తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్‌డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి.
యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎల్‌డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్‌డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన
Comments
Please login to add a commentAdd a comment