిపై సోషల్‌మీడియాలో సరదా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై లోక్‌సభలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. శశిథరూర్ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడుతూ కనిపించారు. ముందు సీటులో ఆమె కూర్చొని ఉండగా.. శశిథరూర్ వెనుక సీట్లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. ఓ వైపు ఫరూక్ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా శశిథరూర్ ఫన్నీగా ఆమెతో మాట్లాడారు. It was a great speech by Farooq Abdullah. Must listen for everyone. @ShashiTharoor pic.twitter.com/STQe0yulxG — Farrago Abdullah (@abdullah_0mar) April 6, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఫర్రగో అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట బీజీఎంతో శశిథరూర్ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. మరో నెటిజన్.. శశిథరూర్ అంటే ఫైర్ కాదు.. ఫ్లవర్ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను బలవంతంగా తీసేయడంతో కశ్మీరీల్లో నెలకొన్న అపనమ్మకాన్ని కేంద్రప్రభుత్వం తొలగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్లుల్లా సూచించారు. విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్పనతోపాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలని ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. కశ్మీర్లో రాజకీయాలకు పునరుజ్జీవం పోసేందుకు ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను స్పష్టం చేశాక శ్రీనగర్ చేరుకున్న ఫరూఖ్, ఒమర్‌లు శనివారం మీడియాతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణ వివరాలను తమ పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సభ్యులతో మాట్లాడాకే వెల్లడిస్తామని వారు చెప్పారు. ‘జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిపై నాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రజాభిప్రాయం ద్వారా సాకారం చేస్తానని మాటిచ్చి తర్వాత వెనకడుగు వేశారు. ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు సైతం పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు. మేమెన్నడూ స్వాతంత్య్రం కావాలని అడగలేదు. స్వతంత్ర ప్రతిపత్తే కావాలన్నాం. ఇప్పుడు అదెక్కడుంది?. రాష్ట్ర హోదా తీసేసి కశ్మీరీల్లో ఉన్న నమ్మకాన్ని కేంద్రం పోగొట్టుకుంది. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం నమ్మకం పెరిగేలా ఏదైనా చేస్తుందేమో చూస్తాం’ అని ఫరూఖ్ మీడియాతో అన్నారు. గుప్కార్ అలయన్స్‌కు ఇక ముగింపు పలకనున్నా రనే వాదనలను ఆయన కొట్టిపారేశారు. ‘నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాక ఎన్నికలు జరిపి ఆ తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి మేం అస్సలు ఒప్పకోం. రాష్ట్ర హోదా ఇచ్చాకే ఎన్నికలు పెట్టండి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీ తర్వాత గుప్కార్ అలయన్స్‌లో ఐక్యత లోపించిందనే వాదనను ఒమర్ తోసిపుచ్చారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే తమ కలను బీజేపీ 70 ఏళ్ల తర్వాత సాకారం చేసుకుంది. మేం కూడా పోరాటంలో విజయం సాధించేందుకు 70 వారాలు.. 70 నెలలు.. అంతకంటే ఎక్కువ కాలం పట్టినా సరే ఎన్నాళ్లయినా పోరాడతాం’ అని ఒమర్ అన్నారు. -
కశ్మీర్‌పై నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం
జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గురువారం కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్æ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్ మెహబూబా కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కశ్మీర్‌కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. కశ్మీర్లో 48 గంటల హై అలర్ట్ ప్రధానితో కశ్మీర్ నేతల సమావేశం నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కేంద్రం మరింతగా పెంచింది. 48 గంటలు హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ను కూడా కట్ చేసే అవకాశాలున్నాయి. -
కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో కశ్మీర్‌కు చెందిన పార్టీలన్నీ ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పార్టీలో అంతర్గత చర్చలు ప్రారంభించారు. చర్చల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుందామనే విషయంలో సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ‘‘ఎన్సీ చీఫ్ పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రధానకార్యదర్శి అలీ మహమ్మద్ సాగర్, కశ్మీర్ ప్రావిన్షియల్ అధ్యక్షుడు నసీర్ అస్లామ్ వణీతో చర్చించారు. ఈ చర్చలు సోమవారం కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై స్పష్టత వస్తుంది’’అని పార్టీ నాయకుడొకరు ఆదివారం వెల్లడించారు. కశ్మీర్లో మరో ప్రధాన పార్టీ పీడీపీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశమై నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కట్టబెట్టింది. ‘‘అఖిలపక్ష సమావేశంపై తుది నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి ముఫ్తీకి కట్టబెడుతూ పీఏసీ నిర్ణయించింది’’అని పీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ సుహైల్ బుఖారి చెప్పారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) మంగళవారం సమావేశమై అసలు సమావేశానికి హాజరు కావాలా, వద్దా అని నిర్ణయిస్తారు. కశ్మీర్ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 24, గురువారం మధ్యాహ్నం 3 గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: కాంగ్రెస్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారో లేదో కాంగ్రెస్ స్పష్టంగా వెల్లడించలేదు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌కే తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. -
కరోనాతో ఆస్పత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శనివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా చేరినట్లు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మార్చి 30వ తేదీన 83 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ మేరకు ఫరూక్ శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా వ్యాక్సిన్ పొందిన తర్వాత పాజిటివ్ రావడం గమనార్హం. ‘తన తండ్రి కోసం ప్రతిఒక్కరూ చేస్తున్న ప్రార్థనలు, మద్దతు తెలుపుతున్నందుకు మా కుటుంబం గర్వపడుతుంది’ అని పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా ఆరోగ్యం విషయమై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుని ఆయన వెంటనే కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. Based on the advice of doctors to enable them to better monitor my father, he has been admitted to hospital in Srinagar. Our family remains grateful to everyone for their messages of support & their prayers — Omar Abdullah (@OmarAbdullah) April 3, 2021 -
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
శ్రీనగర్: సీనియర్ రాజకీయనాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా (82) కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా మంగళవారం తెలియజేశారు. తండ్రికి పాజిటివ్ రావడంతో తానూ ఐసోలేషన్లోకి వెళ్లానని, తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించు కోవాల్సిందిగా సూచించారు. ఫరూక్ కోవిడ్ బారిన పడటంపై ప్రధాని మోదీ స్పందిం చారు. ఆయన త్వరగా కోలుకోవాలని, కుటుంబమంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తు న్నట్లు మోదీ పేర్కొన్నారు. తిరిగి స్పందించిన ఒమర్ అబ్దుల్లా మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 2న కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. చదవండి: పెళ్లిలో జోష్‌గా స్టెప్పులేసిన కశ్మీర్ మాజీ సీఎం.. -
పెళ్లిలో జోష్‌గా స్టెప్పులేసిన కశ్మీర్ మాజీ సీఎం..
చంఢీగఢ్: రాజకీయాల్లో బిజీగా ఉండే జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా ఓ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మనవరాలి వివాహం ఢిల్లీకి చెందిన బిజినెస్మెన్ ఆదిత్యానారంగ్తో జరిగింది. చండీగఢ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. కాగా, ఏనభై ఏళ్ళ వయస్సులోను ఫరూఖ్.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కలిసి స్టేజీ పైన జోష్‌గా స్టెప్పులేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమరీందర్ సింగ్ పాడుతూంటే దానికి తగ్గట్టుగా అబ్దుల్లా స్టెప్పులు వేసి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ వయస్సులో కూడా ఇంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే .. వీరిద్దరు కలిసి గతంలో మహమ్మద్ రఫీ పాడిన ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కె చర్చే..’, ‘గులాబీ ఆంఖే జో తెరి దేఖీ..’ అనే పాటల పైన జోష్‌గా స్టెప్పులేశారు. చదవండి: వైరల్: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు -
ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తండ్రి ఎంపీ అయిన ఫరూక్ అబ్దుల్లాని గృహ నిర్బంధంలో ఉంచార ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్‌లోని గుప్కార్ ప్రాంతం లో తన ఇంటి బయట ఉన్న పోలీసు వాహనా లకు సంబంధించిన ఫోటోల ను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘ఆగస్టు, 2019 తర్వాత కనిపిస్తున్న కొత్త కశ్మీర్ ఇది. ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని మా ఇంట్లో ఉంచి తాళాలు వేశారు. పార్లమెంటు సభ్యుడైన నా తండ్రిని కూడా నిర్బంధించడం దారుణం. నా సోదరి, పిల్లల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని ఒమర్ అబ్దుల్లా ఆ ట్వీట్లో వెల్లడించారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బం దినెవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని తెలిపారు. ‘‘ఎలాంటి కారణాలు లేకుండానే ఇంట్లో బంధించి ఉంచారు. ఇంటిలో పనులు చేసుకునే వారిని లోపలికి రానివ్వడం లేదు. మీ కొత్త ప్రజాస్వామ్యం అంటే ఇదేనా’’ అని ఒమర్ ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా, కొందరు వీఐపీలు, భద్రత కల్పించాల్సిన వారిని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లు బయటకొచ్చి తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అలా చేసినట్టుగా శ్రీనగర్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
తన వ్యాఖ్యలతో నవ్వుల్లో ముంచిన మాజీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో తాను గడిపిన జీవితాన్ని వివరిస్తూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నవ్వులు పూయించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఆయన తన లాక్డౌన్ జీవితాన్ని వివరించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలతో పాటు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇతరులతో చేతులు కలపడానికి.. ఆలింగనం చేసుకోవడానికి భయపడ్డామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. నిజాయతీగా చెబుతున్నాననంటూ ఆ భయంతోనే తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచారు. ఏమో ఏమైనా జరగొచ్చనే భయంతో మనసెంత కోరుకున్నా సరే తాను నియంత్రణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలని ఆకాంక్షిస్తూనే కోవిడ్ టీకా రావడంపై మాజీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. -
మాజీ ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చిన ఈడీ
శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి జమ్మూ, శ్రీనగర్‌లలోని 11.86 కోట్ల రూపాయల ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ మేరకు శనివారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. అటాచ్ చేసిన వాటిలో రెండు ఇళ్లు, ఓ వ్యాపార భవనం, మూడు స్థలాలు ఉన్నాయి. ఈడీ వాటి విలువను 11.86 కోట్ల రూపాయలకు లెక్కగట్టినప్పటికి, మార్కెట్ విలువ 60-70 కోట్ల రూపాయలుగా ఉంటుందని సమాచారం. ( పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత ) కాగా, ఇదే కేసుకు సంబంధించి ఫరూఖ్ అబ్దుల్లా పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపించింది. -
అమిత్‌షాకు ముఫ్తీ కౌంటర్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో అధికరణ 370,35(ఎ) పునరుద్దరణ కోసం కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాటాన్ని జాతి వ్యతిరేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించడంపై ఆ పార్టీ నేత మహబూబ ముఫ్తీ ట్విట్టర్లో స్పందించారు. దేశాన్ని రక్షించడంతో తామే(బీజేపీ) ముందున్నామని, తమ రాజకీయ ప్రత్యర్థులు దాంట్లో ఆమడ దూరంలో ఉంటారనే పాత ప్రచారాన్ని బీజేపీ ఇంకా కొనసాగిస్తుందన్నారు. లవ్ జిహాద్, తుక్డే తుక్డే గ్యాంగ్, గుప్కర్ డిక్లరేషన్లపై ప్రజల దృష్టిని మరల్చి నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి అంశాలను మరుగున పడేస్తున్నారని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్రానికి కశ్మీర్ పార్టీల నాయకులకి మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతన్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా జమ్మూ కశ్మీర్లో త్వరలో రెండో విడత జిల్లా అభివృద్ధి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ, పీపుల్స్ పార్టీపై నాయకులు ఇస్తున్న ప్రకటనలపై విమర్శలు ఎక్కు పెట్టింది. అయితే తమ పార్టీని ముఠాగా అభివర్ణించడాన్ని ఆమె తప్పు పట్టారు. పాత అలవాట్లను ఇంకా బీజేపీ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. (చదవండి: పాకిస్తాన్ వైపు భారీ నష్టం!) మొదట భారత సార్వ భౌమత్వానికి తుక్డే తుక్డే గ్యాంగులతో ప్రమాదమని ప్రచారం చేశారు. ఇప్పుడు గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాడే మాలాంటి వాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసిన రోజు నుంచి ఇప్పటి వరకూ లక్షల మంది ప్రజలు మరణించారని ట్వీట్ చేశారు. అధికారం కోసం బీజేపీ అనేక కూటమిలతో జట్టు కడుతుందని, అదే ఎన్నికల కోసం తాము పోరాడితే మాత్రం జాతి ప్రయోజనాలకి విరుద్ధమెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. కశ్మీర్ నేతలు వరుసగా చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం స్పందించారు. చైనా-పాక్ సాయంతో జమ్ముకాశ్మీర్‌లో అధికరణ 370 ని తిరగి పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని నిలదీశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన జట్టు కట్టవచ్చని వాటి జాతి వ్యతిరేకంగా కనిపించిన ఎజెండాపై మాత్రం బీజేపీ కచ్చితంగా ప్రశ్నిస్తుందన్నారు. గుప్కర్ డిక్లరేషన్: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (ఆర్టికల్ 370) రద్దు చేయడాని కంటే ఒక రోజు ముందు ఆరు పార్టీలు (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్) కలిసి శ్రీనగర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో సమావేశమయ్యారు. ఆ ఇల్లు గుప్కర్ రోడ్డులో ఉండటంతో దానిని గుప్కర్ డిక్లరేషన్‌గా పిలుస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్ కశ్మీర్లో తిరిగి నిబంధన 370 ని పునరుద్ధరణ. -
గుప్కార్ అలయెన్స్ చైర్మన్‌గా ఫరూఖ్
శ్రీనగర్: కశ్మీర్లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్‌కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది బీజేపీ వ్యతిరేక వేదిక అని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది. దుర్గానాగ్ దేవాలయాన్ని దర్శించిన ఫరూఖ్ అబ్దుల్లా ఫరూఖ్.. దుర్గాష్టమి, మహానవమి సందర్భం గా పురాతన దుర్గానాగ్ దేవాలయాన్ని సందర్శించారు. మానవాళికి మంచి జరగాలని, శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసినట్లు ఫరూఖ్ తెలిపారు. దేవాలయానికి ఎంతో ప్రాశçస్త్యం ఉంది. ‘హిందూ సోదర, సోదరీమణులకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. పండగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా’ అని అన్నారు. కశ్మీర్ నుంచి వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లు తొందరగా తమ ప్రాంతాలకు తిరిగిరావాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దుర్గానాగ్ దేవాలయం 700 సంవత్సరాల పురాతనమైనది. 2013లో ఈ దేవాలయ ప్రాంగణంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. -
బీజేపీకి వ్యతిరేకం.. దేశానికి కాదు
కశ్మీర్: జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్దరించడమే కాక ఆర్టికల్ 370ని తిరిగి సాధించడం కోసం కశ్మీర్ నాయకులంతా ఏకమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ) పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశారు. దీనికి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం, ఫరూక్ అబ్దుల్లాను అధ్యక్షుడిగా, మెహబూబా ముఫ్తీని ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో శనివారం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘గుప్కార్ కూటమి బీజేపీకి వ్యతిరేకం.. దేశానికి కాదు. కానీ కూటమి దేశానికి వ్యతిరేకమని బీజేపీ అసత్య ప్రచారం చేస్తుంది. వారు దేశానికి, రాజ్యాంగానికి హానీ చేశారు. జమ్ము కశ్మీర్ ప్రజల హక్కులు తిరిగి వారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మతం ఆధారంగా విభజించడానికి వారు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి’ అన్నారు. (చదవండి: కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి) ఇక నేటి సమావేశంలో అలయన్స్ సభ్యులు ఆర్టికల్ 370 పునరుద్ధరణ, జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. ఇక అలయెన్స్‌కు తనను చైర్మన్‌గా ఎన్నుకున్నారని.. మెహబూబా ముఫ్తీని వైస్ చైర్మన్‌గా.. వామపక్ష నేత మహమ్మద్ యూసుఫ్ తారిగామిని కన్వీనర్‌గా.. జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జద్ లోనెని అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. సజ్జద్ లోనె మాట్లాడుతూ.. ‘వాస్తవాల గురించి త్వరలోనే శ్వేతపత్రంతో ప్రజల ముందుకు వస్తాము. ఇంతకు ముందు మన వద్ద ఉన్నవి.. ఇప్పుడు మనం కోల్పోయిన వాటిపై పరిశోధన పత్రం ఇస్తాము. రెండు వారాల్లో, మా తదుపరి సమావేశం జమ్మూలో ఉంటుంది. తరువాత మరో సమావేశం ఉంటుంది. మా పూర్వపు రాష్ట్ర జెండా మా కూటమికి చిహ్నంగా ఉంటుంది’ తెలిపారు.. -
ఈడీ ఉచ్చు
-
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఫరూఖ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించిన 40 కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాని ఆరు గంటలపాటు విచారించింది. రాజ్‌బాగ్‌లోని తమ కార్యాలయంలో ఫరూఖ్‌ను ఈడీ విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులోని వాస్తవాలను కోర్టులు నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఫరూఖ్ బతికున్నా, లేదా చనిపోయినా, 370 ఆర్టికల్ కోసం మన పోరాటం కొనసాగుతుంది. నన్ను ఉరితీసినా మన నిర్ణయం మారదు’ అని అన్నారు. అబ్దుల్లాపై ఈడీ విచారణ చేపట్టడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని, జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ అలయెన్స్ భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వంపై అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వం సహించే స్థితిలో లేదని వారు విమర్శించారు. -
జేకేసీఏ స్కామ్ : ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) స్కామ్‌కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను ఈడీ అధికారులు శ్రీనగర్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫరూక్ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఆరు పార్టీలు కూటమిగా ఏర్పడటంతోనే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లపై తమ పార్టీ త్వరలో స్పందిస్తుందని చెప్పారు. అయితే ఫరూక్ నివాసంపై ఎలాంటి దాడులు జరగలేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరుతూ ఫరూక్ అబ్ధుల్లా నివాసంలో జరిగిన ఆరు పార్టీల నేతల సమావేశం డిక్లరేషన్ జారీ చేసిందని చెప్పారు. చదవండి : కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి ఈ భేటీలో పీడీపీ చీఫ్ మెహబూబూ ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజద్ లోన్, పీపుల్స్ మూవ్మెంట్ నేత జావేద్ మిర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి, ఆవామి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ముజఫర్ షా పాల్గొన్నారు. మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఈ సమావేశానికి పిలుపు ఇచ్చారు. -
కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్
శ్రీనగర్: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్ డిక్లరేషన్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్ డిక్లరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. -
370 రద్దు వల్లే చైనా దురాక్రమణ
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్ అబ్దుల్లా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్ ఆమోదంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు. -
డ్రాగన్ దూకుడుకు కారణం అదే!
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్‌లో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా దూకుడుకు ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ అంగీకరించదని, డ్రాగన్ మద్దతుతో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చైనా అధ్యక్షుడిని ఎన్నడూ ఆహ్వానించలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా నేతను ఆహ్వానించడమే కాకుండా ఆయనను చెన్నైకి తీసుకువెళ్లి ఇరువురు నేతలు విందు ఆరగించారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. చదవండి : చర్చలతో చైనా దారికి రాదు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆమోదయోగ్యం కాదని ఓ జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో కశ్మీర్ సమస్యలను నివేదించేందుకు కూడా తనను అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తొలగించాయి. -
చైనా పాలనే నయం అనుకునేలా..
శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కశ్మీరీ ప్రజలు భారత్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నందున, చైనా పాలనే నయం అనుకునే అవకాశం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దును కశ్మీరీలు ఎన్నడూ స్వాగతించలేదని, బానిసల్లా బతికేందుకు ఇష్టపడరని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తే ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తారని చెప్పుకొచ్చారు. ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చైనాతో చర్చిస్తున్నపుడు పాక్‌తో కూడా మాట్లాడండి..) కాగా గతేడాది ఆగష్టు 5న జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎన్డీయే సర్కారు ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అక్కడ భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలకు గృహ నిర్బంధం విధించారు. ఈ విషయాల గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కశ్మీరీ ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమను తాము భారతీయులమని భావించే స్థితిలో కూడా లేరని వ్యాఖ్యానించారు. అంతేగాక ఆర్టికల్ 370 రద్దుకు ముందు లోయలో చోటుచేసుకున్న పరిణామాలు, బలగాల మోహరింపు గురించి తాను కేంద్రాన్ని ప్రశ్నించానని, భద్రతా కారణాల దృష్ట్యానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాధానం లభించిందన్నారు. కానీ మూడు రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370,35ఏను ఎత్తివేస్తారని అస్సలు ఊహించలేదని ఫరూక్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. కాగా జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొనాలంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఇటీవల ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
పాకిస్తాన్‌తోనూ చర్చించండి: ఫరూక్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా దౌత్య విధానానికి సంబంధించి లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాతో చర్చలు జరుపుతున్నట్లుగానే, దాయాది దేశం పాకిస్తాన్‌తోనూ ఇదే తరహా సంప్రదింపులు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారని, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించి శాంతి నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం లోక్‌సభలో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా.. ‘‘బలగాల ఉపసంహరణ విషయంలో నేడు ఇండియా చైనాతో చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న వివాదాల గురించి పాకిస్తాన్‌తోనూ చర్చలు ప్రారంభించాలి. బార్డర్లో ప్రజలు చనిపోతున్నారు. చర్చల ద్వారానే ఇందుకు పరిష్కారం దొరుకుతుంది. లఢఖ్ సరిహద్దులో చైనాతో వ్యవహరిస్తున్న తీరుగానే, మన పొరుగు దేశంతోనే మాట్లాడి ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయేలా చూడాలి’’ అని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు) అదే విధంగా.. షోపియాన్ ఎన్కౌంటర్లో తమ తప్పిదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారని ఆర్మీ అధికారులు చెప్పడం తనకు సంతోషంగా ఉందంటూ జూలై నాటి ఘటనను ఫరూక్ అబ్దుల్లా సభలో ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లిస్తుందని ఆశిస్తున్నారన్నారు. కాగా గతేడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటు పలువురు కశ్మీరీ నేతలకు ప్రభుత్వం గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే.(చదవండి: చైనాకు చెక్ పెట్టేందుకు ఆ 4 దేశాలు..) ఈ క్రమంలో ఇటీవలే ఆయనకు విముక్తి లభించింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా డిటెన్షన్ కాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఎంపీలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. కాగా ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుతం శ్రీనగర్ ఎంపీగా ఉన్నారు. -
మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని ఆరు రాజకీయపార్టీలు ఉమ్మడిగా చేసిన ‘గుప్కార్ డిక్లరేషన్’ను పాకిస్తాన్ స్వాగతించడంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా గట్టిగా స్పందించారు. ‘మేం ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలం కాము’ అంటూ వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు అకస్మాత్తుగా ఇప్పుడు ఇష్టం పుట్టుకొచ్చింది. ఢిల్లీకి గానీ, సరిహద్దుల్లో ఉన్న వారికి గానీ.. మేం ఎవరి తొత్తులం కాదని స్పష్టం చేస్తున్నా’ అని తెలిపారు. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్, మరో మూడు పార్టీలు కలిసి ప్రకటించిన గుప్కార్ డిక్లరేషన్ సాధారణ ఘటన కాదు, కీలక రాజకీయ పరిణామం అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ‘సాయుధులను కశ్మీర్లోకి పంపడం పాక్ మానాలనీ, భారత్, పాక్‌లు చర్చలు ప్రారంభించాలని ఆయన కోరారు. కశ్మీర్‌లోని ఆరు రాజకీయ పార్టీలు ఆగస్టు 22న శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై చేసిన ఉమ్మడి ప్రకటనను గుప్కార్ డిక్లరేషన్ అని అంటున్నారు. -
‘పాక్‌తో యుద్ధమా.. అని మోదీని అడిగా’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కార్‌ను ఏ ఒక్కరూ విశ్వసించబోరని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిజాయితీగా ఉండాలని, వాస్తవాలను ఎదుర్కోవాలని తాను కోరుతున్నానని చెప్పారు. ‘భారత ప్రభుత్వాన్ని ఏ ఒక్కరూ నమ్మరు.. ఈ ప్రభుత్వం అబద్ధం చెప్పకుండా ఒక్క రోజు ఉండటం కూడా అసాధ్యమ’ని ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమకు మాటమాత్రం చెప్పకుండా ముందుకెళ్లారని అన్నారు. కశ్మీర్‌కు పెద్దసంఖ్యలో భద్రతా దళాలను తరలించిన ముందురోజు తాను ప్రధానమంత్రిని కలిశానని, ఆ భేటీలో మోదీ తమకు ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌కు పెద్ద ఎత్తున బలగాలను తరలించాల్సిన అవసరం ఏముందని తాను ఆయనను అడిగానని చెప్పారు. పర్యాటకులను తిప్పిపంపుతున్నారు.. అమర్నాథ్ యాత్ర రద్దు చేశారు.. పాకిస్తాన్‌తో యుద్ధం జరగబోతోందా అని తాను ప్రశ్నించినా ప్రధానమంత్రి మౌనంగా ఉండిపోయారని గుర్తుచేసుకున్నారు. తాము అడిగిన విషయం కాకుండా వేరే అంశాల గురించి ఆయన మాట్లాడారని, మోదీ గొప్ప దయగల, నేర్పున్న వ్యక్తే కానీ నమ్మదగిన నేత మాత్రం కాదని ఫరూక్ అబ్దుల్లా ‘ఎన్డీటీవీ’తో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏడు నెలల పాటు ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధంలో ఉన్న అబ్ధుల్లా(83)ను ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు. ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం ఆగస్టు 5న ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి : కశ్మీర్లో మరింత కదలిక -
సచిన్ పైలట్ బావ మరిది కాబట్టే..
శ్రీనగర్: రాజస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తన బావ సచిన్ పైలట్‌ను లక్ష్యంగా చేసుకుని తమపై విమర్శలకు దిగిన భూపేశ్ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒమర్ హెచ్చరించారు. హానికరమైన, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీరుతో విసిగిపోయానని.. అందుకే పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన భూపేశ్ భగేల్.. తాను అడిగింది కేవలం ఒక ప్రశ్నేనని, ఇకపై కూడా అలాగే అడుగుతూ ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని.. ఇలాంటి సమయంలో తన మాటలను అవకాశంగా మలచుకునేందుకు ప్రయత్నించవద్దంటూ హితవు పలికారు. ఇందుకు బదులిచ్చిన ఒమర్.. ‘‘నా లాయర్లకు మీరు మీ సమాధానాలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు ఇదే. మీకు మీ స్నేహితులెవరో, వ్యతిరేకులు ఎవరో తెలియదు. అందుకే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మీ ప్రశ్న హానికరమైనది’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల) సచిన్ పైలట్ బావమరిది కాబట్టే.. కాగా గత కొన్ని రోజులుగా రాజస్తాన్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై భూపేశ్ భగేల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సచిన్ పైలట్ తిరుగుబాటుకు, జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదల కావడానికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. సచిన్ పైలట్ మామ, బావ మరిది అయినందు వల్లే వీరికి విముక్తి కలిగి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘రాజస్తాన్‌లో జరుగుతున్న సంఘటనలను, సచిన్ పైలట్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒమర్ అబ్దుల్లా ఎందుకు విడుదలయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఒమర్‌తో పాటు మెహబూబా ముఫ్తి(జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం)కూడా హౌజ్ అరెస్ట్ అయ్యారు. కానీ ముఫ్తీజీ మాత్రం నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ సచిన్ పైలట్ బావ మరిది అయినందు వల్ల ఒమర్‌కు విముక్తి లభించింది’’అంటూ సచిన్ పైలట్ ఎపిసోడ్, ఆయనతో రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్ని.. అందుకు ప్రతిఫలంగా ఒమర్‌ను విడుదల చేశారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఒమర్ అబ్దుల్లా... తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన భూపేశ్ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని.. ఆయన తన లాయర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్యాయంగా తమ నాయకులను నిర్బంధంలో ఉంచితే చట్టపరంగా సవాలు చేసి విముక్తి పొందారంటూ భూపేశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్సీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఒమర్ అబ్దుల్లా సోదరి సారా అబ్దుల్లా సచిన్ పైలట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ తొలుత వీరి ప్రేమకు అంగీకారం లభించకపోవడంతో పెద్దలను ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత విభేదాలన్నీ తొలగిపోయి ఇరు కుటుంబాలు కలిసి పోవడంతో కథ సుఖాంతమైంది. I am fed up of the downright malicious and false allegation that what Sachin Pilot is doing is somehow linked to my or my father’s release from detention earlier this year. Enough is enough. Mr @bhupeshbaghel will be hearing from my lawyers. Cc @RahulGandhi @INCIndia @rssurjewala https://t.co/Gojb7vN1V3 — Omar Abdullah (@OmarAbdullah) July 20, 2020 -
నిర్బంధం నుంచి ఫరూక్ విడుదల
శ్రీనగర్: ఏడు నెలల నిర్బంధం అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా(82)కు విముక్తి లభించింది. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడూ అయిన ఎంపీ ఫరూక్ అబ్దుల్లాపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(పీఎస్ఏ)ను ప్రభుత్వం తొలగించింది. ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం ఆగస్టు 5వ తేదీన ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. పీఎస్ఏ చట్టం ప్రయోగించిన తొలి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాయే. పీఎస్ఏ చట్టం కింద నిర్బంధంలో ఉంచినట్టయితే మూడు నెలలపాటు ఎటువంటి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉండదు.అలాగే ఈ నిర్బంధాన్ని 2 ఏళ్ల పాటు కొనసాగించే అవకాశం కూడా చట్టం ఇస్తుంది. శ్రీనగర్‌లోని గప్కార్ రోడ్డులోని తన నివాసం నుంచి బయటికి వచ్చిన ఫరూక్ అబ్దుల్లా.. నిర్బంధంలో ఉన్న తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘ఈ రోజు నేను విముక్తిడినయ్యాను. ఈ స్వేచ్ఛ సంపూర్ణం కాదు. ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా ఇతర జైళ్ళల్లో నిర్బంధించిన వారందరినీ విముక్తి చేసినప్పుడే అది సంపూర్ణం అవుతుంది’అని మీడియాతో అన్నారు. ‘నా విడుదల కోసం ప్రార్థించిన ప్రతి వ్యక్తికీ కృతజ్ఞతలు. మిగిలిన వారంతా విడుదలయ్యే వరకూ ఏ రాజకీయాలను గురించీ మాట్లాడను. ఇటీవలే కంటికి సంబంధించిన సర్జరీ చేయించుకున్న ఫరూక్ అబ్దుల్లా ప్రజల గొంతుకను వినిపించేందుకు పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానన్నారు. ఫరూక్ అబ్దుల్లా విడుదలను స్వాగతించిన నేషనల్ కాన్ఫరెన్స్ నిర్బంధంలో ఉన్న మిగిలిన వారిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. -
కశ్మీర్లో మరింత కదలిక
ఏడు నెలల నిర్బంధం నుంచి జమ్మూ–కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫారుఖ్ అబ్దుల్లా శుక్రవారం విడుదల కావడం అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడగలవన్న ఆశ రేకెత్తిస్తోంది. నిరుడు ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేయడంతోపాటు, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టే కశ్మీర్ పునర్విభజన ప్రక్రియను కూడా పూర్తిచేసింది. అదే రోజు ఫారుఖ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీలతో సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలను, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేశారు. మూడు నెలలు గడిచాక వారందరినీ విడుదల చేస్తారని ఆశిస్తున్న తరుణంలో సెప్టెంబర్ 15న ఫారుఖ్పైనా, ఇతర నేతలపైనా ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) ప్రయోగించారు. ఆగస్టు 5నుంచి మొత్తంగా 7,357మందిని అరెస్టు చేయగా, అందులో 396మందిపై ఆ తర్వాత పీఎస్ఏ ప్రయోగించారు. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)తో పోల్చదగిన ఈ చట్టాన్ని వాస్తవానికి ఫారుఖ్ తండ్రి షేక్ అబ్దుల్లాయే తీసుకొచ్చారు. 1978లో ఆ చట్టాన్ని తెచ్చినప్పుడు దాన్ని కలప స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికని చెప్పినా అనంతరకాలంలో రాజకీయ ప్రత్యర్థులపై దాన్ని ప్రయో గించడం మొదలుపెట్టారు. నిర్దిష్టమైన వ్యక్తి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే ఈ చట్టం కింద గరిష్టంగా ఏడాదిపాటు నిర్బంధించేందుకు వీలుంటుంది. రాజ్యభద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారన్న అభియోగం మోపితే గరిష్టంగా రెండేళ్లపాటు నిర్బంధించవచ్చు. కనుకనే ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత వున్నా ఆచి తూచి వినియోగించకపోతే పౌర స్వేచ్ఛకు ముప్పు తెస్తుందని సుప్రీంకోర్టు సైతం ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. జమ్మూ– కశ్మీర్ పునర్విభజన అనంతరం ఇతరత్రా చట్టాలు చాలా రద్దయినా పీఎస్ఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యధావిధిగా కొనసాగించింది. నిర్బంధ చట్టాలపై పార్టీలకతీతంగా పాలకులకుండే ప్రేమను పీఎస్ఏ చరిత్ర వెల్లడిస్తుంది. నాయకులు, ఇతరుల నిర్బంధం మాత్రమే కాదు... కశ్మీర్లో ఆగస్టు 5 నుంచి కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. అక్కడున్న తమవారి క్షేమ సమాచారాలు తెలియక విదేశాల్లోనూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ చదువుల కోసం, కొలువుల కోసం వెళ్లినవారు ఇబ్బందిపడ్డారు. అక్కడివారు కూడా తమ ఆప్తులతో సంభాషించడం ఆగిపోవడంతో మానసిక వేదనకు లోనయ్యారు. అయితే నిరుడు అక్టోబర్‌నాటికి మొబైల్ సేవల్ని పాక్షికంగా పునరుద్ధరించారు. అక్కడ పర్యాటకం కూడా ప్రారంభమైంది. మొదట్లో దాదాపు మూడు నెలలపాటు మూతబడిన పాఠశాలలు, కళాశాలలు కూడా ఆ తర్వాత తెరుచుకున్నాయి. అదేవిధంగా మూతబడిన వ్యాపార కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జమ్మూ–కశ్మీర్ ప్రాంతం సున్నిత మైన ప్రాంతం. పొరుగునే పాకిస్తాన్ ఉండటం, మిలిటెంట్లను సరిహద్దులు దాటించి కశ్మీర్లో తరచు సమస్యలు సృష్టించిన చరిత్ర దానికి వుండటం పర్యవసానంగా కమ్యూనికేషన్ల వ్యవస్థను నిలిపేసి నట్టు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సర్వీసుల్ని వినియోగించుకుని ఉగ్రవాదులు విధ్వంసకర కార్యకలాపాలకు దిగే ప్రమాదం వుంటుందని ప్రభుత్వం అనుమానించడంలో తప్పు లేదు. అయితే పటిష్టమైన నిఘా వుంచి లేదా పరిమిత సమయాల్లో మాత్రం అనుమతించి ఈ వ్యవస్థను యధావిధిగా కొనసాగించివుంటే బాగుండేది. మొత్తంగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరులు ఇబ్బందులుపడ్డారు. మొబైల్ సేవలు అందుబాటులోకొచ్చాక ఇంటర్నెట్ కూడా పనిచే యడం ప్రారంభించింది. ఇవన్నీ కశ్మీర్లో నానాటికీ మెరుగుపడుతున్న పరిస్థితుల్ని సూచిస్తున్నా యనడంలో సందేహం లేదు. కానీ ఫారుఖ్, ఒమర్, మెహబూబా వంటి నేతల్ని ఈ చట్టం కింద నిర్బంధించడం ఎలా చూసినా సహేతుకమైన చర్య కాదు. వీరంతా భారత్‌లో జమ్మూ–కశ్మీర్ విడదీయరాని భాగమని దృఢంగా విశ్వసించినవారు. మాజీ ప్రధాని స్వర్గీయ వాజపేయి నేతృ త్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అందులో పాలుపంచుకుంది. మెహబూబా నాయకత్వంలోని పీడీపీతో కలిసి బీజేపీ జమ్మూ–కశ్మీర్లో రెండేళ్లపాటు అధికారం పంచుకుంది. ఈ నేతల రాజకీయ కార్యకలాపాలు ఎప్పుడూ సమస్యాత్మకం కాలేదు. పైపెచ్చు ఈ పార్టీల కార్యకలాపాల కారణంగానే అక్కడి ప్రజానీకంపై మిలిటెంట్ల ప్రభావం నానాటికీ తగ్గి పోయింది. ఒకప్పుడు ఎంతో పలుకుబడివున్న హురియత్ కాన్ఫరెన్స్ వంటివి క్రమేపీ ప్రజాబలం లేక క్షీణించాయి. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగాలని ఏకపక్షంగా, బాధ్యతారహితంగా అమెరికా నిర్ణయించడం, అందులో భాగంగా తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం వంటి పరిణామాలతో ముందూ మునుపూ మన దేశానికి సమస్యలేర్పడే అవకాశంవుంది. 90వ దశకం చివర పాక్ ప్రాపకంతో తాలిబన్లు జమ్మూ–కశ్మీర్లో ఎంత కల్లోలం సృష్టించారో ఎవరూ మరిచిపోలేరు. కనుక ఈ దశలో కశ్మీర్ సమాజం సమష్టిగా ఉగ్రవాద బెడదను ఎదుర్కొనాలంటే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పడం అత్యవసరం. ఫారుఖ్ అబ్దుల్లాకు స్వేచ్ఛనివ్వడం ఆ దిశగా తొలి అడుగని భావించాలి. చెరవీడిన అనంతరం ఫారుఖ్ ఒక మాటన్నారు. ఇతర నాయకులు కూడా నిర్బంధం నుంచి విముక్తులైనప్పుడే తనకు పరిపూర్ణమైన స్వేచ్ఛ వచ్చినట్టు భావిస్తానన్నారు. జమ్మూ–కశ్మీర్లో పరి స్థితులు కుదుటపడితే దానికి మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిరుడు ఆగస్టులోనే వాగ్దానం చేశారు. అది నెరవేరాలని, కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరి స్థితులు నెలకొని, అది మళ్లీ భూతలస్వర్గంగా కాంతులీనాలని అందరూ ఆశిస్తారు. -
ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగ శుక్రవారం ఫరూక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్‌ను స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం అతన్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి (ఏడు నెలలుగా) ఆయన నిర్బంధం కొనసాగుతోంది. 83 ఏళ్ల ఫరూక్‌తో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్‌లను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్‌ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
ఫరూక్ అబ్దుల్లా (కశ్మీర్ నేత) రాయని డైరీ
ఎవరో తలుపు తోసుకుని లోపలికి వస్తున్నారు! ‘‘తోయనవసరం లేదు, తెరిచే ఉంది రండి’’ అన్నాను. ‘‘తెరిచే ఉన్నా, మీరు నిర్బంధంలో ఉన్నారు కనుక మేము తోసుకునే రావాలి ఫరూక్ జీ’’ అన్నాడు ఆ వ్యక్తి లోపలికి వస్తూనే. ఎవరా అని చూశాను. నవ్వుతున్నాడతను! ‘‘నాకు రెండు సందేహాలు ఉన్నాయి. మీరెవరు అన్నది ఒకటి. మీరెందుకు నవ్వుతున్నారు అన్నది ఇంకొకటి. అయితే నాకిప్పుడు అనిపిస్తోంది.. మీరెందుకు నవ్వుతున్నారో తెలుసుకుంటే మీరెవరో తెలిసిపోతుంది కాబట్టి రెండింటిలో ఒక సందేహం తీర్చుకుంటే చాలునని. చెప్పండి. మీరెందుకు నవ్వుతున్నారు?’’ అని అడిగాను. మళ్లీ నవ్వాడతను. ‘‘నా ఊహకు నాకే నవ్వొచ్చింది ఫరూక్‌జీ. లోపలికి వస్తున్నప్పుడు నా మనసు ఒక దృశ్యాన్ని ఊహించుకుంది. గది మధ్యలో ఒక కుర్చీ ఉంటుంది. అందులో మీరు కూర్చొని ఉంటారు. మీ చేతులు కుర్చీకి కట్టేసి ఉంటాయి. మీ నోటికి ఒక గుడ్డ బిగదీసి కట్టి ఉంటుంది. మీకు రెండు వైపులా మరో రెండు కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీలో ఒమర్ అబ్దుల్లా ఉంటారు. ఇంకో కుర్చీలో మెహబూబా ముఫ్తీ ఉంటారు. వాళ్ల చేతులూ కుర్చీలకు కట్టేసి ఉంటాయి. వాళ్ల నోటికీ ఒక గుడ్డ బిగదీసి కట్టి ఉంటుంది. మీ ముగ్గురు పూర్వపు ముఖ్యమంత్రులూ ఒకరితో ఒకరు కళ్లతో మాట్లాడుకుంటూ ఉంటారు... ఇలా అని ఊహించుకున్నాను ఫరూక్ జీ. కానీ అలా లేరు మీరు. పక్కన ఒమర్, మెహబూబా కూడా లేరు’’ అన్నాడు! ‘‘అలాగైతే మీరు కచ్చితంగా భారతదేశపు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచే వచ్చి ఉంటారు. నేను ఊహించినదేమిటంటే.. ఎప్పటికైనా నా కోసం వచ్చేవారు భారతదేశపు హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ అయి ఉంటారని! మీరు వాళ్లిద్దరూ కాదు కనుక మీరెవరన్నది, మీరేమిటన్నది నాకు ఆసక్తి లేని సంగతి’’ అన్నాను. ‘‘కానీ ఫరూక్‌జీ.. కనీసం నేను ఎందుకు వచ్చానన్న దానిపై నైనా మీరు ఆసక్తిని కనబరచడం నన్ను సంతోషపరిచే సంగతి అవుతుంది. అంతకన్నా ముందుగా మీకు నేను గుర్తు చేయబోతున్న ఒక విషయాన్ని వినేందుకు కూడా మీరు నిర్బంధంగా ఆసక్తి చూపాలి. భారతదేశపు హోం శాఖ, భారతదేశపు హోం కార్యదర్శి అని మీరు అంటున్నారు! ‘భారతదేశపు’ అని మీరు మాటిమాటికీ అనడం మిమ్మల్ని మీరు భారతదేశం నుంచి వేరు చేసుకోవడం కానీ, మీ నుంచి భారతదేశాన్ని వేరు చేయడంగానీ అవుతుంది. ఇప్పుడు కశ్మీర్.. భారతదేశంలోనే ఉంది, భారతదేశం పైనో, కిందో, పక్కనో లేదు’’ అన్నాడు! ‘‘ఎందుకొచ్చారో చెప్పండి’’ అన్నాను. ‘‘మీకు రగ్బీ అంటే ఇష్టమేనా?’’ అన్నాడు! ఎవరనుకుని ఎవరి దగ్గరికి వచ్చాడో!! ‘‘మీరు నన్ను ఫరూక్‌జీ అంటున్నారు కనుక నేనే ఫరూక్నని మీకు తెలిసే ఉంటుందని నేను భావించవచ్చా?’’ అన్నాను. ‘‘పోనీ.. మీకు బీర్ ఫెస్టివల్ అంటే ఇష్టమేనా ఫరూక్‌జీ..? బాత్ ఫెస్టివల్, కాఫీ ఫెస్టివల్, కామెడీ ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్. ఫుడ్ ఫెస్టివల్..?’’ అన్నాడు!! ‘‘ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయా.. త్రీసెవంటీని ఎత్తేశాక..’’ అన్నాను. ‘‘ఇండియాలో కాదు ఫరూక్‌జీ.. యు.కె.లో జరుగుతున్నాయి. ఇండియాలో ఉండకుండా, యు.కె. వెళ్లిపోడానికి మీరు కనుక ఓకే అంటే మిమ్మల్ని, మీ అబ్బాయి ఒమర్‌ని విడుదల చేస్తారట. ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రత్యేక కార్యదర్శి రీనా మిత్ర అడిగి రమ్మన్నారు’’ అని చెప్పాడతను!! - మాధవ్ శింగరాజు -
ఫరూక్ అబ్దుల్లా నిర్బంధం పొడిగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సబ్‌జైలుగా ప్రకటించిన ఆయన నివాసంలోనే మరో మూడు నెలలపాటు ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంలో ఉంటారని అధికారులు చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఎత్తివేస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్నాక ఫరూక్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి గృహ నిర్బంధంలో(ప్రజా భద్రతా చట్టం కింద) ఉంచారు. -
‘రక్షణ’ కమిటీలో ప్రజ్ఞా, ఫరూక్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి వచ్చే బీజేపీ ఎంపీ సాథ్వి ప్రజ్ఞాసింగ్‌కు పార్లమెంట్ కీలక కమిటీలో ప్రభుత్వం చోటు కల్పించింది. ఈమెతోపాటు ప్రజా భద్రత చట్టం(పీఎస్ఏ)కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా(81)పేరును పార్లమెంట్ రక్షణ రంగ సంప్రదింపుల సంయుక్త కమిటీకి ప్రతిపాదించినట్లు తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్, మాజీ రక్షణ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులు ఉన్నారు. 21 మంది ఉండే ఈ కమిటీలో 12 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ కమిటీలో చోటు లభించిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు. మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తీవ్రభావ జాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఒక సభ్యురాలికి ఎంతో ముఖ్యమైన రక్షణ సంబంధ కమిటీలో స్థానం కల్పించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అదేవిధంగా, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం ఫరూక్ అబ్దుల్లాను మూడు నెలలుగా పీఎస్ఏ కింద గృహ నిర్బంధంలో ఉంచింది. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా పలువురిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. -
తొలిరోజే ఆందోళనలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. లోక్ సభ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం సహా పలు అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. సభ ప్రారంభం కాగానే, కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రిన్స్ రాజ్(ఎల్జేపీ), హిమాద్రి సింగ్(బీజేపీ), శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్(ఎన్సీపీ), డీఎం కాతిర్ ఆనంద్(డీఎంకే) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జెఠ్మలానీ సహా 10 మంది పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. ఆ వెంటనే, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆపేయాలని నినాదాలు చేశారు. వారితో పాటు ఎన్సీ సభ్యులు తమ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన ఇంట్లోనే నిర్బంధించడంపై నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభ్యులకు అవకాశమిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ సహా విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించారు. తక్షణమే ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేసి, సభకు హజరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోకివిపక్ష సభ్యులను అనుమతించకుండా.. ఈయూ పార్లమెంటేరియన్లను అనుమతించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ఖండించారు. పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై పోలీసులు దాడిచేసి, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె కుమార్తె చెప్పారని డీఎంకే సభ్యుడు బాలు ప్రస్తావించారు. గత సమావేశాలు అద్భుతం పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయన్న విశ్వాసం తనకుందన్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిధ్యతల సమాహారం. దేశాన్ని ముందుకు నడిపే చోదక శక్తి రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. గత సమావేశాలు అద్భుతంగా జరిగాయని పేర్కొన్నారు. -
అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం భేటీలో ఆయన మాట్లాడారు. అయితే, జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం కోరింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సభా నిబంధనలు, నియమాల మేరకు అన్ని అంశాలపై చర్చించేందుకు, మాట్లాడేందుకు అన్ని పక్షాలకు అవకాశం కల్పిస్తామని, వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సమావేశాలు ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. నిర్మాణాత్మక చర్చల ద్వారానే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుందని ప్రధాని అన్నారని అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ,అమిత్‌షా, గులాంనబీ ఆజాద్, విజయసాయిరెడ్డి తదితరులు ఫరూక్ అబ్దుల్లాపై హామీ ఇవ్వని ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం నిర్బంధించిన ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ఫరూక్‌ను నిర్బంధించడంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఎంపీ హస్నైన్ మసూదీ ప్రస్తావించారు. ఫరూక్‌ను పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వానికి ఉందని మసూదీ పేర్కొన్నారు. ‘కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సభలో ఈ అంశంపై పట్టుబడతాం’ అని ఆయన తెలిపారు. ‘ఒక పార్లమెంట్ సభ్యుడిని చట్ట విరుద్ధంగా ఎలా నిర్బంధిస్తారు? ఫరూక్ అబ్దుల్లాతోపాటు జైల్లో ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కూడా పార్లమెంట్ సమావేశాలకు అనుమతించాలి’అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయన్నారు. స్టాండింగ్ కమిటీలకు పంపకుండానే అన్ని బిల్లులను ఆమోదించేలా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అన్ని అంశాలపై చర్చకు అవకాశమిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. సభలో మాత్రం మరోవిధంగా వ్యవహరిస్తుందని ఆజాద్ ఆరోపించారు. అయితే, ఫరూక్ అబ్దుల్లా విడుదలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల్లో కోత, వ్యవసాయ సంక్షోభంపై తప్పనిసరిగా చర్చించాలని సభలో కోరతామని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని పాశ్వాన్ ప్రస్తావించారు. హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి థావర్‌చంద్ గహ్లోత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధురి, గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నేత ఆనంద్ శర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వి.విజయసాయి రెడ్డి, టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సహా 27 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, ఆర్థికమాంద్యం, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగడం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో ఈసారి ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెరిగిన బలం, అయోధ్య వివాదంపై ఇటీవలి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు బీజేపీలో విశ్వాసం పెంచాయి. ఎన్డీయే కూటమి ‘ఉమ్మడి కుటుంబం’ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. మోదీ సహా హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ ఈ కూటమిని ఉమ్మడి కుటుంబంగా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నట్లే పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయన్నారు. ఈ చిన్న సమస్యల వల్ల కుటుంబం దెబ్బతినే పరిస్థితి రాకూడదన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా తోడ్పడాలని కోరారు. సభ్య పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం ప్రత్యేకంగా కన్వీనర్ లేదా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎల్జేపీ, అప్నాదళ్, జేడీయూ వంటి పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్డీయేలో సరైన సమన్వయం ఉంటే మహారాష్ట్రలో బీజేపీ–శివసేనల మధ్య ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయేదని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఎంపీల గైర్హాజరు ఆందోళనకరం: వెంకయ్య న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు ఎంపీలు గైర్హాజరవుతుండ టంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీల ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై చర్చించేందుకు పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఇటీవల సమావేశం కాగా 28 మందికి గాను నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. అందులో కమిటీ సభ్యుడిగా ఉన్న ఢిల్లీకి చెందిన ఏకైక ఎంపీ గౌతమ్ గంభీర్ ఆ భేటీకి రాకుండా ఇండోర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేస్తూ కనిపించారు’అని వెంకయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హిందూ వివాహ, విడాకుల చట్టం–1952 మొదలుకొని ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు–2019 వరకు, 1953లో ధోతీలపై అదనపు ఎౖMð్సజ్ పన్ను నుంచి 2017లో జీఎస్టీ అమల్లోకి తేవడం వరకు రాజ్యసభ పయనం సుదీర్ఘంగా సాగిందని వెంకయ్య అన్నారు. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని రూ.250 వెండి నాణెం, పోస్టల్‌స్టాంపును విడుదల చేయనున్నామ న్నారు. కాగా, రాజ్యాంగం ఆమోదం పొంది70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందన్నారు. అరుదైన సందర్భం.. 67 ఏళ్ల రాజ్యసభ చరిత్రలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న సందర్భాన్ని ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’ పుస్తకం వివరించింది. ‘మే 8, 1991న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతోంది. అధికార, విపక్షాలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో సభ డెప్యూటీ చైర్మన్‌గా ఉన్న ఎంఏ బేబీ విపక్షాలకు అనుకూలంగా ఓటేశారు’ అని వివరించింది. పౌరసత్వ బిల్లు సహా 35 బిల్లులు నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది. పౌరసత్వ బిల్లులో ఏముంది? 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హిందు, బౌద్ధ, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ మతాలకు చెందిన వారిని భారత పౌరులుగా గుర్తించేందుకు వీలు కల్పించేందుకు పౌరసత్వ సవరణ బిల్లులో వీలు కల్పించారు. దీంతోపాటు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గింపు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్ డేటా ప్రొటెక్షన్) బిల్లు, అన్ని రకాలైన వివక్ష నుంచి ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌పై నిషేధం బిల్లు, జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్టీగా కాంగ్రెస్ చీఫ్‌కు ఉన్న హోదాను రద్దు చేయడంతోపాటు ఆ ట్రస్ట్ సభ్యులను తొలగించే అధికారాలను ప్రభుత్వానికి కల్పించే బిల్లు ఉన్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో పార్లమెంట్ భవనం -
సీఆర్పీఎఫ్ అదుపులో మాజీ సీఎం సోదరి, కుమార్తె
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్ కూడా ఉన్నారు. సురయ్య, సఫియాలు ఆధ్వర్యంలో పలువురు మహిళలు చేతులకు నల్లని బ్యాండ్స్ ధరించి, ప్లకార్డులు పట్టుకుని ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. వారంతా ఒకచోట చేరేందుకు ప్రయత్నించగా పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో వారు రోడ్డుపై కుర్చోని ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అలాగే నిరసన తెలుపుతున్న మహిళలు మీడియాకు తమ సందేశాన్ని ఇవ్వకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ఆ మహిళల విడుదల చేసిన ప్రకటనలో.. కశ్మీర్‌లోని ప్రజల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని కోరారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు తమను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్ మహిళలుగా తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు విరుద్ధంగా, వాస్తవాలను వక్రీకరించేలా జాతీయ మీడియా కథనాలు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో అంక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్, మెహబూబా ముఫ్తీలతో పలువురు నేతలను, వేర్పాటువాదులను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. -
ఫరూక్‌తో ఎన్సీ బృందం భేటీ
శ్రీనగర్/ ఇస్లామాబాద్: కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలి కీలక రాజకీయ పరిణామం సంభవించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి మేరకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేతలు గృహ నిర్బంధంలో ఉన్న పార్టీ అగ్ర నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలతో ఆదివారం ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. జమ్మూ ప్రొవెన్షియల్ ఎన్సీ చీఫ్ దేవీందర్ సింగ్ రాణా నేతృత్వంలోని 15 మంది నేతల బృందం వారితో రాష్ట్రంలో పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు ప్రకటన విడుదల చేసిన తర్వాతి రోజు ఆగస్టు 5 నుంచి మాజీ సీఎంలు, ఎన్సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఎన్సీ నేతలు మొదటగా ఒమర్ అబ్దుల్లాతో అరగంటపాటు సమావేశమయ్యారు. గడ్డంతో కొత్తగా కనిపించిన తమ నేతతో వారంతా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లాను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతలు ప్రజలపై ఆంక్షల విషయంలో కలత చెందుతున్నారని తెలిపారు. ‘రాష్ట్రం మొత్తం దిగ్బంధంలో ఉంది. మా పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) చట్టం కింద నిర్బంధించారు. ఆయన లేకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎలా సాధ్యం? నేతలను వెంటనే విడుదల చేయాలి’అని పేర్కొన్నారు. నేడు మెహబూబాతో సమావేశం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సోమవారం భేటీ అయ్యేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది నేతల బృందానికి నిర్బంధంలో ఉన్న పార్టీ గవర్నర్ అనుమతించారు. -
ఆర్టికల్ 370: రెండు నెలల తర్వాత తొలిసారి
శ్రీనగర్: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఆదివారం తన పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్సీ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా నేతృత్వంలో 15మంది సీనియర్ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. అంతకుముందు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4వ తేదీ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతోపాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. గవర్నర్ సత్యపాల్ మాలిక్ వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని ఎన్సీ నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలను కలిశారు. -
ఫరూఖ్ నిర్బంధం తీవ్ర తప్పిదం
నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాను కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి ప్రజాభద్రతా చట్టం కింద నిర్బంధించడం మతిలేని చర్యే కాదు.. అది భారత రాజ్యాంగ, న్యాయ సంవిధానానికి మాయనిమచ్చగా మిగులుతుంది. జమ్మూ కశ్మీర్ నేతలను నిరంకుశ చట్టాలతో అడ్డుకుంటున్న కేంద్రం ఆ రాష్ట్రాన్ని తన అంతర్గత వలసగా మార్చుకునే దిశలోనే పయనిస్తోంది. మనుషులందరిలాగే, రాజకీయ నాయకులందరిలాగే ఫరూఖ్ అబ్దుల్లా పరిపూర్ణ వ్యక్తి కాకపోవచ్చు. కానీ అయన చేసిన తప్పులు, పాపాలకు మించి ఆయనను పాపాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. కశ్మీర్లో దేశపతాకాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీలు రాజకీయ భూమికలో పాలు పంచుకోలేని స్థితిలో కశ్మీర్‌లోయ ప్రజలకు రాజకీయ నాయకత్వాన్ని అందించే కర్తవ్యాన్ని చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ప్రజాభద్రతా చట్టం కింద కేంద్రప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవడం భారత రాజ్యాంగ, న్యాయ సంవిధానానికి మాయనిమచ్చగా మిగులుతుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీనుంచి 81 సంవత్సరాల ఈ వయోవృద్ధుడిని గృహనిర్బంధంలో ఉంచారు. కానీ ఆయన ఎక్కడున్నదీ చెప్పాలంటూ తమిళనాడుకు చెందిన ఎమ్‌డీఎమ్‌కే అధినేత వైగో హెబియస్ కార్పస్ పిటిషనన్ తో సుప్రీం కోర్టు తలుపులు తట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫరూఖ్‌పై ప్రజాభద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న ఏ వ్యక్తినైనా 3 నెలల నుంచి రెండేళ్ల వరకు బెయిలు లేకుండా నిర్బంధించవచ్చు. ఈ చర్య ద్వారా కశ్మీర్ రాజకీయ ప్రతినిధులను పూర్తిగా తృణీకరిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా సంకేతాలు పంపినట్లయింది. కశ్మీర్ రాజకీయాల్లో పాలుపంచుకోనీయకుండా జమ్మూ కశ్మీర్ నాయకులను నిరంకుశ చట్టాలతో అడ్డుకుంటున్న కేంద్రం మునుపటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని తన అంతర్గత వలసగా మార్చుకునే వైపుగా పయనిస్తోందనే చెప్పాలి. దీనిపై కేంద్రం అనుమానాస్పద వైఖరిని సమర్థిస్తూ సుప్రీకోర్టు తన ఉజ్వల ప్రతిష్టను మరుగుపర్చుకుందనే చెప్పాలి. సోమవారమే మరొక అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ. బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాన్ని గమనించాలి. ‘‘జాతి హితాన్ని, అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సాధారణ జీవితాన్ని పునరుద్ధరించడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇవ్వాలి’’. అయితే జాతిహితం గురించి ఆందోళన ప్రకటిస్తూ, కశ్మీర్ రాష్ట్రంలో వ్యక్తిగత పర్యటనలు చేసుకోవడానికి హామీ ఇస్తున్నట్లు సినీ ఫక్కీ భంగిమలు ప్రదర్శించడానికి బదులుగా గౌరవనీయ న్యాయమూర్తులు న్యాయాన్ని ఎత్తిపట్టడం అనే తమ రాజ్యాంగ విధిని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జడ్జీల ఈ విద్యుక్త ధర్మం నేడు జమ్మూకశ్మీర్‌లో తీవ్రంగా అప్రతిష్ట పాలవుతూండటం గమనార్హం. ఆగస్టు 6న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు హాల్లో ప్రసంగిస్తూ, ఫరూఖ్ అబ్దుల్లాను అరెస్టు చేయడం కానీ, నిర్బం ధంలోకి తీసుకోవడం జరగలేదని ప్రకటించారు. పైగా, ఫరూఖ్ తన అభీష్టం ప్రకారం తన స్వగృహంలోనే ఉంటున్నారని షా పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి నేషనల్ కాన్ఫరెన్స్ పెద్దాయన ప్రజా భద్రతకే ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం కొత్తగా కనిపెట్టింది. ఆయనను నిర్బంధంలోకి తీసుకునేంత ప్రమాదం ఏం జరిగిందన్నది స్పష్టం కావడం లేదు. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న వరుస పరిణామాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని అనుమతించకపోవడం భాగంగానే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారని స్పష్టంగా బోధపడుతోంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను జైల్లో పెట్టడం లేదు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయన స్వగృహంలోని సింగిల్ రూమ్‌లో ఆయన్ని నిర్బంధించినట్లు తెలుస్తోంది. మనుషులందరిలాగే, రాజకీయ నాయకులందరిలాగే ఫరూఖ్ అబ్దుల్లా పరిపూర్ణ వ్యక్తి కాకపోవచ్చు. కానీ అయన చేసిన తప్పులు, పాపాలకు మించి ఆయనను పాపాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. ప్రస్తుత పాలకులు చరిత్రను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు కాబట్టే 1980లలో కశ్మీర్ రాజకీయాలను అస్థిరపర్చడానికి దారితీసిన వరుస ఘటనలను అందరూ మర్చిపోయి ఉండవచ్చు. 1982లో షేక్ అబ్దుల్లా అస్తమయం తర్వాత, ఇందిరా గాంధీ తన విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్సు 1983 జూన్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఇందిర కోరుకున్నారు. కానీ అలా చేస్తే కశ్మీర్లో తన విశ్వసనీయత పూర్తిగా అడుగంటిపోతుందని స్పష్టంగా గ్రహించిన ఫరూఖ్ అబ్దుల్లా ఇందిర కోరికను గౌరవించకుండా మిర్వాయిజ్ ఫరూఖ్‌తో పొత్తు పెట్టుకున్నారు. వీరిద్దరి పొత్తు ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఫరూఖ్ 1983 అక్టోబర్‌లో శ్రీనగర్‌లో అఖిల భారత ప్రతిపక్ష సదస్సుకు పిలుపునివ్వడం ద్వారా తీవ్రమైన తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఫరూఖ్ చర్యతో ఆగ్రహించిన ఇందిరా గాంధీ అరుణ్ నెహ్రూ, ముఫ్తి మొహమ్మద్‌లను కూడగట్టి తిరుగుబాటు లేవదీశారు. నాటి జమ్మూకశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ సహకారంతో ఫరూఖ్ పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలై ఆయన బావమరిది జీఎమ్ షా 1984 జూలైలో సీఎం అయిపోయారు. మూడేళ్ల తర్వాత ఫరూఖ్ 1987లో కాంగ్రెస్‌తో పొత్తుకు అంగీకరించారు. ఆ ఎన్నికల్లో రిగ్గింగు పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో పాలన బాగా దెబ్బతినింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పరిస్థితిని కొలిక్కి తేవడంలో విఫలమయ్యాయి. దీంతో 1989 నాటి లోక్ సభ ఎన్నికలను కశ్మీర్ ఓటర్లు పూర్తిగా బాయ్‌కాట్ చేశారు. ఇది పాకిస్తాన్ కశ్మీర్ యువతను తిరుగుబాటుకు ప్రేరేపించింది. ఇదే 1989–90లో తీవ్రవాదం పెరగడానికి దారి తీసింది. చివరకు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సాయుధ పోరాటం ప్రారంభించిన సమయంలోనూ ఫరూఖ్ తనమీద తాను జోకులేసుకుంటూ గడిపేశారు. ఈ నేపథ్యంలోనే జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ జేకెఎల్‌ఎఫ్ శక్తులు నాటి నూతన హోంమంత్రి ముఫ్తి మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబియ్యాను కిడ్నాప్ చేశారు. ఫరూఖ్ జేకేఎల్‌ఎఫ్‌తో చర్చలను వ్యతిరేకిస్తూనే.. రుబియ్యా విడుదలకై జేకేఎల్ఎఫ్పై ఒత్తిడి తేవడం కోసం ఆయన తన కాంటాక్టులను ఉపయోగించారు. చివరకు జేకేఎల్ఎఫ్ నేతలను విడుదల చేసే విషయమై నాటి కేంద్ర మంత్రులు అరుణ్ నెహ్రూ, ఐకే గుజ్రాల్, అరిఫి మొహమ్మద్ ఖా¯Œ తో ఒక కమిటీ ఏర్పాటుకు ఆదేశించడం ద్వారా ఫరూఖ్ తన ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ ఒకే ఒక చర్య ఆరోజు నుంచి కశ్మీర్లో అగ్నిజ్వాలలను రేపుతూనే ఉంది. దీని ఫలితంగా 1990 నుంచి 1996 దాకా ఫరూఖ్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఏవిధంగా చూసినా అది చర్చలను తుపాకీ ఆదేశించిన కాలం. కేంద్రప్రభుత్వం కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొన్నదని చూపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. న్యూఢిల్లీలో హెచ్.డి. దేవేగౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల తర్వాత కశ్మీర్‌కి గరిష్ట స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని వాగ్దానం చేసిన తర్వాతే ఫరూఖ్ అబ్దుల్లా బెట్టు వీడి ఎన్నికల్లో పోటీ చేశాడు. 1996 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఘనవిజయం సాధించింది. బహుశా, మోదీ ప్రభుత్వ కశ్మీర్ విధానంలో తీవ్రంగా ప్రశ్నించదగిన అంశం ఏదంటే, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు, వాటి నేతలను భారత చట్టాలనుంచి మినహాయించి మూక నిర్బంధంలోకి తీసుకోవాలని నిర్ణయించుకోవడమే. ఒక్కమాటలో చెప్పాలంటే కశ్మీర్లో రాజకీయ ప్రక్రియకు కేంద్రం పూర్తిగా తలుపులు మూసేశారు. సీపీఎం నేత నుంచి నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కేడర్లను, నాయకులను ఒక్కుమ్మడిగా నిర్బంధించడాన్ని ఈ అంశమే స్పష్టపరుస్తుంది. కశ్మీర్లో దేశపతాకాన్ని సమున్నతంగా నిలిపిన పార్టీలు రాజకీయ భూమికలో పాలు పంచుకోలేని స్థితిలో కశ్మీర్‌లోయ ప్రజలకు రాజకీయ నాయకత్వాన్ని అందించే కర్తవ్యాన్ని చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే కానీ మరొకరికి సాధ్యమా? కశ్మీర్ లోయను దేశ అంతర్గత వలసగా ట్రీట్ చేయకుండా కేంద్రం సయమనం వహిస్తే తప్ప ఇది సాధ్యంకాదు. కేంద్ర రాష్ట్రాలు రెండింట్లోనూ చట్టసభల ప్రాతినిధ్యం దేశ పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఇది మన ప్రజాస్వామ్య సౌధానికి గీటురాయి. భవిష్యత్తులో కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికయ్యేవారు ఈ మూడూ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వారుగానే ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ మార్గంలో ప్రస్తుతం ఆలోచిస్తోందా? మనోజ్ జోషి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఫరూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పదిహేను రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా సోమవారం కశ్మీర్‌కే పరిమితమైన ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన ఇంటినే జైలుగా మార్చింది. ఆయన తరఫున దాఖలైన ‘హబియస్ కార్పస్’ పిటిషన్ విచారణకు రానున్న ఒక రోజు ముందు కేంద్రం ఈ చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈ ప్రజా భద్రత చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా ఎవరినై రెండేళ్లపాటు జైల్లో ఉంచొచ్చు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా హయాంలో (1978లో) కలప స్మగ్లర్లను అణచివేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే రానురాను కశ్మీర్ వేర్పాటువాదులను అణచివేసేందుకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 1990, 2008, 2010, 2016లలో కశ్మీర్లో జరిగిన ఆందోళనలను అణచివేసేందుకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఆ సందర్భంగా దాదాపు ఆరువేల మందిని అరెస్ట్ చేసి వారిలో 327 మంది వేర్పాటువాదులపై చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు ‘లాలెస్ లా (చట్టరహిత చట్టం)’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో పది రోజుల వరకు కూడా పోలీసులు వెల్లడించాల్సిన అవసరం లేదు. 1989లో శ్రీనగర్‌లో జరిగిన అల్లర్ల దశ్యం ‘ప్రజా భద్రత’ పేరిట ఆ తర్వాత కూడా ఎలాంటి కారణం చూపకుండానే పొడిగించవచ్చు. అయితే నాలుగు వారల లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోర్డు ముందు నిర్బంధితులను హాజరు పరిచి కేసును సమీక్షించాలి. ఈ బోర్డులో అర్హత కలిగిన జడ్జీలను లేదా అర్హత లేని జడ్జీలను కూడా నియమించవచ్చు. బోర్డులోని జడ్జీలు లేదా సభ్యుల వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. నిర్బంధితులకు తమ తరఫున న్యాయవాదులను నియమించుకునే అవకాశం కూడా లేదు. సాధారణంగా ‘జాతీయ భద్రత’ పేరిట ఎవరినైనా ఆరు నెలలపాటు నిర్బంధించవచ్చు. దీన్ని రెండేళ్లపాటు ఏకపక్షంగా పొడిగించవచ్చు. ఈ నిర్బంధాన్ని కోర్టు ఎన్నిసార్లు కొట్టివేసినా తాజా ఉత్తర్వుల ద్వారా నిర్బంధాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు. 20 ఏళ్లకుపైగా జైల్లో ఉన్న మసరత్ ఆలమ్ భట్ 1990 దశకంలో ముస్లిం లీగ్ నాయకుడు, వేర్పాటు వాది మసరత్ ఆలమ్ భట్‌పై 37 సార్లు ఈ ప్రజా భద్రతా చట్టాన్ని (పీఎస్ఏ)ను ప్రయోగించడంతో ఆయన ఏకంగా 20 ఏళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కలప దొంగల అణచివేత కోసం తీసికొచ్చిన ఈ చట్టం కింద రాజకీయ నాయకులతోపాటు కశ్మీర్ బార్ అసోసియేషన్ చైర్మన్ సహా న్యాయవాదులను, కశ్మీర్ వాణిజ్య మండలి సభ్యులు సహా వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరిలో ఎవరు ప్రజాందోళనలు నిర్వహించిన వారు కాదు, ప్రజా భద్రతకు ముప్పు తెచ్చిన వాళ్లు కాదు. ముదుసలి వయస్సులో ఫారూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయడం అంటే మున్ముందు ఆయన ఏ ముప్పు తెస్తాడో ఏమోనని కేంద్రం భయపడుతుండడమేనని ప్రజాస్వామ్య వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఫరూక్ అబ్ధుల్లాపై పీఎస్ఏ ప్రయోగం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన శ్రీనగర్‌లోని తన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. పీఎస్ఏ కింద ప్రభుత్వం ఓ వ్యక్తిని రెండేళ్ల పాటు విచారణ లేకుండానే నిర్బంధంలో ఉంచవచ్చు. పీఎస్ఏ కింద ఫరూక్ అబ్ధుల్లాను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన నివాసాన్ని అనుబంధ జైలుగా ప్రకటించారు. దీంతో ఆయన తన నివాసంలోనే ఉంటూ బంధువులు, స్నేహితులను కలుసుకునే వీలుంది. గతంలో కశ్మీరీ నేత షా ఫైజల్‌ను సైతం పీఎస్ఏ కింద నిర్భందంలోకి తీసుకున్నారు. మరోవైపు ఫరూక్ అబ్దుల్లాను కోర్టు ఎదుట హాజరుపరచాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 30న ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టనున్నట్టు సుప్రీం బెంచ్ పేర్కొంది. -
వీరి భవితవ్యం ఏంటి?
ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అన్న సంఘ్‌పరివార్ కల నెరవేరి జమ్ము కశ్మీర్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 370 ఆర్టికల్ రద్దవడంతో పాటు మంచుఖండాన్ని రెండుభాగాలుగా విభజించే బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇక జమ్ము కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు కానుండడంతో అక్కడ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో అన్న చర్చ మొదలైంది. ప్రధానంగా ఇన్నాళ్లూ కశ్మీర్ లోయను తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేసిన అబ్దుల్లా, ముఫ్తీ వంశాల భవిష్యత్ ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీలు ‘ప్రజాస్వామ్యానికే ఇది చీకటి రోజని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారు’ అని ఆర్టికల్ 370 రద్దుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా భవిష్యత్‌లో రాజకీయంగా వారికి ఎలాంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీపైనే పీడీపీ ఆధారపడాల్సి వచ్చింది. జమ్ము, లదాఖ్‌లో ప్రజలు దశాబ్దాల తరబడి హింసాకాండతో విసిగివేసారిపోయారు. శాంతి స్థాపన, అభివృద్ధిని వారు ఆకాంక్షిస్తున్నారు. దీంతో ఎన్సీ, పీడీపీలు రాజకీయాలు కేవలం కశ్మీర్ లోయకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో సీట్లు పెరిగితే.. కశ్మీర్ లోయతో పోల్చి చూస్తే జమ్మూ అతి పెద్ద ప్రాంతం. జనాభా పరంగా కూడా పెద్దది. కేంద్రం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. జమ్మూ ప్రాంతంలోనే 10–15 సీట్లు పెరిగితే రాజకీయా లు బీజేపీకి అనుకూలంగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్ము ప్రాంతాన్ని క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు పన్నుతున్న కమలనాథులు కశ్మీరీయేతర హిందూ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కూడా యోచిస్తున్నారు. పీడీపీ, ఎన్సీ చేతులు కలిపితే... అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలుపుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోయలో వేర్పాటు వాదులతో చేతులు కలిపి విధ్వంసం సృష్టించడం, బీజేపీని ఎదుర్కోవడానికి కలసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం వంటి చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఈ రెండు పార్టీల పాత్ర నామమాత్రంగానే ఉంటుందనే భావన ఉంది. ఎందుకంటే కేంద్రపాలితం కావడంవల్ల శాంతి భద్రతలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయి. పాలనలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం ఉంటుంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో పోరాటం చేయడం మినహా వారికి వేరే మార్గం ఉండదు. -
మేం పోరాడతాం కోర్టుకు వెళ్తాం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ను విభజించడం అంటే శరీరాన్ని ముక్కలుగా కోసేసినట్లుగా తనకు అనిపిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై తాము పోరాడతామనీ, కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం అయిన ఫారూఖ్.. 370వ అధికరణం రద్దయిన తర్వాత తొలిసారిగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. కేంద్రం ప్రజాస్వామిక అధికారాలతో కాకుండా నియంతృత్వ అధికారంతో జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందనీ, పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను తొలగించిందని ఫారూఖ్ మండిపడ్డారు. ‘ద్వారాలు తెరుచుకున్న వెంటనే మా ప్రజలు బయటకు వస్తారు. మేం పోరాడుతాం. కోర్టుకు వెళ్తాం. మేం తుపాకులు పట్టుకుని తిరగలేదు. గ్రెనేడ్లు, రాళ్లు విసరలేదు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడాన్ని మేం నమ్ముతాం. వాళ్లు మమ్మల్ని హత్య చేయాలనుకుంటున్నారు. మేం సిద్ధం. నా ఛాతీ సిద్ధంగా ఉంది. ఛాతీపై కాల్చండి. వెనుక కాదు’అంటూ ఫారూఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను విభజించిందనీ, ఇక ఇప్పుడు ప్రజల మనసులను కూడా విడగొడతారా అని ఉద్వేగంతో ప్రశ్నించారు. సభలోనే అబద్ధం చెప్పడం విచారకరం.. ‘నన్ను గృహనిర్బంధంలో ఉంచలేదని హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులోనే అబద్ధం చెబుతున్నారు. నా ఇష్టంతోనే నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదని ఆయన అంటున్నారు. కానీ మా ఇంటి ముందు ఓ డీఎస్పీని మోహరించారు. నన్ను బయటకు వెళ్లనివ్వలేదు. ఎవ్వరినీ లోపలకు రానివ్వలేదు. ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి బయటకు వచ్చేందుకు కూడా నేను చాలా కష్టపడ్డాను. సభలోనే హోం మంత్రి ఇలా అబద్ధాలు చెప్పడం విచారకరం’అని ఫారూఖ్ వివరించారు. శ్రీనగర్ ఎంపీ అయిన ఫారూఖ్ మంగళవారం లోక్‌సభలో లేకపోవడంతో ఆయనను అరెస్ట్ చేశారా లేక గృహనిర్బంధంలో ఉంచారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించగా, అమిత్ షా సమాధానమిస్తూ ‘ఆయనను అరెస్టు చేయలేదు. గృహ నిర్బంధంలో ఉంచలేదు. ఆయన తన ఇష్టం మేరకు ఇంట్లోనే ఉన్నారు’అని బదులిచ్చారు. మరి ఫారూఖ్‌కు ఆరోగ్యమేమైనా బాగాలేదా అని సుప్రియ ప్రశ్నించగా, ‘అది వైద్యులే చెప్పాలి. నేను వైద్యం చేయలేను’అని వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. కాగా, ఫారూఖ్ మాట్లాడుతూ ‘వాళ్లు (ప్రభుత్వం) ప్రాంతాలను విడదీశారు. ఇప్పుడు ప్రజల మనసులను కూడా విడగొడతారా? హిందూ, ముస్లింలను విడదీస్తారా? నా భారతదేశం లౌకికవాదాన్ని, ఐక్యతను నమ్మే ప్రతీ ఒక్కరిదీ అని నేను భావించాను.70 ఏళ్లుగా మేం యుద్ధంలో పోరాడాం. కానీ ఇప్పుడు దోషులమవుతున్నాం’అని ఆవేదన వ్యక్తం చేశారు. -
మీడియా ఎదుట ఫరూక్ భావోద్వేగం..!
శ్రీనగర్ : రాష్ట్రం తగులబడుతుంటే.. తాను ఇంట్లో ఎలా కూర్చుంటానని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా ఫరూక్ సభలో లేకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అమిత్ షా తను కావాలనే ఇంట్లో కూర్చున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తనను గృహ నిర్భందం చేశారని.. తన కొడుకు ఒమర్‌ను కూడా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానిప్పుడు తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చానన్నారు ఫరూక్. రాష్ట్రం అల్లకల్లోలంగా మారిన సమయంలో ఇంట్లో ఎలా కూర్చుంటానని ప్రశ్నించారు. తనను, రాష్ట్ర ప్రజల్ని కాపాడలంటూ మీడియా ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేంద్ర నాయకులు ప్రాంతాలను విభజించారు. కానీ, హృదయాలను కూడా విభజిస్తారా. జనాలను కూడా హిందూ, ముస్లింలుగా విభజిస్తారా.ఈ దేశం లౌకికతను, ఐక్యతను విశ్వసిస్తుందని భావించాను. కానీ నేడు బీజేపీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించింది’అని వాపోయారు. -
‘ఫరూక్‌ను నిర్భందించలేదు’
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షాలు ఫరూక్ అబ్దుల్లా గురించి ప్రశ్నించగా.. ఆయనను అరెస్ట్ చేయలేదు.. నిర్భందంలోకి కూడా తీసుకోలేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులను ఆదివారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమిత్ షా మంగళవారం సభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సులే.. ‘ఫరూక్ అబ్దుల్లా నా పక్కనే కూర్చునే వారు.. కానీ నేడు ఆయన సభకు హాజరుకాలేదు’ అని తెలిపారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ఫరూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయలేదు.. నిర్భందించలేదు. ఆయన కావాలనే ఇంట్లో ఉన్నారన్నా’రు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేదా అని సుప్రియా ప్రశ్నించగా.. నేను వైద్యుడిని కాదంటూ అమిత్ షా సమాధానమిచ్చారు. ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాలేదనే అంశాన్ని తొలుత డీఎంకే గుర్తించింది. ఆయన ఎక్కడున్నారని, ఆయనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఆ పార్టీ సభ్యుడు దయానిధి మారన్ స్పీకర్‌కు తెలిపారు. సభలోని సభ్యులను రక్షించే బాధ్యత స్పీకర్‌దే అన్నారు మారన్. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్థానిక నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, తదితర నేతలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
కశ్మీరం పై సోషల్ ‘యుద్ధం’
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గత నాలుగైదు రోజులు గా కశ్మీర్ పరిణామాలను గమనిస్తున్న ప్రజానీకం సోమవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయింది. 370వ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంతో తెలుగు ప్రజలు సోమవారమంతా ఇదే విషయంపై చర్చలు జరిపారు. ఏ ఇద్దరు మనుషులు కలిసినా, రాజకీయ నేతలు ఎదురుపడినా కశ్మీర్ అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. ఏమవుతుందో ఏమో? దేశ భద్రత, భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పెరుగుతుందా.. తగ్గుతుందా అనే విషయంపై ఎక్కువగా చర్చ జరగడం తెలుగు ప్రజల చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. దీంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కశ్మీర్ ప్రజ ల్లో ఎలాంటి స్పందన వస్తుంది.. దేశ భద్రతకు సంబంధించి ఏమైనా పరిణామాలు జరుగుతాయా.. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు ఎలా ఉంది.. స్థానికంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. కేంద్ర నిర్ణయం స్టాక్మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపింది.. అనే అంశాలు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లోనూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కశ్మీర్ అంశంపై భిన్న వాదనలు నడిచాయి. 370వ అధికరణ ద్వారా అక్కడి ప్రజలకు సంక్రమించిన అధికారాల విషయంలో ఇరువర్గాలు ఓ రకంగా సామాజిక మాధ్యమాల్లో యుద్ధమే చేశాయి. ఈ అధికరణ ద్వారా కశ్మీర్లో వివాహానంతర వారసత్వ హక్కులు, దేశంలోని ఇతర రాష్ట్రాలకున్న ప్రత్యేక అధికారాలు, కశ్మీర్లో కేంద్ర చట్టాలు, అత్యున్నత న్యాయస్థానాల తీర్పుల అమలు తదితర అంశాలపై పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ అధికరణ నెహ్రూ, అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందమని కొందరు, దేశాన్ని విభజించి పాలించేందుకు జరుగుతున్న కుట్రను ఎదుర్కోవాలంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు చేస్తూ పోస్టులు పెట్టారు. -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
భారత్‌కు గుణపాఠం తప్పదు : ఫరూక్ అబ్దుల్లా
న్యూఢిల్లీ/ఒసాకా : అగ్రరాజ్యం అమెరికా చేతిలో భారత్‌కు గుణపాఠం తప్పదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. ఓవైపు తమ ఉత్పత్తులపై భారత్ భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తుండగా.. మన ప్రధాని మాత్రం టెర్రరిజం, పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం అంశాలే ప్రధానంగా జీ20 సదస్సులో ప్రసంగించడం సరైనదికాదని అభిప్రాయపడ్డారు. పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుని అమెరికాతో సంబంధాలు చెడకుండా చూసుకోవాలని మోదీకి హితవు పలికారు. ఇటీవల అమెరికా నుంచి దిగుమతయ్యే 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. (చదవండి : ట్రంప్‌తో మోదీ చర్చించిన అంశాలివే..) ఇదిలాఉండగా... జపాన్‌లో జరుగుతున్న జీ 20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెంపుదల, శాంతి సుస్ధిరతలను కాపాడటం, వర్తక లోటును అధిగమించడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని వైట్ హౌస్ ట్వీట్ చేసింది. (చదవండి : ‘కశ్మీర్ రిజర్వేషన్’ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్‌రెడ్డి) ఇక జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి గత సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నామని అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే, ఈ చట్టంతో ఇతరుల రిజర్వేషన్లకు భంగం కలగొద్దని అన్నారు. ఈ బిల్లు ప్రకారం జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దుకు 10కిలోమీటర్లు, కశ్మీర్లో నియంత్రణరేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించనున్నారు. -
ఫారూఖ్‌కు గట్టి పరీక్ష
జమ్మూ, కశ్మీర్ రాజధాని నియోజకవర్గమైన శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు నాయకత్వం వహించే షేక్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు గతంలో ఏడుసార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా మరోసారి శ్రీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అబ్దుల్లాను పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 42 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. 2017లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన అబ్దుల్లా తన సమీప పీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్‌పై పది వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ ఉప ఎన్నికలో జనం స్వల్ప సంఖ్యలో (7 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫారూఖ్ అబ్దుల్లాతోపాటు ఆగా సయ్యద్ మొహిసిన్ (పీడీపీ), ఖాలిద్ జహంగీర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో ప్రస్తుత పీడీపీ అభ్యర్థి ఆగా మొహిసిన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించారు. ఈ నెల 18న పోలింగ్ జరిగే శ్రీనగర్ స్థానంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలకు చెందిన 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట ఫారూఖ్ అబ్దుల్లా తల్లి బేగం అక్బర్ జహాన్ ఒకసారి (1977), ఫారూఖ్ మూడుసార్లు (1980, 2009, 2017), ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మూడు సార్లు (1998, 99, 2004) శ్రీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో పరాజయం ఎరగని ఫారూఖ్ 2014లో నగరానికి చెందిన పీడీపీ అభ్యర్థి తారిఖ్ కర్రా చేతిలో ఓడిపోవడం సంచలనం అయింది. తర్వాత కర్రా పీడీపీకి, లోక్‌సభకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో ఫారూఖ్ విజయం సాధించారు. బీజేపీతో కలిసి కొన్నేళ్లు సంకీర్ణ సర్కారు నడిపిన తర్వాత విడిపోయిన కారణంగా పీడీపీకి జనాదరణ తగ్గిందని భావిస్తున్నారు. పీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ లేకపోవడం అబ్దుల్లాకు అనుకూలాంశమే. అయితే, గతంలో తీవ్రవాదిగా ఉండి ప్రజాతంత్ర పంథా ఎంచుకున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) నేత సజ్జద్ గనీ లోన్ రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. కిందటేడాది చివర్లో జరిగిన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ బహిష్కరించడంతో పీసీ అభ్యర్థి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ తరఫున ఇర్ఫాన్ అన్సారీ ఇక్కడ పోటీలో ఉన్నారు. రాజకీయాలకు అన్సారీ కొత్తే అయినా ఫారూఖ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారనీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు పడే ఓట్లను ఆయన గణనీయంగా చీల్చుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. పీసీ అభ్యర్థి రంగంలోకి దిగడం వల్ల అబ్దుల్లా గెలుపు అంత సులభం కాదని అంటున్నారు. తీవ్రవాద కార్యకలాపాలు శ్రీనగర్ పరిధిలో తక్కువే ఉత్తర, దక్షిణ కశ్మీర్‌తో పోల్చితే ఈ నియోజకవర్గ పరిధిలో వేర్పాటువాద తీవ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. కాని, పోలింగ్ బహిష్కరణకు ఇచ్చిన పిలుపు 2017 ఉప ఎన్నికలో పనిచేసింది. ఈసారి కూడా ఎంత శాతం జనం ఓటు హక్కు వినియోగించకుంటారో చెప్పడం కష్టం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూఖ్ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. శ్రీనగర్‌లో కాంగ్రెస్ పోటీ పెట్టలేదు. జమ్మూ, ఉధంపూర్‌లో కాంగ్రెస్‌కు నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 81 ఏళ్ల ఫారూఖ్ గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆయన పార్టీ నమ్ముతోంది. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు నడపడంతో పీడీపీ జనాదరణ కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం కూడా పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత గెలుపుపై అనుమానాలు అనవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
‘ఫరూక్‌కు సొంత రాష్ట్రంలోనే విలువ లేదు’
సాక్షి, వైఎస్సార్: ఏపీలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు లాంటి అవినీతి పరుడికి పలువురు నేతలు మద్దతు పలకడంపై మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్ జిల్లాలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాకు సొంత రాష్ట్రంలో, సొంత పార్టీలోనే విలువ లేదని అన్నారు. అవినీతిపై పోరాడి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన అరవింద కేజ్రీవాల్.. ఏపీలో అవినీతిపరుడికి ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దీనివల్ల కేజ్రీవాల్ లాంటి వాళ్లకున్న విలువలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంత నీచమైనా రాజకీయాలైన చేస్తారని విమర్శించారు. చంద్రబాబు బండరాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బట్టబయలు చేశారని గుర్తుచేశారు. గోయల్ చర్చకు రమ్మని సవాల్ చేసినా చంద్రబాబు స్పందించలేదన్నారు. కమిషన్ కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పోరాటం ప్రత్యేక హోదాపై కాదని.. సీబీఐ, ఐటీలను రాష్ట్రంలోకి రాకుండా చూసేందుకేనని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో పూర్తి అవాస్తవాలను చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తన ప్రచారంలో చూపిస్తున్న ఇళ్లు.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని కియా పరిశ్రమ గురించి చంద్రబాబు ప్రభుత్వం వాస్తవాలు బయట పెట్టలేదని తెలిపారు. రాజధాని అమరావతి గ్రాఫిక్స్ మాదిరే టీడీపీ ప్రచార చిత్రాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. -
ఫరూఖ్ అబ్దుల్లా రాజకీయ నిరుద్యోగి
సాక్షి, కడప కార్పొరేషన్: కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా రాజకీయ నిరుద్యోగి అని అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించి పక్కనబెట్టారని మాజీ మంత్రి డా. ఖలీల్‌బాషా ఎద్దేవా చేశారు. బుధవారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాల్టెక్స్ ఇనాయతుల్లా, హఫీజుల్లా, డా. సుహైల్ అహ్మద్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాను తెచ్చి కడపలో రోడ్ షో చేస్తే 500 మంది కూడా జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం గూర్చి ఏమీ తెలియని ఫరూఖ్ అబ్దుల్లా హిందూ, ముస్లింలకు కొట్లాట పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ అన్ని మతాల వారు అన్యోన్యంగా ఉన్నారని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే వైఎస్ జగన్ రూ.1500 కోట్లు ఆఫర్ చేశారని అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గోద్రా అల్లర్ల గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లు ఎవరి ఒడిలో కూర్చున్నాడో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా ఉండటం దరిద్రమన్నారు. నారా హమారా, టీడీపీ హమారా సభలో ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసులు పెట్టిన చంద్రబాబుకు ముస్లిం ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మైనార్టీలు నాకు ఓట్లు వేయలేదు కదా అనే భావనతో నాలుగున్నరేళ్లు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా పక్కనబెట్టారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీ మంత్రి లేని కేబినెట్ ఇదేనన్నారు. ప్రత్యేక హోదాను కావాలనే పక్కనబెట్టి ప్యాకేజీ కోసం కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ బయటపెట్టారన్నారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మళ్లీ మభ్యపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కరికీ రుణాలు అందలేదన్నారు. దూదేకుల కులస్తులు కూడా బాబు మాటలు నమ్మి మోసపోయారన్నారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీల సూచనలు ఏమాత్రం అమలు కాలేదన్నారు. 2004లో ఏడాది ముందు ఎన్నికలకు పోయిన చంద్రబాబు 105 సీట్లను మార్చారని, ఫలితాల్లో మార్చిన సీట్లలో ఐదు మాత్రమే గెలుపొందారన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంటికే పరిమితం కాక తప్పదని జోష్యం చెప్పారు. బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్న ఫరూఖ్ అబ్దుల్లా సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే ఫరూఖ్ అబ్దుల్లా చదువుతున్నారని, ఆయనకు మన రాష్ట్రం గూర్చి ఎలాంటి అవగాహన లేదని వైఎస్ఆర్సీపీ నేత కాల్టెక్స్ హఫీజుల్లా అన్నారు. 1996లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఫరూఖ్ అబ్దుల్లా చెబితే నమ్మేవాళ్లు ఎవరూ లేరన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని, అధికారంలోకి వచ్చాక వదిలేస్తాడన్నారు. ఆయన పార్టీల గూర్చే ఆలోచిస్తాడు తప్పా ప్రజల గురించి ఆలోచించడన్నారు. వైఎస్ జగన్ ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తారని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మైనార్టీ మంత్రి ఉన్నారని, నాలుగున్నరేళ్లు మన రాష్ట్రంలో మైనార్టీ మంత్రి లేరని తెలిపారు. సమావేశంలో మైనార్టీ నాయకులు అక్బర్ అలీ పాల్గొన్నారు. -
టీడీపీ తరఫున ప్రచారం చేయరూ.. ప్లీజ్
సాక్షి, అమరావతి: రాజకీయ కుతంత్రాల సినిమాలో ఇంతవరకు తన పార్ట్నర్ పవన్ కల్యాణ్‌తో షో చేస్తున్న చంద్రబాబు తాజాగా గెస్ట్ ఆర్టిస్టులను కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. కుమ్మక్కు కుట్రలో తామిద్దరం ఎంతగా నటిస్తున్నప్పటికీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని తేటతెల్లం కావడంతో చంద్రబాబు స్పెషల్ అప్పియరెన్సుల మీద దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను తీసుకువచ్చారు. మరికొందరినీ లైన్లో పెట్టారు. కాకపోతే చంద్రబాబు తన రాజకీయ మకిలిని తమకూ అంటిస్తున్నారని.. తమను కేవలం కుల పెద్దల స్థాయికి దిగజార్చేస్తున్నారని ఆ పాత్రధారులకు తెలియడం లేదు. చంద్రబాబు ఎందరితో ఏం చేయించినా సరే టీడీపీ సినిమాను బాక్సాఫీసు వద్ద కుదేలు చేసేందుకు రాజకీయ ప్రేక్షకులైన ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేయడం కొసమెరుపు. జాతీయస్థాయి నేతలా? కుల పెద్దలా? ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబు జాతీయస్థాయి నేతలను కూడా రాష్ట్రానికి తెచ్చి భ్రష్టుపట్టిస్తున్నారు. వారిని కుల పెద్దలు, మతపరమైన పంచాయతీలు చేసేవారి స్థాయికి దిగజార్చుతున్నారు. ఆ నేతలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ రూపొందించిన ప్రచార షెడ్యూలే ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. చంద్రబాబుతో కలసి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం కడపలోనూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువుగా ఉన్నందునే అక్కడ ఆయనతో ప్రచారాన్ని నిర్వహించింది. అంటే ఫరూక్ అబ్దుల్లాను కేవలం ముస్లిం నాయకుడిగానే తాము గుర్తిస్తున్నామని ఆయనకు అంతకుమించిన స్థాయిలేదని టీడీపీ పరోక్షంగా తేల్చి చెప్పిందన్నమాట. రాజకీయంగా ఏనాడో ప్రాభవం కోల్పోయిన ఆయన సొంత రాష్ట్రం జమ్మూకాశ్మీర్‌కు వెళ్లకుండా లండన్‌లోనూ, ఢిల్లీలోనూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడాయన టీడీపీ తరఫున కేవలం ముస్లింలు ఉన్న ప్రాంతాల్లోనే ప్రచారం చేయడం ద్వారా ఆయన పరపతిని గల్లీ నేత స్థాయికి దిగజార్చారని ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీతో 1998 నుంచి 2004 వరకు, మళ్లీ 2014 నుంచి 2018 వరకు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబును తామెలా విశ్వసిస్తామని ముస్లింలు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీడీపీ తరఫున విజయవాడ, విశాఖపట్నంలలో గురువారం, ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఆమెతో ఆ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉండే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, విశాఖపట్నంలోని దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని టీడీపీ నిర్ణయించింది. అంటే పశ్చిమ బెంగాల్లో వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన మమతా బెనర్జీని కూడా కేవలం ఓ కుల పెద్ద స్థాయికి చంద్రబాబు దిగజార్చారన్నది స్పష్టమవుతోంది. అలాగని బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ రాజకీయంగా ఏమైనా గుర్తింపు ఇచ్చిందా అంటే.. అదీ లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాలుగు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించడంతో బ్రాహ్మణ సామాజికవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ఆ నాలుగు స్థానాల్లో విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం, విశాఖపట్నంలోని దక్షిణ, తూర్పు నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో చంద్రబాబు హడలెత్తిపోయి ఆ సామాజికవర్గానికి చెందిన మమతా బెనర్జీతో ఆ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేయించాలనే ఎత్తుగడ వేశారు. ‘బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదు కానీ మమతా బెనర్జీని తీసుకువచ్చి తమ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను ఓడించాలని కుట్ర చేస్తారా’ అని బ్రాహ్మణ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా చంద్రబాబు అదే గాటన కడుతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనతో ఆ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న విశాఖపట్నం, విజయవాడలలో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా కేవలం కుల పెద్ద లాగానే చంద్రబాబు పరిగణిస్తుండటం విస్మయపరుస్తోంది. కర్ణాటకకు చెందిన వక్కలిగ సామాజికవర్గానికి చెందిన ఆయనతో ఆ సామాజికవర్గ ఓటర్లు ఉండే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రచారం చేయించాలని ఎత్తుగడ వేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌తో నెల్లూరులో ప్రచారం చేయించాలన్నది టీడీపీ యోచన. యాదవ సామాజికవర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నెల్లూరులో ఆ సామాజికవర్గానికి టీడీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. మంత్రి నారాయణను అభ్యర్థిగా నిర్ణయించింది. కానీ వైఎస్సార్సీపీ మాత్రం యాదవ సామాజికవర్గానికి చెందిన తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్నే మరోసారి అభ్యర్థిగా నిర్ణయించింది. దాంతో యాదవ సామాజికవర్గ ఓటర్లలో చీలిక తేవడానికి తేజస్వీ యాదవ్‌తో నెల్లూరులో ప్రచారం చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా తమిళ ఓటర్లు ఎక్కువుగా ఉండే చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ప్రచారం చేయించాలని కూడా టీడీపీ యోచిస్తోంది. టీడీపీ తరఫున ప్రచారం చేయరూ.. ప్లీజ్ రాజకీయ విలువలను అంతకంతకూ దిగజార్చడంలో చంద్రబాబు తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. జాతీయ స్థాయి నేతలుగా గుర్తింపు ఉన్న వారిని కేవలం కుల పెద్దలుగా, మత పంచాయతీలు చేసేవారి స్థాయికి దిగజారుస్తున్నారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేక పోరాటం ముసుగులో ముందస్తుగానే సన్నద్ధమయ్యారన్నది స్పష్టమైంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ గడ్డు పరిస్థితిని ముందే గుర్తించిన చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగానే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నేతలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తనను ఆదుకునేందుకు రావాల్సిందిగా వారిని అర్థించారు. ఆయన బతిమలాడటంతో కొందరు నేతలు టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సమ్మతించారని సమాచారం. ఈ క్రమంలోనే మొదటగా జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మంగళవారం టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్, స్టాలిన్ మరికొందరు కూడా త్వరలో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
నాకు ఓటేయకపోతే ఇబ్బందుల్లో పడతారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ‘నాకు ఓటేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. భవిష్యత్ అంధకారం అవుతుంది. వైఎస్సార్సీపీకి ఒక్క ఓటు కూడా వేయకుండా అన్ని ఓట్లూ టీడీపీకే వేయాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాలతో పాటు కర్నూలు నగరంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనంలేక రోడ్‌షోలు వెలవెలబోయాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు రోజూ మాట్లాడుతున్న తరహాలోనే ప్రజలను బెదిరించేలా ప్రసంగించారు. కేసీఆర్, మోదీ బూచి చూపడంతోపాటు ‘కాపీ పథకాల’నూ వల్లెవేశారు. ఆయన ప్రసంగాన్ని విన్న ప్రజలు ఇదెక్కడి చోద్యమంటూ మధ్యలోనే వెనుదిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో టీఆర్ఎస్ మద్దతు అవసరంలేదంటూ నంద్యాల సభలో వ్యాఖ్యానించారు. అదేమైనా జాతీయ పార్టీనా అని ప్రశ్నించారు. ఇవ్వాల్సింది బీజేపీ, కాంగ్రెస్‌లేనని, ఇందులో బీజేపీ ఇవ్వకుండా మోసం చేసిందని, సోనియా, రాహుల్‌గాంధీ ఇస్తామని చెప్పడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీ ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని, ఈ యుద్ధంలో వారికి భయపడే ప్రసక్తేలేదన్నారు. ‘తీవ్రవాదులతో పోరాడా.. రౌడీలను వెళ్లగొట్టా.. బాంబులకు భయపడని నేను వారికి భయపడతానా? అయినా మీరంతా నాకు అండగా నిలవాల’ని కోరడంతో ప్రజలు విస్తుపోయారు. అలాగే, అన్నిచోట్లా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘మీకు ఆళ్లగడ్డ పౌరుషం లేదా? నంద్యాల పౌరుషం లేదా? కర్నూలు పౌరుషం లేదా.. పిడికిలి బిగించాలి’.. అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, గతంలో వైఎస్ జగన్ నంద్యాలను ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు యథాప్రకారం దీనినీ కాపీ కొట్టి నంద్యాలను జిల్లా చేస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. మోదీ ఏకపక్ష నిర్ణయాలు, హిందుత్వ పేరుతో ఆయన ఇతర మతాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నామన్నారు. ముస్లిం మహిళల రక్షణ కోసం తలాక్ బిల్లును తెచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని ప్రశ్నించారు. కాగా, ఫరూక్ అబ్దుల్లా ప్రసంగం ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా.. మోదీని విమర్శించడానికే పరిమితమైన ఆయన ఎక్కడా టీడీపీకి ఓటు వేయాలని కోరకపోవడం గమనార్హం. కొండారెడ్డి బురుజు సాక్షిగా అబద్ధాలు కర్నూలు సభలో సీఎం మాట్లాడుతూ.. అమరావతి, కడపతోపాటు కరూŠన్ల్లో హజ్‌హౌస్ కట్టించామని తెలిపారు. అయితే, కొండారెడ్డి బురుజు సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని చూసి సభకు హాజరైన వారు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి గత ఎన్నికల ముందు కర్నూలులో హజ్‌హౌస్ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా దీనిని నిర్మించలేదు. ఇప్పుడు ఆ శిలాఫలకం వెక్కిరిస్తూనే ఉంది. అయినప్పటికీ హజ్‌హౌస్‌ను నిర్మించామని చంద్రబాబు ప్రకటించడంతో ప్రజలు అవాక్కయ్యారు. -
చంద్రబాబుకు ఘోర అవమానం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశ ప్రధాని, రాష్ట్రపతి తదితర అత్యున్నత పదవులు అధిరోహించే వ్యక్తులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించానంటూ గొప్పలు చెప్పుకొని కాలం వెళ్లదీసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. జాతీయ నాయకులను ప్రచారంలో దింపి డాబు ప్రదర్శిద్దామనుకుంటే కడప ప్రజలు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ క్రమంలో మంగళవారం నాటి కడప ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి స్పందన కరువైంది. కార్యకర్తలు, ప్రజలు కలిపి కనీసం 300 మంది కూడా హాజరుకాకపోవడంతో బాబు కంగుతిన్నారు. దీనిని అవమానంగా భావించిన ఆయన... టీడీపీ కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇదేనా మీ నాయకత్వం అంటూ చిందులు తొక్కారు. కాగా ఇంతకుముందు చంద్రబాబు, టీడీపీ నాయకులు నిర్వహించిన పలు సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి అనేక సందర్భాల్లో అనుకూల మీడియాతో సభలు సక్సెస్ అయినట్లుగా కలరింగ్ ఇచ్చేవారు. అయితే ఈసారి ఏకంగా ఓ పొరుగు రాష్ట్రం ముఖ్యనేత, మాజీ సీఎం ముందు అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు అండ్ కో ‘మేనేజ్మెంట్ వ్యవహారం’ బట్టబయలు కావడంతో తెలుగు తమ్ముళ్లకు గట్టి షాక్ తగిలినట్లైంది.