Chancellor
-
ఆక్స్ఫర్డ్ చాన్సలర్ పదవికి ఇమ్రాన్ పోటీ!
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి పోటీపడనున్నారు. ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఆన్లైన్ బ్యాలట్ విధానంలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారని అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు సలహాదారుడైన వ్యాపారవేత్త సయ్యద్ జుల్ఫీ బుఖారీ శుక్రవారం జియో న్యూస్‌కు తెలిపారు. ఇమ్రాన్ ఆక్స్‌ఫర్ యూనివర్శిటీ పూర్వ విద్యారి్థ. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు. 2005–2014 దాకా ఆయన బ్రాడ్ఫోర్డ్ యూనివర్శిటీ చాన్సలర్‌గా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి గౌరవ హోదా.. పూర్వ విద్యార్థులు దీని కోసం పోటీపడటానికి అర్హులు. రాజకీయ నాయకులకు ఈ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. -
యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావు.. ఆస్ట్రియాలో భారత ప్రధాని మోదీ
వియన్నా: మూడోసారి భారత్ ప్రధానిగా ఎన్నిక అయ్యాక ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటన బుధవారం కొనసాగుతోంది. ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఉన్నతస్థాయి సమావేశం అయ్యారు. అనంతరం ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘ఇది యుద్ధం చేసే సమయం కాదు. ఇదే విషయాన్ని నేను గతంలో చెప్పాను. యుద్దంతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. ప్రపంచంలో ఎక్కడైనా అమాయక ప్రజలను బలితీసుకోవటం ఆమోదించదగ్గ విషయం కాదు. భారత్, ఆస్ట్రియా కలిసి దౌత్యపరంగా సహకారం అందిస్తాం. .. నేను మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఇక్కడికి వచ్చే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా పర్యటించటం చాలా ప్రత్యేకంతో పాటు చారిత్రాత్మకమైంది. ఇవాళ ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో సానుకూలమైన చర్చలు జరిగాయి. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో చేసుకొనే పలు ఒప్పందాల వృద్దిపై చర్చించాం. అందులో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, వాటర్, వ్యర్థాల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఒప్పందాలపై చర్చలు జరిపాం’ అని ప్రధాని మోదీ తెలిపారు.#WATCH | Vienna: PM Modi says, " ...I have told earlier also, this is not the time for war, we won't be able to find solution to problems in the Warfield. Wherever it is, killing of innocent people is unacceptable. India and Austria emphasize dialogue and diplomacy, and for that,… pic.twitter.com/GwrGL1E9PN— ANI (@ANI) July 10, 2024 అంతకుముందు.. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ మాట్లాడారు. ‘‘నిన్న రాత్రి, ఇవాళ ఉదయం భారత ప్రధాని మోదీతో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణపై చాలా విషయాలు చర్చించుకున్నాం. యూరోపియన్ దేశాల ఆందోళన భారత్ తెలుసుకోవటం, సాయం అందించటం చాలా ముఖ్యమైన అంశం. అదే విధంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలు చాలా ప్రధానమైనవి. భౌగోళికంగా సవాలు విసురుతున్న ఈ ఘర్షణ పరిస్థితులపై సహకారంపై చర్చలు జరిపాం. 1950 నుంచి ఇండియా , ఆస్ట్రియా దేశాల మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ స్నేహం నమ్మకంతో ముందుకుసాగుతోంది. 1955లో ఇండియా ఆస్ట్రియాకు సాయం చేసింది. అప్పటి నుంచి భౌగోళిక రాజకీయ పరిస్థితుల అభివృద్ధిపై ఇరు దేశాలను ఏకం చేస్తోంది’’ అని పేర్కొన్నారు.#WATCH | Vienna: Austrian Chancellor Karl Nehammer says, "...There is a very good relationship between India and Austria. It's a relationship of trust which began in the 1950s...India helped Austria and in 1955, the negotiations came to a positive conclusion with the Austrian… pic.twitter.com/Vg4wX0e1IK— ANI (@ANI) July 10, 2024దీని కంటేముందు ప్రధాని మోదీకి ఆస్ట్రియాలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోరోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ బుధవారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిట్జ్ కార్ల్టన్ హోటల్లో భారతీయులు, ఆస్ట్రియన్స్ కళాకారులు వందేమాతరం గీతంతో మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. -
గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్ హోదా రద్దు
తిరువనంతపురం: రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌గా గవర్నర్‌ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. అయితే, తమ ప్రతిపాదనలను బిల్లులో చేర్చలేదంటూ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సభ నుంచి వాకౌట్ చేసింది. కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని గానీ, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలను గానీ చాన్సలర్‌గా నియమించాలని యూడీఎఫ్ సూచించింది. చాన్సెలర్ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది. ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
Telangana: వర్సిటీల చాన్స్‌లర్‌గా గవర్నర్ తొలగింపు?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విభేదాలు కొత్త పరిణామాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా తమిళిసై, రాష్ట్ర సర్కారు.. ఉప్పు, నిప్పు అన్నట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్ పదవి నుంచి తప్పించే యో చనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. డిసెంబర్లో వారం రోజులపాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ఆర్థికంగా అష్ట దిగ్బంధనం చేయడా న్ని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి ఈనెల 4న మహబూబ్‌నగర్, 7న జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్నారు. 8న కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. అలాగే 9న మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలుకు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంది. మరోవైపు డిసెంబర్ రెండో వారంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నందున ఎమ్మెల్యేలు, మంత్రులు తమతమ నియోజక వర్గాల్లో బిజీగా ఉండే అవకాశముంది. వీటన్నిటి దృష్ట్యా మూడోవారంలో అసెంబ్లీ నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఈ భేటీలు 5 రోజులు జరిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవహారశైలిపై కూడా చర్చించాలనే అభిప్రాయంతో సర్కారు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. కాగా వర్సిటీల చాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందినా, దానిపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం విశేషం. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోయినా.. గవర్నర్ వ్యవహారశైలిపై నిరసన వ్యక్తం చేసినట్లుగా శాసనసభ రికార్డుల్లో ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో బిల్లులు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్రస్థాయిలో బోర్డు ఏర్పాటును శాసనసభ ఆమోదించగా.. గవర్నర్ దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి వెళ్లి గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. ఈ తతంగం గడిచి దాదాపు పక్షం రోజులు దాటినా ఆమోదించడం లేదా తిరస్కరించడం ఇప్పటివరకు జరగలేదు. అలాగే ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా నియమించే బిల్లును కూడా గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడం గమనార్హం. కాగా ఇటీవలే కేరళ ప్రభుత్వం కూడా చాన్స్‌లర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పించేందుకు ఏకంగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. అయితే అది ఇంకా ఆమోదం పొందలేదు. -
కేరళ గవర్నర్‌కు బిగ్ షాక్.. ఛాన్సలర్‌గా తప్పిస్తూ ఆర్డినెన్స్?
తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి. యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
గవర్నర్‌తో విభేదాలు.. మమత సర్కార్ కీలక నిర్ణయం
కోల్‌కత: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇకపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బర్త్య బసు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్కడ్, మమతా బెనర్జీ సర్కార్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌తో సంబంధం లేకుండా దీదీ సర్కార్ వీసీలను నియమిస్తోందంటూ గవర్నర్ ధన్కడ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను ఛాన్సలర్ హోదా నుంచి తప్పించాలని మమత నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే తెచ్చింది. చదవండి👇 మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే! -
PM Modi Europe Visit: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అవుతారు. ఆపై ఆరవ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో పాల్గొంటారు. ఐజీసీ ప్రతి రెండేళ్లకొకసారి ఇరు దేశాల మధ్య జరుగుతుంటుంది. రెండు దేశాలకు చెందిన టాప్ సీఈవోలు.. వీరిరువురితో ఇంటెరాక్ట్ అవుతారు. ఇక తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌లో, బుధవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఈమధ్యే కొత్తగా ఫ్రాన్స్‌కు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌కు పీఎం మోదీ శుభాకాంక్షలు తెలియజేసి.. భేటీ అవ్వనున్నారు. PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ — ANI (@ANI) May 2, 2022 -
AP: వైద్యుల సేవలు భేష్
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా సమయంలో రోగులకు వైద్యులు, వైద్య విద్యార్థులు మెరుగైన సేవలందిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భవిష్యత్‌లో కూడా సమాజానికి, పేదలకు తగిన సేవలందించాలని సూచించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవం గురువారం విజయవాడలో జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించి.. ప్రమాదకర స్థితికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. వైద్య, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ యూనివర్సిటీలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు. డాక్టర్ పళనివేలు, డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్లు.. కోయంబత్తూరులోని జెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి.పళనివేలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అలాగే ఐదుగురికి పీహెచ్‌డీలు, ఒకరికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అందజేశారు. 125 మంది విద్యార్థులకు 150 మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. రాగిణి అనే విద్యార్థిని అత్యధికంగా మూడు గోల్డ్‌మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు నగదు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాబ్జి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.పద్మావతి, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఇ.రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేరళ సెంట్రల్ వర్సిటీ చాన్స్‌లర్‌గా శేషగిరిరావు
సాక్షి, హైదరాబాద్: కేరళ సెంట్రల్ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్.వి.శేషగిరిరావును నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ సీనియర్ నాయకుడైన శేషగిరిరావు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. బీజేపీకి అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. -
సెంట్రల్ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా ఓయూ ప్రొఫెసర్!
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావుకు కీలక పదవి లభించింది. ఆయనను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ చాన్స్‌లర్‌గా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, డీన్‌గా అనేక సంవత్సరాలు ఎస్వీ శేషగిరిరావు సేవలు అందించారు. ఆయనకు బీజేపీతో అనుబంధముంది. బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన వ్యవహరించారు. -
హెచ్‌సీయూ చాన్స్‌లర్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) చాన్స్‌లర్‌గా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నియమితులయ్యా రు. హెచ్‌సీయూ విజిటర్‌గా పదవి రీత్యా కొనసాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వర్సిటీ చాన్స్‌లర్‌ను నియమించారు. ఇప్పటివరకు చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ సి.రంగరాజన్ స్థానంలో నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా, జస్టిస్ నర్సింహారెడ్డి ప్రస్తుతం సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అనంతరం పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ లా డిగ్రీలను పొందారు. -
మనూ’ చాన్స్‌లర్‌గా ఫిరోజ్ భక్త్ అహ్మద్
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) నూతన చాన్స్‌లర్‌గా ప్రముఖ విద్యావేత్త, కాలమిస్ట్ ఫిరోజ్ భక్త్ అహ్మద్ నియమితులయ్యారు. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వర్సిటీ విజిటర్ హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నియామకాన్ని చేసినట్లు వర్సిటీ అధికారులు గురువారం తెలిపారు. భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు ఫిరోజ్ భక్త్ అహ్మద్ స్వయానా మేనల్లుడు. ఈయన బాలల సాహిత్యంపై ఉర్దూ, హిందీ భాషల్లో పలు పుస్తకాలు రాయడంతోపాటుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, కాలమిస్ట్‌గా విధులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మదర్సాల ఆధునీకరణ, ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1997లో మనూ ఫౌండేషన్ ప్యానెల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. -
జర్మనీ అధినేత్రిగా మరోసారి ఆమెకే పట్టం!
న్యూఢిల్లీ: జర్మనీ అధినేత్రిగా నాలుగోసారి ఏంజెలా మెర్కెల్ పగ్గాలు చేపట్టబోతున్నారు. జర్మన్ పార్లమెంటు సభ్యులు బుధవారం మరోసారి దేశ చాన్స్‌లర్‌గా ఏంజెలాను ఎన్నుకున్నారు. ఇది ఆమెకు నాలుగో పర్యాయం. చివరిది అని కూడా భావిస్తున్నారు. 364 సభ్యులు ఉన్న జర్మనీ దిగువ సభలో 315 మంది ఆమెకు ఓటు వేశారు. తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. 63 ఏళ్ల ఏంజెలాకు ఈసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం అతిపెద్ద సవాలే కానుంది. పెద్దగా తన పార్టీకి పట్టులేని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏంజెలా నడిపించబోతున్నారు. తనను ఎన్నుకుంటూ చట్టసభ సభ్యులు వేసిన ఓటింగ్‌ను ఆమోదిస్తున్నట్టు ఏజెంగా బుధవారం పార్లమెంటు దిగువ సభలో పేర్కొన్నారు. -
జర్మనీ చాన్స్‌లర్‌గా మెర్కెల్!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఐరోపాలో అతిపెద్ద దేశమైన జర్మనీ పార్లమెంటులో దిగువ సభ బుందేస్టాగ్‌కు ఆదివారం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపడతారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే ఇస్లాంను, వలసలను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారిగా బుందేస్టాగ్‌లో అడుగుపెట్టనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేసిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) ప్రస్తుత పాలక కూటమిలో భాగస్వామిగా ఉండటం విశేషం. జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలైన క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ), ఎస్పీడీ కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని ‘మహా సంకీర్ణం’ (గ్రాండ్ కొయెలేషన్) అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో దీనిని కొనసాగించకూడదని భావించిన ఎస్డీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం సొంతంగా పోటీపడింది. చాన్స్‌లర్ పదవికి ఎస్పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఐరోపా కూటమి పార్లమెంటు అధ్యక్షునిగాను 2012, 2014లో షూల్జ్ ఎన్నికయ్యారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్పీడీకి 20–21%, ఏఎఫ్‌డీకి 13–13.5% ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్ కోల్ రికార్డును మెర్కెల్ సమం చేస్తారు. రెండు ఓట్లు–దామాషా పద్ధతి! జర్మనీలో ఓటు హక్కు కలిగినవారు ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. బుందేస్టాగ్‌లో మొత్తం 598 మంది సభ్యులుంటారు. అందులో సగం మంది సభ్యులను(299 మంది) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేస్తారు. ఒక ఓటు బుందేస్టాగ్‌లో తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కు పౌరులకు ఉంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5 శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను (299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. 5% ఓట్లు కూడా రాని పార్టీకి ఈ పద్ధతిలో సభ్యులను పంపే అర్హత ఉండదు. -
వర్సిటీ ఉద్యోగినిపై చాన్స్‌లర్ అత్యాచారం
బెంగళూరు: విశ్వవిద్యాలయంలో అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఓ సాధారణ ఉద్యోగినిపై కన్నేశాడు. రెండేళ్లుగా తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. చివరికి బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆ కామాంధుడు శనివారం కటకటాల వెనక్కు వెళ్లాడు. వివరాలు... స్థానిక అలెయన్స్ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌గా ఉన్న మధుకర్ జీ అంగూర్ అందులోనే పని చేస్తున్న ఉద్యోగిని (32)ని బెదిరించి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండే వాడు. ఇటీవల కాలంలో బాధితురాలు శారీరకంగా, మానసికంగా కుంగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి కుమార్తెకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మడివాళ పోలీసులు మధుకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని డీసీపీ బోరలింగయ్య ధ్రువీకరించారు. -
సింగపూర్ వర్సిటీ ఛాన్సలర్‌గా భారతీయుడు
సింగపూర్: మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి పొరుగుదేశంలో గొప్ప గౌరవం దక్కింది. జేవై పీలే(81) అనే భారత సంతతికి చెందిన వ్యక్తి సింగపూర్‌లోని సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ(ఎస్ఎంయూ)కు ఛాన్సలర్ గా నియామకం అయ్యారు. ఈయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. అంతకుముందు ఛాన్సలర్‌గా పనిచేసిన యాంగ్ పంగ్ హో నుంచి పీలే బాధ్యతలు స్వీకరించినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. మలేసియా నుంచి సింగపూర్ విడివడిన తర్వాత ఆ దేశం సాధించిన ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తుల్లో పీలే కూడా ఒకరు. ఇప్పటికే ఆయన పలు పాలక వర్గ సర్వీసులకు విధులు నిర్వర్తించిన అనుభవం కూడా మెండుగా ఉంది. సింగపూర్ ఎక్సేంజ్‌కు ఏడాదిపాటు చైర్మన్‌గా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సింగపూర్ వైమానిక సంస్థ కూడా ఆయన ఆధ్వర్యంలోనే కీలకంగా ఎదిగిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. -
హెచ్‌సీయూ చాన్సలర్‌గా రంగరాజన్
ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డాక్టర్ సీ రంగరాజన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్) చాన్సలర్‌గా నియమితులయ్యారు. విజటర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. హెచ్‌సీయూ 11వ చాన్సలర్‌గా రంగరాజన్ పేరును ఖరారుచేసి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో రిజర్వు బ్యాంకు గవర్నర్, పార్లమెంటు సభ్యుడుగానూ పనిచేసిన రంగరాజన్ తమిళనాడుకు చెందినవారు. తిరుచిరాపల్లి నేషనల్ కాలేజీలో చదువుకున్న ఆయన లయోలా కాలేజ్ (మద్రాస్ యూనివర్సిటీ) నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం చాలా ఏళ్లపాటు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాతోపాటు ఐఐఎం- అహ్మదాబాద్‌లో పాఠాలు చెప్పారు. మైక్రో ఎకనామిక్స్‌పై ఆయన రాసిన పుస్తకాలే.. ప్రస్తుతం పలు బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూళ్లు పాఠ్యాంశాలయ్యాయి. ఆర్థిక శాస్త్రంలో రంగరాజన్ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వాలు అనేక ఉన్నత పదవులు ఆయనకు కట్టబెట్టాయి. ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలికి చైర్మన్‌గా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు అధ్యక్షుడిగా, సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. 1992 నుంచి 1997 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా.. 1997 నుంచి నుంచి 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. అదే సమయంలో ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2002 సంవత్సరంలో భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషన్'తో ఆయనను సత్కరించింది. -
'ఇమ్రాన్ ఖాన్ ను తొలగించండి'
పాకిస్థానీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ ను ఛాన్స్ లర్ పదవిని నుంచి తొలగించాలని బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు. బ్రిటన్ లోని బ్రాడ్ పోర్డ్ యూనివర్సిటికి ఇమ్రాన్ ఖాన్ ఛాన్స్ లర్ గా సేవలందిస్తున్నారు. అయితే 2010 సంవత్సరం నుంచి బ్రాడ్ పోర్డ్ యూనివర్సిటి నిర్వహించిన గ్రాడ్యుయేషన్, ఇతర కార్యక్రమాలకు ఇమ్రాన్ హాజరుకాకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను తొలగించేందుకు యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ రాజకీయాలనో, ఛాన్స్ లర్ పదవిలో దేన్ని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి మొహసిన్ తన్వీర్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఛాన్స్ లర్ గా ఇమ్రాన్ ఖాన్ తన విధులను విస్మరించడంపై విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.