![Narsimha Reddy Appointed As New HCU Chancellor - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/5/hcu-chancellor.jpg.webp?itok=guohn2AV)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) చాన్స్‌లర్‌గా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నియమితులయ్యా రు. హెచ్‌సీయూ విజిటర్‌గా పదవి రీత్యా కొనసాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వర్సిటీ చాన్స్‌లర్‌ను నియమించారు. ఇప్పటివరకు చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ సి.రంగరాజన్ స్థానంలో నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా, జస్టిస్ నర్సింహారెడ్డి ప్రస్తుతం సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అనంతరం పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ లా డిగ్రీలను పొందారు.
Comments
Please login to add a commentAdd a comment