Cabinet
-
TG: క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..!
ఢిల్లీ : తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఉగాదిలోపే క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన పలువురు ముఖ్యనేతలు ఢిల్లీకి పయనమై వెళ్లారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ లు ఢిల్లీకి వెళ్లారు.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఈరోజు(సోమవారం జరిగే సమావేశం అనంతరం క్యాబినెట్ విస్తరణ అనేది ఓ కొలిక్కే వచ్చే అవకాశం ఉంది. నేడో, రేపో క్యాబినెట్ మంత్రులపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. -
కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలు ఇకపై కెనడా మంత్రులుగా కొనసాగారు. కెనడా పార్లమెంట్‌కు ఎన్నికైన అతి పిన్న వయస్సులైన మహిళల్లో కమల్ ఖేరా సైతం ఉన్నారు. 58 ఏళ్ల అనితా ఆనంద్‌కు ఆవిష్కరణలు, శాస్త్ర, వాణిజ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. 36 ఏళ్ల కమల్ ఖేరాను ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.కాగా, ఢిల్లీలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న కాలంలో కమల్ కుటుంబం కెనడాకు తరలిపోయారు. టొరంటోలో యార్క్ వర్సిటీలో కమల్ సైన్స్ డిగ్రీ సాధించారు. నర్సుగా, కమ్యూనిటీ వలంటీర్‌గా, రాజకీయ కార్యకర్తగా మొదలెట్టి చివరకు మంత్రిస్థాయికి కమల్ ఎదిగారు. నోవా స్కాటియాలో పుట్టిన అనిత 1985లో ఒంటారియోకు వలసవచ్చారు. లాయర్, పరిశోధకురాలు, అధ్యాపకురాలు అయిన అనిత 2019లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. గతంలో ట్రెజరీ బోర్డ్ అధ్యక్షురాలిగా, రక్షణ మంత్రిగా, ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా సేవలందించారు. Diversity in leadership! Indo-Canadian Anita Anand and Delhi-born Kamal Khera have joined Canadian Prime Minister Mark Carney's cabinet. It is a proud moment for representation and inclusion in Canadian politics. 🇨🇦 #Canada #Cabinet #AnitaAnand #KamalKhera #MarkCarney pic.twitter.com/PU3KOU0WaW— Dr. Prosenjit Nath (@prosenjitnth) March 15, 2025 -
అనుభవం, జ్ఞానం లేదు.. కామన్సెన్స్ వాడరు
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రికి అనుభవం, జ్ఞానం లేకున్నా కనీసం కామన్ సెన్స్‌ను కూడా ఉపయోగించడం లేదు. సీఎంకు అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒకరిద్దరు అనుభవజు్ఞలు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. కానీ రాష్ట్రంలో సీఎం, మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది. హామీలు, పథకాల అమలును పక్కనపెడితే ప్రజల కనీస అవసరాలైన సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటిని అసెంబ్లీలో ఎత్తిచూపడమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలు, వేస్తున్న నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అప్పులు సహా.. అన్నీ అబద్ధాలే! ‘‘రాష్ట్ర అప్పుల లెక్కలపై రేవంత్, మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. గత ఏడాదికాలంలో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైంది. బడ్జెట్‌తోపాటు సవరించిన అంచనాలను కూడా ప్రభుత్వం సభ ముందు పెడుతుంది. ఆదాయ లోటు కూడా భారీగా ఉండబోతోంది. అందువల్ల బడ్జెట్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రులుగా పనిచేసినవారు మన పార్టీ తరఫున ఉభయ సభల్లోనూ ఉన్నారు. వారు ‘షాడో కేబినెట్’లా వ్యవహరించి పద్దులపై చర్చ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని ఎండగట్టాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాగు, సాగునీటి కష్టాలతోపాటు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్ కోతలు, వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతుండటం, ఎండుతున్న పంటలు వంటి రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో వివిధ రంగాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎత్తిచూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతకు సోషల్ మీడియా అద్దం పడుతోందని, నిజానికి అంతకంటే ఎక్కువ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో నెలకొందని పేర్కొన్నారు. నలుగురు సభ్యులు గైర్హాజరు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీకి నలుగురు సభ్యులు ముందస్తు సమాచారం ఇచ్చి గైర్హాజరు అయ్యారు. వ్యక్తిగత పనులతో తాము సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలిపారు. గైర్హాజరైన వారిలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు ఉన్నారు. దాదాపు 25 అంశాలపై దిశానిర్దేశం సుమారు మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ దాదాపు 25 అంశాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు, డీఏలు, పీఆర్సీ తదితరాలపై గొంతు వినిపించాలని సూచించారు. మహిళలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, వైద్యరంగంలో దిగజారిన ప్రమాణాలు, దళిత బంధు నిలిపివేత, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వంటి అంశాలు ప్రస్తావించాలన్నారు. ఏపీ నదీ జలాల చౌర్యం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో 20శాతం కమిషన్ల ఆరోపణలు, పరిశ్రమల ఏర్పాటుకు బలవంతపు భూసేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధన, కులగణనలో తప్పులు, బెల్ట్‌షాపుల తొలగింపు, ఎల్ఆర్ఎస్, మేడిగడ్డ పునరుద్ధరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. నేడు అసెంబ్లీకి కేసీఆర్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయన మంగళవారం ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి వచ్చి తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో పాల్గొన్నారు. అనంతరం నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లేదా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్ఎస్కు డిప్యూటీ లీడర్లు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరిస్తుండగా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ నియమించారు. తాజాగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ లీడర్లను నియమిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మండలిలో ఎల్.రమణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్న హరీశ్‌రావు డిప్యూటీ లీడర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమల్లో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చల్లో లేవనెత్తాల్సిన అంశాలు వ్యూహాత్మకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలన్నారు. సభ్యులు మొక్కుబడిగా కాకుండా, సమావేశాలు జరిగే రోజుల్లో ఉదయం 9.30కు బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. -
తెలంగాణ కేబినెట్ సమావేశం
-
రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదం
భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) రూ.10,000 కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు, ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామగ్రి కొనుగోలు చేయనున్నారు. వీటిని మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్) ఉత్పత్తి చేస్తాయి.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లు భారత సైన్యానికి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థను అందిస్తాయి. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇవి సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలకమైన వనరుగా మారాయి. ఈ ఒప్పందంలోని మరో కీలక అంశం ఏరియా డేనియల్ మ్యునిషన్స్(ఏడీఎం). ఎక్కువ విస్తీర్ణంలో వందలాది బాంబులను ఏర్పాటు చేయడం ద్వారా నిర్దిష్ట ప్రాంతాల్లో శత్రు దళాలు ప్రవేశించకుండా కట్టడి చేయవచ్చు. అందుకోసం మందుగుండు సామగ్రి అవసరం అవుతుంది. ఈ ఒప్పందాన్ని డీఆర్డీఓ, ఎంఐఎల్, ఈఈఎల్కు వాటి వాటా ఆధారంగా విభజిస్తారు. మందుగుండు సామగ్రికి సంబంధించి ఈఈఎల్ కాంట్రాక్ట్ విలువలో 60% అందుకుంటుంది. మిగిలిన 40% ఎంఐఎల్కు అందుతుంది. ఈ సహకారం రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరుఈ ఒప్పందానికి సీసీఎస్ ఆమోదం లభించడంతో రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తుంది. సైన్యం ఇప్పటికే 10 పినాకా రెజిమెంట్లను కలిగి ఉంది. భవిష్యత్తులో మరిన్ని రాకెట్లు తోడవుతుండడం సైన్యం వ్యూహాత్మక పరిధిని మరింత పెంచుతుంది. ఈ నిర్ణయం రక్షణ తయారీ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలనే దేశ లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. -
ఐదున్నర దశాబ్దాల శ్రమ
భారత్‌కు స్వాతంత్య్రం తథ్యమని రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు తేల్చేశాయి. స్వాతంత్య్ర సమరం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాణం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం. అది ఉత్తేజకరమైనది కూడా. స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే రాజ్యాంగ రచన నిర్ణయం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచన ఆరంభమయింది.భారత్‌కు రాజ్యాంగం ఇవ్వాలన్న ఆలోచన 1895 నాటి ‘రాజ్యాంగ బిల్లు’లో కనిపిస్తుంది. ఆపై ఐదున్నర దశాబ్దాల తరువాతే భారత్‌కు రాజ్యాంగం అవతరించింది. దేశం గణతంత్ర రాజ్యమైంది. కాబట్టి మన రాజ్యాంగ రచనకు 130 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. దీనినే ‘స్వరాజ్ బిల్’ అని అంటారు. బ్రిటిష్ ఇండియాలో జాతీయవాదం పదునెక్కుతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. అనీబిసెంట్ అంచనా ప్రకారం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ కావచ్చు. అయితే, బ్రిటిష్ ఇండియా మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. స్వతంత్ర భారతంలోనే అది సాధ్యమైంది. అనీబిసెంట్ 1925లో, సైమన్ కమిషన్ 1928లో వచ్చి వెళ్లిన తరువాత మోతీలాల్, జవహర్లాల్, తేజ్‌బహదూర్ సప్రూ సంఘం రాజ్యాంగం అందించేందుకు (నెహ్రూ నివేదిక) ప్రయత్నించింది.1919 భారత ప్రభుత్వ చట్టం ఫలితాలను పరిశీలించి, రాజ్యాంగ సంస్కరణలను తీసుకురావడానికి నియమించినదే సైమన్ కమిషన్ (1928). ఇది భారతీయులను దారుణంగా పరిహాసం చేసింది. భారతదేశ రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ నియమించింది. ఇందులో ఒక్క భారతీయుడు లేరు. ఫలితమే ‘సైమన్ ! గో బ్యాక్’ ఉద్యమం. తరువాత బ్రిటిష్ ప్రభుత్వ సవాలు మేరకు మోతీలాల్ నాయకత్వంలో అధినివేశ ప్రతిపత్తిని కోరుతూ (కామన్వెల్త్లో ఉంటూనే కొంత స్వయం అధికారం ఉండడం), రాజ్యాంగాన్ని కోరుతూ ఒక వినతిపత్రం తయారు చేశారు. 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలుగా ఉపకరించాయి. 1895 రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్యేళ్లకు 1934లో ఎం.ఎన్ . రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినా, ఆరేళ్ల తరువాతే అది కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే ఈ పరిణామం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్‌లో ఉన్నారు. అఖండ భారత్ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్‌ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్ తాత్కాలిక చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్ ముఖర్జీ, ముసాయిదా సంఘం అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్ నరసింగరావు ఎన్నికయ్యారు.1946 డిసెంబర్ 9న పరిషత్ మొదటి సమావేశం జరిగింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులు పరిషత్ పని చేసింది. మొత్తం సమావేశాలు 11. ఇందుకైన ఖర్చు రూ. 64 లక్షలు. 22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. 1950 జనవరి 24న ‘జనగణ మన’ను జాతీయ గీతంగా స్వీకరించారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.1946 డిసెంబర్ 13న పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్‌ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించడం. 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏయే అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులు, మైనారిటీల వ్యవహారాల సలహా సంఘం, కేంద్ర అధికారాల నిర్ణాయక సంఘం వంటివి! అవన్నీ వాటి నివేదికలను 1947 ఏప్రిల్, ఆగస్ట్ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద 1947 ఆగస్ట్ 30న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికలు, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్ .రావ్ ఒక ముసాయిదాను తయారు చేశారు. 1947 అక్టోబర్‌లో ఈ పని పూర్తి చేసి, రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. దీనిపై ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి, తుది ముసాయిదాను రూపొందించి, 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌కు సమర్పించింది.తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్ 23, 24, 27 తేదీలలో పరిషత్ చర్చలు జరిపింది. తరువాత 1948 అక్టోబర్ 26న ముసాయిదాను మరోసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా 1949 అక్టోబర్ 17 వరకు చర్చ జరిగింది. ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్ తిరస్కరించింది. స్వీకరించిన కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 3న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా 1949 నవంబర్ 14న రాజ్యాంగ పరిషత్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. తరువాత 1949 నవంబర్ 26న మూడోసారి కూడా చదవడం, చర్చించడం పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద 1950 జనవరి 24న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.అయితే, భారత రాజ్యాంగం సుదీర్ఘం, న్యాయవాదుల స్వర్గం అంటూ ప్రతికూల వ్యాఖ్య వచ్చింది. ఆ వ్యాఖ్య చేసినవాడు ఐవర్ జెన్నింగ్స్. ఏడుగురు సభ్యులతో 1947 ఆగస్ట్ 29న ముసాయిదా సంఘాన్ని ఎన్నుకున్నారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. కానీ సంఘం అధ్యక్షునిగా నెహ్రూ జెన్నింగ్స్‌ను ప్రతిపాదించారు. చివరికి గాంధీజీ అభిప్రాయం మేరకు అంబేడ్కర్ చైర్మన్ అయ్యారు. ఒకటి వాస్తవం. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్ ఐక్యంగా పురోగమించడానికి అంతస్సూత్రంగా పనిచేస్తున్నది భారత రాజ్యాంగమే!-డాక్టర్ గోపరాజు నారాయణరావు -
‘తల్లికి వందనం’ పథకానికి మంగళం.. ఈ ఏడాది లేనట్టే..
సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేబ్‌నెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కిక్కే.. కిక్కుతల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తున్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. -
రేపు మన్మోహన్సింగ్ అంత్యక్రియలు
సాక్షి,ఢిల్లీ:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం(డిసెంబర్28) కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని శక్తిస్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.మన్మోహన్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా,శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది.మన్మోహన్సింగ్(92) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మన్మోహన్సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికన ఆర్థికవేత్త,ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌కు గొప్ప పేరున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మన్మోహన్సింగ్ అస్తమయం -
‘మహా’ కేబినెట్ విస్తరణ పూర్తి..అలిగిన శివసేన ఎమ్మెల్యే
నాగ్‌పూర్:మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైన పది రోజులకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన 39 మంది నేతలు మంత్రులుగా ఆదివారం(డిసెంబర్15) ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు.సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,డిప్యూటీసీఎంలు ఏక్నాథ్ శిండే,అజిత్ పవార్ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాన్‌కులేతోపాటు రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, గణేశ్ నాయక్, మంగళ్‌ప్రభాత్ లోధా, జయ్‌కుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావే, అశోక్ ఉయికే, ఆశిశ్ శేలార్, శివేంద్రసిన్హ భోసలే, జయ్‌కుమార్ గోరె మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభూరాజ్ దేశాయ్, ఎన్సీపీ నుంచి ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, దత్తాత్రేయ, అధితీ తాత్కరే, మానిక్రావ్ కొకాటే, నరహరి జిర్వాల్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మరోవైపు తనకు కేబినెట్ బెర్తు దక్కలేదని శివసేన ఎమ్మెల్యే, పార్టీ విదర్భ కో ఆర్డినేటర్ నరేంద్ర మోడేకర్ అలిగారు. పార్టీ కో ఆర్టినేటర్ పదవికి రాజీనామా చేశారు. -
పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు పెట్టనున్న కేంద్రం
-
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
అలాంటిలాంటి పిల్లి కాదిది.. ఏకంగా ప్రధాని కార్యాలయంలో..!
బ్రిటిష్ పతాకాన్ని హోదా చిహ్నంగా మెడలో ధరించి, గంభీరంగా చూస్తున్న ఈ పిల్లి వాలకం గమనించండి. ఇది బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో ఉన్నతోద్యోగి. దీని హోదా ‘చీఫ్ మౌసర్ టు ది కేబినెట్ ఆఫీస్’. బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోనికి ఎలుకలు చొరబడకుండా కాపలా కాయడమే దీని పని. దీని కన్ను కప్పి పొరపాటున ఏ ఎలుకైనా సాహసించి ఈ కార్యాలయంలోకి చొరబడితే, ఇది వెంటనే పట్టి, పలారం లాగించేస్తుంది. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలోని ఉద్యోగులందరూ దీనిని అల్లారుముద్దుగానే కాదు, అత్యంత గౌరవంగా కూడా చూసుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో పిల్లులను పెంచే పద్ధతి పదహారో శతాబ్ది నుంచి ఉండేది. ప్రధాని కార్యాలయంలో పెంచే పిల్లికి ‘చీఫ్ మౌసర్’ హోదాను అధికారికంగా ప్రకటించడం మాత్రం 1997లో జరిగింది. ఇప్పుడు ‘చీఫ్ మౌసర్’గా ఉన్న పిల్లి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏటా 100 పౌండ్లు (రూ.10,597) ఖర్చు చేస్తోంది. (చదవండి: ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!) -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్‌లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్‌పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్‌కు చెందిన దీపికా పాండే సింగ్‌లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణపై జాప్యమెందుకు?
రాంచీ: జార్ఖండ్‌లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్‌ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్‌కు నాలుగు బెర్త్‌లు, సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక మంత్రి పదవి లభించింది.గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. -
కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-
ట్రంప్ కేబినెట్లో కీలక పదవులు దక్కించుకుంది వీరే.. (ఫొటోలు)
-
పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ఢిల్లీ, సాక్షి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మి పథక లక్ష్యం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. రూ. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "FCI plays a very big role in the procurement of food. It has been decided today to significantly strengthen the Food Corporation of India (FCI)...Today, the cabinet has decided fresh equity… pic.twitter.com/TL26u6xS2G— ANI (@ANI) November 6, 2024 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందింది’’ అని అన్నారు. #Cabinet approves PM-Vidyalaxmi scheme to provide financial support to meritorious students so that financial constraints do not prevent any youth of India from pursuing quality higher educationUnder the scheme, any student who gets admission to a Quality Higher Education… pic.twitter.com/Z8C3fllXuo— PIB India (@PIB_India) November 6, 2024 -
తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం(అక్టోబర్ 26) సాయంత్రం సమావేశమైంది. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ములుగులో సమ్మక్క సారలమ్మ వర్శిటీకి భూ కేటాయింపుతో పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ కీలక నిర్ణయాలు..మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ఎల్బీనగర్ టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు, నాగోల్ టు ఎల్బీనగర్, ఎల్బీనగర్ టు హయత్‌నగర్ పొడిగింపుఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేందద్రాల ఏర్పాటునకు ఆమోదంఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణానికి గోషామహల్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుకొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్రేరాలో 54 పోస్టుల భర్తీకి నిర్ణయంములుగులో సమ్మక్కసారక్క గిరిజన యూనివర్సిటీ నిర్ణయానికి భూ కేటాయింపులుఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు టీచర్ పోస్టుల రేషనలైజేషన్‌కు నిర్ణయంఇదీ చదవండి: ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి -
J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు. -
రతన్ టాటాకు భారత రత్న!.. మహారాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన
ముంబైలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సేవా రంగాల్లో అతని సేవలు అనితరమైనవవి అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతిపై సంతాప ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.కాగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు. ముంబైలోని ఎన్సిపిఎలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వర్లీలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవ్వనున్నారు. -
జమిలికి జై
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తూ వస్తున్న మోదీ సర్కారు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. దేశమంతటా అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ’ఒక దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు జై కొట్టింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం తెలిసిందే. తొలుత దీనికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ మీదట దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. ‘కమిటీ సిఫార్సుల మేరకు అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ బిల్లు ప్రతిని రూపొందించి కేబినెట్ ముందు పెడుతుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతాం‘ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే శీతాకాల సమావేశాలే ఇందుకు వేదిక కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఒకే బిల్లు గానీ, అవసరమైతే పలు బిల్లులు గానీ ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు లా కమిషన్ కూడా జమిలిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 2029 నుంచి ఒకేసారి అన్ని ఎన్నికల నిర్వహణ, హంగ్ వచ్చే పక్షంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు తదితర సిఫార్సులను కమిషన్ చేయవచ్చని సమాచారం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు కీలక వాగ్దానంగా ఉంటూ వస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ, ఎన్డీయే పక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం ఇది ఆచరణసాధ్యం కాదంటూ పెదవి విరిచాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కారు ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాయి. త్వరలో అమలు కమిటీ జమిలి ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మతి తెలిపాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పారీ్టలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చింది. దేశ ప్రజల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో ఒక అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.‘ఈ అంశంపై రానున్న కొద్ది నెలల పాటు ప్రజలు, పార్టీలు, మేధావులు... ఇలా అన్ని రకాల వేదికల్లోనూ లోతుగా చర్చలు జరుగుతాయి. జమిలి ఎన్నికలకు విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తాం. దీర్ఘకాలంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కావాలన్నది మా ప్రభుత్వ విశ్వాసం. ఇది మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్య‘ అని చెప్పుకొచ్చారు. కమిటీ చేపట్టిన సంప్రదింపుల సందర్భంగా ఏకంగా 80 శాతం మందికి పైగా జమిలికి మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువత దీన్ని పూర్తిస్థాయిలో సమర్థించిందన్నారు. కాబట్టే జమిలికి ప్రస్తుతం విపక్షాల వ్యతిరేకంగా ఉన్నా.. విపక్షాలపై కూడా వైఖరి మార్చుకుందామంటూ అంతర్గతంగా ఒత్తిడి వస్తోందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులివ్వలేదు. మోడీ 3.0 హయాంలోని దీన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. 1967 దాకా జమిలి ఎన్నికలే స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశమంతటా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యంతరాలు తదితర కారణాలతో జమిలికి తెర పడింది. ఈ నేపథ్యంలో జమిలి కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం, కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు అవసరం అవుతాయి. రెండు దశల్లో అమలు కోవింద్ కమిటీ సిఫార్సుకోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ‘తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 100 రోజు ల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపాలి‘ అని పేర్కొంది. అన్ని ఎన్నికలకూ ఉమ్మ డిగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తున్నాయి. -
‘జమిలి’కి కేబినెట్ ఆమోదం..ప్రధాని కీలక ట్వీట్
న్యూఢిల్లీ: భారత దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేదిశగా జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం ఒక ముందడుగు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జమిలి ఎన్నికలకు బుధవారం(సెప్టెంబర్18) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం మోదీ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా రాంనాథ్కోవింద్కు అభినందనలు తెలియజేస్తున్నా. విస్తృత సంప్రదింపులు జరిపి జమిలి ఎన్నికలపై సిఫారసులు చేశారు’అని కోవింద్‌ను ప్రధాని కొనియాడారు. ఇదీ చదవండి.. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ -
ఈ టర్మ్‌లోనే ఎన్నికలు..
-
థాయిలాండ్ ప్రధానికి ఉద్వాసన
బ్యాంకాక్: అవినీతి మరక అంటుకున్న వ్యక్తిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుని నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ థాయిలాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావీసిన్ను అక్కడి రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని పదవి నుంచి తొలగించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీని రద్దుచేయాలంటూ ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన వారం రోజులకే ఇలా ప్రధాన మంత్రి పదవి ఊడిపోవడం గమనార్హం. ‘‘ నన్ను క్షమించండి. నన్ను కోర్టు అనైతిక ప్రధానిగా భావించిందిగానీ నేను అలాంటి వ్యక్తినికాదు. ఏదేమైనా కోర్టు తీర్పును శిరసావహిస్తా’ అని తీర్పు తర్వాత ప్రధాని స్రెట్టా వ్యాఖ్యానించారు. స్రెట్టాకు వ్యతిరేకంగా 5:4 మెజారిటీతో బుధవారం కోర్టు తీర్పు వెలువరిచింది. తక్షణం తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఏప్రిల్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్బన్ను మంత్రిగా ఎంపికచేశారు. అయితే 2008లో ఆయన ఒక జడ్జికి 55వేల అమెరికన్ డాలర్లు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అవినీతి నేతకు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టారంటూ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. -
మళ్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా..?
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలవడంతో కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమిస్తారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించి కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు.గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన తర్వాత సిసోడియా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న సిసోడియాకు శుక్రవారం(ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రమే ఆయన జైలు నుంచి విడుదలై సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిశారు.ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..కేంద్ర కేబినెట్ ఆమోదం?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టంలోని సవరణలకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఈ సవరణలతో ఇవి తమ ఆస్తులని వక్ఫ్ బోర్డ్ అంటే అందుకు తగిన ఆధారాలు చూపుతూ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాలు భూమి ఉంది. -
సిరాజ్, నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగాలు..
-
సీఎం రేవంత్ షాడో కేబినెట్లో ఆ నలుగురు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో షాడో కేబినెట్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం(జులై 27) మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్ సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఉదయ సింహ, అజిత్ రెడ్డితో షాడో కేబినెట్ నడుస్తోందన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు.సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తమ వద్దకు అన్ని వివరాలు వస్తున్నాయని చెప్పారు. అన్నీ బయటపెట్టడానికి టైమ్ ఉందన్నారు. -
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్‌తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఆ భేటీతో... ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది. మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు. ‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.యోగి సంచలన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం(జూన్21) కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం రెండో టర్ములో డిసెంబర్ 11,2018 వరకు కటాఫ్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆమరుసటి రోజు డిసెంబర్ 12,2018 నుంచి డిసెంబర్ 9,2023వరకు 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఈ రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.వ్యవసాయం దండగ కాదు..వ్యవసాయం పండుగ అని నిరూపించాలనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదా పద్ధతుల్లో చేసి రైతు ఆత్మహత్యలకు కారణమయింది. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రైతు భరోసాపై పారదర్శకంగా అందరి సూచనల మేరకే అమలు చేస్తాం.ప్రభుత్వ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించాం. ఉపసంఘంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఇక నుంచి మీడియాకు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే చెప్తారు. వీరిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారం. వీరిని మంత్రివర్గ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నాం. రుణమాఫీ అర్హుల ఎంపిక విధివిధాలపై త్వరలోనే జీవో విడుదలవుతుంది’అని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీ బుధవారం(జూన్18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. -
వార్ కేబినెట్‌ను రద్దు చేసిన నెతన్యాహూ
టెల్ అవీవ్: యుద్ధక్షేత్రంలో ముందుకు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ కేబినెట్‌ను సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనూహ్యంగా రద్దుచేశారు. దీంతో గాజాస్ట్రిప్‌లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలను ఇకపై ఎవరు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వార్ కేబినెట్ నిర్వీర్యానికి అసలుకారణమని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకోవడంతో ఇజ్రాయెల్‌లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటా నిలిచాయి. దేశంపై దాడి నేపథ్యంలో రాజకీయపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటుతూ ప్రభుత్వానికి మద్దతుపలుకుతూ నెతన్యాహూ ఏర్పాటుచేసిన వార్ కేబినెట్లో సభ్యులుగా నెతన్యాహూకు బద్దశత్రువులైన విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు చేరారు. గాంట్జ్, నెతన్యాహూ, రక్షణ మంత్రి మొఆవ్ గాలంట్‌లు వార్ కేబినెట్లో కీలక సభ్యులుగా ఉండేవారు. అయితే ఇటీవలి కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌరనష్టంలేని సైనిక చర్యకే మొగ్గుచూపింది. బందీలను విడిపించడంపై దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యమన్నట్లు ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు నెతన్యాహూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు నెతన్యాహూ ససేమిరా అనడంతో యుద్ధరీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు కేబినెట్ నుంచి వైదొలిగారు. -
నెతన్యాహు సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ రద్దు
జెరూసలెం: హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంత కాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్, గాడీ ఐసెన్‌కోట్ వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులకు దిగింది. హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్ క్యాబినెట్ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం. -
పదవులపై ఉత్కంఠ.. ఎవరికి ఏ శాఖలు ?
-
తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు వెంటనే అమలులోకి తెచ్చింది. నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ.. పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు. #WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x— ANI (@ANI) June 13, 2024 -
సీనియర్లకు నిరాశే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్‌కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. గంటా, అయ్యన్నకు దక్కని పదవులు ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపర్ సీనియర్లయిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యన్నారాయణమూర్తిని పక్కనపెట్టి జూనియర్ అయిన వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్, మరో నేత సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి దక్కగా కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్లకు మొండిచేయి చూపారు. తూర్పులో జనసేనకు ప్రాధాన్యం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. ఆ జిల్లా నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్‌కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. ఈ జిల్లకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చి మంత్రి అయిన పార్ధసారథి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య వంటి వారికి కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచిన కె. పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబుకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ అవకాశం రాలేదు. సీమలో సీనియర్లకు మొండి చేయి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరిక్కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశించగా, మండిపల్లి రామప్రసాద్రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి మొండిచేయి చూపారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు. సుజనా చౌదరికి ఎదురు దెబ్బ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోని ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన్ని వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఉత్తరాంధ్రకు తగ్గిన ప్రాధాన్యం మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి నాలుగు పదవులే దక్కాయి. ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక్కరికే అవకాశం రాగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఇద్దరికి అవకాశం లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు లభించాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెండేసి చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. జనసేనకు మూడే జనసేన తరఫున నలుగురైదుగురికి మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ మూడు మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులపర్తి రామాంజనేయులు అసంతృప్తిలో ఉన్నారు. -
రుణమాఫీపై వారంలో కేబినెట్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై చర్చించేందుకు, విధివిధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీకి సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి.. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలిస్తున్నారు. కటాఫ్ తేదీ ఏది? మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి, అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు. కేంద్రం మాదిరి ఉద్యోగులు, డాక్టర్లు తదితరులకు మినహాయింపు? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్టులు లాంటి ప్రొఫెషనల్స్‌ను ఈ పథకం నుంచి మినహాయించింది. పీఎం కిసాన్ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలు అసలైన రైతులకు లబ్ధి చేకూర్చాయనే అభిప్రాయం ఉంది. ఈ మేరకు రుణమాఫీ అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా ఎలాంటి విధివిధానాలుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు కేబినెట్లో ట్విస్ట్..
-
జనసేనకు 5 మంత్రి పదవులు దక్కేదెవరికి..?
-
చంద్రబాబు మంత్రివర్గం రేసులో బీజేపీ నేతలు
-
భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు
-
విధేయతకు పెద్దపీట!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. జి.కిషన్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితుల య్యారు. ఇందులో కిషన్‌రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా.. సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు. ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినవారే. మోదీ మూడో కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో పట్టుసాధించడంతో..2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్‌రెడ్డి, సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వ ర్‌రెడ్డి, గోడెం నగేశ్ రెండోసారి ఎంపీలుగా గెలవగా.. డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.\కేంద్ర కేబినెట్లో చోటు కోసం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్. డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తే చేసింది. పార్టీకి ముందు నుంచీ విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్‌రెడ్డి, సంజయ్‌ల కృషి దోహదపడటాన్ని పరిగణనలోకి తీసుకుంది.అనుభవం, సీనియారిటీతో..కిషన్‌రెడ్డి నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. గత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉ న్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలసివచ్చి కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది.దూకుడుగా పార్టీ బలోపేతంతో..2019లో కరీంనగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా నియామకమైన తర్వాత దూకుడుగా వ్యవహ రించారు. అప్పట్లో అధికార బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్ షాలతో శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికితోడు తొలి నుంచీ ఆర్ఎస్ఎస్లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్‌కు కలసివచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.ఏపీ నుంచి ముగ్గురికి..ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడు, తొలిసారి గెలిచిన పెమ్మ సాని ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 1991 నుంచీ పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియారిటీ, విధేయతను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం.ఉదయం ఫోన్లు.. మధ్యాహ్నం తేనీటి విందు..ఆదివారం ఉదయం పది గంటల నుంచే మంత్రులుగా ఎంపికైన ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచే అందుబాటులో ఉండాలని ఆ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో భేటీకి రావాలని సూచించారు. దీంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ఎంపికైన అందరినీ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అభినందించారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రధాని తేనీటి విందు ఇచ్చారు. తర్వాత పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా పనిచేయాలని, 100 రోజుల ఎజెండాను అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత అంతా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.హిందీలో ప్రమాణ స్వీకారంకేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ హిందీలో ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజ రైన కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపె ట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. -
కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
సాక్షి, విజయవాడ: కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఒక సీనియర్, ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఛాన్స్ లభించింది. ఒక బీసీ, ఇద్దరు ఓసీలకు కేబినెట్లో స్థానం లభించింది. కేంద్ర కేబినెట్లో కింజరాపు రామ్మోహన్నాయుడికి స్థానం దక్కగా.. మూడు సార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్ పదవిని రామ్మోహన్ దక్కించుకున్నారు.టీడీపీలో రెండో మంత్రి పదవిని పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి, ఎంపీ సీటును పెమ్మసాని దక్కించుకున్నారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి ఎంపీగా శ్రీనివాస వర్మ ఎన్నికయ్యారు. పురందేశ్వరి, సీఎం రమేష్‌లకు తొలి కేబినెట్లో అవకాశం దక్కలేదు. క్షత్రియ, కమ్మ, కొప్పుల వెలమ సామాజికవర్గాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.శ్రీనివాస్ వర్మ ప్రొఫైల్..క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు నాలుగున భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఈయన విద్యాపరంగా డబుల్ ఎంఏ చేయడంతో పాటుగా ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1991లో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస్ వర్మ 95 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్‌గా, 95 నుండి 97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్‌గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా.. 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్‌గా, 2001 నుండి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా, 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు. 2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుండి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా, ప్యానల్ చైర్మన్‌గా, డీఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీగా, భూపతి రాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్‌గా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్‌కు గౌరవ ప్రెసిడెంట్‌గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలందించారు. -
మోదీ నూతన క్యాబినెట్లో అనుప్రియ పటేల్
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్ ఎవరు?అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్‌పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు
సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్ జాదవ్‌లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.మంత్రి మండలిలో కిషన్‌రెడ్డి , బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
సెంట్రల్ కాబినెట్ లో చోటు ఎవ్వరికీ..!
-
కేంద్ర కేబినెట్ కూర్పు.. ఏపీకి ఎన్ని?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.టీడీపీకి రెండు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్‌తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. -
మంత్రి పదవులపై మొదలైన చర్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 80 రోజుల ప్రహసనం పూర్తయ్యి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడంతా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కొలువు దీరడమే మిగిలి ఉంది. దీంతో అందరి దృష్టి జిల్లాలో ఎవరెవరికీ మంత్రి యోగం దక్కుతుందో అన్నదానిపైనే పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ కోసం ఎవరికి వారే ఆశలు పెట్టుకుంటున్నారు. వారిలో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్లే చర్చకు వస్తున్నాయి. ఇక, ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల కేంద్ర క్యాబినెట్లో కూడా టీడీపీలో కొందరికీ మంత్రి పదవులు దక్కుతాయి. ఆ అవకాశం హ్యాట్రిక్ విక్టరీ సాధించిన కింజరాపు రామ్మోహన్నాయుడికి వస్తుందన్న ఆశలు భారీగానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చింది. మే 13న పోలింగ్ జరిగింది. ఈ నెల 4వ తేదీన లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో కూట మి విజయబావుటా ఎగురవేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం, దాని విధి వి«ధానాల మేరకు పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి మంత్రులెవరు అవుతారన్న దానిపైనే పడింది. జిల్లాలో హ్యాట్రిక్ విక్టరీతో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు, వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాళం అశోక్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు. కాళింగ కోటాలో కూనకు దక్కే అవకాశం జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా? కాళింగ సామాజిక వర్గానికా? అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండు సార్లు గెలిచి, గతంలో పార్టీ విప్‌గా పనిచేసి, ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మూడు సార్లు గెలిచారని పరిగణనలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ, టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్‌కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు. వెలమ సామాజిక వర్గానికిస్తే కాళింగులకు అనాయ్యం చేశారని, కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియరైన కింజరాపు అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని, అన్యాయం చేశారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుంది. లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్ ఇచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. ఈ సమయంలో అటు కాపుల నుంచి, ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి గాని మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు. జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. ఇక, గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ’అచ్చెన్నకే పెద్దపీట.. సామాజిక వర్గాల వారీగా చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కాళింగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే స్థాయిలో జిల్లాలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక, సీనియర్ల కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె శిరీషను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన తొలుత వెలమ సామాజిక వర్గాన్నే తీసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కింజరాపు అచ్చెన్నాయుడిది. గతంలో మంత్రిగా పనిచేయగా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక, రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన బగ్గు రమణమూర్తికి మంత్రి పదవి ఇచ్చేంత ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్‌కు అదే గొప్ప పదవిగా భావించాలే తప్ప మంత్రి పదవి ఆశించేంత పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడికే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటే తప్ప ఆయనకు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎంపీ రామ్మోహన్ తెరపైకి వస్తే...ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడం, ఆ పార్టీ నుంచి గెలిచిన హ్యాట్రిక్ ఎంపీగా కింజరాపు రామ్మోహన్నాయుడు నిలవడం, చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో కేంద్ర కేబినెట్లో చోటు కలి్పస్తారేమోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. దివంగత కింజరాపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రామ్మోహన్నాయుడు వరుసగా విజయం సాధించడమే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే అప్పుడు జిల్లా సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. ఇటు రాష్ట్రమంత్రిగా బాబాయ్ అచ్చెన్నాయుడికి, అటు కేంద్రమంత్రిగా అబ్బాయ్ రామ్మోహన్నాయుడికి చోటు కల్పిస్తే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ అగ్రతాంబూలం ఇస్తారా? అన్న సామాజిక వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికే ఇవ్వాలనుకుంటే రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. కాదనుకుంటే కేంద్ర కేబినెట్లో రామ్మోహన్‌కు చోటు కలి్పంచాలి. ఈ సమయంలో బాబాయ్, అబ్బాయ్లో ఒకరికి మొండి చేయి తప్పదు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏమవుతుందో, ఎవరికి యోగం దక్కుతుందో చూడాలి. -
కేంద్ర కేబినెట్లో ఇద్దరికి చాన్స్?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి తెలంగాణకు రెండు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు పార్టీలో అంతర్గత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలిసింది. పార్టీలో సీనియారిటీ, విధేయత, కులాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఒక రెడ్డి, మరొక బీసీ సామా జికవర్గ నేతకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇదివరకే కేబినెట్ మంత్రిగా పనిచేసిన జి.కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ పోటీలో ఉండే అవకాశం ఉంది. అయితే కిషన్‌రెడ్డినే మరోమారు కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన్ను పార్టీ అధ్యక్షు డిగా కొనసాగించాలని నిర్ణయిస్తే అరుణకు అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మ పురి అరవింద్, ఈటల రాజేందర్లలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇందులో వరుసగా రెండోసారి గెలిచిన బండికే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. మోదీ పట్ల ఉన్న విధేయత, 2 లక్షలకుపైగా మెజారిటీ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఆయనకు సంఘ్ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందనే వాదన ఉంది. ఇక సీనియర్ నేతగా ఈటలకు సైతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా, తొలిసారి ఎంపీగా ఎన్నికవడం, పార్టీలో చేరి ఎక్కువకాలం కాకపోవడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. కేబినెట్లో తీసుకునే వారి పేర్లపై గురువారం లేక శుక్రవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఉంటుంది. అంతకుముందే మంత్రి పదవులపై స్పష్టత రావొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల కమిషన్(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఉత్సవాలకు కాంగగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్ నిర్ణయించింది.అమ్మ ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. -
కాళేశ్వరంపై కమిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అధ్యక్షతన జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జస్టిస్ చంద్రఘోష్ గతంలో లోక్‌పాల్‌గా, ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై విచారణకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన మరో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. నివేదికల సమర్పణకు గాను రెండు కమిషన్లకు 100 రోజుల గడువు విధించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 2 గంటలకు పైగా సమావేశమైన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. కొత్త రేషన్‌కార్డులు, తొలివిడతలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా సెంటర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణ: పొంగులేటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపైనా, ఎవరి ఒత్తిడితో ప్రాజెక్టును అలా కట్టారో అనే అంశంపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతుందని పొంగులేటి తెలిపారు. టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ల విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి నేరుగా 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఆ విద్యుత్‌ను వాడుకోలేదని మంత్రి ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుమ్మక్కై గత ప్రభుత్వం దళారులకు చేసిన చెల్లింపులపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక గత 10 ఏళ్లలో ఇతర రంగాల్లో జరిగిన అవినీతికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడంపై మంత్రివర్గంలో చర్చించామని తెలిపారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున రూ.22,500 కోట్లతో మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్ల స్థలం కలిగిన పేదలు, నిరుపేదలకు దీనిని వర్తింపజేస్తారు. గ్రామాల వారీగా గ్రామసభలు ఏర్పాటు చేసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, పింక్ షర్ట్ వారు అని చూడకుండా, పైరవీలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేస్తామని పొంగులేటి తెలిపారు. త్వరలో 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు ప్రస్తుత ప్రభుత్వం మహిళలను కోటీశ్వరుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి వీలుగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు కోసం అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఇక్కడి స్థలాన్ని జిల్లాల వారీగా మహిళా గ్రూపులకు కేటాయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిల్లో విశాలమైన మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 84 శాతం రైతులకు రైతుబంధు ఇచ్చిందని, వచ్చే 2 రోజుల్లో 93 శాతానికి పైగా రైతులకు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు. త్వరలో కొత్త రేషన్‌కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదలందరికీ కొత్తగా తెల్ల రేషన్‌కార్డులు జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డులుంటేనే ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే భావన ప్రజల్లో ఉందని, ఈ నేపథ్యంలో రేషన్‌కార్డుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని విడదీసి అమలు చేయాలని భావిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. దీనిపై నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించామన్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు లైన్‌క్లియర్ 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మినిమమ్ పే స్కేల్ (టైమ్ పేస్కేల్) ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి అభ్యర్థులు తమకు అనుకూలంగా తీర్పులు తీసుకువచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాగా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు. గత సెపె్టంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు పడక రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోయాయని పేర్కొన్నారు. కొత్తగా 16 కార్పొరేషన్లు మహిళల సాధికారత కోసం ‘తెలంగాణ మహిళా శక్తి’ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఓబీసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీల కోసం మొత్తం 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 1.యాదవ (కుర్మ), 2.మున్నురుకాపు, 3.పద్మశాలి, 4.పెరిక (పురగిరి క్షత్రియ), 5.లింగాయత్, 6.బలిజ, 7.గంగపుత్ర, 8.మేరా, 9.ముదిరాజ్ కార్పొరేషన్, 10.ఆర్య వైశ్య, 11.రెడ్డి కార్పొరేషన్, 12.మాదిగ, మాదిగ ఉపకులాలు, 13.మాల/మాల ఉపకులాలు, 14.కుమురం భీమ్ ఆదివాసి, 15. సంత్ సేవాలాల్ లంబాడి, 16.ఎరుకలు, ఇతర ఉపకులాల కోసం ఏకలవ్య.. కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు: పొన్నం కులగణన నిర్వహణకు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన సాంకేతికత జోడించడం కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించి రూ.ఒక్క కోటి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తాము కొత్త కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని, త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా వర్గాల వారితో సంప్రదింపులు జరిపి రెండు మూడు వారాల్లో కార్పొరేషన్లకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తారని శ్రీధర్‌బాబు తెలిపారు. గీత కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు త్వరలో రక్షణ పరికరాలను అందజేస్తామని, వాటితో చెట్లను ఎక్కితే కిందపడే ప్రమాదం ఉండదని, మరణాలూ ఉండవని పొన్నం చెప్పారు. బీఆర్ఎస్ ఖాళీ అయింది: కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరం కలిసి బృందంగా పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కేసీఆర్ ఈ రోజు మహిళలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, జెడ్పీ/మున్సిపల్ చైర్మన్లు, కింది స్థాయి నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, మరో పార్టీలో చేరుతున్నారని చెప్పారు. -
ఏఐ కోసం రూ. వేలకోట్లు.. కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం నేడు (గురువారం) రూ. 10371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో జాతీయ-స్థాయి 'ఇండియాఏఐ' (IndiaAI) మిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం ఏఐలో దూసుకువెళ్తున్న సమయంలో మన దేశం కూడా ఈ రంగంలో తప్పకుండా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ప్రస్తావించారు. నేడు దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనే విజన్‌తో మన దేశంలో కూడా టెక్నాలజీ పెరగాలని క్యాబినెట్ భారీ బడ్జెస్ట్ ప్రకటించింది. ఇండియాఏఐ మిషన్ సామాజిక ప్రయోజనం కోసం విప్లవాత్మక సాంకేతికత అనువర్తనాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి సహాయపడుతుంది. భారత్ ప్రపంచంలో పోటీ పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
TS HC: కొట్టేసే అధికారం గవర్నర్ కు లేదు
-
మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
సాక్షి, తాడేపల్లి: పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారాయన. ఇదిలా ఉంటే.. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జయరాం ఇచ్చే డబ్బు కు ఆశ పడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్లు టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. ఊరేదైనా మారని తీరు -
AP: కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,తాడేపల్లి: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024–25 ఆర్ధిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడంతో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ హార్టీకల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది. దీంతో పాటు డోన్‌లో వ్యవసాయం రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీ పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు కేబినెట్ అనుమతిచ్చింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి.. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ : బుగ్గన -
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
-
22 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
-
Visakhapatnam: 76 కిమీ.. రూ.14వేల కోట్లు..
