Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి | Pankaj Tripathi to play role of Atal Bihari Vajpayee in biopic | Sakshi
Sakshi News home page

Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి

Published Sat, Nov 19 2022 4:17 AM | Last Updated on Sat, Nov 19 2022 4:17 AM

Pankaj Tripathi to play role of Atal Bihari Vajpayee in biopic - Sakshi

భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్‌ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు.

‘‘అటల్‌ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్‌ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్‌ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement