appoint
-
వేర్పాటు నేత భార్యకు పాక్ పట్టం.. ప్రతీకార ధోరణే ప్రధాన కారణం?
భారతదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు పాకిస్తాన్ పట్టంకట్టింది. ఆమె పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోకి అడుగు పెట్టింది. అన్వరుల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రభుత్వంలో మానవ హక్కులు, మహిళా సాధికారతపై ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారుగా ఆమె నియమితులయ్యింది. ఆమె ఒక ఉగ్రవాది భార్య అయినప్పటికీ పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కుల అంశంలో ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు మించిన అర్హత కలిగిన వ్యక్తులు పాకిస్తాన్లో లేరా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకం వెనుక పాకిస్తాన్ రహస్య ఎజెండా ఉందనేది స్పష్టం అవుతున్నదని వారు అంటున్నారు. ముషాల్‌కు బాధ్యతల అప్పగింత వెనుక.. నిజానికి ముషాల్ హుస్సేన్ మాలిక్ నియామకం లాంఛనప్రాయ చర్య అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ముషాల్ పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రముఖరాలేమీ కాదు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టనూ లేదు. అటువంటి పరిస్థితిలో కాశ్మీర్ ఎజెండాను సజీవంగా నిలిపివుంచడానికి, పాకిస్తాన్ సైన్యం వినతి మేరకు ముషాల్‌ను పాకిస్తాన్ ఈ ఉన్నత పదవిలో నియమించిందని తెలుస్తోంది. ముషాల్ హుస్సేన్ కశ్మీర్ విషయంలో మొదటి నుంచి భారత్‌పై విషం చిమ్ముతూ వస్తోంది. కశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచాలని.. భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్- 370 రద్దు చేసిన అంశాన్ని తిరిగి లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న విఫల ప్రయత్నాలలో భాగమే ఈ చర్య అని విశ్లేషకులు అంటున్నారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముషాల్‌ను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ముషాల్ మాట్లాడుతూ యాసిన్ మాలిక్ విషయంలో భారత్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు చేసింది. ఇదిలావుండగా ఇటీవల జీ-20 సభ్యులు శ్రీనగర్‌కు చేరుకుని, సమావేశంలో పాల్గొన్నప్పుడు మరోసారి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నించింది. పీఓకే ప్రజలను తప్పుదారి పట్టించేందుకే.. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలో ముషాల్ చేరిక వెనుక పాక్ ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ముషాల్‌ను నియమించడం ద్వారా పీఓకే ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం దక్కుతుందని భావిస్తోంది. కాగా ముషాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్. 2005లో పాకిస్తాన్లో ఆమెకు యాసిన్ మాలిక్ పరిచయం అయ్యాడు. 2009లో వారు పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను చైనా ఎందుకు హెచ్చరించింది? -
ఆర్మీ వైస్ చీఫ్‌గా మనోజ్ పాండే
న్యూఢిల్లీ: భారత ఆర్మీ నూతన వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు మనోజ్ తూర్పు ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఈ పదవికి తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితాను నియమించారు. 1982లో పాండే ఆర్మీలో చేరారు. పలు కీలక పదవులు నిర్వహించడంతో పాటు అనేక కీలక యుద్ధాల్లో పాల్గొన్నారు. పరమ్ విశిష్ఠ సేవా మెడల్‌తో పాటు పలు అవార్డులు ఆయనకు దక్కాయి. ఏప్రిల్‌లో ఆర్మీ చీఫ్ నరవణె పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీనియర్ అధికారి మనోజ్ పాండే ఏప్రిల్ అనంతరం ఈ పదవి చేపట్టే అవకాశాలున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించారు. -
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షపదవికి ఆగస్టులో రాజీనామా చేసిన ఆయనను అంతకుముందున్న ఎన్నికల కమిషనర్ అశోక లవాసా స్థానంలో నియమించారు. ఈ సందర్బంగా రాజీవ్ కుమార్‌కు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏప్రిల్ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆయనను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు(పీఈఎస్బీ) ఆసియా అభివృద్ధి బ్యాంకు చైర్మన్‌గా నియమించింది. అయితే రాజీవ్ కుమార్ 1984లో జార్ఖ్ండ్ కేడర్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయనకు అనేక రంగాలైన పబ్లిక్ పాలసీ, అడ్మినిస్టేషన్‌గా 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అదే విధంగా ఆయన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ సస్టెనబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్ఎల్బీ డిగ్రీల్లో ఆయన పట్టభద్రులు. -
నారీ.. సైన్యాధికారి
న్యూఢిల్లీ: కమాండ్ రోల్స్‌లో మహిళా సైనికాధికారుల నియమించే విషయంలో కొనసాగుతోన్న వివక్షకు చెల్లుచీటీ ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల పేరుతో సైనిక పటాలాల కమాండింగ్ బాధ్యతల్లో మహిళా అధికారులను నియమించకపోవడం తగదని స్పష్టం చేసింది. భారత సైన్యంలో పనిచేస్తోన్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. అందులో భాగంగానే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)లోని మహిళా సైనికాధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్(పర్మనెంట్ కమిషన్–పీసీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలో ఎందరో మహిళాఅధికారులు దేశానికి అత్యున్నత పురస్కారాలను తెచ్చిపెట్టిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేస్తూ సాయుధ దళాలలో లింగపరమైన వివక్షకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు తమ ఆలోచనావిధానాలను మార్చుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో.. కమాండ్ పోస్టింగ్స్‌తో పాటు పురుష అధికారులతో సమానంగా పదోన్నతులు, ర్యాంక్స్, పెన్షన్సు, ఇతర ప్రయోజనాలు దక్కనున్నాయి. 2010 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సమర్థన రక్షణ రంగంలో ఎన్నేళ్ళ సర్వీసు ఉన్నదనే విషయంతో సంబంధం లేకుండా పురుష సైనికుల మాదిరిగానే మహిళా సైనికులకు వృత్తిపరమైన ఎంపిక కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. మహిళా సైనికుల విషయంలో వివక్ష తగదంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పదేళ్లుగా ఈ ఆదేశం అమలుపై కేంద్రం శ్రద్ధ చూపలేదని తప్పు పట్టింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ పరిమితులు అడ్డు కాదు సైన్యంలో ఉన్నత పదవులను నిర్వర్తించడంలో మహిళలకు వారి సహజ శారీరక పరిమితులూ, సామాజిక కట్టుబాట్లు అడ్డుగా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తోసిపుచ్చింది. ‘మాతృత్వం, పిల్లల పోషణ లాంటి సవాళ్ళు’ కూడా ఉన్నాయన్న కేంద్రం వివరణను కోర్టు తప్పు పట్టింది. మహిళల శారీరక పరిమితులు వారి విధి నిర్వహణకు ఏ విధంగానూ అడ్డురావని కోర్టు స్పష్టం చేసింది. కేవలం 4 శాతమే మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటును, కమాండ్ పోస్టింగ్స్‌ను నిరాకరించడం ఆందోళనకరమని, ఇది సమానత్వ భావనకు వ్యతిరేకమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆర్మీలో ఉన్న మొత్తం కమిషన్డ్ అధికారుల్లో మహిళా అధికారుల సంఖ్య కేవలం 1,653 అని, అది 4% కన్నా తక్కువేనని గుర్తు చేసింది. ‘లింగపరమైన వివక్షతో వారి సామర్థ్యాన్ని తక్కువచేయడం మహిళలుగా వారిని మాత్రమే కాదు.. మొత్తం భారతీయ సైన్యాన్ని అవమానించడమే’ అని పేర్కొంది. ‘ఎస్ఎస్సీలో ఉన్న మహిళాఅధికారులందరికీ శాశ్వత కమిషన్‌ను అనువర్తింపచేయాలి. 14 ఏళ్ల పైబడిన సర్వీస్ ఉన్నమహిళా అధికారులు పీసీలో చేరేందుకు ఇష్టపడనట్లయితే.. పెన్షన్ అర్హతకు అవసరమైన 20 ఏళ్ల సర్వీస్ పూర్తయేంతవరకు విధుల్లో కొనసాగించాలి’ అని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కమాండ్ పోస్టింగ్స్‌ను ఇవ్వడంలో అడ్డంకులు కల్పించరాదని స్పష్టం చేసింది. యుద్ధ విధుల్లో మహిళా అధికారుల సేవలను వినియోగించుకోవడం విధానపర నిర్ణయమని ధర్మాసనం పేర్కొంది. -
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్నచర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లక్ష్మణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
హెచ్‌సీయూ చాన్స్‌లర్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) చాన్స్‌లర్‌గా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నియమితులయ్యా రు. హెచ్‌సీయూ విజిటర్‌గా పదవి రీత్యా కొనసాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వర్సిటీ చాన్స్‌లర్‌ను నియమించారు. ఇప్పటివరకు చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ సి.రంగరాజన్ స్థానంలో నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా, జస్టిస్ నర్సింహారెడ్డి ప్రస్తుతం సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అనంతరం పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ లా డిగ్రీలను పొందారు. -
నైజీరియా హైకమిషనర్‌గా ప్రొద్దుటూరు వాసి
పొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బొల్లవరం నాగభూషణం రెడ్డి నైజీరియా దేశానికి భారత్ హై కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ నైజీరియాలో భారతదేశం తరఫున హై-కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9న జెనివాలో ఆయన రిలీవ్ కానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన డాక్టర్ బొల్లవరం రామసుబ్బారెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడైన నాగభూషణం 1993లో సివిల్స్‌లో 71వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఆయన సోదరుడు వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గా ఎంపికయి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ కార్యలయంలో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
త్వరలో వర్సిటీలకు ఛాన్స్లర్లు, వీసీలు!
నియామకాలపై సీఎం దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్లర్ పోస్టులతోపాటు ప్రభుత్వం నియమించాలనుకుంటున్న ఛాన్స్లర్ పోస్టుల భర్తీపై ప్రభుత ్వం దృష్టి సారించింది. త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. గురువారం సీఎం కేసీఆర్ ఈ అంశంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించారు. ఈ సందర్భంగా వీసీలు, ఛాన్స్లర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని అనుకున్నట్లు తెలిసింది. -
వైఎస్ఆర్ సీపీ 'మహాధర్నా'కు కోఆర్డినేటర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే మహాధర్నాకు కో ఆర్డినేటర్లకు నియమించారు. ధర్నాను జయప్రదం చేసేందుకు జిల్లాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం-బేబినాయన విజయనగరం-సుజయ్‌కృష్ణ రంగారావు విశాఖపట్నం-తలశిల రఘురాం తూర్పుగోదావరి-గొల్ల బాబూరావు పశ్చిమగోదావరి-ధర్మాన ప్రసాదరావు కృష్ణా-మోపిదేవి వెంకటరమణ గుంటూరు-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకాశం-బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు-భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కడప-జంగా కృష్ణమూర్తి అనంతపురం-విజయసాయి రెడ్డి కర్నూలు-భూమా నాగిరెడ్డి -
సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా
-
సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా
న్యూఢిల్లీ: నూతన సీబీఐ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ స్పెషల్ డెరైక్టర్ అనిల్ కుమార్ సిన్హాను ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త సీబీఐ చీఫ్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం ప్రధాని నివాసంలో సమావేశమైంది. ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తులతో కూడిన కొలీజియం 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే సిన్హా పేరును సిఫారసు చేసింది. సీబీఐ డెరైక్టర్‌గా మంగళవారం పదవీ విరమణ చేసిన రంజిత్ సిన్హా వలె.. కొత్త సీబీఐ చీఫ్ కూడా బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారే కావడం విశేషం. సీబీఐలో రెండో అత్యున్నత హోదాలో(స్పెషల్ డెరైక్టర్)లో ఇప్పటివరకు ఉన్న ఏకే సిన్హా.. పలు అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో పాలు పంచుకున్నారు. ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)లో డీఐజీ, ఐజీ హోదాల్లో పనిచేశారు. విజిలెన్స్ కమిషన్‌లో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించారు. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత సీబీఐ డెరైక్టర్‌గా నియమితుడైన మొదటి అధికారి సిన్హానే కావడం విశేషం. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఈ ముగ్గురు ఉన్న కమిటీ సిఫారసు చేసిన వారినే సీబీఐ చీఫ్‌గా నియమించాలని లోక్‌పాల్ చట్టంలో పొందుపర్చారు. అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ఆ సిఫారసు చేసేది. హెడ్లైన్లలో నిలిపిన మీడియాకు థ్యాంక్స్! వీడ్కోలు కార్యక్రమంలో రంజిత సిన్హా సీబీఐ డెరైక్టర్‌గా పదవీవిరమణ న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్‌గా 1974 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి రంజిత్ సిన్హా మంగళవారం రిటైర్ అయ్యారు. పదవీవిరమణ సందర్భంగా సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ సంస్థ ప్రయోజనాల కోసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇంత వివాదాస్పద పరిస్థితుల్లో పదవీవిరమణ చేయాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యానించారు. ‘నా విజయాల ఆధారంగా కాదు.. ఎన్ని సార్లు పడిలేచానో చూసి నన్ను జడ్జ్ చేయండి’ అన్న నెల్సన్మండేలా వ్యాఖ్యను ఉద్ఘాటించారు. తనను డార్లింగ్ లీడర్‌గా ప్రశంసించిన జూనియర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీడియాలో నాపై విమర్శలనే చూస్తుండటంతో నేను చేసిన ఇతర పనులను నేను కూడా మర్చిపోయాన’న్నారు. రోజుల తరబడి పతాక శీర్షికల్లో తనను నిలిపినందుకు కృతజ్ఙతలంటూ మీడియాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అధికారులకు ఏమైనా సందేశమిస్తారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ.. సందేశాలిచ్చేందుకు తాను సాధువునో, రాజకీయ నేతనో కాదన్నారు. -
నల్లగొండ కలెక్టర్‌గా స్మితా సబర్వాల్!
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన ఆమె... కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పేషీలో తొలి అధికారిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆమె సీఎం కార్యాలయంలో కీలకమైన నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పారిశ్రామికీకరణకు అవసరమైన భూమి గుర్తింపులో చొరవ తీసుకుని.. కలెక్టర్ల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఆమెను ఆ జిల్లా కలెక్టర్‌గా నియమించే విషయాన్ని సీఎం పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. -
వైఎస్ఆర్ సీపీ కమిటీల నియామకం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించారు. వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హరీష్ కుమార్, భూషణ్ భవనం ను నియమించారు. వైఎస్ఆర్ సీపీ స్టూడెంట్ వింగ్, అడ్‌హక్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ సలాం బాబును నియమించారు. స్టూడెంట్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిగారి రాఖేష్ రెడ్డి నియమితులయ్యారు. మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఫయాఖీ నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరిని పదవుల్లో నియమించారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయం మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. -
జాతీయ మహిళ కమిషన్ చైర్మన్‌గా లలిత
న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్మన్‌గా లలితా కుమారమంగళం నియమితులయ్యారు.కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ లలిత నియామకాన్ని ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మేనకా గాంధీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. -
ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్‌గా ఫించ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా టి-20 క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఓపెనర్ అరోన్ ఫించ్‌ను నియమించారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్, టెస్టు క్రికెట్‌పై దృష్టిసారించేందు కోసం ఆసీస్ టి-20 కెప్టెన్ పదవికి జార్జి బెయిలీ రాజీనామా చేశాడు. దీంతో బెయిలీ స్థానంలో ఫించ్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నియామకాన్ని ప్రకటించింది. టి-20 ఫార్మాట్లో ఫించ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో పుణె వారియర్స్, ఆసీస్ దేశవాళీ జట్టు మెల్బోర్న్ రెనెగాడెస్ జట్లకు ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివం
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సదాశివం నియామకంపై కాంగ్రెస్ పార్టీ సహా న్యాయవాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా కేంద్ర ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది. ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చిన వెంటనే కేరళ గవర్నర్‌గా సదాశివం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. -
వైఎస్సార్సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు
జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. నియామకాలు చేసిన జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగానికి 8 మంది ప్రధాన కార్యదర్శులతోపాటుగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతి (శ్రీకాకుళం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), గుడివాడ అమర్నాథ్ (విశాఖపట్టణం), జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావరి), ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి), కె.పార్థసారథి (కృష్ణా -దక్షిణం), కొడాలి నాని (కృష్ణా-ఉత్తరం), మర్రి రాజశేఖర్ (గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (నెల్లూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి (వైఎస్సార్), శంకరనారాయణ (అనంతపురం), కె.నారాయణస్వామిలను (చిత్తూరు) నియమించారు. -
సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కేసీఆర్
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవ హరించే కీలకమైన సదరన్ జోనల్ కౌన్సిల్(దక్షిణ ప్రాంతీయ మండలి) వైస్ చైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలం పాటు కేసీఆర్ ఈ పదవిలో కొనసాగుతారు. దీనికి కేంద్ర హోం మంత్రి చైర్మన్‌గా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఈ కౌన్సిల్లో సభ్య రాష్ట్రాలుగా ఉండగా.. ఇటీవ లే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇందులో చేర్చారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదే ఈ కౌన్సిల్‌కు వైస్ చైర్మన్‌గా కేసీఆర్ నియమితులవడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా కేసీఆర్‌కు రెండు, మూడు రోజుల కిందట లేఖ రాశారు. కౌన్సిల్ మరింత ప్రభావవంతంగా, నిర్మాణాత్మకంగా పనిచేసేలా కృషి చేస్తారని అభిలషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జాతీయ సమగ్రతను మరింత పటిష్టపరచడం, అభివృధ్థి ప్రాజెక్టులను వేగవంతంగా, సమర్థంగా నిర్వహించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అభివృద్ధి అంశాలపై రాష్ట్రాల ఆలోచనలు, అనుభవాలను ఎప్పటికప్పుడు కేంద్రంతో పంచుకోవడం వంటి విషయాల్లో ఈ మండలి క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది. -
హైకోర్టులో స్పెషల్ జీపీలు, జీపీల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం నలుగురు స్పెషల్ జీపీలు, ఐదుగురు జీపీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో తమ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (స్పెషల్ జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు స్పెషల్ జీపీలను, ఐదుగురు జీపీలను నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ జీపీలుగా బి.మహేందర్‌రెడ్డి, ఎస్.శరత్‌కుమార్, ఎ.సంజీవ్‌కుమార్, బి.ఎస్.ప్రసాద్ నియమితులు కాగా, జీపీలుగా పి.పంకజ్‌రెడ్డి, ఆర్.రాజేష్ మెహతా, ఎ.నజీబ్‌ఖాన్, జి.అరుణ్‌కుమార్, సి.వెంకట్ యాదవ్‌లను నియమించారు. మూడేళ్లపాటు వీరంతా ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. స్పెషల్ జీపీలు ఒక్కొక్కరికి నెలకు రూ.75 వేలు, జీపీలు ఒక్కొక్కరికి రూ.55 వేలు గౌరవ వేతనం అందుతుంది. మరో 10-12 జీపీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 30 వరకు ఏజీపీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా ఆమ్లా
జొహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ గా హషీం ఆమ్లాను నియమించారు. గత మార్చిలో రిటైరయిన గ్రేమ్ స్మిత్ స్థానంలో ఆమ్లాకు జట్టు పగ్గాలు అప్పగించారు. క్రికెట్ సౌతాఫ్రికా ఈ నియామకం చేపట్టింది. కెప్టెన్సీ పదవికి గతంలో ఆమ్లా వినిపించినా బ్యాటింగ్ పైనే పూర్తిగా దృష్టి సారించాలనే ఉద్దేశంతో అతను తిరస్కరించాడు. అయితే పదేళ్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన స్మిత్ రిటైరయ్యాక ఆమ్లా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బ్యాటింగ్ తో పాటు జట్టును సమర్థవంతంగా నడిపించడానికి కృషి చేస్తానని 31 ఏళ్ల ఆమ్లా చెప్పాడు. -
కాశ్మీర్ డీజీపీగా రాజేంద్రకుమార్
శ్రీనగర్: సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రాజేంద్రకుమార్ జమ్మూకాశ్మీర్ కొత్త డీజీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకాశ్మీర్ కేబినెట్ సమావేశం రాజేంద్రకుమార్ నియామకానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రకుమార్ జమ్మూకాశ్మీర్ క్యాడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 57 ఏళ్ల రాజేంద్రకుమార్ కాశ్మీర్లో పలు కీలక పదవుల్లో పని చేశారు. -
ఆర్మీ చీఫ్‌గా దల్బీర్ సింగ్ నియామకం
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ నియమితులయ్యారు. రక్షణ శాఖ పంపిన సిఫారసుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ బిక్రమ్ సింగ్ స్థానంలో దల్బీర్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. జూల్ 31న బిక్రమ్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత దల్బీర్ సింగ్ ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతారు. 59 ఏళ్ల దల్బీర్ సింగ్ ప్రస్తుతం ఆర్మీలో డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళంలో పనిచేశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. మరికొందరు నాయకులకు పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించారు. కడప జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డిని నియమించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్డం ఎన్నికల పరిశీలకుడిగా షౌకత్ అలీ, ప్రకాశం జిల్లా ఎన్నికల కో ఆర్డినేటర్‌గా అబ్దుల్ ఖదీర్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా జనక్ ప్రసాద్ వ్యవహరించనున్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఓవీ రమణను నియమించారు. ఇక వైఎస్ఆర్ సీపీ క్రిస్టియన్, మైనార్టీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా జార్జి హెర్బర్ట్, సీమాంధ్ర జిల్లాల మైనార్టీ సెల్ కో ఆర్డినేటర్‌గా నజీర్ అహ్మద్, వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యుడిగా ఇక్బాల్ హుస్సేన్ ఫరూకిలను నియమించారు. -
గవర్నర్ సలహాదారుల నియామకం
-
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం అధిపతిగా టక్కర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ విభాగానికి అధిపతిగా ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ విభాగంలో ముగ్గురు కార్యదర్శులను నియమించగా, కొత్తగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ను, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి ఎన్.శివశంకర్‌ను నియమించారు. అలాగే పది మంది డిప్యూటీ కార్యదర్శులను, ఐదుగురు అసిస్టెంట్ కార్యదర్శులను నియమించనున్నారు. ఈ విభాగంలో ఐదు సెక్షన్లను ఏర్పాటు చేస్తారు. ఇక విభజన పనికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలు అన్నీ కూడా ఈ విభాగం నుంచే సాగుతాయి. విభజనకు సంబంధించి ఏ అంశంలో మార్గదర్శకాలను జారీ చేయాలన్నా ఈ విభాగం నుంచే చేస్తారు.