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్‌మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. 76.90 కి.మీ. మేర ప్రాజెక్టు.. విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్‌మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు. ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్‌లో తెలిపారు. 17న కేంద్రానికి డీపీఆర్ ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించినందున లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్‌కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
Rajasthan: మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే 8 కీలక శాఖలు
జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. తన కేబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కీలక ఎనిమిది శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. వీటిలో హోం, ఎక్సైజ్, అవినీతి నిరోధక శాఖ, కార్మిక, గృహశాఖలు ఉన్నాయి. కీలక ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం దియా కుమారికి కేటాయించారు. విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే అయిన ఆమె పర్యాటకం, కళలు సాహిత్యం సాంస్కృతిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమశాఖ వంటి మరో అయిదు విభాగాల బాధ్యతలను స్వీకరించారు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైరవాకు టెక్నికల్- ఉన్నత విద్య, రవాణా శాఖను కేటాయించారు. ఇతర క్యాబినెట్ మంత్రుల్లో కిరోడి లాల్ మీనాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలు, గజేంద్ర సింగ్ ఖిమ్సర్కు వైద్యారోగ్యం, రాజ్యవర్ధన్ రాథోడ్‌కు పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్.. మదన్ దిలావర్ పాఠశాల విద్యను కేటాయించారు. అయితే మంత్రులకు శాఖలను కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత బాధ్యతలను అప్పజెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. కాగా గత నవంబర్‌లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 15న రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. గతవారం (డిసెంబర్ 30) గవర్నర్ కల్రాజ్ మిశ్రా సమక్షంలో రాజ్‌భవన్‌లో 22 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా ఎన్నికైన వారు ఉన్నారు. వీరందరికీ నేడు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు జరిగింది. చదవండి: ఢిల్లీ: కన్నీరు పెట్టుకున్న స్వాతి మలివాల్ -
షేక్ సాన్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన కేబినెట్
-
సామాజిక ‘కూర్పు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన కేబినెట్‌ను సామాజిక కోణంలో ఏర్చికూర్చినట్టు స్పష్టమవు తోంది. సీనియార్టీ ప్రాతిపదికతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన నేతలతో తొలిదఫా మంత్రివర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. కొత్త కేబినెట్లో దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. కనీసం ఇద్దరికి ఈ హోదా వస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ రేవంత్‌రెడ్డితో పాటు సీఎం పదవి కోసం పోటీ పడిన భట్టికి మాత్రమే ఈ హోదా లభించడం గమనార్హం.ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో సీఎంతో కలిపి నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో అవకాశం లభించినట్టైంది. కొండా సురేఖ (పద్మశాలి), పొన్నం ప్రభాకర్ (గౌడ్) లను బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయగా, దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (బ్రాహ్మణ), తుమ్మల నాగేశ్వర రావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), ధనసరి అనసూయ (ఎస్టీ)లకు మంత్రిమండలిలో స్థానం లభించింది. మొత్తం మీద అగ్రవర్ణాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మొత్తం 12 మందితో తెలంగాణ మంత్రిమండలి కొలువు దీరడం విశేషం. కాగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోవడంతో తొలి దఫా కేబినెట్లో ఆ వర్గానికి స్థానం లభించలేదు. నాలుగు జిల్లాలకు నో.. జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు గాను 6 జిల్లాల నేతలకు మాత్రమే కేబి నెట్లో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నుంచి ముగ్గురు, నల్లగొండ నుంచి ఇద్దరు, మహ బూబ్ నగర్ నుంచి సీఎంతో కలిపి ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. హైదరా బాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందక పోవడంతో ఆ జిల్లాకు అవకాశం లభించలేదు. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలా బాద్ జిల్లాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి తొలి విడతలో అవకాశం ఇవ్వలేదు. కేబి నెట్లో మరో 17 మంది మంత్రులుగా ఉండే అవ కాశం ఉండగా ప్రస్తుతం 12 మంది ప్రమాణం చేశారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను వీలును బట్టి భర్తీ చేస్తారని, పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరేలోపు అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఫస్ట్ టైమర్స్ నలుగురు.. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మొదటిసారి మంత్రులయ్యారు. ఇక రేవంత్‌రెడ్డి కూడా ఇంతకుముందు మంత్రిగా పని చేయకుండానే ఏకంగా సీఎం కావడం గమనార్హం. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన ఆయన ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు మాత్రం నిర్వర్తించలేదు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, సీఎల్పీ నేత పదవుల్లో పనిచేశారు. ఒక్కసారి కూడా మంత్రి కాకుండానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పొంగులేటి, పొన్నం ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం కూడా తొలిసారే కావడం గమనార్హం. -
కాంగ్రెస్ సర్కారుకు సవాళ్లు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఏలుబడి మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముఖ్యమంత్రిని నిర్ణయించటం మొదలు మంత్రుల ఖరారు వరకూ కొనసాగే కాంగ్రెస్ మార్కు అనిశ్చితికి పెద్దగా తావు లేకుండానే అంతా పూర్తికావటం గమనించదగ్గది. మరో అయిదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలుండటం, తెలంగాణలో గరిష్ఠ స్థాయిలో సీట్లు రాబట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉండటం ఇందుకు కారణం కావొచ్చు. కేబినెట్ కూర్పులో రాజకీయ, పాలనానుభవం పుష్కలంగా వున్నవారితోపాటు కొత్త నెత్తురుకు కూడా చోటిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గతంలో కాంగ్రెస్ ఏలుబడిలో మంత్రులుగా పనిచేశారు. జూపల్లి టీఆర్ఎస్ కేబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్‌గా,కాంగ్రెస్ శాసనభా పక్ష నేతగా వ్యవహరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది ప్రత్యేక రికార్డు. ఆయన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దనసరి అనసూయ అలియాస్ సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం అమాత్యులుగా పరిపాలనకు కొత్త వారు. శాఖల కేటాయింపుపై ఊహాగానాలు వస్తున్నా అధికారిక ప్రకటనపై మాత్రం సస్పెన్స్ ప్రస్తు తానికి కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక తెలంగాణలో ఆ పార్టీకి కొంత ఊపూ ఉత్సాహం వచ్చిన సంగతి నిజమే అయినా... అది అధికారాన్ని అందుకునే స్థాయికి ఎదుగుతుందని మొదట్లో ఎవరికీ అంచనాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, పార్టీ శాసనసభ్యుల పైనా ప్రజానీకంలో గూడుకట్టుకున్న అసంతృప్తిని పసిగట్టడంలో పార్టీ సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం అయ్యారు. వివిధ స్థాయుల్లో అవినీతి, సర్కారీ కొలువుల భర్తీలో ప్రదర్శించిన అలసత్వం, పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, ధరణి పోర్టల్‌తో వచ్చిన సమస్యలు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చాయి. సీఎం ఎవరికీ అందుబాటులో వుండరన్న అభిప్రాయం ఏర్పడటం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసింది. వీటన్నిటి పర్యవసానంగా ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజానీకం ఎదురుచూసింది. దీన్ని అందిపుచ్చుకుంటున్నట్టే మొదట్లో కనబడిన భారతీయ జనతా పార్టీ స్వీయతప్పిదాల వల్ల క్రమేపీ వెనక్కిపోయింది. ఇది కూడా కాంగ్రెస్‌కు లాభించింది. ఇక ఆ పార్టీ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు గెలుపును సునాయాసం చేశాయి. రైతు భరోసా కింద ఏటా రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000, రైతులకు అయిదేళ్ల వ్యవధిలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇంటింటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, ప్రతి మహిళకూ నెలకు రూ. 2,500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 కే గ్యాస్ సిలెండర్, ఇంది రమ్మ ఇళ్ల పథకం కింద సొంతిల్లు లేనివారికి ఉచితంగా స్థలం, రూ. 5 లక్షల సాయం, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు, చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పెన్షన్, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా తదితర హామీలు కూడా సగటు ఓటరును బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫైలు పైనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. అయితే ఏటా రూ. 88,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ఈ పథకాల అమలుకు నిధులు సమకూర్చటం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఇవిగాక ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం రూ. 5 లక్షల కోట్ల రుణభారం ఉన్న తెలంగాణలో ఇదంతా కత్తిమీది సామే. ఎందుకంటే 2023–24 బడ్జెట్లో రాష్ట్ర ఆదాయాన్ని 2.16 లక్షల కోట్లుగా చూపారు. ఇక రెవెన్యూ వ్యయం రూ. 2.12 లక్షల కోట్లుంది. ఎఫ్ఆర్బీఎం చట్టం కింద రుణ పరిమితిని పెంచుకోవటానికి అనుమతించాలన్న బీఆర్ఎస్ సర్కారు వినతిని కేంద్రం తిరస్కరిస్తూ వచ్చింది. బహుశా అందువల్లే కావొచ్చు... తొలి కేబినెట్ భేటీలో అధిక భారం పడని రెండు గ్యారెంటీలు – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుచేయాలని నిర్ణయించారు. ఇవి రెండూ ఈ 9వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 64 కాగా, మిత్రపక్షం సీపీఐకి ఒక స్థానం వుంది. నిన్నటివరకూ పాలించిన బీఆర్ఎస్ 39 స్థానాలతో బలమైన ప్రతి పక్షంగా ఉంది. 8 స్థానాలు గెల్చుకున్న బీజేపీ, ఏడు స్థానాలున్న ఎంఐఎంలు సైతం పాలనా నిర్వహణను నిశితంగా గమనిస్తుంటాయి. వాగ్దానాల అమలులో విఫలమైతే నిలదీయటానికి విపక్షాలు సిద్ధంగా ఉంటాయి. బీఆర్ఎస్ ప్రాంతీయపార్టీ గనుక కేసీఆర్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగారు. పాలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సారథిగా రేవంత్‌కి పరిమితులు తప్పవు. రాజకీయాలపై ఆసక్తి, అనురక్తి మినహా మరే నేపథ్యమూ లేని రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎది గిన తీరు ఎన్నదగ్గది. విద్యార్థి దశలో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీతో, ఆ తర్వాత టీఆర్ఎస్తో, అటుపై తెలుగుదేశంతో ప్రయాణించిన రేవంత్ రెడ్డి 2017లో అనూహ్యంగా కాంగ్రెస్‌లో కొచ్చి స్వల్పవ్యవధిలోనే పీసీసీ అధ్యక్షుడు కాగలిగారు. ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఓటుకు కోట్లు కేసు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఇప్పటికీ ఉందంటున్న సాన్ని హిత్యం రేవంత్‌కు గుదిబండలే. వాటినుంచి ఎంత త్వరగా విముక్తులైతే అంత త్వరగా నవ తెలంగాణలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ సారథిగా ఆయన తనదైన ముద్ర వేయగలుగుతారు. -
కాంగ్రెస్ కేబినెట్ !..మంత్రివర్గంలో ఊహించని పేర్లు
-
29న రాష్ట్ర కేబినెట్ భేటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్టు తెలిసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 171(3), 171(5)లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యత కానీ ఆచరణాత్మక అనుభవం కానీ లేకపోవ డంతో వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తు న్నట్టు గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్ లేవనెత్తిన అంశాలకు సమాధా నమిస్తూ మళ్లీ వారి పేర్లనే సిఫారసు చేస్తూ... గవర్నర్ కోరిన వివరాలను పూర్తిగా తిరిగి పంపించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు సన్నద్ధతపై సైతం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించడానికి కొత్త పథకాలు, కార్యక్రమాల అమలుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిసింది. అయితే మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు. -
మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు. చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 2023లో తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన నాటి నుంచి కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర కేబినెట్లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు. -
భార్య పాకిస్తాన్ కేంద్ర మంత్రి.. భర్త తీవ్రవాది
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలికంగా కేబినెట్ విస్తరించారు. కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు కల్పించడం పాకిస్తాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మానవ వనరుల శాఖ మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ ను నియమించినట్లు తెలిపారు. మిశాల్ భర్త జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నెరసుడిగా నిర్ధారించగా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు. మిశాల్ హుస్సేన్ మాలిక్ తోపాటు ఆర్ధిక మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ షంషాద్ అఖ్తర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సర్ఫరాజ్ బుగాటి నియమితులయ్యారు. వీరితోపాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ఉన్నారు. పాక్ తాత్కాలిక ప్రధానికి ముఖ్య సలహాదారులుగా ఎయిర్ మార్షల్(ఆర్) ఫర్హాట్ హుస్సేన్ ఖాన్, ఆహద్ ఖాన్ చీమా, వకార్ మసూద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ మఫ్టీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మఫ్టీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ 1989, డిసెంబరు 8న కిడ్నాప్ కు గురవ్వగా ఆ కేసులో యాసిన్ మాలిక్ ను నిందితుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే యాసిన్ మాలిక్ స్థాపించిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను 2019లో అధికారికంగా నిషేధించింది పాకిస్తాన్. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస -
Telangana Cabinet Meeting: కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఆర్అండ్బీ, రవాణా, కార్మిక, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. వివిధ పనులు, కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది. వరద మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. సుమారు 50కిపైగా అంశాలపై సుదీర్ఘంగా 6 గంటల పాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సహచర మంత్రులతో కలసి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రవాణా, ఆర్థిక శాఖల మంత్రులు, ఆర్టీసీ చైర్మన్‌తోపాటు కార్మికుల నుంచి వచి్చన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. ఆరీ్టసీని కాపాడేందుకు, ప్రజారవాణాను విస్తృతం చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. వరద తక్షణ సాయంగా రూ.500 కోట్లు రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించిందని.. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర 10 జిల్లాల్లో ఆర్అండ్బీ/ పంచాయతీరాజ్ రోడ్లు, చెరువులు, కాల్వలు, పంట పొలాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆదేశించినట్టు వివరించారు. ఇక వివిధ జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు తరలించిన 27వేల మంది ముంపు బాధితులకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వరదల్లో మృతిచెందిన 40 మందికిపైగా వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదలతో పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు, ఇతర సమస్యలపై సమగ్రమైన నివేదిక అందించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించిందని.. రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు సూచించిందని వివరించారు. ఖమ్మం పొడవునా ప్రవహిస్తున్న మున్నేరువాగు వరద నుంచి పట్టణానికి రక్షణకోసం వరద గోడలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారి సేవలు భేష్.. వరద ముప్పును సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం ధైర్య సాహసాలతో విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ లైన్‌మన్, హెల్పర్‌తోపాటు ముందుచూపుతో 40మంది విద్యార్థులను కాపాడిన ఉపాధ్యాయుడు మీనయ్యను ఈ పంద్రాగస్టు సందర్భంగా సన్మానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వారి సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రస్తావించి కొనియాడారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అనాథల కోసం ప్రత్యేక పాలసీ రాష్ట్రంలోని అనాథ పిల్లలను ‘చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్’గా గుర్తిస్తూ.. వారి సంరక్షణ, ఆలనా పాలన చూసుకోవడానికి పకడ్బందీగా ‘అనాథ బాలల పాలసీ’ని రూపొందించాలని శిశుసంక్షేమ శాఖను కేబినెట్ ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు తల్లిదండ్రులుగా నిలుస్తుందని.. ఆశ్రయం క ల్పిం చి, ప్రయోజకులుగా మార్చి, వారికంటూ ఓ కుటుంబం ఉన్నట్టుగా సంరక్షిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలివీ.. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని కార్మిక శాఖను కేబినెట్ ఆదేశించింది. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్ర యం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కోరిన మేరకు 253 ఎకరాల భూమి ని సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది. బీదర్ తరహాలో ఇక్కడ విమానాశ్రయం నిర్వహించాలని, ఇకపై కుంటిసాకులు చెప్పవద్దని అథారిటీకి మంత్రి కేటీఆర్ సూచించారు. శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. ఇతర నగరాల తరహాలో హైదరాబాద్‌లోనూ రెండో ఎయిర్‌పోర్టు అవసరమని మంత్రివర్గం అభిప్రాయపడింది. పుణె, గోవాలలో రక్షణ రంగ విమానాశ్రయాలను పౌర విమానాశ్రయాలుగా విని యోగిస్తున్న తరహాలోనే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమానయాన సేవలకు వినియో గించాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రక్షణ, పౌరవిమానయాన శాఖలకు ప్రతిపాదనలు పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ వంటి కాపు అనుబంధ కులాల కోసం ‘సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ’ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం సాకారమైందని కేటీఆర్ చెప్పారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో హార్టికల్చర్ క ళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వరదల్లో చనిపోయినవారిలో రైతు బీమా ఉన్న వారికి రూ.5 లక్షల సొమ్ము ఆటోమెటిగ్గా వస్తుందని, మరో రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. -
బడి పిల్లలకు ‘టోఫెల్’ ట్రైనింగ్
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తూ ‘టోఫెల్’ పరీక్షలకు సిద్ధం చేయనుంది. ఈమేరకు పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి మండలానికి రెండు జూనియర్ కళాశాలలను నెలకొల్పనుంది. ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసమే కాగా మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో ఏర్పాటు కానుంది. ఈనెల 12న జగనన్న విద్యాకానుక (జేవీకే)తోపాటు 28వతేదీ నుంచి వారం రోజుల పాటు ‘అమ్మఒడి’ కార్యక్రమాల ద్వారా చదువుల ఆవశ్యకతను చాటి చెప్పాలని నిర్ణయించింది. పాఠశాలల్లో అమలయ్యే కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ప్రతి రెవెన్యూ డివిజనల్లో ఒక డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారిని నియమించనుంది. ఈమేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాల’ పేరుతో జూన్ 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా, 20న రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. 3 కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 పోస్టులు వచ్చే ఏడాది మరో మూడు కొత్త మెడికల్ కాలేజీలు (పులివెందుల, పాడేరు, ఆదోని) ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో కాలేజీకి 706 పోస్టుల చొప్పున 2,118 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో ఈ ఏడాదే తరగతులు ప్రారంభమవుతున్నాయి. 6 నుంచి 9 నెలల వ్యవధిలో అత్యంత వేగంగా పనులు చేపట్టి ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2019తో పోలిస్తే పీజీ సీట్ల సంఖ్య కూడా రెట్టింపైంది. ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిల్లో 41 మంది స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్యులను రెగ్యులర్ పద్ధతిలో నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది. ఉద్దానం ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దనున్నాం. పాఠశాల స్థాయి నుంచే ‘టోఫెల్’ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా టోఫెల్ పరీక్ష కోసం సన్నద్ధం చేయనుంది. ఈ పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. టోఫెల్ ప్రైమరీ (3–5 తరగతులు), టోఫెల్ జూనియర్ (6–10 తరగతులు) పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ టీచర్‌ను ప్రభుత్వం 3 రోజుల శిక్షణ కోసం అమెరికాకు పంపిస్తుంది. డెయిరీలను నాశనం చేసిన చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని మంత్రి వేణు మండిపడ్డారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డె యిరీ మూసి వేశారన్నారు. సీఎం జగన్ పాడి రైతు ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమూల్ ద్వారా మే లైన సేకరణ ధర లభించేలా చర్యలు చేపట్టారన్నా రు. ఏపీలో పాలఉత్పత్తి పెరిగిందన్నారు. పాడిరైతును ఆర్థికంగా బలోపేతం చేయ డమే లక్ష్యంగా 28.35 ఎకరాల చిత్తూరు డైరీ భూ ములను అమూల్‌కు 99 ఏళ్లు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలన్న పాడిరైతుల కల నెరవేరుతుందన్నారు. ఆమోదించిన ఇతర ప్రతిపాదనలు.. ► రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ అర్చకులు, ధర్మకర్తలకు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం. ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. దేవదాయ శాఖ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆక్రమణలు తొలగించేందుకు వీలుగా చట్ట సవరణ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం. ► చిత్తూరు జిల్లా సొదుంలో బీసీ బాలికల గురుకుల కళాశాలలో రెండు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ► నాడు–నేడు పనులు పూర్తైన 476 జూనియర్ కాలేజీల్లో వాచ్మెన్ల నియామకం. ► ఆధార్ గుర్తింపు కార్డు చట్టబద్ధత ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. ► 2017 బధిరులు ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్ డ్ డ బుల్స్‌లో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్ షేక్ జాఫ్రిన్ (కర్నూలు జిల్లా)ను సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 సర్వీసులో నియమిస్తూ జోన్ –4లో సూపర్ న్యూమరరీ పోస్టు మంజూరుకు ఆమోదం. ► నరసాపురం ఫిషరీస్ యూనివర్సిటీలో 65 పోస్టులు, ఫిషరీస్ సైన్స్ కాలేజీలో 75 పోస్టులు మంజూరు. విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో నూతనంగా అడోల్సెంట్ అండ్ చైల్డ్ సైకియాట్రి డిపార్ట్మెంట్ ఏర్పాటుతో పాటు చైల్డ్ సైకియాట్రి సూపర్ స్పెషాలిటీ యూనిట్లో 11 పోస్టులు, కడప మానసిక వైద్యశాలలో కొత్తగా 116 పోస్టులు మంజూరు. ► రాజానగరం అసెంబ్లీ పరిధిలో సీతానగరం పీహెచ్సీ ఇక సీహెచ్‌సీగా మార్పు. ► శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్ఎం పురం, చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి, రాజమ హేంద్రవరంలో ఏర్పాటు కానున్న నాలుగు ఐఆర్ బెటాలియన్లలో ఒక్కో చోట 980 చొప్పున మొత్తం 3,920 పోస్టుల మంజూరు. ► గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీకి కేబినెట్ ఆమోదం. ఏడాదికి 0.5 మిలియన్ టన్నుల హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల అమ్మోనియాను వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి చేయడం లక్ష్యం.ఈ పరిశ్రమల స్థాపనతో దాదాపు 12 వేల ఉద్యోగాల కల్పన ► అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రూ.1800 కోట్లతో 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న రెన్యూ వోయేమాన్ పవర్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సెక్షన్ 5 (రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేస్తూ ) సవరణ ప్రతిపాదనకు ఆమోదం. ► గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. ► వైఎస్సార్ జిల్లా సీ.కె.దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్‌లో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమి కడప జిల్లా బెస్త సంఘానికి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం. అనంతపురం జిల్లా పాలసముద్రంలో గతంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్థకు కేటాయించిన 10 ఎకరాల భూమి అదే ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయకు కేటాయింపు. ► నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో 40 సెంట్లు, రావూరులోని 9.46 ఎకరాల ప్రభు త్వ స్థలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయింపు. ► ఏర్పేడు మండలం వికృతిమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు కేటాయింపు. ► డిజిటల్ లైబ్రరీలు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు, పీహెచ్‌సీలకు హైబ్యాండ్ విడ్త్‌తో 5జీ సేవలు అందించేందుకు వీలుగా ఏపీఎస్ఎఫ్ఎల్ రూ.445.7 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం. ► ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవను అభినందించిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఒడిశా ప్రభుత్వం. సీఎం జగన్ సూచనలతో 50 అంబులెన్సుల తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలను హర్షిస్తూ ఆమోదించిన మంత్రివర్గం. a -
ఉద్యోగికి ‘గ్యారెంటీ’ భరోసా.. సీపీఎస్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా జీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత, కాంట్రాక్టు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను రూపొందించింది. దీనిద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరనుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కరువు భృతి (డీఆర్) ఇవ్వడం ద్వారా మెరుగైన పెన్షన్‌ను అందించనుంది. దీంతోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి కీలక అంశాలకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాట ప్రకారం సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రతనిచ్చేలా రూపొందించిన జీపీఎస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగుల జీతాలను దాటేస్తుంది.. సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ఆ తర్వాత ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను తీసుకొచ్చాం. సీపీఎస్‌తో అనిశ్చితి.. ప్రస్తుత సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండటం లేదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు. జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా.. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుంది. ఇందులోనూ సీపీఎస్‌లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తుంది. ఉదాహరణకు రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా రూ.1,10,000 పెన్షన్‌గా తీసుకుంటారు. తద్వారా రిటైర్డ్ ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటు లేదు. దేశానికే ఆదర్శంగా జీపీఎస్ దేశంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమల్లోకి తీసుకురాలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్‌ను తీసుకొస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. మాట ఇచ్చి.. నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కటాఫ్ తేదీకి 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే సీఎం జగన్ ఐదేళ్లకు తగ్గించారు. దీంతో మేనిఫెస్టో హామీల్లో 99.50 శాతం అమలు చేసినట్లైంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఒకేలా హెచ్ఆర్ఏ ఉండేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా కొన్ని జిల్లా కేంద్రాల్లో 12 «శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ 16 శాతానికి పెరుగుతుంది. 2022 జనవరి 1వతేదీ నుంచి డీఏ, డీఆర్ 2.73 శాతం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. 6,840 కొత్త పోస్టుల మంజూరు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. వీటిల్లో 3,920 రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు సహా నూతన వైద్య కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున కొత్త పోస్టులను కల్పించింది. ప్రభుత్వంలోకి వైద్య విధాన పరిషత్ ఏపీ వైద్య విధాన పరిషత్ 1986 యాక్ట్‌ను రద్దు చేసి ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ శాఖగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ స్వయం ప్రతిపత్తి నుంచి ప్రభుత్వంలోకి మారడం ద్వారా 14,658 మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలను చెల్లించనుంది. -
AP: మెరుగైన పెన్షన్..?.. ముఖ్యమంత్రి మదిలో ఆలోచన..
