జార్ఖండ్‌ కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే | Jharkhand Cabinet Ministers: Full list of Jharkhand council of ministers | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే

Published Thu, Dec 5 2024 2:33 PM | Last Updated on Thu, Dec 5 2024 2:39 PM

Jharkhand Cabinet Ministers: Full list of Jharkhand council of ministers

రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్‌లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్‌పూర్  ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్‌కు చెందిన దీపికా పాండే సింగ్‌లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్‌, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్‌, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

కాగా జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ నవంబర్‌ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్‌ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.  డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.

ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది.  బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 24 సీట్లు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement