సాక్షి, ముంబై : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికల యాత్రలో బీజేపీ నేత సెల్ఫీ తీసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. ఔరంగాబాద్ డిప్యూటీ మేయర్ విజయ్ ఔతడే దివంగత నేత అస్థికల యాత్ర సాగుతుండగా సెల్ఫీ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాజ్‌పేయి అస్థికల యాత్ర ముంబై నుంచి ఔరంగబాద్‌లోని ఉస్మాన్‌పురాకు చేరుకుని జల్నాకు వెళుతుండగా ఔతడే సెల్ఫీలు తీసుకున్నారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బీజేపీ నేత చర్యను తప్పుపట్టారు. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో జరిగిన వాజ్‌పేయి సంస్మరణ సభలో ఇద్దరు మంత్రులు నవ్వుల్లో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. సంతాప సభలో మంత్రులు బ్రిజ్‌మోహన్ అగర్వాల్, అజయ్ చంద్రార్కర్‌లు జోక్‌లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఇద్దరు మంత్రుల తీరుపైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దిగ్గజ నేతకు నివాళులు అర్పించేంది ఇలాగేనా అంటూ మంత్రులను నెటిజన్లు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment