వైఎస్సార్‌సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు | Ysrcp general secretaries, district presidents appointed | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు

Published Thu, Aug 21 2014 2:12 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

వైఎస్సార్‌సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు - Sakshi

వైఎస్సార్‌సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు

 జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. నియామకాలు చేసిన జగన్

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగానికి 8 మంది ప్రధాన కార్యదర్శులతోపాటుగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ నియమితులయ్యారు.

జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతి (శ్రీకాకుళం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), గుడివాడ అమర్‌నాథ్ (విశాఖపట్టణం), జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావరి), ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి), కె.పార్థసారథి (కృష్ణా -దక్షిణం), కొడాలి నాని (కృష్ణా-ఉత్తరం), మర్రి రాజశేఖర్ (గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (నెల్లూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి (వైఎస్సార్), శంకరనారాయణ (అనంతపురం), కె.నారాయణస్వామిలను (చిత్తూరు) నియమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement