Atal Bihari Vajpayee
-
వాజ్‌పేయి సర్కారును కూల్చిన ఆ ఒక్క ఓటు నేను వేయించిందే
న్యూఢిల్లీ: 1999లో వాజ్‌పేయి ప్రభుత్వా న్ని పడగొట్టిన ప్రతిపక్షంలోని ఆ ఒక్క ఓటు తను ఒప్పించి వేయించిందేనని సీనియర్ నేత, ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం మహారాష్ట్ర సంసద్‌లో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1999 లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం గద్దె దిగి పోవడానికి దారి తీసిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. ఓ ఎంపీతో సుమారు 10 నిమిషాలపాటు మాట్లాడాక అధికార పక్షం ఎన్డీలోని ఆ ఒక్క సభ్యుడి ఓటును ప్రతిపక్షానికి అనుకూలంగా వేసేలా ఒప్పించింది తనేనంటూ చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే ఆ ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. ఈ సందర్భంగా నీలేశ్‌కుమార్ కులకర్ణి రచించిన ‘సన్సద్ భవన్ టు సెంట్రల్ విస్టా’ పుస్తకావిష్కరణ జరిగింది. -
భారత‘రత్న’ వాజ్‌పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
అటల్ బిహారి వాజ్ పాయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
-
వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి. వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకమని ప్రశంసలు కురిపించారు.వాజ్‌పేయి శత జయంతి సందర్బంగా వైఎస్ జగన్ నివాళి అర్పించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్..‘అటల్ బిహారీ వాజ్‌పేయి బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశం క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మార్గనిర్దేశం చేసిన నాయకుడు. ఆయన 100వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. వాజ్‌పేయి జీవితం భావితరాలకు స్ఫూర్తి దాయకం’ అంటూ కామెంట్స్ చేశారు.Atal Bihari Vajpayee Ji was a revered polymath who guided India through critical times. On his 100th birth anniversary, we pay tribute to Vajpayee Ji, whose enduring legacy continues to inspire generations.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2024 -
వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మృతివనం ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రధాని మోదీ(PM MODI) నివాళులర్పించారు. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కేబినెట్ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారు: ప్రధాని మోదీసుసంపన్న, బలమైన భారత దేశ నిర్మాణం కోసం వాజ్‌పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రధాని బుధవారం(డిసెంబర్25) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. వాజ్‌పేయి విజన్,మిషన్ భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించేందుకు తమకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: రాజకీయ కవి సార్వభౌముడు -
Atal Bihari Vajpayee: చదవని ప్రేమలేఖ
అటల్ బిహారీ వాజ్‌పేయి అవివాహితునిగా మిగిలిపోవడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దోచిన రాజ్‌కుమారీ హస్కర్ అనే మహిళ దూరమవడంతో పెళ్లి చాప్టర్‌కు దూరమయ్యారు. ఏక్ నిరంజన్‌లా ఉండిపోయారు.ఎవరీ హస్కర్? కశ్మీర్ పండిట్ల కుటుంబానికి రాజ్‌కుమారీ హస్కర్ వాజ్‌పేయికి కాలేజీ రోజుల్లో సహాధ్యాయి. ఇందిరాగాందీకి దూరపు బంధువంటారు. పలు కార్యక్రమాల్లో కలిసి పని చేసే క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కానీ ఎవరూ దాన్ని బయటపెట్టలేదు. వాజ్‌పేయి ఆమెకు ప్రేమలేఖ రాసినా నేరుగా ఇవ్వకుండా గ్రంథాలయంలో ఆమె చదివే అవకాశమున్న ఓ పుస్తకంలో పెట్టారు. అయితే హస్కర్ ఆ పుస్తకాన్ని చదవలేదు. అలా వాజ్‌పేయి ప్రేమలేఖ ఆమెకు అందనే లేదు. రాజకీయాలు చేసే వ్యక్తికి కూతురును ఇవ్వడం హస్కర్ తండ్రికీ ఇష్టం లేకపోయింది. దాంతో బ్రిజ్ నారాయణ్ కౌల్ అనే ప్రొఫెసర్‌తో ఆమె వివాహం జరిగిపోయింది. అలా హస్కర్ శ్రీమతి కౌల్గా మారి వాజ్‌పేయి జీవితం నుంచి అదృశ్యమైంది. వాజ్‌పేయి కూడా ప్రేమ సంగతి మర్చిపోయి క్రియాశీల రాజకీయాల్లో మునిగిపోయారు.16 ఏళ్ల తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత వాజ్‌పేయి, శ్రీమతి కౌల్ ఓ కాలేజీ ఫంక్షన్లో అనుకోకుండా పరస్పరం తారసపడ్డారు. ఢిల్లీలో తన భర్త పని చేసే కాలేజీలో కీలకోపన్యాసం సందర్భంగా అక్కడ కౌల్‌ను చూసి వాజ్‌పేయి నిశ్చేషు్టలయ్యారు. తర్వాత కౌల్ దంపతులతో ఆయన అనుబంధం బలపడింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా కౌల్ దంపతులు కూడా తమ కూతురు నమితతో కలిసి ఆయన ఇంటికి మారిపోయారు. దాంతో వారి బంధంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. భావ సారుప్యత ఉన్న కౌల్‌ను వాజ్‌పేయీ పెళ్లాడితే మంచిదని సన్నిహితులు, రాజకీయ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పినా ఆయన కొట్టిపారేశారంటారు. ‘‘దీనిపై చర్చ అనవసరం. నేను పెళ్లీడు వయసులో ఉండగా ఆదర్శవంతమైన భార్య కోసం అన్వేషణ మొదలెట్టాను. దొరికినా దురదృష్టవశాత్తు ఆమె తండ్రి తనకు అనువైన ఆదర్శ భర్త కోసం వెతికారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయిలోని ఈ కోణాన్ని జాతీయ మీడియా ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కించలేదు. కౌల్ కూతురు నమితను వాజ్‌పేయి తన కన్నకూతురిలా చూసుకున్నారు. తర్వాత దత్తత తీసుకున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలను నమిత, ఆమె కూతురు నీహారిక దగ్గరుండి జరిపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనసారా మాట్లాడండయ్యా!
కవితాత్మక ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం వాజ్‌పేయికి వెన్నతో పెట్టిన విద్య. తేలికైన పదాలతో బరువైన భావాలను వెల్లడించే మాటలకు ఆయన పెట్టింది పేరు. సాహితీ రంగంలోనూ అటల్ తనదైన ముద్ర వేశారు. హిందూ పురాణాల సారాన్ని నింపుకున్న ఆయన వాక్యాలకు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులంతా సలామ్ కొట్టేవారు. ఆయన రాజకీయ ప్రసంగాలు కూడా సాహితీ సౌరభాలు వెదజల్లేవి. తాను అధికారంలో ఉండగా విపక్షాలు చేసే విమర్శలకు హుందాగా, చమత్కారంగా బదులిచ్చేవారు. ‘మనసారా మాట్లాడండయ్యా’ అంటూ తోటివారిని ప్రోత్సహించేవారు.చిరస్మరణీయ ప్రసంగం ప్రజాస్వామ్యంపై వాజ్‌పేయికి ఉన్న అపార నమ్మకం ఆయన దార్శనికతలో తొణికిసలాడేది. తన తొలి ప్రభుత్వం 13 రోజులకే కూలిన సందర్భంలో 1996 మే 27న ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం మరపురానిది! దాన్ని నాటి పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలు నేటికీ గుర్తు చేసుకుంటారు. ఎమర్జెన్సీ వేళ జైలు జీవితం గడుపుతూ రాసిన కవితలతో ‘ఖైదీ కవి కుండలీ’ అనే కవితా సంకలనం రచించారు. ‘అమరత్వం అగ్ని లాంటిది’, ‘నా 51 కవితలు’ వంటి పలు సంకలనాలు వెలువరించారు. ‘కవిత్వం రాసుకునేంత సమయాన్ని కూడా రాజకీయాలు మిగల్చలేదు. నా కవితా వర్షపుధార రాజకీయ ఎడారిలో ఇంకిపోయింది’ అని ఓసారి వాపోయారు. ధోతీ, కుర్తాలో నిండుగా కనిపించే అటల్ ఖాళీ సమయాల్లో కవితలు రాస్తూ సాహిత్యంతో దోస్తీ చేసేవారు. అవుంటేనే కవిత వాజ్‌పేయి సరదా మనిషి. ‘‘కవిత్వం రాయాలంటే అనువైన వాతావరణముండాలి. మనసు లగ్నం చేయగలగాలి. మనల్ని ఆవిష్కరించుకునే సమయం చిక్కాలి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అవెలా సాధ్యం?’’ అన్నారోసారి. కొంతమేర సాహిత్య కృషి చేసినా పెద్దగా రాణించలేదంటూ తెగ బాధపడేవారట. ‘‘కవిత్వంలో నేను చేసింది సున్నా. అసలు రాజకీయాల గడప తొక్కక పోయుంటే హాయిగా కవితలు రాసుకుంటూ, కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ముషాయిరాల్లో మునిగి తేలుతూ గడిపేవాడిని’’ అంటూ తరచూ అంతర్మథనానికి లోనయ్యేవారు. -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
లోకం మెచ్చిన నాయకుడు..
ప్రపంచం మెచ్చిన విలక్షణ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణా దేవి, కృష్ణ బిహారీ వాజ్‌పేయి. తండ్రి గ్వాలియర్‌లో స్కూల్ టీచర్. తాత శ్యామ్‌లాల్ వాజ్‌పేయి ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరేనాకు వలస వెళ్లారు. తర్వాత మెరుగైన జీవనోపాధి కోసం గ్వాలియర్‌కు చేరారు. అక్కడి సరస్వతి శిశు మందిర్‌లో వాజ్‌పేయి ప్రాథమిక విద్య అభ్యసించారు. గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో బీఏ ఉత్తీర్ణులయ్యారు. కాన్పూర్‌లో ఆగ్రా వర్సిటీకి చెందిన డీఏవీ కాలేజీ నుంచి ఎంఏ (పొలిటికల్ సైన్స్) చేశారు.ఆర్య సమాజోద్యమంతో ప్రస్థానం ఆర్య సమాజ ఉద్యమం పట్ల వాజ్‌పేయి చిన్నప్పుడే ఆకర్షితులయ్యారు. గ్వాలియర్‌లో ఆర్య సమాజ ఉద్యమ యువజన విభాగమైన ఆర్యకుమార సభలో చేరారు. 1944లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరారు. 16 ఏళ్ల వయసులోనే స్వయం సేవకునిగా చురుకైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టై 24 రోజులు జైల్లో ఉన్నారు. 1947లో ఆరెస్సెస్ ప్రచారక్ (పూర్తిస్థాయి కార్యకర్త)గా ఎదిగారు. దేశ విభజన పరిణామాల నేపథ్యంలో న్యాయ విద్యను మధ్యలోనే ఆపేశారు. ఆర్ఎస్ఎస్ పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. కవిగా, రచయితగా, ప్రజానాయకుడిగా రాణించారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగం భారతీయ జన సంఘ్‌లో సభ్యుడిగా చేరారు. దాని అధినేత శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడిగా ఉత్తరాదిన పార్టీని ముందుకు నడిపారు. 1957 సాధారణ ఎన్నికల్లో బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. పార్లమెంట్లో పలు అంశాలపై ఉర్రూతలూగించేలా ప్రసంగించేవారు. ఆయనపై నెహ్రూ ప్రభావం బాగా ఉండేది. నెహ్రూనూ వాజ్‌పేయి ప్రతిభ ఆకట్టుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత జన సంఘ్ బాధ్యతలను వాజ్‌పేయి స్వీకరించారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడయ్యారు. నానాజీ దేశ్‌ముఖ్, ఎల్.కె.ఆడ్వాణీ వంటి సహచరుల తోడ్పాటుతో పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. పదవీ వ్యామోహం లేదు ప్రధాని పదవి పట్ల వాజ్‌పేయికి ఎన్నడూ వ్యామోహం లేదంటారు. 1995 డిసెంబర్లో బీజేపీ భేటీలో ఆడ్వాణీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో సార్టీ గెలిస్తే వాజ్పేయే ప్రధాని అవుతారని ప్రకటించగా ఆయన వారించారు. ఎన్నికల్లో నెగ్గడంపైనే దృష్టి పెట్టాలని, ప్రధాని అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతమని సున్నితంగా హెచ్చరించారు. 1996 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీకి అడుగు దూరంలో ఆగినా ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ వాజ్‌పేయిని రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించారు. దాంతో వాజ్‌పేయి తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో మెజారీ్టని కూడగట్టడంలో విఫలం కావడంతో 13 రోజుల్లోనే వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996 నుంచి 1998 మధ్య రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కొలువుదీరినా మధ్యలోనే కూలిపోయాయి. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ రావడంతో వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. కానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించడంతో 13 నెలల తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. 1999 ఏప్రిల్ 17న లోక్‌సభలో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. కార్గిల్ విజయం తదితరాల సాయంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. లోక్‌సభలో 543 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుంది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. 1999 నుంచి 2004 దాకా ఐదేళ్లపాటు పూర్తికాలం పదవిలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు లోక్‌సభల్లో ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి నాయకుడిగా వాజ్‌పేయి రికార్డుకెక్కారు. నాలుగు వేర్వేరు రాష్ట్రాలు(ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ) నుంచి వేర్వేరు సమయాల్లో పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నేత వాజ్‌పేయి. తగిన మెజార్టీ లేక వాజ్‌పేయి ప్రభుత్వాలు కూలిపోవడాన్ని హేళన చేసిన ప్రతిపక్షాలతో, ‘‘చూస్తూ ఉండండి! ఏదో ఒక రోజు బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి వస్తుంది’’ అని పార్లమెంట్లో వాజ్‌పేయి బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన వాక్కు నిజమైంది.బీజేపీ తొలి అధ్యక్షుడు.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో వాజ్‌పేయీ అరెస్టయ్యారు. తర్వాత 1977 ఎన్నికల్లో జనసంఘ్ ఇతర పార్టీలతో కూడిన జనతా కూటమి నెగ్గి మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. వాజ్‌పేయీ విదేశాంగ మంత్రిగా రాణించారు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి చరిత్ర సృష్టించారు. 1980లో జనసంఘ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా మారాక దాని తొలి అధ్యక్షుడయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి పూర్తిస్థాయిలో ఐదేళ్లూ ప్రధానిగా చేశారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. దాయాది పాకిస్తాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చారు. లాహోర్ బస్సు యాత్ర చేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పాక్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు. గొప్ప రాజనీతిజు్ఞడిగా దేశ విదేశాల్లో పేరుగాంచారు. పార్టీలకతీతంగా ఎంపీలతో ఆయనకు సత్సంబంధాలుండేవి. అంతర్జాతీయ వ్యవహారాలపై వాజ్‌పేయీకి అమితాసక్తి ఉండేది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వాజ్‌పేయీ హయాంలో 2001లో పార్లమెంట్‌పై దాడి 2002లో గుజరాత్లో మత కలహాలు జరిగాయి. ఆయన్ను భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశం గర్వించదగ్గ గొప్ప నేత
సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖ్యులని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారకోపన్యాసంలో త్రివేది ప్రసంగించారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు నాయకులుగా పుట్టి ప్రధాని పగ్గాలు చేపట్టింది ఇద్దరేనని.. వారిలో వాజ్‌పేయి అయితే మరొకరు నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పేయి ఆలోచలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారని త్రివేది చెప్పారు. దేశంలో మౌలికవసతుల కల్పనకు వాజ్‌పేయి బీజం వేస్తే దాన్ని మోదీ వటవృక్షం చేశారన్నారు. విద్యతోపాటు, నైపుణ్యం, డిజిటల్ విద్య, డిజిటల్ ఎకానమీ వరకు అన్నింటినీ గ్రామాల చెంతకు చేర్చారని ప్రశంసించారు. నాటి వాజ్‌పేయి ప్రభుత్వం దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రస్తుతం మోదీ సర్కారు అణ్వాయుధాలను భూమ్యాకాశాల నుంచి ప్రయోగించే సామర్థ్యానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు. అందరినీ మెప్పించిన నేత వాజ్‌పేయి: కిషన్‌రెడ్డి అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పాయ్ పేరు కాదని, ఒక చరిత్ర అని అన్నారు. దేశ ప్రధానిగా, కేంద్రమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా వేలెత్తి చూపించలేని పనితీరుతో అందరినీ మెప్పించారన్నారు. చివరి శ్వాస వరకు జాతీయ వాదానికి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. అటల్జీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ వాజ్‌పేయిని ప్రజలు దేశానికి ఒక కాంతిరేఖగా గుండెల్లో దాచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి పాలనలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వాజ్‌పేయి ఫౌండేషన్ చైర్మన్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దార్శనికత గల రాజనీతిజ్ఞుడు
దేశ ప్రజలు తమ ప్రియతమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి (డిసెంబర్ 25)ని జరుపుకొంటున్న వేళ ఇది. ఆయన ఎంతో మందికి ప్రేరణను ఇస్తూ ఒక రాజనీతి కోవిదునిగా సమున్నత స్థానంలో నిలిచారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాన్య పౌరుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే ఎంతటి పరివర్తనను తీసుకురావచ్చో చేతల్లో చూపించారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన మహనీయునిగా అటల్జీకి దేశ ప్రజలు ఎన్నటికీ రుణపడి ఉంటారు.అటల్జీ 1998లో ప్రధా నిగా పదవిని స్వీకరించిన తరుణంలో మన దేశం రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు తొమ్మిదేళ్లలో నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరగడాన్ని మనం చూశాం. దేశ ప్రజానీకం సహనాన్ని కోల్పోతూ, ఈ ప్రభుత్వాలు వాటి బాధ్యతను సమర్థంగా నెరవేర్చ గలుగుతాయా? అనే అనుమానంలో పడిపోయారు. ఈ స్థితిని అటల్జీ మార్చి స్థిరమైన, ప్రభావవంతమైన పాలనను అందించారు.అటల్జీ నాయకత్వం ఎన్నో రంగాల్లో గణనీయ ప్రభావాన్ని చూపించింది. ఆయన పదవీ కాలంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప పురోగతి చోటు చేసుకొంది. యువశక్తి అత్యంత చైతన్యవంతంగా ఉన్న భారత్ వంటి దేశానికి ఇది చాలా ముఖ్యం. అటల్జీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడానికి శ్రద్ధ తీసుకుంది. భారత్‌లో సంధాన సదుపాయాల కల్పన విషయంలోనూ ముందుచూపు కనిపించింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఈనాటికీ చాలామంది గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది దేశంలో అనేక ప్రాంతాలను అనుసంధానం చేసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి కార్యక్రమాలను అమలుచేయడం ద్వారా స్థానికంగా కూడా సంధానాన్ని పెంపొందింప చేయడానికి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన కృషి అంతే గుర్తించదగ్గది. ఇదే మాదిరి ఆయన ప్రభుత్వం ఢిల్లీ మెట్రోను ఏర్పాటు చేయడానికి పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఢిల్లీ మెట్రోకు ఒక ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టు అనే పేరు ప్రఖ్యాతులున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచడమే కాక, దూరదూరాల్లో ఉన్న ప్రాంతాలను చేరువచేసి ఏకత, సమగ్రత వర్ధిల్లేటట్టు చూసింది.సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకూ, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండి పోయిన వర్గాలకూ ఆధునిక విద్యను అందుబాటులోకి తేగలిగే భారత దేశాన్ని ఆవిష్కరించాలన్న అటల్జీ కలను గురించి చెబుతుంది. ఆశ్రిత పక్షపాతం, దశాబ్దాల పాటు ఎదుగూబొదుగూ లేని ఆర్థిక విధా నాలతో సాగిన దేశంలో... అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవ తీసుకుంది.వాజ్‌పేయి అద్భుత నాయకత్వానికో చక్కటి ఉదాహరణ 1998 వేసవి. ఆయన ప్రభుత్వం అప్పుడే పదవీ బాధ్యతలు చేపట్టింది. వెంటనే మే 11న పోఖ్రాన్లో అణు పరీక్షలను నిర్వహించింది. ‘ఆప రేషన్ శక్తి’ పేరిట జరిగిన ఈ పరీక్షలు భారత శాస్త్రవేత్తల శక్తిని నిరూ పించాయి. భారత్ ఈ రకమైన పరీక్షలను నిర్వహించడమా? అని ప్రపంచం విస్తుపోయింది. ప్రపంచ దేశాలు వాటి ఆగ్రహాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఆ సమయంలో ఏ సామాన్య నేత అయినా ఒత్తిడికి తలొగ్గేవారు. కానీ, అప్పుడు జరిగిందేమిటి? భారత్ దృఢంగా నిల బడటమే కాక, మరో రెండు రోజుల తరువాత అంటే మే 13న రెండో దఫా పరీక్షలు నిర్వహించింది. 11వ తేదీ పరీక్షలు విజ్ఞానశాస్త్ర నైపు ణ్యాన్ని చాటితే, 13వ తేదీన నిర్వహించిన పరీక్షలు సిసలైన నాయకత్వం అంటే ఏమిటో రుజువుచేశాయి. బెదిరింపులకో, ఒత్తిడికో లొంగిపోయే రోజులు గతించాయని ప్రపంచానికి ఆయన ఒక సందేశాన్ని పంపారు. అప్పటి ఎన్ డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షల్ని ఎదుర్కొంటూనే గట్టిగా నిలబడింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొనే హక్కును నిలబెట్టుకొంటూ, ప్రపంచ శాంతిని బలంగా సమర్థించే దేశంగా కూడా నిలిచింది.భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అటల్జీ అర్థం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సంకీ ర్ణాలను పునర్నిర్వచించిన ఎన్డీఏకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా రాజనీతిజ్ఞత కనిపిస్తుంది. గుప్పెడు మంది ఎంపీలున్న పార్టీకి చెందిన వ్యక్తి అయి నప్పటికీ ఆయన మాటలు శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీని గడగడ లాడించేవి. ప్రధానమంత్రిగా తనదైన శైలిలో విపక్షాల విమర్శలను తిప్పి కొట్టేవారు. తనను ద్రోహిగా ముద్ర వేసే స్థాయికి కాంగ్రెస్ దిగ జారినప్పటికీ ఎవరిపైనా ద్వేషం పెంచుకోలేదు.అధికారం కోసం ఏనాడూ ఆయన అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు. 1996లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాజీనామా చేయడానికి మొగ్గు చూపారే తప్ప బేరసారాలకు పాల్పడలేదు. 1999లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో జరిగిన అనైతిక రాజకీయాలను సవాలు చేయమని చాలా మంది చెప్పినప్పటికీ, న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరకు అద్భుతమైన ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని చేపట్టారు.శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఆయన్ని తీవ్రంగా ప్రభా వితం చేసింది. కొన్నేళ్ల తర్వాత జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత, 1977 ఎన్నికలకు ముందు తాను స్థాపించిన (జన్ సంఘ్) పార్టీని జనతా పార్టీలో విలీనం చేసేందుకు అంగీకరించారు. ఇది ఆయనతో పాటు ఇతరులను సైతం బాధించిన నిర్ణయమని నేను భావిస్తున్నాను. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఆయనకు ప్రధానం.భారతీయ సంస్కృతితో అటల్జీ ఎంతగా మమేకమయ్యారో కూడా గమనించాల్సిందే. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నేతగా నిలిచారు. భారతీయ వారసత్వం, గుర్తింపు పట్ల ఆయన ఎంత గర్వంగా ఉండే వారో చెప్పడానికి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన ఈ ఒక్క ఉదాహరణ చాలు.ఆయన ఓ గొప్ప రచయిత, కవి. స్ఫూర్తి నింపేందుకు, ఆలోచన లను రేకెత్తించేందుకు, ఓదార్పును అందించేందుకు తన మాటలను ఉపయోగించేవారు. ఆయన అంతర్మథనానికి, దేశం పట్ల ఉన్న ఆకాంక్షలకు ఆయన కవిత్వం అద్దం పడుతుంది.అటల్జీతో సంభాషించే, నేర్చుకొనే అవకాశం దక్కడం నాలాంటి ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓ గొప్ప వరం. బీజేపీకి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. పార్టీ తొలినాళ్ళ నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి దిగ్గజాలతో కలసి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపించారు. సిద్ధాంతం, అధి కారం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భాలు ఎదురైతే ఆయన మొదటిదానినే ఎంచుకొనేవారు. అటల్జీ శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలి. ఆయన అనుసరించిన సుపరిపాలన, ఐక్యత, ప్రగతి అనే నియమాలను ప్రతిబింబించే భారత్‌ను నిర్మించడానికి మనం కృషి చేద్దాం. మన దేశ సామర్థ్యంపై అటల్జీకి ఉన్న అచంచలమైన విశ్వాసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి పనిచేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది.నరేంద్ర మోదీభారత ప్రధాని (మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ముగింపు నేడు.) -
సుపరిపాలన సాకారం కావాలంటే...
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినోత్సవంగా 2014 నుంచి జరుపుకొంటున్నాం. ప్రధానిగా ఉన్నప్పుడు మన పురాణ, ఇతిహాసాలు చెప్పిన రాజధర్మాన్ని పాటించి సుపరిపాలన చేశారాయన. అందుకే ఆయన పాలనకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించి, కొనసాగిస్తోంది. రామాయణంలో రాముడు భరతుడికి సుపరిపాలన గురించి చెబుతూ రాజ ధర్మాన్ని వివరిస్తాడు. మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు సుపరిపాలన గురించి వివరించాడు. భీష్ముడి ఉద్దేశంలో సుపరిపాలన ఆకాంక్షించే ప్రభువులు నైతిక విలువలను విస్మరించరాదు. ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో సుపరిపాలనకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. ‘ప్రజల సంతోషమే రాజు సంతోషం. ప్రజల సంక్షేమంలోనే ప్రభువు సంక్షేమం ఉంది. రాజు సంక్షేమ కోసం కాకుండా ప్రజల సంతానం కోసం మాత్రమే పరిపాలన గావించాలి.’ సుపరిపాలనలో... పరిపాలనను వికేంద్రీ కరించాలి. కానీ మన దేశంలో ప్రభుత్వ పాలన కేంద్రీకృతమైనట్లు విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధి కారాలు కల్పించాలి. స్థానిక ప్రభుత్వాలను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కొంత బలోపేతం చేసినప్పటికీ అవి అనేక రాష్ట్రాలలో నిధులు లేని విధులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. సత్వర న్యాయం లభించాలి. అనేక కారణాల వల్ల ప్రజలకు న్యాయస్థానాల్లో సత్వర న్యాయం లభించడం లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. తగిన సమయంలో లభించని న్యాయం అన్యాయంతో సమానం. అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత కారణంగా, లక్షల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసుల సత్వర నివారణకు అవసరమైన సంస్కరణను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాలి.సుపరిపాలన అంటే అవినీతి రహిత పాలన. దురదృష్టవశాత్తు ప్రభుత్వ పాలనలో అవినీతి పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవినీతి నిరోధక శాఖలైన సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ కమి షన్లను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పని చేయనివ్వాలి. అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు సీబీఐని పంజరంలో చిలకలా అభివర్ణించడం గమనార్హం. అవినీతికి పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. పరిపాలనలో పారదర్శకత ఉండాలి. ఇందుకోసం 2005లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం హర్షించదగ్గ పరిణామం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్లోనూ, రాష్ట్రాల సమాచార కమిషన్లోనూ ఏర్పడిన ఖాళీలను భర్తీచేయడం లేదు. ఇటువంటి చర్యలు సుపరిపాలనకు వ్యతిరేకం. సుపరిపాలనలో ప్రజలకు నిర్ణయాలలో తగిన పాత్ర ఉండాలి. ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ, చట్ట బద్ధమైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వాములు కావాలి. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సదుద్దేశంతో రూపొందించిప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాల వల్ల ఆ చట్టం ఆశయాలు నెర వేరలేదు. ఈ చట్టాన్ని పకడ్బందిగా అమలుచేయడం కోసం అవసరమైన చర్యలు గైకొనాలి. ఇవన్నీ జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యం అవుతుంది.– డా‘‘ పి. మోహన్ రావుప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ చైర్మన్ ‘ 99495 95509(రేపు వాజ్‌పేయి శత జయంతి ముగింపు: సుపరిపాలనా దినోత్సవం) -
అధిక నిధులతోనే రైతుకు మేలు
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్‌పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను. నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది. చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి. ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది. భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
వాజపేయి సమాధి వద్ద మోదీ నివాళులు
-
లోక్‌సభకు ఎక్కువసార్లు నెగ్గింది ఎవరంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. 1952లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే లోక్‌సభకు ఎక్కువసార్లు ఎవరు గెలిచారనే విషయానికొస్తే..ఇంద్రజీత్ గుప్తా(11 సార్లు): లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇందర్జిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో చివరిసారిగా ఎంపీ అయ్యారు. ఇంద్రజిత్ గుప్తా తన జీవితకాలంలో 11 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.సోమనాథ్ ఛటర్జీ(10 సార్లు):1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సార్లు గెలిచారు. ఛటర్జీకి 1996లో 'అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' లభించింది.పీఎం సయీద్ (10 సార్లు):పీఎం సయీద్ 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.అటల్ బిహారీ వాజ్‌పేయి(9 సార్లు)మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అటల్ జీకి నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ అనుభవం ఉంది. మరికొందరు నేతలు కూడా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారుకమల్ నాథ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ స్థానం ఆయనకు బలమైన కోటగా పరిగణిస్తారు. కమల్‌నాథ్ 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.మాధవ్ రావ్ సింధియా: దివంగత నేత మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ఆయన ఓడించారు.ఖగపతి ప్రదాని: ఒడిశాలోని నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని రికార్డు సృష్టించారు. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.గిరిధర్ గోమాంగ్: కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.రామ్‌విలాస్ పాశ్వాన్: తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతల్లో రామ్‌విలాస్ పాశ్వాన్ పేరుంది. రామ్ విలాస్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు.జార్జ్ ఫెర్నాండెజ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అతను బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.బాసుదేబ్ ఆచార్య: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వాసుదేబ్ ఆచార్య 1980లో తొలిసారిగా బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.మాణిక్‌రావ్ హోడల్యా గవిత్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ హోడల్యా గవిత్ లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.వీరంతా ఎనిమిది సార్లు: బీజేపీ నేత సంతోష్ గంగ్వార్ లోక్‌సభ ఎన్నికల్లో బరేలీ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు. సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు విజయం సాధించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
Lok sabha elections 2024: వాజ్‌పేయి మేజిక్
ప్రాంతీయ పార్టీల దన్ను లేనిదే సంపూర్ణ ఆధిక్యం అసాధ్యమని గుర్తించిన బీజేపీ 13వ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 20కి పైగా పార్టీలను నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) గూటి కిందకు తెచ్చి మెజారిటీ సాధించింది. సొంత బలం పెరగకున్నా భాగస్వాముల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చి దేశాన్ని ఐదేళ్లూ విజయవంతంగా పాలించింది. కాంగ్రెస్ మాత్రం అంతర్గత సంక్షోభంతో బాగా దెబ్బ తిన్నది..1998 ఎన్నికల తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) జాతీయ రాజకీయాల్లో పార్టీ గ్రాఫ్ బలపడేందుకు దోహదపడింది. దీనికి వాజ్‌పేయి తొలి చైర్మన్ కాగా జార్జ్ ఫెర్నాండెజ్ కనీ్వనర్. బీజేపీతో పాటు జేడీ (యూ), శివసేన, టీడీపీ, జేడీ(ఎస్) కూటమిలో ముఖ్ పార్టీలుగా ఉన్నాయి. 1999 లోక్‌సభ ఎన్నికలు సెపె్టంబర్ 5 నుంచి అక్టోబర్ 3 దాకా ఐదు దశల్లో జరిగాయి.కార్గిల్ యుద్ధం, ఫోఖ్రాన్ అణు పరీక్షలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాజ్‌పేయి చరిష్మా కూడా తోడై ఎన్డీఏకు 298 స్థానాలు దక్కాయి. 1984 తర్వాత ఏ పార్టీకైనా, సంకీర్ణానికైనా లోక్‌సభలో మెజారిటీ దక్కడం అదే తొలిసారి. బీజేపీకి 182 సీట్లొస్తే కాంగ్రెస్ 114తో పరిమితమైంది.సీపీఎం 33, టీడీపీ 29, సమాజ్‌వాదీ 26, జేడీయూ 21 సీట్లు గెలుచుకున్నాయి. సీపీఐకి కేవలం నాలుగు సీట్లే రావడంతో జాతీయ పార్టీ హోదా కోల్పోయింది! ఫలితాల అనంతరం డీఎంకే వంటి మరిన్ని పార్టీలు చేరడంతో ఎన్డీఏ కూటమి మరింత బలపడింది. అక్టోబర్ 13న ప్రధానిగా వాజ్‌పేయి మూడోసారి ప్రమాణం చేశారు. మొత్తమ్మీద 1996 నుంచి 1999 మధ్య మూడేళ్లలో లోక్‌సభకు ఏకంగా మూడుసార్లు ఎన్నికలు జరగడం విశేషం!కాంగ్రెస్‌లో సంక్షోభంకాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే పార్టీలో ముసలం మొదలైంది. జన్మతః విదేశీయురాలైన సోనియాను ప్రధాని అభ్యరి్థగా అంగీకరించేందుకు సీనియర్ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కలత చెందిన సోనియా రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఆమెకు మద్దతుగా నిలిచింది.కార్యకర్తలు నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. చివరికి 1999 మే 20న పవార్, సంగ్మా, అన్వర్‌పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. దాంతో సోనియా రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీ సారథిగా కొనసాగారు. ఈ పరిణామం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. బీజేపీ ‘స్వదేశీ వాజ్‌పేయి – విదేశీ సోనియా’ నినాదాన్ని ఎత్తుకుంది. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌కు అవే తొలి ఎన్నికలు.పవార్ సొంత పార్టీసోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి కాంగ్రెస్ నుంచి బయటకు వచి్చన శరద్‌పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ జూన్ 10న నేషనలిస్ట్ కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలి ఎన్నికల్లోనే 2.27 శాతం ఓట్లతో 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్ అల్లర్లునరేంద్ర మోదీ పాలనలోని గుజరాత్లో 2002 ఫిబ్రవరిలో చెలరేగిన మత ఘర్షణలతో వాజ్‌పేయి సర్కారు బాగా అప్రతిష్టపాలైంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు అల్లరి మూకలు నిప్పంటించడంతో అయోధ్య నుంచి తిరిగొస్తున్న 59 మంది హిందూ భక్తులు మరణించారు. తర్వాత నెల పాటు చెలరేగిన హింసలో వెయ్యి మందికి పైనే చనిపోయారు. ఈ హింసాకాండను వాజ్‌పేయి ఖండించినా దాన్ని అరికట్టలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు.విశేషాలు...► ప్రధానిగా వాజ్‌పేయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట హైవేలను విస్తరించారు. ప్రధాని గ్రామీణ్ సడక్ యోజనతో రూరల్ రోడ్లకు అక్షరాలా మహర్దశ పట్టింది.► టెలికం సేవల విస్తరణకు కీలక అడుగులు పడ్డాయి. లైసెన్స్ ఫీజుల స్థానంలో ఆదాయ పంపిణీ విధానం ప్రవేశపెట్టారు. 2000 సెపె్టంబర్ 15న బీఎస్ఎన్ఎల్ను ఏర్పాటు చేశారు.► ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఏర్పాటైంది. బాల్కో, హిందుస్థాన్ జింక్, ఐపీసీఎల్, వీఎస్ఎన్ఎల్ వంటి అగ్రగామి కంపెనీలను ప్రైవేటీకరించారు.►పెట్రోలియం ధరలపై నియంత్రణ ఎత్తేయడానికి వాజ్‌పేయి సర్కారే బీజం వేసింది.13వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు(మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు బీజేపీ 182కాంగ్రెస్ 114సీపీఎం 33టీడీపీ 29సమాజ్‌వాదీ 26జేడీ(యూ) 21శివసేన 15బీఎస్పీ 14ఇతరులు 109 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికలు ఎందుకింత హాటు?
ఎండలు బాబోయ్ ఎండలు... ఏప్రిల్‌లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు 100 కోట్ల మంది ఓటర్లకు ఈసారి వేసవి సెగ మామూలుగా తగలడం లేదు. ఎన్నికలు ఇలా దంచికొడుతున్న ఎండల్లో జరగడానికి కారణం నూటికి నూరుపాళ్లూ రాజకీయాలే. అవును! తొలి లోక్‌సభ ఎన్నికలు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలంలోనే జరిగాయి. 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అని 20 ఏళ్లుగా ఇదుగో, ఇలా మండే ఎండల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ టు అక్టోబర్... స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1951–52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. నెహ్రూ ప్రధానిగా తొలి లోక్‌సభ 1952 ఏప్రిల్ 17 నుంచి 1957 ఏప్రిల్ దాకా కొనసాగింది. అక్కణ్నుంచి 1980 దాకా లోక్‌సభ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి, లేదంటే మార్చిలోనే జరిగాయి. 1984లో ఇందిర హత్యానంతరం ప్రధాని అయిన రాజీవ్ గాంధీ లోక్‌సభను రద్దు చేయడంతో డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1989లో సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నడవక చివరికి రెండేళ్లకే లోక్‌సభ రద్దయింది. దాంతో 1991 మే, జూన్ నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఎండాకాలంలో జరిగిన తొలి ఎలక్షన్లు అవే. 1996లోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనే ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకే లోక్‌సభ రద్దవడంతో 1998 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాజ్‌పేయి సర్కారు 13 నెలలకే కుప్పకూలి 1999లో ఎన్నికలు సెపె్టంబర్, అక్టోబర్ మధ్య జరిగాయి. ఇప్పుడు మనందరినీ ఠారెత్తిస్తున్న ఎండాకాలపు ఎన్నికలకు 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కారణం. బీజేపీ ఆర్నెల్ల ముందే లోక్‌సభను రద్దు చేసి ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో ఎన్నికలకు వెళ్లింది. అలా ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ మండుటెండల్లో మొదలైన సార్వత్రిక ఎన్నికల సీజన్ ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత 2009, 2014, 2019లోనూ ఎండా కాలంలోనే ఎన్నికలు జరిగాయి. ఇలా రెండు దశాబ్దాలుగా ఏప్రిల్–జూన్ ఎన్నికల ‘వేడి’ కొనసాగుతూ వస్తోంది. మార్చడం కుదరదా? చట్టప్రకారం లోక్‌సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువుదీరాల్సిందే. తదనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్‌సభ కొలువుదీరాలన్నమాట. కనుక ఎన్నికల తేదీలను మరీ ముందుకు, వెనక్కు జరపడం కుదరదు. అంటే మళ్లీ మధ్యంతరమో, ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్ మారబోదు. అప్పటిదాకా మనమంతా ఇలా ఎండల్లో ఓటెత్తకా తప్పదు!! లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరు... ఏడాది పోలింగ్ తేదీలు 1951–52 అక్టోబర్ 25 – ఫిబ్రవరి 21 1957 ఫిబ్రవరి 24 – మార్చి 14 1962 ఫిబ్రవరి 19–25 1967 ఫిబ్రవరి 17–21 1971 మార్చి 1–10 1977 మార్చి 16–20 1980 జనవరి 3–6 1984 డిసెంబర్ 24–28 1989 నవంబర్ 22–26 1991 మే 20 – జూన్ 15 1996 ఏప్రిల్ 27 – మే 7 1998 ఫిబ్రవరి 16–28 1999 సెపె్టంబర్ 5 – అక్టోబర్ 3 2004 ఏప్రిల్ 20 – మే 10 2009 ఏప్రిల్ 16 – మే 13 2014 ఏప్రిల్ 7 – మే 12 2019 ఏప్రిల్ 11 – మే 19 2024 ఏప్రిల్ 19 – జూన్ 1 – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాడు ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరిన వాజ్‌పేయి?
దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎన్నికలు ప్రజాస్వామ్య పండులని అంటుంటారు. దేశంలో 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఇప్పటికీ ఏదోవిధంగా గుర్తుకు తెచ్చుకుంటారు. దేశంలో 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు వింత వైనాలు చోటుచేసుకున్నాయి. నాడు జన్‌సంఘ్ నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఒక ప్లాన్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 లోక్‌సభ ఎన్నికల్లో మథుర, బల్రాంపూర్, లక్నో ఈ మూడు చోట్ల నుంచి పోటీ చేశారు. బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఐదుసార్లు ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి తొలిసారిగా మధుర లోక్‌సభలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన కారణంగానే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఓటమిని తనకు తానుగా ఆహ్వానించుకున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు. ఈ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి బహిరంగ సభలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేవారు. తనకు కాకుండా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌కు ఓటువేయాలని కోరేవారు. ఇలా తాను వెళ్లిన ప్రతీచోటా ప్రత్యర్థికి ఓటు వేయాలని కోరారట. ఎవరైనా అదేమిటని అడిగితే ఆయన తన లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదని, కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని నిర్ధారించడమేనని చెప్పుకొచ్చేవారు. నాటి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజ మహేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. ఆయనకు 95 వేల 202 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దిగంబర్ సింగ్ 69 వేల 209 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. జనసంఘ్‌కు చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి నాలుగో స్థానంలో నిలిచారు. వాజ్‌పేయికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. -
ఓటీటీకి మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న బయోపిక్ మెయిన్ అటల్ హూన్. రవి జాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ మూవీ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈనెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఇందులో పంకజ్ త్రిపాఠి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం గురించి చూపించారు. ఈ చిత్రంలో పీయూష్ మిశ్రా, దయా శంకర్ పాండే, రాజా సేవక్, ఏక్తా కౌల్ పలువురు నటించారు. జనవరి 19, 2024న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు నెలల్లోపే ఓటీటీకి వచ్చేస్తోంది. Shuru karo taiyaari, aa rahe hain Atal Bihari! #MainAtalHoon premieres on 14th March, only on #ZEE5#AtalOnZEE5#MainAtalHoon@TripathiiPankaj @meranamravi @vinodbhanu @thisissandeeps #KamleshBhanushali @thewriteinsaan #BhaveshBhanushali @directorsamkhan @BSL_Films… pic.twitter.com/so934WIZOu — ZEE5 (@ZEE5India) March 10, 2024 -
అద్వానీకి భారత రత్న.. దేశ అత్యున్నత పురస్కారం అందుకుంది వీరే
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం తనకెంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకూ 50 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ జాబితాలో ఇటీవల ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. చదవండి: బీజేపీ ‘రథ యాత్రికుడు’ అద్వానీ! ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 50. ఎల్కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)-2024 -
అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌పై పబ్లిక్ రెస్పాన్స్ ఇదే
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బయోపిక్ (Main Atal Hoon) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి జాదవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'మే అటల్ హూ' అనే పేరుతో థియేటర్లలోకి వచ్చింది. బాలీవుడ్లో టాప్ యాక్టర్‌గా కొనసాగుతున్న పంకజ్ త్రిపాఠి అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రకు జీవం పోశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అటల్ బిహారీ వాజపేయి జీవితం గురించి ఉన్నది ఉన్నట్లు చూపించారని రివ్యూలు వస్తున్నాయి. ఆయన పాత్రలో త్రిపాఠి జీవించేశారని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో నెటిజన్లు సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు త్రిపాఠి, టీమ్‌ను తెరపై లెజెండరీ లీడర్‌గా చూపించినందుకు ప్రశంసించారు. సినిమాపై ప్రశంసలు కురిపించిన ఓ సోషల్ మీడియా యూజర్ పంకజ్ త్రిపాఠి నటన అద్భుతం అని అన్నారు.‘మే అటల్ హూ, అందరూ తప్పక చూడాల్సిన సినిమా’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన ఓ నెటిజన్ ఈ చిత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయిని తెరపై చూపించడం అంత ఈజీ కాదని రాశారు. పంకజ్ త్రిపాఠి తన అద్భుతమైన నటనతో మరోసారి సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని ఆయన నటనకు విస్మయం చెందానని ఒకరు పేర్కొన్నారు. ‘మే అటల్ హూ – పంకజ్ త్రిపాఠి కెరీర్లో ఇప్పటివరకు బెస్ట్ ఫిల్మ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి రవి జాదవ్ దర్శకత్వం వహించారు. వాజ్‌పేయి జీవితం, రాజకీయాల ఆధారంగా 137 నిమిషాల నిడివిగల ఈ చిత్రం పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్షలతో సహా కొన్ని అత్యంత క్లిష్టమైన సమయాల్లో భారతదేశాన్ని నడిపించడంలో అటల్ పాత్రను వర్ణిస్తుంది. వ్యక్తిగత తగాదాలు, కుటుంబ సమస్యలు కూడా బయటపడ్డాయి. అలాగే, సాహిత్యంపై ఆయనకున్న మక్కువను ఈ చిత్రం ఎత్తిచూపింది. దేశానికి అటల్ చేసిన సేవలు తెరపై అద్భుతంగా చూపించారని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఒక రాజనీతిజ్ఞుడిగా భారతదేశానికి అటల్ చేసిన త్యాగాలను కూడా మెయిన్ అటల్ హూన్లో కనిపిస్తాయి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే చలించేలా ఉందని.. ఇందులో దర్శకుడి పనితీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అని తెలుపుతున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా నెమ్మదిగా కథ నడుస్తుంది.. దానిని మీరు తట్టుకోగలిగితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఉత్కంఠతతో కొనసాగుతుందని కొందరు తెలుపుతున్నారు. ఇదొక విజువల్ ట్రీట్ అని పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. చిత్రంలోని మొదటి భాగంలో వచ్చే డైలాగ్‌లు అంతగా ఆకట్టుకోలేదు కానీ ఇంటర్వెల్ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిజమైన పరాక్రమాన్ని వర్ణిస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు. అయోధ్యను రామజన్మభూమిగా ప్రకటించాలనే అంశాలు, ఉద్యమాలు ఇందులో కనిపిస్తాయి. అరుదైన రాజకీయ మేధావిగా ప్రసిద్ధి. అటల్ బిహారీ వాజ్‌పేయి కవిగా, రాజకీయవేత్తగా, మానవతావాదిగా పేరుపొందారు. వాజ్పాయ్ బీజేపీని ప్రభావితం చేసిన నాయకులలో ఒకరు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దేశ పదవ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ప్రమాణ స్వీకారం చేశారు. #OneWordReview...#MainAtalHoon: CAPTIVATING. Rating: ⭐️⭐️⭐️½ It’s tough to make a biopic on a stalwart and encompass pertinent episodes from his lifespan in 2+ hours… #NationalAward-winning director #RaviJadhav achieves it with flourish… #MainAtalHoon is, without doubt, one of… pic.twitter.com/rkR9Ab4pPP — taran adarsh (@taran_adarsh) January 19, 2024 Watch #MainAtalHoon in theatres now!#PankajTripathi actor par excellence pic.twitter.com/4KLugu43Ig — Kungfu Pande 🇮🇳 (Parody) (@pb3060) January 19, 2024 Amazing performance by Pankaj Tripathi. I believe it should’ve rather been a series than a movie. 2 hours is too little for a film to be made on Bharat Ratna Shri Atal Bihari Vajpayee ji 🙏🏻 A must watch film that I’d recommend.#MainAtalHoonReview#MainAtalHoon pic.twitter.com/Td2pJK9EwE — Lohit Kamarajugadda (@Onlylohit) January 19, 2024 Saw #MainATALHoon yesterday at a special screening. “Bharat ka PM, Jung jeetne k baad hi baat karega.” Mind blowing performance by #PankajTripathi do watch in theatres near you pic.twitter.com/f5H8w0Bs7S — Kungfu Pande 🇮🇳 (Parody) (@pb3060) January 17, 2024 #MainATALHoon screening last evening gives u the taller picture of why we too have to be ATAL if we want the BHARAT of our dreams We r close very very close Brilliantly played by #PankajTripathi It is a story of a great leader who began this journey of Nation first Must watch pic.twitter.com/JAzpgey2w0 — Shirin Udhas Aggarwal (@ua_shirin) January 17, 2024 #MainAtalHoonReview | Film #MainAtalHoon is an honest attempt backed by a stellar performance by @TripathiiPankaj who is the heart and soul of the film Rating: ⭐⭐⭐⭐ Once again #PankajTripathi proves that he is an actor par excellence & no one would have done justice to… pic.twitter.com/tCINnZlSV3 — Aashu Mishra (@Aashu9) January 18, 2024 Movie: Main Atal Hoon Rating: ⭐️⭐️⭐️½ Review: ADMIRABLE Pankaj Tripathi delivers one of his career-best in #MainATALHoon 👏 Ravi Jadhav did decent work, @meranamravi 👍#AtalBihariVajpayee #MainAtalHoonReview @TripathiiPankaj #PankajTripathi https://t.co/7JYLQwbCj0 — Simran Kumari (@I_amSimran) January 19, 2024 -
'కశ్మీర్‌కూ గాజా గతే..' ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు
శ్రీనగర్: భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కాశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరుసటి రోజు ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'మన స్నేహితులను మనం మార్చగలం. కాని మన పొరుగు వారిని మార్చలేమని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. మనం మన పొరుగువారితో స్నేహ పూర్వకంగా ఉంటే, ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు' అని గుర్తు చేశారు. 'పాకిస్థాన్‌కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మనమే చర్చలకు సిద్ధంగా లేము. ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకపోతే.. కశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుంది.' అని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా మారిన గుహలను కూల్చివేయాలని సైనికులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులర్పించిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
-
వాజ్ పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని
-
Birthday Special: ‘వాజపేయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు?
నేడు (డిసెంబరు 25) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజపేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయేవిధంగా రాజకీయాలు నడుపుతూ, ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. వాజపేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. హిందీ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజపేయి ఘనత సాధించారు. వాజపేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వాజపేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు.. ఏదో ఒకరోజు అటల్జీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజపేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలుపార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజపేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజపేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజపేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ.. -
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..
పాట్న: బిహార్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్కు పేరును కోకోనట్ పార్క్‌గా మార్చడంపై రాజకీయంగా వివాదానికి దారితీసింది. బిహార్ అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్ పేరును కోకోనట్ పార్క్‌గా సోమవారం అధికారికంగా పేరు మార్చారు. పార్క్ బయట శిలాఫలాకాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. పార్క్‌ను మొదట్లో కోకోనట్ పార్కు పేరుతోనే పిలిచేవారు. 2018లో అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం కోకోనట్ పార్క్‌కు అటల్ పేరును ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వం ఆ పార్కు పేరును కోకోనట్‌గా మార్చడంపై బీజేపీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 'వాజ్‌పేయీ వర్థంతి సందర్భంగా నితీష్ కుమార్ ఇటీవల పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అటల్ పేరుపై ఉన్న పార్కుకు కొత్త పేరును మార్చారు. ఒకే ప్రభుత్వం వాజ్‌పేయీపై విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్కుకు అటల్ పేరును యథావిధిగా ఉంచాలి' అని బీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయంగా వివాదాస్పదం కావడంతో అటల్ పార్కుకు రాకపోకలను నిలిపివేశారు. ఓ వైపు పార్కు బయట కోకోనట్ పేరుతో శిలాఫలకం ఉండగా.. పార్కు బయట వాజ్‌పేయీ పేరు అలాగే ఉంది. ఇదీ చదవండి: 'ఆపరేషన్ హస్త'.. నాయకుల మధ్య పొలిటికల్ వార్.. -
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్‌పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్‌పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్‌పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్‌పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్‌పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్‌పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్‌పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్‌పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్‌జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అరుదైన ఫొటోలు
-
మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
ఢిల్లీ: నేడు(బుధవారం) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ నేపథ్యంలో వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని 'సదైవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. #WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/bYUvCv9Idt — ANI (@ANI) August 16, 2023 నివాళులు అర్పించిన స్పీకర్ ఓం బిర్లా.. #WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/sKhGiQAY2s — ANI (@ANI) August 16, 2023 #WATCH | Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah and Union Minister Nitin Gadkari pay floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/xTzvgIS90f — ANI (@ANI) August 16, 2023 నివాళులు అర్పించిన వాజ్‌పేయి కుటుంబ సభ్యులు.. #WATCH | Delhi: Former PM Atal Bihari Vajpayee's foster daughter Namita Kaul Bhattacharya pays floral tribute at 'Sadaiv Atal', on his death anniversary. pic.twitter.com/YS49n7xyB9 — ANI (@ANI) August 16, 2023 -
విలువల్లోనూ పట్టువిడుపులు!
వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్ చౌధరి. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్ బిహారీ వాజ్‌పేయి మారిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్‌పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్‌పేయి గురించి మనకు తెలుసా? ఇటీవల విడుదలైన వాజ్‌పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్‌పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది. ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్‌పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్ చౌధరి రాసిన ‘వాజ్‌పేయి: ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది. వాజ్‌పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు. చౌధరి అనడం అటల్ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని. ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్ వాదించేవారు’ అని రాశారు. అటల్ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్ కాలమిస్ట్‌లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ పట్ల వాజ్‌పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్ విమర్శించారు’ అని అభిషేక్ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. వాజ్‌పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన డిసెంబర్ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్ రాశారు. అలాగే, అటల్ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్‌పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్ కార్యదర్శి విష్ణు సహాయ్ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది. స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్‌లో జరిగిన క్విట్ ఇండియా నిరసనల్లో వాజ్‌పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్ వారికి అటల్ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్‌పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్ఎల్బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్ డిబేట్లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’. వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా? రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్‌పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సాధికారత కోసమే సాంకేతికత
న్యూఢిల్లీ: సాంకేతికతను సాధికారత సాధించేందుకే సద్వినియోగం చేయాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ సాంకేతికత దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత్ పోఖ్రాన్ అణపరీక్షలు జరిపి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ దేశ చరిత్రలో ఉజ్వలమైన క్షణాల్లో 1998నాటి పోఖ్రాన్ అణుపరీక్షలు కూడా ఒకటి. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నకాలంలో చేసిన అణుపరీక్షలు దేశ శాస్త్రసాంకేతికత సత్తాను చాటడంతోపాటు ప్రపంచస్థాయిలో దేశ ఖ్యాతిని సమున్నత స్థాయిలో నిలిపాయి’ అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా త్వరలో నిర్మంచబోయే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ–ఇండియా(లిగో–ఇండియా)కు శంకుస్థాపన చేసిన దానిని జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అరుదైన ఖనిజాల నుంచి మ్యాగ్నెట్లను తయారుచేయనున్నారు. విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనాలయంసహా ముంబై, నవీ ముంబైలలోని పలు పరిశోధన, ఉత్పత్తి కేంద్రాలను జాతికి అంకితమిచ్చారు. ‘ జామ్(జేఏఎం) ట్రినిటీ, కోవిన్ పోర్టల్, రైతులకు డిజిటల్ మార్కెట్ ఇలా ప్రతి రంగంలో సాంకేతికతను భారత ప్రభుత్వం సాధికారత, సామాజిక న్యాయం కోసమే వినియోగిస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు కాదు. శాస్త్ర,సాంకేతిక రంగ పురోభివృద్ధికి ఎంతగానో మా సర్కార్ కృషిచేస్తోంది. పదేళ్ల క్రితం ఏటా 4,000 పేటెంట్లు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 30వేలకు చేరుకుంది. గతంలో ఏటా 70వేల ట్రేడ్‌మార్క్‌లు నమోదయ్యేవి. ఇప్పుడవి 2.5లక్షలపైమాటే. ఇంక్యుబేషన్ కేంద్రాల సంఖ్య ఎనిమిదేళ్ల క్రితం 150 ఉంటే ఇప్పడవి 650కి చేరుకున్నాయి’ అని మోదీ అన్నారు. -
నెహ్రూ హిందువు కాదంటారా?
నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసే హిందువు కాదు నెహ్రూ. కానీ హిందూ ఆధ్యాత్మికత, మార్మికతలపై ప్రగాఢమైన ఆసక్తులతో పెరిగారు. హిమాలయాలు, గంగానది భారతీయ నాగరికతకు ఉయ్యాలలు అని నెహ్రూ చేసిన అభివర్ణన మనల్ని వాటి దివ్యత్వంలో ఓలలాడిస్తుంది. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందువని సంఘ్ పరివార్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. తప్పుడు సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించడంలో బీజేపీలోని కేంద్రీకృత సోషల్ మీడియా కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో సమర్థంగా పని చేస్తుంటుందని ఢిల్లీ కాలేజీలో పాఠాలు చెబుతుండే నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఢిల్లీ నుంచి పంపిన సమాచారం వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా దేశం మొత్తానికి చేరుతుంది. ఉదాహరణకు, నేనొకసారి బిహార్‌లోని నా గ్రామస్థులు కొందరిని...‘విద్య వల్ల నేను ఆంగ్లేయుడిని, సంస్కృతి వల్ల మహమ్మదీయుడిని, యాదృచ్ఛికంగా మాత్రమే హిందువును’ అని ఒక నాయకుడు చెప్పుకున్నారని అంటారు. ఆ నాయకుడెవరో మీకు తెలుసా?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు తటాలున వచ్చిన సమా ధానం: ‘నెహ్రూ’! భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అంటే గిట్టని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ ‘హిందూ మహాసభ’ 1950లో తొలి సారి, ‘‘నెహ్రూ విద్య చేత ఆంగ్లేయుడు. సంస్కృతి చేత మహమ్మ దీయుడు. యాదృచ్ఛికంగా మాత్రమే హిందువు’’ అని విమర్శించింది. తదనంతర కాలంలో ఆ మాటను నెహ్రూను ద్వేషించేవారంతా నెహ్రూకే ఆపాదించి, స్వయంగా ఆయనే తన గురించి ఆ విధంగా చెప్పుకొన్నట్లు ప్రచారంలోకి తెచ్చారు. గత ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘‘యాదృచ్ఛికంగా మాత్రమే తాము హిందువులమని చెప్పుకున్న వారి వారసులు తమను తాము హిందువులమని చెప్పు కోకూడదు’’ అని రాహుల్ గాంధీపై చురకలు వేయడంతో ఉద్దేశ పూర్వకమైన ఆ ఆపాదింపునకు పునరుద్ధరణ జరిగినట్లయింది. సుసంపన్న భారత ఆనవాళ్లు నెహ్రూ నిజంగానే హిందువులకు వ్యతిరేకిగా ఉన్నారా? ఆయన జీవితాన్ని తరచి చూసిన ఏ సత్యాధ్యయనమైనా వంచనాపూరితమైన ఈ దుష్ప్రచారాన్ని బహిర్గతం చేస్తుంది. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ (1934), ‘యాన్ ఆటోబయాగ్రఫీ’ (1936), ‘ద డిస్క వరీ ఆఫ్ ఇండియా’ (1946) మూడూ ప్రభావశీలమైనవి. డిస్కవరీ ఆఫ్ ఇండియా కారాగార వాసంలో రాసిన ఒక క్లాసిక్. (బ్రిటిష్ వాళ్లు ఆయన్ని 14 సార్లు జైలుకు పంపారు. 3,259 రోజులు కటకటాల వెనుక గడిపారు.) ఆయన ప్రసంగ సంకలనాలు, వ్యాసాలు, లేఖలు (పక్షానికొకసారి ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖలే ఐదు భారీ సంపుటాలు అయ్యాయి!) ... ఇవన్నీ కూడా ఇస్లాం, ఇతర బాహ్య ప్రభావాల చేత సుసంపన్నమైనదిగా నెహ్రూ భావించిన భారతదేశం తాలూకూ ప్రాచీన హిందూ నాగరికత సార్వత్రికత, సమగ్రతలతో నిండి ఉన్నవే. రామాయణ, మహాభారత, భగవద్గీతల పట్ల నెహ్రూకు ఉన్న ప్రీతి, గౌరవ ప్రపత్తులకు సాక్ష్యాల వెల్లువలు ఆయన రచనల్లో కనిపి స్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, తదితర గ్రంథాలలోని మన రుషుల జ్ఞానం, భక్తియుగంలోని సాధువులు, కవులు, సంఘ సంస్కర్తలు; రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, మహర్షి అరబిందో, ఆధునిక కాలంలో జాతీయతా భావం మేల్కొనేందుకు దోహదపడిన ఇతర హిందూ తాత్విక మహర్షుల గొప్పదనాన్ని నెహ్రూ రచనలు దర్శింపజేస్తాయి. ఇక తన గురువు, హిందూ మతబోధనలతో జీవిత మార్గాన్ని ఏర్పరచిన మహాత్మాగాంధీపై ఆయనకున్న గురి ఎంతటిదో తెలిసిందే. నెహ్రూ తన చివరి సంవత్సరాలలో ఉపనిషత్తులపై చర్చించడానికి తరచు తనను కలిసేందుకు వచ్చేవారని భారత రాష్ట్రపతి (1962–67), హిందూ తాత్వికతపై ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలకు రచయిత అయిన ఎస్.రాధాకృష్ణన్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఆలోచనల ప్రతిధ్వనులు నెహ్రూ ప్రాపంచిక దృక్పథానికి, ఆయన కాలం నాటి కొందరు జనసంఘ్ హిందూ నాయకుల దృష్టి కోణానికి మధ్య స్పష్టమైన సారూప్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు, బీజేపీ తన సైద్ధాంతిక మార్గదర్శిగా పరిగణించే పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రంథం ‘ఇంటెగ్రల్ హ్యూమనిజం’... పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు వ్యవస్థలను విడిచిపెట్టి భారతదేశం సమగ్ర అభివృద్ధి మార్గాన్ని అనుసరించాలన్న నెహ్రూ ఆలోచనను ప్రతిధ్వనిస్తుంది. నెహ్రూ మాదిరిగానే దీన్‌దయాళ్ కూడా మన ప్రాచీన సంస్కృతిలో మంచిది ఏదో దానిని తీసుకుని, అందులోని చెడును రూపుమాపడానికి సంసి ద్ధమవడాన్ని గర్వంగా భావించాలని చెప్పారు. ఆయన ఇలా రాశారు: ‘‘మనం మన ప్రాచీన సంస్కృతిలోని ప్రత్యేకతను గుర్తించకపోలేదు. అలాగని మనం పురావస్తు శాస్త్రజ్ఞులం కాలేము. విస్తారమైన ఈ పురావస్తు మ్యూజియానికి సంరక్షకులం కావాలన్న ఉద్దేశం కూడా మనకు లేదు. మన సమాజంలో విలువలను, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి అవసరమయ్యే కొన్ని సంస్కరణలైతే చేయాలి. అందుకోసం కొన్ని సంప్రదాయాలకు స్వస్తి చెప్పాలి’’. నెహ్రూకు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, మోదీ–పూర్వపు బీజేపీ లలోని నెహ్రూ విమర్శకులకు మధ్య తీవ్రమైన కొన్ని విభేదాలు ఉండొచ్చు. వాటిని దాచేయలేం. కానీ ఇప్పుడు నెహ్రూపై మనం చూస్తున్న క్రూర, విషపూరితమైన దూషణలు అప్పుడు లేవు. 1964 మేలో ఆయన మరణించినప్పుడు పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి... ‘‘తన ముద్దుల యువరాజు దీర్ఘ నిద్రలోకి కనురెప్పలు వాల్చడంతో భరతమాత శోక సముద్రంలో మునిగిపోయింది’’ అని ఘనంగా నివాళులు అర్పించారు. నెహ్రూను శ్రీరామచంద్రుడితో పోలుస్తూ, ‘‘వాల్మీకి గాథలో కనిపించే గొప్ప భావనలు మనకు పండిట్జీ జీవితంలో లభిస్తాయి’’ అన్నారు. ‘‘రాముడిలా నెహ్రూ కూడా అసాధ్యమైన, అనూహ్యమైన వాటికి రూపకర్త. ఆయన వ్యక్తిత్వ బలం, ఆ చైతన్యం, మనోస్వేచ్ఛ; ప్రత్యర్థికి, శత్రువుకు సైతం స్నేహ హస్తం చాచే గుణం, ఆ పెద్ద తరహా, ఆ గొప్పతనం బహుశా భవి ష్యత్తులో కనిపించకపోవచ్చు’’ అని నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ ‘గురూజీ’ గోల్వాల్కర్... నెహ్రూ దేశభక్తిని, మహోన్నతమైన ఆదర్శవాదాన్ని కొనియాడుతూ, ఆయనకు ‘భరత మాత గొప్ప పుత్రుడి’గా హృదయపూర్వక అంజలులు ఘటించారు. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు బలమైన పునాది వేసినందుకు ఎల్.కె. అద్వానీ తరచు నెహ్రూను ప్రశంసించేవారు. 2013లో ఆయన తన బ్లాగులో, ‘‘నెహ్రూ లౌకికవాదం హైందవ పునాదులపై ఆధార పడి ఉంది’’ అని విశ్లేషించారు. అలాగే, తీవ్ర మనో వేదనతో నెహ్రూ అకాల మరణం చెంద డానికి కారణం అయిన (1962 చైనా దురాక్రమణ యుద్ధంలో) భారత్ పరాజయం తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్లను తిరిగి అంచనా వేయడం ప్రారంభించారనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన మరణానికి కొద్ది వారాల ముందు జర్నలిస్టుల బృందంతో జరిపిన సంభాషణలో కమ్యూనిస్టు అనుకూల వార్తా పత్రిక అయిన ‘ది పేట్రియాట్’ ప్రతినిధి జనసంఘ్‌ను ‘జాతీయ వ్యతిరేక పార్టీ’ అనడంతోనే నెహ్రూ ఆ ప్రతినిధిని వారించారు. ‘‘కాదు, జనసంఘ్ దేశభక్త పార్టీ’’ అని బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ నెహ్రూ హిందుత్వాన్ని జనసంఘ్, కాంగ్రెస్ రెండూ మరిచిపోయాయి. బదులుగా అవి తమ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని నిరంతరంగా ఆరున్నరొక్క రాగం తీస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ నాగరికతను యుగయుగాలుగా నిలబెట్టిన ప్రత్యేక లక్షణం ‘సమన్వయాన్ని సాధించగల సామర్థ్యం’, ‘వ్యతిరేకతల్ని పరిష్కరించు కోవడం’, ‘ఒక కొత్త కలయిక’ అని వారు గుర్తుంచుకోవాలి. రెండు ధ్రువాలుగా విడిపోతున్న నేటి ప్రమాదకర కాలానికి... జాతి ప్రయోజ నాల కోసం ‘సంవాదం’ (సంభాషణ) ద్వారా ‘సమన్వయం’ సాధించిన నెహ్రూ ఆదర్శప్రాయులు. సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త మాజీ ప్రధాని వాజ్‌పేయి సహాయకులు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
బడ్జెట్: వాజ్‌పేయి చొరవ వల్లే.. అది ఇప్పటికీ అమలు
ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది. ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. గతంలో కంటే కాస్తలో కాస్త జనాలకు ఊరట ఇచ్చే ప్రయత్నమే చేసింది కేంద్రం. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న ఓ చారిత్రక నిర్ణయం ఇప్పటికీ బడ్జెట్ సందర్భంలో ప్రస్తావనకు వస్తుంటుంది. అదేంటో తెలుసా?.. ఈయన హయాంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. ఫిబ్రవరి చివరి తేదీన సాయంత్రం వేళలో బడ్జెట్ ప్రవేశపెట్టడం బ్రిటిష్ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ, వాజ్‌పేయి ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చేసింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా.. 1999లోనే ఉదయం 11 గంటల ప్రాంతంలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని మొదలుపెట్టారు. అలాగే ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే మరో సంప్రదాయానికి 2017లో పుల్‌స్టాప్ పడింది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ.. ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మొదలుపెట్టారు. స్వాతంత్య్ర భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈ జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు. మోదీ 2.0 టీంలో 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారాయన. 1962-69 మధ్య.. ఆయన చేతుల మీద కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి ప్లేస్‌లో పీ చిదంబరరం, ప్రణబ్ ముఖర్జీ(8), యశ్వంత్ సిన్హా(8), మన్మోహన్ సింగ్(6) ఈ జాబితాలో ఉన్నారు. -
పీవీ మధ్యే మార్గమే దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు సంజయ్ బారు అభిప్రాయడ్డారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది... అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది కూడా పీవీ, వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ల ఏలుబడిలోనే అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ శనివారం ఏర్పాటు చేసిన పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1950ల నుంచి 2015 వరకూ దేశ ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే.. 2000 – 2015 మధ్యకాలంలోనే సగటు ఆర్థికాభివృద్ధి అత్యధికంగా 7.5 శా తంగా నమోదైందని, ఈ కాలంలోనే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2015 తరువాత వృద్ధి తిరోగమనంలో ఉందని, కోవిడ్–19 విజృంభించిన ఏడాది రుణాత్మక వృద్ధిని మినహాయిస్తే 2014– 2023 మధ్యకాలంలో సగటున 6 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని చెప్పారు. 1990లో ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభా వం 2000 సంవత్సరం నుంచి కనిపించడం మొదలైందని అన్నారు. మధ్యే మార్గంతో వృద్ధి పథంలోకి... 1990 వరకూ దేశంలో పేరెన్నిక కంపెనీలంటే ఓ వందకు మించి ఉండేవి కాదని, టాటా, బిర్లాలు, మోడీ, గోయాంకా, సింఘానియా, థాపర్లు వంటి పేర్లే ప్రతి రంగంలోనూ వినిపించేవని సంజయ్ బారు గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించడం మొదలుపెట్టి.. పరిశ్రమల శాఖ మంత్రిగా వాటి అమల్లోనూ ముందున్న ఫలితంగా అంబానీలు మొదలుకొని మహింద్రా, ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్, టీవీఎస్ గ్రూపు వంటి దిగ్గజాలు ఎదిగాయని చెప్పారు. పీవీ ప్రధానిగా రోజుకో సవాలును ఎదుర్కొన్నా మధ్యే మార్గమన్న తారకమంత్రంతో వాటి ని అధిగమించారని రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ ఇదే రీతిన పాలన సాగిందని చెప్పారు. ఆధిపత్య రాజకీయాలతో చేటు...: పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్‌లు భారత జాతీయత పునాదులను పటిష్టం చేయడం ద్వారా ఆర్థికంగాఎదిగేందుకు సాధికారికంగా మెలిగేందుకు కారణమయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక ఆధిపత్యభావజాలం ఈ దేశానికి గతంలోనూ నష్టం కలుగజేసిందని, ఇప్పుడు జరిగేది కూడా అదేనని, దేశ కీర్తిని గతంలో తగ్గించినట్టే ఇప్పుడూ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ తరహాలోనే అందరినీ కలుపుకుని పోయే రాజకీయాలు, మధ్యేమార్గాలు మాత్రమే మనల్ని రక్షించగలవని సంజయ్‌బారు అభిప్రాయపడ్డారు. భారత రత్నకు అన్ని విధాలుగా అర్హుడు పీవీ అని.. మన్మోహన్ ఏలుబడిలో ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మా శర్మ తదితరులు పాల్గొన్నారు. -
Youth Parliament: అయామ్ మౌనిక
యూత్పార్లమెంటులో ప్రసంగించిన మన గిరిపుత్రిక పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.. అయామ్ మౌనిక... ఫ్రం తెలంగాణ.. అని పరిచయం చేసుకుని వాజ్‌పేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మౌనిక గురించి... దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్‌పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురికి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దొరికింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు, ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకుంది మౌనిక. చురుకైన ప్రసంగాలు... రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్లు్య చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్‌గా, తల్లి సునీత బీడీ కార్మికురాలిగా కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మౌనిక ఆర్కే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌రెడ్డి ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన యూత్పార్లమెంటుకు ఎన్నికైన యువతులతో మౌనిక యూత్ పార్లమెంటు కోసం.. దేశవ్యాప్తంగా యూత్పార్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు. మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం వచ్చింది. మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా ‘మేకిన్ ఇండియా– మేడిన్ ఇండియా’ అంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాత జిల్లా స్థాయి పోటీల్లో ‘స్టార్టప్ ఇండియా– స్టాండప్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది. ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.... యూత్ పార్లమెంటులో భాగంగా ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. దీంతో ‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’ అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. దివంగత ప్రధాని వాజ్‌పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది. యూత్ పార్లమెంటుకు ఎంపికై, తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
దేశాభివృద్ధిలో రాజీలేని తత్వం వాజ్‌పేయిది
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశ రక్షణ అవసరాల పరంగానూ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి రాజీ పడలేదని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి విషయంలో ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవహరించారన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం సుపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి వాజ్‌పేయి చేసిన కృషి మరువలేనిదని ‘స్వర్ణ చతుర్భుజి’ కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం చూపారన్నారు. నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసిన హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ ఫలాలను ఇప్పుడు ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు. 60 ఏళ్లు పైబడిన పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి సంక్షేమ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. గ్రామాలను కలుç³#తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రాథమిక, మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించేందుకు సర్వశిక్షా అభియాన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వాజ్‌పేయి హయాంలో ప్రారంభమయ్యాయన్నారు. అణుపరీక్షల వేళ ప్రపంచంలోని పెద్ద శక్తులు వాజ్‌పేయిపై విరుచుకుపడగా ఐదు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత అణుశక్తి దేశంగా భారత్‌ను ప్రకటించారని గుర్తు చేసారు. వాజ్‌పేయి ధైర్యవంతమైన చర్యల ఫలితంగా ప్రవాస భారతీయులు గర్వంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉపకార్యదర్శి నారాయణస్వామి, పలువురు మాజీ సైనికాధికారులు పాల్గొన్నారు. -
విలువల రాజకీయానికి మారుపేరు వాజ్‌పేయి
సాక్షి, హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంట రీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్య వర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి వాజపేయి సిద్ధాంతాలే కారణమన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజపేయి పెట్టింది పేరని పేర్కొన్నారు. ప్రధానిగా వాజ్‌పేయి ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. వాజపేయి జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, బండా కార్తీకరెడ్డి, కె.రాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023 క్యాలెండర్‌ని బండి సంజయ్ విడుదల చేశారు. -
Good Governance Day 2022: కలుపుకొని పోవడమే సుపరిపాలన
ఈ రోజు క్రిస్మస్ – యేసు క్రీస్తు పుట్టిన రోజు. ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం అనే ఆయన బోధనలు మాన వాళికి జీవనాడి లాంటివి. ఈ సందర్భంగా దేశ ప్రజలంద రికీ... ముఖ్యంగా క్రైస్తవ పౌరు లకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. మన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా 1924లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇదే రోజున జన్మించడం యాదృచ్ఛికం! ఆయన శాంతి, సహ జీవనం, కరుణ, అందరికీ గౌరవం, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజ నీతిజ్ఞుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, దార్శనికుడుగా ప్రసిద్ధులు. వాజ్‌పేయి 1932లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో ప్రచారక్ అయ్యారు. 1951లో భారతీయ జనసంఘ్‌లో సభ్యత్వం పొందడం ద్వారా అధికారి కంగా రాజకీయాల్లో చేరారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల ద్వారా ఆయన ఎంతో స్ఫూర్తి పొందారు. 1957లో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ నుంచి ఎన్నికై... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా పార్ల మెంట్లో ఆయన చేసిన చర్చోపచర్చలకు ముగ్ధులై వాజ్‌పేయి తన స్థానాన్ని ‘ఒక రోజు’ ఆక్రమిస్తారని అంచనా వేశారు. 1980లో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, వివిధ ముఖ్యమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల అధిపతిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి తన అత్యుత్తమ సేవలను అందించారు. ఆయన ‘నేషన్ ఫస్ట్’ అనే విశ్వాసానికి ముగ్ధుడై, అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్య రాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించవలసిందిగా కోరారు. దౌత్య విషయాలపై ఆయన సాధికారత అద్భుతమైనది. 1996లో ఆయన బీజేపీ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. అతి కొద్దిరోజులే ఆయన ప్రభుత్వం ఉంది. తరువాత 1998లో మళ్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పోఖ్రాన్ వద్ద భారత్ రెండో దఫా అణుపరీక్షలను నిర్వహించింది. ఒకవైపు దేశ భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆయన చూశారు. లాహోర్ బస్సు యాత్ర చేపట్టడం, ఆగ్రా శిఖరాగ్ర సమావేశానికి పర్వేజ్ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించడం వంటివి ఆయన సాహసోపేత విధానంలో కొన్ని మెరుపులు. తర్వాత కార్గిల్ యుద్ధంలో ఆయన నాయకత్వంలో పాక్‌పై విజయం సాధించడం ముదావహం. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతులను ఉన్నతీకరించడానికి కృషి చేశారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సరళీకరణ స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయి, మరిన్ని భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడానికి ఏకంగా ప్రత్యేక ‘పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ’ను సృష్టించారు. 6–14 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడానికి ‘సర్వశిక్షా అభియాన్’ను ప్రారంభిం చడం చారిత్రక నిర్ణయం. దేశంలో నదులను అను సంధానించాలనేది ఆయన చిరకాల వాంఛ. ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్ట్, ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ ద్వారా రహదారుల నిర్మాణానికి గొప్ప ఊపునిచ్చారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో, పార్లమెంట్లో, అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సహాధ్యాయిగా ఉన్న నాకు... ఆయన ఒక నిష్ణాతుడైన రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ, అంకితభావం ఉన్న నాయకు డిగా తెలుసు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంత రాయం కలిగించే ప్రయత్నానికి ఎప్పుడూ ఆయన మద్దతు ఇవ్వలేదు. లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేస్తూ బిహార్‌లో అరెస్టు అయినప్పుడు నేను పార్ల మెంటు సభ్యుడిగా ఉన్నాను. ఆ సంద ర్భంగా వారం రోజులకు పైగా పార్లమెంట్ కార్య కలాపాలకు అంతరాయం ఏర్ప డింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో వాజ్‌పేయి మాట్లాడుతూ... ‘పార్ల మెంటు చర్చోప చర్చలకు వేదిక. మనం చర్చకు అనుమతించాలి. మన రాజకీయ పోరాటం పార్లమెంటు వెలుపల జర గాలి...’ అన్నారు. వాజ్‌పేయి దార్శనికతను అందిపుచ్చు కుని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ వెనుకబడి ఉండకూడదు అన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ కల త్వరగా సాకారం అవ్వ డానికి సుపరిపాలన అందిస్తున్నారు. జన్‌ధన్–ఆధార్– మొబైల్ అనేవి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చాయి. వాజ్‌పేయి జయంతిని ‘జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా, ప్రజలు, నాయకులు, అధికారులు... దేశం పట్ల భక్తినీ, సమాజం పట్ల గౌరవాన్నీ కలిగి ఉండాలి. బలమైన, ఆరోగ్యకర మైన, అందరినీ కలుపుకొని పోయే దేశ నిర్మాణమే వాజ్‌పేయికి నిజమైన నివాళి. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పరిపాలనతో మాత్రమే భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్ద గలుగుతాం! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు జాతీయ సుపరిపాలనా దినోత్సవం) -
Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
వాజ్‌పేయి వర్ధంతి: రాజకీయ దురంధరుడికి ఘన నివాళి
అటల్ బిహారీ వాజ్‌పేయి.. ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా, అశేష జనాదరణ ఉన్న ప్రముఖుడిగా గుర్తింపు ఉన్న వాజపేయి వర్ధంతి నేడు.. ఆగస్టు 16వ తేదీన అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ సందర్భంగా.. ప్రముఖులంతా ఈ ఉదయం ఆయన సమాధి ఉన్న న్యూఢిల్లీ స్మారక స్థలం ‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించారు. మాజీ ప్రధాని సమాధి వద్ద.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా.. పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ తదితరులతో పాటు వాజ్‌పేయి దత్తత కూతురు నమితా కౌల్ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/044qWd9R6y — ANI (@ANI) August 16, 2022 #WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/FKBbnrhjbe — ANI (@ANI) August 16, 2022 #WATCH | Delhi: Former PM, late #AtalBihariVajpayee's foster daughter Namita Kaul Bhattacharya pays floral tribute at 'Sadaiv Atal', on his death anniversary today. pic.twitter.com/NOzmLqdZLC — ANI (@ANI) August 16, 2022 ఇదీ చదవండి: వాజ్‌పేయి చివరిసారిగా జనాలకు కనిపించింది ఎప్పుడంటే.. -
నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు. We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide . — Subramanian Swamy (@Swamy39) August 3, 2022 చైనా పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తైవాన్ భూభాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. చదవండి: కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం! -
అటల్ బిహారి వాజ్‌పేయిగా విలక్షణ నటుడు !
Pankaj Tripathi Lead Role In Atal Bihari Vajpayee Biopic: దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో రూపొందనుంది. ఈ బయోపిక్కు 'మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే-అటల్' అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉల్లేక్ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బయోపిక్ చిత్రంలో ప్రధాన పాత్రలో విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించనున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే పంకజ్ త్రిపాఠీ.. అటల్ బిహారీ వాజ్‌పేయిగా నటిస్తే కచ్చితంగా న్యాయం చేయగలరని సినీ విశ్లేషకులు చెబుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాను 2023, డిసెంబర్ల 25న అటల్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ‘Main Rahoon Ya Na Rahoon, Yeh Desh Rehna Chahiye – Shri Atal Bihari Vajpayee.’ Presenting #ATAL, a film on the life story of India’s most exemplary leader, renowned poet, and visionary.@thisissandeeps @directorsamkhan #KamleshBhanushali #VishalGurnani #JuhiParekhMehta pic.twitter.com/J2Db2l32iy — Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022 -
తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..
Biopic On Late PM Atal Bihari Vajpayee: దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. 'మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే-అటల్' అనే టైటిల్‌తో వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మంగళవారం (జూన్ 28) ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఉల్లేక్ ఏన్‌పీ రాసిన 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంకా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభించి, క్రిస్మస్కు విడుదల చేయాలనుకుంటున్నారు. అటల్ పుట్టినరోజు డిసెంబర్ 25. వచ్చే ఏడాది 99వ జయంతి సందర్భంగా ్టల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్.. ‘Main Rahoon Ya Na Rahoon, Yeh Desh Rehna Chahiye – Shri Atal Bihari Vajpayee.’ Presenting #ATAL, a film on the life story of India’s most exemplary leader, renowned poet, and visionary.@thisissandeeps @directorsamkhan #KamleshBhanushali #VishalGurnani #JuhiParekhMehta pic.twitter.com/J2Db2l32iy — Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022 @zeeshan01ahmad @shivvsharma0706 @BSL_Films @legendstudios_ @HitzMusicoff @70mmtalkies @penguinindia pic.twitter.com/0VLWPZWEU6 — Vinod Bhanushali (@vinodbhanu) June 28, 2022 -
ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ
తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూ ఎంపికను వైఎస్సార్సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్ ఒక వాదాన్ని లేవ దీసింది. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు.అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్‌ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్‌ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్ యాదవ్ చేసిన సూచనకు అంగీకరించి వాజ్‌పేయి కలామ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు. పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! -
వాజ్‌పేయికి ఆలయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్‌పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది. -
వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన...బిశ్వభూషణ్ హరిచందన్
-
15–18 ఏళ్ల వారికీ కోవిడ్ టీకా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు(ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కోవిడ్‌పై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. లోతైన అధ్యయనం తర్వాతే.. కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. సైంటిస్టులు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయూ పడకలు సిద్దమని, దేశవ్యాప్తంగా 3వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, 4 లక్షల ఆక్సిజన్ సిలెండర్లు దేశమంతా సరఫరా చేశామని తెలిపారు. భారత్‌లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు. దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించాం. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాం. – మోదీ -
జాతి మరువని విరాణ్మూర్తి
నేడు క్రిస్మస్ పర్వదినం. సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్ అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. జాతీయవాద లక్ష్యం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఆయన హయాంలో తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని ప్రతిపక్షాలు భావించేవి. మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్, నదుల అనుసంధానం, స్వర్ణచతుర్భుజి, ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన వంటివి ఆయన మానస పుత్రికలు. వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. నేడు క్రిస్మస్. మానవులందరికీ ప్రేమ, కారుణ్యం, మానవీయతా సందేశాన్ని అందించే పర్వదినమిది. బహుముఖ రాజకీయ వ్యక్తిత్వం కలిగిన విశిష్టమూర్తి, కవి, జర్నలిస్టు, రాజనీతిజ్ఞుడు, న్యాయం, సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్ అయిన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. ఆయన జాతీయవాద లక్ష్యం కోసం మనస్ఫూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. తనకుతానుగా ఆయన ఒక సంస్థ. అయస్కాంత సదృశమైన మూర్తిమత్వంతో దేశ ప్రజల హృదయాలను ఆయన ఆకర్షించారు. అసమానమైన అనురక్తితో ఆయన ప్రజల హృదయ సామ్రాట్ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాజ్‌పేయి భారతీయ అజాతశత్రువు. ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, వాజ్‌పేయి అందరికీ సన్నిహితుడు. రాజకీయాల్లో అయనకు శత్రువులు లేరు. ఆయన జాతీయవాద స్ఫూర్తి, దేశభక్తి అందరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఆయన వాగ్దాటి, భావ వ్యక్తీకరణా శైలి అత్యంత సహజంగానూ, స్వతస్సిద్ధంగానూ ఉంటాయి. రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇష్టపడేవారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తనపై విమర్శలను కూడా ఆయన నమ్రతతో ఆమోదించేవారు. పారదర్శకతను ఆయన ఎంతో దృఢంగా విశ్వసించేవారు. సుపరిపాలన లక్ష్యాన్ని ఆయన మనసారా ఆకాంక్షించేవారు. అందుకే ఆయన జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిన పాకిస్తాన్‌తో భారత్ యుద్ధ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీని వాజ్‌పేయి ప్రశంసించారు. ఆమె తండ్రి భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని వాజ్‌పేయి గొప్పగా ప్రశంసించేవారు. దేశాన్ని దేవాలయంగా భావించే వాజ్‌పేయిని భవిష్యత్తు దార్శనిక నేతగా నెహ్రూ ఆనాడే దర్శించారు. అన్నిటికంటే దేశం ముందు అనేది వాజ్‌పేయి జీవితాంతం పాటించిన ఆదర్శం. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. లక్షలాదిమంది కార్యకర్తలనూ, ఇతరులనూ అది ప్రభావితం చేయడమే కాకుండా వారిలో జాతీయవాద బీజాలను నాటింది. పార్టీ, రాజకీయాలు, పదవులు, హోదాలు ఏవీ శాశ్వతం కాదనే విషయంపై ఆయన ఎంతో స్పష్టతతో ఉండేవారు. దేశం, ప్రజాస్వామ్యం ఆయనకు అత్యంత ప్రధానమైన అంశాలు. పార్లమెంట్ ఒక చర్చా, సంభాషణా స్థలమే తప్ప పోరాట స్థలం కానీ సవాళ్లు విసిరే స్థలం కానీ కాదని ఆయన నమ్మకం. కులం, రంగు, మతం, ప్రాంతంకి సంబంధించిన సంకుచిత భావాలకు అతీతంగా ఆయన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారు. రాజకీయాల ప్రధాన దృష్టి దేశంపైనా, అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోయే దేశాభివృద్ధిపైన మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయం. రాజకీయ పాలన పట్ల వాజ్‌పేయి వైఖరి ఎంత సమ్మిళితంగా ఉండేదంటే, ప్రతిపక్షాలు తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని భావించేవి. అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ వంటి 23 పార్టీలతో కూడిన నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)ని ఆయన ఎంతో విజయవంతంగా నిర్వ హించారు. ఆయన పాలనా కాలం భారత రాజకీయాల్లో ఒక చారిత్రక ప్రయోగం. రాజకీయాల్లో కలిసి పనిచేయడంలో విజయవంతమైన, విశిష్టమైన ప్రయోగం అది. జనతా పార్టీ ప్రభుత్వంలో వాజ్‌పేయి భారత విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. అన్నిటికంటే దేశం ముందు అనే ఆయన రాజకీయ విశ్వాసంతో ప్రభావితుడైన నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధి బృందంలో వాజ్‌పేయిని చేర్చారు. దౌత్య, విదేశీ వ్యవహారాలపై ఆయన సాధికారత మహత్తరమైనది. 1998లో పోఖ్రాన్–2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా, తదితర దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినప్పటికీ వాజ్‌పేయి చెక్కుచెదరలేదంటే ఇదే కారణం. చైనాతో సరిహద్దు వివాదాలను తగ్గించుకుని వాణిజ్య బంధాలను మెరుగుపర్చుకున్నారు. మూడు తరాల చైనా నాయకత్వంతో (మావో సేటుంగ్, డెంగ్ జియావోపింగ్, హూ జింటావో) వాజ్‌పేయి వ్యవహరించారు. అలాగే పెర్వేజ్ ముషారఫ్‌ని ఆగ్రా సదస్సుకు ఆహ్వానించడం ద్వారా పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కూడా ఆయన సాహసించారు. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. టెలికాం రంగంలో పలు సంస్కరణలను మొదలెట్టడం ద్వారా ఆయన మొబైల్, ఫోన్ అనుసంధానతను విప్లవీకరించారు. 1999లో కార్గిల్ ఘర్షణ వంటి ఘటనలతో 1998–2004 మధ్య కాలంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, 1999–2000 మధ్య రెండు తుఫానులు, 2002–2003లో కరువుతో, చమురు సంక్షోభంతో దేశం విలవిల్లాడిపోయినప్పటికీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం 8 శాతం వృద్ధితో స్థిరమైన ఆర్థిక ప్రగతిని కొనసాగించింది. దేశంలో 6–14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించే సర్వ శిక్షా అభియాన్ పథకం ప్రారంభించడానికి వాజ్‌పేయి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ప్రారంభంతో బడి మధ్యలోనే మానేస్తున్న పిల్లల సంఖ్య 60 శాతానికి పడిపోయింది. నదుల అనుసంధాన ప్రాజెక్టు అనేది వాజ్‌పేయి చిరకాల స్వప్నాల్లో ఒకటి. అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా రహదారుల మౌలిక వసతుల కల్పనకు ఆయిన భారీగా ప్రోత్సాహం అందించారు. ఇకపోతే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన్ పథకం ద్వారా ఇవాళ మన గ్రామాలు సర్వకాలాల్లోను ఉపయోగంలో ఉండే రహదారులతో అనుసంధానమైన విషయం కూడా మనకు తెలుసు. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన ద్వారా ఉద్యోగాల కల్పనకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్ కల్పించే నిబంధనను పునరుద్ధరించారు. ఆనాడు వాజ్‌పేయి ప్రదర్శించిన దార్శనికతను నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తార్కిక ముగింపువైపు తీసుకుపోతున్నారు. అందరికీ హితం చేకూర్చే పరిపాలన ద్వారా దేశంలో ఏ ఒక్కరినీ వెనకబడకుండా పురోగమించేలా చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే స్వప్నాన్ని వీలైనంత త్వరగా ఫలింప చేశారు. జన్‌ధన్–ఆధార్–మొబైల్ త్రయం దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కాలంలో దాని ప్రభావానికి గురైన ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే పంపించింది. సమాజంలోని పేదల్లో కెల్లా నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ప్రత్యేకించి పేదలు, అధోజగత్ సహోదరుల్లో ఏ ఒక్కరినీ పక్కన పెట్టకుండా వారిని అభివృద్ధిలో భాగం చేయాలనే ఆయన కల నేడు నెరవేరుతుండటం సంతోషకరం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో అనురాగాన్నీ, సమ్మిళితత్వాన్నీ, పారదర్శకతనూ ప్రోత్సహించడం ద్వారా సుపరిపాలనను అందించాలనే వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. కోవిడ్–19 మహమ్మారి ద్వారా అనేకరంగాల్లో మనకు ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో పునర్మిర్మాణ ప్రక్రియను ఇప్పుడు చేపడుతున్నాం. అందరికీ నాణ్యమైన సౌకర్యాలను, అవకాశాలను కల్పించేందుకు మనం తీవ్రమైన ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయితో 1980నుంచి మొదలుకుని దశాబ్దాలపాటు పనిచేయగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశాను. మనమంతా కష్టపడి పనిచేసి భారత్‌ను విశ్వగురువుగా మారుద్దాం. అదొక్కటే మన మహానేతకు మనం అర్పించే నిజమైన నివాళి. సర్వకాలాల్లో వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయకుడిగా నా మదిలో నిలిచి ఉంటారు. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలనా దినోత్సవం) -
లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరిలో ఘటనలో బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకి దిగుతున్నారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి రైతులకు మద్దతుగా మాట్లాడిన పాత వీడియో క్లిప్పుని గురువారం ఆయన ట్వీట్ చేశారు. 1980లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వ రైతు అణిచివేత విధానాలను వాజ్‌పేయి ఖండిస్తూ అన్నదాతలకు అండగా ఉంటానంటూ చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని షేర్ చేశారు. ‘‘ప్రభుత్వం రైతుల్ని అణిచివేసినా, రైతు చట్టాలను దుర్వినియోగం చేసినా, వారు శాంతియుతంగా చేసే నిరసనల్ని అణగదొక్కినా మనం రైతు పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. వారి నుంచి దూరంగా పారిపోవాలి్సన పనిలేదు’’ అని వాజ్‌పేయి ఆ వీడియోలో పేర్కొన్నారు. లోతైన హృదయం ఉన్న నాయకుడి గొప్ప మాటలు ఇవి అంటూ వరుణ్ గాంధీ కొనియాడారు. -
బీజేపీకి వరుణ్ గాంధీ షాక్: ఒకనాటి సంచలన వీడియో పోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా గళం విప్పిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తగ్గేదే..లే అంటూ కేంద్రానికి మరోసారి షాకిచ్చారు. మాజీ ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన ఒక సంచలన వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. రైతుల అణచివేతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను గురువారం ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతులకు మద్దతుగా నిలిచిన ఆయన ప్రసంగ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. చదవండి : మిశ్రాను పదవి నుంచి తప్పించండి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల సుదీర్ఘ ఉద్యమం, లఖీంపూర్ ఖేరిలో రైతులపై హింసాకాండ నేపథ్యంలో బీజేపీ నేత ట్విట్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. "పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్ చేయడమంటే మోదీ సర్కార్‌కు షాకేనని భావిస్తున్నారు. వరుణ్ గాంధీ షేర్ చేసిన వీడియోలో చట్టలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయడంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాలని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి కేంద్రాన్ని హెచ్చరించడం ఈ క్లిప్పింగ్‌లో చూడొచ్చు. చదవండి : Global Handwashing Day 2021: కరోనాకు చెక్ పెడదాం కాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసపై ఘాటుగా స్పందించిన ఏకైక బీజేపీ ఎంపీవరుణ్ గాంధీ. హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కారుతో ఢీకొట్టి మరీ రైతులను హత్య చేశారన్న ఆరోపణల్లో జూనియర్ హోం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడు. మరోవైపు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మాట్లాడిన నెల రోజులకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడుగా వరుణ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి : Love Your Eyes: ఆ కళ్లను ప్రేమిస్తున్నారా? అయితే ముందు మీ కళ్లను ప్రేమించండి! Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx — Varun Gandhi (@varungandhi80) October 14, 2021 -
వాజ్‌పేయి చివరిసారి కనిపించింది ఎప్పుడంటే..
