breaking news
Jharkhand
-
అసలే కోతి.. ఆపై..!
రాంచీ: కోతి పనులు చేయకురా అని చిన్నారులను పెద్దలు మందలిస్తూనే ఉంటారు. అయినా పిల్లలు వినరు. ఇక కోతులు అస్సలు వినవు. అవి చేసే గోలకు అంతే ఉండదు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఔర్మాంఝీ ప్రాంతంలోని ఒక మద్యం దుకాణంలో శనివారం కస్టమర్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక కోతి హఠాత్తుగా దుకాణంలోకి దూరింది. దీంతో కౌంటర్లోని వ్యక్తులు భయంతో బయటకు పరుగులుతీశారు. కోతి మాత్రం నింపాదిగా దుకాణంలో చక్కగా పేర్చిన బీర్, విస్కీ, రమ్, వోడ్కా బాటిళ్లను తేరిపార చూసి మూత తీసి ఉన్న ఒక ‘మ్యాజిక్ మూమెంట్స్’బ్రాండ్ వోడ్కా బాటిల్‌ను అమాంతం తాగేసింది. కొద్ది నిమిషాలకే మద్యం మత్తు దానికి ఎక్కడం మొదలైంది. అప్పటిదాకా మద్యం సీసాల కార్టన్ల మీద గెంతుతూ హడావుడి చేసిన కోతి కొద్ది నిమిషాలకే వాటిపై నిద్రపోయింది. మధ్యమధ్యలో కళ్లు తెరుస్తూ ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు. కోతిచేష్టల తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం దుకాణాదారుడు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి కోతిని బయటకు తీసుకెళ్లారు. దుకాణంలో మర్కటం హడావుడి వీడియో చూసిన నెటిజన్లు జోకులు పేల్చారు. కోతి వీడియోను కామెడీగా మార్చిన వాళ్లను కొందరు పర్యావరణవేత్తలు తప్పుబట్టారు. అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఇది గర్భంతో ఉన్న కోతి. దప్పిక వేళ ఎక్కడా తాగేందుకు నీరు దొరక్కపోవడంతో దుకాణంలోని సీసాల్లో ఉన్నవి నీళ్లు అని భావించి లోపలికి వచ్చి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. -
ట్రక్‌ను ఢీకొన్న కారు.. మంత్రి కుమార్తెతో సహా నలుగురు మృతి!
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంషెడ్పూర్ జిల్లా డోముహానీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి కారు, ట్రక్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. డోముహానీ సమీపంలో ఆగి ఉన్న ట్రక్‌ను కారు ఢీకొన్నట్లు సమాచారం. అత్యంత వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. దీపికా పాండే సింగ్ కుమార్తె మృతిపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా దీపికా పాండే సింగ్ ప్రభుత్వం తరఫున విద్యార్థుల మద్దతుగా మాట్లాడారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని, ఆందోళనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్, పెలెట్ గన్ వంటివి ఉపయోగించకూడదని ఆమె కోరారు. ఆగస్టు 17న రాంచీ సదర్ ఆసుపత్రిలో విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నిరాహార దీక్షను జ్యూస్ ఇచ్చి విరమింపజేశారు. ఈ సమయంలో ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ కూడా అక్కడ ఉన్నారు. -
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో విషాదకర చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను (56) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గిరిడీహ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సుదివ్య సోను గిరిడీహ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లో కీలక నేతగా కొనసాగుతున్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై సీఎం హేమంత్ సోరేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మృతి జేఎంఎం కుటుంబానికి, జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదివ్య సోను సేవలు, పార్టీకి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.Jharkhand Mukti Morcha tweets, "The Jharkhand Mukti Morcha family is stunned and heartbroken by the untimely demise of Sudivya Kumar, a dedicated comrade of Jharkhand Mukti Morcha and a minister in the Jharkhand government. His departure is an irreplaceable loss for the party,… pic.twitter.com/Qapd1IKWaj— ANI (@ANI) September 6, 2026మరోవైపు.. జేఎంఎం నేత, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి దీపక్ బిరువా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదివ్య సోను ఆరోగ్యం గత రాత్రి అకస్మాత్తుగా క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు. జేఎంఎం కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొంటూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.ఇదీ చదవండి: లోహగడ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్.. -
పాతికేళ్ల జలయుద్ధానికి తెర: బిహార్, జార్ఖండ్‌ల కీలక ఒప్పందం!
రెండున్నర దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన జల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సోన్ నది నీటి పంపకాలపై గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఢిల్లీ వేదికగా ముగిసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల అన్నదాతల భవితవ్యాన్ని మార్చే ఈ కీలక ఒప్పందం ప్రాజెక్టుల శకానికి కొత్త నాంది పలికింది.25 ఏళ్ల పగ ముగిసింది: ఢిల్లీలో చారిత్రక ఘట్టంసోన్ నది నీటి పంపకాలపై పాతికేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు దేశ రాజధానిలో తెరపడింది. ఈ తాజా చారిత్రక ఒప్పందం ప్రకారం మొత్తం కేటాయింపుల్లో బిహార్‌కు 5.75 మిలియన్ ఎకరాల అడుగుల ( ఎంఏఎఫ్) నీరు, జార్ఖండ్‌కు 2 ఎంఏఎప్ నీటిని కేటాయించారు. ఈ కీలక నిర్ణయంతో ఇరు రాష్ట్రాల్లోని కరువు పీడిత ప్రాంతాలలో దశాబ్దాలుగా మూలనపడిన సాగునీరు, రిజర్వాయర్ నిర్మాణాలు, నదుల అనుసంధాన ప్రాజెక్టులు శరవేగంగా పట్టాలెక్కనున్నాయి.విభజన తెచ్చిన చిచ్చు: వివాదం పుట్టిందిక్కడే!ఈ వివాదానికి మూలాలు నవంబర్ 2000 నాటి ఉమ్మడి బిహార్ విభజనలో ఉన్నాయి. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో సోన్ నది ప్రధాన ఎగువ పరివాహక ప్రాంతం, దాని ఉపనదులు జార్ఖండ్ పరిధిలోకి వెళ్లిపోయాయి. దిగువ మైదాన ప్రాంతాల్లోని సారవంతమైన వ్యవసాయ భూములు బిహార్‌లో ఉండిపోయాయి. నది పుట్టుక ఒకచోట, వ్యవసాయ క్షేత్రాలు మరోచోట కావడంతో సహజంగానే నీటి నియంత్రణ, వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.1973 బాణ్‌సాగర్ లింక్: 7.75 ఎంఏఎఫ్ వివాదంఈ సంక్షోభం వెనుక 1973 నాటి బాణ్‌సాగర్ ఒప్పందం కీలక పాత్ర పోషించింది. నాటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి బిహార్ మధ్య జరిగిన ఆ త్రైపాక్షిక ఒప్పందంలో ఉమ్మడి బిహార్‌కు మొత్తం 7.75 ఎంఏఎఫ్ నీటిని కేటాయించారు. అయితే 2000లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ 7.75 ఎంఏఎఫ్ నీటిని బిహార్, జార్ఖండ్‌లు ఎలా పంచుకోవాలనే దానిపై ఎలాంటి స్పష్టమైన చట్టబద్ధ నిబంధనలు రూపొందించలేదు. దాంతో రెండు దశాబ్దాలుగా అనేక కమిటీలు ప్రయత్నించినా రిజర్వాయర్ ఎత్తు, గ్రామాలు మునిగిపోతాయన్న భయాల నడుమ పంచాయితీ కొలిక్కి రాలేదు.ఇంద్రపురి బ్యారేజ్: సీన్ మొత్తం మారింది!ఈ తాజా ఒప్పందంతో రోహ్తాస్ జిల్లాలోని దేహ్రీ-ఆన్-సోన్‌కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ ఇంద్రపురి బ్యారేజ్ పూర్తిస్థాయి నిర్వహణకు మార్గం సుగమమైంది. జార్ఖండ్‌లోని గఢ్వా, పలాము జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ బ్యారేజీ.. బిహార్‌లోని షాహాబాద్ వ్యవసాయ ప్రాంతానికి ప్రధాన జీవనాధారం. తాజా ఒప్పందంతో బిహార్‌కు సాగు కోసం అదనపు నీరు లభించడమే కాకుండా, జార్ఖండ్ భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ నీటిమట్టాన్ని పరిమిత స్థాయిలో ఉంచేందుకు, అవసరమైన పునరావాసం కల్పించేందుకు స్పష్టమైన నియమావళి ఖరారైంది.రాజకీయ ప్రకంపనలు: ఇరు రాష్ట్రాల్లో దశాబ్దాల సెగగత పాతికేళ్లలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నేరుగా యుద్ధ వాతావరణం కనిపించకపోయినా, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సోన్ నది అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఖరీఫ్ సీజన్లో కాలువలకు నీరు రాకపోతే బిహార్ నాయకులు సర్కారుపై విరుచుకుపడేవారు. మరోవైపు ఇంద్రపురి డ్యామ్ ఎత్తు పెంచితే తమ భూములు మునిగిపోతాయని, ప్రజలు నిరాశ్రయులవుతారని జార్ఖండ్ నేతలు అడ్డుకున్నారు. వేర్వేరు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో పరస్పర నిందారోపణల నడుమ ఈ సమస్య దశాబ్దాల పాటు నలిగిపోయింది.రంగంలోకి కేంద్ర జల సంఘం: చివరకు పరిష్కారం!ఈ సుదీర్ఘ ప్రతిష్టంభనను ఛేదించడంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కీలక దౌత్యం నడిపింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా సాంకేతిక అధ్యయనాలు, హైడ్రాలజీ సర్వేలు జరిపి డ్యామ్ ఎత్తుపై ఆమోదయోగ్యమైన మార్పులను ప్రతిపాదించింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఫైలును ఓ కొలిక్కి తెచ్చారు. ఫలితంగా జార్ఖండ్‌లోని పలాము, గఢ్వా జిల్లాల దాహం తీరడంతో పాటు బిహార్‌లోని రోహ్తాస్, భోజ్‌పూర్, ఔరంగాబాద్ పొలాలకు పుష్కలంగా సాగునీరు అందనుంది.ఇది కూడా చదవండి: రాజస్థాన్ అంటే జైపూర్, ఉదయ్‌పూర్ కాదు.. మరి? -
పచ్చని రక్షాబంధన్
నీకు నేను రక్షా.. నాకు నువ్వు రక్షా.. అంటూ అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షాబంధన్. ఈ పండుగనే కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు జార్ఖండ్ ప్రజలు. వారు తమకు జీవనాధారాన్నిస్తున్న వృక్షాలనే తోబుట్టువులుగా భావిస్తూ.. వాటికి ప్రేమతో రాఖీలు కడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఈ సంప్రదాయంలో అక్కడి ప్రజలు వృక్షాలకు రాఖీలు కడుతూ లక్షల వృక్షాలను నరికివేత నుంచి కాపాడుకున్నారంటే .. వారికి ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. వృక్షాలకు రాఖీ కట్టి రక్షించుకునే ఈ గొప్ప కార్యక్రమం నిన్నామొన్నా మొదలైంది కాదు. దీని వెనుక 20 ఏళ్ల చరిత్ర ఉంది. 2004లో ధన్ బాద్ జిల్లాలోని లుకయా అనే చిన్న గ్రామంలో అటవీ అధికారి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా ఆ ఊరి ప్రజలు చెట్లకు రాఖీలు కడుతూ.. వాటిని సంరక్షిస్తూ నరికివేత నుంచి కాపాడుకుంటున్నారు.నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌లోని 24 జిల్లాలలో విస్తరించి ఉన్న 700కి పైగా గ్రామాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. ఈ ఉద్యమం ప్రారంభమైన మొదటి దశలోనే సుమారు ఒక లక్ష చెట్లకు రాఖీలు కట్టి రక్షించుకున్నారు. ఈ నెల రోజుల ప్రచారంలో మొత్తం 3 లక్షల వృక్షాలకు రాఖీ బంధనం వేసి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం వృక్షాల పరిరక్షణ వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఏకంగా 1128 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ప్రకృతికి, మనిషికి మధ్య విడదీయరాని బంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ ‘సేవ్ ట్రీ’ ఉద్యమం నేడు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. -
జార్ఖండ్‌లో 939 మంది విద్యార్థులపై కేసులు
రాంచీ: జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలిపిన వందలాది మంది విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికార విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులతో ఘర్షణ పడటం వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై 39 మంది పేరు తెలిసిన వ్యక్తులు, మరో 900 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులపై గిరిధ్, హజారీబాగ్ జిల్లాల్లో మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నియామక పరీక్షల్లో అవకతవకలు జరిపాయని ఆరోపిస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. అందులో భాగంగా గాంధీ మైదాన్‌లో విద్యార్థులు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిష్టి»ొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో పాల్గొన్న 14 మంది పేరు తెలిసిన వ్యక్తులు, మరో 200 మంది గుర్తు తెలియని వ్యక్తులపై రాంచీలోని కోత్వాలీ పోలీస్స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, వారిని గుర్తించేందుకు సీసీటీవీ, వీడియో ఫుటేజీలను విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నిరసనల సందర్భంగా నలుగురు ఎస్ఐలు సహా 8 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. -
భూమిపై తొలి జీవం భారత్‌లోనే పుట్టిందా?
న్యూఢిల్లీ: భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్‌లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5 బిలియన్) ఏళ్ల నాటి సూక్ష్మజీవుల అవశేషాలు (మైక్రోబియల్ మ్యాట్స్) లభ్యమైనట్లు పరిశోధకులు వెల్లడించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)శాస్త్రవేత్త త్రిస్రోతా చౌధురి నేతృత్వంలోని బృందం, యూరప్ అమెరికా పరిశోధకులతో కలిసి నిర్వహించిన ఈ అధ్యయనం ప్రతిష్టాత్మక ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైంది.జంషెడ్‌పుర్ సమీపంలోని భితర్దారి ప్రాంతంలో ఉన్న పురాతన రాళ్లపై నలుపు-తెలుపు చారల రూపంలో ఈ శిలాజాలు కనిపించాయి. జీవసంబంధ పదార్థంతో పాటు కాలగణనకు ఉపయోగపడే ‘జిర్కాన్’ స్పటికాలు ఒకే శిలలో కలిసి ఉండటం అత్యంత అరుదైన విషయమని, దీనివల్ల రాతి వయసును, జీవ ఉనికిని నేరుగా నిర్ధారించడం సాధ్యమైందని త్రిస్రోతా చౌధురి తెలిపారు. శిలలోని కార్బన్ సహజమైనదా లేక అగ్నిపర్వతాల వంటి ప్రక్రియల ద్వారా చేరిందా అని తేల్చేందుకు ‘రామన్ స్పెక్ట్రోస్కోపీ’ పద్ధతిని ఉపయోగించి పరిశీలించారు.ఈ కార్బన్ 324 నుంచి 369 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే ఎదుర్కొందని, ఇది అసలు రాతికి చెందిన స్వదేశీ పదార్థమేనని నిర్ధారించారు. అలాగే ఎనిమిది జిర్కాన్ స్పటికాలలోని యురేనియం-లెడ్ నిష్పత్తిని విశ్లేషించగా, వీటి వయసు 350 కోట్ల సంవత్సరాలుగా తేలింది. 3.5 బిలియన్ ఏళ్ల క్రితం తీవ్రమైన రసాయన పరిస్థితులు, చురుకైన అగ్నిపర్వతాలు, ఇనుము, సిలికా అధికంగా ఉన్న సముద్ర వాతావరణంలోనూ ఆదిమ సూక్ష్మజీవులు జీవించగలిగాయని, కార్బన్ డై ఆక్సైడ్‌ను సేంద్రియ పదార్థంగా మార్చే అధునాతన విధానాలను అప్పట్లోనే వినియోగించాయని ఈ పరిశోధన రుజువు చేస్తోంది.ఇది కూడా చదవండి: ‘సంభాల్ మాస్టర్‌మైండ్’కు ఉచ్చు.. రెడ్ కార్నర్ నోటీస్ జారీ! -
రాంచీలో బాహాబాహీ
రాంచీ: ఎంపిక పరీక్షల్లో అవకతవకలపై శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు తలపడ్డాయి. విద్యా ర్థుల నిరాహార దీక్షలు, తీవ్ర ఆందోళనల నడు మ జార్ఖండ్ పబిŠల్క్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించగా, అందుకు సంబంధించిన ఆదేశాలపై గురువారం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం తన చర్యను సరైన రీతిలో సమర్థించుకోకపోవడమే హైకోర్టు ఆదేశాలకు కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు జేపీ ఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫామ్స్ మంచ్ సారథ్యంలో ర్యాలీగా నగరంలోని ఆల్బర్ట్ చౌక్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోరెన్, రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు, అధికార జేఎంఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ర్యాలీ చేపట్టడంతోపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. ఈ సమయంలో మంచ్ నేత కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్పృహతప్పి పడిపోవడంతో సదర్ ఆస్పత్రిలో జాయిన్ చేశారని మరో నేత పియూశ్ కుమార్‌సింగ్ చెప్పారు. పోలీసులు విద్యార్థినులపైనా బలప్రయోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హజారీబాగ్, గిరిదిహ్‌లోనూ విద్యార్థులు సీఎం సోరెన్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించడం, జేఎంఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణలకు దారి తీసింది. -
జార్ఖండ్ ‘రద్దు’ నోటిఫికేషన్లపై స్టే
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్విసు కమిషన్(జేపీఎస్సీ) పరీక్షల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జార్ఖండ్ హైకోర్టులో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 11వ, 13వ జేపీఎస్సీ పరీక్షల ద్వారా జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల అమలుపై న్యాయస్థానం స్టే విధించింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వు అమలుపై కూడా స్టే విధించింది. నియమకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నోటిఫికేషన్లపై స్టే విధించింది. సెప్టెంబర్ 15లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతోపాటు స్పందనను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఏ అభ్యర్థి నియామకంలోనైనా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే, ఆ వ్యక్తి తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉద్యోగాన్ని కోల్పోతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. జేపీఎస్సీ ద్వారా జరిగిన నియామకాలను ప్రభుత్వం రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని కోర్టు గుర్తించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. కోర్టు స్టే వల్ల 450 మంది అభ్యర్థులకు ఉపశమనం లభించిందని అన్నారు. పబ్లిక్ సర్విసు కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు 25 రోజులపాటు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో, 2014 నుంచి జేపీఎస్సీ, ఒక అవుట్సోర్స్ ఏజెన్సీ నిర్వహించిన 45 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. -
పరీక్షల రద్దుపై ఉద్యోగుల ఆందోళన సెక్రటేరియట్ ముట్టడి
రాంచీ: పరీక్షార్థుల ఉద్యమధాటికి 45 పరీక్షలను జార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేస్తూ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేయడంతో గత పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకిస్తూ ఆందోళనలను ఉధృతంచేశారు. బుధవారం వందలాది మంది అభ్యర్థులు రాంచీలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమ సమస్యల్ని వివరిస్తామంటూ అభ్యర్థులు సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. దీంతో వీళ్లను ప్రధాన కార్యాలయం లోపలి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన అభ్యర్థులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. ప్రాంగణంలోకి రాకుండా అక్కడ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాసరే వాటిని లెక్కచేయకుండా పోలీసులను తోసుకుంటూ అభ్యర్థులు సెక్రటేరియట్ ప్రాంగణంలోకి వెళ్లి బైఠాయించారు. పరీక్షల్లో అక్రమాల కోణంలో దర్యాప్తు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మొత్తం పరీక్షల రద్దు అంటే తమ ఉద్యోగభవిష్యత్తు అంధకారంలో పడుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకునే దురుద్దేశం మాకు లేదు. శాంతియుతంగా ధర్నాలుచేసేందుకు మాకు ఒకటి, రెండు ధర్నాస్థలిలను ప్రభుత్వం సూచించింది. అక్కడ నిరసనలు ఆగవు. పరీక్షల్ని రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేదాకా మా ఆందోళనలు కొనసాగుతాయి’’అని అభ్యర్థుల నేత, ఇటీవల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం పొందిన చందన్ కుమార్ స్పష్టంచేశారు. హైకోర్టులో పలువురి పిటిషన్లు.. పరీక్షల్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ పలువురు అభ్యర్థులు బుధవారం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘పరీక్షల్ని రద్దుచేస్తే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. కుటుంబాలు వీధిన పడతాయి. అభ్యర్థుల భవిష్యత్ నాశనమవుతుంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుంటున్న అభ్యర్థులకు ఉపశమనం కల్పించేలా తగు ఆదేశాలు ఇవ్వండి. ప్రభుత్వ నిర్ణయం అమలుకాకుండా నిలువరించండి’’అని అద్వేష్ కుమార్ తదితరులు పిటిషన్లు దాఖలుచేశారు. -
ఉద్యమానికి విరామం
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం గత 25 రోజులుగా ఉద్యమిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థులు రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో తమ నిరసనకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పాత పరీక్షల రద్దు, జేపీఎస్సీ,జేఎస్ఎస్సీల్లో అస్తవ్యçస్త విధానాలు, పరీక్ష విధానంలో లోపాలను రూపుమాపాలంటూ తాము చేసిన డిమాండ్ల, పలు అంశాలను రెండు నెలల్లోపు పరిష్కరించాలని హేమంత్ సోరెన్ సర్కార్‌కు ఉద్యమనేతలు బుధవారం అల్టిమేటమ్ ఇచ్చారు. 22 నియామక పరీక్షలను, పబ్లిక్ సర్వీస్కమిషన్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిర్వహించిన మరో 23 పరీక్షలను రద్దుచేస్తున్నట్లు సోరెన్ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఉద్యమనేతలు ఇలా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘మా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం. నియామక పరీక్షల్లో అక్రమాలపై సమగ్రస్థాయిలో దర్యాప్తుతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి రెండు నెలల గడువిస్తున్నాం. ఆలోపు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిచేయకపోతే మళ్లీ ఉద్యమాన్ని మొదలెడతాం’’అని జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి పియూశ్ కుమార్ సింగ్ స్పష్టంచేశారు. ఉద్యమానికి విరామం ప్రకటించిన నేపథ్యంలో గత 15 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రూపేశ్ కుమార్ పాల్, సవితా కుమారీ, రాహుల్ క్రాంతిలు దీక్షను విరమించారు. 26 రోజుల ఉద్యమధాటికి ప్రభుత్వం 22 రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌లను, 23 ఇతర పరీక్షలను రద్దుచేసిందని మంచ్ నేత రవీంద్ర పాశ్వాన్ చెప్పారు. ‘‘ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలను బయటపెట్టిన ప్రజావేగు(విజిల్‌బ్లోయర్), ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్ మస్తానాను సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. గత పరీక్షల రద్దు నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయే వారి మీద మాకు సానుభూతి ఉంది. ఈ విషయంలో తప్పు అంతా ప్రభుత్వానిదే’’అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. -
దారికొచ్చిన జార్ఖండ్!