సాక్షి, అమరావతి: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సీపీఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం ప్రతిపాదనలు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీపీఎస్ ఫండ్ గణాంకాల ప్రకారం చూస్తే ఉద్యోగి ఆఖరి నెల మూల వేతనంలో గరిష్టంగా 20 శాతం మాత్రమే పెన్షన్‌గా వస్తుందని శాస్త్రీయ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అది కూడా స్థిరంగా ఉండి పెన్షనర్ జీవితకాలంలో పెరగదు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 33 శాతం పెన్షన్ గ్యారంటీ కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల జీవన వ్యయం అధికమై పెన్షనర్లు ఇబ్బందులు పడతారని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలన్న ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు ఓపీఎస్ విధానంలో మాదిరిగానే మెరుగైన గ్యారంటీ పెన్షన్ విధానంలో ధరల పెరుగుదల నుంచి పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఏటా 3 శాతం పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగినప్పుడు ఏటా 3 శాతం పెంపు కేవలం కంటితుడుపులా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు సమాచారం. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలన్న ఆలోచనకు అనుగుణంగా లేదని పేర్కొంటూ ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా ఓపీఎస్‌కు దాదాపు సమానంగా పెన్షన్ విధానం ఉండాలని ముఖ్యమంత్రి జగన్ కీలక సూచన చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏటా పెరుగుదల 3 శాతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి పెంచే డీఏ పాయింట్ల ఆధారంగా రాష్ట్రంలో ఉద్యోగులకు కరువుభత్యం(డీఏ), పెన్షనర్లకు కరువుభృతి(డీఆర్) పెంచుతున్న మాదిరే ఈ పెన్షన్ విధానంలోనూ పెన్షనర్లకు డీఆర్ పెంచడం శాస్త్రీయంగా ఉంటుందని సీఎం సూచించినట్లు సమాచారం. ఈ విధానాన్ని అమలు చేస్తే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరి ధరల పెరుగుదల నుంచి వారికి ఉపశమనం కలుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. ఓపీఎస్‌కు దాదాపు సమానమైన పెన్షన్ అందుకొనే విధానం ఉండాలని, మనం తెస్తున్న పెన్షన్ విధానం సీపీఎస్ ఉద్యోగులను సంతృప్తిపరచాలని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పినట్లు సమాచారం. గ్యారంటీ పెన్షన్‌ను 33 శాతం నుంచి ఓపీఎస్ మాదిరిగా 50 శాతానికి పెంచాలని కూడా ముఖ్యమంత్రి భావించారు, అలా చేస్తేనే సీపీఎస్ ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరుతుందని, ఓపీఎస్‌కు దాదాపు సమానమైన విధానం రూపకల్పన చేసినట్లవుతుందని సూచించారు. పీఆర్సీ మినహా అన్ని ప్రయోజనాలు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు మళ్లీ సవరించి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)లో మాదిరే ఉద్యోగులకు ఆఖరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్‌గా నిర్ధారించడంతో పాటు ఓపీఎస్ విధానంలో పెన్షనర్లకు పెంచినట్లే డీఆర్ కూడా పెంచేలా మెరుగైన పెన్షన్ విధానాన్ని రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రివర్గం ఆమోదం తెలిపితే ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు అనుగుణంగా సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌తో దాదాపు సమానమైన మెరుగైన పెన్షన్ విధానం అమల్లోకి వస్తుంది. పీఆర్సీ ప్రయోజనాలు మినహా ఓపీఎస్లోని మిగతా ప్రయోజనాలన్నీ ముఖ్యమంత్రి జగన్ సూచించిన తాజా పెన్షన్ విధానంలో ఉంటాయి. ప్రజల సరాసరి జీవితకాలం పెరిగిన నేపథ్యంలో ఏటా కనీసం 5 శాతం డీఆర్ పెరుగుతుందనుకున్నా 20 ఏళ్లలో పెన్షన్ రెట్టింపవుతుంది. సీపీఎస్‌లో చెల్లిస్తున్న మాదిరే 10 శాతం ఉద్యోగులు చెల్లిస్తే చాలు. ఉద్యోగులు నష్టపోకుండా ఇది మెరుగైన విధానం అవుతుంది. ఓపీఎస్ వల్ల ప్రతికూలతలు ఇవీ.. ► సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్ తీసుకురావడానికి ఆర్థిక పరిస్థితి సహకరించదు. ► ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇవ్వాల్సిన పెన్షన్లు మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. ► 2040 నాటికి బడ్జెట్ నుంచి పెన్షన్ల కోసం చేయాల్సిన వ్యయం రూ.60,706 కోట్లకు చేరుకుంటుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ఏడాదిలో బడ్జెట్ నుంచి చేసే ఖర్చు రూ.1,85,172 కోట్లకు చేరుతుంది. అంటే రాష్ట్ర సొంత రాబడిలో ప్రతినెలా తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం 181 శాతానికి చేరుకుంటుంది. మరో పదేళ్ల తర్వాత అంటే 2050 నాటికి ఇది 197 శాతానికి చేరుకుంటుంది. ► ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్లీ చాలీచాలని పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సి వస్తుంది. అలా జరిగితే ఈ రోజుల్లో ఉన్న వడ్డీరేట్లుకూడా అప్పుడు ఉండవు. దీనివల్ల తగ్గిన వడ్డీరేట్లకు అనుగుణంగా సీపీఎస్ పెన్షన్ ఫండ్ నుంచి వచ్చే పెన్షన్లు కూడా తగ్గుతాయి. ఇది ఉద్యోగులకు, ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడున్న సీపీఎస్తోనూ భరోసా లేదు: ► ఓపీఎస్ బదులుగా ఇప్పుడున్న సీపీఎస్తోనూ భరోసా లేదన్నది వాస్తవం. ► దశాబ్దానికీ, దశాబ్దానికీ తగ్గిపోతున్న బ్యాంకుల వడ్డీరేట్లు నేపథ్యంలో ఇప్పుడు అందుతున్న సీపీఎస్కూడా భవిష్యత్తులో మరింత తగ్గే పరిస్థితులున్నాయన్నది వాస్తవం. ► 1980ల్లో 12–13 శాతం ఉన్న వడ్డీ రేట్లు ఇవాళ 5 – 6 శాతం కూడా దాటని పరిస్థితి. ► ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడు వస్తున్న పింఛన్లో 20 శాతం కూడా రాని పరిస్థితి. ► అంతేకాకుండా ఈ డబ్బు వివిధ ఫండ్స్‌లో, స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు రూపేణా ఉండడం వల్ల అవి ఒడిదుడుకులకు గురైనప్పుడల్లాం ఉద్యోగులకు అందే సీపీఎస్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ► రిటైర్డ్ ఉద్యోగికి కచ్చితంగా నెలకు ఇంత అందుతుందని చెప్పే పరిస్థితులు లేవు. మిగతా రాష్ట్రాలకూ అనుసరణీయం కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో ఓపీఎస్‌కు వెళుతున్నట్లు ప్రకటించినా వాస్తవంగా అది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రాల సొంత రాబడిలో పెన్షన్ల వ్యయం భారీగా పెరిగితే అప్పుడు మళ్లీ సీపీఎస్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ మెరుగైన పెన్షన్ విధానమే మిగతా రాష్ట్రాలకూ అనుసరణీయం. -
ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం..
ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీంతో రైతుల ధాన్యం పాడవకుండా, కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల తప్పించడానికి సులభమవుతుందని ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోదాంల ఏర్పాటుకు పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా గోదాంల ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరగనుందని తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో 700 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని పేర్కొంది. ప్రతి మండలంలో 2 వేల టన్నుల ధాన్యం నిలువచేసుకునేలా గోదాంలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 3,100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు ఠాకూర్ తెలిపారు. కానీ 1,450 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకునే వెసులుబాటు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదాంల ఏర్పాటుతో ధాన్యం నిలువచేసుకునే సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు చేరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ధాన్యం నిలువ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఇదీ చదవండి:Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి! -
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
అప్పుల్లేని ముఖ్యమంత్రి.. టాప్ 1లో నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆయన మంత్రి మండలి సభ్యుల ఆస్తుల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్ అందరి కంటే అధిక ధనవంతుడిగా స్పష్టమవుతోంది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్ ఆస్తులు స్వల్పంగా వృద్ధి చెందగా, రుణ భారం లేకపోవడం విశేషం. మంత్రి మండలిలో అత్యంత అల్ప ఆస్తిపరుడిగా గనులు – ఉక్కు శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడ ఆయన అందరి కంటే తక్కువ ఆస్తిపరుడుగా నిలిచారు. నవీన్ మంత్రి మండలిలో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2022లో ముఖ్యమంత్రి ఆస్తుల వృద్ధి విలువ రూ.42,86,069 పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఆయన ఆస్తుల విలువ రూ.65,40,79,694 కాగా, అంతకుముందు సంవత్సరం ఆస్తుల విలువ రూ.64.97 కోట్లకు పరిమితమైంది. అధికారిక పోర్టల్‌లోని ప్రకటన ప్రకారం, వివిధ బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో డిపాజిట్లు మరియు వివిధ బాండ్ల పరంగా నవీన్ పొదుపు (నగదు) ఆస్తుల విలువ రూ.42,86,069లు పెరిగింది. ముఖ్యమంత్రి చరాస్తుల విలువ రూ.12.52 కోట్లు. వీటిలో న్యూఢిల్లీ, భువనేశ్వర్, హింజిలికట్, బర్గడ్ బ్యాంకు ఖాతాల్లో నగదు, నగలు, నాలుగు చక్రాల వాహనం ఇమిడి ఉన్నాయి. బంగారు ఆభరణాల విలువ రూ. 3.49 లక్షలు కాగా, 1980 మోడల్‌కు చెందిన పాత అంబాసిడర్ కారు విలువ రూ.6,434గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి న్యూఢిల్లీలోని జన్‌పథ్ శాఖ బ్యాంకులో రూ.70.11 లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్ శాఖలో రూ.20.87 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రూ.52.88 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇవన్నీ అతని తల్లిదండ్రులు బిజు పట్నాయక్ మరియు జ్ఞాన్ పట్నాయక్ నుంచి సంక్రమించినవిగా పేర్కొన్నారు. ఈ స్థిరాస్తుల్లో భువనేశ్వర్‌లో నవీన్ నివాస్‌లో మూడింట రెండు వంతుల వాటా విలువ సుమారుగా రూ.9,52,46,190 కాగా, న్యూఢిల్లీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్–3లో ఉన్న ఆస్తిలో 50% వాటా విలువ దాదాపు రూ.43,36,18,000గా ప్రకటించారు. -
కేంద్ర కేబినెట్లో మార్పులు.. కిరణ్ రిజిజుకు షాకిచ్చిన మోదీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ను నియమించారు. కిరన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించారు. కాగా అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. చదవండి: Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కన్నుమూత -
త్వరలో స్టాలిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! ఆ మంత్రి ఔట్
తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ త్వరలో కేబినేట్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారని అధికారికి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఈ నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నందున మరో రెండు వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదీగాక రాష్ట్ర మంత్రివర్గంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% గరిష్టానికి చేరుకుంది. ఐతే దీనిలో ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వోచ్చని, కొందర్ని నిష్క్రమించమని కోరే అవకాశం ఉందని సమాచారం. పనితీరు సరిగా లేని కనీసం ఇద్దరు మంత్రులను రాజీనామా చేయమని చెప్పే అవకాశం ఉందంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుటంబంపై ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి త్యాగరాజన్‌పై వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు నేతలు. కాగా, గతవారమే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ ఆడియో ఫైళ్లను చౌక రాజకీయాలుగా కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయితే మంత్రివర్గ వ్యవస్థీకరణలో ఈసారి డీఎంకే ఎమ్మెల్యే టీరా్బీ రాజా, శంకరన్ కోవిల్ వంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
గ్యాస్ వినియోగదారులకు ఊరట..
సీఎన్జీ, వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం కేంద్రమంత్రి వర్గం తీసుకోబోతోంది. దేశంలో ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలపై పరిమితిని విధించడాన్ని కేంద్ర మంత్రివర్గం త్వరలో పరిశీలించే అవకాశం ఉందని తెలిసింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలను ప్రభుత్వం ద్వైవార్షికంగా అంటే ఏటా రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఈ సహజవాయువును వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీగా, వంట గ్యాస్‌గా, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, ఎరువుల తయారీకి వినియోగిస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. దేశంలో ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇదివరకే అందుబాటులో ఉన్న క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర అయితే ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు 8.57 డాలర్లు (రూ.705), సముద్ర గర్భంలో కొత్తగా కనుగొన్న కష్టతరమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్ అయితే 12.46 డాలర్లు (రూ.1,026)కు చేరింది. ఈ ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1న సవరించాల్సి ఉంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం లెగసీ ఫీల్డ్‌ల నుంచి వెలికితీసే గ్యాస్ ధరలు ప్రతి ఎంఎంబీటీయూకు 10.7 డాలర్లు (రూ.881)కు పెరుగుతాయని, కష్టతరమైన ఫీల్డ్‌ల నుంచి వచ్చే గ్యాస్ ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. సీఎన్జీ, వంట కోసం వినియోగించే పైప్డ్ గ్యాస్ రేట్లు ఇప్పటికే 70 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1న సవరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు వినియోగదారులు, అటు ఉత్పత్తిదారులు ఇద్దరి ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ గ్యాస్ ధరల సవరణను పరిశీలించడానికి కిరిట్ పారిఖ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గత సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మిగులు దేశాలలో గ్యాస్ ధరలను వాటి సహజవాయువు ధరను నిర్ణయించే ప్రస్తుత పద్ధతికి బదులుగా లెగసీ ఫీల్డ్‌ల నుంచి గ్యాస్ ఇండెక్సేషన్‌ను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలలో 10 శాతానికి మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. ఒక ఎంఎంబీటీయూకు కనిష్ట ధర 4 డాలర్లు (రూ.329), గరిష్ట ధర 6.50 డాలర్లు (రూ.535) ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లు ఉంది. దాని ప్రకారం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 7.5 డాలర్లు (రూ.617) ఉండాలి. కానీ పరిమితి అమలైతే గ్యాస్ ధర 6.5 డాలర్లు (రూ.535) మాత్రమే ఉంటుంది. కమిటీ సిఫార్సులపై మంత్రిత్వ శాఖల అంతర్గత సంప్రదింపులు ముగిశాయి. ఈ సిఫార్సులను కేబినెట్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గం దీనిని పరిశీలించే అవకాశం ఉంది. -
నదుల అనుసంధానానికి ప్రాధికార సంస్థ
సాక్షి, అమరావతి : నదుల అనుసంధానం పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ తరహాలో నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ (నిరా) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ నుంచి.. ప్రధాన పనులకు సంబంధించిన టెండర్లు, వాటి పర్యవేక్షణ వరకూ అన్ని బాధ్యతలను ఆ సంస్థే నిర్వహించనుంది. ఆయకట్టుకు నీళ్లందించే బ్రాంచ్ కెనాల్స్ (ఉప కాలువలు), డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువల) పనులను మాత్రమే రాష్ట్రాలకు అప్పగించాలని ప్రతిపాదించింది. అప్పుడే నదుల అనుసంధానం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిరాగా రూపాంతరం చెందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రాజెక్టుల కంటే అధికంగా.. జాతీయ ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 90% నిధులను కేంద్రం సమకూర్చేది. కానీ.. ఇటీవల ఆ వాటాను 60 శాతానికి తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. నదుల అనుసంధానం ప్రాజెక్టులకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుందని, మిగతా 10 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ) నుంచే ఈ మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేబీఎల్పీ మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. కేబీఎల్పీ అంచనా వ్యయం 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతా 10 శాతం ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ భరిస్తాయి. మిగతా నదుల అనుసంధాన ప్రాజెక్టులకూ ఇదే విధానం వర్తిస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది. నదుల అనుసంధానం వేగవంతం హిమాలయ, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా కడలి పాలవుతున్న జలాలను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎన్‌డబ్ల్యూడీఏ 30 అనుసంధాన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. కానీ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నిధుల కొరత, జల వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర సమస్యల వల్ల నదుల అనుసంధానం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవల కెన్–బెట్వా నదుల అనుసంధానానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా ‘నిరా’ను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం నుంచి పనులు చేపట్టడం వరకూ వేగవంతమయ్యే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సహకారోద్యమం బలోపేతం!