VAJPAYEE DEATH ANNIVERSARY: భారత రాజకీయాలకు ‘భీష్మ పితామహుడి’గా తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కింది ఆయనకు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించిన ఆయన.. 2004 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి మూడో వర్ధంతి. 2018, ఆగస్ట్ 16న తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. 2004 ఓటమి తర్వాత వాజ్‌పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన.ఆపై అనారోగ్యంతో ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. చివరి సభ.. ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్‌తో అమృత్సర్ నుంచి లోక్ సభ స్థానానికి పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుల్ని అందేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. మీడియా ప్రతినిధులతో.. 2007, డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్‌పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్‌పేయి చూడగానే ఆశ్చర్యపోయారు. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో ఉన్నారాయన. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్‌పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు. కుర్చీలోనే భారతరత్న 2009లో ఛాతీ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్‌కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో.. కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్‌గా కలుస్తూ వచ్చారు. 2015లో ఆయనకు భారతరత్న ప్రకటించారు. మార్చి 27, 2015న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లోనే అందుకోవాలి. కానీ, వాజ్‌పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, డయాబెటిస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్‌పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడే నేతలే తప్పించి.. వాటిని ఆచరించేవాళ్లు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి
-
వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటీ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. 1998 మే నెలలో పోఖ్రాన్2 అణు పరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాలా సహాయ సహకారాలను నిలిపివేస్తామని బెదిరించాయి. నిలిపివేశాయి కూడా. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలను అంతకు ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కానీ, అమెరికా బెదిరింపులకు ఆ పార్టీ తలొగ్గింది. వాజ్‌పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో.. మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు.. ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అదే వాజ్‌పేయి ప్రభుత్వం.. ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన పార్టీగా చరిత్రలో నిలవాల్సి వచ్చింది. మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకసారి 13 రోజుల్లో, మరోసారి 13 నెలల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడిందే తప్ప ఏనాడూ లాలూచీలు పడాలని, ఎదుటివారిని లాక్కోవాలని చూడలేదు. బీజేపీకి కావాల్సింది ఏంటి? ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని, స్వేచ్ఛను అందించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అన్నివిధాలా దేశాన్ని అగ్రరాజ్యంగా అవతరింపచేయడం, మన ఘనమైన వారసత్వాన్ని నలుదిక్కులా చాటడం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి బీజేపీ కార్యకర్తా, నాయకుడూ పఠించే, పాటించే మంత్రం ఇదే. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్‌పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంటే రెండు సీట్లలోనే గెలుపొందింది. ఆ తర్వాతి ఎన్నికల్లో రెండంకెలు, మూడంకెల సీట్లను సాధించి, క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మరలా సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. రెండున్నర దశాబ్దాలపాటు దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంతో.. ఇక భారతదేశంలో ఏక పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అని రాజకీయ పండితులంతా ఏకగ్రీవంగా ప్రకటించిన సమయంలో బీజేపీ 2014 ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు, 282 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లు, 300లకు పైగా సీట్లు సాధించింది. భారతదేశంలో నలు దిక్కులా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకుని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధించిన, సాధిస్తున్న విజయం ఇది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన ఏకైక పార్టీగా బీజేపీ ఎదిగిందంటే దానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కానీ, మిత్రపక్షాల రూపంలో కానీ అధికారంలో ఉంది. కానీ, ఇప్పటి వరకూ అధికారం చేపట్టని, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులకు సరితూగే స్థాయిలో ప్రజాకర్షక నాయకులు లేని కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉందంటే బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకుని, జెండాను భుజాన పెట్టుకున్న కార్యకర్తలే కారణం. స్వాతంత్య్రానంతరం పాశ్చాత్య ప్రభుత్వ పోకడలకు ప్రభావితమైన నాయకులు భారతీయ ఆత్మతో సంబంధంలేని పోకడలను బలంగా నమ్మి, దేశంపైన బలవంతంగా రుద్దుతున్న సమయంలో భారతీయతత్వంతో ‘సమగ్ర మానవతావాదం’ పేరిట మనదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాలన్నీ ‘అంత్యోదయ’ పథకాలను ప్రారంభించాయి. కింది స్థాయిలో ఉండే వారికి ప్రభుత్వం నుంచి నేరుగా సహాయ, సహకారాలు అందేలా మోదీ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని స్థాయిలో చర్యలు చేపట్టి, అమలు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల అమలును కొత్తపుంతలు తొక్కించి, మధ్య దళారులను, లీకేజీలను అరికట్టింది. భారతీయ చారిత్రక సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ‘దేశం ముందు, పార్టీ తర్వాత, స్వప్రయోజనాలు చివరాఖరున’ అన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు.(నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం) వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్ బీజేపీ సీనియర్ నాయకులు -
ఫిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు : దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజల హక్కులు.. దేశాభివృద్ధి కోసం మాట్లాడేవారని గుర్తుచేశారు. అటల్ తీసుకుని వచ్చిన సంస్కరణలతో దేశానికి ప్రపంచంలో ఎంతో గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ పార్లమెంట్ అనుభవం గడించిన ప్రధాని వాజ్‌పేయీదని, ఆయన చరిత్రను ప్రతి యువకుడు అధ్యయనం చేయాలని సూచించారు. అటల్, అద్వానీ లాంటి ఇద్దరు గొప్ప నేతల మధ్య తాను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. న్యూక్లియర్ పరీక్షల అనంతరం పార్లమెంట్లో ఒక్క ఓటు తేడాతో రాజీనామా చేశారని గుర్తుచేశారు. శనివారం నెల్లూరులో పర్యటించిన వెంకయ్య నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తే జాతీయవాదం కాదని, దేశహితమే జాతీయ వాదమని వ్యాఖ్యానించారు. ‘చర్చలు జరపడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రస్తుత నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ, వాటిని అమలు చేయడం మరుస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరుపై ప్రజల్లో నమ్మకం పోతుంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు శారీరక దాడులకు పాల్పుడటం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిపాదించినా.. ప్రతిపక్షాలు వ్యతిరేఖించినా.. ఏం చేయాలన్నది చట్టసభకు వదిలేయాలి. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంను అపహాస్యం చేస్తున్నాయి. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్‌లోనే చెప్పాను. దీనిపై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి. అదిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఆ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. తాత్కాలిక ఉపయోగం కంటే దీర్ఘకాలిక అవసరాల కోసం రాజకీయాలు చేయాలి.’ అని అన్నారు. -
వాజ్‌పేయికి నివాళి అర్పించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 96వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి సతల్‌లోని ఆయన సమాది వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్‌లు హాజరై వాజ్‌పేయికి ఘన నివాళి అర్పించారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ లోక్‌సభ సెక్రటరియట్ రచించిన 'అటల్ బిహారి వాజ్‌పేయి ఇన్ పార్లమెంట్ : కొమెమొరేటివ్ వాల్యూమ్' పుస్తకాన్ని నేడు పార్లమెంట్లో రిలీజ్ చేయనున్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ వేదికగా వాజ్‌పేయి చేసిన ప్రసంగాలతో పాటు ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య అంశాలను ఈ పుస్తకంలో ప్రచురించారు. విజయవాడ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 'వాజపేయి అజాత శత్రువు... ఆయన జీవితం అందరకీ స్పూర్తి దాయకం. కార్గిల్ విజయం, అణు పరీక్షలతో సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతి రహిత పాలనకు వాజపేయి నిదర్శనం. సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దేశాధినేతగా ఎదిగారు. ఆయన జయంతిని ఈరోజున సుపరిపాలన దినోత్సవం గా జరుపుకుంటున్నాం.'అంటూ తెలిపారు. -
వాజ్‌పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం
పాలకులకు మహత్తర శక్తిని చ్చేది ప్రజాభిప్రాయం. తిరుగు లేని ప్రజాభిప్రాయమే ప్రజా స్వామ్యానికి శ్రీరామరక్ష. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ మైనా తాను చేసిన మంచి పనుల ఆధారంగా ప్రజల మనసు గెలిచి తిరిగి అధికారంలోకి రావాల నుకోవడం పరిణత ప్రజా స్వామిక లక్షణం. మనదేశంలో 1990ల మధ్యవరకూ కాంగ్రెస్ ప్రభు త్వాలు పలుమార్లు ఏర్పాటయ్యాయి. ఇవి తమ పనితీరు ఆధారంగా కాక, స్వాతంత్య్ర పోరాటానికి తామే నాయకత్వం వహించామని ప్రచారం చేసుకుని సాను భూతి పొందడంతోపాటు, ప్రతిపక్షాల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎన్నికవుతూ వచ్చాయి. 1975–77 మధ్యకాలంలో ప్రపంచం నివ్వెరపోయేలా ప్రజా స్వామ్యం పీక నులిమి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితి ప్రజల మనోభావాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది. 1990లో ఆర్థిక సరళీకరణ, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సాంకేతికత కారణంగా వివిధ సమాచార వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వార్తల్లోని వాస్తవాలను గుర్తించడం మొదలు పెట్టారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పార్టీలకు తాము అనుకున్నట్టే అంతా జరగాలన్న పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇలాంటి దశలోనే సుపరిపాలనకు మార్గదర్శనం చేసిన భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టింది. ప్రభుత్వం తాను చేసింది ప్రజలకు చెప్పుకోవడంతోపాటు ప్రజలు కూడా ప్రభుత్వాలు ప్రకటించిన మార్పులు జరిగాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించ డమే వాజ్‌పేయి సుపరిపాలనకు నిదర్శనం. వ్యూహాత్మక దృష్టి, పారదర్శకతను పెంపొందించడం, ప్రభుత్వాన్ని జవాబు దారీగా నిలబెట్టడం అనే మూడు విస్తృతమైన అంశాలు సుపరిపాలనకు ఆధారం. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా మనం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాజ్‌పేయి వ్యూహాత్మక దృష్టి కారణంగా మౌలిక వసతుల కల్పన జోరందుకుంది. రహదారుల రంగ చరిత్రగతిని మారుస్తూ, స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాలకు అనుసంధానత పెరిగి ఉపాధి అవకాశాలు ముమ్మరమయ్యాయి. బాల్యదశ నుంచే మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్న ఆలోచనతో సర్వశిక్షా అభియాన్ తెచ్చారు. దీనిద్వారా పాఠశాల విద్యను నిర్ణీతకాల వ్యవధిలో సార్వత్రికంగా మార్చేందుకు ముందడుగు పడింది. పోఖ్రాన్లో అణుపరీక్షలను నిర్వ హించాలన్న భారతదేశ నిర్ణయం, ఆ తర్వాత అణ్వా యుధ వ్యాప్తి నిరోధక కూటమిలో చేరడం వంటివి వాజ్‌పేయి దూరదృష్టి, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనాలు. పాలకులు తమ ప్రవర్తన విషయంలో ఎంత బాధ్యతతో వ్యవహరించాలో దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాథ్యూ తెలియ జెప్పారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరూ, వారి ప్రవర్తన విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి; తమ పాలకులు చేసే ప్రతి చట్టం గురించి తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంటుందని స్పష్టం చేశారు. 2002 తర్వాతే వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శక పాలనకు మూలస్తంభంలాంటి, సమాచార హక్కు చట్టానికి పూర్వ రంగంలాంటి ద ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 తెచ్చింది. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారిత్వం దిశగా వాజ్‌పేయి ఎంతో ముందుచూపుతో తీసుకున్న పలు నిర్ణయాలు పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపా డాయి. ప్రజాధనాన్ని కాపాడటం, దాన్ని సద్వినియోగం చేయడం పాలకుల బాధ్యత. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్, ప్రజాధనం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదనీ, ఉన్నదల్లా పన్ను చెల్లింపుదారుల ధనమేననీ అంటారు. అందువల్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యతకు పెద్దపీటవేస్తూ, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టాన్ని తేవడం ద్వారా, వ్యవస్థాగతంగా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికీ, తద్వారా ఆర్థిక లోటును క్రమంగా తగ్గించడానికీ ప్రయత్నం జరిగింది. వాజ్‌పేయి సుపరిపాలనా విధానాల ప్రభావం, నరేంద్ర మోదీ మొదటి, రెండవ విడత ప్రభుత్వాలపై స్పష్టంగా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ ఒప్పందాన్ని చట్ట రూపంలో తేవడం, ఆర్టికల్ 370ని విజయవంతంగా రద్దు చేయడం, మహిళలకు, షెడ్యూలు కులాలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను పక్కనపెట్టడం ఇందుకు నిదర్శనం. అందరికీ సమాన అవకాశాలు, ఒకేరకమైన చట్టాలు వర్తించే అంశాలపై ప్రధానమంత్రి దృష్టిపెట్టడం వాజ్‌పేయి సుపరిపాలనా విధానంలోని మరో కోణాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంగా చెప్పుకోవచ్చు. జన్‌ధన్ యోజన వంటి విప్లవాత్మక చర్యలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2.57 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని 70 కోట్లకుపైగా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ అయ్యేట్టు చూడటం జరిగింది. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం నేరుగా సహాయం చేయగలిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పారదర్శక పాలన, మెరుగైన శాసన విధానాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారాయి. కాలం చెల్లిన చట్టాలు ఎన్నింటినో మోదీ సర్కారు రద్దుచేసింది. మోదీ పిలుపునిచ్చిన సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదం సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం. జి.కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి; సుపరిపాలన దినోత్సవం -
బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేను బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలుస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతం, సీఎంల్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌లను కూడా దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 1999లో ఝార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దశాబ్ధాలుగా ఈ విషయంపై విచారణ కొనసాగింది. ఈ కేటాయింపుల్లో దిలీప్ రేతో పాటు మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్లు ప్రత్యేక కోర్టు గుర్తించింది. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ హయంలో దిలీప్ రే ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నెల 14న దిలీప్ రేతో పాటు దోషిగా తేలిన మరో ముగ్గురుకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. చదవండి: యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్ -
ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగమార్గం అటల్ టన్నెల్
-
వాజ్‌పేయి కలని సాకారం చేసిన రోజు: మోదీ
సిమ్లా : ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే, హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ మోదీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ క్షణం చారిత్రాత్మకం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కలని సాకారం చేసిన రోజు. అందుకే ఈ సొరంగానికి అటల్ టన్నెల్ అని నామకరణం చేయబడింది. ఈ సొరంగం భారత సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంద’ని ప్రధాని మోదీ అన్నారు. దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో ఆస్ట్రియా టన్నెలింగ్ విధానంలో దీన్ని నిర్మించారు. 9.02 కిలోమీటర్ల అతి పొడవున నిర్మించిన ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 3,060 మీటర్ల ఎత్తులో గుర్రపు షూ ఆకారంలో ఉంది. ఈ టన్నెల్ ద్వారా మనాలీ నుంచి లద్దాఖ్‌లోని లేహ్ వరకు దాదాపు 5 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. మనాలీ నుంచి లాహాల్-స్పితి లోయతో అనుసంధానించి నిర్మించిన ఈ సొరంగ మార్గం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు కల్పించినట్లయ్యింది. (బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసు: మోదీకి బాధితురాలి లేఖ) రోజుకు 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ఈ టన్నెల్ గుండా ప్రయాణించివచ్చు. ప్రతీ వాహనం గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు. కీలకమైన పాక్, చైనా సరిహద్దులో సియాచిన్ గ్లేసియర్, అక్సాయ్ చిన్లలో మన సైనికులు నిరంతర పహరా కాస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను, ఆయుధాలను, ఇతర సామగ్రిని తీసుకెళ్లడం చాలా కష్టతరంగా ఉండేది. ఈ నేపథ్యంలో రోహతాంగ్ పాస్ కింద సొరంగం నిర్మించాలని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జూన్ 3, 2000న దక్షిణ ముఖ ద్వారానికి శంకుస్థాపన చేశారు. అత్యంత కష్టతరమైన విస్తీర్ణాన్ని కలిగి ఉన్నఈ ప్రదేశంలో భౌగోళిక, వాతావరణ సవాళ్లను అధిగమించడానికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) అవిశ్రాంతంగా పనిచేసింది. వాజ్‌పేయి చేసిన కృషికి గుర్తుగా రోహతాంగ్ టన్నల్‌కు అటల్ టన్నల్ అని పేరు పెట్టాలని కేంద్ర కేబినెట్ 2019లో నిర్ణయించింది. -
వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్ధంతి(ఆగస్టు 16) సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘ఈ పుణ్యతిథిన అటల్జీకి ఇవే నా ఘనమైన నివాళులు. ఆ మహనీయుడి సేవల్ని భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని ఓ ట్వీట్ చేస్తూ వాజ్ పేయికి సంబంధించిన ఫొటోలతో కూడిన సుమారు రెండు నిముషాల వీడియోను మోదీ విడుదల చేశారు. ప్రధానిగా దేశాభివృద్ధికి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన హయాంలోనే భారత్ అణు శక్తిగా ఎదిగిందని గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, ఎంపీగా, ప్రధానిగా అటల్ ఈ దేశానికి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు. (చదవండి : ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు గట్టిగా బుద్ధి చెప్పాం) 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే. మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1996లో, 1998 నుంచి 1999వరకు ఆ తరువాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్‌పేయి కొనసాగారు. ఆయన హయాంలోనే 1998 మే 11 -13 మధ్య భారత్ పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది. 2018 ఆగస్టు 16 న వాజ్ పేయి దివంగతులయ్యారు. Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd — Narendra Modi (@narendramodi) August 16, 2020 -
ఈ మౌన ముని.. ‘పోఖ్రాన్–2’ పథ నిర్దేశకుడు
1996 మే 8. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్ కలాంకు వర్తమానం వచ్చింది – రాత్రి 9 గంటలకు ప్రధానిని కలవమని. పి.వి.నరసింహారావు ప్రధాని. కలాం ప్రధానికి శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారు, డీఆర్డీఓ కార్యదర్శి. ‘‘కలాంగారూ, నేను తిరుపతి వెళ్తున్నాను. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్, మీ బృందం పరీక్షలకు సిద్ధంగా ఉండండి. నా అనుమతి కోసం వేచి ఉండండి. ఈ పరీక్షలకు డీఆర్డీఓ, డీఏఈ సిద్ధంగా ఉండాలి’’– అని కలాంకు ముఖాముఖిగా చెప్పారు పీవీ. అది ఎన్నికల సమయం. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించలేదు. 1996 మే 16న మాజీ ప్రధాని నరసింహారావు, అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టర్ ఆర్. చిదంబరం కలసి అంతకుముందురోజే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిశారు. పీవీ ప్రధానికి ఓ చీటీ ఇచ్చారు. వాజ్‌పేయి కేవలం 13 రోజులు పని చేసి, మెజారిటీ చాలదనే కారణం మీద జూన్ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 1998 మార్చిలో జరిగాయి. మార్చి 19న వాజ్‌పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 మే 22 దాకా పదవిలో ఉన్నారు. 2004 క్రిస్మస్ రోజులు. డిసెంబర్ 23న పీవీ కన్నుమూశారు. గ్వాలియర్‌లో వాజ్‌పేయి రచయితల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ విషయం బయటికి చెప్పవద్దని పీవీ కోరారు. కానీ ఆయనే గతించారు. చెప్పడం తన విధి’ అని ప్రకటిస్తూ 1996 మే 16న అందుకున్న చీటీలోని విషయం వివరించారు. ‘సామగ్రి తయ్యార్ హై’ అని రాసిన చీటీ లోగుట్టు చెప్పేశారు. ‘అణుపరీక్షలకు అంతా సిద్ధం, నిరభ్యంతరంగా ముందుకెళ్ళవచ్చు’ అని దాని అంతరార్థం. పీవీనే పోఖ్రాన్– 2 న్యూక్లియర్ ప్రోగ్రాం మూలపురుషుడు అని ఆ రోజు వాజ్‌పేయి ప్రకటించి ఉండకపోతే మనకు సాధికారంగా తెలిసి ఉండేదికాదు. ఆంధ్రప్రదేశ్‌లో పీవీ ప్రారంభించిన భూసంస్కరణలు, విద్యాసంబంధమైన పలు చర్యలు ఆయనను తెలుగు ప్రాంతంలో చిరంజీవిని చేశాయి. ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలలో భారత్ ధోరణి, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అణుశక్తి రంగంలో ఆయన చూపిన చొరవ, వ్యూహం గురించి ఎక్కువ ప్రస్తావన రాలేదు. 1996 మే నెలలో జరగవలసిన అణుపరీక్షలు నరసింహారావు మళ్ళీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి 1995 డిసెంబర్లో ఒకసారి ప్రయత్నాలు మొదలై, ఆరునెలలు వాయిదా పడ్డాయి. 1995 నవంబర్ చివర్లో ప్రధాని అణు పరిశోధనా బృందాల నాయకులు అబ్దుల్ కలాం, ఆర్.చిదంబరంకు టి–30 కార్యక్రమం నిర్దేశించారు. ముప్పయి రోజుల్లో అణుపరీక్షలు జరగాలని అంతరార్థం. అయితే డిసెంబర్ 15న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ దేశ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం మేరకు భారతదేశం అణుపరీక్షలు జరుపుతోందని వార్త ప్రచురించి సంచలనం రేపింది. మరోవైపు సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లపై సంతకాలు చేయాలా, వద్దా అని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి డిసెంబర్లో అణు పరీక్షలు జరుపలేదు. మరి మళ్ళీ ఆరునెలలకే ఎందుకు అణుపరీక్షలు జరపాలని భావించారు పీవీ? ఎందుకంటే 1995 డిసెంబరు నాటికి హైడ్రోజన్ బాంబు సిద్ధం కాలేదు. శాస్త్రవేత్తలు ఆరు నెలల వ్యవధి అడిగారు. అంతేకాకుండా థార్ ఎడారిలో పోఖ్రాన్ దగ్గర అణుపరీక్షలకు సిద్ధం చేయడంలో గూఢచారి ఉపగ్రహాల కెమెరా కళ్ళను ఎలా బురిడీ కొట్టిం చాలో కూడా ఈ వ్యవధిలో మన శాస్త్రవేత్తలు నేర్చుకున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉంటే 1995 డిసెం బర్లో కొన్ని పరీక్షలు జరిపి ఉండేవారు పీవీ. కానీ ఆయన ఆవిధంగా ఆలోచించలేదు. నరసింహా రావు కనుమూయడానికి కొన్నినెలల ముందు జర్నలిస్టు శేఖర్ గుప్తా ఈ విషయం అడిగితే– ‘భయ్యా కొన్ని రహస్యాలు నా పాడెతోనే పోనీవోయ్’ అని పీవీ అనడం అందరూ టీవీల్లో చూశారు. పోఖ్రాన్–2 అణుపరీక్షల తర్వాత ప్రపంచం సులువుగానే భారతదేశాన్ని అంగీకరించింది. అదేవిధంగా పీవీ ధోరణికి తగినట్టుగానే తరవాత వచ్చిన ప్రధానులు సీటీబీటీ, ఎన్పీటీ ఒప్పందాలపై సంతకాలు చెయ్యలేదు. కనుకనే ఈ విషయాలన్నీ దగ్గరగా చూసిన అబ్దుల్ కలాం– దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడు పీవీ అని కొనియాడటం ఎంతో అర్థవంతం అనిపిస్తుంది. వ్యాసకర్త సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 డా. నాగసూరి వేణుగోపాల్ -
వాజ్‌పేయి చాణక్యం.. చైనాకు గుణపాఠం
న్యూఢిల్లీ: ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనాకు షరామామూలే అనే సంగతి చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. అది 1965. ఇండో సినో యుద్ధం తర్వాత పరిస్థితులు ఇంకా గంభీరంగానే ఉన్నాయి. డ్రాగన్ పదే పదే ఇండియాపై అక్కసు వెళ్లగక్కతూనే ఉంది. ఓ వైపు సంప్రదింపులంటూనే భారత జవాన్లు చైనాలోకి చొరబడ్డారని పేర్కొంది. (అమ్మకానికి చే గువేరా ఇల్లు) సిక్కిం సరిహద్దు దాటి తమ దేశానికి చెందిన వ్యక్తుల నుంచి 800 గొర్రెలు, 59 జడల బర్రెలను భారత సైన్యం దొంగిలించిందని ఆరోపించింది. ఇది సాకుగా చూపి మళ్లీ సైనిక చర్యకు దిగాలనేది డ్రాగన్ ఆలోచన. చైనా ఆరోపణను భారత్ కొట్టిపారేసింది. ఇరువర్గాల మధ్య కొన్నాళ్ల పాటు ఈ సమస్యపై లేఖల యుద్ధం జరిగింది. తమ గొర్రెలను, బర్రెలను తిరిగివ్వాలని లేకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని భారత్ ను డ్రాగన్ హెచ్చరించింది. చైనా కుటిల నీతిని అర్థం చేసుకున్న అప్పటి యువ ఎంపీ అటల్ బిహారీ వాజ్‌పేయి వినూత్న రీతిలో చైనాకు బుద్ధి చెప్పారు. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) దాదాపు ఎనిమిది వందల గొర్రెలను ఢిల్లీలోని చైనా ఎంబసీకి తోలుకెళ్లారు. వాటి మెడలో ‘మమ్మల్ని తినండి. కానీ, ప్రపంచాన్ని కాపాడండి’ అనే ప్లకార్డులు వేశారు. గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచయుద్ధానికి చైనా తెరలేపుతోందని విమర్శించారు. వాజ్‌పేయి గొర్రెల నిరసనకు చైనా విస్తుపోయింది. తమ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఘాటైన లేఖను పంపింది. గొర్రెల ఘటన వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపించింది. ఇందుకు తిరిగి లేఖ రాసిన భారత్.. అందులో నిర్మలమైన పదజాలాన్ని వాడుతూ ‘ఢిల్లీ వాసులు కొందరు 800 గొర్రెలను చైనా ఎంబసీలోకి తోలారు. ఇది ఊహించని విధంగా జరిగిన పరిణామం. నిరసన కూడా ప్రశాంతంగా జరిగింది’ అంటూ జవాబిచ్చింది. -
రండి.. దీపాలు వెలిగిద్దాం
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఓ వేదికపై వాజ్‌పేయి తన కవితను చదువుతూ కనిపించారు. వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలి కరోనా వైరస్ బాధితులకు, వారికి వైద్య సేవలందించే డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, సాధారణ ప్రజలకు సరిపడా నిత్యావసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మాస్కులు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన 11 సాధికార బృందాలతో, సంబంధిత అధికారులతో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా టెస్టింగ్, క్రిటికల్ కేర్ ట్రైనింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం ఫోన్లో ట్రంప్–మోదీ సంభాషణ ప్రాణాంతక కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. వారిద్దరూ శనివారం ఫోన్ ద్వారా పరస్పరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై తమ మధ్య విస్తృతమైన చర్చ జరిగిందని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. -
ఇన్నేళ్లకు మళ్లీ అదే సీన్ రిపీటైంది!
సాక్షి, కరీంనగర్: రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని పార్టీ నేతలు సంబరపడుతున్నారు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1998 నుంచి కరీంనగర్ జిల్లా నుంచి సీహెచ్.విద్యాసాగర్‌రావు అటు ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్నేళ్లకు అదే సీన్ రిపీట్ అయింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన సంజయ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. విద్యాసాగర్‌రావు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలవగా, బీజేపీ నుంచి పెద్దపల్లి, మెట్పల్లి ఎమ్మెల్యేలుగా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో కరీంనగర్ జిల్లాలో అప్పట్లో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగింది. 2004 ఎన్నికల నాటి నుంచి శాసనసభలో కరీంనగర్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్లో ప్రబలమైన శక్తిగా ఉన్న అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొని నిలబడేలా బీజేపీని తీర్చిదిద్దాలి్సన బాధ్యత సంజయ్‌పై పడింది. స్వయం సేవకుడే.. కమలం సారథి తొలి నుంచి బీజేపీకి పట్టున్న కరీంనగర్ జిల్లా 1982లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తరువాత కరీంనగర్ జిల్లా నుంచి సీహెచ్.విద్యాసాగర్‌రావు తొలి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్జీ 1989, 1994 వరకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడమే గాకుండా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 1999 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా విజయం సాధించడమే గాకుండా తాను ఖాళీ చేసిన మెట్పల్లి నుంచి తుమ్మల వెంకట రమణారెడ్డిని గెలిపించారు. పెద్దపల్లి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి అప్పుడే గెలిచారు. కరీంనగర్‌తోపాటు పలు పట్టణాల్లో, గ్రామాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ లభించింది. 2004 తరువాత పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. 2014, 2019లో దేశమంతా మోదీ హవా కొనసాగినా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఒక్క స్థానం గెలవలేకపోయింది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే బండి సంజయ్ ఈ రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు గట్టిపోటీ ఇచ్చి, రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ హవాకు తోడు సంజయ్‌కుమార్ పట్టుదల, ప్రజల సానుభూతి కలగలిసి భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతూనే ఆర్ఎస్ఎస్ మద్దతుతో ఏకంగా బీజేపీ రాష్ట్ర పీఠాన్ని అధిరోహించారు. వచ్చే ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తెలంగాణ, ఏపీకి నూతన బీజేపీ అధ్యక్షులు! క్షేత్రస్థాయిలో దృష్టి పెడితే... కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసిన వ్యూహం తరువాత జరిగిన స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో పనిచేయలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట మెజారిటీ సాధించిన బీజేపీ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం కరీంనగర్, హుజూరాబాద్‌లో కొంత ప్రభావం చూపింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పుంజుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీని బలమైన శక్తిగా రూపొందించాల్సిన బాధ్యత సంజయ్ పైనే ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో మురళీధర్ రావు, విద్యాసాగర్‌రావు వంటి నేతలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాస్ లీడర్లుగా ఉన్నది కొందరే. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. నాలుగేళ్ల వరకు ఏ ఎన్నికలు లేకపోవడంతో ప్రతీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి బూత్, గ్రామ, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని క్యాడర్ గుర్తు చేస్తోంది. -
యుగ పురుషుడు
-
వారు బాధ్యత గుర్తించాలి
ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఆందోళనల్లో గాయపడిన పోలీసులు, సామాన్యులు ఏం తప్పు చేశారు?. ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి సమస్య శాంతియుతంగానే పరిష్కారమయ్యాయి. సవాళ్లకే సవాలు విసరడం మా నైజం. దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో వాజ్‌పేయి పేరు నిలిచి ఉంటుంది. అటల్ ప్రధానిగా ఉండగా జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను శక్తిమంతమైన దేశంగా నిలిపాయి. – ప్రధాని మోదీ లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చేసిన పని సరైందా అన్నది వాళ్లు (ఆందోళనకారులు) తమని తాము ప్రశ్నించుకోవాలి. వాళ్లు తగులబెట్టింది ఏదైనా కానీ.. వారి పిల్లలకు ఉపయోగపడేదేగా’ అని ఆయన ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ లక్నోలో 25 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటల్ పేరుతో ఏర్పాటు కానున్న వైద్య విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. లక్నోలోని లోక్‌భవన్‌లో ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలని అన్నారు. ఆందోళనల్లో గాయపడ్డ, పోలీసులు, సామాన్యులు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుతో ఓ పాత జబ్బు శాంతియుతంగా నయమైపోయిందన్నారు. రామజన్మభూమి సమస్య కూడా శాంతియుతంగానే పరిష్కారమైందని అన్నారు. తమ పిల్లల మాన మర్యాదలను కాపాడుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్ట సవరణ అనే సమస్యకు 130 కోట్ల మంది భారతీయులు ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ ఆత్మ విశ్వాసంతో భారత్ నవ దశాబ్దంలోకి ప్రవేశిస్తోందని మిగిలిన అన్ని పనులు పూర్తి చేసే లక్ష్యంతో సాగుతోందని అన్నారు. సవాళ్లకే సవాలు విసరడం తమ నైజమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటిదాకా మొత్తం 15 మంది మరణించగా, సుమారు 263 మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌ను లదాఖ్, జమ్మూకశ్మీర్‌లతో కలిపే రోహ్తంగ్ సొరంగానికి మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఈ సొరంగాన్ని అటల్ టన్నెల్‌గా పిలుస్తారని ప్రధాని మోదీ బుధవారం ప్రకటించారు. ఈ సొరంగానికి 2003లో వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు. బొట్టు బొట్టు ఒడిసిపట్టాల్సిందే! మెరుగైన సాగుపద్ధతులు పాటించడం, నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతులు జల సంరక్షణకు పాటుపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో భూగర్భ జల సంరక్షణ పథకమైన ‘అటల్ జల్ యోజన’ను మోదీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ఈ పథకం ఏడు (మహారాష్ట్ర, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక) రాష్ట్రాల్లోని 78 జిల్లాలు, 8,300 గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో వ్యవసాయం అధికంగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, నీటిని పొలాలకు మళ్లించేందుకు ఇప్పటికీ పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారని ప్రధాని తెలిపారు. దీనివల్ల చాలాసార్లు నీరు వృథా అవుతోందని అన్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉన్న చెరకు పంట సాగయ్యే ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడాన్ని గమనించామన్నారు. ఈ పరిస్థితులను మెరుగుపరిచేందుకు రైతుల్లో జలసంరక్షణపై అవగాహన మరింత పెరగాలని అన్నారు. దేశంలోని ప్రతి గ్రామం నీటి వాడకానికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పథకాల ద్వారా అందించే నిధుల సాయంతో జల సంరక్షణ పనులు చేపట్టాలని కోరారు. భూగర్భ జల మట్టాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు పరస్పర సహకారంతో నీటి బడ్జెట్లు రూపొందించుకుని తదనుగుణంగా పంటల పెంపకం చేపట్టాలని వివరించారు. ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల ఖర్చు భూగర్భ జల వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అటల్ జల్ యోజన ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ తెలిపారు. గత 70 ఏళ్లలో దేశంలోని మొత్తం 18 కోట్ల గృహాల్లో మూడు కోట్లకు మాత్రమే పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం ఒనగూరిందని, తమ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో మిగిలిన 15 కోట్ల కుటుంబాలకు తాగునీటిని చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాయని మోదీ తెలిపారు. 25 అడుగుల ఎత్తు వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని శిల్పి రాజ్‌కుమార్ పండిట్ రూపొందించారు. 25 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువున్న ఈ విగ్రహతయారీకి రూ.89 లక్షలు ఖర్చయింది. పండిట్ నేతృత్వంలోని 65 మంది కళాకారులు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. బిహార్‌కు చెందిన రాజ్‌కుమార్ పండిట్ జైపూర్ కేంద్రంగా కాంస్యం, అల్యూమినియం, ఇత్తడి వంటి లోహాలతో ప్రముఖుల విగ్రహాలను వేలాదిగా తయారు చేశారు. ఈయన తయారుచేసిన అత్యంత ఎత్తైన 47 అడుగుల పాండవవీరుడు అర్జునుడి విగ్రహాన్ని జైపూర్‌లో ప్రతిష్టించారు. ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారకం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
మౌనమే అటల్జీ ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నేతకు నివాళులు అర్పించారు. మూడు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయికి ఆయన మాటల కంటే మౌనమే శక్తివంతమైనదని ప్రధాని కొనియాడారు. ఎప్పుడు మౌనం దాల్చాలి..ఎప్పుడు మాట్లాడాలి అనేది ఆయనకు తెలుసునన్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వాజ్‌పేయికి నివాళులు అర్పిస్తూ దివంగత ప్రధానితో తాను పలు సందర్భాల్లో కనిపించిన దృశ్యాలను ఆ వీడియోలో పొందుపరిచారు. ఇక అంతకుముందు బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు నేతలు దివంగత నేత వాజ్‌పేయికి అటల్ సమాధి స్ధల్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. 1924, డిసెంబర్ 25న జన్మించిన వాజ్‌పేయి 1939లోనే ఆరెస్సెస్‌లో చేరారు. -
వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
-
వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
లక్నో: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 25న లక్నోలో జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, ఆరెస్సెస్ కార్యకర్త రాకేశ్ సిన్హా హాజరుకానున్నారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ నారాయణ్ దీక్షిత్ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు... 'డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానం ద్వారా లక్నో చేరుకున్న అనంతరం వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు' అని సాంస్కృతిక శాఖ సంయుక్త డైరెక్టర్ వైపీ సింగ్ పేర్కొన్నారు. అనంతరం 25 నిమిషాలపాటు ప్రధాని ప్రసంగం ఉంటుందని... ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు మోదీ ఢిల్లీకి బయలుదేరుతారని తెలిపారు. ఇక వేడుకల్లో జాతీయ కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న 'జాతీయ సుపరిపాలన దినోత్సవం'గా జరుపుకొంటున్న విషయం తెలిసిందే. -
కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్ స్వామి (90) కన్నుమూశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు.1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించిన ఐడీ స్వామి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వెలిబుచ్చారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు.ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా గతవారంమే స్వామి భార్య పద్మ కన్నుమూశారు. -
అణచివేతతో సాధించేది శూన్యం
మితవాద జాతీయ శక్తుల దృఢమైన విశ్వాసాలు వాస్తవపరీక్షకు, హేతుబద్ధతకు నిలబడేవికాదు. కశ్మీర్ గడ్డలోని వైవిధ్యతను హత్తుకోవడమే అక్కడి ప్రజల హృదయాలనూ, మనసులనూ గెలవడానికి గల అత్యుత్తమ మార్గం. అందుకు వాజీపేయి విధానాలు అనుసరించడమే ఉత్తమం ఇంతకు ముందు మనం ఉదారవాదుల్లో జమ్మూ–కశ్మీర్‌పై గూడుకట్టుకున్న అయిదు ప్రధానమైన కల్పితాలను ప్రస్తావించాం. అసలైన కఠోర వాస్తవాలు ఏమిటో చెప్పాం. ఈసారి మనం మితవాద జాతీయ శక్తుల్లో పేరుకుపోయిన విశ్వాసాలేమిటో పరిశీలిద్దాం. నరేంద్ర మోదీ–బీజేపీలకుండే అసంఖ్యాకమైన వోటర్లను పరిగణనలోకి తీసుకుంటే దీన్నొక అతి పెద్ద సమూహంగా భావిం చాలి. ఈ సమూహానికి 370 అధికరణ, కశ్మీరీ నేతల ద్రోహచింతన ప్రధాన సమస్య. ఆ రాష్ట్రానికి దేశ పాలనా వ్యవస్థ సమష్టిగా అన్యాయం చేసిందని తెగ బాధపడిపోయే ఉదారవాదుల భావన వంటిదే ఇది. బహుశా దానికన్నా ఒకింత ప్రబలమైనదనే చెప్పాలి. క్షేత్రస్థాయి వాస్తవాలు, నిజానిజాలపై అవగాహనలేమి నుంచే మితవాద జాతీయ భావావేశం పుట్టుకొచ్చింది. మితవాద, వామపక్ష, మధ్యేవాద అపోహలు జాతీయ ప్రయోజనానికి లేదా కశ్మీరీ సమస్య పరిష్కారానికి ఏమాత్రం తోడ్పడవు. కనుకనే మనం వాస్తవాలు, హేతుబద్ధతలపై వెలుగును ప్రసరింప జేయాలి. నమ్మకాలు మనోహరంగానే ఉంటాయి. కానీ అవి వాస్తవాధారితాలు కాకపోతే ప్రమాదభరితమవుతాయి. అందుకే జాతీయవాదుల్లోని అయిదు ప్రధాన అపోహలేమిటో చూద్దాం. అందులో మొదటిది, కీలకమైనది 370 అధికరణ, దానిద్వారా కశ్మీర్‌కి దక్కిన స్వయంప్రతిపత్తి. వారి దృష్టిలో ఇదే సమస్యకు మూలం. సరే ఇప్పు డది ఎటూ ముగిసిపోయింది. కొత్త చరిత్రను సృష్టించారు. కానీ సమస్య కూడా అలా ముగిసిపోతుందా? కొత్త చరిత్ర సృష్టించినంత మాత్రాన పాతది తుచిపెట్టలేం. జాతి చేతనలోనూ, కశ్మీర్‌లోనూ 370 అధికరణ చాలా ఉద్వేగభరితమైనది. అలాగే గత 69 ఏళ్లుగా అది తాత్కాలికమైనదిగానే ఉండిపోయింది. చివరికది తన పూర్వపు రూపానికి ఒక నీడలా కూడా మిగలనంతగా నీరుగారింది. వీపీసింగ్ మినహా మన ప్రధానులంతా దాన్ని నీరుగార్చడానికే ప్రయత్నించారు. మోదీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో రద్దు చేయడం లాంఛనప్రాయం మాత్రమే. కేవలం రక్షణ, విదేశీవ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో మాత్రమే కేంద్రం ప్రమేయం ఉంటుందన్న నియమం కాస్తా ఇప్పుడు రద్దయి రాజ్యాంగంలోని 395 అధికరణల్లో 290 దానికి నేరుగా వర్తించేలా మారింది. కొన్ని ఇతర సమస్యలైతే ఉన్నాయి. వాటిల్లో స్థానికేతరులను పెళ్లాడే కశ్మీరీ మహిళలకు వారసత్వ హక్కు నిరాకరించడం, వారి పిల్లల్ని కశ్మీరీలుగా గుర్తించకపోవడం, తక్షణ తలాక్‌పై, స్వలింగసంపర్కుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తింపజేయకపోవడంవంటి అంశాలపై వచ్చే డిమాండ్లు ఉదారవాద కోర్కెలే. పాక్‌ను దురాక్రమణదారుగా, అక్కడి అలజడికి ప్రధానకారకంగా భావించడం కూడా ఈ కేటగిరీలోని కాల్పనికతలే. రెండోది–1948 మొదలుకొని జాతీయవాద చర్చల్లో ఉన్నది మన సైన్యానికి సంబంధించింది. పాకిస్తానీలనుంచి గిల్గిట్–బాల్టిస్తాన్లతోసహా మన కశ్మీర్ భూభాగం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా నెహ్రూ మెతకగా వ్యవహరించి ఐక్యరాజ్యసమితి మెట్లెక్కారని, అదే గనుక సర్దార్ పటేల్‌కు అప్పగించి ఉంటేనా...అనేది ఆ కాల్పనికత సారాంశం. కానీ వాస్తవం వేరు. అది మారదు. దాన్నెవరూ మార్చలేరు. 1947–48 మధ్య రెండు సీజన్లలో సాగిన యుద్ధానికి శీతాకాలంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సైన్యాలకు సంబంధించి మీకు అందుబాటులో ఉన్న మిలిటరీ పత్రాలు చూడండి. భౌగోళిక, క్షేత్రస్థాయి, సైనిక వ్యూహతంత్ర, శక్తిసామర్థ్యాలను గమనించండి. పురోగమనానికి ఇరుపక్షాలకు ఉండే అవరోధాలు అర్ధమవుతాయి. బహుశా తొలి దశ మొదట్లోనే...అంటే నవంబర్, డిసెంబర్ మధ్య ప్రయత్నిస్తే ఉడి వద్ద మన దళాలు పురోగమించి ముజఫరాబాద్లోనికి చొచ్చుకొని వెళ్లగలిగేవి. అయితే బనిహాల్ మార్గం మంచుతో కూరుకుపోతే తప్ప విమానాల ద్వారా లేదా రోడ్డు మార్గంలో దళాల తరలింపు సాధ్యం కాదు. ఇరు దేశాల్లో ప్రచారంలో ఉన్న భిన్న కథనాలు 1948లో అయితే సులభంగా విజయం చేజిక్కేదని చెబుతాయి. కానీ ఇవన్నీ పోటాపోటీ కల్పనలు. ఒక సంగతి గుర్తుంచుకోండి. ఈ యుద్ధ సమయానికి ఇరు దేశాల సేనలనూ బ్రిటిష్ చీఫ్‌లే నడిపించారు. విభజన తర్వాత సైన్యం కేటాయింపు సమంగా జరగలేదు. పాకిస్తాన్‌కు అవిభక్త సైన్యంలో మూడోవంతు, ఆర్థికంలో ఆరో వంతు దక్కింది. ఈ పరిస్థితి దేశాన్ని దెబ్బతీసింది. 1947–48లో సైనికపరంగా ఉన్న ఆ అగాథంతో హిమవన్నగాలపై విజయకేతనం ఎగరేయడం అసాధ్యం. ఆ సంగతలా ఉంచి ఇప్పుడు ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్‌ను తరిమేయడం సాధ్యమేనా? అది కుదరని పని అని ఎంతో వినమ్రంగా చెబుతున్నాను. 1948 నుంచి మనం అనేక యుద్ధాలు, ఘర్షణలూ చూశాం. చివరికి మనం స్వాధీనం చేసుకున్నది సియాచిన్ మంచుపర్వతశ్రేణి. కొన్ని కమాండో–కామిక్ చానళ్లను కాస్సేపు పక్కనబెడితే పాకిస్తాన్ సైన్యాలు ఆత్మరక్షణలో దిట్ట అని మనం గుర్తుంచుకోవాలి. 1948లో కోల్పోయిన భూభాగం పునఃస్వాధీనమైనా,ఆక్రమిత కశ్మీర్‌ను జయించడమైనా అహేతుకమైన పుక్కిటి పురాణాలేనని తెలుసుకోవాలి. మూడోది–కశ్మీరీలు వినయవిధేయతలున్నవారు, శాంతస్వభావులు, దేశభక్తి మెండుగా ఉన్నవారు. కానీ పాకిస్తానీ ప్రచారంతో, మిలిటెంట్ ఇస్లాంతో సైద్ధాంతికంగా కలుషితమయ్యారు. కొన్నాళ్లక్రితం వరకూ అయితే మొదటిది సత్యం. ఈ మూడు దశాబ్దాల తిరుగుబాటు ఉద్యమాల తొలినాళ్లలో చాలామంది సాయుధులు పాకిస్తాన్‌కి చెందినవారే. 90వ దశకం మొదట్లో ఆఫ్రికా, అరబ్ దేశాలనుంచి ఐఎస్ఐ ప్రాపకంతో వచ్చిన జిహాదీలను కశ్మీరీలు ఛీత్కరించుకునేవారు. కానీ పదే ళ్లుగా ఈ తిరుగుబాట్లు దేశీయమయ్యాయి. కశ్మీరీ యువత ఆగ్రహంతో, అవమానభారంతో రగిలిపోతోంది. ఆయుధాలు పట్టడానికి సిద్ధపడుతోంది. మరణించిన లేదా పట్టుబడిన మిలిటెంట్ల నేపథ్యాలు చూస్తే ఇది ధ్రువపడుతుంది. మిలిటెం ట్లకు అవసరమైన ఆయుధాలు లోయలో విస్తారంగా ఉన్నాయి. మరిన్ని సరఫరా చేయడానికి పాకిస్తాన్‌కు లోటులేదు. కశ్మీర్ కేంద్రం పరిధిలోకి వెళ్లింది గనుక పోలీసులపై నియంత్రణ ఉంటుంది. కానీ అది ఉగ్రవాదానికి చరమగీతం పాడలేదు. నాలుగు–కశ్మీరీలకు పెట్టుబడులు,ఆర్థికాభివృద్ధి అవసరమనేది వాదన. దీన్ని నమ్మడమంటే మానవ మనస్తత్వాన్ని అడ్డగోలుగా అపార్థం చేసుకోవడమే. అక్కడి ప్రజల ఆగ్రహాన్ని, అవమానాలను, పరాయీకరణను పట్టించుకుని సరైన పరిష్కారం చూపకపోతే ఎంత ఆర్థికాభివృద్ధి అయినా, ఉదారత అయినా జన హృదయాలను మార్చలేవు. ఆస్తుల్ని కొనిపించడంద్వారా, బయటివారిని అక్కడ స్థిరపరచటం ద్వారా, అక్కడి మహిళలను పెళ్లాడటం ద్వారా... అసంబద్ధంగా, మొరటుగా జనాభా సమతూకాన్ని మార్చేస్తామంటే అది పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. జమ్మూ–కశ్మీర్ భారత్ భూభాగం. దాన్నెవరూ ౖకైవసం చేసుకోలేరు. కానీ లోయలోని ప్రజలు మీతో లేకుంటే దాన్ని మీరు మార్చలేరు. ఇక చివరిది, అయిదోది అత్యంత సున్నితమైన కాల్పనికత. ఇది స్వీయ వినాశనానికి చేరువచేసేంత ప్రమాదకరమైనది కూడా–అది జనాభా సమతూకాన్ని మార్చాలనుకోవడం. ఇజ్రాయెల్ గుణపాఠాలను, వాటి సారాంశాన్ని సరిగా గ్రహిస్తే మీరసలు ఆ పనికే పూనుకోరు. ఇక్కడ కశ్మీర్ భూభాగం మన స్వాధీనంలోనే ఉంది. పాకిస్తాన్, చైనాలు తప్ప ప్రపంచంలో అందరూ దీన్ని గుర్తించారు. కానీ ఇజ్రాయెల్‌కు అలా కాదు. అది యూదు దేశమైతే, మనది లౌకికవాద గణతంత్రం. కశ్మీర్లో అది సాధ్యపడాలంటే కోటిమంది హిందువులను అక్కడ స్థిరపరచాలి. అది చైనాలో సాధ్యమేమోగానీ ఇక్కడ కాదు. అలాంటి పని చేసి కూడా అది టిబెట్లోగానీ, జిన్జియాంగ్లోగానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నది. అటు ఇజ్రాయెల్‌కు కూడా ఈ పని భద్రతను, సుస్థిరతను చేకూర్చలేకపోయింది. చైనా, ఇజ్రాయెల్ దేశాల కఠినత్వం మనల్ని విస్మయపరుస్తుంది. కానీ వీటికి లేని సామర్థ్యం మనకుంది. వైవిధ్యతను సులభంగా హత్తుకునే సామర్థ్యమది. కశ్మీర్‌కు చేరువ కావడానికి అదే అత్యుత్తమ విధానం. హృదయాలను, మనసులను గెలవడానికి అదే మార్గం. వారి ఆత్మగౌరవానికి, వారి ప్రతిష్టకూ, వారి విలక్షణతను పరిరక్షించడానికి పాకిస్తాన్ కన్నా మనం మెరుగైన ప్రతిపాదన చేయగలమా? ఇప్పుడు మనం వాజపేయి విధానాల ద్వారా నేర్చుకోవాలి తప్ప జీ జిన్‌పింగ్ విధానాలద్వారా కాదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మన అణ్వస్త్ర విధానం మారొచ్చు
జైపూర్/న్యూఢిల్లీ: సరిహద్దులో పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నవేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదు’అన్న విధానానికే భారత్ కట్టుబడి ఉందనీ, అయితే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను రాజ్‌నాథ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది. కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘భారత్ బాధ్యతాయుతమైన అణ్వస్త్రశక్తిగా మారడం ప్రజలందరికీ గర్వకారణమే. ఇందుకు భారత్ అటల్జీకి రుణపడి ఉంటుంది’అని ట్వీట్ చేశారు. మరోవైపు రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అణ్వాయుధాల ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను బయటపెట్టాలనీ, ఈ అస్పష్టతకు తెరదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వెనుక దేశమంతా నిలబడుతుందనీ, అయితే ముందుగా మన అణు విధానంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరింది. -
‘కశ్మీర్ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది’
కోల్‌కతా : జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరు జాతీయ భద్రత గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా కోల్‌కతాలోని ఐసీసీఆర్ వద్ద ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...‘72 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రోజురోజుకీ మన జనాభా పెరగిపోతోంది. కానీ మనకు సరిపడా భూములు లేవు. భారత్ వంటి దేశాలు ఆహార ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడకూడదు. సొంతంగా పంటలు పండించుకోవాలి. అందుకే జనాభాను నియంత్రించగలగాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఉటంకించారు. ప్రపంచం భారత్‌ను గౌరవించింది అపుడే.. అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించిన అనంతరం వెంకయ్యనాయుడు ఆయన సేవలను ప్రస్తుతించారు. ‘ అటల్జీ పాలనలోనే అసలైన సంస్కరణలు మొదలయ్యాయి. ‘సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పాటు సామాన్యుల జీవితాలను మార్చే విధంగా క్రమపద్ధతిలో ఆయన పాలన సాగింది. సుస్థిరాభివృద్ధికి అటల్జీ హయాంలోనే బీజం పడింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలించారు. సుపరిపాలన అందించారు. అప్పుడే ప్రపంచం భారత్‌ను గౌరవించడం మొదలుపెట్టింది’ అని వెంకయ్యనాయుడు వాజ్‌పేయి పాలనను కొనియాడారు. -
పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్!
జైపూర్ : ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే అంశంలో భారత్ భవిష్యత్తులో తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్లో ఆయనకు రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. వాజ్‌పేయి చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అణ్వాస్త్రాలను సంధించే విధానంలో ఇప్పటిదాకా భారత్ అనుసరించిన విధానంలో మార్పు రావొచ్చని పేర్కొన్నారు. ‘భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించుకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోంది. నేటికీ ఆ విషయానికి కట్టుబడి ఉంది. అయితే భవిష్యుత్తులో ఎదురయ్యే పరిస్థితులపైనే ఈ విధానం ఆధారపడి ఉంటుంది ’అని పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. జాతి మొత్తం రుణపడి ఉంది ‘భారత్ అణ్వాయుధ దేశం. ఈ విషయం ప్రతీ భారతీయ పౌరుడు గర్వించదగినది. ఈ కారణంగా భరత జాతి మొత్తం అటల్జీకి రుణపడి ఉంది. పోఖ్రాన్లో చేపట్టిన పరీక్షల ద్వారా మన అణ్వాయుధ శక్తి అందరికీ తెలిసింది. అదే విధంగా మొదటగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదనే నియమాన్ని అనుసరిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులపైనే ఈ విధానం ఆధారపడి ఉంది’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో...భారత్ అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 1998 మార్చి 11, 13 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్ ప్రాంతంలో ఐదు అణుపరీక్షలు నిర్వహించారు. ఇక కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశ పాకిస్తాన్ భారత్‌ను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ కోసం అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఈ విషయంలో చైనా, ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మధ్యవర్తిత్వం మేరకు కశ్మీర్ అంశంపై నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. Pokhran is the area which witnessed Atal Ji’s firm resolve to make India a nuclear power and yet remain firmly committed to the doctrine of ‘No First Use’. India has strictly adhered to this doctrine. What happens in future depends on the circumstances. — Rajnath Singh (@rajnathsingh) August 16, 2019 -
అటల్జీ తొలి వర్ధంతి : అగ్ర నేతల నివాళి
సాక్షి,,న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు శుక్రవారం .దేశ రాజధానిలోని వాజ్‌పేయి స్మృతి కేంద్రం సదవ్ అటల్‌ను సందర్శించిన నేతలు వాజ్‌పేయి జాతికి అందించిన సేవలను ప్రస్తుతించారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారిక పలువురు బీజేపీ నేతలు, పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి దివంగత నేతకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వాజ్‌పేయి తొలి వర్ధంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. -
వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ
భారతీయత నిండుదనానికి ఆమె చిరునామా. భారతీయుల స్వప్నానికి ప్రతిబింబం. సాటి లేని వాగ్ధాటి ఆమె సొంతం. ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ... చెప్పాలనుకున్న విష యాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంలో అందివేసిన చేయి. ఏపనైనా అలవోకగా చేసే ధైర్యం, తెగువ ఆమె సొంతం. రాజకీయంగా... అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించారు. ఒక స్త్రీగా, ఇల్లాలిగా, రాజకీయనాయకురాలిగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా సంపూర్ణ మహిళగా ఖ్యాతి పొందారు. ఆమె మరెవరో కాదు భారత వీరనారి, ద గ్రేట్ లెజెండ్ సుష్మ స్వరాజ్. పుట్టి పెరిగింది ఉత్తరాదిలోనైనా... దక్షిణాదిలో కూడా ఆమె సుపరిచితురాలే. పార్టీ అధినేతలకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఆమె పాపులర్ అయ్యారు. పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా తన మార్క్ ఉండాల్సిందే. హర్యానాలో విద్యా భ్యాసం చేసిన సుష్మ 20 ఏళ్లకే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జయప్రకాష్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత బీజేపీలో చేరి అంచ లంచెలుగా ఎదిగారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీ జాతీయ నాయకురాలి స్థాయికి చేరుకున్నారు. 25 ఏళ్లకే అంబాలా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది 27 ఏళ్లకే హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికై ఔరా అన్పించుకున్నారు. నాలుగుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నిక య్యారు. 1999లో బళ్లారి నుంచి లోక్ సభకు పోటీ చేసి సోనియాకు సవాల్ విసిరి.. దేశమంతా తనవైపు చూసేలా ప్రచారం సాగించారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. వాజ్‌పేయి హయాంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సమాచార శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి అప్పుడే వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త ఒరవడి తీసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉంటూ లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 15వ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సుష్మ కీలక బాధ్యత నిర్వర్తించారు. 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు పొందారు. ఇక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కేబి నెట్లో కీలక విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మ ఆ శాఖకు ముందెన్నడూ లేని గుర్తింపు తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా దేశానికి తరలించడానికి చేసిన కృషి అనన్య సామాన్యమైంది. కల్లోల దేశాల్లో ప్రజల్ని రక్షించేందుకు తాను నేరుగా ఆయా దేశాల రాయ బార కార్యాలయాలతో చర్చలు జరిపేవారు. పార్లమెంట్ లో సుష్మ చేసే ప్రసంగాలకు ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అందరూ జేజేలు పలికేవారు. భాషపై పట్టు, వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆమె ఇట్టే కట్టిపడేసేవారు. విదేశాంగ మంత్రిగా ఉంటున్న సమయంలో వచ్చిన ఆనారోగ్యం సుష్మను ఊపిరి సలుపుకోనివ్వలేదు. అందువల్లే గత ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తన జీవిత కాలంలోనే చూడాల్సిన ఘట్టంగా, చనిపోయే ముందు చేసిన ట్వీట్ భారతదేశాన్ని కన్నీరు పెట్టించింది. సుష్మ చనిపోయారన్న నిజాన్ని భారతీయులెవరూ జీర్ణించుకోలేకోపోయారు. సంతాప సందేశాల్లో ప్రపంచదేశాధినేతలు కన్నీటి పర్యంతమయ్యారంటే విదేశాంగ విధానంపై సుష్మ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విదేశాంగ విధానానికి గానీ, బీజేపీ పార్టీకి గానీ సుష్మ స్వరాజ్ ముందు, సుష్మ స్వరాజ్ తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే అలాంటి నేత మరొకరు ఉండరు. ఉండబోరు. ఆ ఘనత ఒక్క సుష్మకు మాత్రమే దక్కుతుంది. పురిఘళ్ల రఘురామ్: బీజేపీ సమన్వయకర్త, ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
పట్టపగలే పాక్‌కు చుక్కలు చూపించిన భారత్
1999 జూలై 26 భారతీయులెవ్వరు మరచిపోలేని రోజది. సరిగ్గా 20 యేళ్ల క్రితం దేశం మొత్తం జయహో భారత్ అంటూ నినాదాలు చేసిన రోజది. పాక్ ఆర్మీకి పట్టపగలే చుక్కలు చూపించిన సందర్భం.20 యేళ్ల మరుపురాని జ్ఞాపకం కార్గిల్ విజయ దివస్. భారత జాతి ఐక్యతను చాటిన సంఘటనలో కార్గిల్ యుద్ధం ఒకటి. అసలు కార్గిల్‌ను ఆక్రమించుకొవడం వెనుక ఉన్న పాక్ కుతంత్రం ఏమిటి? ఆ యుద్ధంలో మన సైనికులు ఎంత విరోచితంగా పోరాడో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం. -
ఓడిపోతే.. రాజీనామా చేయాలా?
ముంబై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పరోక్షంగా స్పందించారు. ‘ఎన్నికల్లో అటల్ బిహారి వాజ్‌పేయితో పాటు మహామహులైన చాలామంది రాజకీయ నేతలు ఓడిపోయారు. కానీ, వారు ఎన్నడూ మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని’ పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇటివలే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సబర్బన్ బోరివాలిలోని ‘అటల్ స్మృతి ఉద్యాన్’ ప్రారంభోత్సవ వేడుకలో గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఠాక్రే పాల్గొన్నారు. ఎన్నికల్లో స్వతహాగా ఒక్కసారి కూడా పోటీ చేయని ఠాక్రే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివసేన, దాని మిత్రపక్షమైన బీజేపీ అనేకసార్లు ఎన్నికల్లో ఓడిపోయాయని, కానీ తమ నాయకులు ఎన్నడూ నిష్క్రమించలేదన్నారు. -
ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్‌పేయి ఆదేశం!
2001, డిసెంబర్ 13న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించారు. పాక్ తన శిబిరాన్ని వేరే చోటుకు మార్చడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అమెరికాపై అల్ ఖాయిదా దాడి(9/11) నేపథ్యంలో ఆఫ్ఘన్‌పై యుద్ధానికి దిగిన అమెరికాకు మద్దతివ్వాలని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. దానివల్ల క కలిగే నష్టాలను గుర్తించిన వాజ్‌పేయి దౌత్యనీతిని ఉపయోగించి నిర్ణయాన్ని దాటవేశారు. ‘ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్: మెమరీస్ ఆఫ్ ఏ మిలటరీ చీఫ్(గుర్తుంచుకోదగిన ప్రధాని:సైన్యాధిపతి జ్ఙాపకాలు) పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్ కుమార్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. పార్లమెంటుపై దాడి జరగ్గానే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాలతో సమావేశమయ్యారు. పీవోకేలో ఉన్న ఉగ్ర శిక్షణా శిబిరంపై దాడికి అన్ని నిర్ణయించాం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, పాకిస్తాన్ ఆ శిబిరాన్ని ఒక స్కూలు, హాస్పటల్ మధ్యకి మార్చినట్టు చివరి నిముషంలో తెలిసింది. శిబిరంపై దాడి చేస్తే జననష్టం జరుగుతుందన్న భావంతో ప్రధాని వాజ్‌పేయి దాడి చేయవద్దన్నారు. అని సుశీల్ తన 135 పేజీల పుస్తకంలో పేర్కొన్నారు.