కేంద్ర విద్యామంత్రి రాజీనామా కోరుతూ వినూత్న తరహా నిరసనలతో, నిరాహార దీక్షలతో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఊహించని విజయం సాధించిన జెన్ జీ... రాంచీలో సైతం ఘన విజయం సాధించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (జేఎస్ఎస్సీ–సీజీఎల్) పరీక్షను రద్దు చేయటానికి ఎట్టకేలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంగీకరించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటనతో ఉద్యమకారుల శిబిరం ఆనందోత్సాహాలతో పొంగిపోగా... రాష్ట్రంలో గత పన్నెండేళ్ల నుంచీ జరిగిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయనీ, వాటిపై కూడా చర్యలు తీసుకోబోతున్నామనీ ఆయన చెప్పటం వేలాదిమంది ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేసింది. ఆ నియామకాలన్నీ రద్దు చేస్తారా... చేస్తే దానికి అనుసరించే విధానమేమిటన్న ప్రశ్న ఇప్పుడందర్నీ వేధిస్తోంది. వీరుగాక తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారున్నారు. అన్నీ పూర్తయి నియామకాల కోసం ఎదురుచూస్తున్న మరో 1,975 మంది వీరికి అదనం. తగిన విద్యార్హతలు గలవారంతా ప్రభుత్వోద్యోగం కోసం వెంపర్లాడతారు. ప్రయత్నం ఫలిస్తే జీవితంలో శాశ్వతంగా స్థిరపడిపోవచ్చని ఆశపడతారు. ఆ ఉద్యోగ భద్రత అలాంటిది మరి. కానీ ప్రభుత్వోద్యోగాలు వందల్లో ఉంటే, పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. అందుకే తమ చదువులు ఎంతవరకూ పనికొస్తాయన్న భయాందోళనలు అభ్యర్థుల్లో సహజంగానే ఉంటాయి. ఈ పరిస్థితిని శిక్షణ సంస్థలు సొమ్ముచేసుకుంటాయి. లక్షలమంది వేలకు వేలు ఖర్చుచేస్తారు. తీరా ప్రశ్నపత్రాలు లీకయ్యాయని తెలిశాక అలాంటివారి గుండె రగిలిపోదా? ఈ ఆగ్రహావేశాలనుంచే జెన్ జీ ఉద్యమం పురుడు పోసుకుంది. కేంద్ర స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష అయినా, ఇప్పుడు జార్ఖండ్‌లో జరిగిన ఉద్యోగ నియామకాలైనా వివాదాస్పదంగా మారింది అందుకే. సమాజంలో, జీవితంలో అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో అన్యాయం జరిగిందనుకున్నప్పుడు ఉద్యమాలు పోటెత్తడం అనివార్యమని గ్రహించక, యువత డిమాండ్లను అవగాహన చేసుకోక తమకు అలవాటైన పద్ధతుల్లో ఉద్యమాల్ని అణిచేద్దామని ఢిల్లీలోనూ, రాంచీలోనూ పాలకులు ప్రయత్నించారు. రెండుచోట్లా పాలక కూటములు వేర్వేరు. అవి పరస్పరం ప్రత్యర్థి పక్షాలు. అయినా వారి చర్యల్లో సారూప్యత కనబడటం గమనించదగ్గది. రెండుచోట్లా చివరకు పాలకులు వాస్తవం గ్రహించక తప్పలేదు.జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పోటీ పరీక్షలన్నిటినీ టీఎస్సార్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేటు లిమిటెడ్(టీడీపీఎల్) నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంస్థ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) కోసం ఇంతవరకూ 10 పరీక్షలు, జెఎస్ఎస్సీకి 5 నిర్వహించింది. వీటిద్వారా బ్లాక్ సప్లయ్ ఆఫీసర్ మొదలుకొని డిప్యూటీ కలెక్టర్, టీచర్, సివిల్ జడ్జీ, ప్రాసిక్యూటర్ వరకూ అనేక పోస్టులు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్రిశంకు స్వర్గంలో పడ్డామనీ, జనం దృష్టిలో నేరగాళ్లుగా మిగులుతామనీ వారంతా గొల్లుమంటున్నారు. తమ నిర్లక్ష్యంతో, కొన్నిసార్లు కుమ్మక్కుతో యువత ఆశయాలపై చన్నీళ్లు చల్లుతున్నామని పాలకులు గుర్తించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోంది. టీడీపీ నేతలు క్రీడా ధ్రువీకరణ పత్రాలివ్వటం, సర్కారు ఉద్యోగాలు పంచడం వింత. జాతీయస్థాయి పతక గ్రహీతలు కూడా వారిముందు బలాదూరే! కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ కళ్లు మూసుకుంది. జార్ఖండ్‌లో ఉద్యమవీరుల పార్టీగా ప్రతిష్ఠ పొందేందుకు నానారకాల ప్రయత్నం చేసిన పక్షమే అక్రమాలెక్కడంటూ దబాయింపులకు దిగుతోంది. దగాపడిన డీఎస్సీ అభ్యర్థులు చానెళ్లలో తమ గోడు వినిపిస్తుంటే... ప్రశ్నపత్రాల లీక్ మొదలుకొని ర్యాంకుల ప్రకటన, నియామకాల వరకూ సర్వం సందేహాలకు తావిస్తుంటే టీడీపీకి ‘తందాన తాన’ పక్షంగా మిగిలింది. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తే ఫస్ట్ ర్యాంకర్ అని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా అతగాడి పేరు డేటానుంచి మాయం చేయటం దేన్ని సూచిస్తోంది? జార్ఖండ్‌ను చూశాకైనా బుద్ధి తెచ్చుకుని తప్పు గ్రహించక పోతే కూటమి పక్షాలకు ఏపీ జనం టోకున బుద్ధి చెప్పటం ఖాయం. -
విద్యార్థుల విజయం
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు చరమగీతం పాడాలంటూ ఉద్యమబాటలో పయనిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థులు ఎట్టకేలకు విజయం సాధించారు. నిరసనకారుల డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు స్వయంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రకటించారు. దీంతో గత 24 రోజులుగా రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్షాస్థలిలో ఉద్యమిస్తున్న వేలాది మంది పరీక్షార్థులు, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రిగా రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్‌లో ఉద్యమం మొదలెట్టిన కాక్రోచ్ జనతాపార్టీ ఇచ్చిన స్ఫూర్తితో రాంచీలో నిరాహార దీక్షలు మొదలెట్టిన పరీక్షార్థుల డిమాండ్ల సాధన దిశలో సీఎం సోరెన్ సోమవారం కీలక నిర్ణయాలను వెలువర్చారు. రాంచీలో మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం మాట్లాడారు. ‘‘ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షావిధానంలో అక్రమాలను ఎలుగెత్తిచాటిన విద్యార్థుల మొరలను ఆలకిస్తున్నాం. ఈ దిశలో పటిష్టమైన చట్టం తీసుకురాబోతున్నాం. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(జేఎస్ఎస్సీ–సీజీఎల్ఈ)ను రద్దుచేస్తున్నాం. 2014 ఏడాది నుంచి ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ‘టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్(టీడీపీఎల్)’ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను రద్దుచేస్తున్నాం. టీడీపీఎల్ ఇచ్చిన పరీక్షల ఫలితాలనూ పక్కనబెడుతున్నాం. పరీక్షార్థుల డిమాండ్ల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ సారథ్యంలో కొత్తగా పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటుచేస్తున్నాం’’అని సీఎం ప్రకటించారు. ‘‘పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి ఇప్పటికే మొదలై సీఐడీ, సిట్ దర్యాప్తుల్లో విస్మయకర విషయాలు బయటికొస్తున్నాయి. వాటిని ఇప్పుడే ఇక్కడే చెప్పలేను. పరీక్షల రాకెట్లో రాష్ట్రంలో పలు కంపెనీల పాత్ర ఉందని స్పష్టమైంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పొందిన వాళ్లను అరెస్ట్ చేస్తున్నాం. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) ఉన్నప్పటికీ అది సమగ్రంగా అమలుకాలేదని తేలింది. పరీక్షల విధానంలో సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాం. దానికొచ్చే ఫిర్యాదులను నిపుణులు పరిశీలిస్తారు’’అని సీఎం తెలిపారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సీఎం తగు నిర్ణయాలు తీసుకో వాలని ఆగస్ట్ 14న సోరెన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాసిన లేఖ బహిర్గతమైన కొన్ని గంటలకే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం వెలువర్చడం గమనార్హం. గత నియామక పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సీఎం ప్రకటన వార్త తెలిసి వాళ్లంతా తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. విషయం తెల్సి సోమవారం రాత్రి పలువురు ఉద్యోగులు జార్ఖండ్ సెక్రటేరియట్‌కు వచ్చి నిరసన చేపట్టారు. 2014 నుంచి పరీక్షల్ని రద్దుచేస్తే 2,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని వాళ్లు వెల్లడించారు. ఆనంద డోలికల్లో విద్యార్థులు సీఎం ప్రకటన వార్త తెలియగానే రాంచీలోని స్టేడియంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ పరీక్షల సంస్కరణల మంచ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న పరీక్షార్థుల ఉద్యమనినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. ఇది విద్యార్థుల సమష్టి విజయ మని ఉద్యమనేతలు వ్యాఖ్యానించా రు. అయితే సీఐడీ, సిట్ విచారణలకు బదులుగా సీబీఐతో సమగ్ర స్థాయిలో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌చేశారు. అప్పటిదాకా తమ ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు. అయితే గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న, ప్రస్తుతం సదర్ ఆస్పత్రి ఐసీయూలో ఉన్న ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో భిన్నంగా స్పందించారు. ప్రధాన డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో త్వరలోనే స్టేడియంకు వచ్చి నిరాహార దీక్షను విరమించాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. -
విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్‌కు రాహుల్ లేఖ
సాక్షి, ఢిల్లీ: జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సీఎం స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించారు. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాహుల్ లేఖపై చర్చ నడుస్తోంది.లేఖలో భాగంగా.. రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు, వారి డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రభుత్వం కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించడం, వారి కొన్ని డిమాండ్లను అంగీకరించడం అభినందనీయమని రాహుల్ కొనియాడారు. అయితే కొందరు విద్యార్థులు ఇంకా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు.విద్యా వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు..భారతీయ విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకుని.. విద్యార్థుల శ్రమను దోచుకునే సాధనంగా మార్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను వినాలని, వారి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. -
సీఎం సోరెన్ రాజీనామా చేయాల్సిందే
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పక్రియల్లో అక్రమాలకు చరమగీతం పాడాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పరీక్షార్థులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈనెల 20న రాంచీలో హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. ఒకవేళ రాహుల్ గాంధీ మాటను ముఖ్యమంత్రి వినకపోతే జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకోవాలని జేపీఎస్సీ–జీఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తేల్చిచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని సీఎంకు ప్రతిపక్ష నాయకుడు బాబూలాల్ మరాండీ సూచించారు. మరోవైపు పరీక్షల విధానంలో సంస్కరణలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ‘స్టూడెంట్స్ వాయిస్ విత్ స్టూడెంట్స్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరోవైపు ఉద్యమనేతలు, ప్రభుత్వం మధ్య సోమవారం మధ్యాహ్నం మరోదఫా చర్చలు జరగనున్నాయి. -
ట్రాక్‌పై తోడేలు తల.. పట్టాలు తప్పిన స్పెషల్ ట్రైన్!
సిల్లీ: జార్ఖండ్‌లోని సిల్లీ- బొకారో రైలు మార్గంలో శనివారం తెల్లవారుజామున మధుపూర్ శ్రావణ మేళా స్పెషల్ ట్రైన్ (నంబర్ 08895) ప్రమాదానికి గురైంది. పోల్ నంబర్ 354/ఎస్ఏ-4 సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్ నుంచి మూడో కోచ్ (నంబర్ ఎస్ఈసీ 64776) ఒక చక్రం పట్టాలు తప్పడంతో ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రాథమిక సమాచారం ప్రకారం రైల్వే ట్రాక్ పాయింట్ అండ్ క్రాసింగ్ వద్ద ఒక తోడేలు (భేడియా) తల ఇరుక్కోవడం వల్ల కోచ్ చక్రం పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కోచ్‌లో ప్రయాణిస్తున్న భక్తులందరినీ సురక్షితంగా కిందకు దించామని అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రాంచీ రైల్వే డివిజన్ మేనేజర్ కరుణా నిధి సింగ్‌తో పాటు రైల్వే అధికారులు, రైల్వే రక్షణ దళం, జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.సహాయక సిబ్బంది తక్షణమే స్పందించి సుమారు గంట వ్యవధిలోనే కోచ్‌ను తిరిగి పట్టాలపైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ కోచ్‌ను మురి యార్డ్‌కు తరలించారు. ఘటనా స్థలంలో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా ఈ సమయంలో పలు రైళ్ల మార్గాలను మళ్లించారు. గంట సమయం పట్టిన ఈ చర్యల అనంతరం బొకారో రైల్వే మార్గంలో ఉదయం దాదాపు 5:15 గంటలకు రైళ్ల రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో రైలును గమ్యస్థానానికి పంపించారు. పాయింట్ అండ్ క్రాసింగ్ అనేది రైళ్లను ఒక మార్గం నుంచి మరో మార్గానికి సురక్షితంగా మార్చడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన రైల్వే వ్యవస్థ అని అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: మయన్మార్‌లో మరో ప్రళయం.. వణికిస్తున్న చైనా మెగా డ్యామ్! -
జార్ఖండ్‌లో విద్యార్థుల రణరంగం: 20న సీఎం నివాసం ముట్టడి!
రాంచీ: జార్ఖండ్‌లో జేపీఎస్సీ , జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనలు శనివారంతో 23వ రోజుకు చేరుకోగా, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ, తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి.ఈ నిరసనల్లో భాగంగా ఆగస్టు 16న జార్ఖండ్‌లోని మొత్తం 24 జిల్లా కేంద్రాల్లో సీఎం సోరెన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మాట్లాడుతూ ‘మేము సీఎం రాజీనామాను కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్పందించకపోతే, రాహుల్ గాంధీ జేఎంఎం కూటమి నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఉద్రిక్తతలకు దారితీసింది.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ సహా మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించుతామని తెలిపింది. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న విద్యార్థుల డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. సీఐడీ దర్యాప్తులో భాగంగా జేపీఎస్సీ మాజీ చీఫ్ ఎల్. ఖియాంగ్టెను పోలీసులు అరెస్టు చేశారు.ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం అమాయక విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ప్రలోభాలకు లోనుకావొద్దని సోరెన్ సూచించారు.ఇది కూడా చదవండి: ప్రమాదంలో ‘జెన్ జీ’: పార్టీలు, విహారయాత్రలకు భారీగా అప్పులు? -
మహతో, పోలీసుల మధ్య తోపులాట
రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ ఉద్యమిస్తూ నిరాహార దీక్షకు దిగిన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో శనివారం రాంచీలోని సదర్ ఆస్పత్రి అత్యవసర చికిత్స విభాగంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా రాంచీ స్టేడియంలో తిరంగా ర్యాలీకి పాల్గొనేందుకు ఆయన సిద్ధంకాగా ఆస్పత్రి ఐసీయూ విభాగం ఆవరణలో విధుల్లో ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మహతోనూ వెంట తీసుకెళ్లేందుకు అప్పటికే అక్కడికి చేరుకున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా(జేకేఎల్ఎం) సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. త్రివర్ణపతాకం పట్టుకుని మహతో ఎలాగైనా ఆస్పత్రి గది నుంచి బయటపడేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఛాతికి గాయమైనట్లు మహతో ఆరోపించారు. ‘‘80 ఏళ్లు పూర్తయినా ఇంకా నామమాత్రంగానే స్వాతంత్య్రం వచ్చినట్లుంది. తిరంగా ర్యాలీలో పాల్గొనే హక్కు నాకు లేదా?. రాజ్యాంగంలోని ఏ చట్టం ప్రకారం నన్ను అడ్డుకుంటున్నారు? చికిత్సలో ఉండగా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవద్దని ఏ వైద్యుడైనా సూచించారా? ఆ సూచనా పత్రం చూపించండి?’’అని పోలీసులతో మహతో వాగ్వాదానికి దిగినా ఫలితంలేకుండా పోయింది. 14 రోజులుగా మహతో నిరాహార దీక్షచేస్తున్న విషయం తెల్సిందే. -
భూమిలోంచి మంటలు.. జార్ఖండ్ లో వింత ఘటన
-
21వ రోజుకు విద్యార్థుల నిరసన
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరుకున్నాయి. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్ర చేపడతామని విద్యార్థులు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరంగా యాత్రతో తమ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో మరింత పారదర్శకతను తేవాలని, పలు పరీక్షలను రద్దు చేసి, సీబీఐ లేదా రా్రõÙ్టతర రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలనే డిమాండ్లతో విద్యార్థులు నిరసనలను కొనసాగిస్తుండటం తెల్సిందే. ఈ నెల 10వ తేదీన చలో అసెంబ్లీ సందర్బంగా జరిగిన నిరసనలకు సంబంధించి పోలీసులు 300 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు పెట్టారు. కాగా, గత 13 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఆస్పత్రిలో చేరిన జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతో ఆరోగ్యం విషమంగా మారింది. ఆయనతోపాటు దీక్ష చేపట్టిన మరో నలుగురు విద్యార్థులకు కూడా సదర్ ఆస్పత్రిలోనే చికిత్సలు అందుతున్నాయి. -
300 మందిపై కేసులు నమోదు
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు స్వస్తి పలకాలంటూ ఉద్యమిస్తున్న విద్యార్థులు, పరీక్షార్థులు పదో తేదీన రాంచీలో అసెంబ్లీ ముట్టడి వేళ లాఠీచార్జ్, పలువురికి గాయాలైన ఘటనలో పోలీసులు కేసుల నమోదు మొదలెట్టారు. శాసనసభ సమీపంలోని విధాన్ సభా పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని 300 మందిపై కేసులు నమోదుచేశారు. ‘‘పదో తేదీన అసెంబ్లీ సమీపంలో పోలీసులపై రాళ్లు రువ్వి, ఉద్రిక్తతలకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదుచేశాం. విద్యార్థుల శాంతియుత ర్యాలీ వెంటనే ఉద్రిక్తంగా తయారైంది. రాళ్ల దాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారు. సీసీటీవీ కెమెరాలు, వీడియోలో ఫుటేజీలను పరిశీలించి ఆయా వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేస్తాం’’అని రాంచీ ఎస్పీ పరాస్ రాణా గురువారం చెప్పారు. మరోవైపు రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో పరీక్షార్థుల ఉద్యమం గురువారం 20వ రోజుకు చేరుకుంది. ‘‘ఉద్యమనేతల నిరాహార దీక్షలు కొనసాగించారు. పరీక్షల విధానంలో సంస్కరణలు, పాత పరీక్షలను రద్దుచేయడం, నియామక ప్రక్రియలో అక్రమాలపై ఇతర రాష్ట్రాల మాజీ జడ్జీలతో దర్యాప్తు జరిగేదాకా ఉద్యమం కొనసాగుతుంది. డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. 12 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆస్పత్రిపాలైన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో తాజా ఆరోగ్యస్థితిని ప్రభుత్వం బహిర్గతంచేయట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
టీచర్‌కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్‌గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్‌లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్‌జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి! ABVP పై పోలీసుల లాఠీచార్జ్
-
అట్టుడుకుతున్న జార్ఖండ్ వెనక్కి తగ్గేదే లే!
-
క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్!
కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
యువతపై దౌర్జన్యం సరికాదు: ప్రకాశ్ రాజ్
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోటీ పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలంటూ జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్, వాటర్ క్యానాన్లను ప్రయోగించారు. ఈ అణచివేత తీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. Why .. Why .. Why 💔💔💔 . This brutality will not work anymore.. it will only bring the arrogant power down . #justasking https://t.co/wFBXcvUfdp— Prakash Raj (@prakashraaj) August 10, 2026ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను రీపోస్ట్ చేస్తూ ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. ఈ క్రూరత్వం ఇకపై సాగదు. ఇది కేవలం అహంకారంతో కూడిన ప్రభుత్వాన్ని కిందకు దించుతుంది’ అంటూ ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై ఈ రకమైన దౌర్జన్యం సరికాదని, వారి భవిష్యత్తు కోసం గళం ఎత్తుతున్న విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదం మోపడాన్ని ఆయన తీవ్ర పదజాలంతో ఖండించారు.జార్ఖండ్‌లో జరుగుతున్న ఈ ఆందోళనలు, విద్యార్థులపై పోలీసుల చర్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ అంశంపై పార్లమెంట్‌లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇది కూడా చదవండి: ఆరుగురు కొత్త సైనిక కమాండర్లను నియమించిన మొజ్తబా ఖమేనీ! -
ఉద్యమం.. ఉద్రిక్తం
రాంచీ: దేశ రాజధానిలో నీట్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమం చివరకు పోలీసుల లాఠీచార్జ్‌తో ఉద్రిక్తంగా ముగియగా అదే బాష్పవాయుగోళాల ప్రయోగాలు, రక్తసిక్తమైన విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల దృశ్యాలు సోమవారం జార్ఖండ్ రాజధానిలో పునరావృతమయ్యాయి. జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల్లో సంస్కరణలు కోరుతూ, అక్రమాలమయమైన గత పోటీపరీక్షలను రద్దుచేయాలన్న డిమాండ్లతో ఉద్యమిస్తున్న ఆందోళనకారుల నిరసన ఉద్రిక్తంగా మారింది. సోమవారం పాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి కొత్త అసెంబ్లీ భవనం దాకా ‘విధాన్ సభ మార్చ్’గా బయల్దేరిన వేలాది మంది విద్యార్థులు, పరీక్షార్థులు త్రివర్ణపతాకాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల ప్లకార్డులు చేతబూని న్యాయంకోరుతూ అసెంబ్లీకి సమీపప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. జగన్నాథ్ ఆలయ రోడ్డులో చివరి అంచె బ్యారీకేడ్లను పరీక్షార్థులు బద్దలుకొట్టేందుకు యతి్నంచగా పోలీసులు జలఫిరంగులను ఎక్కుపెట్టారు. మెరుపులా దూసుకొస్తున్న నీటి ఉదృతికి తడుస్తున్నా విద్యార్థులు అలాగే ముందుకు కదలడంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయినాసరే పరీక్షార్థుల నుంచి ప్రతిఘటన పెరగడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. లాఠీచార్జ్‌లో చాలా మంది పరీక్షార్థులు గాయపడ్డారు. చిన్నా పెద్దా, అమ్మాయిలు అనే తేడా లేకుండా తలలు పగలగొడుతూ పోలీసులు ఇష్టమొచి్చనట్లు చితకబాదారని రక్తసిక్తమైన ఉద్యమకారుడు పీయూశ్ కుమార్ సోనీ చెప్పారు. బారీకేడ్లను విజయవంతంగా దాటిన కొందరు ఉద్యమకారులు అసెంబ్లీ గేటు నంబర్ 1 వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ‘‘శాంతియుతంగా నిరసన చేపడుతున్న మాపై లాఠీల వర్షం కురిపించారు. రక్తమోడుతున్నా ఉద్యమపంథాను వీడేదేలేదు. హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వం పరీక్షార్థుల డిమాండ్లను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇన్నిసార్లు చర్చలు జరిపినా సానుకూలంగా స్పందించలేదు. అందుకే అసెంబ్లీ మార్చ్‌కు సిద్ధపడ్డాం’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. ‘‘ఈరోజే సీఎం హేమంత్ పుట్టినరోజు. బర్త్‌డే రోజు బహుమానాలు ఇస్తారనుకుంటే లాఠీదెబ్బలే గిఫ్ట్‌గా ఇచ్చారు. మా డిమాండ్లు నెరవర్చేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. లాఠీచార్జ్‌తో పోలీసులు శారీరక దెబ్బకొట్టగలరేమోగానీ మా ఆలోచనలను దెబ్బతీయలేరు’’అని ఉద్యమనేతలు ప్రకటించారు. బల ప్రయోగం.. బాష్పవాయుగోళాలు.. నిరాహారదీక్షలు, ఉద్యమం ఆరంభమై 16 రోజులు గడిచినా చర్చల్లో ఎలాంటి పురోగతి కని్పంచకపోవడం, డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పకోకపోవడంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు ధుర్వాలోని ఓల్డ్ అసెంబ్లీ కాంప్లెక్స్ నుంచి వేలాదిగా ఉద్యమకారులు ర్యాలీగా బయల్దేరారు. 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ పది కేజీల బరువు తగ్గిన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో సైతం అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపుగా కదిలారు. జేఎస్ఎస్సీ పరీక్షల్ని రద్దుచేయాలి. సీబీఐ విచారణ జరపాలి. జేఎస్ఎస్సీపై దాడులకు సీఐడీ ఎందుకు జంకుతోంది? అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమకారులు ముందుకు కదిలారు. నాలుగు కిలోమీటర్ల ఈ మార్గంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ బృందాలు మొహరించాయి. ఒక్కో బారీకేడ్‌ను దాటుకుంటూ పరీక్షార్థులు మందుకొచ్చేకొద్దీ వాళ్లను పోలీసులు నిలువరించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో తొలుత వాగ్వాదం జరిగింది. శానససభలో మా డిమాండ్లు విని్పంచకపోతే న్యాయం ఎలా జరుగుతుంది? అని పోలీసులతో ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయినాసరే ఉద్యమకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు తొలత టియర్‌గ్యాస్ షెల్స్‌ను, తర్వాత లాఠీలను ప్రయోగించిచారు. తమపై విద్యార్థులు రాళ్లదాడి చేయడంతోనే లాఠీచార్జ్ చేయాల్సి వచి్చందని రాంచీ సిటీ ఎస్పీ పరాశ్ రాణా చెప్పారు. నిరననకారుల దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించారు. చర్చల పర్వం కొనసాగుతుండగా ర్యాలీ చేపట్టడమేంటని ప్రభుత్వం అసహనం వ్యక్తంచేసింది. 98 శాతం డిమాండ్లకు ఒప్పుకున్నాసరే ఉద్యమపంథాను ఎందుకు వీడట్లేరని ప్రభుత్వం నిలదీసింది. అయితే 13 పరీక్షల్ని రద్దుచేయాలంటే కనీసం మూడు పరీక్షలకే ఒప్పుకున్నారని, జేపీఎస్సీ, జేఎస్ఎస్లో సంస్కరణల ఊసే ఎత్తేట్లేరని, సీబీఐ విచారణకు ప్రభుత్వం సాహసించట్లేదని ఉద్యమకారులు ఆరోపించారు.జేపీఎస్సీ మాజీ చైర్పర్సన్ అరెస్ట్ జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జేపీఎస్సీ మాజీ ఛైర్పర్సన్, 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్.ఖియాంగ్టేను సోమవారం జార్ఖండ్ సీఐడీ అధికారులు అరెస్ట్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేశాక గత ఏడాది ఈయనను ప్రభుత్వం జేపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గత నెలలో ఈయనను సీఐడీ నాలుగుసార్లు ప్రశ్నించింది. ముగ్గురు జేపీఎస్సీ సభ్యులు రాజీనామాచేశాక ఒత్తిడి పెరగడంతో జూలై 22న ఖియాంగ్టే తన పదవికి రాజీనామా చేయడం తెల్సిందే. ఖియాంగ్టే అరెస్ట్‌తో ఈ ఉదంతంలో అరెస్టుల సంఖ్య ఇరవైకి పెరిగింది.రంగంలోకి ఈడీ.. ఇన్ని రోజులు ఈ ఉదంతంలో సీఐడీ కేసు నమోదుచేసిన దర్యాప్తుచేస్తుండగా సోమ వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. సీఐడీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగాచేసుకుని మనీ లాండరింగ్ కోణంలో మరో కేసును ఈడీ నమోదుచేసి దర్యాప్తు ఆరంభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ సమన్లు జారీచేసి పిలిపించి ప్రశ్నించనుంది. అవసరమైతే అరెస్ట్లుచేసే ఆస్కారముంది. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అక్రమాల్లో నిగ్గుదేల్చేందుకు విద్యార్థులు సీబీఐ దర్యాప్తుకోరుతుంటే ఈడీ రంగంలోకి దిగడం గమనార్హం. ఐసీయూలో మహతో సోమవారం అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొన్న మహతోను తీవ్ర అనారోగ్యం కారణంగా తోటి ఉద్యమకారులు ఆస్పత్రిలో చేర్పించారు. మహతో గత 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ 10 కేజీలకుపైగా బరువుతగ్గడం తెల్సిందే. రక్తంలో చక్కర స్థాయిలో బాగా పడిపోయాయని, ఆయన ఆరోగ్యపరిస్థితి ‘క్లిష్టమైన’స్థాయికి పడిపోయిందని రాంచీలోని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. రాంచీ సదర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ నాన్సీ ప్రియా తెలిపారు. అయితే లాఠీచార్జ్ వేళ మహతోనూ పోలీసులు కొట్టారని అతని సహాయకుడు పంకజ్‌కుమార్ వెల్లడించారు. -
జార్ఖండ్‌లో ‘జంతర్ మంతర్’
ఉన్నత చదువులకూ, ఉద్యోగాలకూ పోటీ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వాలు వాటిల్లో అవకతవకలు బయపడినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, విశ్వసనీయ సంస్థలతో దర్యాప్తు చేయించటానికి మొండికేయటం ఈమధ్య కనబడుతున్న వింత ధోరణి. సోమవారం జార్ఖండ్‌లోని రాంచీలో నిరుద్యోగ యువత, విద్యార్థులు ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించినప్పుడు చానెళ్లలో కనబడిన దృశ్యాలు విస్తుగొలిపాయి. హఠాత్తుగా చూసినవారికి అది జంతర్ మంతరో, జార్ఖండో తెలియని స్థితి ఏర్పడింది. జార్ఖండ్‌లో జేఎంఎం నాయకత్వానగల పాలక కూటమిలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కానీ తమ డిమాండ్లు నెరవేరటం కోసం రాంచీలో యువత 16 రోజులుగా పోరాడాల్సి వస్తోంది. ఉద్యమకారుల డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. గత నెల 22న ఈ వ్యవహారంలో పదవి నుంచి తప్పుకొన్న జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) చైర్మన్ ఎల్. ఖియాంగ్టేను తాజాగా అరెస్టు చేశారు. కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారు. కానీ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ అయిన సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.నిరుద్యోగ యువతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వాల స్పందనెలా ఉంటుందో జంతర్ మంతర్‌తోపాటు జార్ఖండ్ ఉద్యమం కూడా నిరూపించింది. సర్కారీ కొలువు లభించాలని యువతీయువకులు ఎంతగానో తపిస్తారు. అందుకోసం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి చదువుల్లో మునిగిపోతారు. శిక్షణ కోసం వేలకు వేలు వెచ్చిస్తారు. తీరా ప్రశ్నపత్రం లీకయిందంటే, అయోగ్యులు పైపైకి ఎగబాకారని తెలిస్తే... ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చెప్పనలవికాని వేదనను అనుభవిస్తారు. వారి కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. లక్షలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఒక పెద్ద కుంభకోణం బయటపడిన వెంటనే చిత్తశుద్ధిగల ప్రభుత్వమైతే సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయిస్తుంది. ఆ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేస్తుంది. పరీక్ష ఫలితాలను రద్దుచేస్తుంది. ఇందుకోసం యువత రోడ్డెక్కాల్సి వచ్చిందంటే పాలకులు సిగ్గుపడాలి. తప్పు జరిగిందని తెలిసినా జార్ఖండ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు డిమాండ్‌ను ఎందుకు తిరస్కరిస్తోంది? అదొక్కటే కాదు... ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై, వేలంపాటలపై సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మొండికేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరసనలపై రౌడీ ఎమ్మెల్యేలతో దాడులు చేయిస్తోంది. ఈ వ్యవహారంలో విద్యామంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడటానికి జంకి, ప్రభుత్వాధికారుల్ని ముందుకు తోస్తున్నారు. మరోవైపు చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు. సాక్షాత్తూ అభ్యర్థులే తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటే... ఇలా బీరాలు పోవడం ఆయన గారికి సిగ్గనిపించడం లేదు. కేంద్రంలో తమ కూటమి ఏలుబడే ఉన్నా, సీబీఐ దర్యాప్తు అనగానే ఏపీ సర్కారు నిలువెల్లా వణుకుతోంది. యువత ఉద్యమాల సందర్భంగా రాజకీయ పక్షాల ద్వంద్వవైఖరి తేటతెల్లం అయింది. జంతర్ మంతర్ ఆందోళనపై ముద్రలేసి, దాన్ని నీరుగార్చాలని చూసిన బీజేపీ చివరాఖరికి తన వైఖరిని మార్చుకుంది. కానీ జార్ఖండ్ ఆందోళనలో అది చురుగ్గా పాల్గొంటున్నది. ఢిల్లీ ఉద్యమంలో మౌనప్రేక్షకపాత్ర వహించి ఆఖరి దశలో మేల్కొన్న కాంగ్రెస్... జార్ఖండ్‌లో పాలక కూటమిలో ఉంటూ కూడా ప్రభుత్వానికి నచ్చజెప్పలేకపోయింది. పైగా మీ డిమాండ్లేమిటో చెప్పండని పదిరోజులైనాక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉద్యమకారుల్ని అడిగారు. ఏపీలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ అక్కడి డీఎస్సీ నియా మకాల స్కామ్‌పై నోరెత్తదు. కానీ జార్ఖండ్‌లో మాత్రం నేనున్నానంటూ ముందు కొస్తుంది. ఇవన్నీ యువత గుర్తించరనుకోవటం ఆ పక్షాల తెలివితక్కువతనం. వెంటనే ప్రభుత్వాలు ఉన్నతస్థాయి దర్యాప్తునకు సిద్ధపడి లీకుల వెనకుండే మాఫియాలనూ, వారికి అండదండలందించే బడా నేతలనూ బయటకు లాగాలి. ఇతర వాగ్దానాల సంగ తలావుంచి కనీసం పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేకుంటే యువత క్షమించదు. -
జార్ఖండ్: అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్లు..
రాంచీ: ఝార్ఖండ్‌లో నియామక పరీక్షల అక్రమాలను నిరసిస్తూ సోమవారం వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర శాసనసభ ముట్టడికి యత్నించారు. పురాతన అసెంబ్లీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను జగన్నాథ ఆలయం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. నిరసనకారులను నియంత్రించడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం దిగివచ్చి, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు 2023, 2025లో నిర్వహించిన బ్యాక్లాగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌పై విద్యార్థులు పట్టువీడలేదు.ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై జరుగుతున్న నిరసనల నడుమ సోమవారం రాంచీలో హైడ్రామా చోటుచేసుకుంది. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఆదిత్య సాహు, బాబూలాల్ మరాండీతో సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆందోళనకారులు శాంతియుతంగా అసెంబ్లీని ముట్టడించేందుకు (ఘెరావ్) అసెంబ్లీ వైపు మార్చ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి జార్ఖండ్ అసెంబ్లీ వైపు సాగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, రాజ్యాద్ధబద్ధంగా ఈ మార్చ్ కొనసాగుతుందని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జార్ఖండ్ పోలీసులు నిషేధాజ్ఞలు (ప్రొహిబిటరీ ఆర్డర్లు) జారీ చేయడంతో పాటు, నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనలో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి హింసాత్మక ప్రదర్శనలకు పాల్పడవద్దని రాంచీ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. #WATCH | Ranchi, Jharkhand: BJP leaders, protesting outside the CM residence, detained by the Police. They are protesting over JPSC-JSSC alleged irregularities. pic.twitter.com/ziejwSNz4z— ANI (@ANI) August 10, 2026జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, సోమవారం రాంచీలో రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని, ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరిగినందున సీబీఐ విచారణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. VIDEO | Ranchi, Jharkhand: Protesters leave Jaipal Singh Munda Stadium to march towards the 'Vidhan Sabha'.'Vidhan Sabha March' has been called by students who have been protesting for over two weeks against alleged irregularities in recruitment examinations in the state.… pic.twitter.com/gl3vyXt6Uf— Press Trust of India (@PTI_News) August 10, 2026విద్యాద్ధుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యార్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నిరసనల్లో భాగంగా ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహ్తో, సోమవారం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.మరోవైపు, ఈ నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీఐడీ వీరిని విచారణకు పిలవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసెంబ్లీ పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, రాంచీ వ్యాప్తంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య పట్టువీడని ధోరణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
సీబీఐ విచారణకు పట్టు
రాంచీ: జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(జేపీఎస్సీ) నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని, లేకపోతే పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. జేఎస్ఎస్సీ–సీజీఎల్ పరీక్షలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్ మినహా, 98 శాతం డిమాండ్లను అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఆదివారం జరిగిన ఆరోవిడత చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సహా చాలావరకు డిమాండ్లు నెరవేరాయని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ అన్నారు.సీబీఐ విచారణ జరగాలన్న డిమాండ్ నెరవేరే వరకు రాజీ పడబోమని స్పష్టంచేశారు. ఆగస్టు 10న అసెంబ్లీ వరకు తలపెట్టిన ర్యాలీని కొనసాగిస్తామని ప్రకటించారు. జేఎస్ఎస్సీ–సీజీఎల్ పరీక్ష హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించామని, దానిపై సీబీఐ విచారణ జరపాలన్న విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరించలేమని సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ వెల్లడించారు. ‘‘విద్యార్థులతో మేము సానుకూల చర్చలు జరిపాం. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఇప్పుడు ఆందోళనను విరమించుకోవాలా వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలి’’అని చెప్పారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా ఒక ఫాస్ట్–ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టంచేశారు. ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం విద్యార్థుల డిమాండ్లలో చాలావాటికి అంగీకరించామని, అయినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడం దురదృష్టకరం అని జార్ఖండ్ ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లలో చాలావరకు తాము అంగీకరించినప్పటికీ, వారు ఆందోళనను విరమించడానికి సిద్ధంగా లేకపోవడం సరైంది కాదని అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం తమకు లేదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఆందోళనను పక్కనపెట్టి, చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.పరీక్షల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై విద్యార్థుల నుంచి సూచనలు కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, అలాగే ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందిస్తుందని వివరించారు. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీకి నిరసనకారులు చేపట్టనున్న ర్యాలీ దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ముగ్గురు జేపీఎస్సీ సభ్యుల రాజీనామా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ)కు చెందిన ముగ్గురు సభ్యులు అజీత భట్టాచార్య, అనీమా హన్స్దా, జమాల్ అహ్మద్ ఆదివారం రాజీనామా చేశారు. జేపీఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారు పదవుల నుంచి తప్పుకున్నారు. ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సహా అక్రమాల ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం ఆ ముగ్గురు సభ్యులకు సీఐడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జూలై 22న జేపీఎస్సీ చైర్పర్సన్ ఎల్.ఖియాంగ్టే రాజీనామా సమరి్పంచారు. ఆయనను సీఐడీ అధికారులు ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రశ్నించారు. -
నేహా బోరాపై సిరా దాడి
రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను దేశద్రోహి అని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ఆమెపై సిరా చల్లాడు. వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ మద్దతుదారులు, నిరసనకారులు అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తుండగా బిర్సా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. సిరా చల్లిన వ్యక్తిని అమర్నాథ్ పాండేగా గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశి్నస్తున్నారు. అయితే, ఇప్పటివరకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఈ సిరా దాడి ఒక నాటకమేనని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో భాగమైన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌కు ఏఐఎస్ఏ విద్యార్థి విభాగమని గుర్తుచేసింది. ఉద్యమాన్ని బలహీనపర్చడానికి కుట్రలు తాజా సంఘటనపై నేహా బోరా స్పందించారు. ఢిల్లీలో నిరసనల సమయంలో పెల్లెట్ గన్ కాల్పులు, లాఠీచార్జిని ఎదుర్కొన్న తనకు ఈ సిరా దాడి వల్ల ఎలాంటి భయం కలగదని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయగలరా? అని ప్రశ్నించారు. ఉద్యమాన్ని బలహీనపర్చడానికి బీజేపీ–ఆర్ఎస్ఎస్ వర్గాలు కుట్రలు సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా హింసకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన ఢిల్లీ ఉద్యమంలో తాను భాగమైనందుకే ప్రతీకార చర్యగా బీజేపీ ఈ ఘటనకు పాల్పడిందని నేహా బోరా ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా జనసందోహం మధ్య నుంచి ఒక్కసారిగా ఒక వ్యక్తి బయటకు వచ్చి బోరాపై సిరా విసిరాడని ఏఐఎస్ఏ నాయకురాలు శివాని పేర్కొన్నారు. నిందితుడికి బీజేపీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నేహా బోరా దేశ వ్యతిరేకి అని నిందితుడు అమర్నాథ్ పాండే మండిపడ్డాడు. ఆమె ఉమర్ ఖలీద్ మద్దతుదారు అని ధ్వజమెత్తాడు. ఆసుపత్రికి రాహుల్ క్రాంతి తరలింపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆరుగురు నిరసనకారుల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్లు తెలిసింది. వారిలో రాహుల్ క్రాంతి అనే విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం రాంచీలోని సదర్ ఆసుపత్రిలో చేర్చినట్లు ఒక అధికారి తెలిపారు. రాహుల్ క్రాంతి మంగళవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతిపక్ష నాయకుడు బాబూలాల్ మరాండి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఇద్దరు మహిళలు సహా మొత్తం ఐదుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల నిరసన శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. రెండు విద్యార్థి సంఘాలు రాష్ట్ర అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాయి. నియామక పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశాయి. 14వ జేపీఎస్సీ సివిల్ సరీ్వసెస్ పరీక్షను రద్దు చేయాలని, అవకతవకలపై సీబీఐ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తుల బృందం చేత స్వతంత్ర విచారణ జరిపించాలని తేల్చిచెప్పాయి. ప్రభుత్వంతో తొలి విడత చర్చలు ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలపై జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఆందోళనను కొనసాగిస్తామని నిరసనకారులు తేల్చిచెప్పారు. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతోసహా తమ డిమాండ్లన్నీ నెరవేర్చే వరకూ ఆందోళనను విరమించబోమని పేర్కొన్నారు. ఆదివారం నాటికి తమ డిమాండ్లు నెరవేరకపోతే, ఆగస్టు 10న రాష్ట్ర అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, జేపీఎస్సీ/జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్‌కు చెందిన 10 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి మధ్య శుక్రవారం రాత్రి మొదటి విడత చర్చలు జరిగాయి. జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, తమ డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని సంస్కరణల మంచ్ నాయకులు చెప్పారు. -
చర్చలకు సిద్ధం
రాంచీ: జార్ఖండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడాలని, సంస్కరణల బాటలో హేమంత్ సోరెన్ సర్కార్ పయనించాలన్న డిమాండ్లతో 13 రోజులుగా ఆందోళన చేస్తున్న పరీక్షార్థులు, విద్యార్థులు ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలకు ముందుకొచ్చారు. త్వరలో ప్రభుత్వంతో జరిగే చర్చల కోసం 11 మందితో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉద్యమనేతలు గురువారం ప్రకటించారు. జార్ఖండ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే సభలో విపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక, ఉద్యమ అనుకూల నినాదాలతో హోరెత్తించిన వేళ ఉద్యమనేతలు చర్చలకు ముందుకురావడం గమనార్హం. ఎనిమిది మంది విద్యార్థులు, ఇద్దరు నిపుణులైన పాత్రికేయుడు, ఒక న్యాయవాదితో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేశామని ఉద్యమనేతలు తెలిపారు. రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో ‘జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫారŠమ్స్ మంచ్’పేరిట జరుగుతున్న ఉద్యమం గత కొన్నేళ్లలో జార్ఖండ్‌లో ఎన్నడూలేనంతటి అతిపెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందిన విషయం విదితమే. ఐదుగురు సభ్యుల ప్రభుత్వ ప్యానెల్‌తో గురువారమే చర్చలు ఆరంభంకానున్నట్లు తెలుస్తోంది. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వ బృందం ఎదుట విన్పించనున్నారు. జేపీఎస్సీతోపాటు జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో విపక్ష ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి సమస్యల్ని పరిష్కరించాలి అని రాసి ఉన్న మాస్‌్కలు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. మరోవైపు 7, 10 తేదీల్లో అసెంబ్లీ వద్ద ధర్నాకు విద్యార్థులు పిలుపునిచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమీపంలో గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ యంత్రాంగం తెలిపింది. -
12 ఎగ్జామ్స్‌లో టాపరే లీకురాయుడు!
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడే యువతకు అతడు ఒకప్పుడు ఆదర్శం. వరుసగా పోటీ పరీక్షలు రాసి.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 పరీక్షల్లో విజయం సాధించాడు. అతడి సక్సెస్ స్టోరీ చూసి ఎంతోమంది అభ్యర్థులు స్ఫూర్తి పొందారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పేరు పేపర్ లీక్ కేసులో మారుమోగుతోంది. జార్ఖండ్ పరీక్షల కుంభకోణంలో ప్రధాన అనుమానితుడిగా అరెస్టైన అభయ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.అభయ్ తివారీ.. జార్ఖండ్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన 19 మందిలో ఒక్కడు. అయితే అతను సాధించిన విజయాల జాబితా చిన్నది కాదు. నేవీ పరీక్ష, భాభా అణు పరిశోధన కేంద్రం (BARC) పరీక్ష, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు.. ఇలా అనేక పోటీ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. 13 ఏళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు క్లియర్ చేయడంతో అతడికి “ఎగ్జామ్ స్టార్”గా గుర్తింపు వచ్చింది. అయితే.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల ఆరోపణలు మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. “అతడి వరుస విజయాల వెనుక ప్రతిభేనా? లేక పరీక్షల వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్ సీఐడీ ఆరోపణల ప్రకారం.. అభయ్ తివారీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ఓ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తన వరుస విజయాలనే(సిసలైన సక్సెసా? లేదంటే మోసమా? అనేది తేలాల్సి ఉంది).. నమ్మకంగా మార్చుకుని అభ్యర్థులను ఆకర్షించాడని అధికారులు భావిస్తున్నారు.పరీక్షల సంస్థతో పాత సంబంధాలుతివారీ గతంలో పరీక్షల నిర్వహణ సంస్థ TRS-Data Processing Private Limitedలో పనిచేశాడు. పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత అతడు జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. పాత పరిచయాలు కొనసాగించాడా? పరీక్షల వ్యవస్థలోకి ఎలా ప్రవేశించాడు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.పేపర్ లీక్‌తో బయటపడిన అసలు విషయంజార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తర్వాత నిరసనలు మరింత పెరిగాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.రాంచీలో రోడ్డెక్కిన విద్యార్థులురాంచీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పరీక్షలు రద్దు చేయాలని, అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరగా.. ప్రభుత్వం మాత్రం సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.ఇటు సీజేపీ ప్రతినిధి అభిజిత్ దీప్కే కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపారు.నలుగురు మంత్రులతో కమిటీవిద్యార్థుల ఆందోళన తీవ్రత పెరగడంతో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. సమస్యలను పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలకు ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థలో లోపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనలు కొంత తగ్గినా.. విద్యార్థులు మాత్రం కేవలం హామీలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.ఒక్క తివారీ కేసు కాదు.. వ్యవస్థకే పరీక్షఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఆదర్శంగా కనిపించిన అభయ్ తివారీ.. ఇప్పుడు అదే పరీక్షల వ్యవస్థపై వచ్చిన అనుమానాలకు కేంద్రంగా మారాడు. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమా? లేదంటే మరేదైనా కోణం ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం దేశంలో పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. -
ఉధృతమవుతున్న ఉద్యమం
రాంచీ/ఛత్రపతి శంభాజీనగర్: జార్ఖండ్ పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడి పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న డిమాండ్‌తో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగార్థులు, ఉద్యమకారులకు మద్దతుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. మరో ఐదుగురు ఉద్యమకారులు మంగళవారం రాత్రి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ‘‘ఉద్యమానికి నైతిక బలాన్నిస్తూ ఇద్దరు మహిళలు సహా ఐదుగురు కొత్తగా దీక్షలో భాగస్వాములయ్యారు. డిమాండ్లను నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు’’అని జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) సంస్కరణల మంచ్ అధికార ప్రతినిధి జీవన్ కుమార్ ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టినందుకే నిరాహార దీక్షలో కూర్చున్నానని నాయకురాలు సబితా కుమారి తెలిపారు. బుధవారం ఉద్యమకారుల దీక్షాస్థలిలో జాతీయజెండాలతో ‘తిరంగా యాత్ర’కార్యక్రమం చేపట్టారు. ‘జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్ ్స మంచ్’పేరుతో ఉద్యోగార్థులు జూలై 25వ తేదీన ఈ నిరసనను మొదలెట్టిన విషయం తెల్సిందే. చర్చలకు ఆహ్వానించిన సర్కార్ చర్చలకు సిద్ధమని హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాంచీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కుమార్ రజత్, అదనపు జిల్లా మేజి్రస్టేట్(శాంతిభద్రతలు) ధనంజయ్ కుమార్‌లు దీక్షా స్థలికి వచ్చారు. సీఎం అధికార నివాసంలో చర్చలకు రావాలని ఐదుగురు ఉద్యమనేతలను అధికారులు ఆహ్వానించారు. కనీసం నీరైనా తాగండి: వాంగ్‌చుక్ లద్దాఖ్ సామాజిక వేత్త, ఇటీవల జంతర్‌మంతర్‌లో రోజులతరబడి నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం రాంచీలో దీక్ష చేస్తున్న వారిని విజ్ఞప్తిచేశారు. దీక్షచేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా(జేఎల్కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతోతో వాంగ్‌చుక్ బుధవారం మాట్లాడారు. ‘‘మీ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలు పడిపోతున్నాయి. ఆరోగ్యం విషమించకుండా ఉండాలంటే కనీసం నీళ్లు అయినా తాగండి. అప్పుడు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష సాధ్యం’’అని సూచించారు. వాంగ్‌చుక్ విజ్ఞప్తిమేరకు మహతో తర్వాత కొద్దిగా నీళ్లు తాగారు. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నారు. అంతటా పేపర్ లీకేజీలు: సీఎం చర్చలకు సిద్ధమని సీఎం సోరెన్ ప్రకటించారు. ఉద్యమంపై ఆయన ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘‘యువత లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తాం. పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ మా రాష్ట్రానికే పరిమితంకాలేదు. ఇది దేశవ్యాప్తంగా యువతకు సమస్యగా తయారైంది. రాత్రిపగలు రాష్ట్రంలో దర్యాప్తు కొనసాగుతోంది. నేరస్తులను జైలుకు పంపిస్తాం. దర్యాప్తుతో మేం ఆగిపోం. యువత సమస్యలకు పరిష్కారం చూపిస్తాం’’అని సోరెన్ అన్నారు.జవాబుదారీగా ఉండాల్సిందే: దీప్కే ఉద్యమిస్తున్న వందలాది మంది విద్యార్థులకు తమ సహాయసహకారాలు, తోడ్పాటు ఎప్పుడూ ఉంటాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చీఫ్ అభిజీత్ దీప్కే స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పట్టణంలో సీజేపీ కీలక భేటీకి ముందు దీప్కే మీడియాతో మాట్లాడారు. ‘‘జార్ఖండ్‌లో పోటీపరీక్షల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేదాకా మేం ఊరుకోం. జవాబుదారీగా ఉంటామని ప్రకటించేదాకా ఒత్తిడిచేస్తూనే ఉంటాం. మేం జార్ఖండ్‌కు వెళ్తాం. ఆ విద్యార్తుల ప్రతి డిమాండ్ సాధనకు కలిసి పోరాడతాం’’అని దీప్కే ప్రకటించారు. -
అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి
ఛత్రా: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం, నిర్బంధం ఆరోపణల నేపథ్యంలో ఒక యువకునిపై ఆగ్రహించిన గ్రామస్తుల అతనికిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఒక బాలిక కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె ఆచూకీ లభించగా, సదరు యువకుడు తనను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.దీంతో సుమారు 100 నుంచి 150 మంది గ్రామస్తులు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు. ఆ యువకుడి తల్లిదండ్రులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా 56 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీఓ) డియోలాల్ ఒరాన్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని, నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు.ఇది కూడా చదవండి: జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్ -
జార్ఖండ్‌లో మరో జంతర్‌మంతర్
రాంచీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో రోజుల తరబడి కొనసాగి పోలీసుల అతి బలప్రయోగంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘నీట్ లీకేజీ’ఉద్యమంతో స్ఫూర్తి పొందిన జార్ఖండ్ విద్యార్థిలోకం రాంచీ వేదికగా ఉధృతస్థాయిలో నిరసన కార్యక్రమాలకు ఆరంభించింది. జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్‌కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్(జేసీసీ) పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, సీబీఐ, ఈడీలతో కేసులను దర్యాప్తు చేయించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలని విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఆదివారం రాత్రి పదిగంటలకు విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నిరాహార దీక్షకు కూర్చోవడంతో రాంచీలో పెద్దసంఖ్యలో విద్యార్థులు దీక్షాస్థలికి చేరుకున్నారు. నిరసన ప్రదర్శనలు సోమవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. 14వ జేపీఎస్సీ పరీక్ష, జేఎస్ఎస్సీ–కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షతోపాటు ఇతర రిక్రూట్మెంట్ టెస్ట్‌లను రద్దుచేయాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. విద్యార్థుల ఉద్యమానికి తాము సైతం మద్దతిస్తున్నట్లు సీజేపీ చీఫ్ దీప్కే సోమవారం ప్రకటించారు. చిన్న నిరసనగా మొదలై... ఇటీవల నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణ, అర్హుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, న్యాయం చేయాలంటూ పలువురు పరీక్షార్థులు జూలై ఐదో తేదీన రాంచీలోని వపు బాటికా మైదానంలో నిరసన చేపట్టారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, వాటిని రద్దుచేయాలని నినదించారు. విద్యార్థుల ఈ ప్రదర్శనకు పలు రాజకీయ పారీ్టలతోపాటు పౌరసమాజంలోని పలు సంఘాల నుంచి విపరీతమైన మద్దతు తోడైంది. దీంతో వందలాది మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా కదలిరావడంతో రాంచీలో నిరసన తాజాగా తీవ్రరూపం దాల్చింది. జంతర్‌మంతర్‌లో ఎలాగైనా విద్యార్థులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ దీక్ష కొనసాగించారో అచ్చం అలాగే రాంచీలోనూ పెద్దసంఖ్యలో పరీక్షార్థులు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఓవైపు వర్షాలు, పిడుగుల ఘటనలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా ఇవన్నీ సైతం లెక్కచేయకుండా విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ‘‘వర్షాకాలంలో కారుమబ్బులతో కాస్తంత చీకటిపడటం సహజం. కానీ అవినీతి పడగ నీడతో రాష్ట్రంలో పరీక్షార్థుల భవిష్యత్తు అంధకారమవుతోంది’’అని దీక్షాస్థలిలోని ఒక ఉద్యమకారుడు వ్యాఖ్యానించారు. జేపీఎస్సీ మాజీ ఛైర్మన్‌పై సీఐడీ ప్రశ్నలవర్షం పరీక్షల నిర్వహణలో అవకతవకల కేసులో జేపీఎస్సీ మాజీ చైర్మన్ కె.ఖియాంగ్టేను సీఐడీఅధికారులు సోమవారం మరోమారుప్రశ్నించారు. గతంలో జూలై 28(9 గంటలు), జూలై 29(8 గంటలు), జూలై 31 తేదీన ఎనిమిది గంటలపాటు సీఐడీ ప్రశ్నించింది. సోమవారం ఏడు గంటలపాటుప్రశ్నించింది. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను చైర్మన్ పదవికి రాజీనామాచేశానని ఖియాంగ్టే తెలిపారు. -
మావోయిస్టులకు బిగ్ షాక్.. కీలక నేత బేస్రా అరెస్ట్
రాంచీ: జార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన కోబ్రా 209వ బెటాలియన్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బేస్రాను అరెస్ట్ చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. మిసిర్ బేస్రా నక్సల్స్ సంస్థలో కీలక స్థాయిలో ఉన్న నేతగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాల నిర్వహణ, వ్యూహాల రూపకల్పనలో అతడికి ముఖ్యమైన పాత్ర ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.బేస్రాతో పాటు మరో ఇద్దరు అరెస్ట్ఈ ఆపరేషన్‌లో మిసిర్ బేస్రాతో పాటు మరో ఇద్దరు నక్సల్స్ నేతలు మోచూ, గౌరవ్ హాన్స్దాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి అరెస్టుతో రాష్ట్రంలోని నక్సల్ నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, మిసిర్ బేస్రా కోసం భద్రతా బలగాలు చాలా కాలంగా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయి. అతడి కోసం జార్ఖండ్‌లోని అడవి ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత జిల్లాల్లో గతంలో పలు భారీ ఆపరేషన్లు నిర్వహించారు.కాగా, అడవుల్లో మావోయిస్టుల కదలికలు, ఆయుధ సరఫరా మార్గాలు, కీలక సమావేశాలపై నిఘా పెట్టి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసినట్లు తెలుస్తోంది. భద్రతా వర్గాల ప్రకారం.. మిసిర్ బేస్రా అరెస్ట్ మావోయిస్టు సంస్థకు వ్యూహాత్మకంగా పెద్ద నష్టంగా భావిస్తున్నారు. సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న నేత అరెస్ట్ కావడంతో సంస్థ నిర్ణయాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో జార్ఖండ్‌లో నక్సల్ ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు సంయుక్తంగా పలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిసిర్ బేస్రా అరెస్ట్‌ను నక్సల్ వ్యతిరేక పోరులో ఒక కీలక విజయంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. బేస్రాపై పోలీసుల రివార్డులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. -
స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో
పాపులర్ అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ టోనీ క్లోర్ (Tony Klor) స్టీల్‌సిటీ జమ్షెడ్పూర్ అందాలకు ఫిదా అయిపోయాడు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వైరల్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్, ఇటీవల జార్ఖండ్‌లోని 'స్టీల్ సిటీ' జమ్షెడ్పూర్ను మొదటిసారిగా సందర్శించి, ఎంతగానో ముగ్ధుడయ్యాడు. మొదట ఇది తన ఇండియా బకెట్ లిస్ట్‌లో లేకపోయినా, ఈ నగరాన్ని చూశాక తనకిష్టమైన ప్రదేశాలలో ఒకటిగా మారిందని ఆయన ప్రశంసించడం విశేషంగా నిలుస్తోంది.మెట్రో నగరాలు, ప్రశాంతమైన బీచ్‌లు, పర్వతాలు, ఎడారులు, దట్టమైన అడవుల వంటి ఊహించదగిన అన్ని రకాల ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. జైపూర్, గోవా, వారణాసి వంటి నగరాలు అంతర్జాతీయ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నప్పటికీ, అంతగా ప్రాచుర్యం లేని అనేక పట్టణాలు, వాటిలో చూడటానికి ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించవు. కానీ అనుకోకుండా స్టీల్ సిటీని సందర్శించిన టోనీ క్లోర్ జమ్షెడ్పూర్ను "భారతీయ పిట్స్బర్గ్" అని అభివర్ణించారు. టాటా స్టీల్ నిర్వహణలోనే నగరం ఇంత శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నడవడం చూసి అబ్బురపడ్డారు. View this post on Instagram A post shared by Tony Klor (@tonykmontana) ఇక్కడ గోల్పహాడి ఆలయం, జూబ్లీ పార్క్, సాక్షి మార్కెట్, డిమ్నా లేక్ మరియు దొముహాని ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇక్కడి పచ్చదనం, పరిశుభ్రత, సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్రీడా రంగానికి ఇది అందించిన ఒలింపియన్లను గురించి తెలుసుకొని అభినందించారు. అంతేకాదు జార్ఖండ్‌పై తన అభిప్రాయం, అపోహలను తారుమారు చేస్తూ ప్రజలు అనుకునేదానికంటే ఈ రాష్ట్రం చాలా అందంగా ఉందని, జమ్షెడ్పూర్ ఒక వెలుగులోకి రాని "అరుదైన రత్నం" (underrated gem) అని టోనీ పేర్కొన్నారు. "నేను ఈ నగరం గురించి నా పిల్లలకు కూడా చెబుతాను" అని సోషల్ మీడియాలో రాశారు. టోనీ షేర్ చేసిన వీడియో నెటిజన్లను, ముఖ్యంగా జమ్షెడ్పూర్ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. తమ నగర అందాలను ఇంత చక్కగా చూపించినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
రథానికి విద్యుత్ తీగ తాకి ఇద్దరు విద్యార్థుల మృతి
ఖుంటి: ఝార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. భగవాన్ జగన్నాథుడి రథయాత్రలో ఉపయోగించిన రథాన్ని టోర్పాలోని మౌసీ బారీ వద్ద నిలిపి ఉంచగా, అది 11,000 వోల్టుల విద్యుత్ తీగను తాకడంతో ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.టోర్పా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 10 మంది బాలురు రథంతో ఆడుకుంటుండగా, వారిలో కొందరు రథంపైకి ఎక్కారు. "రథం 11,000 వోల్టుల విద్యుత్ తీగను తాకడంతో ఏడుగురు బాలురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సదర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి టోర్పా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది" అని ఓ పోలీసు అధికారి చెప్పారు.ఖుంటి సదర్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ కిశోర్ ఒరావోన్ మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. "వారిలో ఇద్దరిని మృతులుగా తీసుకొచ్చారు. మరో బాలుడికి చికిత్స కొనసాగుతోంది" అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఉన్న రథాన్ని టోర్పాలోని మౌసీ బారీ వద్ద నిలిపి ఉంచారని మరో పోలీసు అధికారి తెలిపారు. -
జైల్లో ఉన్న బాయ్‌ఫ్రెండ్ కోసం.. వందడుగుల టవరెక్కిన యువతి
బొకారో: జైలులో ఉన్న తన ప్రేమికుడిని వెంటనే విడుదల చేసి, తనతో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ 17 ఏళ్ల యువతి సెల్ టవరెక్కి ఐదు గంటలపాటు హంగామా సృష్టించింది. జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లా గోమియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధెంధే గ్రామంలో మంగళవారం ఘటన చోటుచేసుకుంది.ఈ నెల 18వ తేదీన తన కుమార్తెను రాంచీకి చెందిన యువకుడు నిర్బంధించాడంటూ ఓ మహిళ ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి, ఆ యువతిని తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. నిర్బంధించిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి, రిమాండ్‌లో ఉంచారు. అదే యువతి తిరిగి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామంలోని సెల్ టవర్పైకెక్కింది. జైల్లో ఉన్న అతడితో తనకు పెళ్లి జరిపించాలంటూ డిమాండ్ చేసింది. గ్రామస్తులు, పోలీసులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం 3 గంటలకు ఎట్టకేలకు కిందికి దిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
షాక్ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్ కాదు' అనుకుంది!
ఆమెకు 95.2 శాతం మార్కులు వచ్చాయి. చాలా మంది విద్యార్థులకు అది కలల ఫలితమే. కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు. కానీ ఆ విద్యార్థిని మాత్రం సంతృప్తి చెందలేదు. తన సమాధాన పత్రాల్లో ఎక్కడో పొరపాటు జరిగిందనే నమ్మకంతో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసింది. ఆ తర్వాత వచ్చిన ఫలితం చూసి ఆమె మాత్రమే కాదు.. విద్యా వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఏకంగా 24 మార్కులు పెరిగి.. దేశ టాపర్ల సరసన నిలిచింది. ఈ అద్భుత ఘనత సాధించింది ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన అవనీ కేజ్రీవాల్. డీపీఎస్ సేల్ టౌన్షిప్ స్కూల్లో కామర్స్ విద్యార్థినిగా చదివిన ఆమె, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో తొలుత 95.2 శాతం మార్కులు సాధించింది. ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ తన ప్రదర్శనకు వచ్చిన మార్కులు సరిపోవని భావించిన అవనీ, సమాధాన పత్రాల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసింది. అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. రీవాల్యుయేషన్ అనంతరం ఆమె మార్కులు ఏకంగా 24 పెరిగాయి. దీంతో ఇంగ్లీష్ కోర్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించి 500కి 500 స్కోర్‌తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అదనపు సబ్జెక్ట్‌గా తీసుకున్న గ్రాఫిక్స్‌లో కూడా 99 మార్కులు సాధించింది.ఫలితాలు ప్రకటించిన రోజే తనకు పూర్తి సంతృప్తి కలగలేదని అవనీ చెబుతోంది. ఏడాది పొడవునా తాను పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదని భావించానని, అందుకే రీవాల్యుయేషన్‌కు వెళ్లానని తెలిపింది. తన సమాధానాలపై, తన శ్రమపై ఉన్న నమ్మకమే ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పింది.అవనీ విజయ రహస్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. రోజుకు ఎన్ని గంటలు చదివానన్నది కాదు.. ఎన్ని లక్ష్యాలు పూర్తి చేశానన్నదే ముఖ్యమని ఆమె చెబుతోంది. ప్రతిరోజూ రెండు లేదా మూడు టాపిక్‌లు పూర్తి చేయాలని నిర్ణయించుకుని, అవి పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో చదివేదాన్నని తెలిపింది. సోషల్ మీడియా విషయంలోనూ విద్యార్థులకు ఆమె ఒక సందేశం ఇచ్చింది. దాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని, కానీ చదువుకు ఆటంకం కలిగించకుండా పరిమితంగా ఉపయోగించాలని సూచించింది.వ్యాపారవేత్త మితేష్ కేజ్రీవాల్, గృహిణి పూనమ్ కేజ్రీవాల్ దంపతుల కుమార్తె అయిన అవనీ.. భవిష్యత్తులో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సీయూఈటీ-యూజీ 2026 పరీక్ష కూడా రాసింది. భవిష్యత్తులో సొంత వ్యాపారాన్ని స్థాపించి విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని కలలు కంటోంది.అవనీ సాధించిన ఈ ఘనతపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఆమె విజయం వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయా చౌహాన్ పేర్కొన్నారు.ఒక రీవాల్యుయేషన్ అభ్యర్థన.. 24 అదనపు మార్కులు.. 95.2 శాతం నుంచి పర్ఫెక్ట్ 100 శాతం. అవనీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక సందేశంగా మారింది. ఫలితంపై సందేహం ఉంటే వదిలేయకుండా.. తమ కృషిపై నమ్మకంతో ముందడుగు వేయాలని ఆమె విజయం చెబుతోంది. -
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
న్యూఢిల్లీ/రాంచీ/ఐజ్వాల్: జార్ఖండ్‌లో గురువారం హోరాహోరీగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీఏ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నఠ్వాణీ అనూహ్య విజయం సాధించారు. గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమిపాలయ్యారు. జార్ఖండ్‌లో రెండు రాజ్యసభ స్థానాల కోసం మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.అధికార ‘ఇండియా’కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌లకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో ఒక స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అభ్యర్థి బైద్యనాథ్ రామ్, మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్‌ల గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 28 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే అసెంబ్లీలో ఎన్డీఏకు కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. కానీ గురువారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్‌కు ఏకంగా 28 ఓట్లు పడ్డాయి.క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి పరిమళ్ను గెలిపించారని అధికార ‘ఇండియా’కూటమి ఆరోపించింది. పరిమళ్ పోటీచేసిన స్థానానికి జరిగిన ఓటింగ్‌లో మూడు ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. వీటిలో రెండు బీజేపీ ఎమ్మెల్యేలవికాగా ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేది. ఇక మిగిలిన మిజోరంలో ఒకటి, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు గురువారం ఎన్నికలు జరిపి వెంటనే ఫలితాలను వెల్లడించారు. -
పొలిటికల్ హైడ్రామా.. హోటల్లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్డౌన్!
రాంచీ: జార్ఖండ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేపు (జూన్ 18న) జరగనున్న ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తమ ఎమ్మెల్యేలను రాంచీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్, ఫిరాయింపుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.జార్ఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నిక జరగనుంది. అధికార ఇండియా కూటమి తరఫున జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత బైజ్నాథ్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా బరిలో ఉండగా.. ఎన్డీయే మద్దతుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో రెండో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారింది. ఓటింగ్ ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరిగినప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉందనే అనుమానాలు ఇరు కూటముల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే తమ ఎమ్మెల్యేలందరినీ ఒకేచోట ఉంచి, ఎన్నిక పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని నిర్ణయించింది.ఇండియా కూటమి అలర్ట్.. సమాచారం మేరకు.. బీజేపీ, ఏజేఎస్‌యూ (AJSU), లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తదితర ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు రాంచీలోని విలాసవంతమైన హోటల్లో బస చేస్తున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ నిర్వహణ, పార్టీ విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సిన విధానంపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార ఇండియా కూటమి కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీల ఎమ్మెల్యేలను ఒకే వేదికపై ఉంచి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటింగ్ విధానంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.సంఖ్యా బలమే..ఈ ఎన్నికలో పరిమల్ నత్వానీ అభ్యర్థిత్వం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ మంచి పరిచయాలు ఉండటంతో ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. దీంతో ఏ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసుకోవడానికి కూటములు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను రిసార్ట్లు, హోటళ్లకు తరలించడం దేశ రాజకీయాల్లో కొత్త విషయం కాకపోయినా, జార్ఖండ్‌లో ఈసారి జరుగుతున్న పరిణామాలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ఇండియా కూటమి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 18న జరిగే ఓటింగ్‌తో ఈ రాజకీయ హైడ్రామాకు తెరపడనుంది. -
‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే..
కోడెర్మా: దేశంలో ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన చర్చనీయాంశంగా మారింది. ‘నీట్’ కోసం సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పరీక్షల ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆమె బలైపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూనే ఆ బాలిక గదిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.ఆన్లైన్ పరీక్ష రాస్తూ..తమ అమ్మాయి చదువులో ఎంతో చురుకైనదని, ‘నీట్’లో విజయం కోసం పట్టుదలతో చదువుతోందని బంధువులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన ఆమె, అనంతరం ఇంటికి తిరిగి వచ్చి సొంతంగా ప్రిపరేషన్ కొనసాగిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలు రాయాలనే పట్టుదలతో ఉన్న ఆమె, నీట్ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకంతో ఉంది. అయితే ఇంట్లోనే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.కేసు నమోదు.. ముమ్మర దర్యాప్తుఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎవరిపైనా ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థిని నీట్ పరీక్షకు హాజరైన విషయం నిజమే అయినప్పటికీ, కుటుంబ సభ్యులు ప్రాథమికంగా ఇచ్చిన దరఖాస్తులో పరీక్ష ఒత్తిడికి సంబంధించిన అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించలేదని పోలీసులు వివరించారు.ప్రాణాంతకంగా మారుతున్న పరీక్షల టెన్షన్ఈ విషాద ఉదంతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న విపరీతమైన అకడమిక్ ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే నీట్ వంటి కఠినమైన ప్రవేశ పరీక్షలు, వారిపై తీవ్ర మానసిక భారాన్ని మోపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, పరీక్షల నిర్వహణలో అస్థిరత తదితర కారణాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో విద్యార్థులకు సరైన కౌన్సెలింగ్ సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచాలని, ఒత్తిడిని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్! -
ఇషాన్ కిషన్‌కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్ అనామకుడు
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్, జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్‌పూర్ రాయల్స్, కోయలాంఛల్ సూపర్‌కింగ్స్, థన్‌బాద్ డైమాండ్స్, సంథల్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.ఈ వేలంలో రాబిన్ మింజ్‌ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.మరోవైపు ఇషాన్ కిషన్‌ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్‌తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్‌రేట్‌తో 602 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.అయినా, దేశీయ క్రికెట్లో రాబిన్ మింజ్‌కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.కాగా, తొలి జార్ఖండ్ టీ20 లీగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 27 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్‌ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
రెండు రాష్ట్రాల టాపర్‌గా ఎంఎస్ ధోని
టీమిండియా దిగ్గజ ఆటగాడు, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌టైమ్ గ్రేట్ అయిన ఎంఎస్ ధోని, ఓ ఆర్దికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా రికార్డు నెలకొల్పాడు.ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బిహార్-ఝార్ఖండ్ కలిపి గత ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹20,000 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేశాయి. ఇందులో ₹12,000 కోట్లు ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచాడు. ఈ విషయాన్ని బిహార్-ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. డి. సుధాకర రావు మీడియాకు వెల్లడించారు.ధోని ఎంత పన్ను చెల్లించాడన్న వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినా, అతని ఆస్తులు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆధారంగా సుమారు ₹38 కోట్ల పన్ను చెల్లించినట్లు అంచనా వేస్తున్నారు.ధోని నికర సంపద మరియు ఆదాయాలు: 2026 మే నాటికి ధోని నికర సంపద సుమారు ₹1,060 కోట్లుగా అంచనా వేయబడింది. సంవత్సరానికి సుమారు ₹75 కోట్లు వివిధ వనరుల ద్వారా సంపాదిస్తున్నాడు. టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాల్లో కార్స్24, గరుడ ఏరోస్పేస్, ఖటాబుక్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా, ఇన్వెస్టర్‌గా ఉన్నాడు.ఫుడ్ & బెవరేజెస్ రంగంలో సెవెన్ ఇంక్ బ్రివ్స్, హౌస్ ఆఫ్ బిర్యాని, షాకా హ్యారీ (ప్లాంట్ బేస్డ్ మీట్) వంటి బ్రాండ్లతో ముడిపడి ఉన్నాడు. క్రీడా యాజమాన్యంలో చెన్నైయిన్ ఎఫ్‌సి (ISL ఫుట్‌బాల్), మహి రేసింగ్ టీమ్ ఇండియా (సూపర్‌స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్)కు కో-ఓనర్‌గా ఉన్నాడు.ధోని పేరిట రాంచీలో 7 ఎకరాల్లో ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. 100కి పైగా వింటేజ్, మోడరన్ బైకులు ఉన్నాయి. వీటన్నటి కోసం ఓ గాజు గోడల గ్యారేజీ ఉంది. అలాగే 43 ఎకరాల ఫామ్‌ను నిర్వహిస్తూ వాణిజ్యపరంగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.భారతీయ క్రికెటర్లలో ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..?(2023-24 ఆర్థిక సంవత్సరం ఆధారంగా)- విరాట్ కోహ్లీ : ₹66 కోట్లు - ఎంఎస్ ధోని : ₹38 కోట్లు - సచిన్ టెండూల్కర్ : ₹28 కోట్లు - సౌరవ్ గాంగూలీ : ₹23 కోట్లు - హార్దిక్ పాండ్యా : ₹13 కోట్లు -
వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?
జార్ఖండ్‌లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.జార్ఖండ్ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్‌తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు. అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్‌పాయిజనింగ్ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?) -
సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్‌లో టాపర్‌గా!
కొందరు ఎలాంటి శారీరక లోపం లేకుండా, సమస్త సౌకర్యాలు ఉండి విద్యలో పెద్దగా రాణించలేక చతికిలపడుతుంటారు. ట్యూషన్లని, స్పెషల్ క్లాస్‌లని చెప్పించినా.. కొందరికి వచ్చే మార్కులు అంతంత మాత్రమే. కానీ ఈ కుర్రాడు. సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..మొత్తం శరీరం తనకు సహకరించే పరిస్థితి లేకున్నా కూడా పదోతరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. పైగా తనకు ఈ పరిస్థితి లేకుంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాడిని అని చెబుతుండటం విశేషం. ఆ విద్యార్థే జార్ఖండ్‌లోని గొడ్డాకు చెందిన ఫైజాన్. తీవ్రమైన సెరిబ్రల్ పాల్సీ ఉన్నప్పటికీ, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93.8 శాతం మార్కులు సాధించి, దివ్యాంగుల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. శరీర కదలికల సవాళ్లను అధిగమించి, నోటితో పెన్ను పట్టుకుని రాసి ఇన్ని మార్కులు తెచ్చుకోవడం విశేషం. తన అనారోగ్య పరిస్థితి వల్లే ఇంతకు మించి సాధించలేకపోయానని, లేదంటే ఇంకా ఎక్కువ మార్కులే వచ్చేవని అంటున్నాడు. అంతేగాదు ఫైజాన్ చేతితో రాసే విధానానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఫైజాన్ గురించి వివరించారు. ఇక ఫైజాన్ తాను కొన్ని పరీక్షల్లో బొమ్మలు గీయలేకపోయానని, ముఖ్యంగా రేఖచిత్రాలు నోటితో స్పష్టంగా గీయడంలో కాస్త తడబడ్డట్లు వెల్లడించాడు. కాగా, జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ (JAC) గురువారం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పరీక్ష ఫలితాలను ప్రకటించింది, మొత్తం ఉత్తీర్ణత శాతం 95.27గా నమోదైంది.సెరిబ్రల్ పాల్సీ అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ ప్రకారం, సెరిబ్రల్ పాల్సీ అనేది శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలోనే కనిపించే ఒక మెదడు రుగ్మత. ఇది శరీర కదలికలు, కండరాల సమన్వయంపై శాశ్వతంగా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి కదలికలను నియంత్రించే, శరీర భంగిమ సమతుల్యతను కాపాడే మెదడు సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుంది.VIDEO | Jharkhand boy overcomes cerebral palsy to top Jharkhand Class 10 boards. Holding a pen in his mouth, Faizan has overcome challenges that many regular physically able students would find difficult.He has topped the Class 10 board examinations in Jharkhand under the… pic.twitter.com/WXrfElGdCL— Press Trust of India (@PTI_News) April 24, 2026 (చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతం
రాంచీ: కాల్పుల మోతతో జార్ఘాండ్ అరణ్యాలు దద్దరిల్లాయి. హజారీబాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సహదేవ్ మహతో అలియాస్ అనుజ్, నతాషా, బుధన్ కర్మాలి (ఏరియా కమాండర్),రంజిత్ గంజూ (ఏరియా కమాండర్)లు ఉన్నారు. ముట్టడి అనంతరం భద్రతా బలగాలు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలకు ఎదురు దెబ్బ తగిలినట్లైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఖపియా అడవి ప్రాంతంలో 209 కోబ్రా బెటాలియన్ బృందాలు యాంటీ-నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. చీతా రాజేష్ కుమార్ యాదవ్ నాయకత్వంలో, చీతా అభిషేక్ యాదవ్‌తో కలిసి ఉన్న బృందం మావో యిస్టు గ్రూప్‌ను ఎదుర్కొంది. నక్సలైట్ బృందానికి సహదేవ్ మహతో నేతృత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
భీకర కాల్పులు: సరందా అడవుల్లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, రాంచీ: నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్‌లు, దళాల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా జార్ఖండ్ సరందా అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. వెస్ట్ సింగ్భూమ్-చైబాసా జిల్లాల మధ్య సరందా అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా దాగి ఉన్నాడనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గురువారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురెదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. నిన్నంతా కాల్పులు కొనసాగగా.. పోద్దుపోవడంతో ఆ ప్రాంతాన్ని హై అలర్ట్ లో ఉంచామని స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మావోయిస్టుల అగ్రనేత మిసిర్ బెస్రా తన దళాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ గ్రూపులో టాప్ లీడర్లు మోచు, సాగెన్ అంగారియా, అశ్విన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్, స్థానిక పోలీస్‌లతో కూడిన జాయింట్ టీం మారాంగ్ పొంగా–బలిబా గ్రామాల మధ్య అడవిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భారీ స్థాయిలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించారు. మిసిర్ బెస్రా నేపథ్యం.. మిసిర్ బెస్రా(71).. జార్ఖండ్–ఒడిశా రీజియన్‌లో మావోయిస్టు అగ్రనేత. గిరిడిహ్ జిల్లాకు చెందిన మదన్దిహ్ గ్రామం ఈయన స్వస్థలం. సుదీర్ఘంగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఈయన.. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. సీపీఎం (Maoist) పొలిట్‌బ్యూరోలో చివరగా మిగిలింది ఈయనేనని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఏంఏ మధ్యలో వదిలేసిన మిసిర్ బెస్రా.. శిబు సోరెన్ పోరాటాల ప్రభావంతో వామపక్ష భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడు. 1986లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాలో చేరాడు. 1989 నుంచి అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. 2000లో జార్ఖండ్ రీజినల్ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. 2004లో MCCI–PWG విలీనంతో CPI (Maoist)లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడయ్యాడు. ఈయన నేతృత్వంలో.. 2000లో రాంచీ ప్రాంతంలో పోలీసుల నుండి నాలుగు రైఫిళ్లు దోచుకున్నారు. 2001లో హజారీబాగ్, ధన్‌బాద్‌లోని సీఆర్పీఎఫ్, జేఏపీ క్యాంపులపై దాడులు చేసి 25 మంది భద్రతా సిబ్బందిని హతమార్చారు. 2005లో బీహార్‌లోని జెహనాబాద్ జైలుపై దాడి చేసి 389 మంది ఖైదీలను తప్పించారు. 2007లో అరెస్టు అయ్యి.. ఆ తర్వాత పోలీసుల కళ్లు గప్పి జైలు నుండి తప్పించుకున్నారు. జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మిసిర్పై 154 కేసులు నమోదయ్యాయి. మూడు ఎన్ఐఏ కేసులు కూడా ఉన్నాయి.పలు దాడులకు సంబంధించిన వ్యూహకర్త అయిన మిసిర్ బెస్రా మీద రూ.కోటి బహుమతి ప్రకటించింది జార్ఖండ్ ప్రభుత్వం. ఇతర సీనియర్ నేతలు లొంగిపోతున్నా.. ఎన్కౌంటర్లలో మరణించినా.. బెస్రా మాత్రం సరందా అడువుల్లో దాక్కుని భద్రతా బలగాలకు చిక్కడం లేదు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో.. మిసిర్ను లొంగిపోవాలని ఈ మధ్యే కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తాజాగా.. ఏప్రిల్ 3న పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల సీనియర్ నేత ప్రశాంత్ బోస్ (కిషన్ దా) రాంచీ ప్రభుత్వాసుపత్రిలో కన్నుమూశారు. మరణించే ముందు మిసిర్ బెస్రా అలియాస్ సాగర్‌ను ఉద్దేశించి కిషన్ దా ఓ లేఖ రాశారు. ‘‘ఆయుధ పోరాటం ద్వారా లక్ష్యాలను సాధించడం ఇక సాధ్యం కాదని.. పార్టీకి కొత్త వ్యూహం అవసరమని’’ ఆ లేఖలో మిసిర్కు సూచించారాయన. వెలువడని అధికారిక ప్రకటన.. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు.. మరికొందరు గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. అలాగే.. కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఐదుగురు జవాన్లు గాయపడ్డారని.. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో రాంచీకి ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఎదురు కాల్పులు, ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుండడంతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్రం కీలక ప్రకటనదశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవని కేంద్ర ప్రభుత్వం గురువారం.. రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం అందించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండేళ్లుగా మావోయిస్టుల ఏరివేత కోసం భారీ ఆపరేషన్లు చేపట్టింది. -
మావోయిస్ట్ అగ్ర నేత.. ప్రశాంత్ బోస్ కన్నుమూత
రాంచీ: జార్ఖండ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిషేధిత మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత కిషన్ దా గా పరిచయమున్న ప్రశాంత్ బోస్ శుక్రవారం కన్నుమూశారు. 80ఏళ్లకు పైగా వయస్సున్న ఈయనకు మనీశ్, బుద్ధ అనే పేర్లు కూడా ఉన్నాయి. శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన ఆయన్ను జైలు అధికారులు వెంటనే రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ప్రశాంత్ బోస్ తుది శ్వాస విడిచారని రాంచీ ఎస్ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. మృతికి కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కొంతకాలంగా మధుమేహం, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. జార్ఖండ్‌లోని సెరాయ్‌కేలా–ఖర్సావన్ జిల్లాలో 2021 నవంబర్ 12వ తేదీన భార్య షీలా మరాండీతోపాటు ప్రశాంత్ బోస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌తోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర ఏడు రాష్ట్రాల పరిధిలో మావోయిస్ట్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. జార్ఖండ్‌లోని దట్టమైన సారండా అడవుల్లో రహస్య జీవనం సాగిస్తూ 100కు పైగా దాడులకు ప్రశాంత్ బోస్ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. నిషేధిత మావోయిస్ట్ పార్టీ కీలక విభాగాలైన సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్లలో ముఖ్యనేతగా ఉన్నారు. జార్ఖండ్ ప్రభుత్వం 2018లో ఈయన తలపై రూ.కోటి రివార్డు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి రివార్డులే ప్రకటించాయి. -
MS Dhoni: ధోనికి భారీ షాక్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వివాదంలో చిక్కుకున్నాడు. జార్ఖండ్ స్టేట్ హౌజింగ్ బోర్డు అతడికి నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే... మైదానంలో వివాదరహితుడగా, మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందాడు ధోని.దిగ్గజ సారథితన అద్భుతమైన సారథ్య నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని (MS Dhoni). ఇక ఐపీఎల్‌లోనూ తిరుగులేని సారథిగా ఈ మిస్టర్ కూల్‌కు రికార్డు ఉంది.చెన్నై సూపర్ కింగ్స్‌ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని.. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ 44 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్-2026 బరిలో నిలిచేందుకు ఇప్పటికే సన్నద్ధమమ్యాడు.ఆస్తికి సంబంధించిన వివాదంఇక మైదానంలో ధోని మెరుపుల కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. అతడు ఓ ఆస్తికి సంబంధించి తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియా టుడే కథనం ప్రకారం..దుర్వినియోగం చేస్తు న్నారనే ఆరోపణలుజార్ఖండ్లోని హర్మూ రోడ్లో గృహ అవసరాల నిమిత్తం ధోని రెసిడెన్షియల్ ప్లాట్ సొంతం చేసుకున్నాడు. దీనిని కేవలం నివాస స్థలంగా మాత్రమే ఉపయోగించాలని జార్ఖండ్ స్టేట్ హౌజింగ్ బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ ప్లాట్‌లో డయాగ్నస్టిక్ సెంటర్ నడుపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.ధోని రింగ్ రోడ్డులోని కొత్త నివాసానికి మారిన తర్వాతే ఈ ప్రచారం ఊపందుకోగా.. హౌజింగ్ బోర్డు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధోనికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ఇదే ఆఖరి అవకాశం అని పేర్కొన్నట్లు సమాచారం.నిజమని తేలితే కేటాయింపులు రద్దుఈ విషయం గురించి హౌజింగ్ బోర్డు చైర్మన్ సంజయ్ లాల్ పాశ్వాన్ మాట్లాడుతూ.. గృహ అవసరాల నిమిత్తమే ఈ ప్లాట్‌ను ధోనికి కేటాయించామని.. అయితే, అక్కడ వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ధోనికి నోటీసులు జారీ చేశామన్నారు.అయితే, ధోని ఒక్కడికే కాకుండా హర్మూ రోడ్డులో ప్లాట్లు సొంతం చేసుకున్న మరి కొందరు సీనియర్ అధికారులపై కూడా ఇలాంటి ఆరోపణలే రాగా.. వారిని కూడా వివరణ కోరినట్లు పాశ్వాన్ తెలిపారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే వారికి కేటాయించిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: T20 WC 2026 SL vs PAK: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు! -
రాంచీలో గజరాజు సంచారం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో శుకవ్రారం ఉదయాన్నే ఓ గజరాజు అలజడి రేపింది. ఉదయం 5 గంటలప్పుడు నగర శివార్లలో కనిపించిన ఆ ఏనుగు 5 గంటలపాటు నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బిర్సా చౌక్, రాంచీ విమానాశ్రయం ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగును అటవీ సిబ్బంది ఉదయం 10 గంటల సమయానికి విజయవంతంగా అడవిబాట పట్టించగలిగారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి ప్రవేశించింది. ‘దారి తప్పిన ఆ ఏనుగు నగరంలోకి ప్రవేశించింది. ఉదయం వేళ చిన్నారులు స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం’అని రాంచీ డివిజన్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ చెప్పారు. ఎటువంటి నష్టం జరగలేదన్నారు. హల్హు అటవీ ప్రాంతం నుంచి ధుర్వా వైపు తరచూ ఏనుగులు వస్తున్నాయని వివరించారు. 2024 జూన్‌లోనూ ఏనుగొకటి మొదటిసారిగా నగరంలోకి ప్రవేశించిందని గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోకి వచి్చందన్నారు. అదేవిధంగా, నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న రటులోని పాడుబడ్డ శీతల గిడ్డంగిలోకి రెండు ఏనుగులు ప్రవేశించాయన్నారు. 2013లోనూ రాంచీ సిటీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక ఏనుగు సంచరించిందని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏనుగుల దాడి ఘటనల్లో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని వర్మ తెలిపారు. -
బ్లాక్‌బాక్సు లేని 40 ఏళ్ల విమానం
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఏడుగురి మృతికి కారణమైన 40 ఏళ్ల నాటి బీచ్‌క్రాఫ్ట్ సీ90ఏ విమానంలో బ్లాక్‌బాక్సు (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లు) లేదని డీజీసీఏ వెల్లడించింది. దానికి చివరిసారిగా 1987లో అర్హత సరి్టఫికెట్ జారీ చేసినట్లు పేర్కొంది. రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90ఏను ఎయిర్ అంబులెన్స్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ నెల 23న జార్ఖండ్ నుంచి ఢిల్లీకి అత్యవసరంగా బయలుదేరగా మధ్యలోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానాన్ని 1987లో తయారు చేసినట్లు గుర్తించారు. అర్హత సమీక్ష సర్టిఫికెట్ వచ్చే ఏడాది జనవరి 20దాకా చెల్లుబాటు అవుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, విమానంలో బ్లాక్‌బాక్సు లేకపోవడం దర్యాప్తునకు అవరోధంగా మారింది. విమానానికి సంబంధించిన కీలక సమాచారం అందుబాటు లేకుండాపోయింది. నిబంధనల ప్రకారం.. 5,700 కిలోల కంటే బరువు ఉన్న విమానంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కచ్చితంగా ఉండాలి. ప్రమాదానికి గురైన విమానం బరువు 4,583 కిలోలుగా తేల్చారు. విమానంలో లోపాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు స్పష్టంచేశాయి. -
జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్
రాంచీ: జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రాంచి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ జార్ఘాండ్ ఛత్రా జిల్లాలో కూలింది. విమానంలో సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. ప్రమాదాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. ఎయిర్ అంబులెన్స్‌లో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు అటెండెంట్లు, ఒక డాక్టర్, ఒక పారామెడిక్ ఉన్నట్లు తెలిపింది. ఈ విమానం బీచ్‌క్రాఫ్ట్ C90 మోడల్‌ది. రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన ఎయిర్ అంబులెన్స్ రాంచీ విమానాశ్రయం నుండి సాయంత్రం 7:11 గంటలకు టేకాఫ్ అయింది. 7:34 గంటలకు కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చివరిసారి సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సుమారు వారణాసి దక్షిణ-తూర్పు దిశలో 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ కమ్యూనికేషన్ సంబంధాలు కోల్పోయింది.దీంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఛత్రా జిల్లా ప్రభుత్వయంత్రాంగానికి సమాచారం అందించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
‘మంట’గలిసిన మానవత్వం
చైబాసా (జార్ఖండ్): ఆమె గుండెలకు హత్తుకున్నది తన ప్రాణాన్ని.. ఆ గుంపు నిప్పు పెట్టింది ఆ ప్రేమనే.. ముక్కుపచ్చలారని ఏడాది పసికందును, గుండెల్లో హత్తుకున్న తల్లిని.. మూఢత్వం రగిలించిన మంటలు బూడిద చేశాయి. చేతబడి అనే ఒక అబద్ధపు ముద్ర.. కన్నపేగును, అమ్మ ఒడిని నిలువునా దహించివేసిన వేళ, అక్కడ కాలిపోయింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. ఈ సమాజపు మానవత్వం.. నాగరిక సమాజం తలదించుకునేలా జార్ఖండ్‌లో మంత్రగత్తె నెపంతో ఒక మహిళను, ఆమె ఏడాది వయసున్న పసికందును సజీవ దహనం చేసిన ఘోరం వెలుగు చూసింది.మంత్రగత్తె నెపంతో..పశ్చిమ సింగ్భూమ్ జిల్లా కుమారదుంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనమిది. మృతురాలి బంధువు ఒకరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. అయితే, ఆ మహిళ చేసిన చేతబడి వల్లే అతను చనిపోయాడని స్థానికులు కొందరు నమ్మారు.ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 12 మంది వ్యక్తులు ఆమె ఇంటిపై దాడి చేశారు. భార్యాభర్తలిద్దరినీ బయటకు లాగి ఘర్షణకు దిగారు. గందరగోళం మధ్య, ఆమె చేతిలో ఏడాది బాబు ఉండగానే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లి, బిడ్డ అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ దాడిలో భర్త కూడా గాయపడగా, అతను ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని రాత్రంతా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.చదవండి: కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకుని..బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు జగన్నాథ్‌పూర్ ఎస్డీపీవో రాఫెల్ ముర్ము తెలిపారు. కేవలం మూఢనమ్మకాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడిలో పాల్గొన్న ఇతర మహిళలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం కుమారదుంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఉత్తరాఖండ్ సంచలనం
జంషెడ్పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఉత్తరాఖండ్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్ జట్టుతో ఇక్కడి కీనన్ స్టేడియంలో ఆదివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ జట్టు ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసుకుంది. 136 పరుగుల తేడాతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ జట్టు ఒకదశలో 100/2తో పటిష్టంగానే కనిపించింది. అయితే ఉత్తరాఖండ్ వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా మాయాజాలానికి... అభయ్ నేగి పేస్ ధాటికి జార్ఖండ్ జట్టు చివరి 8 వికెట్లను 30 పరుగుల తేడాలో కోల్పోయింది. చివరకు 130 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (34; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మయాంక్ మిశ్రా 22 పరుగులిచ్చి 5 వికెట్లు, అభయ్ నేగి 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఉత్తరాఖండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 282/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ జట్టు 122.3 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటై 136 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కెపె్టన్ కునాల్ చండేలా (68; 8 ఫోర్లు), జగదీశ సుచిత్ (70; 6 ఫోర్లు), అభయ్ నేగి (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. కర్ణాటక లక్ష్యం 325 ముంబై జట్టుతో ముంబైలో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు విజయానికి 212 పరుగుల దూరంలో నిలిచింది. ముంబై నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60 బ్యాటింగ్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (3), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 189/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు 98.3 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటైంది. తనుశ్ కొటియాన్ (48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), తుషార్ దేశ్‌పాండే (47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా ముంబై జట్టు కర్ణాటకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కష్టాల్లో మధ్యప్రదేశ్ జమ్మూ కశ్మీర్ జట్టుతో ఇండోర్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ కష్టాల్లో పడింది. 291 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 204 పరుగులు చేయాలి. ప్రస్తుతం శుభం శర్మ (11 బ్యాటింగ్), వెంకటేశ్ అయ్యర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో ఆఖిబ్ నబీ 3 వికెట్లు, ఆబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 84/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు 70.3 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. -
దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు.. లారీ నుజ్జునుజ్జు..!
రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్‌పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లోని దేవోబంద్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్‌పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్‌పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.A tragic incident occurred on the Jasidih-Madhupur section of the Eastern Railways.Who's at fault here? #IndianRailways pic.twitter.com/DDzAezLxwD— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) January 22, 2026అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్ పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
జార్ఖండ్‌లోని చైబాసాలో భారీ ఎన్ కౌంటర్
-
Jharkhand: ఏనుగు దాడి.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సింఘ్‌భూమ్: జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఎనిమిది నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. తెల్లవారుజామున గోయిల్కేరా బ్లాక్‌లోని సోవాన్ గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఒక ఏనుగు గ్రామంలోని ఒక గుడిసెపై దాడి చేసి, అందులో నిద్రిస్తున్న వారిని తొక్కి చంపేసింది. ఈ ఘటనలో కుంద్రా బాహదా, అతని కుమార్తె కొద్మా బాహదా, కుమారుడు సాము బాహదా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం నుంచి కుంద్రా భార్య తృటిలో తప్పించుకోగా, మరో కుమార్తె జింగీ బాహదా తీవ్ర తల గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో గత ఆరు రోజులుగా ఏనుగుల దాడులు మరింతగా పెరిగాయి. తాజా మరణాలతో కలిపి ఈ వారంలో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. ఈ తరహా ఘటనల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోయిల్కేరా బ్లాక్ ఏనుగుల దాడులకు కేంద్రబిందువుగా మారింది. మంద నుండి విడిపోయిన ఒక ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేస్తూ, నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను నాశనం చేస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.తాజాగా ఏనుగు దాడి జరిగిన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 20,000 నగదును అందజేశారు. ఏనుగును అడవిలోకి పంపేందుకు పశ్చిమ బెంగాల్ నుండి ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించారు. అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు సూచించారు. అటవీ ఆక్రమణలు, ఆహారం లభించకపోవడం తదితర కారణాలతో ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఎనిమిదో వింత: కమలంతో కాంగ్రెస్ దోస్తీ! -
IND vs NZ: సెలక్షన్ రోజే విఫలమైన ఇషాన్ కిషన్!
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.వన్డేల్లోనూ పునరాగమనం!అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్‌తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.సెలక్షన్ రోజు విఫలంకివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్‌తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.ఏకంగా ప్రపంచకప్ జట్టులోకిజార్ఖండ్ సారథిగా.. బ్యాటర్‌గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ కీపర్, ఓపెనర్‌గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 500కు పైచిలుకు పరుగులతో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్.. జట్టుకు తొలి టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. ఏకంగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించున్నాడు.టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ.. తాజాగా దేశీ వన్డే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక (Karnataka vs Jharkhand)తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్‌ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డుఈ క్రమంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అదే విధంగా ఓ ప్రపంచ రికార్డును కూడా ఇషాన్ కిషన్ ఈ సందర్భంగా తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ సందున్ వీరక్కడి 39 బంతుల్లో శతక్కొట్టగా.. తాజాగా ఈ రికార్డును ఇషాన్ సవరించాడు. తద్వారా ప్రపంచంలోనే లిస్ట్-ఎ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో- 2025లో జార్ఖండ్ తరఫున కర్ణాటక మీద👉సందున్ వీరక్కడి- 39 బంతుల్లో- 2019లో సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున బదురేలియా స్పోర్ట్స్ క్లబ్ మీద👉ఉర్విల్ పటేల్- 41 బంతుల్లో- 2023లో గుజరాత్ తరఫున అరుణాచల్ ప్రదేశ్ మీద👉మార్క్ బౌచర్- 44 బంతుల్లో- 2006లో సౌతాఫ్రికా తరఫున జింబాబ్వే మీద.ఇషాన్ దంచి కొట్టినాఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్‌లో ఇషాన్ దంచి కొట్టినా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 5 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. విరాట్ సింగ్ (68 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుమార్ కుషాగ్ర (47 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక బౌలర్లు ఏకంగా 47 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడంతో జార్ఖండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అభిలాష్ శెట్టి 4 వికెట్లు పడగొట్టాడు.పడిక్కల్ భారీ సెంచరీతోఅనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 413 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దేవదత్ పడిక్కల్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 54; 10 ఫోర్లు), అభినవ్ మనోహర్ (32 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించగా... ధ్రువ్ ప్రభాకర్ (22 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), క్రిష్ణన్ శ్రీజిత్ (38), కరుణ్ నాయర్ (29), రవిచంద్రన్ స్మరణ్ (27) తలా కొన్ని పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో సౌరభ్ శేఖర్, ఉత్కర్ష్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 విజేతగా జార్ఖండ్ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను 69 పరుగుల తేడాతో చిత్తు చేసిన జార్ఖండ్.. తొలిసారి ఈ దేశవాళీ టీ20 టోర్నీ టైటిల్‌ను ముద్దాడింది. జార్ఖండ్ ఛాంపియన్‌గా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర.తుది పోరులో కిషన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కిషన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఎంసీఎ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడు కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు కుషాగ్ర(81) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన కిషన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కిషన్ సాధించిన రికార్డులు ఇవే..👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొట్టమొదటి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.👉ఒకే టీ20 టోర్నమెంట్లో (అంతర్జాతీయ లేదా డొమెస్టిక్) అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ కెప్టెన్‌గా ఇషాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో అతడు 33 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని (30), నికోలస్ పూరన్ (30) పేరిట ఉండేది.👉టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్(5) రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు. కిషన్ ఇప్పటివరకు టీ20ల్లో 6 సెంచరీలు చేశాడు. ఓవరాల్ వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా కిషన్ నిలిచాడు. తొలి స్ధానంలో క్వింటన్ డికాక్(7) ఉన్నాడు.👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డును ఇషాన్ సమం చేశారు. ఈ దేశవాళీ టోర్నీలో వీరిద్దరూ ఇప్పటివరకు చెరో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.👉ఒకే టోర్నమెంట్లో వికెట్ కీపర్ కెప్టెన్‌గా రెండు సార్లు సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్‌గా ఇషన్ నిలిచాడు.కిషన్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ నుంచి తప్పించింది. ఆ తర్వాత మళ్లీ అతడు డొమాస్టిక్ క్రికెట్ ఆడడంతో తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. కానీ జట్టులోకి మాత్రం ఇంకా పునరాగమనం చేయలేదు.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
కెప్టెన్ ఇషాన్ కిషన్ కొట్టేశాడు!
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో హర్యానా- జార్ఖండ్ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్యానా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.101 పరుగులుమరో ఓపెనర్ విరాట్ సింగ్ (2) విఫలమైనా.. ఇషాన్ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్‌లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా మెరుపు హాఫ్ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 177 పరుగులు జోడించారు.ధనాధన్ ఇన్నింగ్స్‌అనంతరం అనుకుల్ రాయ్ (20 బంతుల్లో 40), రాబిన్ మింజ్ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సమంత్ జేఖర్, సుమిత్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జార్ఖండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్ అంకిత్ కుమార్, వన్‌డౌన్‌లో వచ్చిన ఆశిష్ సివాజ్ డకౌట్ అయ్యారు.పోరాడిన మిడిలార్డర్ఇలాంటి దశలో మిడిలార్డర్లో యశ్వర్ధన్ దలాల్ (22 బంతుల్లో 53), నిషాంత్ సింధు (15 బంతుల్లో 31), సమంత్ జేఖర్ (17 బంతుల్లో 38) ధనాధన్ ఆడి.. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపారు.ఆఖర్లో పార్త్ వట్స్ (4), సుమిత్ కుమార్ (5), అన్షుల్ కాంబోజ్ (11) తడబడగా.. అమిత్ రాణా (13 నాటౌట్), ఇషాంత్ భరద్వాజ్ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్ కావడంతో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో గెలిచింది.జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్ సింగ్, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్ గెలుచుకున్న జార్ఖండ్.. తాజాగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు That winning feeling! 🥳Time for celebration in the Jharkhand camp as they win the Syed Mushtaq Ali Trophy for the first time 🙌Scorecard ▶️ https://t.co/3fGWDCTjoo#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/qJB0b2oS0Y— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
ఫైనల్లో ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్‌తో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో టైటిల్ పోరులో టాస్ ఓడిన జార్ఖండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో విరాట్ సింగ్ (2) విఫలం కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.శతక్కొట్టిన ఇషాన్ కిషన్.. కుశాగ్రా ధనాధన్మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు.అనుకుల్, రాబిన్ మింజ్ ధనాధన్ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రాకు తోడు అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ ధనాధన్ దంచికొట్టారు. అనుకుల్ రాయ్ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. రాబిన్ మింజ్ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సుమిత్ కుమార్, సమంత్ జేఖర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐLeading from the front! 🫡Ishan Kishan with a magnificent hundred in the #SMAT final 💯The Jharkhand captain walks back for 1⃣0⃣1⃣(49) 👏Updates ▶️ https://t.co/3fGWDCTjoo@IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/PJ7VI752wp— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
ఆంధ్ర గెలిచినా...
పుణే: దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ‘సూపర్ లీగ్’ దశతోనే ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా... మంగళవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం సాధించినా... రన్‌రేట్‌లో వెనుకబడ్డ కారణంగా ఫైనల్ చేరే అవకాశం కోల్పోయింది. ‘సూపర్ లీగ్’లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు 2 విజయాలు, ఒక పరాజయంతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. జార్ఖండ్ కూడా ఎనిమిది పాయింట్లతోనే ఉన్నా... రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న జార్ఖండ్ ముందంజ వేయగా... ఆంధ్ర జట్టు ఇంటిబాట పట్టింది. టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/32) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 9 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్ కాగా... శ్రీకర్ భరత్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), అశి్వన్ హెబ్బర్ (30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం జార్ఖండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. విరాట్ సింగ్ (40 బంతుల్లో 77; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన జార్ఖండ్ (+0.221)... ఆంధ్ర (–0.113) చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో మాత్రమే ఓడటంతో మెరుగైన రన్‌రేట్‌తో తుదిపోరుకు అర్హత సాధించింది. -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.182 పరుగులుఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా... బ్రికమ్ కుమార్ దాస్ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మణిశంకర్ (21 బంతుల్లో 42; 5 సిక్స్‌లు) రాణించారు.సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్జార్ఖండ్ బౌలర్లలో వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్ సింగ్ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాటీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ ఇషాన్ కిషన్ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్ నిలిచాడు.గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్లో జార్ఖండ్ సారథిగా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ టీ20 ఫార్మాట్లో మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.టీ20 క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏ఇషాన్ కిషన్ (ఇండియా)- జార్ఖండ్ తరఫున 3 శతకాలు🏏ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ తరఫున కలిని 2 శతకాలు🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 2 శతకాలు. చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి -
కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన
త్వరలో ప్రారంభం కానున్న దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025-26) కోసం 15 మంది సభ్యుల జార్ఖండ్ జట్టును ఇవాళ (నవంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఎంపికయ్యాడు. ఈ జట్టులో కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్ లాంటి ఐపీఎల్ సంచలనాలకు చోటు దక్కింది. ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్ లాంటి స్థిరమైన బ్యాటర్లు.. సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్ లాంటి నాణ్యమైన బౌలర్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరందిరినీ కలగలుపుకొని ఇషాన్ జార్ఖండ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.27 ఏళ్ల ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు మారు పేరు. చూడటానికి చిన్నగా ఉన్నా భారీ షాట్లు ఆడగల సమర్దుడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఇషాన్, టీమిండియాలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇషాన్‌కు ఇదివరకే జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది.టీ20 ఫార్మాట్లో ఇషాన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 206 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్.. 134.20 స్ట్రైక్ రేట్‌తో 5270 పరుగులు చేశాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అనుభవమున్న ఇషాన్.. తాజాగా సౌతాఫ్రికా-ఏతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున మెరిశాడు. ఈ సిరీస్‌లో ఇషాన్ ఓ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ ఎలైట్ గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, తమిళనాడు, సౌరాష్ట్ర, త్రిపుర జట్లు ఉన్నాయి. జార్ఖండ్ నవంబర్ 26న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈసారి ఇషాన్ నేతృత్వంలోని జార్ఖండ్ జట్టు అండర్ డాగ్‌గా బరిలోకి దిగనుంది. స్టార్లతో నిండిన పటిష్టమైన జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది.కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్ లాంటి హార్డ్ హిట్టర్లు చెలరేగవచ్చు. అనుకూల్ రాయ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటే ఆస్కారం ఉంది. ఇషాన్‌ను వ్యక్తిగతంగా ఆపడం కూడా చాలా కష్టమవచ్చు. ఇషాన్ ఒక్క సారి టచ్‌లోకి వచ్చాడంటే ఎంతటి బౌలర్లనైనా లెక్క చేయడు.SMAT 2025-26 కోసం జార్ఖండ్ జట్టు.. ఇషాన్ కిషన్ (C/WK), ఉత్కర్ష్ సింగ్, విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా (WK/VC), రాబిన్ మింజ్, అనుకూల్ రాయ్, పంకజ్ కుమార్, బాలకృష్ణ, మొహమ్మద్ కౌనైన్ ఖురేషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజన్దీప్ సింగ్. చదవండి: IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు -
ఆంధ్ర ‘హ్యాట్రిక్’ విజయం
జంషెడ్పూర్: రంజీ ట్రోఫీలో ఆంధ్ర క్రికెట్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో జార్ఖండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 34/2తో చివరి రోజు ఆట కొనసాగించిన జార్ఖండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 52.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. శరణ్‌దీప్ సింగ్ (65) అర్ధ సెంచరీ చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సౌరభ్ కుమార్ (5/57) ఐదు వికెట్లతో చెలరేగగా, త్రిపురాణ విజయ్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘ఎ’లో 22 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చిత్తుగా ఓడిన హైదరాబాద్... జమ్మూ: గ్రూప్ ‘డి’లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 281 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 472 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 169/7తో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ 57.5 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌటైంది. మరో 21 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. జమ్మూ కశ్మీర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆబిద్ ముష్తాక్ (7/68) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. 5 మ్యాచ్‌ల్లో 1 గెలిచి, 1 ఓడి, 3 ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రంజీకి విరామం... బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం ఈ దశలో రంజీ ట్రోఫీకి విరామం రానుంది. దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (నవంబర్ 26–డిసెంబర్ 18), వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (డిసెంబర్ 24–జనవరి 18)లను ఈ మధ్య కాలంలో నిర్వహిస్తారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ కొనసాగుతోంది. జనవరి 26 నుంచి జరిగే తమ తర్వాతి రంజీ మ్యాచ్‌ల్లో విదర్భతో ఆంధ్ర, ముంబైతో హైదరాబాద్ తలపడతాయి. -
అభిషేక్ రెడ్డి డబుల్ సెంచరీ
జంషెడ్పూర్: ఓపెనర్ అభిషేక్ రెడ్డి (348 బంతుల్లో 247; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆంధ్ర జట్టు కొండంత స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 128 ఓవర్లలో 567/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 224/2తో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. అభిషేక్ రెడ్డి సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. కరణ్ షిండే (129 బంతుల్లో 94; 7 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శ్రీకర్ భరత్, షేక్ రషీద్ అర్ధశతకాలు సాధించగా... త్రిపురణ విజయ్ (27), కెప్టెన్ రికీ భుయ్ (18) ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే ఐదో వికెట్‌కు కరణ్ షిండేతో కలిసి అభిõÙక్ రెడ్డి 208 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఆఖర్లో సౌరభ్ కుమార్ (13 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. జార్ఖండ్ బౌలర్లలో అనుకూల్ రాయ్, రిషవ్ రాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. శిఖర్ మోహన్ (3), కుమార్ కుషాగ్ర (16) అవుట్ కాగా... శరణ్‌దీప్ సింగ్ (13 బ్యాటింగ్) మానిషి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సరికి చేతిలో 8 వికెట్లు ఉన్న జార్ఖండ్ జట్టు... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉంది. -
షాకిచ్చిన ఉప ఫలితాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు ఈనెల 11వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటిని అధికార పక్షాలు దక్కించుకున్నాయి. బీజేపీ పాలిత రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకోగా, జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం స్థానం అధికార నేషనల్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా ఓటమి పాలైంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)అభ్యర్థి విజయం సాధించారు. జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా సీటును బీజేపీ నిలబెట్టుకుంది. మిజోరంలో ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) డంపా సీటును, పంజాబ్‌లోని తరన్‌తరన్ స్థానాన్ని ఆప్, జార్ఖండ్‌లోని ఘట్శిలా స్థానాన్ని జేఎంఎం నిలబెట్టుకున్నాయి. అదేవిధంగా, తెలంగాణలోని జుబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో తిరిగి గెలుచుకుంది. ఉప ఎన్నిక ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులకు విజయం అందించిన జమ్మూకశ్మీర్‌లోని నగ్రటా, ఒడిశాలోని నౌపడ నియోజకవర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎమ్మెల్యేలైన దేవయాని రాణా, ధొలాకియాలను ఆయన అభినందించారు. వీరి గెలుపునకు అహరి్నశలు కృషి చేసిన కార్యకర్తలకు ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు. కంచుకోటలో ఎన్సీ ఓటమి బుద్గాం నియోజకవర్గం అబ్దుల్లాల కుటుంబానికి కంచుకోటగా ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుద్గాంతోపాటు గండేర్బల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, సీఎం అయ్యాక బుద్గాంకు రాజీనామా చేశారు. దీంతో, 11న ఉప ఎన్నిక జరిగింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఇక్కడ ప్రతిపక్ష పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు. ఎన్సీ అభ్యర్థి ఆగా సయ్యద్ మెహ్మూద్పై ముంతజీర్ 4,478 ఓట్ల తేడాతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. 1957లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఓటమి ఎరుగని ఎన్సీకి మొట్టమొదటి పరాజయమిది. డిపాజిట్ కోల్పోయిన ఎన్సీ జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా గెలుచుకున్నారు. జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ(జేకేఎన్‌పీపీ)కి చెందిన హర్‡్ష దేవ్ సింగ్‌పై 24,647 ఓట్ల తేడాతో దేవయాని గెలిచారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యరి్థని షమీమ్ బేగం డిపాజిట్ కోల్పోయారు. ఆమెకు కేవలం 10,872 ఓట్లు మాత్రమే దక్కాయి. దివంగత ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవయాని. దేవేందర్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. నౌపడలో బీజేపీ భారీ మెజార్టీ ఒడిశాలోని నౌపడ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి జే ధొలాకియా గెలుచుకున్నారు. సమీప ప్రత్యరి్థ, కాంగ్రెస్‌కు చెందిన ఘాసీ రామ్ మాఝిపై 83,748 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దివంగత బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధొలాకియా కుమారుడు జె. రాజేంద్ర మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీకి ఎదురుదెబ్బ రాజస్తాన్‌లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అంటా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్‌పై కాంగ్రెస్ నేత ప్రమోద్ జైన్ భయా 15,612 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది. దీంతో, ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. సీటు నిలుపుకున్న ఆప్ పంజాబ్‌లోని తరన్ తరన్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు తన సమీప ప్రత్యరి్థ, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్వీందర్ కౌర్ రణ్ధవాపై 12,091 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆప్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సొహాల్ జూన్‌లో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిపారు.జార్ఖండ్‌లో బీజేపీ ఓటమి జార్ఖండ్‌లోని ఘట్శిలా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన సోమేశ్ చంద్ర సోరెన్, సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన బాబూలాల్ సోరెన్‌ను 38,500 ఓట్ల తేడాతో ఓడించారు. జేఎంఎం ఎమ్మెల్యే రాందాస్ సోరెన్ కుమారుడే సోమేశ్. రాందాస్ ఆగస్ట్ 15వ తేదీన హఠాన్మరణం చెందగా ఉప ఎన్నిక చేపట్టారు. స్వల్ప తేడాతో విజయం అధికార జొరాం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) అభ్యర్థి వన్లాల్ సైలోవా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై ఎంఎన్ఎఫ్ అభ్యర్థి ఆర్.లాల్థంగ్లియా 562 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎంఎన్ఎఫ్కు చెందిన డంపా శాసనసభ్యుడు లాల్రిన్ట్లువాంగా సైలో జూలైలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. -
బిహార్ రాజకీయాల్లో జార్ఖండ్ జోక్యం
బిహార్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. జార్ఖండ్ రాష్టానికి చెందిన నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప గెలుపు సాధ్యం కాదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. బిహార్, జార్ఖండ్ సరిహద్దుల వెంట రాజ్‌మహల్ కొండలు ఉన్నాయి. ఆ కొండల వెంట ఉండే కతియార్, భాగల్పూర్లోని కహాల్గావ్, బంకా, జముయ్ జిల్లాల్లోని ఎక్కువ భాగం ప్రజలు సంస్కృతి, భాష పరంగా జార్ఖండ్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో రాజకీయంగా తూర్పు బిహార్‌పై జార్ఖండ్ నేతల ప్రభావం ఉంటుందని స్వయంగా స్థానిక ఓటర్లే చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలోని గిరిజనుల ఓట్లే నేతల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. జార్ఖండ్ కేంద్రంగా వ్యూహ రచన చకై, బంకాలోని బెల్హార్, కటారియా కతిహార్‌లోని మణిపురి, భాగల్పూర్లోని కహాల్గావ్ అసెంబ్లీ స్థానాల్లో గిరిజనులు ఎక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గతంలో చకయి స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది. ఈ ప్రాంత వాసులు గత ఏడాది నవంబర్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జముయి జిల్లా ఖైరా బ్లాక్‌లోని గిరిజన ఫ్రైడే వేడుకకు రెండు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నేతలు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైతం ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. జార్ఖండ్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయతి్నస్తోంది. ఓట్లను రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇరు కూటములు కుల సమీకరణలను బేరీజు వేసుకుంటున్నాయి. చకయి చేజిక్కాలంటే.. జముయి జిల్లాలోని చకయి అసెంబ్లీ నియోజకవర్గం జార్ఖండ్‌లోని దేవరి సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ఓటర్లలో 20.8 శాతం మంది యాదవులు, 11.5 శాతం మంది ముస్లింలు, 8.4 శాతం మంది గిరిజనులు ఉన్నారు. వీళ్లే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. జేఎంఎం, జేడీయూ ఎన్నికల చిహ్నాలు దాదాపు ఒకే ఆకృతిలో ఉండటం జేడీయూ బాగా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఓట్లు జేడీయూకు పడుతున్నాయనే ఫిర్యాదులు గతంలోనే వెల్లువెత్తాయి. 2010లో జేఎంఎం టికెట్‌పై సుమిత్ సింగ్ 188 ఓట్ల తేడా గెలిచారు. 2020లో అతనే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యరి్థని 581 ఓట్లతో ఓడించారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. బెల్హార్ బలాబలాలు కీలకమే జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ సమీపంలోని బెల్హార్ సైతం జార్ఖండ్ మూలాలున్న నేతలతో ఇరు కూటములకు సవాల్‌గా మారింది. 2015 ఎన్నికల్లో కటోరియాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కిషోర్ ప్రసాద్ జేఎంఎం టికెట్‌పై పోటీ చేశారు. 2010 సురేంద్ర ప్రసాద్ గుప్తా జేఎంఎం నుంచి పోటీచేసి 11 వేల ఓట్లు సాధించారు. 2005 ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి శైలేంద్ర కుమార్ 3 వేల ఓట్లు సాధించారు. మొదట్నుంచీ ఇక్కడ జార్ఖండ్ మూలాలున్న నేతలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఎన్డీఏ, విపక్షాల ‘ఇండియా’ కూటమి జేఎంఎం నేతల ప్రసన్నం కోసం అనేక వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2020లో ఇక్కడ జేడీయూకు చెందిన మనోజ్ యాదవ్ సమీప అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు రామ్‌దేవ్ యాదవ్‌పై కేవలం రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆర్జేడీ హవా కొనసాగితే అధికార కూటమికి ఇక్కడ పరాభవం తప్పదుకహల్గావ్ కహానీ జార్ఖండ్‌లోని గొడ్డా ప్రాంతానికి అనుకుని ఉన్న కహల్గావ్ సీటు ఇక్కడ కీలకమైంది. ఈ స్థానం నుంచి తన కుమారుడిని అభ్యర్థిగా నిలపాలని జార్ఖండ్ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారు. గొడ్డా ఎమ్మెల్యే సంజయ్ జార్ఖండ్‌లో ఆర్జేడీ కోటా నుంచి మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు దీపికా పాండేసింగ్ సైతం తన సన్నిహితురాలు ప్రవీణ్ కుషా్వహాను ఈ స్థానం నుంచి పోటీకి నిలపాలని ప్రయతి్నంచారు. వీళ్లను ప్రసన్నం చేసుకుని తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గతంలోనే ప్రయతి్నంచారు. కహల్గావ్లోని గోరాదిహ్లో ఇటీవల సమావేశం నిర్వహించారు. అయితే అందరినీ కలుపుకొనిపోవడం ఆయనకు తలనొప్పిగానే మారింది. ఎన్డీఏ ఇక్కడ సమీకరణలపై ముమ్మర కసరత్తు చేస్తోంది. కటోరియాను ఆకట్టుకునేదెలా? కటోరియా స్థానంపై గత 35 సంవత్సరాలుగా జేఎంఎం పార్టీ కన్నేసింది. 2015, 2020లో జేఎంఎం బంకా జిల్లాలోని కటోరియా స్థానం నుంచి అంజలి హన్నాను నిలబెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రెండు సీట్లలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఏ పార్టీ తరఫున పోటీచేసినా సరే ఆ అభ్యరి్థకి జార్ఖండ్ నేతల ఆశీస్సులు కీలకం. ముఖ్యంగా జేఎంఎం మద్దతు అత్యంత ముఖ్యం. అనుకూలమైన అభ్యర్థులను రంగంలోకి దించిన పార్టీలు విజయావకాశాలకు పావులు కదుపుతున్నాయి. ‘మణి’హారం ఎవరిదో? ఎస్టీలకు కేటాయించిన కతిహార్‌లోని మణిహరి సీటును కైవసం చేసుకుంటామని జేఎంఎం ప్రకటించింది. గిరిజన ఓటు తమకు అనుకూలమని చెబుతోంది. గత ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో పార్టీల గెలుపు అంచనాలు తారుమారయ్యాయి. ఈసారి ఈ ఇబ్బంది రాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు జార్ఖండ్ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. చివరకు జేఎంఎం చించిన నేతలనే అన్ని పార్టీలూ బరిలోకి దించాయి. అయితే ఇక్కడ పడకేసిన అభివృద్ధి అనేదే ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే వీలుంది. -
బ్లడ్‌బ్యాంక్ నిర్వాకం.. ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్
రాంచీ: జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్యశాఖపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని చాయ్‌బాసాలో స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియాతో బాధపడుతున్న తమ ఏడేళ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని విచారణకు పంపింది. శనివారం జరిగిన విచారణలో అదే ఆసుపత్రిలో తరచుగా రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలకు కూడా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదుగురికి పెరిగింది.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా గుర్తించాం. లోపాలు సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాం’’ అని అన్నారు. ఈ అవకతవకలను వివరించే నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించారు.అనంతరం, జిల్లా సివిల్ సర్జన్ డా. సుశాంత్ కుమార్ మాఝీ ఈ అంశంపై మాట్లాడారు. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ రక్త మార్పిడి ద్వారా మాత్రమే వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని, ఎందుకంటే కలుషితమైన సూదులు వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్ఐవీ సంక్రమించవచ్చని ఆయన తెలిపారు.హైకోర్టు ఆగ్రహం..ఈ ఘటనను జార్ఖండ్ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుంచి ఈ విషయంపై నివేదిక కోరింది. ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం, వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రక్త దాతలందరిని గుర్తించి వారి రక్త నమూనాలను మళ్లీ పరీక్షించాలని ఆదేశించింది.వ్యక్తిగత కక్ష కారణమా?అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూసింది. మంజహరి జిల్లా పరిషత్ సభ్యుడు మాధవ్ చంద్ర కుంకల్ ఈ ఘటన వెనుక వ్యక్తిగత విద్వేషం కారణంగా ఉన్నట్లు ఆరోపించారు. రక్త బ్యాంక్ సిబ్బందికి, బాధితుల్లో ఓ బాలుడి బంధువులో ఒకరికి మధ్య ఏడాదికాలంగా కోర్టులో కేసు నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. -
అలాగే ప్రమాదం జరిగి.. అనూహ్యంగా తప్పించుకుని..
రాంచీ: రెండూ బస్సు అగ్ని ప్రమాదాలే. రెండు బస్సులను రహదారులపై అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒక ఘటనలో బస్సు బుగ్గిపాలై 19 మందిని బలితీసుకుంటే మరో ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా ప్రమాదఘటన సుఖాంతంగా ముగిసింది. ఒకటి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంకాగా మరోటి జార్ఖండ్లోది. డ్రైవర్ అప్రమత్తత, రెప్పపాటులో ప్రతిస్పందనలతో ఎలాంటి పెను ప్రమాదం నుంచైనా అవలీలగా తప్పించుకోవచ్చని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాదం ఘటన నిరూపించింది. రెండు బస్సుల్లోనూ దాదాపు ఒకే సంఖ్యలో ప్రయాణికులు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే? జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం సాయంత్రం అత్యంత వేగంగా రహదారిపై పరుగుల తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది రాంచీ–లోహార్దగా జాతీయరహదారిపై మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ రెప్పపాటుకాలంలో బస్సును ఆపేశాడు. ప్రయాణికులు అందర్నీ అప్రమత్తంచేసి అందర్నీ కిందకు దింపేశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని ఆర్పేశారు. వీళ్లకు స్థానిక దుకాణదారులు సైతం సాయపడి తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన వివరాలను మందార్ పోలీస్‌స్టేషన్ ఆఫీసర్–ఇన్చార్జ్ మనోజ్ కర్మాలీ వెల్లడించారు. ‘‘బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తున్నారు. దాంతో అవి హఠాత్తుగా మండి బ్యాటరీబాక్స్ సమీపంలో షాట్ సర్క్యూట్‌కు కారణమయ్యాయి. దీంతో అగ్గిరాజుకొని బస్సును చుట్టుముట్టాయి. ఘటన తర్వాత బస్సును పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చాం. ప్రయాణికులందర్నీ తమతమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. బస్సులో అగ్నిమాపక ఉపకరణాలు లేవు. దీనిపై విచారణకు హాజరురావాలని బస్సు యజమానికి సమన్లు జారీచేశాం’’అని మనోజ్ కర్మాలీ చెప్పారు. అప్రమత్తత ఎలాంటి పెనువిషాదం నుంచైనా కాపాడుతుందని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాద ఘటన రుజువుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ను జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా తమిళనాడు (Tamil Nadu vs Jharkhand)తో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు. ఒకానొక సమయంలో డబుల్ సెంచరీ దిశగా పయనించిన ఇషాన్.. ద్విశతకానికి ఇరవై ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.సెలక్టర్లకు గట్టి వార్నింగ్ఏదేమైనా ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రదర్శన పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. అద్భుత సెంచరీతో టీమిండియా సెలక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌ను చాన్నాళ్లుగా టీమిండియా నుంచి పక్కన పెట్టడం గురించి మాట్లాడుతూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను తెరమీదకు తెస్తున్నారు.మెరుగైన ప్రదర్శనతో‘‘ఇషాన్ కిషన్ మంచి ఆటగాడు. అయితే, అతడు దేశీ క్రికెట్లో తరచుగా ఆడుతూ.. నిలకడైన ప్రదర్శనలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకునేందుకు సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అగార్కర్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఈ యువ ఆటగాడు... ఈసారి మెరుగైన ప్రదర్శనతో సీజన్‌ను ఆరంభించడం విశేషం.తొలిరోజే శతకంఇక మ్యాచ్ విషయానికొస్తే... కోయంబత్తూర్ వేదికగా తమిళనాడుతో బుధవారం మొదలైన పోరులో టాస్ గెలిచిన జార్ఖండ్.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు టీమిండియా ప్లేయర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (183 బంతుల్లో 125 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.ఇషాన్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... సాహిల్ రాజ్ (105 బంతుల్లో 64 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. శరణ్‌దీప్ సింగ్ (102 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లు విఫలమవడంతో ఒక దశలో జార్ఖండ్ జట్టు 157 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సాహిల్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తమిళనాడు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... క్రీజులో కుదురుకున్న తర్వాత చక్కటి షాట్లతో ఆకట్టుకుంది. ఈ జంట అబేధ్యమైన ఏడో వికెట్‌కు 150 పరుగులు జోడించడంతో జార్ఖండ్ కోలుకుంది. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా... చంద్రశేఖర్ 2 వికెట్లు తీశాడు.డబుల్ సెంచరీ మిస్ఇక రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ తన ఓవర్‌నైట్ స్కోరు 125కు మరో 48 పరుగులు జోడించి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 247 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. ఆర్ఎస్ అంబరీశ్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.మరోవైపు సాహిల్ రాజ్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గురప్జీత్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక అనుకూల్ రాయ్‌ను (12)ను సందీప్ వారియర్ వెనక్కి పంపించాడు. ఈ నేపథ్యంలో 122 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి జార్ఖండ్ 379 పరుగులు చేసింది. జతిన్ పాండే 4, రిషావ్ రాజ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
శతక్కొట్టిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) భాగంగా తమిళనాడుతో ఇవాళ (అక్టోబర్ 15) మొదలైన మ్యాచ్‌లో జార్ఖండ్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కూడా అయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.75 ఓవర్ల తర్వాత జార్ఖండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 251 పరుగులుగా ఉంది. ఇషాన్‌కు జతగా సాహిల్ రాజ్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ 10, శరన్‌దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3, డీటీ చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 16 మ్యాచ్‌లు జరుగతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇషాన్ కిషన్‌దే మొదటి శతకం. వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీలకు చేరువై ఔటాయ్యరు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ (కర్ణాటక) 96 పరుగుల వద్ద ఔటాయ్యడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ (మహారాష్ట్ర) 9 పరుగుల తేడాతో అత్యంత అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు (18/5) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా మాజీ వికెట్కీపర్ఉత్తర్ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ (Srikar bharat) (ఆంధ్రప్రదేశ్) సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షేక్ రషీద్ (69) క్రీజ్‌లో ఉన్నాడు. 73 ఓవర్ల తర్వాత ఆంధ్ర స్కోర్ 235/1గా ఉంది.చదవండి: దుమ్మురేపిన రషీద్ ఖాన్ -
కలిసి కట్టుగా కదిలారు... రోడ్డు నిర్మించారు
‘అయ్యా మా గ్రామానికి రోడ్డు సరిగా లేదు. మీరు పట్టించుకోవాలి’ అని మహిళా బృందం అధికారులకు విన్నవించుకుంది. ‘అలాగే. తప్పకుండా’ అని హామీ ఇచ్చారు అధికారులు. రోజులు గడుస్తున్నా, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.ఝార్ఖండ్‌లోని పిచులియా గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించకుండా తామే స్వయంగా రంగంలో దిగారు. 25 మంది మహిళలు పారలు, తట్టలతో రోడ్డు బాగు చేయడానికి దృఢసంకల్పంతో ముందుకు కదిలారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం మైయా సమ్మాన్ యోజనను ఉపయోగించుకున్నారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ప్రతినెల రూ.2,500 పొందడానికి వీలుకల్పించే పథకం ఇది. దసరాకు ముందు రోడ్డు వేయాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. చాలా రోజులు కష్టపడి తమ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు, పట్టణాలతో అనుసంధానించే రోడ్డు నిర్మించారు. దసరాకు కొన్ని రోజుల ముందే రోడ్డు నిర్మాణం పూర్తయింది. -
అనూహ్య నిర్ణయం.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
2025-26 రంజీ సీజన్‌కు (Ranji Trophy) ముందు జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JSCA) సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న యువ వికెట్‌కీపర్ బ్యాటర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్‌ను (Ishan Kishan) తమ రంజీ జట్టు (Jharkhand) కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్లో కెప్టెన్‌గా ఉన్న విరాట్ సింగ్‌ను ఇషాన్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) నియమించింది. అనుకుల్ రాయ్, కుమార్ కుషాగ్ర, ఆర్యమన్ సింగ్ వంటి యువ ప్రతిభావంతులు జట్టులో చోటు దక్కించుకున్నారు. రంజీ ట్రోఫీ 2025-26లో జార్ఖండ్ అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనుంది.రంజీ ట్రోఫీ 2025-26 కోసం జార్ఖండ్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్ (వైస్ కెప్టెన్), శరణ్‌దీప్ సింగ్, శిఖర్ మోహన్, కుమార్ కుషాగ్రా, కుమార్ సూరజ్, ఉసాక్ రాయ్, మనీషి, వికాస్ కుమార్, జతిన్ కుమార్ పాండే, వికాస్ సింగ్, ఆదిత్య సింగ్, సాహిల్ రాజ్, శుభమ్ సింగ్, ఆర్యమాన్ సింగ్, రిషవ్ రాజ్అనూహ్య నిర్ణయంగత కొన్ని సంవత్సరాలుగా జార్ఖండ్ జట్టులో పెద్దగా కనిపించని ఇషాన్ కిషన్‌ను రానున్న రంజీ సీజన్ కోసం కెప్టెన్‌గా నియమించడంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇషాన్‌ను కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారని ఆ రాష్ట్ర మాజీలు JSCAను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు JSCA పొంతనలేని సమాధానలు చెబుతుండటం అనుమానాలను బలపరుస్తుంది. రాజకీయ పైరవీల కారణంగా ఇషాన్‌కు కెప్టెన్సీ దక్కిందని కొందరంటున్నారు.గాయాల తర్వాత మళ్లీ రంగంలోకి..!ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకం బాదిన ఇషాన్ కిషన్ ఆతర్వాత దారుణంగా విఫలమయ్యాడు. ఆతర్వాత జూన్‌లో నాటింగ్హమ్షైర్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి, రెండు అర్ధశతకాలు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఇండియా-ఇంగ్లండ్ టూర్, దులీప్ ట్రోఫీ మిస్ అయ్యాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ ఆ అవకాశం చేజారింది. తాజాగా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఇషాన్.. రంజీ ట్రోఫీలో సత్తా చాటి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు.చదవండి: Ind vs Pak: అప్పుడు బాయ్‌కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..! -
హ్యాట్సాఫ్ మాష్టారు..! వైకల్యాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే..!
పుట్టుకతో రెండు చేతులు లేవు. అయినా వెనుకడుగు వేయలేదు. అజేయంగా ముందుకు సాగి ఉన్నత చదువులు చదవడమే కాకుండా, పాఠాలు చెప్పే ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే టీచర్ అయ్యాడు. చేతులు లేకపోయినా..పిల్లలకు బోధించే విధానాన్ని చూస్తే.. ఎవ్వరి మనసైనా హత్తుకుంటుంది. ఓ గొప్ప స్ఫూర్తిని నింపుతుంది.జార్ఖండ్‌లోని దట్టమైన అడువుల మధ్యలో గుల్షన్ లోహార్ అనే ఉపాధ్యాయుడు ఆ యువ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. పుట్టుకతోనే చేతులు లేని ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు బ్లాక్‌బోర్డుపై రాస్తూ బోధిస్తున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. పైగా ఆ విద్యార్థుల్లో స్ఫూర్తిని కూడా నింపుతోంది. ఆయన ఎప్పుడు తన వైకల్యాన్ని అడ్డంకి కూడా చూడలేదు. చాలామంది ఇలా రెండు చేతులు లేకపోవడాన్ని శాపంగా చూస్తే..అదే తన బలంగా మార్చుకున్నాడాయన. అతడి ఎడ్యుకేషన్ జర్నీ దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన లోహార్ రోజు 74 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజ్‌కి వెళ్లేవాడట. తల్లి, సోదరుడు, అడగడుగునా సాయం అందించేవారట. బీఈడీ డిగ్రీకి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయంతో పూర్తి చేసినట్లు తెలిపారు. అలా టీచర్ ఉద్యోగం పొందాక..మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు అంతగా ఉపాధ్యాయులెవరు ఆసక్తి చూపరు కానీ లోహార్ అలాంటి పాఠశాలలనే ఎంచుకుంటారు. ఆయన పశ్చిమ సింగ్‌భూమ్‌లోని మారుమూల అడవులలో ఉన్న బరంగ గ్రామం పాఠశాల అనేక విద్యా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాంటి పాఠశాలకు టీచర్‌గా రావడమే కాకుండా పాఠాలు చెప్పే తీరు ఓ రేంజ్లో ఉంటుందిగణితాన్ని బోధించేందుకు తన కాలినే చేతిగా మార్చుకుని చెబుతున్న విధానం చూస్తే..చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.ఎందుకంటే దాన్ని భోధించాలంటే నోటితో సాధ్యం కాదు తప్పనిసరిగా బ్లాక్‌బోర్డుపై రాయక తప్పదు. తన వైకల్యాన్నే సవాలు చేసేలా చిన్నారులకు చెబుతున్న తీరు చూస్తే..మాష్టారు మీరు గ్రేట్ అని ప్రశంసించకుండా ఉండలేరు. అందుకు అతడి భార్య అంజలి, కూతురు సాయం అందిస్తారుట. అంతేగాదు అతడి సేవలను జార్ఖండ్ విద్యా ప్రాజెక్ట్ కౌన్సిల్ గుర్తించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అర్హుడని అభివర్ణించింది. అయితే లోహార్ మాత్రం వైకల్యం అనేది నేర్చుకోవడానికి, బోధనకు అడ్డంకి కాదు అని చెప్పాలనేదే తన ఆకాంక్ష అని చెబుతున్నాడు. (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
జార్ఖండ్‌లో కుర్మీల రైల్ రోకో
రాంచీ: జార్ఖండ్‌లో శనివారం కుర్మీలు ఇచ్చిన రైల్ రోకో పిలుపు ప్రభావం 100కు పైగా రైళ్ల రాకపోకలపై పడింది. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్, తూర్పు సెంట్రల్ రైల్వే ధన్‌బాద్‌ల పరిధిలోని వేర్వేరు స్టేషన్ల పరిధిలో కుర్మీల ఆందోళన కొనసాగుతోంది. నిషేధం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ ఆందోళనకారులు పట్టాలపై బైటాయించారు. తమ కుర్మలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని, కుర్మీలకు షెడ్యూల్ తెగల హోదా ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళ కూడా ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేర్చేదాకా విరమించేది లేదని ఆదివాసీ కుర్మీ సమాజ్ నేత ఓపీ మహతో స్పష్టం చేశారు. కు ర్మీలను 1931లో ఎస్టీల జాబితా నుంచి తొలగించారని, అప్పటి నుంచి పోరాడుతున్నా డిమాండ్ నెరవేరలేదని సంఘం మరో నేత షీతల్ ఓహదార్ చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామంటూ సమర్థించుకున్నారు. వీరికి పలు రాజకీయ పా ర్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. ఆందోళనల కారణంగా తూర్పు సెంట్రల్ రైల్వే ధన్‌బాద్ డివిజన్ పరిధిలో 25 ప్రయాణికుల రైళ్లను రద్దు చేశామని, మరో 24 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్ పరిధిలో వందేభారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్ సహా 12 రైళ్లను రద్దు చేసి, 11 రైళ్లను దారి మళ్లించామన్నారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించామన్నారు. ఆందోళనల కారణంగా రైళ్లు నిలిచిపోవడంతో వేలాదిగా ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుబడిపోయారు. టాటా–పట్నా వందేభారత్ రైలులోని వందలాది మంది ప్రయాణికులు రాంచీలోని మురి స్టేషన్లో ఉండిపోయారు. ఈ రైలును అధికారులు రద్దు చేసిన విషయం తెలిసి ప్రయాణికులు గగ్గోలు మొదలుపెట్టారు. కాగా, కుర్మీల నిరసన చట్ట విరుద్ధం, అప్రజాస్వామికమంటూ వివిధ గిరిజన సంఘాలు రాంచీలోని రాజ్‌భవన్ ఎదుట నిరసన తెలిపాయి. అసలైన గిరిజనుల హక్కులను లాక్కునేందుకు కుర్మీలు ప్రయతి్నస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
జార్ఖండ్: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. మరో అగ్రనేత మృతి
హజరీబాగ్: జార్ఖండ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజరీబాగ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్ర నేత సహదేవ్ సోరెన్ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ తలపై రూ.కోటి రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.ఎన్కౌంటర్లో మృతిచెందిన మరో ఇద్దరు మావోయిస్టులు.. బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్రమ్ అలియాస్ చంచల్‌పై రూ. 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు బీర్సెన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవాన్‌పై రూ.10 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, నిన్న (సెప్టెంబర్ 14) జార్ఖండ్‌లో మరో మావోయిస్టు మృతి చెందారు. పలాము జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.‘ఆపరేష్ కగార్’ మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు మావోయిస్ట్ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్
జార్ఘండ్‌కు చెందిన 21 ఏళ్ల మానిషి తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన అతడు.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో (దులీప్ ట్రోఫీ మొదటి క్వార్టర్ ఫైనల్) ఈస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. నార్త్ జోన్‌పై 6 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో) తీశాడు.మానిషి తీసిన ఈ 6 వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలో రావడం విశేషం. ఈ కారణంగానే అతని పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మానిషికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు. వీరిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు.దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా మానిషి చరిత్ర సృష్టించాడు. అలాగే మార్క్ ఇలాట్ (1995), చమింద వాస్ (2005), తబిష్ ఖాన్ (2012), ఓలీ రాబిన్సన్ (2021), క్రిస్ రైట్‌తో (2021) కలిసి ప్రపంచ రికార్డును పంచుకున్నాడు. ఇలాట్, వాస్, తబిష్ ఖాన్, రాబిన్సన్, క్రిస్ రైట్ కూడా మానిషిలాగే ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు.మానిషి ఈ మ్యాచ్‌లో శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్, యశ్ ధుల్, కన్హయ్య వధవాన్, ఆకిబ్ నబీ, హర్షిత్ రాణాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. మానిషి తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో (22.2-2-111-6) చెలరేగినా రెండో ఇన్నింగ్స్‌లో (34-3-166-0) తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్‌కు అర్హత సాధించింది.జంషెడ్‌పూర్‌లో జన్మించిన మానిషికి ఇది తొలి దులీప్ ట్రోఫీ మ్యాచే అయినప్పటికీ.. ఇదివరకే 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2023-24 రంజీ సీజన్లో అతను అత్యుత్తమంగా (22 వికెట్లు) రాణించాడు. మానిషి 2019లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శన సహా 7 వికెట్లు తీశాడు. తాజా ప్రదర్శన తర్వాత మానిషిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించవచ్చు. -
క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగి..
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ గైనకాలజీ విభాగం పీజీ విద్యార్థిని ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నారని అధికారులు తెలిపారు. విష ప్రయోగంగా అనుమానిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధి శనివారం తెలిపారు. గురువారం రాత్రి రిమ్స్ గైనకాలజీ విభాగం ఆర్థోపెడిక్ వార్డులో 25 ఏళ్ల బాధిత విద్యార్థిని ఉన్నారు. క్యాంటిన్ నుంచి ఫ్లాస్్కలో తెచి్చన టీని గ్లాసులోకి వంపుకుని పక్కన పెట్టుకున్నారు. ఖాళీ దొరికిన వెంటనే రెండు సార్లు చప్పరించారు. టీ బాగోలేదని, దుర్వాసన వస్తోందని ఆమె తెలపడంతో తోటి వారు ఆ టీ జోలి పోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడి వారు వెంటనే ఆమెను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ‘బాధిత విద్యారి్థని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వచ్చే 48 గంటలు చాలా కీలకం. ఫ్లాస్్కతోపాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్ చేసి, టాక్సికాలజీ పరీక్షలకు పంపించాం. ఇది విష ప్రయోగంగా కనిపిస్తోంది’అని ఓ అధికారి తెలిపారు. పరీక్షల ఫలితాలు అందాకే వాస్తవం వెల్లడవుతుందని రిమ్స్ ప్రతినిధి డాక్టర్ రాజీవ్ రంజన్ చెప్పారు. క్యాంటిన్ సీల్ చేసి, టీ ఫ్లాస్క్ తీసుకువచి్చన క్యాంటిన్ ఉద్యోగిని పోలీసులు ప్రశి్నస్తున్నారు. -
జార్ఖండ్‌లో 50,000 రేషన్ కార్డుల తొలగింపు
రాంచీ: జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్లో ఎక్కువ కాలంగా ఉపయోగించకుండా ఉన్న 50,000 మందికి పైగా రేషన్ కార్డుదారుల పేర్లను అధికారులు తొలగించారు. మొత్తం 1,64,237 మంది కార్డులు ఉపయోగలో లేవని, వెరిఫికేషన్ డ్రైవ్‌లో భాగంగా వాటిలో 50,323 మంది పేర్లను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు.మరో 1,13,338 మంది పేర్లను తనిఖీ చేస్తున్నట్లు తెలినపారు. ఆధార్ కార్డు నంబర్లు అనుమానాస్పదంగా ఉన్నందున జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20,067 మంది తొలగించినట్లు ప్రకటనలో వెల్లడించారు. నిజమైన లబి్ధదారులకు మాత్రమే ఆహార ధాన్యాలు అందేలా చూడడమే ఈ వెరిఫికేషన్ లక్ష్యమని తెలిపారు. -
ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం..
ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది. ఆమె సెలబ్రిటీ/మోడల్/క్రీడాకారిణో కాదు. సాదాసీదాగా ఓ మారుమూల ప్రాంతంలో నివశించే గ్రామీణ మహిళ. ఆమెకు భారత ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా..!.టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునా తుడు( Jamuna Tudu). చేతిలో ఒక కర్రతో అడవంతా కలియతిరిగే ఆమెకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో విందుకు ఆహ్వానం లభించింది. ఎందుకు ఆమెకింత గౌరవం అంటే..పద్మశ్రీ అవార్డు గ్రహిత అయిన ఆమె అటవీ నిర్మూలన, అక్రమ కలప నరికివేతలకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత. అడవిని ఇంతలా కంటికి రెప్పలా కాచ్చుకున్న ఆమె ప్రస్థానం ఏవిధంగా సాగిందంటే..జార్ఖండ్‌కి చెందిన జమునా చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీసుల మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది. ముఖ్యంగా అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది(చట్టం ఉల్లంఘమైన పని కలప కోత, కొనుగోలు, అమ్మకం). అంతేగాదు అడవులను రక్షించుకునేలా గ్రామస్తులను, స్థానికులను చైతన్యపరిచేది. అడవిని కాపాడుకోవలన్న లక్ష్యం పట్ల అచంచలమైన స్థెర్యాన్ని, తెగువని చూపేది. ఆ లక్ష్యంలోకి మరికొంత మంది మహిళలకు స్వచ్ఛంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. అలా ఇవన్నీ అట్టడుగు స్థాయి అటవీ సంరక్షణ ఉద్యమానికి దారితీశాయి. ఈ క్రమంలో తనపై ప్రాణాంతక దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదామె. ఆ ఇబ్బందులన్నింటిని నేరుగానే ఎదుర్కొంది. సాధారణ దినసరి కూలీగా, ఒక మేస్త్రీ భార్యగా జమునా అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది. అంతేగాదు అడువుల రక్షణ కోసం ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం కారణంగానే ఆమెకు 'లేడీ టార్జాన్'గా పేరొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఇంతటి గౌరవం లభించింది. దీనిపై జమునా స్పందిస్తూ..ఈ ఆహ్వానం తన మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న ఇతర మహిళలకు కూడా ప్రేరణ కలిగిస్తుందని పేర్కొంది. అలాగే ఈ గౌరవం తన పోరాటం, నిస్వార్థ సేవకు గొప్ప నిదర్శనమని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు) -
పట్టాలు తప్పిన గూడ్సు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
రాంచీ: జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్సువాన్ జిల్లాలోని చండిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలుకు చెందిన 20 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఫలితంగా ఆగ్నేయ రైల్వేలోని చండిల్-టాటానగర్ విభాగంలో రైలు సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.చండిల్ మీదుగా నడిచే రైలు సర్వీసులు నిలిపివేశామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (ఆద్రా డివిజన్) వికాష్ కుమార్ తెలిపారు. రైలు ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రస్తుతం క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. పట్టాలు తప్పిన వ్యాగన్లను తొలగించేందుకు, దెబ్బతిన్న ట్రాక్‌లను మరమ్మతు చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. గూడ్సు రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ మార్గంలోని పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. రద్దు చేసిన సర్వీసులలో 20894 పట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, 28181 టాటానగర్-కతిహార్ ఎక్స్‌ప్రెస్, 28182 కతిహార్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. -
ఆలయ పూజారి ఫిర్యాదు.. ఇద్దరు బీజేపీ ఎంపీపై కేసు నమోదు
రాంచీ: బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ దూబేలకు ఊహించని షాక్ తగిలింది. ఆలయంలో పూజలు జరుగుతున్న వేళ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఎంపీలు ఇద్దరూ నిర్లక్ష్యంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూజరి.. ఎంపీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. శ్రావణమాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, నిశికాంత్ దూబే ఆగస్టు రెండో తేదీన జార్ఖండ్ దేవ్‌గఢ్‌లోని బాబా వైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఆలయంలోకి వీఐపీ, వీవీఐపీల ప్రవేశాలను నిలిపివేశారు. కానీ, బీజేపీ ఎంపీలు ఇద్దరు మాత్రం ఇవేవీ లెక్క చేయలేదు. భద్రతా సిబ్బంది అడ్డు చెప్పినప్పటికీ.. లెక్కచేయకుండా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. ఏకంగా గర్భ గుడిలోకి ప్రేవేశించి పూజలు జరిపారు. వారి ప్రవర్తనతో గుడిలో ఉన్న పూజారులు సైతం ఖంగుతిన్నారు. ఈ క్రమంలో ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆలయ పూజారి కార్తీక్నాథ్ ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.बाबा नाम केवलम्! बोल बम! जय शिव!अब तक 48वाँ.........हर हर महादेव।निशिकांत दुबे... ज़िंदाबाद।💪@nishikant_dubey@ManojTiwariMP pic.twitter.com/fouxq0Vpje— Binita PaswanBJP (@BinitaPaswanBjp) August 8, 2025తన ఫిర్యాదులో భాగంగా.. ఎంపీలు బలవంతంగా ప్రవేశించడం, భద్రతా సిబ్బందితో వాదనకు దిగినట్లు తెలిపారు. మత సంప్రదాయం, మనోభావాలను దెబ్బతీసినట్టు చెప్పుకొచ్చారు. ఆగస్టు 2న రాత్రి 8.45 నుండి రాత్రి 9 గంటల ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని భక్తులు భయాందోళనకు గురయ్యారని, తొక్కిసలాట వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో ఎంపీలు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాంచీ పోలీసులు వెల్లడించారు.ఇక, పోలీసులు కేసు నమోదు చేయడంపై నిశికాంత్ దూబే స్పందించారు. ట్విట్టర్ వేదికగా నితికాంత్ దూబే..‘పూజలు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటివరకు 51 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రేపు తాను అరెస్టు అయ్యేందుకు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తానన్నారు. మరోవైపు, మనోజ్ తివారీ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.पूजा करने के कारण यह केस है,अभी तक 51 केस मेरे उपर दर्ज है । कल देवघर एयरपोर्ट से सीधे पुलिस स्टेशन जाकर गिरफ़्तारी दूँगा https://t.co/75wzLi8jFY— Dr Nishikant Dubey (@nishikant_dubey) August 8, 2025ఇదిలా ఉండగా.. శ్రావణ మాసంలో కన్వరియాలు వేలాదిగా బాబా బైద్యనాథ్ ధామ్ వెళ్తారు. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ నుండి జార్ఖండ్‌లోని దేవఘర్ వరకు 105 కిలోమీటర్ల తీర్థయాత్రకు బయలుదేరి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయంలో పవిత్ర గంగా జలాన్ని అర్పించడానికి బయలుదేరుతారు. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 55 లక్షల మంది కన్వరియాలు ఆలయంలో పవిత్ర జలాన్ని అర్పించారు. -
గురూజీకి కన్నీటి వీడ్కోలు
నెమ్రా: జార్ఖండ్ ముక్తిమోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తమ గురూజీకి కన్నీటి వీడ్కోలు పలికారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిబూ సోరెన్ సోమవారం ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.పార్దివదేహాన్ని తొలుత ఢిల్లీ నుంచి విమానంలో జార్ఖండ్ రాజధాని రాంచీకి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీలో శిబూ సోరెన్ పార్దివదేహం వద్ద గవర్నర్ సంతోష్ గంగ్వార్, స్పీకర్ రవీంద్రనాథ్ మహతో, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులరి్పంచారు. అనంతరం రామ్‌గఢ్ జిల్లాలోని శిబూ సోరెన్ స్వగ్రామం నెమ్రాకు భౌతికకాయాన్ని తరలించారు. కడసారి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. గురూజీ అమర్ రహే అంటూ నినదించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి వందనం సమర్పించారు. శిబూ సోరెన్ చితికి ఆయన పెద్ద కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిప్పంటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాలేకపోయారు. వారు తొలుత విమానంలోని ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు.అక్కడి హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దాంతో రోడ్డు మార్గంలో సాయంత్రం కల్లా నెమ్రాకు చేరారు. హేమంత్ సోరెన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు జార్ఖండ్ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాపం దినాలు ప్రకటించింది. మంగళవారం జార్ఖండ్‌లో పాఠశాలలు మూసివేశారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు సైతం నిరవధికంగా వాయిదా పడ్డాయి. -
శిబూసోరెన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శిబూ సోరెన్ మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన శిబూ సోరెన్ మృతి దేశానికి తీరని లోటన్నారు వైఎస్ జగన్. గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.The demise of veteran leader Sibu Soren ji is a great loss to the nation. His lifelong efforts for tribal welfare and justice will be remembered. My heartfelt condolences to his family and followers. May his soul rest in peace. pic.twitter.com/yCoAWbCZXH— YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2025 జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూతడిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు! -
డిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు!
అన్యాయాలను నిలదీసిన తండ్రిని తన చిన్నతనంలోనే వడ్డీవ్యాపారులు గుండాల సాయంతో హత్య చేయించడం కళ్లారా చూశారాయన. అయితే ఆ ఘటనే శిబుసోరెన్ జీవితాన్ని మార్చేసింది. గిరిజనుల తరఫున పోరాటం తీవ్రతరం చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. స్వరాష్ట్ర సాధన, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో సగానికిపైనే గడిచిపోయింది.జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం(ఆగస్టు 4, 2025) తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతిపై తనయుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు.గౌరవనీయులైన డిషోమ్ గురు(Dishoom Guru) మనల్ని వదిలి వెళ్లిపోయారు. నాకంతా శూన్యంగా కనిపిస్తోంది అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు హేమంత్. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఆదివాసీల, పేదల, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అంటూ వ్యాఖ్య చేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పోరాటం మరువలేనిది’ అని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం శిబు సోరెన్ మృతికి నివాళులర్పిస్తున్నారు.డిషోమ్ గురుగా..శిబు సోరెన్‌ను ఆయన మద్దతుదారులు డిషోమ్ గురూ అని సంబోధిస్తుంటారు. డిషోమ్ గురూ.. అంటే పోరాటాలకు సిద్ధంగా ఉండే గురువు.. భూమి పుత్రుడు, దేశ నాయకుడు అనే అర్థాలు వస్తాయి. ఆదివాసీల హక్కుల కోసం, భూదోపిడీ.. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఆయనకు ఆ పేరు తెచ్చి పెట్టాయి.1973లో జేఎంఎం ఆవిర్భవిస్తే.. 1987 నుంచి 2025 ఏప్రిల్ దాకా ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా, స్వరాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అయితే ఆ మూడు పర్యాయాల్లోనూ రాజకీయ ఒడిదుడుకులతో ఆయన ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకోకపోవడం గమనార్హం. 2005లో కేవలం 9 రోజులు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. రెండోసారి.. అగష్టు 2008లో సీఎంగా బాధ్యతలు చేపట్టి జనవరి 2009లో ఆ పదవి నుంచి దిగిపోయారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్లో సీఎంగా బాధ్యత చేపట్టినా.. ఐదు నెలలకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే..1980 నుంచి 2005 మధ్య ఆయన లోక్‌సభ ఎంపీగా.. అటుపై మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా ఆయన పని చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా పని చేశారు.తండ్రి హత్య చూసి..1944 జనవరి 11న నెమ్రా జిల్లా(ప్రస్తుత జార్ఖండ్)లోని సంతల్ గిరిజన కుటుంబంలో జన్మించారు శిబు సోరెన్. చిన్నతనంలోనే వడ్డీవ్యాపారుల గుండాల చేతుల్లో తండ్రి దారుణ హత్యకు గురికావడం కళ్లారా చూశారాయన. బడీ ఈడు పిల్లాడిగా ఉన్న ఆయన్ని ఆ ఘటనే రాజకీయ పోరాటాల వైపు అడుగులేయించింది. ఆదివాసీల హక్కుల కోసం ఉదృత పోరాటాన్ని చేయించింది.18 ఏళ్ల వయసులో సంతల్ నవయువక్ సంఘ్‌ను స్థాపించి.. 1972లో బెంగాల్ మార్కిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట ఏకే రాయ్, బినోద్ బీహారీ మహాటో నేత కుర్మి మహాటోతో శిబుసోరెన్ చేతులు కలిపారు. గిరిజన జనాభా ప్రతిపాదికన స్వరాష్ట్ర ఉద్యమం చేపడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు. అలా మొదలైన పోరాటం.. 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పాటుతో(బీహార్ నుంచి విడిపోయి) నెరవేరింది. ప్రజల కోసం నిర్భయంగా, నిబద్ధతతో నిలబడిన నాయకుడిగా గుర్తింపు పొందారాయన.కుటుంబమంతా రాజకీయాల్లోనే..రూపీ సోరెన్‌ను జనవరి 1, 1962లో వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. కుమార్తె అంజని జేఎంఎం ఒడిషా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు బసంత్ సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరో కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.శిబుసోరెన్ మీడియా ముఖంగా నవ్వే సందర్భాలు చాలా అరుదు. అందకు ఆయన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉండేది. 15వ ఏట తండ్రి మరణం, ఆకలి, నిరుద్యోగం లాంటి సమస్యలు వల్ల తాను నవ్వడం మానేశాని తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుండేవారాయన. రాజకీయాల్లో సాదాసీదా నేతగానూ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. శిబు సోరెన్.. జార్ఖండ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే అదే సమయంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. గతంలో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు. అలాగే చిరుదిహ్ ఊచకోత, మాజీ కార్యదర్శి శశినాథ్ జా హత్య కేసులతో పాటు అక్రమాస్తుల ఆరోపణలు ఆయన్ని కోర్టు మెట్లు ఎక్కించాయి.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
Shibu Soren: జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత
-
జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్(81) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈయన తనయుడు.జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. అనంతరం జార్ఖండ్‌కు ఆయన మూడుసార్లు సీఎంగా పని చేశారు. దుమ్కా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు కీలకంగా పని చేయడంతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. చిరుదిహ్ హత్య కేసు శిబు సోరెన్ రాజకీయ జీవితంలో స్పీడ్ బ్రేకర్‌గా మారింది. 2004లో, శిబు సోరెన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న టైంలో.. చిరుదిహ్ గ్రామంలో తన వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కారణంగా ఆయన జూలై 24, 2004న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఒక నెల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి.. సెప్టెంబర్ 8న బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. చివరికి శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
బాత్రూంలో జారిపడిపోయిన మంత్రి.. ఆరోగ్య పరిస్థితి విషమం
రాంచీ: జార్ఖండ్‌లో విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లోని బాత్రూంలో జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, హుటాహుటిన ఆయనను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మంత్రి రాందాస్ సోరెన్ ఘటనపై తాజాగా మరో మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. రాందాస్ సోరేన్ తన ఇంట్లో కారు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి విమానంలో తరలిస్తున్నారు. నేను ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. ఈ పరిస్థితి నుంచి రాందాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, మంత్రి రాందాస్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #WATCH | Jamshedpur: JMM leader Mangal Kalindi says, "Preparations are going on to take him to Delhi for treatment..." https://t.co/Y5ZRgUVFot pic.twitter.com/B8KSg5Teok— ANI (@ANI) August 2, 2025 -
ప్రజలతో సున్నితంగా వ్యవహరించండి
దియోగఢ్: వైద్యులను దేవుళ్లుగా భావించే ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ముర్ము వైద్య నిపుణులకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లోని దియోగఢ్ ఎయిమ్స్‌లో గురువారం జరిగిన మొట్టమొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. నైతిక విలువలను పాటిస్తూ రోగుల పట్ల సహానుభూతితో ప్రేమతో మెలగాలన్నారు. వారి జీవితాల్లో చీకట్లు తొలగించాలని కోరారు. ‘గిరిజనుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే ఎయిమ్స్ దియోగఢ్ ఇప్పటికే ఉన్న ఐదింటితోపాటు మరిన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఇతర ఎయిమ్స్‌లకు ఒక ఆదర్శంగా మారేందుకు కృష్టి చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లలలో పోషకాహార లోపం సర్వసాధారణంగా మారిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యులు సామాజిక సేవపైనా దృష్టిసారించాలన్నారు. సుదూర గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు యాంటీ వీనమ్ ఔషధాలను డ్రోన్ల ద్వారా అందిస్తున్న దియోగఢ్ ఎయిమ్స్‌ను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. ఈ సంస్థతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ ఆమె..జార్ఖండ్ గవర్నర్ తాను వ్యవహరించిన సమయంలోనే ప్రధాని మోదీ 2018లో ఎయిమ్స్ దియోగఢ్కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రపతి జార్ఖండ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఐఐటీ ధన్‌బాద్ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. -
Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
దేవఘర్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న బస్సు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేవఘర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాన్ని ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ ఘటనపై స్పందిస్తూ తన నియోజకవర్గమైన దేవఘర్లో కన్వర్ యాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నదని, బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. BJP MP Nishikant Dubey (@nishikant_dubey) posts, " लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें" pic.twitter.com/o6axGqRi85— Press Trust of India (@PTI_News) July 29, 2025ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు. ఈ ఘటన దరిమిలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. -
ఈదుకుంటూ స్కూల్‌కు
ఖుంటి: ఆ గ్రామాన్ని కలిపే రహదారిపై వంతెన వర్షాలకు దెబ్బతింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్ర నిచ్చెనను ప్రమాదకరమంటూ అధికారులు తీసేశారు. అయినా ఆ బాలిక అధైర్యపడలేదు. చదువుకోవాలనే తపన ముందు అడ్డంకులన్నీ ఓడిపోయాయి. స్కూలు బ్యాగును నెత్తిపై పెట్టుకుని ఈదుకుంటూ నదిని దాటి తడిచి నీళ్లు కారుతున్న దుస్తులతోనే స్కూలుకు వెళుతోంది. ఆ గ్రామంలోని మిగతా పిల్లలందరిదీ ఇదే పరిస్థితి. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. రాంచీ–ఖుంటి–సిండెగా రహదారిలో పెలోల్ గ్రామాన్ని కలుపుతూ బనాయ్ నదిపై ప్రభుత్వం 2007లో రూ.1.30 కోట్లతో వంతెన నిర్మించింది. చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలకు ఆ వంతెనే ఆధారం. జూన్ 19వ తేదీన సంభవించిన వరద తీవ్రతకు వంతెన పిల్లర్ ఒకటి దెబ్బతింది. దీంతో, వెదురుకర్రలతో తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేసుకుని గ్రామస్తులంతా పెలోల్ చేరుకుంటున్నారు. కానీ, ప్రమాదకరంగా ఉందంటూ అధికారులు ఆ నిచ్చెనను తొలగించారు. కానీ, పెలోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అంగర్బరీ గ్రామానికి చెందిన సునీత హొరొ(పేరు మార్చారు) మాత్రం ఏమాత్రం భయపడలేదు. నెత్తిపై స్కూల్ బ్యాగు పెట్టుకుని నదిలో ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేరుకుంటోంది. తడిచిన దుస్తులకు బదులుగా బ్యాగులో అదనంగా సిద్ధంగా ఉంచుకున్న డ్రెస్‌ను వేసుకుని స్కూలుకు వెళ్లేంది. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడూ ఇదే పరిస్థితి. దీంతో, వారంలో ఒకటీ రెండు సార్లు మాత్రమే స్కూలుకు వెళ్తున్నామని తెలిపింది. సునీత వచ్చే ఏడాది బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. ‘స్కూలుకెళ్లాంటే నదిలో కొంత భాగాన్ని ఈదటమే తప్ప మరో మార్గంలేదు. ఈదేటప్పుడు స్కూలు బ్యాగు నెత్తిపై పెట్టుకుంటా. కానీ, నా డ్రెస్ పూర్తిగా తడిచిపోతుంది. అందుకే, వచ్చేటప్పుడే ఎక్స్ ట్రా తెచ్చుకుంటా’అని ఆమె తెలిపింది. బోర్డు పరీక్షలకు ప్రిపరేరయ్యే తన స్నేహితులదీ ఇదే పరిస్థితని వివరించింది. సాధారణంగా ఐదంటే ఐదే నిమిషాలు పట్టే ప్రయాణానికి ఇప్పుడు 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని, 40 నిమిషాల సమయం తీసుకుంటోందని విద్యార్థులు అంటున్నారు. రాంచీ నుంచి సిండెగా మీదుగా ఒడిశా వెళ్లే భారీ వాహనాలు, బస్సులు సైతం వంతెన దెబ్బతినడంతో ప్రత్యామ్నాయం మార్గంలో వెళ్తున్నాయి. వంతెన వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మించే పనిలో ఉన్నామని ఖుంటి సబ్ డివిజనల్ అధికారి దీపేశ్ కుమారి తెలిపారు. అయితే, ఆగకుండా కురుస్తున్న వానలతో పనులకు అవరోధం కలుగుతోందని చెప్పారు. జార్ఖండ్ సీఎంహేమంత్ సోరెన్వంతెన దెబ్బతినడంపై దర్యాప్తునకు ఆదేశించారు. -
జార్ఖండ్ కాంగ్రెస్‌లో విభేదాలు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములా టలు, పరస్పర ఆరోపణల పర్వం మరోసారి తెరపైకి వచ్చాయి.కాంగ్రెస్ నేతల విభేదాలు ఢిల్లీ దాకా చేరడంతో, అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొప్పుల రాజుకు అప్పగించింది. రాష్ట్ర నేతలందరినీ ఆయన ఢిల్లీకి పిలిపించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా, కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు తిర్కీ, ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ, ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్లతో ఆయన భేటీ అయ్యారు. జాగ్రత్తగా మసలు కోవాలని, విభేదాలపై రచ్చకెక్కరాదని, సమన్వయంతో కూటమి బలోపేతానికి కృషి చేయాలని వారికి గట్టిగా చెప్పారు. మూల కారణమిదే..!రాంచీలోని రిమ్స్ (రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ తొలగింపు అంశం వివాదానికి తెరతీసింది. రిమ్స్ డైరెక్టర్ తొలగింపునకు సంబంధించిన లేఖపై తాను సంతకం చేయనని కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా బహిరంగంగా ప్రకటించారు. ఈ అంశం పార్టీలో ఉద్రిక్తతను సృష్టించింది. పార్టీని, కూటమి ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగ వేదికపై అలాంటివి వెల్లడించరాదని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఆయనకు సూచించారు. అయితే, బైతా వెనక్కి తగ్గలేదు. మరోవైపు, రిమ్స్–2 ప్రతిపాదనపై జార్ఖండ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్–2 కోసం తన ప్రాంతంలోని రైతుల భూమిని సేకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న రిమ్స్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికే రిమ్స్–2ను తెరపైకి తెచ్చినట్లు సీఎం హేమంత్ సోరెన్ అంటున్నారు. ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంకీర్ణంలో ఉద్రిక్తతలకు దారితీసింది. -
అడవి నుంచి ఐరాస వరకు...
‘సంస్కృతం పలకడానికి నీకు నోరు తిరగదు. నేర్చుకోవడం నీ వల్ల కాదు’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి మొద్దు బుర్రలకు లెక్కలు అర్థం కావు’ అన్నారు మ్యాథ్స్ టీచర్. బాగా చదువుకోవాలనే ఆశతో స్కూల్లోకి అడుగు పెట్టిన ఆదివాసీ అమ్మాయికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ఆ అవమానాలకు తన ప్రతిభతో జవాబు చెప్పింది. యూనివర్శిటీ వైస్–చాన్స్‌లర్ స్థాయికి ఎదిగింది జార్ఖండ్‌కు చెందిన సోనాజ్ హరియ మింజ్. తాజాగా యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో–చైర్‌పర్సన్‌గా నియామకం అయిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించింది...సోనాజ్ మింజ్‌కు బాగా చదువుకోవాలని కోరిక. అడవిలో ఉండేవాళ్లకు చదువు ఎందుకు! అనే వాళ్లు చాలామంది. ‘సంస్కృతం అనేది ఆర్యుల భాష. నీలాంటి వాళ్లకు ఎలా వస్తుంది!’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి వాళ్లకు లెక్కలు ఎలా వస్తాయి!’ అన్నారు మ్యాథ్స్ టీచర్.స్కూల్లో చేరిన కొత్తలో భాషాపరమైన సమస్యలను మింజ్ ఎదుర్కొంది. ఇంట్లో మాట్లాడే ఆదివాసీ భాష తప్ప మరే భాషా తనకు రాదు. అయితే మ్యాథ్స్ బాగా చేసేది.ఆదివాసీ అమ్మాయి అనే కారణంగా మింజ్‌ను చేర్చుకోవడానికి రాంచీలోని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిరాకరించింది.‘నన్నే ఎందుకు అవమానిస్తున్నారో మొదట్లో అర్థం కాలేదు. చాలా కాలానికి అర్థమైంది. నేను ఆదివాసీ అమ్మాయిని అనే కారణంగానే అవమానిస్తున్నారు అని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మింజ్. అయితే అవమానాలు ఆమె చదువుకు అడ్డుగోడలు కాలేకపోయాయి. బాగా చదువుకోవాలి అనే కసిని పెంచాయి.మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ తరువాత దిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలో ఎంఫిల్ చేసింది మింజ్. భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో పనిచేసింది. కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేసిన మింజ్ జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పనిచేసింది.జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన వ్యాసాలు సమర్పించింది. జేఎన్‌యూలో ‘స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్’ డీన్‌గా, జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్స్ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఎంత స్థాయికి ఎదిగినా తాను నడిచి వచ్చిన దారి మరవలేదు మింజ్. దళిత, ఆదివాసీ హక్కుల కోసం పనిచేసింది. జేఎన్‌యూలో ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫీస్ (ఈవోవో) ప్రధాన సలహాదారుగా పనిచేసింది.జార్ఖండ్‌లోని ఎస్కేఎం యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆమె ప్రస్థానం మరోస్థాయికి చేరింది. వైస్ చాన్సలర్ హోదాలో ఆదివాసీ కళలు, భాష కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. తాజాగా... యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రిసెర్చ్. గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో– చైర్‌పర్సన్‌గా నియామకం అయింది. ‘నేను భవిష్యత్‌లో మ్యాథ్స్ టీచర్ అవుతాను’ అని స్కూల్ రోజుల్లో బలంగా అనుకునేది మింజ్. అయితే మింజ్ పడిన కష్టం, ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని పట్టుదల ఆమెను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడమే కాదు ఎంతోమంది ఆదివాసీ అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.ఆ మాటను సవాలుగా తీసుకొని...స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు సింగిల్ మిస్టేక్ లేకుండా చేసేదాన్ని. ‘ఇది చాలదు. నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి’ అన్నారు ఒక టీచర్. ఆమె మాటలను సవాలుగా తీసుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ నాతోనే ఉండిపోయింది. మొదట్లో వెటకారాలు, అవమానాల సంగతి ఎలా ఉన్నా స్కూల్ ఫస్ట్ రావడంతో ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చదువుతో పాటు ఆటలు అన్నా ఇష్టం. యూనివర్శిటీ లెవెల్లో హాకీ ఆడాను. అయితే చదువు మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆటలకు దూరం అయ్యాను.– సోనాజ్ హరియ మింజ్ -
Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల
రామ్‌గఢ్: జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక బొగ్గు గనిలో కొంత భాగం కూలిపోవడంతో ఒకరు మృతిచెందారు. వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం గనిలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. One killed, many feared trapped after portion of coal mine collapses in Jharkhand's Ramgarh: Police. pic.twitter.com/m7sQrlflqk— Press Trust of India (@PTI_News) July 5, 2025అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌గఢ్ జిల్లాలోని కర్మ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలియగానే ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని, రామ్‌గఢ్ డిప్యూటీ కమిషనర్ (డిసి) ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. ఘటనా స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు వెల్లడించారు. గనిలో చాలామంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు గ్రామస్తులు బొగ్గు అక్రమ తవ్వకాలలో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.ఇది కూడా చదవండి: ‘ట్రంప్‌కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు -
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ల కథనం మరువకముందే జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్ కేసులో సోనమ్ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్‌కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు అన్నంలో విషం కలిపింది.జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు -
ఫోన్ పౌచులు అమ్మి.. నీట్ విజేతగా..
కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్‌ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.జార్ఖండ్‌కు చెందిన రోహిత్ కుమార్(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్ ఇండియాలో 12,484 ర్యాంక్ సాధించాడు(కేటగిరీ వైజ్‌గా 1,312 ర్యాంక్). ఫిజిక్స్ వాలాగా పేరుకున్న అలఖ్ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ కుమార్ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్ ఫోన్ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్ కుమార్.. పగలంతా తన బండి మీద సెల్ ఫోన్ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్లో ర్యాంకుతో రోహిత్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే ఆ కుర్రాడికి డాక్టర్ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్‌గా ఆ వైట్ కోట్‌ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.09999547 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఫిమేల్ టాపర్‌గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
బయో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్‌కు రాగా కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. -
ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు
ముంబై: ముంబై ఉగ్రదాడులలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి భారత్‌కు రప్పించాక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అతనిని విచారిస్తోంది. ఈ అత్యంత సున్నితమైన విచారణను కొనసాగిస్తున్న బృందానికి ఇద్దరు సీనియర్ అధికారులు నాయకత్వం వహిస్తున్నారు వారే.. అశిష్ బాత్రా(ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్, జార్ఖండ్ మాజీ జాగ్వార్ ఫోర్స్ హెడ్) జయ రాయ్(ఎన్ఐఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్) వీరిద్దరూ రాణా ఎక్స్ట్రాడిషన్ (ఒక దేశం వేరొక దేశానికి ఒక వ్యక్తిని బదిలీ చేయమని అభ్యర్థించే చట్టపరమైన ప్రక్రియ)నడిపించారు. ఇప్పుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా విచారణ సారధ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దాడులలో పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్ర, రాణాకు గల అంతర్జాతీయ నెట్వర్క్ మొదలైనవాటిని వెలికితీసే లక్ష్యంతో ఈ విచారణ కొనసాగుతోంది.తహవ్వూర్ రాణా 26/11 ముంబై ఉగ్రదాడులలో కీలక సహకారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2009లో అమెరికాలో అరెస్టయిన రాణా 2013లో లష్కర్-ఎ-తొయిబా(Lashkar-e-Taiba) (ఎల్ఈటీ)కి మద్దతు ఇచ్చినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 2025, ఏప్రిల్ 10న అమెరికా నుంచి భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. రాణా విచారణకు సారధ్యం వహిస్తున్న ఇద్దరు అధికారులో ఒకరైన అశిష్ బాత్రా 1997 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. జార్ఖండ్ క్యాడర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు.ఈయన జార్ఖండ్ పోలీస్ విభాగానికి చెందిన ఎలైట్ యాంటీ-మావోయిస్ట్ యూనిట్ ‘జాగ్వార్ ఫోర్స్’కు మాజీ హెడ్. ఈ యూనిట్ మావోయిస్టుల తిరుగుబాటును అణచివేయడంలో కీలక పాత్ర పోషించింది. రాణా విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న జయ రాయ్ 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జార్ఖండ్ క్యాడర్(Jharkhand Cadre)కు చెందినవారు. ప్రస్తుతం ఎన్ఐఏలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు. జయ రాయ్ జార్ఖండ్‌లోని జామ్తారాలో సైబర్‌క్రైమ్‌లను అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో ఎన్ఐఏలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా చేరిన రాయ్.. రాణా కేసులో ఛీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. రాణాకు సంబంధించి ఈ మెయిల్లు, ఆర్థిక లావాదేవీలు మొదలైనవాటిని విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించారు. రాణాని విచారించి, ముంబై దాడులలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రమేయాన్ని వెలికితీసేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా -
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జార్ఖండ్‌లోని పాలమూ డివిజన్‌కు చెందిన రవి కుమార్ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కిరాణ కొట్టు నడిపిస్తూ జీవనం సాగించే కుర్రాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీతోనో, జూదంతోనో కాదు. డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ అదృష్టం వరించింది. ఊహించని ఈ గెలుపుతో రవి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పాలమూ హెడ్‌క్వార్టర్స్‌కి 7 కిలోమీటర్ల దూరంలో.. చియాంకి రైల్వే స్టేషన్ సమీపంలోని తెలియాబండ్ ప్రాంతం ఉంది. మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్ మెహతా ఎప్పుడు చూసినా కిరాణా షాపులో ఫోన్ పట్టుకుని ఇంట్లోవాళ్లతో తిట్లు తింటూ కనిపిస్తుంటాడు. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి మొన్నటిదాకా రూ.5 లక్షలు పొగొట్టాడు. ఈ విషయంపై ఇంట్లో రోజూ గొడవే. అయినప్పటికీ రవి తన ప్రయత్నం మాత్రం వీడలేదు. చివరగా.. ఆరోజు రానే వచ్చింది.ఏప్రిల్ 9వ తేదీ అతని జీవితంలో మరుపురానిరోజు. గుజరాత్ టైటానస్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా, రషీద్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంచుకుని టీం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయం వర్కవుట్ అయ్యింది. డ్రీమ్11తో ఒక్క రాత్రిలోనే రూ.3 కోట్లు సంపాదించాడతను. అంతే.. అతని కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తప్పుడు పనులు డబ్బులు పొగొట్టావ్ అని తిట్టావ్ కదా అమ్మా.. ఇప్పుడు చూడు ఎంత సంపాదించానో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్‌మనీలో 30 శాతం జీఎస్టీ కిందకు పోయింది.మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాలోకి మళ్లించాడు. వచ్చిన డబ్బుతో సగంలో ఆగిపోయిన ఇంటిని కట్టుకోవడంతో పాటు కాస్త పొలం కొనుక్కోవాలని.. ఇలా ప్లానులు గీసుకుంటున్నాడు.లోకల్ 18కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. రూ.49 పెట్టుబడితో లక్ష వస్తే చాలానుకున్నాడట. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలని చెబుతున్నాడతను . ఇక వచ్చిన ప్రైజ్‌మనీతో తమ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని అనుకుంటున్నాడతను. 2018 నుంచి డ్రీమ్11 ఆడుతున్న రవి.. ఇప్పటిదాకా రెండు ఐడీలతో 621 టీంలను సృష్టించాడు. ఈ క్రమంలోనే కిరాణం షాపు ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.5 లక్షలు పొగొట్టాడు. చివరకు.. పడిన చోటే నిలబడి ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కలవాళ్ల నుంచి గ్రేట్ అనిపించుకున్నాడు.Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం జరిగిన ఘటన తెలియజేయడం కోసం మాత్రమే. బెట్టింగ్, ఫాంటసీ గేమింగ్‌లను ప్రోత్సహించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు -
ఊహించని విషాదం.. రిటైర్మెంట్ రోజే అనంతలోకాలకు
ఇది మాటలకందని విషాదం.. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ ట్రైన్ల డ్రైవర్లు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ గంగేశ్వర్ ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అదే రోజే ఆయన అనంత లోకాలకు పయనమయ్యారు.ఇక తమ కుటుంబంతో ఆనందంగా గడపొచ్చనే ఆయన కలలు ఆవిరైపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ఊహించని విషాదమే మిగిలింది. రిటైర్మెంట్ రోజు ఆయనతో కలిసి విందు చేసుకోవాలని ఎదురు చూస్తున్న కుటుంబానికి కన్నీరే మిగిలింది.విధి నిర్వహణలో చివరి రోజున తోటి ఉద్యోగులతో సరదాగా గడిపి.. ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వస్తాడనుకున్న తన తండ్రి ఇంకెప్పటికీ రాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆయన కూతురు విలపించింది. రేపటి నుంచి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటానని ఆనందంగా చెప్పి వెళ్లిన తండ్రి.. ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
జయహో జార్ఖండ్
పంచ్‌కులా (హరియాణా): ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించింది. తొలిసారి జాతీయ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ‘షూటౌట్’ వరకు కొనసాగిన టైటిల్ సమరంలో అల్బెలా రాణి టొప్పో నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు 4–3 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా జట్టును ఓడించింది. 2011లో హాకీ ఇండియా (హెచ్ఐ) ఆవిర్భవించాక 15 సార్లు జాతీయ చాంపియన్‌షిప్ జరిగింది. జార్ఖండ్ జట్టు ఆరుసార్లు (2012, 2013, 2014, 2022, 2023, 2024) మూడో స్థానాన్ని దక్కించుకోగా... ఒకసారి (2015) రన్నరప్‌గా నిలిచింది. ఎనిమిదో ప్రయత్నంలో జార్ఖండ్ విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున కెప్టెన్ రాణి (42వ నిమిషంలో), జార్ఖండ్ తరఫున ప్రమోదిని లాక్రా (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జార్ఖండ్ తరఫున రజని కెర్కెట్టా, నిరాలి కుజుర్, బినిమా ధన్, అల్బెలా రాణి టొప్పో సఫలంకాగా... ష్యామీ బారా విఫలమైంది. హరియాణ తరఫున సోనమ్, కెపె్టన్ రాణి గురి తప్పగా... పింకీ, అన్ను, మనీషా సఫలమయ్యారు. జార్ఖండ్ గోల్‌కీపర్ అంజలి బింజియా హరియాణా ప్లేయర్ల రెండు షాట్లను నిలువరించి తమ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిజోరం జట్టు తొలిసారి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మిజోరం జట్టు 2–1 గోల్స్ తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు అత్యధికంగా 8 సార్లు టైటిల్ దక్కించుకోగా... హరియాణా (3 సార్లు) రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రెండుసార్లు టైటిల్‌ను గెలవగా.. ఒడిశా, జార్ఖండ్ ఒక్కోసారి జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. -
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు
లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. #WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place...My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH— ANI (@ANI) February 26, 2025ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్‌లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
రాగాల పల్లకిలో రాష్ట్రపతి చెంతకు..
జార్ఖండ్(Jharkhand )కు చెందిన ఈ పాతిక మందిలో ఎక్కువ మంది ఆదివాసీ అమ్మాయిలే. ఎవరూ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదు. వీరికి ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడమే కాదు రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలలో పాల్గొని, రాష్ట్రపతి ముందు పైపర్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అపూర్వ అవకాశం వచ్చింది.కర్తవ్యపథ్ దగ్గర ప్రదర్శన(Republic Day Parade ) ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో జార్ఖండ్‌లోని సింగ్భమ్ జిల్లా ‘కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ’ ఒకటి. ట్యూన్స్ వాయించడంలో కచ్చితత్వం, ఏకరూపత కారణంగా ఈ పైపర్ బ్యాండ్ ఎంపికైంది. రాష్ట్ర్రపతి ముందు ప్రదర్శన ఇవ్వబోతున్న ఈ గర్ల్ బ్యాండ్ ఉత్సాహంగా ఉంది. ‘ఇది చాలా గొప్ప అవకాశం. జీవితంలో ఎప్పుడూ మరచి΄ోలేని అవకాశం’ అంటుంది బ్యాండ్ సభ్యులలో ఒకరైన పార్వతి మహతో. (చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్) -
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్‌బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్‌లను విప్పదీయించి బ్లేజర్‌తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్‌లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్‌లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్‌బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్‌బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్‌లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పీడ్‌స్టర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron) రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం తెలిపాడు. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసమే జీవించానని.. ఇకపై క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.గాయాలు వేధిస్తున్నా‘‘ఫాస్ట్ బౌలింగే ఊపిరిగా బతికాను. ఇరవై ఏళ్లుగా నా ఆశ, శ్వాస అంతా క్రికెటే. ఆట పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న నేను.. ఈరోజు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఆ దేవుడు, నా కుటుంబం, స్నేహితులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ ప్రయాణం కొనసాగింది.గాయాలు వేధిస్తున్నా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు శారీరకంగా, మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించగలిగాను. నా ఫిజియోలు, ట్రైనర్లు, కోచ్‌లతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ వల్లే ఇదంతా సాధ్యమైంది.ఆటే నాకు అన్నీ ఇచ్చిందినా కెరీర్‌ను ఇన్నాళ్లు కొనసాగించేలా తోడ్పడిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించవచ్చని తెలుసు. అయితే, నా జీవితంలోని ప్రతీ చిన్న ఆనందానికి ఆటే కారణం. ఆటే నాకు అన్నీ ఇచ్చింది.నా ఫస్ట్ లవ్ ఫాస్ట్ బౌలింగ్. అందుకే నేనిక మైదానంలో అడుగుపెట్టకపోయినా.. క్రికెట్లో భాగంగానే ఉంటాను. ఎందుకంటే.. నేను అందులో ఓ భాగం కాబట్టి..’’ అంటూ వరుణ్ ఆరోన్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.గంటకు 153 కిలోమీటర్ల వేగంతోకాగా సింగ్‌భూమ్‌కు చెందిన వరుణ్ ఆరోన్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)- 2010- 11 సందర్భంగా వరుణ్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో ఈ జార్ఖండ్ పేసర్.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. తన స్పీడ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో.. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్.. తొమ్మిది టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చివరగా 2015లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన వరుణ్ ఆరోన్.. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఐపీఎల్‌లోనూ..ఇక గాయాల బెడద కారణంగా గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకొన్న వరుణ్ ఆరోన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఐదు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఈ స్పీడ్‌స్టర్.. 2022లో చివరగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పుణెలో జరిగిన మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్లో ఆఖరిది. ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 52 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల వరుణ్ ఆరోన్.. 44 వికెట్లు పడగొట్టాడు. స్కూల్ ఫ్రెండ్‌తో పెళ్లివరుణ్ ఆరోన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2016లో రాగిణితో అతడి వివాహం జరిగింది. కోర్టు మ్యారేజీ చేసుకున్న వీళ్లిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. చదవండి: ‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’ -
Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్ గౌతమ్
పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.తన కుమారుడు ఎన్టీఎస్ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్‌లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్‌పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్‌కు చెందిన దీపికా పాండే సింగ్‌లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణపై జాప్యమెందుకు?
రాంచీ: జార్ఖండ్‌లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్‌ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్‌కు నాలుగు బెర్త్‌లు, సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక మంత్రి పదవి లభించింది.గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్‌ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
ఒక ప్రేయసి.. 50 ముక్కలు!
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా.. మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి(24) అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు. వీరిద్దరూ తమిళనాడులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా ఖుంటిలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఏమి తెలియనట్లు మళ్లీ తమిళనాడు వచ్చి గంగితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నవంబర్ 9న ఇద్దరు జార్ఖండ్‌లోని ఖుంటికి తిరిగి వచ్చారు. యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు.నవంబర 24న యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తింటూ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీ ప్రాంతం నుంచి మరి కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గంగి వస్తువులు, ఆమె ఆధార్ కార్డు, ఫోటోతో సహా, ఆమె బ్యాగ్‌ని కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నరికివేసినట్లు అతను ఒప్పుకున్నాడు. -
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
-
రేపు జార్ఖండ్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
జార్ఖండ్‌లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
-
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
-
ఒకే ఒక్కడు హేమంత్
సాక్షి, నేషనల్ డెస్క్: హేమంత్ సోరెన్. జార్ఖండ్ అత్యంత యువ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన గిరిజన నేత. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతుండగానే ఎన్నో సవాళ్లు. భూవివాదంలో చిక్కుకుని ఈడీ అరెస్ట్‌తో జైలుపాలైనా, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట మసకబారినా, వదిన సీత సోరెన్, అత్యంత ఆప్తుడైన నేత చంపయీ సోరెన్ పార్టీని వీడి తిరుగుబాటు జెండా ఎగరేసినా అన్నింటినీ తట్టుకుని సవాళ్లకు ఎదురొడ్డి జార్ఖండ్ శాసనసభ సమరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)ను విజయతీరాలకు చేర్చి జార్ఖండ్ గిరిజన కోటపై తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. హేమంత్ సోరెన్ ఒక్కడే అంతా తానై, అన్నింటా ముందుండి నడిపించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి ఘన విజయం దక్కేలా చేసి తన రాజకీయపటిమను మరోసారి చాటిచెప్పారు. విపక్ష బీజేపీ కూటమి తరఫున ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ తదితరులు కాళ్లకు బలపం కట్టుకుని విస్తృతస్థాయి ప్రచారం చేసినా హేమంత్ సోరెన్ ప్రభ ముందు అదంతా కొట్టుకుపోయింది. జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ఖర్గే కొన్ని చోట్ల ప్రచారం చేసినా కూటమి తరఫున పూర్తి ప్రచార బాధ్యతల్ని హేమంత్ తన భుజస్కంధాలపై మోపి కూటమిని విజయశిఖరాలపై నిలిపారు. తన అరెస్ట్‌తో ఆదివాసీ సెంటిమెంట్‌ను తెరమీదకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జేఎంఎం మాత్రమే పాటుపడగలదని ప్రచారంచేసి మెజారిటీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తండ్రి, జేఎంఎం దిగ్గజం శిబూసోరెన్ నుంచి రాజకీయ వారసత్వం పొందినా తొలినాళ్ల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి సిసలైన సీఎంగా పేరు తెచ్చుకున్నారు. 2009లో రాజ్యసభలో అడుగుపెట్టి.. మూడోసారి ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారైన హేమంత్ రాజకీయ ప్రస్థానం శాసనసభకు బదులు రాజ్యసభలో మొదలైంది. 2009లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అనివార్యకారణాల వల్ల కొద్దికాలానికే రాజీనామాచేయాల్సి వచి్చంది. నాటి మిత్రపక్షంగా బీజేపీ సారథ్యంలోని అర్జున్‌ముండా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రెండేళ్లకే ప్రభుత్వం కుప్పకూలడం రాష్ట్రపతిపాలన అమలుకావడంతో సోరెన్ జేఎంఎం పగ్గాలు చేపట్టారు. తర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతులో 2013లో 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఏడాదికే పదవిని కోల్పోవాల్సి వచి్చంది. 2014లో అధికార పీఠాన్ని బీజేపీ హస్తగతంచేసుకోవడంతో సోరెన్ విపక్షనేత బాధ్యతలు నెత్తినేసుకున్నారు. మలుపుతిప్పిన 2016.. 2016లో నాటి బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్‌లో గిరిజన అటవీ భూములను సులభంగా వ్యవసాయేతర అవసరాలకు బదలాయించేందుకు వీలుగా అత్యంత వివాదాస్పద ‘చోటానాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908(సవరణ)ఆర్డినెన్స్, సంథాల్ పరగణ టెనెన్సీ యాక్ట్ 1949(సవరణ) ఆర్డినెన్స్‌లను తీసుకొచి్చంది. గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రంలో వారి భూములను ప్రభుత్వం అన్యాయంగా స్వా«దీనంచేసుకుని సొంత వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తోందని హేమంత్ సోరెన్ 2016లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం లేవదీశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం చేసిన ఈ ఉద్యమం విజయవంతమవడంతో సోరెన్ శక్తివంత గిరిజన నేతగా అవతరించారు. 2019లో కొనసాగిన హవా కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో 2019లో హేమంత్ మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. 81 సీట్లున్న అసెంబ్లీలో జేఎంఎం పార్టీ ఒక్కటే ఏకంగా 30 సీట్లను కైవసం చేసుకోవడంలో హేమంత్ కృషి దాగిఉంది. అయితే 2023లో భూవివాదంలో మనీలాండరింగ్ జరిగిందంటూ హేమంత్‌ను అరెస్ట్‌చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కటకటాల వెనక్కి నెట్టింది. జనవరి 31న అరెస్ట్‌కు ముందు సీఎం పదవికి రాజీనామాచేసి పారీ్టలో అత్యంత నమ్మకస్తుడైన చంపయీ సోరెన్‌కు పగ్గాలు అప్పజెప్పి జైలుకెళ్లారు. జార్ఖండ్ హైకోర్టు జూన్‌లో బెయిల్ ఇవ్వడంతో మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే తనను అవమానకర రీతిలో సీఎం పదవి నుంచి కిందకు తోశారని చంపయీ సోరెన్, పారీ్టలో విలువ ఇవ్వట్లేరని వదిన సీతా సోరెన్ జేఎంఎంను వీడి హేమంత్‌కు తలనొప్పిగా మారారు. ప్రజలకు చేరువగా పథకాలు పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసి ప్రజారంజక నేతగా హేమంత్ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి మయ్యాన్ సమ్మాన్ యోజన ఆర్థిక ప్రయోజనం లబ్ధిని పెంచారు. 18–51 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1,000 ఆర్థికసాయం అందేలా చేశారు. దాదాపు 1.75 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసి రైతన్నల మన్ననలు అందుకున్నారు. గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు. సహజవనరులతో తులతూగే జార్ఖండ్ నుంచి సహజసంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోచేస్తోందని ప్రచారకార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించి బీజేపీ పట్ల ఓటర్లలో ఆగ్రహం పెంచారు. బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి మోదీ సర్కార్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలపై నిలదీసి గిరిజనులకు అండగా తానొక్కడినే ఉన్నానని ఓటర్ల మనసుల్లో ముద్రవేశారు. 2022లో సొంతంగా మైనింగ్ లీజుకు ఇచ్చుకున్నాడనే అపవాదుతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే ప్రమాదం నుంచి కాస్తలో తప్పించుకున్నారు. జార్ఖండ్ పేదలను మోదీ సర్కార్ తన స్వప్రయోజనాల కోసం నిమ్మకాయ పిండినట్లు పిండుతోందని హేమంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తెగ పాపులర్ అయ్యాయి. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు, నమ్మకస్తులైన ఓటర్లు అంతా కలిసి హేమంత్‌కు మరోసారి ఘన విజయమాల వేశారు. -
కొంత మోదం.. కొంత ఖేదం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టికి కొంత నిరాశం, కొంత ఉపశమనం కలిగించాయి. మహారాష్ట్రలో కూటమి పక్షాలతో కలిసి అధికార బీజేపీ కూటమికి ఓటమి రుచి చూపిద్దామన్న కసితో పనిచేసిన కాంగ్రెస్‌కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్ఛాయి. సీట్ల పంపకాల్లో తప్పిదాలు, ఓట్ల బదిలీ జరగకపోవడం, పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు పెద్దగా నమ్మకపోవడం ఘోర పరాజయానికి దారితీశాయి. జార్ఖండ్‌లో మాత్రం తన బలాన్ని నిలుపుకోవడం, కూటమి పార్టితో కలిసి తిరిగి అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు ఊపిరినిచ్చింది. మహారాష్ట్రలో ఊహించని దెబ్బ ఆరు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ అద్భుత ప్రదర్శన కనబరించింది. మొత్తం 48 పార్లమెంట్ స్థానాలకు గానూ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 16.12 శాతం ఓట్లను రాబట్టుకొని 13 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలైన శివసేన (ఉద్ధవ్) 9, ఎన్సీపీ(శరద్ పవార్) 8 స్థానాలు దక్కించుకున్నాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. తన ఓట్ల శాతాన్ని సైతం కోల్పోయి కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 147 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు రాబట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తన పేలవ ప్రదర్శనతో 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం తమకు బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు వదిలేయడమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయావకాశాలను, సీట్లను తగ్గించేలా నియోజకవర్గాల ఎంపిక జరిగిందని ఆరోపించారు. దీనికి తోడు 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీపడ్డాయి. ఆయా స్థానాల్లో 65కి పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హిందువుల ఓట్ల ప్రాబల్యంతోపాటు గరిష్ట సంఖ్యలో మరాఠాలు బీజేపీకి జైకొట్టడంతో కాంగ్రెస్‌కు పరాజయం ఎదరయ్యింది. జార్ఖండ్‌తో దక్కిన పరువు జార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నెగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో 31 స్థానాల్లో పోటీచేసి 16 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీచేసి 16 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి పూర్తి సహకారం అందడంతో జేఎంఎం గెలుచుకున్న స్థానాలు 30 నుంచి 34కి పెరిగాయి. పొత్తులపై ముందునుంచే అవగాహన ఉండడం, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించడం ఇండియా కూటమికి కలిసొచ్చింది. ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 9 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మరో 2 స్థానాలు గెలిచే అవకాశమున్నా ఎస్పీ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. పశి్చమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన 6 స్థానాల్లోనూ మిత్రపక్షమైన తృణముల్ కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. పంజాబ్‌లోనూ నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టితో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒక స్థానంలో నెగ్గింది. మూడు స్థానాల్లో ఆప్ గెలుపొందింది. రాజస్తాన్‌లో 7 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆరింటిని గెలుచుకున్నాయి. కర్ణాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మరోవైపు వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం పట్ల కాంగ్రెస్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు..
-
మహారాష్ట్ర ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ VS రియల్ ఫలితాలు
-
ఒకసారి ఇండియా కూటమి.. ఒకసారి NDA కూటమి
-
ఎగ్జిట్‌పోల్స్ తలకిందులు: జార్ఖండ్‌లో మళ్లీ ఇండియా కూటమినే!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మెజార్టీకి మించిన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఇటు జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్) అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను(41) దాటి 50కి పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ బర్హైత్లో4,921 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఆయన సతీమణి గాండే అసెంబ్లీ స్థానం నుంచి 4,593 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన మునియా దేవి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.జేఎంఎం నుంచి ఇటీవల బీజేపీలో చేరిన చంపై సోరెన్ సెరైకెలా స్థానం నుంచి వెరెకంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి గణేష్ మహాలీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో నాలుగుసార్లు జేఎంఎం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు చంపైధన్మర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరండీ ఆధిక్యంలో ఉన్నారు.బీజేపీకి చెందిన సీతా సోరెన్ జమ్తారాలో వెనుకంజలో ఉన్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.చదవండి: ‘ఎన్డీయే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది’: మహా ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలుజార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంచనా వేశాయి. కానీ నేడు వెలువడుతున్న అధికారిక ఫలితాలతో గ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.కాగా రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. -
బీజేపీ జోష్
-
ఉత్కంఠ రేపుతున్న ప్రజాతీర్పు..
-
Watch Live: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై ఉత్కంఠ
-
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వయనాడ్‌లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాసేపట్లో ప్రారంభం కానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
-
ఎన్డీఏ వైపే సర్వేలు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో NDA కూటమిదే పైచేయి
-
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ .. ఎవరి సత్తా ఎంతంటే?
సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (పీపుల్స్‌పల్స్)బీజేపీ 182, కాంగ్రెస్ 97,ఇతరులు 9 మహరాష్ట్ర (ఏబీపీ) : బీజేపీ 150-170 కాంగ్రెస్ 110-130ఇతరులు 8-10 ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) ఎన్డీయే-46-58జేఎంఎం కూటమి 24-37 ఇతరులు 6-10 చాణక్య (మహారాష్ట్ర)ఎన్డీఏ 152-160ఇండియా 130-138చాణక్య(ఝార్ఖండ్) ఎన్డీఏ 45-50జేఎంఎం 35-38ఏబీపీ(మహారాష్ట్ర)ఎన్డీఏ 150-170ఎంవీఏ 110-130ఇతరులు 6-8కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. -
Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. -
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్‌కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.జార్ఖండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు డియోఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్‌కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది. -
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
ప్రశాంతంగా ముగిసిన ఝార్కండ్ తొలి విడత ఎన్నికలు
-
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో జరగ నున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని ఉపముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జి, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాలనే ఉత్సాహం అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ కనిపిస్తోందన్నారు. ఎన్నికల ఇన్చార్జిగా జార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన భట్టి శుక్రవారం రాంచీలో జరిగిన రాష్ట్ర పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...అసెంబ్లీ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నేతలెవరూ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమకు కేటాయించిన నియోజకవర్గాలను వదిలిపెట్టవద్దని సూచించారు. కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి వారు ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రచారాన్ని నిర్వహించాలని, సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టో తయారీపై అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో కేసీ వేణుగో పాల్, కేశవ్మహతో కమలేశ్, గులాం అహ్మద్ మీర్‌సాబ్, బి.కె.హరి ప్రసాద్, రామేశ్వరరావు పాల్గొన్నారు. -
జార్ఖండ్ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్ ఫస్ట్’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్‌యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి -
లిక్కర్ స్కామ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
Jharkhand Election: రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్‌పై బార్హెట్ స్థానం నుండి గమ్లియాల్ హెంబ్రోమ్ పోటీకి దిగారు.హెంబ్రోమ్ 2019లో బార్హెత్ నుంచి ఏజేఎస్‌యూ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 2,573 ఓట్లను పొందారు. తుండి స్థానం నుంచి వికాస్ మహతో అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హెట్ (ఎస్జీ)నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇటీవల బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 66 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీని ధన్వార్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ పెద్ద కోడలు, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్‌ను పార్టీ జమ్తారా నుంచి పోటీకి దింపింది. జంషెడ్పూర్ తూర్పు నుంచి మాజీ సీఎం, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు -
దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ
రాంచీ: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. నవంబర్ ఒకటి నుంచి నవంబర్ 10 వరకు ఎన్నికల ర్యాలీల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సహా స్టార్ క్యాంపెయినర్లు సమయం కేటాయించాలని పార్టీ కోరింది.మీడియాకు అందిన తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో దీపావళి తర్వాత బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఎన్నికల ర్యాలీలు జరగనున్నాయి. ప్రధానమంత్రి ఆరు ఎన్నికల ర్యాలీలలో పాల్గొనేలా బీజేపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పార్టీలోని ఆరు సంస్థాగత విభాగాల్లోనూ ప్రధాని ఎన్నికల సభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు ర్యాలీలు నిర్వహించారు.గడచిన నవంబర్ 15న జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోదీ తన మొదటి ర్యాలీ నిర్వహించారు. రెండో ర్యాలీ అక్టోబర్ 2న హజారీబాగ్‌లో జరిగింది. బీజేపీ పరివర్తన్ యాత్రను ఆయన రాష్ట్రంలో ముగించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సాహిబ్‌గంజ్, గిరిడిహ్లలో ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, అవినీతి, బంగ్లాదేశ్ చొరబాట్లు వంటి వివిధ సమస్యలు ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రచారాస్త్రాలుగా ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు పేపర్ లీక్ ఉదంతం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాశం కానుంది.ఇది కూడా చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..! -
జార్ఖండ్ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్ @ 60
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్ధారి లోక్‌నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు) ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్‌వర్‌లు 68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్, సమేష్ సింగ్‌లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్‌చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్‌చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు. 60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే..