న్యూఢిల్లీ: దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీలు), పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 99,000 పీఏసీలు ఉండగా, 63,000 మాత్రమే చురుగ్గా ఉన్నాయి. 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీలు లేవు. 2 లక్షల గ్రామాల్లో పాడి–మత్స్య సహకార సంఘాల్లేవు. అక్కడ వాటిని, తీర గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో 2 లక్షల బహుళ ప్రయోజనకర పీఏసీలు, పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర సరిహద్దుల్లో ‘భవ్య గ్రామాలు’ దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్(వీవీపీ) పేరిట నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022–23 నుంచి 2025–26 దాకా మూడేళ్ల వ్యవధిలో రూ.4,800 కోట్లతో వీవీపీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకం. ఇందులో రూ.2,200 కోట్లను రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు. ఈ పథకంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వీవీపీ స్కీమ్‌తో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రం పాలిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేసింది. షింకున్ లా సొరంగం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి 4.1 కిలోమీటర్ల పొడవైన షింకున్ లా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిమూ–పదామ్–దార్చా రోడ్డు లింక్‌లో రూ.1,681 కోట్లతో ఈ సొరంగం నిర్మిస్తారు. 2025 డిసెంబర్ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్ధాఖ్‌కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని వివరించారు. దేశ భద్రతకు సైతం ఈ ప్రాజెక్టు చాలా కీలకమని చెప్పారు. శ్రీనగర్–కార్గిల్–లేహ్ టన్నెల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. -
రూపే కార్డుల ప్రోత్సాహానికి రూ. 2,600 కోట్ల స్కీం!
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువ చేసే భీమ్–యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర క్యాబినెట్ బుధవారం రూ. 2,600 కోట్ల స్కీముకు ఆమోదముద్ర వేసింది. దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించి జరిపే పాయింట్ ఆఫ్ సేల్స్, ఈ–కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను బ్యాంకులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనగా కేంద్రం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందివ్వనుంది. ఈ పథకం ద్వారా బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందాలని భావిస్తోంది. వినియోగదారులు వ్యాపారులకు తక్కువ విలువ గల పేమెంట్స్‌ను పోత్సహిస్తుంది. యూపీఐ లైట్, యూపీఐ123పే ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేస్తుంది. ఈ పథకంతో భారత్ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
కేరళ గవర్నర్‌కు బిగ్ షాక్.. ఛాన్సలర్‌గా తప్పిస్తూ ఆర్డినెన్స్?
తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి. యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
రిషీ కేబినెట్:హోం సెక్రటరీగా ఆమె రీఎంట్రీ
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రావెర్మన్ తిరిగి యూకే హోం సెక్రటరీగా నియమితులయ్యారు. బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కీలక క్యాబినెట్ నియామకాల్లో భాగంగా సుయెల్లా హోంమంత్రి పదవిని దక్కించు కున్నారు. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం కొత్త ఛాన్సలర్ జెరెమీ హంట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సునాక్ విధేయుడు కానప్పటికీ, జేమ్స్ క్లవర్లీని విదేశాంగ కార్యదర్శి పదవిలో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఇమ్మిగ్రేషన్ డ్రాఫ్ట్‌ను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించక ముందే అప్పటి హోం సెక్రటరీ సుయెల్లా బ్రావెర్మన్ ఈ పాలసీ డ్రాఫ్ట్‌ను వ్యక్తిగత మెయిల్ నుంచి పంపడం వివాదాన్ని రేపింది. ఈ వ్యవహారం సుయెల్లా రాజీనామాకు దారి తీసింది. ఈ సందర్భంగా అప్పటి ప్రభుత్వంపై సుయెల్లా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
బ్రిటన్ చరిత్రలో తొలిసారి.. కేబినెట్లో కీలక పదవులన్నీ వాళ్లకే..
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బుధవారం తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి విభిన్నమైన కేబినెట్‌ను ప్రకటించిన తర్వాత ఈ భేటీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక శాఖల బాధ్యతలను మైనార్టీ వర్గాలకే కేటాయించారు ట్రస్. దీంతో తొలిసారి శ్వేత జాతీయులు కీలక హోదాలో లేకుండా బ్రిటన్ కేబినెట్ ఏర్పాటు జరిగింది. రిషి సునాక్ టీంకు నో ఛాన్స్ అందరూ ఊహించినట్లుగానే ట్రస్ కేబినెట్లో భారత సంతతికి చెందిన, ప్రధాని పదవికి పోటీ పడిన రిషి సునాక్‌కు చోటు దక్కలేదు. ట్రస్ మంత్రివర్గంలో ఉండబోనని రిషి ముందుగానే చెప్పారు. అందుకు తగినట్లుగానే ట్రస్ ఆయనకు మొండిచేయి చూపారు. అంతేకాదు రిషికి మద్దతుగా నిలిచిన మాజీ మంత్రుల్లో ఏ ఒక్కరిని ట్రస్ తన కేబినెట్లోకి తీసుకోలేదు. దీంతో వారంతా ఏ పదవీ లేకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రస్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన సుయెళ్లా బ్రవర్మన్కు హోంమంత్రిగా అవకాశం దక్కింది. ఆగ్రాలో పుట్టిన మరో భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మకు కూడా చోటు లభించింది. భారత్, శ్రీలంక మూలాలున్న రణిల్ జయవర్దనాకు పర్యావరణ మంత్రిగా స్థానం దక్కింది. చదవండి: దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు.. -
బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??
రాంచీ: బీహార్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి.. తిరిగి పాత మిత్రులతో జత కట్టిన నితీశ్ కుమార్.. ఇప్పటికే కేబినెట్ కూర్పును ఓ కొలిక్కి తెచ్చారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే.. ఇక్కడ కూడా మహారాష్ట్ర తరహా పరిస్థితులే కనిపించబోతున్నాయా? అనే చర్చ జోరందుకుంది. బీహార్ సీఎం నితీశ్ ఇవాళ కేబినెట్‌ను విస్తరించబోతున్నారు. మొత్తం బీహార్ కేబినెట్లో 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ జేడీయూకు 16, నితీశ్ కుమార్ జేడీయూకు 12 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. కానీ, కీలకమైన విభాగాలు మాత్రం ఆర్జేడీ, ఇతరులకు తరలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోనూ బీజేపీ కీలకమైన శాఖలన్నీ ఉంచేసుకుని.. షిండే వర్గానికి మిగిలిన పోస్టులను మిగిల్చింది. గతంలో ఈ శాఖలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అనుభవించాయి. ఇప్పుడు.. బీహార్‌లోనూ మిత్రపక్షాల కోసం జేడీయూ అదే తరహా త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వి యాదవ్.. హోం లేదంటే ఆర్థిక శాఖను చేజిక్కించుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇంతకు ముందు హోం శాఖను నితీశ్ కుమారే స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అంతేకాదు తన పేషీలోని కీలకమైన, సీనియర్ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ తేజస్వి యాదవ్.. ముఖ్యమైన పోస్టులు అప్పజెప్పబోతున్నారనే ప్రచారం అక్కడి స్థానిక మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు బీజేపీకి జేడీయూ కేటాయించిన ఆరోగ్యం, ఆర్థికం, రోడ్లు భవనాల శాఖల మీదే ఆర్జేడీ ఫోకస్ చేసిందని.. వాటి కోసమే పట్టుబడుతోందన్నది ఆ కథనాల సారాంశం. ఇదిలా ఉంటే.. మహాకూటమి నేతృత్వంలోని నితీశ్ సర్కార్ వచ్చే వారం.. అసెంబ్లీలో బలనిరూపణకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా గాంధీ -
మహారాష్ట్ర మంత్రిగా మళ్లీ అతడు.. బీజేపీ మండిపాటు
ముంబై: చాలరోజుల సస్పెన్స్ తర్వాత ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్‌ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. అయితే ఈ కేబినెట్ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త కేబినెట్లోని సేన రెబల్ ఎమ్మెల్యే ఒకరి వల్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తితో పాటు ఆగ్రహామూ వ్యక్తం అవుతోంది. సంజయ్ రాథోడ్.. యావత్మల్ జిల్లా దిగ్రాస్ నిజయోకవర్గపు ఎమ్మెల్యే. షిండే క్యాంప్‌లోని ఓ కీలక ఎమ్మెల్యే. ఇవాళ మంత్రిగా ప్రమాణం చేశాడు. అయితే ఆయన గతంలోనూ మంత్రిగా పని చేసి.. పదవి ఊడగొట్టుకున్నాడు. సంజయ్ రాథోడ్.. ఇంతకు ముందు ఉద్దవ్ థాక్రే కేబినెట్లో అటవీ శాఖ మంత్రి. ఓ మహిళతో సంబంధం నడిపి.. ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పాడనే ఆరోపణలు బలంగా వచ్చాయి. పైగా అతనికి శిక్షపడాలని గట్టిగా పోరాటం చేసింది బీజేపీనే. ఈ క్రమంలో.. ఆనాడు ఉద్దవ్ థాక్రే, సంజయ్‌తో బలవంతంగా రాజీనామా చేయించాడు. కట్ చేస్తే.. ఇవాళ మంత్రివర్గ ప్రమాణంలో అతనూ పాల్గొన్నాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాగ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర స్పందిస్తూ.. సంజయ్ రాథోడ్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కడం దురదృష్టకరం. ఓ మహారాష్ట్ర బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు అతను. అతనికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుందని అని ఆమె ప్రకటించారు. पुजा चव्हाण च्या मृत्युला कारणीभूत असणार्या माजी मंत्री संजय राठोड ला पुन्हा मंत्रीपद दिलं जाणं हे अत्यंत दुदैवी आहे संजय राठोड जरी पुन्हा मंत्री झालेला असला तरीही त्याच्या विरुद्धचा माझा लढा मी सुरूचं ठेवलेला आहे माझा न्याय देवतेवर विश्वास लडेंगे….जितेंगे 👍 @CMOMaharashtra pic.twitter.com/epJCMpvHLB — Chitra Kishor Wagh (@ChitraKWagh) August 9, 2022 టిక్‌టాక్ స్టార్ పూజా చవాన్‌తో సంజయ్ రాథోడ్ రిలేషన్షిప్ నడిపించాడు. అయితే వాళ్ల సంబంధం బెడిసి కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ కేసులో ఆమెకు అరెస్ట్‌చేయాలంటూ బీజేపీ నిరసనగళం గట్టిగా వినిపించింది. అందులో ఇవాళ రాథోడ్‌తో ప్రమాణం చేసిన కిరీట్ సోమయ్య సైతం ఉండడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్.. సమక్షంలోనే సంజయ్ రాథోడ్ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్. మరోవైపు షిండే సైతం రాథోడ్‌ను గత కొంతకాలంగా వెనకేసుకొస్తున్నాడు. పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ఇచ్చారనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి బెర్త్ దక్కుతుందన్న ఊహాగానాలే నిజం అయ్యాయి. పూజా చవాన్ కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కిందటి ఏడాది అగష్టులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తూనే ఉంది. ఇదీ చదవండి: కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు? -
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
-
ఉత్కంఠకు తెర.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ మద్దతుతో శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎం పీఠాన్ని అధిరోహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు గడిచిపోయినా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. సీఎం షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం మంత్రివర్గ విస్తరణ ఉండనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, షిండే సేనల నుంచి మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పేర్కొన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో మంత్రి చొప్పున 12 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, గిరిష్ మహజన్, షిండే వర్గం నుంచి గులాబ్ రఘునాథ్ పాటిల్, సదా సర్వాంకర్, దీపక్ వసంత్ కేసర్కార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు మంగళవారం కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆ ఇరువురే ద్విసభ్య కేబినెట్‌ను నడుపుతున్నారు. దీంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఫడ్నవీస్, షిండేలు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే మరింత మందిని కేబినెట్లోకి తీసుకుంటాని గత శనివారం తెలిపారు షిండే. ఇదీ చదవండి: శరద్ పవార్ ‘కంచుకోట’పై బీజేపీ కన్ను.. కేంద్ర మంత్రికి బాధ్యతలు -
లంకకు 20న కొత్త అధ్యక్షుడు
కొలంబో/ఐరాస: కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్లగుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లో సేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు. -
కళ్లెదుటే సామాజిక మార్పు
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల నుంచి మంత్రివర్గం వరకు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చి.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ద్వారా సామాజిక సాధికారత సాధనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టార్చ్ బేరర్‌గా నిలిచారని సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. దేశ చరిత్రలో మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఆ వర్గాలకు ఇచ్చింది ఒక్క సీఎం వైఎస్ జగనేనని నొక్కి చెబుతున్నారు. సామాజిక న్యాయం నినాదంతో 2007లో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మాయావతి సైతం మంత్రివర్గంలో ఆ వర్గాలకు 40 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సామాజిక న్యాయ సాధనకు నడుం బిగించారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని, ఆ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలని ప్రణాళిక రచించి, వాటిని ఆచరణలోకి తెచ్చారు. 2019 జూన్ 8న తొలిసారి 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో (14 మందితో 56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చి, సామాజిక విప్లవానికి తెరతీసి.. నవశకానికి నాంది పలికారు. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు (80 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ మహిళను హోం శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. పరిపాలనలో సింహభాగం వాటా ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే.. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల పంపకం ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేసేలా సీఎం వైఎస్ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201.. బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. సామాజిక మహా విప్లవానికి నాంది ► తొలిసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్.. ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 70 శాతం పదవులు (17) ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవానికి నాంది పలికారు. ► రాష్ట్ర శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును చైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ► గత మూడేళ్లలో ఎన్నికలు జరిగిన ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలను బీసీలకే ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటి చెప్పారు. ► శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. ► మొత్తంగా వైఎస్ జగన్ సంస్కరణల వల్ల ఎన్నిక ఎన్నికకూ వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల (పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల్లో 80 శాతానికిపైగా స్థానాల్లో విజయభేరి మోగించింది. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదివరకటి కంటే అధికంగా మెజార్టీ రావడం గమనార్హం. పేదరిక నిర్మూలన.. విద్యకు బాసట ► పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1,58,375.03 కోట్లలో 80 శాతానికి పైగా నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. నగదు బదిలీయేతర పథకాల ద్వారా మరో రూ.38,836.57 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ► అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దే యత్నాలను చిత్తశుద్ధితో చేస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి.. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తూ.. బైజూస్‌తో ఉచితంగా కంటెంట్‌ను అందించేందుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రపంచంలో మిగతా దేశాల విద్యార్థులతో పోటీ పడేలా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న అంకితభావంతో సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు. -
ఏపీ కేబినెట్ సమావేశం 24కు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ నెల 22న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఒకటో బ్లాక్ మొదటి అంతస్తులో సమావేశం జరుగనుందని తెలిపారు. -
రైతులకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తొలకరి పలకరిస్తున్న వేళ అన్నదాతకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఖరీఫ్ సీజన్ ఆంరభమవుతున్న తరుణంలో 2022–23 సీజన్‌కు వరి సహా 14 రకాల పంటల మద్దతు ధరలను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై మద్దతు ధరను రూ.100 పెంచారు. సాధారణ రకం క్వింటాల్ రూ.1,940 ఉండగా తాజా నిర్ణయంతో రూ. 2,040కు పెరగనుంది. గ్రేడ్–ఏ రకం రూ.1,960 నుంచి రూ.2,060కు పెరగనుంది. రైతులకు మరింత ఆర్థ్ధిక ప్రోత్సాహమిచ్చేందుకు వరి విస్తీర్ణాన్ని పెంచేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు..నూనె గింజల సాగుకు ప్రోత్సాహమిచ్చేలా... కొన్నేళ్లుగా నూనెగింజలు, పప్పుధాన్యాల ధరలు దేశీయంగా అనూహ్యంగా పెరగడం, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. నువ్వుల మద్దతు ధర గరిష్టంగా రూ.523, సోయాబీన్ రూ.350, సన్‌ఫ్లవర్ రూ.300, వేరుశనగ రూ.300 పెరిగాయి. పెసర ధర రూ.480, కంది, మినప రూ.300 పెరిగాయి. జాతీయ సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుండేలా మద్దతు ధరను నిర్ణయించినట్టు కేంద్రం ప్రకటించింది. తాజా పెంపుతో ఎనిమిది పంటలకు మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును మరింతగా ప్రోత్సహించడం, డిమాండ్–సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి మద్దతు ధరలను పెంచామన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ సమగ్రాభివృధ్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు భారత్–యూఏఈ మధ్య పరిశ్రమలు, అధునాతన పరిజ్ఞానాల్లో సహకారానికి అవగాహన ఒప్పంద ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. 10 సమాచార ఉపగ్రహాలను అంతరిక్ష శాఖ అధీనంలోని ఎన్ఎస్ఐఎల్కు బదిలీ చేసే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. వాతావరణ మార్పులపై సంయుక్త పరిశోధన కోసం ఏరిస్, జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒప్పందానికీ ఆమోదముద్ర వేసింది. -
ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం..
రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నవీన్ కొలువులో 13మంది కేబినెట్ మంత్రులుగా 8మంది సహాయ మంత్రులుగా(ఇండిపెండెంట్) స్థానం దక్కించుకోగా.. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 2019లో ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్.. తాజాగా నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు మాజీలకు మరోదఫా అవకాశం ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళలకు మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురికి క్యాబినేట్, ఇద్దరు సహాయ మంత్రి పదవులు లభించాయి. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ప్రమీల మల్లిక్‌కు క్యాబినేట్ ర్యాంకు కల్పించారు. కొత్త కొలువులో పాత ప్రముఖులకు పట్టం గట్టారు. వీరిలో నిరంజన పూజారి, రణేంద్రప్రతాప్ స్వొయి, ఉషాదేవి, ప్రఫుల్లకుమార్ మల్లిక్, ప్రతాప్కేశరి దేవ్, అతున్ సవ్యసాచి నాయక్, ప్రదీప్‌కుమార్ ఆమత్, నవకిషోర్ దాస్, అశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, సమీర్రంజన దాస్, ప్రీతిరంజన్ ఘొడై, తుషార్‌కాంతి బెహరా, రోహిత్ పూజారి ఉన్నారు. వీరిలో 10 మందికి క్యాబినేట్, 4 మందికి సహాయ మంత్రి పదవులు లభించాయి. అతివలకు వందనం.. నూతన మంత్రిమండలిలో నవీన్ పట్నాయక్ మహిళలకు పెద్దపీట వేశారు. శాసనసభలో 15 మంది మహిళా సభ్యులు ఉండగా.. వీరిలో ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురు క్యాబినేట్, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు వరించాచాయి. ఈ లెక్కన మూడో వంతు పదవులు అతివలకు పదవులు కట్టబెట్టారు. ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో ఇందులో ఉండటం గమనార్హం. బర్గడ్ జిల్లా బిజేపూర్ నియోజకవర్గం నుంచి రీతా సాహు, మయూర్భంజ్ జిల్లా కరంజియా నియోజకవర్గం బాసంతి హేంబ్రమ్కు తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఉషాదేవి, ప్రమీల మల్లిక్(ఎస్సీ), టుకుని సాహుకు క్యాబినేట్ పదవులు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో విద్యాధికులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రిమండలి విద్యాధికులతో రూపుదిద్దుకుంది. కొలువుదీరిన మంత్రుల సగటు వయసు 58 ఏళ్లు కాగా.. 9మంది మంత్రుల వయసు 50 ఏళ్లు లేదా అంత కంటే తక్కువ కావడం విశేషం. 19మంది డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఆరుగు పోస్ట్రుగాడ్యుయేట్లు, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. పదవులు కోల్పోయిన మాజీలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో ముగ్గురు అగ్ర నాయకులకు స్థానం లేకుండా పోయింది. వీరిలో ప్రతాప్జెనా, కెప్టెన్ దివ్యశంకర మిశ్రా, డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం తల దించుకోవాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించాయి. మహంగ జంటహత్యల కేసులో ప్రతాప్ జెనా, పూరీ హత్యాకాండలో డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు, కలహండి జిల్లా ఉపధ్యా యిని మమిత మెహర్ హత్యాకాండలో కెప్టెన్ దివ్యశంకర మిశ్రా వివాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టి, వీరిని మంత్రిమండలి నుంచి బహిష్కరించాలని భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రభావం వారి స్థానాలపై పడిందని సమాచారం. దక్షత లోపం వంటి కారణాలతో మంత్రులు సుశాంతసింఘ్, ప్రేమానంద నాయక్, జ్యోతిప్రకాష్ పాణిగ్రాహి, పద్మినీదియాన్, ప్రతాప్ జెనా, ప ద్మనాభ బెహరా, సుదాం మరాండి, రఘునందన దాస్ కొత్త కొలువులో స్థానం కోల్పోయారు. గంజాం జిల్లాలో ఇద్దరికి.. బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో స్థానం దక్కింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా బంజనగర్ ఎమ్మెల్యే విక్రమ్‌కేశరి ఆరక్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చికిటి ఎమ్మెల్యే ఉషాదేవి, పులసరా ఎమ్మెల్యే శ్రీకాంత్ సాహు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇదలి ఉండగా గంజాం జిల్లా దిగపండి ఎమ్మెల్యే స్పీకర్‌గా విధులు నిర్వహించిన సూర్జొపాత్రొ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులకు బరంపురం నగర మేయర్ సంఘమిత్ర దొళాయి అభినందనలు తెలియజేశారు. సరక స్థానం.. పదిలం రాయగడ: రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా జగన్నాథ సరకకు రెండోసారి మంత్రిమండలిలో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండురోజుల క్రితం మంత్రి మండలిని రద్దు చేసి, కొత్త క్యాబినేట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సరక రెండోసారి మంత్రి మండలిలో స్థానం దక్కించుకోవడంతో జిల్లావాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973 జూన్ 10న బిసంకటక్ సమితి జగిడిలో జన్మించిన ఆయన.. 1997లో జిగిడి సమితి సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం అదే పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. 2012లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2014లో సార్వత్రిక ఎన్నికలోల బిసంకటక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మరోసారి విజయం సాధించి, సీఎం ఆశీర్వాదంతో రెండోసారి కూడా క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నారు. రణేంద్రప్రతాప్ స్వొయి జననం: 1953 జూలై 1 స్వస్థలం: రాధా గోవిందపూర్, కటక్ జిల్లా నియోజకవర్గం: అఠొగొడొ భార్య: మంజుల దాస్ విద్యార్హతలు: ఎం.ఎ, ఎల్ఎల్బీ అభిరుచులు: పర్యటన, పఠనం, క్రీడలు, ఆటలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో రణేంద్రప్రతాప్ స్వొయి హ్యాట్రిక్ మంత్రిగా రికార్డు నెలకొలిపారు. రాజా స్వొయిగా సుపరిచితులైన ఆయన.. నవీన్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రి మండలిలో స్థానం పొందారు. 2019లో ఏర్పాటైన మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్న రణేంద్రప్రతాప్, మంత్రిమండలి మార్పుచేర్పుల ప్రభావం నుంచి విజయవంతంగా బటయట పడగలిగారు. వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి క్యాబినేట్ మంత్రిగా నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా, సౌమ్యశీలిగా పేరొందారు. 1990 నుంచి వరుసగా 7 పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. మూడు జిల్లాలకు మెండి చెయ్యి! కొరాపుట్: రాష్ట్ర మంతివర్గ విస్తరణలో మూడు జిల్లాలకు మెండి చెయ్యి మిగిలింది. నవీన్ కొలువులో కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాకు అవకాశం లభించలేదు. ఈ 3 జిల్లాలో బీజేడీ తరఫున 9మంది ఎమ్మెల్యేలుగా గొలుపొందారు. ఇప్పటి వరకు ఈ జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పద్మినీదియాన్ తన పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో సోదరుడు మనోహర్ రంధారికి లభిస్తుందని ఊహాగానాలు వ్యాపించినా.. నిరాసే మిగిలింది. పార్టీ అధిష్టానం సమాచారంతో ఆయన కూడా భువనేశ్వర్ చేరుకొని, క్యాబినేట్ అవకాశం కోసం ఎదురు చూసినా, పిలుపు రాలేదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగి ఫలితం లేకపోయింది. దీంతో అధికార పార్టీ శ్రేణులు డీలా పడిపోయారు. -
మహిళామణులకు పట్టాభిషేకం
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ జకియా ఖానంను పెద్దల సభగా పేరొందిన శాసనమండలి వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా మహిళా మణులకు అత్యున్నత గౌరవం కల్పించారు. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఒక ముస్లిం మహిళకు పెద్ద బాధ్యతలు అప్పగించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారు. బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించి తన ఆదర్శాన్ని చాటారు. జనరల్ మహిళకు కేటాయించిన కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కట్టబెట్టిన సీఎం జగన్ రాజకీయ రంగంలో మహిళా లోకానికి కొత్త దారులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మహిళామణులకు పదవుల పట్టాభిషేకం చేయడంలో సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రాజకీయంగా, ఆర్థికంగా మహిళల సాధికారత, స్వావలంబనకు విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని దేశం ముందు సగర్వంగా నిలబడేలా చేశారు. మంత్రి వర్గంలోనూ పెద్దపీట మంత్రివర్గంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. 2019 మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించగా.. 2022 మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రెండు పర్యాయాలు కూడా కీలకమైన హోంశాఖను దళిత మహిళలకే అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖను తానేటి వనిత, ఆరోగ్య శాఖను విడదల రజని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఉషశ్రీ చరణ్, పర్యాటక, యువజన సర్వీసుల శాఖను ఆర్కే రోజాకు అప్పగించడం విశేషం. పదవులు.. పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్లో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పటివరకు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకుండానే.. ఎవరు అడగకపోయినా సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేషన్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. గడచిన మూడేళ్లలో మహిళలకు 50 శాతానికి మించి పదవులు కట్టబెట్టడం గమనార్హం. నామినేటెడ్, కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో మహిళలకు 51 శాతం వాటా దక్కింది. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులు 202 ఉంటే.. వాటిలో 102 చైర్పర్సన్ పదవులను మహిళలకే ఇచ్చారు. 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు కూడా మహిళలకే కట్టబెట్టారు. 202 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 102 మహిళలకే కేటాయించారు. 1,356 రాజకీయ పదవుల నియామకాల్లో 688 పదవులు అంటే 51 శాతం అక్కచెల్లెమ్మలకే ఇచ్చారు. వార్డు పదవి నుంచి జెడ్పీ చైర్మన్ వరకు.. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ ఎన్నికలు జరగ్గా.. వాటిలో 7 జిల్లాల జెడ్పీ పీఠాలను మహిళలకు కేటాయించడం ద్వారా 54 శాతం అవకాశం కల్పించారు. 26 జెడ్పీ వైస్ చైర్మన్లలో 15 మంది మహిళలే. మొత్తంగా 12 మేయర్, 24 డిప్యూటీ మేయర్ కలిపి 36 పదవులు ఉంటే.. వాటిలో 18 పదవులు మహిళలవే. వార్డు మెంబర్లు 671 మందిలో 361 మంది మహిళలే ఉన్నారు. 75 మునిసిపాలిటీల్లో 45 మంది మహిళా చైర్పర్సన్లే. మునిసిపాలిటీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 పదవులు మహిళలకే దక్కాయి. గ్రామ సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవుల్లో 54 శాతం, మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం మహిళలకే పట్టాభిషేకం చేయడం విశేషం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలులోకి తెచ్చిన వలంటీర్ ఉద్యోగాలు 2.60 లక్షల మందిలో 53 శాతం యువతులే సేవలు అందిస్తుండటం గమనార్హం. ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలోనూ మహిళా పోలీస్‌లను నియమించారు. మహిళా సంక్షేమంలోను ముందడుగు మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తోంది ప్రభుత్వం. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి వారి పురోగతికి ఊతమిస్తోంది. ఈ మూడేళ్లలో (ఈ ఏడాది ఏప్రిల్ వరకు) రూ.1,22,472.23 కోట్ల లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మహిళా సంక్షేమంలో ముందడుగు వేసింది. వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు ఇవి.. ► రాష్ట్రంలో పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం పారదర్శకంగా 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. వారికి శాశ్వత గృహ వసతితోపాటు మౌలిక సదుపాయాలను సమకూర్చే యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందుకుగాను 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డు కూడా లభించింది. ► 2019 ఎన్నికల రోజు వరకు మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వారి చేతికే అందించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.25,517 కోట్లను నాలుగు విడతలుగా నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించి ఇప్పటి వరకు (ఈ ఏడాది ఏప్రిల్) రూ.12,758 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో పొదుపు సంఘాల ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ మొత్తాన్ని ఆయా సంఘాల రుణ ఖాతాల్లోనే జమ చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ తోడ్పాటుతో 99.27 శాతం సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మలు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీ శాతం 13.5 నుంచి 9.5 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు 1.02 కోట్ల మందికి రూ.3,615 కోట్లు వడ్డీ సాయం అందించింది. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు ఇప్పటివరకు 34.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,895.45 కోట్లు ఖర్చు చేసింది. ► వైఎస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ డబ్బులు వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 24.96 లక్షల మందికి రూ.9,180 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ► స్వేచ్ఛ పథకం కింద రుతుక్రమ సమయంలో స్కూళ్లకు వెళ్లలేక బాలికలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7వ తరగతి నుంచి 12వ వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి రూ.32 కోట్లతో నాప్కిన్లు అందించారు. ► మహిళల సత్వర రక్షణే ధ్యేయంగా, దోషులకు సత్వర శిక్షే లక్ష్యంగా.. మహిళల సమస్యలకు నూరు శాతం పరిష్కారం చూపేలా దిశ బిల్లు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ► పూర్తిస్థాయిలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు వారికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మంత్రి పదవులు ఆయా వర్గాలకు ఇవ్వడం ఇదే తొలిసారి. హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజును ఛైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంకు డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా నాలుగు సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధిని చాటుకున్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులుండగా 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం. స్థానిక సంస్థల్లో సింహభాగం.. స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. జడ్పీ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ దక్కించుకోగా తొమ్మిది జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను సాధించగా 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకే కేటాయించారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్ సీపీ సొంతం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. చట్టం చేసి మరీ పదవులు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రిజర్వేషన్ చేస్తూ సీఎం జగన్ చట్టం తెచ్చారు. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39% బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60% పదవులిచ్చారు. 8వివిధ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులిచ్చారు. బీసీలకు 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులిచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఓ ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. బీసీలకు బాబు వెన్నుపోటు.. బీసీలే తమ పార్టీకి వెన్నెముకని తరచూ చెప్పే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అధికారంలో ఉండగా 42 మందితో కూడిన మంత్రివర్గంలో కేవలం తొమ్మిది (21 శాతం) పదవులను మాత్రమే బీసీలకు ఇచ్చారు. విభజన తర్వాత 2014–19 మధ్య 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కేవలం ఎనిమిది (32 శాతం) పదవులను మాత్రమే బీసీలకు కేటాయించి ఆ వర్గాల వెన్నెముకను విరిచారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఏకంగా బీసీలకు పది పదవులు (40%) ఇవ్వడం గమనార్హం. 2014 నుంచి 2019 వరకూ ఎన్నికలు జరిగిన రాజ్యసభ స్థానాల్లో ఒక్క సీటును కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చంద్రబాబు కేటాయించలేదు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాలకుగానూ నాలుగు సీట్లను బీసీలకే ముఖ్యమంత్రి జగన్ కేటాయించడం గమనార్హం. ► నాడు బెదిరింపులు.. హేళన ► ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దళితులను చంద్రబాబు అవహేళన చేయటాన్ని కళ్లారా చూశాం. ► ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా ఎస్టీల హక్కులను కాలరాసిన చంద్రబాబు నిర్వాకాలను మరచిపోగలమా? ► న్యాయం చేయమని విన్నవించిన నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని.. సమస్యలు పరిష్కరించాలని అడిగిన మత్స్యకారుల తోలు తీస్తానంటూ బెదిరించడం.. న్యాయమూర్తులుగా పనికిరారంటూ బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీయడాన్ని విస్మరించగలమా? ► హక్కులను పరిరక్షించాలని వేడుకున్న ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి కటకటాలపాలు చేసిన చంద్రబాబు దాష్టీకం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. రాష్ట్రంలో 2019 మే 29కి ముందున్న పరిస్థితి ఇదీ..! ► నేడు సమున్నత గౌరవం.. ► రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. సంక్షేమ ఫలాలను అగ్రభాగం అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం జగన్ సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు.. మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి పాలనాధికారం కల్పించారు. రాజ్యసభ, శాసనమండలి సభ్యుల నుంచి స్థానిక సంస్థల వరకూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవుల్లో ఆ వర్గాలకే 50 శాతం రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ సగౌరవంగా పదవులు ఇచ్చారు. ► మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1.41 లక్షల కోట్లలో 80 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. తద్వారా ఆయా వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ► నాడు చంద్రబాబు చేసిన సామాజిక అన్యాయాన్ని.. నేడు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతోనే 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు గురువారం నుంచి ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజలకు చాటిచెప్పడానికే గురువారం శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్రను ప్రారంభించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటారు. 29న అనంతపురంలో యాత్ర ముగుస్తుంది. బస్సుయాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. యాత్రలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. తొలిరోజు బస్సు యాత్ర ఇలా.. గురువారం ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం సెవెన్ రోడ్స్ జంక్షన్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభించనున్న మంత్రులు. -
అవినీతి ఆరోపణలు.. పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్
చండీగఢ్: పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. అంతేగాక తాను చేసిన తప్పులను సింఘ్లా ఒప్పుకున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమవద్ద సమాచారం ఉందని, వాటిపై విచారణ చేయిస్తామని సీఎం చెప్పారు. ఇక ఆరోగ్యశాఖమంత్రిపై కేసు నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను ఆదేశించారు. మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్ చేశారు. చదవండి: టార్గెట్ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం अरविंद केजरीवाल के "भ्रष्टाचार विरोधी मॉडल" के तहत AAP सरकार की बड़ी कार्रवाई 🔹CM @BhagwantMann ने स्वास्थ्य मंत्री विजय सिंगला को किया बर्ख़ास्त 🔹अधिकारियों से ठेके पर 1 पर्सेंट कमीशन की मांग का लगा था आरोप 🔹AAP सरकार भ्रष्टाचार मुक्त भारत बनाने के लिए वचनबद्ध है pic.twitter.com/5HkaTU2Cxm — AAP (@AamAadmiParty) May 24, 2022 -
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్ మెడిసిన్) చదివారు. ► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. ► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించారు. ► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేస్తున్నారు. ► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు బీటెక్ చదివారు. ► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం. -
చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు పెద్దపీట
-
ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ‘నాడు–నేడు’ కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడంతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వ డాక్టర్లు సర్కారు ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలు భావిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తారని, తద్వారా ప్రజారోగ్యానికి పూర్తి భరోసా కల్పించవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది. గురువారం వెలగపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, అధికారులు సమర్థంగా నిర్వహించారని అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ► కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్ప సవరణలకు మంత్రివర్గం ఆమోదం. ► కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. వైఎస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం కొత్తగా పులివెందుల డివిజన్ ఏర్పాటు. ► 12 పోలీసు సబ్డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. జెడ్పీలు పూర్తి కాలం యథాతథం ► ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి యథాతథంగా కొనసాగిస్తూ పంచాయతీరాజ్ చట్టం ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం. ► చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటయ్యే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మిల్లెట్ మిషన్ (2022–23 నుంచి 2026–27 వరకు)కు ఆమోదం. ► ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 253 పోస్టులు ఇచ్చేందుకు ఆమోదం. 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. ► ప్రకాశం జిల్లా దర్శిలో నూతన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. ► పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం. ► సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం. హెల్త్ హబ్స్‌కు భూములు ► రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటులో భాగంగా కాకినాడ అర్బన్ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం. ► కర్నూలు జిల్లా కల్లూరులో అత్యాధునిక ఆసుపత్రి కోసం 5 ఎకరాల భూమి కేటాయింపు. ► విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు. ► అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే ఆసుపత్రికి కేటాయింపు. ► శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆసుపత్రికి కేటాయింపు. పలు సంస్థలకు భూ కేటాయింపులు ► ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కు హోటల్, కన్వెన్షన్ సెంటర్ కోసం రాజమహేంద్రవరం అర్బన్‌లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ► కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు 15.31 ఎకరాల భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపు. ► అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయింపు. విండ్ టర్బైన్ జనరేటర్లను నెలకొల్పనున్న ఐఓసీఎల్. ► కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఆగ్రో కెమికల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. ► కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమి ఆర్టీసీకి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ► రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు. ► నిజాంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలు మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ఈ భూమిలో మడ్క్రాప్ హేచరీస్ ప్రాజెక్ట్‌ను మత్స్యశాఖ చేపట్టనుంది. ► కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు కోసం 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాల కేటాయింపు. ► గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ కోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. -
Sri Lanka: మొత్తం మంత్రుల రాజీనామా.. ప్రధాని మాత్రం నో!
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. కేంద్ర కేబినెట్లోని మొత్తం 26 మంత్రులు తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు మంత్రులు తమ లేఖల్లో పేర్కొన్నారు. అయితే.. ఆదివారం అర్ధరాత్రి లంక మంత్రులంతా తమ రాజీనామాలను ప్రధాని మహీందా రాజపక్సకు సమర్పించగా.. ప్రధాని పదవికి మాత్రం మహీందా రాజీనామా చేయడానికి సుముఖంగా లేనట్లుతెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం లేదంటే కొత్త కేబినెట్.. ఈ రెండు ఆఫ్షన్స్‌లో ఏదో ఒకదాంతో మహీందా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజపక్స కుటుంబ చిత్రం ఇక రాజీనామా చేసిన మంత్రుల్లో మహీందా తనయుడితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులే కావడం విశేషం. దీంతో ప్రజావ్యతిరేకత కొంతైనా తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడు ప్రధాని మహీందా. ఇక కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా ఆదివారం పౌరులు, విద్యార్థులు, ప్రతిపక్షాలు కలిసి నిరసనలు వ్యక్తం చేయగా.. ఉద్రిక్తతలకు దారి తీశాయి. స్వాతంత్ర్యం వచ్చిన 1948 నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో అధిక ధరలు, కరెంట్‌కోతలు, నిత్యావసరాల కొరత.. చూస్తుండడం ఇదేమొదటిసారి. అందుకే ప్రజా వ్యతిరేకత పెల్లుబిక్కింది. సంబంధిత వార్త: లంకలో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటంటే.. -
యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సభ్యులకు సోమవారం శాఖలను కేటాయించారు. కీలకమైన హోం, విజిలెన్స్‌తో సహా 34 శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు గ్రామీణాభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు మరో నాలుగు శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి బ్రిజేశ్ పాఠక్‌కు వైద్య విద్యాశాఖతో మరో రెండో ఫోర్ట్ పోలియోలు కేటాయించారు. కళ్యాణ్ సింగ్ మనవడికి చోటు సురేశ్ కుమార్ ఖన్నాకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, స్వతంత్రదేవ్ సింగ్‌కు జలశక్తి, బేబి రాణి మౌర్యకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, జితిన్ ప్రసాదకు పీడబ్ల్యూడీ కట్టబెట్టారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రుల్లో మాజీ ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్(సాంఘిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ సంక్షేమం), దయా శంకర్ సింగ్(రవాణా శాఖ) కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్(ప్రాథమిక విద్య) ఉన్నారు. యోగి కేబినెట్లో ఏకైక ముస్లిం మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ(స్వతంత్ర ప్రతిపత్తి)కి వక్ఫ్, హజ్ శాఖలతో పాటు మైనారిటీల సంక్షేమం అప్పగించారు. ఏకైక సిక్కు మంత్రి బల్దేవ్ సింగ్ ఔలాఖ్(స్వతంత్ర ప్రతిపత్తి) వ్యవసాయం, వ్యవసాయ విద్య శాఖ దక్కించుకున్నారు. 24 మందికి ఉద్వాసన సీఎం యోగి కేబినెట్లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు 52 మంది మంత్రులు ఉన్నారు. మంతివర్గంలో 31 కొత్త ముఖాలకు స్థానం కల్పించగా, పాతవారిలో 24 మందికి ఉద్వాసన పలికారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దినేష్ శర్మకు ఈసారి మొండిచేయి చూపారు. మథుర బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మొదటి టర్మ్‌లో ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సతీష్ మహానాలకు కూడా తాజా కేబినెట్లో చోటు దక్కలేదు. -
పంజాబ్‌లో కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. దేశంలోనే ఫస్ట్..
