Tripathi
-
మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ్ దవే వాదించారు. మమత చేసిన వ్యాఖ్యలేంటి? కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో మమత పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్(సింగ్)రాజ్’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. ‘‘ అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్‌చేశారు. అఖిలేశ్‌యాదవ్ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్‌లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పంకజ్ కుమార్ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్ఐఆర్లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి. ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్ఐఆర్లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల మరో జర్నలిస్ట్‌కూ రక్షణ ఇదే ఉదంతంలో అక్టోబర్ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం తనపై మోపిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకదాంట్లో అభిõÙక్ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం ఇటీవల మరో జర్నలిస్ట్ అభిషేక్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది. -
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందకుపైగా ట్రైన్లు రద్దు
తాటిచెట్లపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వర్–మంచేశ్వర్, హరిదాస్పూర్–ధన్మండల్ సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం త్రిపాఠి శనివారం తెలిపారు. కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 20 వరకు కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం–రాజమండ్రి(07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం(17240/17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రెండు వైపులా రద్దు చేసినట్లు వివరించారు. విజయవాడ డివిజన్లో... విజయవాడ డివిజన్లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్ని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ–బిట్రగుంట (07978) రైలు ఈ నెల 13 నుంచి 19 వరకు, బిట్రగుంట–విజయవాడ (07977) రైలు ఈ నెల 14 నుంచి 20 వరకు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఈ నెల 16 నుంచి 18 వరకు, విజయవాడ–గూడూరు (07500)రైలు ఈ నెల 16 నుంచి 20 వరకు, గూడూరు–విజయవాడ (07458) రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు రద్దు చేశారు. కాగా, నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. యర్నాకుళం–పాట్నా (22643) రైలును ఈ నెల 14, 15 తేదీల్లో, బెంగళూరు–గౌహతి (12509) రైలును ఈ నెల 16, 17, 18 తేదీల్లో, కోయంబత్తూర్–సిల్చర్ (12515) రైలును ఈ నెల 13, 20 తేదీల్లో, భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రాధిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెదిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో మృతి చెందిన రాధిక కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. గాయపడిన రాజా, నాగరత్నమ్మలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి.. తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుంచి ప్రమాద వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన మంత్రి గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై వెనువెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ హెచ్ఎంఐడీసీ ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డిని ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్లకు సూచించారు. స్విమ్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్‌లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఆకస్మికంగా పెచ్చులు ఊడి పడటంతో ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. -
వాటికి నా ఆన్సర్ ‘నో’ అని చెప్తాను
శ్వేత త్రిపాఠి... మల్టీప్లెక్స్, ఓటీటీతో పరిచయం ఉన్నవాళ్లందరికీ తెలిసిన నటి. తన నటనా సామర్థ్యాన్ని సవాలు చేసే పాత్రలంటే అమితమైన అభిమానం ఆమెకు. బర్త్ ప్లేస్ ఢిల్లీ. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్. తల్లి టీచర్. ఇద్దరు తోబుట్టువులు.. అక్క, తమ్ముడు. భరతనాట్యం, కథక్ నృత్యాల్లో శిక్షణ పొందింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చదివింది. యాక్టింగ్‌లో భవిష్యత్‌ను వెదుక్కుందామని ముంబై వచ్చి ఫొటోగ్రఫీ ప్రేమలో పడిపోయింది. ఫెమినా మ్యాగజైన్లో ఫొటో ఎడిటర్‌గా చేరింది. నటనలో తర్ఫీదు తీసుకోవడానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరమని సన్నిహితులు చెప్పారు. కాని ఫ్యాషన్ డిగ్రీ కోసం అప్పటికే నాలుగేళ్ల చదువు ఎక్కవనుకున్న శ్వేత యాక్టింగ్ కోసం ఎన్ఎస్డీలో మళ్లీ మూడేళ్లు వెచ్చిచండం వేస్ట్ అనుకుంది. అందుకే షార్ట్‌కట్‌ను ఎంచుకుంది తన టాలెంట్‌కు మెరుగులు దిద్దుకోవడానికి.. ఎన్ఎస్డీ డైరెక్టర్ (అప్పటి) నిర్వహించిన ఆర్నెల్ల వర్క్‌షాప్‌కు హాజరై. కెమెరా కంటే ముందు కెమెరా వెనక పనిచేసింది అసిస్టెంట్ డైరెక్టర్‌గా. సినిమాల్లో కంటే ముందు టెలివిజన్ సీరియల్లో కనిపించింది. ఆమె ఫస్ట్ టెలివిజన్ షో... క్యా మస్త్ హై లైఫ్. తొలి సినిమా.. మసాన్. థియేటర్ (నాటకాలు) అంటే కూడా శ్వేతకు చాలా ఇష్టం. ఒకవైపు ఫెమినాలో ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు థియేటర్లో ఎక్స్పరిమెంట్స్ చేసేది. ఫెమినా జాబ్ వదిలేశాక నాటకాల కోసం ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది ‘ఆల్ మై టీ (All My Tea) ప్రొడక్షన్స్’ పేరుతో. నాట్యం, స్కూబా డైవింగ్, ట్రావెలింగ్, రీడింగ్ అంటే కూడా ఆమెకు ఆసక్తే. దంగల్ ఆడిషన్స్‌కు వెళ్లింది... కాని ఆ పాత్రకు ఫాతిమా సనా షేఖ్ ఖరారు అయింది. ‘‘అలా ఏరికోరి ఎందుకు ఎంచుకుంటావ్.. వచ్చిన అవకాశాలన్నిటినీ అందుకోక? అని నా శ్రేయోభిలాషులు చాలామంది సలహాలిస్తూంటారు. కాని నేనలా చేయలేను. ఆర్టిస్ట్‌గా నేనేం చేస్తున్నానో జనాలు గమనిస్తారు. సినిమాల్లోనే కాదు ప్రకటనల విషయంలోనూ ఆ ఎరుకతో ఉంటా. అందుకే ఫెయిర్‌నెస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్ ప్రమోషన్ యాడ్స్‌కు నేను దూరం. వాటికి నా ఆన్సర్ ‘నో’ అని చెప్తుంది శ్వేత త్రిపాఠి. -
కోవిడ్‌తో ‘లోక్‌పాల్’ త్రిపాఠీ కన్నుమూత
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్ సోకిందని, వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు. -
గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ భదోహి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితో పాటు పలువురు తనని గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా 2016లో తొలిసారి త్రిపాఠి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని పేర్కొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ హోటల్ రూమ్ తనని ఉంచాడని, అదే సమయంలో కొంతమంది నిందితులు తనపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. విచారణ చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ ప్రధాన న్యాయమూర్తి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత కేసు దర్యాప్తు చేయాలని సూపరిటెండెంట్ రామ్ బదన్ సింగ్ తో పాటు గులాఫ్షా మహిళా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తో సహా ఇద్దరు సభ్యుల బృందానికి కేసును అప్పగిస్తూ తీర్పిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు..వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె ఒప్పుకోవడం లేదని ఎస్పీ తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేనందున ఎమ్మెల్యే త్రిపాఠికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపిన ఎస్పీ.. గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే మేనల్లుడు సందీప్ తివారీ, మరో బంధువు నితేష్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. కాగా తాను గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని ఎమ్మెల్యే త్రిపాఠి తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఆమె ఫిర్యాదులో వెల్లడించినట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు. -
ఇదేమీ ఉత్తరప్రదేశ్ కాదు
త్రిపాఠిపై టీఎంసీ నేతల ఫైర్ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ కేఎన్ త్రిపాఠిపై బుధవారం విమర్శల వర్షం కురిపించింది. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. తన పరిమితులు మించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ.. త్రిపాఠిపై మంగళవారం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బీజేపీ బ్లాక్ ప్రెసిడెంట్ లాగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌పై మమత మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ.. ‘గవర్నర్ తన పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రితో అవమానకరంగా మాట్లాడారు. ఇదేమీ ఉత్తరప్రదేశ్ కాదు.. బీజేపీ కార్యాలయం అంతకన్నా కాదు’ అని హెచ్చరించారు. -
‘నాజీవితంలో ఇంత అవమానం పడలేదు’
కోల్‌కతా: ‘ఇలాంటి మాటలు నా జీవితంలో ఇప్పటి వరకు వినలేదు. అలాంటి భాష నేనెప్పుడు చూడలేదు. క్షమించండి ఇలాంటి భాష మున్ముందు వినాలనుకోవడం లేదు’అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ గవర్నర్ త్రిపాటిని ఉద్దేశించి అన్నారు. గవర్నర్ తనతో మాట్లాడిన ప్రతిసారి అవమానిస్తున్నారని, అవహేళన చేస్తున్నారని మండిపడిన ఆమె ఆయన ఉపయోగిస్తున్న భాష తన జీవితంలో ఇప్పటి వరకు వినలేదని చెప్పారు. ‘ఆయన మాట్లాడే తీరు నాకు అవమానంగా అనిపిస్తోంది. గవర్నర్ బీజేపీ బ్లాక్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి.. అలాంటి భాష ఇక నేను వినాలనుకోవడం లేదు. నా జీవితంలో ఇలాంటి భాష వినలేదు. ఆయన నన్ను బెదిరిస్తున్నారు. ఆయనతో మాట్లాడిన తీరు చూస్తుంటే ఇప్పుడే రాజీనామా చేసి నా కుర్చీలో నుంచి దిగిపోవాలనిపిస్తోంది. నేనేం ఆయన ఆశీస్సులతో అధికారంలోకి రాలేదు. ప్రజల దీవెనలతో వచ్చాను. ఆయన నిజంగా రాజ్యాంగ బద్ధ పదవిని అనుభవిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఒక వర్గం వైపే మాట్లాడితే ఎలా? రెండు వైపుల ఉన్న వాదాలు వినాలి. నా మనసు తీవ్రంగా గాయపడింది. మతం పేరిట విభజన చేయడాన్ని నేను ఏమాత్రం అంగీకరించను. నేను ప్రజల ద్వారానే అధికారంలోకి వచ్చాననే విషయం మర్చిపోవద్దని గవర్నర్ గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బదురియా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై మాట్లాడేందుకు గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. -
పెళ్ళిపీటలు ఎక్కనున్న దివ్యాంకా త్రిపాఠీ
ఏహై మొహబ్బత్ ఫేమ్ దివ్యాంకా త్రిపాఠీ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు తాజా వార్తలనుబట్టి తెలుస్తోంది. అయితే దివ్యాంకా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాసం కూడ అదే విషయాన్ని నిర్థారిస్తోంది. ఆమెకు చాలాకాలం పాటు బాయ్ ఫ్రెండ్ గా ఉన్న నటుడు, ప్రియుడు శరద్ మల్హోత్రా తో విడిపోయిన తర్వాత కొంతకాలంపాటు తన సహ నటుడు వివేక్ దహియా తో దివ్యాంకా డేటింగ్ కొనసాగించింది. ఇప్పుడు అతడినే జూలై నెలలో వివాహం చేసుకునేందుకు ముందుగా హష్- హష్ వేడుకగా జరిపే నిశ్చితార్థ కార్యక్రమాన్ని కూడ నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుబ సభ్యుల అంగీకారంతో నిశ్చయమైన తమ వివాహానికి జూలై నెలలో తేదీని ఖరారు చేస్తారని దివ్యాంకా స్వయంగా పోస్టు చేసిన వ్యాసాన్ని బట్టి తెలుస్తోంది. వివేక్, దివ్యాంకాలు అమితమైన ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కూడ ఆమె పంచుకున్న ఆనందాన్నిబట్టి అర్థమౌతోంది. అయితే శరద్ మల్హోత్రాతో విడిపోయిన విషయం ప్రచార సాధనాల ఉచ్చులో పడలేదని చెప్తోంది. విడిపోవడం భవిష్యత్తులో తనకు మరింత ఆనందాన్ని కలిగించాలని కూడ దివ్యాంకా కోరుకుంటోంది. ఛండీగఢ్, లేదా భోపాల్ లలో వివాహ కార్యక్రమం జరగనున్నట్లు దివ్యాంకా పోస్టును బట్టి తెలుస్తోంది. వివేక్ స్వస్థలం చండీగఢ్ లో గాని, దివ్యాంక స్వస్థలం భోపాల్ లో గాని వివాహం జరిగిన అనంతరం ముంబైలో భారీ రిసెప్షన్ వేడుకను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. -
తెరపై మరో 'అందాల రాక్షసి'
-
'వారి చర్యలు రాజకీయ ప్రేరేపితం'
దేశంలో రచయితలు, మేధావులు తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తున్న చర్యలను రాజకీయ ప్రేరేపిత చర్యలుగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ కే.ఎన్.త్రిపాఠి అభివర్ణించారు. సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన తరువాత దేశంలో ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు స్పందించని వీరంతా హఠాత్తుగా మేల్కొనడం వెనుక రాజకీయ శక్తుల హస్తం ఉందన్నారు. హేతువాద రచయిత నరేంద్ర దబోల్కర్, వామపక్ష వాది నరేంద్ర దబోల్కర్, ప్రముఖ పండితుడు కాల్బుర్గీల హత్యలతో మతవాదులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వినతి చేస్తూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు రచయితలు నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ .త్రిపాఠి ఈ వ్యాఖ్యలు చేశారు.