శ్రీనగర్: భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కాశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరుసటి రోజు ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
'మన స్నేహితులను మనం మార్చగలం. కాని మన పొరుగు వారిని మార్చలేమని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. మనం మన పొరుగువారితో స్నేహ పూర్వకంగా ఉంటే, ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు' అని గుర్తు చేశారు.
'పాకిస్థాన్‌కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మనమే చర్చలకు సిద్ధంగా లేము. ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకపోతే.. కశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుంది.' అని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు.
భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా మారిన గుహలను కూల్చివేయాలని సైనికులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక?
Comments
Please login to add a commentAdd a comment