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 10 మంది ఎమ్మెల్యేలతో కేబినెట్ విస్తరణ చేశారు. ఈ క్రమంలోనే సీఎం మాన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రి ఏర్పడిన రెండో రోజు పంజాబ్‌లో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలను నెలరోజుల్లో భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. తాజాగా ఆదివారం ఆప్ సర్కార్ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సీఎం మాన్ తన మంత్రివర్గంలోని ప్రతీ మంత్రికి ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తారని చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరకపోతే సదరు మంత్రిని తొలగించాలని ప్రజలు డిమాండ్ వచ్చని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరూ ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా, అంకితభావంతో జట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులకు తగిన సూచనలు ఇవ్వడానికి తాను అందరికీ ఓ సోదరుడిలా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత ఉపసంహరణకు సంబంధించి మాన్ తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్ ప్రశంసించారు. మరోవైపు.. ప్రజలపై ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించవద్దని సూచించారు. అలాగే, పంజాబ్‌లో అక్టోబర్‌లో నష్టపోయిన పంటలకు పరిహారం విడుదలైందని, రానున్న రోజుల్లో రైతులకు చెక్కులు అందజేస్తామన్నారు కేజ్రీవాల్. ఇది చదవండి: ఈ పెళ్లి ప్రత్యేకం.. వరుడు చేత బాండ్ పేపర్‌పై సంతకం.. మాట తప్పితే తిప్పలే! -
పంజాబ్ సీఎం మాన్ సంచలన నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుని ఆప్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. సీఎం భగవంత్ మాన్.. 10 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం కేబినెట్ విస్తరణ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రుల తొలి సమావేశంలోనే మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ మంత్రివర్గం 25వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో పోలీసు శాఖలో 10 వేల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో 15 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఓ నెలలోపే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీకి కేబినెట్ ఓకే చెప్పటం విశేషం. కాగా, పంజాబ్ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అంటూ మాన్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు తాము వాగ్దానం చేసినట్లుగానే ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు మాన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. Chaired the first cabinet meeting. The Punjab cabinet has approved notification of 25,000 job vacancies within one month. As we promised before the election, jobs opportunities for our Punjab's youth will be the topmost priority of AAP Govt. pic.twitter.com/rRElBoJxc2 — Bhagwant Mann (@BhagwantMann) March 19, 2022 -
కేబినెట్ ప్రక్షాళనే
సాక్షి, బెంగళూరు: ఉప ఎన్నికలు, విధాన పరిషత్తు పోరు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో నాయకత్వం పునరాలోచనలో పడింది. వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ముఖ్య మార్పులు చేయాలని చూస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత బొమ్మై సర్కారుకు భారీ సర్జరీ చేస్తారని అంచనా. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ పదవులు అనుభవిస్తున్న సుమారు పది మంది సీనియర్ నేతలను మంత్రివర్గం నుంచి తప్పించాలని హైకమాండ్ యోచిస్తోంది. వారిని పార్టీ బలోపేతానికి వాడుకుంటూ, జనాదరణ ఉన్న కొత్త నేతలకు మంత్రి పదవుల్ని కట్టబెడితే వచ్చే ఎన్నికల్లో పుంజుకోవచ్చని ఆశిస్తోంది. గ్రూపులతోనే చిక్కు.. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గ్రూపులు ఏర్పడ్డాయి. సీఎం వర్గం.. మాజీ సీఎం వర్గం.. సీఎం వ్యతిరేక వర్గం.. వలస వచ్చిన వారు.. ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, పార్టీ పెద్దల ఆశీస్సులున్న వారు తదితర గ్రూపులతో చిక్కు ఏర్పడుతోంది. ఒకే పార్టీలో మూడు నాలుగు తలుపులు ఉండటంతో ఏ కార్యక్రమం సవ్యంగా సాగడం లేదనే విమర్శలున్నాయి. ఓ వర్గానికి న్యాయం చేస్తే.. మరో వర్గం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఫలితంగా ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడుతోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు సమర్థులకు బాధ్యతలు అప్పజెప్పేందుకు అధిష్టానం సిద్ధమైంది. 8, 9న నంది బెట్టలో సభ.. ఈ నెల 8, 9వ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇన్చార్జ్ అరుణ్‌సింగ్, సీనియర్ నేత బీఎల్ సంతోష్, సీఎం బొమ్మై తదితరులతో కలిసి నంది హిల్స్‌లో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా విశ్లేషణ ఉంటుందని సమాచారం. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ధిక మంత్రి
న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) ప్రైవేటీకరించే విషయంలో కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభకు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించే ఉద్దేశ్యంతో ఉన్నట్టు 2021–22 బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ చేసిన ప్రకటన గమనార్హం. పీఎస్‌బీల ప్రైవేటీకరణపై సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందించారు. చదవండి: మీరు వినియోగించని బ్యాంక్ అకౌంట్లలో ఎంత సొమ్ము మగ్గుతుందో తెలుసా? -
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ రద్దను బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత వారం, ప్రధాన మంత్రి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసన తెలుపుతున్న రైతులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, మూడు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు వేచి ఉంటారని రైతు నాయకుడు రాకేష్ టికైత్ అన్నారు. అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం మరో నాలుగు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు పంపిణీ చేశారు. దీన్ని మరో నాలుగు నెలలు పొడిగించారు. గడిచిన 15 నెలల కాలానికి గాను ఈ పథకానికి కేంద్రం 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. చదవండి: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు -
ఎంపీ ల్యాడ్స్ నిధులను పునరుద్ధరించిన కేబినెట్
-
Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణం కోసం పర్యాటక శాఖకు భూముల అప్పగింతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు కోసం శారదా పీఠం, దత్త పీఠం, ఇస్కాన్ చారిటీస్లకు భూములను కేటాయించింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. జైన్లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. పద్మ, ఆది వెలమ సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: 'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం) కొలువుల జాతర ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1285, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 560 ఫార్మసిస్టులు, వైద్య విద్య శాఖలో బోధన, నర్సింగ్, పారామెడికల్ విభాగాల్లో 2,190 వెరసి 4,035 ఉద్యోగాలను కొత్తగా సృష్టించి.. నియామకాలు చేపట్టడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 జూన్ నుంచి ఇప్పటిదాకా 26,917 మంది ఉద్యోగులను నియమించింది. మిగతా 14,391 ఉద్యోగుల నియామకాల్లో భాగంగా∙ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జన గణన ► 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ► దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931లో మాత్రమే కులాల ప్రాతిపదికన జన గణన చేశారు. అందు వల్ల ఆ వర్గాల జనాభా ఎంతన్నది తేల్చలేకపోతున్నారు. ఈ దృష్ట్యా బీసీ జన గణన చేపట్టడం ద్వారా శాస్త్రీయంగా వర్గాల జనాభాను తేల్చి.. ఆ మేరకు ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి నిధులు కేటాయించవచ్చన్నది మంత్రివర్గం భావన. అమ్మ ఒడికి 75 శాతం హాజరు ► అమ్మ ఒడి పథకం కింద 2022 జూన్‌లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో 130 పని దినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ► 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం స్ఫూర్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ► వృద్ధాప్య పెన్షన్, ఇంటి స్థలం, వైఎస్సార్ ఆసరా, చేయూత.. తదితర ఏ సంక్షేమ పథకం కిందైనా అర్హత ఉండి.. లబ్ధి చేకూరని వారితో జనవరి నుంచి మే వరకు దరఖాస్తు తీసుకుంటారు. వాటిని పరిశీలించి.. అర్హత ఉన్నట్లు తేలితే జూన్‌లో ప్రయోజనం చేకూర్చుతారు. ► ఇదే రీతిలో జూలై నుంచి నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించి.. అర్హత ఉన్న వారికి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా.. ► రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖ జిల్లా అన్నవరం, వైఎస్సార్ జిల్లా గండికోట, చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా ఈ 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖకు భూమి అప్పగింతకు మంత్రివర్గం ఆమోదం. ఈ ఐదు చోట్ల రూ.1,350 కోట్లతో ఓబెరాయ్ విలాస్ పేరుతో ఒబెరాయ్ సంస్థ 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులను నిర్మించనుంది. తద్వారా 10,900 మందికి ఉద్యోగాలు వస్తాయి. ► భీమిలిలో రూ.350 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్ట్. 7 స్టార్ సదుపాయాలతో రిసార్ట్ నిర్మాణం. 5500 మందికి ఉద్యోగాల కల్పన. ► తిరుపతిలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్. తద్వారా 1500 మందికి ఉద్యోగాలు. ► చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం. విశాఖ జిల్లా శిల్పారామం బీచ్ వద్ద, తాజ్ వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టులకు ఆమోదం. విజయవాడలో పార్క్ హయత్ ప్రాజెక్టుకు ఆమోదం. వీటికి పర్యాటక విధానం కింద రాయితీలకు అంగీకారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్లో సినిమా టికెటింగ్ ఆంధ్రప్రదేశ్ సినిమాల రెగ్యులేషన్ చట్టం–1955 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ రైల్వే ఆన్లైన్ టికెట్ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది. (చదవండి: ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో? ) మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. ► రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం. ► పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు, విధులు తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకు బదిలీ. వాటిని తనిఖీ చేసే అధికారం పశు వైద్యులకు అప్పగింత. ► సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు. ఇందులో కొత్తగా 19 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతి. ► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం. 25 ఏళ్ల పాటు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. తద్వారా ఏటా రూ.2 వేల కోట్లు ఆదా. ► విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపు. సంస్కృత పాఠశాల, వేద విద్య పాఠశాల సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు ఈ భూమిని శారదాపీఠం వినియోగించనుంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో గుండ్లూరు జయలక్ష్మి నరసింహ శాస్త్రి ట్రస్టు(దత్తపీఠం) కు 17.49 ఎకరాలు కేటాయింపు. ఈ ట్రస్టు ఇక్కడ వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు చేయనుంది. ► అనంతపురం జిల్లా పెనుకొండలో ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు. ► చిత్తూరు జిల్లా నగరిలో ఏరియా ఆసుపత్రి కోసం ప్రభుత్వ భూమి మార్పిడికి ఆమోదం. ► విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల స్థానంలో గురజాడ జేఎన్టీయూ.. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీకి గ్రీన్ సిగ్నల్. ► కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కళాశాల నేతృత్వంలో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు దిన్నెదేవరపాడు వద్ద 50 ఎకరాల కేటాయింపు. ► కృష్ణా జిల్లా నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల కేటాయింపు. ► వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణ దేవదాయ శాఖ నుంచి తప్పించి, ఆర్యవైశ్యులకే అప్పగింత. (పాదయాత్రలో హామీ మేరకు) ► విశాఖపట్నం జిల్లా మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 130 ఎకరాల భూమి కేటాయింపు. ఇందులో ఆ సంస్థ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ కడప జిల్లాలో రూ.227.1 కోట్ల వ్యయంతో ఐదు ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపేందుకు ఆమోదం. ► మూడు కొత్త ఆక్వాకల్చర్ ప్రాజెక్టుల కోసం 6 రెగ్యులర్ పోస్టులు డిప్యూటేషన్ పద్ధతిలో, 67 పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి అనుమతి. ► మండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం. ► మావోయిస్టులతోసహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు. ► వాడరేవు వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ఆమోదం. రూ.2205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలోని రహదారుల మరమ్మతులను మంత్రివర్గం సమీక్షించింది. గతంలో ఏడాదికి స్టేట్ హైవేల మరమ్మతుకు రూ.300 కోట్లు, ఎండీఆర్ రోడ్ల మరమ్మతులకు రూ.వంద కోట్లు వెరసి రూ.400 కోట్లు ఖర్చు చేసేవారని అధికారులు వివరించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 46 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లలో 8 వేల కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఇందుకు రూ.2,205 కోట్లతో 1,176 పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 40% పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు అప్పగించామని, రాయలసీమలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.. మిగిలిన 60 శాతం పనులకు నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి.. డిసెంబర్లో పనులు ప్రారంభించి.. వచ్చే మే లోగా పనులు పూర్తి చేయాలని మంత్రివర్గం అధికారులకు దిశానిర్దేశం చేసింది. (చదవండి: పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’) -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలకం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 31 శాతానికి చేరుకుంది. కరోనా కారణంగా జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ పెంపుదల అంశం వాయిదా పడింది. ఈ ఏడాది జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలో పని చేస్తున్న ఉద్యోగులకు ,పెన్షనర్లకు చెల్లించే డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) లను 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక కొత్తగా పెరిగిన డీఏ, డీఆర్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. చదవండి: Jio Exclusive Offer: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై జియో బంపర్ ఆఫర్...! -
ట్యునీసియా కేబినెట్లో రికార్డు స్థాయిలో మహిళలు
ట్యునిస్: ఆఫ్రికా దేశం ట్యునీసియాలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు చోటు దక్కింది. అధ్యక్షుడు కైస్ సయీద్ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్‌ను బర్తరఫ్ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి నజ్లా బౌడెన్ పేరును ప్రతిపాదించారు. తాజాగా, దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బౌడెన్ 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనార్హం. అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బౌడెన్ ప్రకటించారు. -
పంజాబ్ కేబినెట్ 4.30 కు ప్రమాణస్వీకారం
-
రేపు పంజాబ్ కేబినెట్ ప్రమాణస్వీకారం
-
బొమ్మై టీంకు పోర్ట్‌ఫోలియో ఖరారు: కీలక శాఖలు ఎవరెవరికంటే?
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతను చేపట్టిన బొమ్మై కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 29 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్న బొమ్మై తన కేబినెట్లో బీజేపీ ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేశారు. ఆర్థిక శాఖతోపాటు, బెంగళూరు అభివృద్ధి, కేబినెట్ వ్యవహారాల కీలక శాఖలను కూడా సీఎం స్వయంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆరగ జ్ఞానేంద్రకు హోం శాఖను, మొదటిసారి మంత్రి అయిన నగేష్ కు ప్రాథమిక విద్యాశాఖను కేటాయించారు. ఇంకా సునీల్ కుమార్‌కు ఎనర్జీ అండ్ పవర్ పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. రవాణా, ఎస్టీ సంక్షేమ శాఖను బీ శ్రీరాములకు కేటాయించగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఈశ్వరప్పకు, రెవిన్యూశాఖను ఆర్ అశోకాకు అప్పగించారు. గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల శాఖను లింగాయత్ నాయకుడు, వి.సోమన్నదక్కించుకున్నారు. మురుగేష్ నిరానీకి భారీ, మధ్యస్థాయి పరిశ్రమలశాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. అలాగే భువనేశ్వరి (కర్ణాటక దేవత) పేరుతో ప్రమాణం చేసిన ఆనంద్ సింగ్‌కు పర్యావరణ మరియు పర్యావరణ శాఖ, గోమాత పేరుతో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభు చవాన్‌కు పశుపోషణ శాఖను కేటాయించడం విశేషం. కాగా యడ్యూరప్ప రాజీనామా తరువాత గత వారం బీజేపీ శాసనసభా పక్ష నూతన నాయకుడిగా ఎన్నికైన బొమ్మై జూలై 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. Portfolios allocation in Karnataka | CM Bommai keeps Finance, cabinet affairs, Bengaluru development & all un-allocated portfolios. KS Eshwarappa gets Rural Development & Panchayat Raj Development. R Ashoka gets Revenue (except Muzarai). B Sriramulu gets Transport & ST Welfare pic.twitter.com/9OYs5fhAu7 — ANI (@ANI) August 7, 2021 -
‘ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు’
-
29 మంది మంత్రులు, నో డిప్యూటీ సీఎం : బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం నేతృత్వంలో కొత్త మంత్రులు ఇవాళ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాత, కొత్త మేలు కలయికతో కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం బొమ్మై ప్రకటించారు. అలాగే డిప్యూటీ సీఎం ఎవరూ ఉండకూడదని హైకమాండ్ నిర్ణయించిందని బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని కేబినెట్లో, ముగ్గురు డిప్యూటీ సీఎంలున్న సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జాబితా సిద్ధం చేసినట్టు సీఎం తెలిపారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో వేడుకకు హాజరయ్యే వారు మాస్క్ ధరించాలని, అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అలాగే ఎవరూ పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని కూడా చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. మరోవైపు మంత్రుల అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుదారులు తమ నాయకులను ఎంపిక చేయకపోవడంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ముఖ్యంగా హవేరి ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే యడ్యూరప్ప హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ఎమ్మెల్యే ఆనంద్ మమణి తనను మంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానంటూ బెదిరింపుకు దిగారు. కాగా జూలై 28 న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొమ్మై క్యాబినెట్‌పై నిర్ణయం తీసుకునే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనే ఐదు రోజులు గడపటం గమనార్హం. -
నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ?
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ బొమ్మై తన మంత్రివర్గాన్ని బుధవారం సాయంత్రం ఐదింటికి విస్తరించనున్నారని వార్తలొచ్చాయి. 26 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడంలో తుది నిర్ణయం కోసం సీఎం బొమ్మై మంగళ వారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలుసుకున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఆవరణలో హోం మంత్రి అమిత్ షాను సైతం బొమ్మై కలుసుకున్నారని సమాచారం. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని 20–25 మందిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
హైవేల పక్కనే టౌన్‌షిప్‌లు : నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు.రూ .2.5 లక్షల కోట్ల విలువైన టన్నెల్స్‌ను నిర్మించాలని తమ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని మంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాల నిధులను ఈ ఏడాది 34 శాతం పెంచిందనీ, రూ. 5.54 లక్షల కోట్లు మేర పెంచినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగడం కరోనా మహమ్మారి సమయంలో ఉపాధిని సృష్టించడానికి సహాయపడుతుందని గడ్కరీ పేర్కొన్నారు. -
మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళన
-
కొత్త కుర్తాలు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం కోసమేనా .. ?
-
బ్యాడ్ బ్యాంక్‌కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: మొండి బకాయిల పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకు తొలి అడుగుగా ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు త్వరలో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర పడే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ గ్యారెంటీ తక్షణం దాదాపు రూ.31,000కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేసింది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్‌్ట్సగా ఉంటాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్ (ప్రభుత్వ) గ్యారెంటీ లభించేందుకు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమల్లో కీలక అడుగు! : 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన అమలుకు తొలుత సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు ప్రభుత్వం గ్యారెంటీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కీలకం. ‘‘ప్రస్తుత మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పేర్కొంది. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్‌ఏఆర్‌సీల్‌లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తుందని అంచనా. ఎన్పీఏల పరిష్కారంలో ఇది మంచి పురోగతి అవుతుందని అంచనా. -
Puducherry: కొలువుదీరిన రంగన్న కేబినెట్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 55 రోజుల అనంతరం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని మంత్రి వర్గం కొలువుదీరింది. ఐదుగురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన కరోనా బారిన పడడం, ఆ తదుపరి పరిణామాలతో కొత్త కేబినెట్ కొలువులో జాప్యం నెలకొంది. బీజేపీతో చర్చలు ఫలించడంతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నమశ్శివాయంతో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణన్, బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణన్ కుమార్‌కు, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన తేని జయకుమార్, చంద్ర ప్రియాంక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం అరగంటలో ముగించారు. దీన్ని డీఎంకే బహిష్కరించింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన బీజేపీ ఎమ్మెల్యే జాన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. 1980–1983లో కాంగ్రెస్ డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకా అప్పాదురై మంత్రిగా పనిచేశారు. తర్వాత 40 ఏళ్లకు మహిళా మంత్రిగా చంద్ర ప్రియాంక పగ్గాలు చేపట్టారు. ఆమె కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. విద్యావంతురాలైన చంద్రప్రియాంక మాజీ మంత్రి చంద్రకాశి కుమార్తె కావడం గమనార్హం. కాగా కేంద్రాన్ని డీఎంకే సర్కారు యూనియన్ ప్రభుత్వం (ఒండ్రియ అరసు) అని పిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పుదుచ్చేరిలో ప్రమాణ స్వీకార సమయంలో ఎల్జీ అదే పదాన్ని ఉపయోగించే రీతిలో ఇండియా ఒండ్రియం (భారత యూనియన్) పరిధిలోని పుదుచ్చేరి అని మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం గమనించదగ్గ విషయం. చదవండి: బంగారు పతకం గెలిస్తే రూ.3 కోట్లు -
Pondicherry: రంగన్న కేబినెట్ రెడీ
సాక్షి, చెన్నై: మంత్రివర్గ జాబితాను పుదుచ్చేరి సీఎం రంగస్వామి సిద్ధం చేశారు. బీజేపీకి చెందిన ఇద్దరితో పాటు తన పార్టీకి చెందిన ముగ్గురితో కలిపి ఐదుగురు సభ్యులకు మంత్రి చాన్స్ కల్పించారు. ఈ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించనున్నారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌కాంగ్రెస్ అధినేత, సీఎం రంగ స్వామికి మంత్రివర్గం కూర్పు శిరోభారంగా మారింది. తొలుత బీజేపీతో సీట్ల పందేరం వివాదాల నడుమ సాగింది. అధికారపగ్గాలు చేపట్టి నెలన్నర రోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి. ఎట్టకేలకు బీజేపీకి చెందిన ఎన్బలం సెల్వం గత వారం స్పీకర్‌గా పగ్గాలు చేపట్టారు. మంత్రివర్గ పంచాయితీ కొలిక్కి రావడంతో జాబితా సిద్ధం చేసే పనిలో రంగన్న నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తనకు మంత్రివర్గంలో చోటు దక్కడం లేదన్న సమాచారంతో బీజేపీకి చెందిన జాన్‌కుమార్ ఢిల్లీలో పైరవీలో మొదలెట్టే పనిలో పడ్డారు. అయితే ఎళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్న శరవణ కుమార్‌కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే రంగన్న జాబితాలోనూ ఆయన పేరు ఉండడం వెలుగు చూసింది. జాన్ కుమార్‌కు రిక్త హస్తం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతో పాటుగా తన కుమారుడ్ని ఎన్నికల్లో గెలిపించుకున్న నేత జాన్‌కుమార్. అయితే, ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కేది అనుమానంగా మారింది. ఆయన వర్గీయులు ఓ వైపు ఆందోళనలు సాగిస్తున్న నేపథ్యంలో మరో వైపు ఢిల్లీలో జాన్‌కుమార్ తిష్ట వేసి ఉండటం గమనార్హం. చివరి వరకు మంత్రి పదవి కోసం అధిష్టానంతో పోరాడుతానని జాన్‌కుమార్ ప్రకటించారు. సీఎం అభ్యర్థి కావాల్సిన వ్యక్తినని, బీజేపీ పిలుపు మేరకు ఇక్కడకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. జాన్‌కుమార్ ఢిల్లీ వేదికగా పైరవీలు ఓ వైపు సాగిస్తుంటే, మరో వైపు రంగన్న తన మంత్రి వర్గ జాబితాను సిద్ధం చేసి ఎల్జీకి సమర్పించేందుకు సిద్ధం కావడం గమనార్హం. జాబితాలో బీజేపీకి చెందిన నమశ్శివాయంకు హోంశాఖ, శరవణకుమార్‌కు ఆదిద్రావిడ సంక్షేమ శాఖ కేటయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, తన పార్టీకి చెందిన తిరుమురుగన్కు విద్యాశాఖ, లక్ష్మీనారాయణన్‌కు ఆరోగ్యశాఖ, జయకుమార్‌కు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించి ఉన్నట్టు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్‌గా రాజవేలు, ప్రభుత్వ విప్‌గా ఆర్ముగం పేర్లను ఎంపిక చేసి ఈనెల 24న ఎల్జీకి జాబితాను రంగన్న సమర్పించబోతున్నట్టు ఎన్‌ఆర్‌కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి -
యూపీలో కేబినెట్ విస్తరణ ఇప్పుడే కాదు: బీజేపీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మార్పులు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఉపాధ్యక్షుడు, యూపీలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ఈ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి సరైన సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేపడ్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి మధ్య విభేదాలు నెలకొన్నాయనే ఊహాగానాలను కొట్టిపారేశారు. యూపీ ప్రభుత్వ, పార్టీ నాయకత్వాలను మార్చే అవకాశాలను తోసిపుచ్చారు. సీఎం, యూపీ బీజేపీ అధ్యక్షుడు ఇద్దరూ బాగానే పనిచేస్తున్నారన్నారు. ముగ్గురు మంత్రులు మరణించడంతో ఏర్పడిన ఖాళీలతో పాటు మిగతా ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అప్పుడే ప్రక్షాళన తప్పదని ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాధామోహన్ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను వ్యక్తిగత కారణాలతో కలిశానని, కేబినెట్లో మార్పులకు సంబంధించి కాదని రాధామోహన్ సింగ్ తెలిపారు. మంత్రివర్గంలో కొన్ని ఖాళీలున్న విషయ వాస్తవమే అయినా, అవి అంత ముఖ్యమైన శాఖలకు సంబంధించినవి కావని వివరించారు. అందువల్ల కేబినెట్ విస్తరణ తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని తెలిపారు. -
Telangana Lockdown: పొడిగించాలా? వద్దా?.. 30న నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అన్న అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. దీని కోసం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. కరోనా రెండో వేవ్ ఉధృతిని నియంత్రిం చడానికి ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించగా, ఇప్పటికే ఒకసారి పొడిగిం చారు. ఈ నెల 30తో ఇది ముగియ నుంది. లాక్డౌన్ ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా సడలింపులు, మినహాయింపులు ఇచ్చి మరో వారం పది రోజులపాటు లాక్డౌన్ పొడిగించవచ్చని సమాచారం. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేస్తే మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో పొడిగింపునకే ప్రభుత్వం మొగ్గు చూపనుంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు అమలు చేస్తున్నారు. దీన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచాలని వ్యాపార వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థిరాస్తి రంగ వ్యాపారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు నిర్మాణ రంగ ప్రాజెక్టుల పనులు కొనసాగించేందుకు కొత్తగా సడలింపులిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే సిమెంట్, స్టీల్, హార్డ్‌వేర్ దుకాణాలకు సడలింపులు ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకోనుంది. కాగా.. వానాకాలం పంటల సాగు ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాల సరఫరా తదితరాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రైతుబంధు సొమ్ము పంపిణీపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. -
తెలంగాణ గవర్నర్ ‘అత్యవసర రాక’ కలకలం
సాక్షి, హైదరాబాద్: ‘అధికారిక పనుల నిమిత్తం అత్యవసరంగా పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాను..’అంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మధ్యాహ్నం చేసిన ట్వీట్ రాష్ట్రంలో కొంత రాజకీయ వేడి పుట్టించింది. గవర్నర్ అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నారంటే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చుననే చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందడంతోనే గవర్నర్ అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి ఉంటారనే ఊహాగానాలు కొనసాగాయి. ఈటల బర్తరఫ్ నేపథ్యంలో.. మొన్నటివరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో.. ఆ ఖాళీని భర్తీ చేయవచ్చని, అదే సమయంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఒకరిద్దరు మంత్రులపైనా వేటు పడుతుందని, కొత్తవారికి చోటు లభించే అవకాశాలున్నాయన్న ప్రచారమూ సాగుతోంది. ఈటల రాజేందర్‌ను తొలగించిన అనంతరం వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఈ శాఖను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించవచ్చని బాగా ప్రచారం జరుగుతోంది. కరోనా నియంత్రణపై ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొనడం, బుధవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రం తరఫున హరీశ్‌రావు పాల్గొనడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. వైద్యారోగ్య శాఖకు మంత్రిని నియమించే అవకాశాలుండడంతో రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇతర కార్యక్రమాల కోసమే.. అయితే రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంతో పాటు వర్చువల్‌గా జరిగే మరో కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే గవర్నర్ హైదరాబాద్‌కు వచ్చారని రాజ్‌భవన్ అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అధికారులు మీడియాకు తెలియజేశారు. దీంతో గవర్నర్ అత్యవసర పర్యటనపై కొనసాగిన ఊహాగానాలకు బ్రేక్ పడినట్టు అయింది. నర్సుల సేవలు అసమానమైనవి: గవర్నర్ కోవిడ్ సంక్షోభంలో నర్సులు అసమానమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. రాజ్‌భవన్‌కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో, రోగుల సేవలో నర్సులు అద్వితీయమైన, నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారంటూ గవర్నర్ సెల్యూట్ చేశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో.. తమ ఆరోగ్యాలను, జీవితాలను పణంగా పెట్టి నర్సులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని పేర్కొన్నారు. ఆధునిక నర్సింగ్ వృత్తికి ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు గవర్నర్ నివాళులర్పించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన మరో కార్యక్రమంలో గవర్నర్.. తమిళనాడులోని నర్సులకు వారి అత్యుత్తమ సేవలకుగాను అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి.సౌందరరాజన్ పాల్గొన్నారు. -
MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే!
