రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం హేమంత్ సొరేన్ మరోసారి ముఖ్యమంత్రి చేపట్టబోతున్నట్లు సమాచారం. తమ నేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకుంటూ జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. జార్ఖండ్‌లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లారు. అనంతరం, జూన్ 28వ తేదీన రాంచీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సొరేన్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంపై సొరేన్ స్థానంలో హేమంత్ సొరేన్ మళ్లీ బాధత్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంపై సొరేన్ అధికారిక కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment