
ఇదేమీ ఉత్తరప్రదేశ్ కాదు
త్రిపాఠిపై టీఎంసీ నేతల ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ కేఎన్ త్రిపాఠిపై బుధవారం విమర్శల వర్షం కురిపించింది. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. తన పరిమితులు మించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
సీఎం మమతా బెనర్జీ.. త్రిపాఠిపై మంగళవారం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బీజేపీ బ్లాక్ ప్రెసిడెంట్ లాగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌పై మమత మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ.. ‘గవర్నర్ తన పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రితో అవమానకరంగా మాట్లాడారు. ఇదేమీ ఉత్తరప్రదేశ్ కాదు.. బీజేపీ కార్యాలయం అంతకన్నా కాదు’ అని హెచ్చరించారు.