చెన్నై: తమిళనాడు శాసనసభా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుతీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రేపు ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 34 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రాజ్‌భవన్‌కు అందిన అధికారిక సమాచారం ప్రకారం మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. 1. ఎంకే స్టాలిన్: ముఖ్యమంత్రి 2. దురైమురుగన్: జల వనరులు 3. కేఎన్ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు 4. ఐ. పెరియసామి: సహకార శాఖ 5. ఎన్. పొన్ముడి: ఉన్నత విద్య 6. ఈవీ వేలు: పబ్లిక్ వర్క్స్ 7. ఎంఆర్కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం 8. కేకేఎస్‌ఆర్ రామచంద్రన్: రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ 9. తంగం థెన్నరసు: పరిశ్రమల శాఖ 10. ఎస్ రఘుపతి: న్యాయ శాఖ 11. ఎస్. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి 12. కేఆర్ పెరియకరుప్పన్: గ్రామీణాభివృద్ధి శాఖ 13. టీఎం అంబారసన్: గ్రామీణ పరిశ్రమలు 14. ఎంపీ సామినాథన్: సమాచార, ప్రచార శాఖ 15. పి. గీతాజీవన్: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత 16. అనిత ఆర్ రాధాకృష్ణన్: మృత్స్యకార, జంతు పరిరక్షణ 17. ఎస్ఆర్ రాజకన్నప్పన్: రవాణా శాఖ 18. కే రామచంద్రన్: అటవీ శాఖ 19. ఆర్ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా 20: వీ. సెంథిల్ బాలాజీ: విద్యుత్, ప్రొబిషన్, ఎక్సైజ్ 21. ఆర్ గాంధీ: చేనేత, టెక్స్టైల్స్ శాఖ 22. ఎంఏ సుబ్రమణియన్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ 24. ఎస్ఎస్ శివశంకర్: బీసీ సంక్షేమం 25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ 26. పళనివేల్ త్యాగరాజన్: ఆర్థిక, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 27. ఎస్ఎమ్ నాజర్: పాలు, డెయిరీ డెవలప్మెంట్ 28. జిగ్నీ కేఎస్ మస్తాన్: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం 29. అన్బిల్ మహేశ్ పొయ్యమొళి: పాఠశాల విద్య 30. శివ వీ మెయ్యనాథన్: పర్యావరణ శాఖ 31. సీవీ గణేశన్: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ 32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 33. ఎం మతివెంతన్: పర్యాటక శాఖ 34. ఎన్కే సెల్వరాజ్: ఆది ద్రవిడ సంక్షేమం -
ఏపీ :కరోనా కట్టడి చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
-
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం
-
వైఫై బూత్‌లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్... దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరతీయనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పనున్నారు. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయి’ అని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్స్పాట్లను గుర్తించి, డిస్ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్ డెవలపర్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాయమైపోయిన పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు.. మళ్లీ కొత్త రూట్లో ప్రజల ముందుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. సందు చివర కిరాణా షాపులు, చిన్నా చితకా టీ కొట్లు, పాన్ షాపుల్లో కూడా పబ్లిక్ వైఫై బూత్‌లు త్వరలో దర్శనమివ్వనున్నాయి. గతంలో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) స్థానంలో ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)లు కొలువుదీరనున్నాయి. మొబైల్ డేటాతో పనిలేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... ఎంత కావాలంటే అంత డేటాను లోడ్ చేసుకొని, ఎంచక్కా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేయొచ్చన్నమాట!! దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు ఈ ‘వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కంటెంట్ పంపిణీలో సమానావకాశాలను అందించడంతో పాటు చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్ని కనెక్టివిటీ సేవల్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్)గా చెప్పుకోవచ్చు. – ఆర్ఎస్ శర్మ, ట్రాయ్ మాజీ చైర్మన్ లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు వీలు కల్పించే ఈ కీలక చర్యకు మేం ముందునుంచీ మద్దతిస్తున్నాం. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తికి ఇది ఎంతగానో చేదోడు అందిస్తుంది. ప్రజలను డిజిటల్ పౌరులుగా మార్చేస్తుంది. అదే సమయంలో వ్యాపారాభివృద్ధితో పాటు కిరాణా స్టోర్లు, టీ షాపులు వంటి చిన్న స్థాయి వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మొత్తంమీద చూస్తే సామాజిక–ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ దీని ద్వారా సాకారమవుతుంది. – టీవీ రామచంద్రన్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ప్రెసిడెంట్ కొత్త కొలువులు పెరుగుతాయ్... ‘వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో స్థిరమైన, మరింత సమర్థవంతమైన హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను కోరుకుంటున్న యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. 4జీ మొబైల్ కవరేజీ లేని ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. పబ్లిక్ వైఫైను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ అవసరాలను తీర్చగలం’ అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించింది. -
జెసిండా మరో సంచలనం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మరో సంచలననిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన పార్లమెంటులలో ఒకటిగా తీర్చి దిద్దుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ను ఉప ప్రధానమంత్రిగా ప్రకటించారు. అంతేకాదు విదేశాంగ మంత్రిగా నానియా మహూతాను నియమించారు. 20మంది సభ్యుల మంత్రివర్గంలో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకున్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ మనీ (ప్రజలకు నేరుగా ఉచితంగా డబ్బును పంపిణీ) అంటూ తీవ్రచర్చకు తెరతీసిన గ్రాంట్ రాబర్ట్సన్ మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు విదేశాంగ మంత్రిగా నానియా మహూతా గడ్డం మీద సాంప్రదాయ మావోరి మోకో కాయే పచ్చబొట్టుతో నాలుగేళ్ల క్రితం (1996లో) దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా ఖ్యాతి గడించిన మహూతా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. విదేశాంగమంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మెహుతా. మునుపటి విదేశాంగ మంత్రి విన్‌స్టన పీటర్స్ కూడా మావోరికి చెందిన వారే కావడం విశేషం. భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41) జెసిండా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు. గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల తరపున పోరాడుతున్న ప్రియాంకా 2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్లో విలేకరులతో అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని, ఈ ప్రభావం తమపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయనున్నామనే విశ్వాసాన్ని ఆమె వెల్లడించారు. -
పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ జారీతో పండుగ సీజన్లో డిమాండ్ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని ఈ నిర్ణయం ప్రకటిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెట్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్‌ను అందుకోనున్నారు. మరోవైపు దుర్గా పూజ లోగా సామర్ధ్యం ఆధారిత బోనస్‌ను విడుదల చేయనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. చదవండి : ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్ -
కేబినెట్ ఆమోద ప్రతిని ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఈ నెల 15 వరకూ హైకోర్టు పొడిగించింది. కూల్చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. భవనాల్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని, దీని విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్ ప్రసాద్ చెప్పారు. గతంలో ఇదే విధంగా తీర్మానం చేసిన దానిపై తాము ఉత్తర్వులు ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. మంత్రివర్గం గత నెల 30న తీర్మానం చేసిన విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు అనిపిస్తోందని,, పత్రికల్లో వార్తలు రాలేదని, ప్రభుత్వం కూడా ప్రకటన జారీ చేయలేదని వ్యాఖ్యానించింది. ప్రజలకు చెప్పకపోయినా కోర్టులకైనా తెలియజేయాలని ఆదేశించింది. ప్రజలకు తెలియజేయకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. సీల్డ్ కవర్లో మంత్రివర్గ తీర్మాన ప్రతిని అందజేయాలని కోరింది. పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ... నిర్మాణాలు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, పలు చట్టాలను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడిందని, అనుమతి తీసుకుని కూల్చారో లేదో ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ వాదనను ఏజీ వ్యతిరేకిస్తూ, భవనాల కూల్చివేత పనులు మధ్యలో నిలిచిపోయాయని, వాటిని పూర్తిగా కూల్చేందుకు వీలుగా స్టేను ఎత్తేయాలని కోరారు. మంత్రివర్గ తీర్మాన ప్రతిని ఈరోజే మధ్యాహ్నానికి ఇస్తామని, విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై.. పిటిషనర్ వాదనల దాఖలుకు సమయం ఇవ్వాలని, విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం మంత్రివర్గ తీర్మాన ప్రతిని, పిటిషనర్ కౌంటర్ రిప్లై్ల దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మంత్రివర్గం ఆమోదించింది ప్రభుత్వం చట్ట ప్రకారమే సచివాలయ భవనాల్ని కూల్చివేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. మంత్రివర్గం జూన్ 30న ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఆర్అం డ్బీ ఈఎన్సీ అదే నెల 4న 25.50 ఎకరాల్లోని సచివాల య భవనాల కూల్చివేతకు నివేదిక ఇచ్చారని, దీనికి అనుగుణంగా కూల్చివేతలకు జీహెచ్ఎంసీ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. కాలుష్య సమస్యతో ఎవ్వరూ బాధపడటం లేదని, హుస్సేన్‌సాగర్ సమీపంలో కూల్చివేయరాదన్న వాదన చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిర్మాణాలు– కూల్చివేతలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లోని 4(3)ను ఉల్లంఘించలేదన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, వీటిని కొట్టేయాలని కోరారు. -
కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విలయతాండవం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభాన్ని నివారించి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నిత్యావసర వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్) బుధవారం సవరిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడం వల్ల దేశ వృద్ధికి కీలకమైన వ్యవసాయరంగం మరింత పుంజుకుంటుందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఈ చట్టాన్న ఆహార కొరతను ఎదుర్కొన్న సమయంలో అమలు చేశారని.. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ఆకర్శించేందుకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా 50 ఏళ్ల రైతుల డిమాండ్ నెరవేరిందని జవదేకర్ అన్నారు. పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్(పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరోవైపు కోల్కత్తా పోర్ట్ ట్రస్ట్‌ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా పేరు మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. చదవండి: అనుబంధ వ్యవ‘సాయా’నికి! -
ఏడాదిపాటు వారి జీతాల్లో 30 శాతం కోత..
ముంబై : కరోనా మహహ్మారి వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా మహారాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఏడాదిపాటు శాసనసభ్యులందరి జీతంలోంచి 30 శాతం కోత పెట్టాలని గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రెండు సంవత్సరాల పాటు ఎంపీల్యాడ్స్ నిధులను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ర్ట ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ఏర్పాటైన రెండు కమిటీలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీల్లో మాజీ అధికారులు, మహారాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సహా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, జయంత్ పాటిల్ ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ర్టలో 24 గంటల్లోనే 72 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కేసుల సంఖ్య 1,135కు చేరింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ముంబై, పూణే, నాసిక్ మరియు నాగ్‌పూర్ వంటి నగరాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
రాజధాని అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక
-
సీఎం కేజ్రీవాల్‌కు శాఖ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం హస్తిన పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ తన కేబినెట్లోని ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. తాను మాత్రం ఎటువంటి శాఖ తీసుకోలేదని సమాచారం. గత మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక భూమిక పోషించిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లకు మళ్లీ కేబినెట్ పదవులు దక్కాయి. గత కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీశ్ సిసోడియా.. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి ఆయనకు ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాల శాఖ కేటాయించినట్టు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు 1. మనీశ్ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక, పర్యాటకం, భూమి-భవనాలు, విజిలెన్స్, సర్వీసెస్, కళలు, సంస్కృతి, భాషలు 2. ఇమ్రాన్ హుస్సేన్: అడవులు, ఆహార సరఫరా, ఎన్నికలు 3. కైలాస్ గహ్లోత్: రవాణా, రెవెన్యూ, న్యాయ, శాసన వ్యవహారాలు, ఐటీ, కార్యనిర్వాహక సంస్కరణలు 4. గోపాల్ రాయ్: పర్యావరణం 5. రాజేంద్ర పాల్ గౌతమ్: మహిళా, శిశు సంక్షేమం 6. సత్యేందర్ జైన్: ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) చదవండి: మోదీ ఆశీస్సులు కావాలంటున్న కేజ్రీవాల్ -
ఏపీ మంత్రుల శాఖల్లో మార్పులు...
-
మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని కీలక శాఖలను ఒకే మంత్రిత్వశాఖ కిందకు తీసుకువచ్చింది. దీంట్లో భాగంగానే మంత్రి మోపిదేవి వద్దనున్న మార్కెటింగ్‌శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వద్దనున్న ఫుడ్ ప్రాససింగ్ శాఖను.. వ్యవసాయ, సహకార శాఖలను చూస్తున్న మంత్రి కె.కన్నబాబుకు అప్పగించారు. పరిపాలనా పరమైన సౌలభ్యంతో పాటు మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి మోపిదేవి వద్ద ప్రస్తుతం పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉన్నాయి. మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలాగే బదలాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ పోనూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖను మంత్రి గౌతంరెడ్డికి అప్పగించారు. -
త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ..!
-
ఇక చిన్న మదుపరికీ బాండ్లు!
న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్ బాండ్ మార్కెట్లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్ మార్కెట్‌ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని మంత్రి వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వరంగ సంస్థలకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్ కేలండర్‌ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలియజేశారు. బాండ్ ఈటీఎఫ్ విశేషాలు.. ► భారత్– 22 ఈటీఎఫ్ మాదిరే ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ► ఒక్కో యూనిట్ విలువ రూ.1,000. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ► క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లా... మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది. ► గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఉండదు. ► రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌తో (ప్రస్తుతం 6.47 శాతం) పోలిస్తే 0.50–1.40% అధికంగా ఉండొచ్చని అంచనా. ► బాండ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్ లాభం) మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలావరకూ తగ్గుతుంది. ► ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్ఈ ఒక ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. ► ఈటీఎఫ్ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తన నిధుల కోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ కింద బాండ్లను జారీ చేయవచ్చు. ► ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్వహణ బాధ్యతలను ఎడెల్వీజ్ ఏఎంసీ చూస్తుంది. రిస్క్ చాలా తక్కువ... ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, ఎస్సెల్ గ్రూపులు.. రుణపత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫలమవ్వడాన్ని ఇటీవల చూశాం. వీటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేసినా, లేక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా డిఫాల్ట్ రిస్క్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో ఇలాంటి పరిస్థితి ఉం డదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలే. ప్రభుత్వ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటివరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. లిక్విడిటీతో కూడిన, నాణ్యమైన ప్రభుత్వరంగ బాండ్లలో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరింత మంది ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి ఇది వీలు కల్పిస్తుంది. – ఎన్ఎస్ వెంకటేశ్, సీఈవో, యాంఫి ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల సమీకరణకు ఇదొక కొత్త మార్గంగా సాయపడుతుంది. ప్రారంభంలో 3 ఏళ్లు, 10 ఏళ్ల మెచ్యూరిటీతో భారత్ బాండ్ ఈటీఎఫ్ ఉంటుంది. – రాధికా గుప్తా, సీఈవో, ఎడెల్వీజ్ ఏఎంసీ బాండ్ ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండటం రిటైల్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. వారు తక్కువ రిస్క్‌తో కూడిన కార్పొరేట్ బాండ్లలో పాల్గొనేందుకు ఇదో మంచి అవకాశం. – అనిల్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్, ఇక్రా -
15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: 15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలాన్ని కేంద్ర కేబినెట్ పొడిగించింది. కమిషన్ పదవీ కాలాన్ని 2020 అక్టోబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. 2019 అక్టోబర్ వరకు ఉన్న కమిషన్ పదవీ కాలాన్ని తొలుత 2019 నవంబర్ 30 వరకు పొడిగించారు. అనంతరం దీనిని మరోమారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు, ఇతర వనరుల విభజనపై ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి నివేదికను అందించేందుకు విధించిన గడువును 2020 అక్టోబర్ 30 వరకు పొడిగించింది. ఇక 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంశాలను సైతం తుది నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. -
ఉద్యోగులకు వీఆర్ఎస్, సాహసోపేత విలీన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా సంక్షోభంలో పడిపోయిన బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్ఎస్)ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. పునరుజ్జీవనం కోసం రూ. 15,000 కోట్లు సార్వభౌమ బాండ్ల జారీకి సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. అయితే 4జీ స్పెక్ట్రం కేటాయింపు 2016 ధరల కనుగుణంగా ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీటి ఆస్తుల మానిటైజ్ ద్వారా రూ.38,000 కోట్ల రూపాయల డబ్బునున ఆర్జించనున్నట్టు చెప్పారు. వీఆర్ఎస్ ప్యాకేజీని రెండు కంపెనీలకు వర్తింపచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. 53 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు వరకు జీతం, పెన్షన్, 125 శాతం గ్రాట్యుటీ అందిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకోసం సాహసోపేతమైన పునరుద్ధరణ ప్యాకేజీతో బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ విలీన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి రెండు సంస్థల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. #Cabinet has decided to offer an attractive Voluntary Retirement plan to the employees of BSNL and MTNL. pic.twitter.com/jaAsIvByrJ — Ravi Shankar Prasad (@rsprasad) October 23, 2019 -
కేబినెట్ నిర్ణయం
-
పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర కెబినెట్ కొత్త తరహాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆమోదించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పీఎస్‌యుల ప్రయివేటీకరణను ప్రభుత్వం వేగవంతం చేయనుందని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో డీఐపీఏఎమ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మెనెజ్‌మెంట్) వ్యూహాత్మక అమ్మకాలను చేపడుతుందని, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కెబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం కాగా, నీతి అయోగ్, డీఐపీఏఎమ్ సంయుక్తంగా పెట్టబడుల ఉపసంహరణను చేపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్ను మినహాయింపు నిర్ణయానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీలో ద్రవ్యలోటును 3.3శాతం తేవడానికి పెట్టుబడుల ఉపసంహరణ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. -
సంక్షేమ రాజ్యం
-
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినేట్ ఆమోదం
-
ఇసుక పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదం