![Jharkhand Governor invites Hemant Soren to form government on July 7](/styles/webp/s3/article_images/2024/07/4/cm.jpg.webp?itok=zQ-pvecr)
జార్ఖండ్‌లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారు
ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment