district presidents
-
నూతన బాధ్యతలు..
-
CM YS Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలన్నారు. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే ...: ♦పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్ కోసం మిమ్మల్ని అందర్నీ పిలిచాం ♦రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో ఎలా పనిచేయాలన్నదానిపై ఒక ప్రణాళికను మీకు వివరిస్తాం ♦క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశిస్తున్నాం ♦గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ వెళ్తున్నారు. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నారు. ♦ఓ వైపు గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలి. దీనికోసం 10-15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించింది. ♦దీనికోసం 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ– గృహసారథులుగా ఉంటారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు వీళ్లు చూస్తారు. ♦అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీతరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారు. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. రాజకీయ అవగాహన ఉన్నవారు, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపికచేయాలి. ♦మొత్తంగా యాభైఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45 వేల మంది కన్వీనర్లు ఉంటారు. ♦ముందుగా చేయాల్సిన పని రాష్ట్రంలోని దాదాపు 15వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్ల ఎంపికను ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వీరిని ఎంపిక చేస్తారు. ఈ ప్రాసెస్ సక్రమంగా జరిగేలా నియోజకవర్గాల పరిశీలకులు చూస్తారు. ♦ఎంపిక పూర్తయిన తర్వాత ఈ సచివాలయాల పరిధిలోని పార్టీకి సంబంధించిన కన్వీనర్లు డోర్ టు డోర్ వెళ్లి పార్టీనుంచి సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్‌ని అందిస్తారు. ♦15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు. మొదటసారి ఇలా తిరగడం వల్ల ఆ సచివాలయాల పరిధిలో ఒక అవగాహన వస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూనే.. మరోవైపు సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకూ తిరుగుతారు. ♦అన్ని సచివాలయాల పరిధిలోకూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది. కన్వీనర్లు అన్నవారు స్థానికంగా నివసించిన వారై ఉండాలి. కన్వీకనర్ల ఎంపిక తర్వాత తదనంతరం ప్రతి యాభై ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులను ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహసారథులు కూడా అదే క్లస్టర్లకు చెందినవారై ఉండాలి. ♦సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు. ♦ఈ కార్యక్రమాలు ఎందుకంటే బూత్ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. నెట్వర్క్ బలంగా ఉండడం వల్ల గెలవటం అన్నది చాలా సులభం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కి 175 గెలవాలి. ♦బటన్ నొక్కడమే కాదు, ఈనెట్‌వర్క్ మొత్తం చాలా బలంగా పనిచేయాలి. ఈ నెట్వర్క్ అంతా బలంగా పనిచేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులుగా మీ అందరిమీదా ఉంది. డిసెంబర్20లోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడాలి. ♦మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం ఉండదు. కచ్చితంగా ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మీది. ♦గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా. దేవుడి దయ వల్ల వాతావరణం చాలా బాగుంది. మన ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. కార్పొరేషన్లలో 78 శాతం నుంచి 80 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. ఇలాంటి మంచి వాతావరణంలో మనం అడుగులు ముందుకేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు తిరగడానికి భయపడతారు. ♦కాని మొదటిసారి.. నాన్న హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో పథకాలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అర్హత ఉన్న వారికి ఎవ్వరికీ కూడా నిరాకరించకుండా పథకాలు అమలు చేశాం. మూడున్నరేళ్లుగా ప్రతి కుటుంబానికీ మేలు జరిగింది. మన పార్టీ వల్ల మేలు జరిగిందన్న సంతోషం ఎమ్మెల్యేలకూ ఉంది. పార్టీలో ఎక్కడైనా చిన్న చిన్న బేధాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది. -
CM YS Jagan: పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం భేటీ కానున్నారు. ఇటీవలే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్యేల పనితీరు, కిందిస్థాయి కార్యకర్తలు అభిప్రాయాలను అబ్జర్వర్ల ద్వారా తెలుసుకుంటున్నారు. సమావేశంలో పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం పరిశీలకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. చదవండి: (ఆ మాట జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి: సీఎం జగన్) -
వైఎస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల
-
వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చెవిరెడ్డి సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీలోని 23 అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రతి అనుబంధ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా పని చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జాబితా ►శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ ►విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి ►కాకినాడ, తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, మిథున్‌రెడ్డి ►కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ►పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి ►నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ►అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ►కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి జిల్లా అధ్యక్షుల జాబితా ►శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్ ►విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు ►పార్వతీపురం మన్యం - పరీక్షిత్ రాజు ►అల్లూరి సీతారామరాజు - కోటగుళ్ల భాగ్యలక్ష్మి ►విశాఖపట్నం - పంచకర్ల రమేష్ ►అనకాపల్లి - కరణం ధర్మశ్రీ ►కాకినాడ - కురసాల కన్నబాబు ►కోనసీమ - పొన్నాడ వెంటక సతీష్ కుమార్ ►తూర్పుగోదావరి - జక్కంపూడి రాజా ►పశ్చిమగోదావరి - చెరకువాడ శ్రీరంగనాథ రాజు ►ఏలూరు - ఆళ్ల నాని ►కృష్ణా - పేర్ని నాని ►ఎన్టీఆర్ - వెల్లంపల్లి శ్రీనివాసరావు ►గుంటూరు - డొక్కా మాణిక్య వరప్రసాద్ ►బాపట్ల - మోపిదేవి వెంకటరమణ ►పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►ప్రకాశం - జంకె వెంకటరెడ్డి ►నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ►కర్నూలు - బీవై రామయ్య ►నంద్యాల - కాటసాని రాంభూపాల్‌రెడ్డి ►అనంతపురము - పైలా నరసింహయ్య ►శ్రీసత్యసాయి జిల్లా - మాలగుండ్ల శంకరనారాయణ ►వైఎస్సార్ కడప - కొట్టమద్ది సురేష్‌బాబు ►అన్నమయ్య - గడికోట శ్రీకాంత్‌రెడ్డి ►చిత్తూరు - కె నారాయణస్వామి ►తిరుపతి - నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చదవండి: (ముస్లిం మైనార్టీలపై బాబు మొసలి కన్నీరు) -
టార్గెట్ 175.. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తే సాధ్యమే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి ప్రతి నెలా పథకాలను అందిస్తుండటాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా నిర్వహించే బాధ్యత మీదేనని ప్రాంతీయ సమన్వయర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీనిపై ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం సమావేశమై మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. నెలలో కనీసం 10 రోజులు ‘ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టాం. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. మీ నియోజకవర్గాలే కాకుండా మీకు అప్పగించిన బాధ్యతలను కూడా నెరవేర్చాలి’ అని సీఎం జగన్ నిర్దేశించారు. ‘పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ అందరిపై నమ్మకంతో ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించా’ అని గుర్తు చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. నిధులు సద్వినియోగం బాధ్యత మీదే.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదేనని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో కచ్చితంగా ఆరు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు స్పష్టం చేశారు. బూత్ స్థాయిల నుంచి కమిటీల నియామకం బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బూత్ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలని స్పష్టం చేశారు. వాటితోపాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని, పథకాల్లో సింహభాగం వారికే అందిస్తున్నామని గుర్తు చేశారు. అదే రీతిలో పార్టీ బూత్ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. వాస్తవాలతో ప్రజల్లోకి: గడికోట అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించామని, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా చేకూర్చిన మేలును నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సీఎం జగన్ ఆదేశించారని శాసనసభా వ్యవహారాల కో ఆర్డినేటర్, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా నినాదం అని ఆయన ప్రకటించారు. శుక్రవారం తాడేపల్లిలో గడికోట విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారన్నారు. అనుబంధ సంఘాలు సహా అన్ని కమిటీల ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. ఆగస్టు లోపు వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలు, అక్టోబర్ లోపు మిగిలిన అన్ని కమిటీలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఇక రానున్న రోజుల్లో సీఎం జగన్ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉంటారని చెప్పారు. ఎల్లో మీడియాను ఎదుర్కొన్న పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. -
బాధ్యతగా పనిచేయాలి: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. మండల, గ్రామ, బూత్‌స్థాయి కమిటీల నియామకంపై సీఎం కీలక దృష్టి సారించారు. చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలన్నారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని సీఎం అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే: ♦మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించాను ♦అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలి ♦పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలి ♦క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలి ♦జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో కో–ఆర్డినేట్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలి ♦వీరంతా ప్రభావంతంగా పనిచేయాలి ♦గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి ♦నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత మీది ♦కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీది ♦కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలి ♦ప్రభుత్వపరంగా క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిస్తున్నాం, దీనికి తోడు గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేసుకుంటే గెలుపు అన్నది అసాధ్యం కానేకాదు ♦ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నాం ♦సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా మీమీద ఉంది ♦ప్రతినెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నాం ♦ఇవి జాగ్రత్తగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది ♦ జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తికావాలి ♦అలాగే పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలి ♦మహిళా సాధికారితకోసం ఈప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది ♦ పథకాల్లో సింహభాగం వారిదే ♦బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా వారికి ప్రాధాన్యత ఉండేలా చూసుకోండి ♦ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతాను: సీఎం ♦దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తాం: సీఎం -
పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం
AP CM Jagan Mohan Reddy Announces Roadmap For 2024 Assembly Polls: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకుగాను 175 ఎందుకు రాకూడదు? గతంలో కుప్పంలో మనం గెలవలేదు. కానీ కుప్పం మునిసిపాలిటీని గెలిచాం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాం. అలాంటిది వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఎందుకు గెలవలేం? చేయాల్సిన కార్యక్రమాలను సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పక గెలుస్తాం. మనం ఒదిగి ఉంటూ ప్రజలకు చేసిన మంచిని చెప్పాలి. మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలని కోరాలి. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది. ప్రజలకు ఇంత మంచి చేసి గొప్ప గెలుపు ఎందుకు సాధించలేం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం. పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లోనే చెప్పా. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించామని, జిల్లాల ఇన్చార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశామని.. వీరందరినీ మంత్రులు గౌరవించాలని చెప్పారు. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం అని.. అందరూ కలసికట్టుగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా నియమించి కేబినెట్ హోదా కల్పిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వచ్చే రెండేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి మార్గ నిర్దేశం చేస్తూ మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తమ కన్నా ఎక్కువ అనే భావనతో మంత్రులు ఉండాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాల్సిందే ► రెండేళ్లలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. మంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా తప్పనిసరిగా గడపగడపకూ కార్యక్రమం నిర్వహించాలి. మంత్రి అయినప్పటికీ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారనే భావన ప్రజలకు కలగాలి. ప్రతి మంత్రీ దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ► మంత్రి అయ్యాక మాకు ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చారనే పాజిటివ్ టాక్ మీకు ప్లస్ అవుతుంది. మంత్రులంతా కచ్చితంగా జిల్లా అధ్యక్షులతో, రీజినల్ కో ఆర్డినేటర్లతో పూర్తిగా అనుసంధానం కావాలి. మంత్రులుగా ఉన్నవారు తామే నాలుగు అడుగులు వెనక్కి వేసి మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలి. దీనివల్ల వారి పెద్దరికం పెరుగుతుంది. ► జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు తీసుకుంటున్న వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్టీని గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు మంత్రులుగా వస్తారు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ► సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో లబ్ధిదారులకు రూ.1.37 లక్షల కోట్లు అందజేశాం. వచ్చే రెండేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఇస్తాం. తద్వారా సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు అందించినట్లు అవుతుంది. ► వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పని చేయాలి. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నాం. రెప్పపాటులో రెండేళ్లు పూర్తవుతాయి.. ► మనం అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. కళ్లు మూసుకుని తెరిచేలోగానే మిగిలిన రెండేళ్లు కూడా పూర్తవుతాయి. మనం వేగంగా అడుగులు ముందుకేయాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనం అధికారంలో కొనసాగాలి అంటే.. అడుగులు కరెక్ట్‌గా వేయాలి. కిందటసారి వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వచ్చే కార్యక్రమం చేయాలి. ► హోప్ అన్నది.. రియల్టీకన్నా.. చాలా బలమైనదని సాధారణంగా వింటాం. కానీ మొట్టమొదటిసారిగా రియాల్టీ కూడా చాలా బలమైనదని మనం నిరూపించాం. మేనిఫెస్టోలోని హామీలలో 95 శాతం మనం ఇప్పటికే నెరవేర్చాం. మొదటి మూడేళ్లు మేనిఫెస్టో అమలుపై దృష్టిపెట్టాం. ► రేపు లేదు అన్న ధోరణిలో వేగంగా మేనిఫెస్టోను అమలు చేస్తూ అడుగులు ముందుకేశాం. అందులో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేశాం. గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. డీబీటీ (నేరుగా నగదు బదిలీ) విధానాన్ని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమలు చేశాం. ఇంత బలమైన ఫెర్ఫార్మెన్స్ చూపించి ఎన్నికలకు వెళ్లడం అన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. మే నుంచి గడపగడపకూ.. ► మే రెండో వారం నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రతి ఎమ్మెల్యే గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది సచివాలయాలను సందర్శించి ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు పర్యటించాలి. ఆ రెండు రోజులు ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పర్యవేక్షించాలి. ► గడపగడపకూ కార్యక్రమం తొలిదఫా పూర్తి కావడానికి దాదాపు 8–9 నెలలు పడుతుంది. అవినీతి, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. వలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తే ఎమ్మెల్యేలకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగిందనేది మీ దగ్గర సమాచారం ఉంటుంది. ► అక్కచెల్లెమ్మల పేరుమీద మీకు లెటర్స్ ఇస్తాం. ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం చేసిన మంచిని అందులో వివరిస్తాం. ఆ ఇంట్లో అమ్మఒడి, ఆసరా, చేయూత, పింఛన్, ఇళ్ల పట్టాలు.. ఇలా ఎప్పుడు ఏ పథకం ఇచ్చామన్నది అందులో తెలియచేస్తాం. ప్రతి ఇంటికీ వెళ్లి దేవుడి దయతో ఈ మంచి చేయగలిగామని ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రానున్న రెండేళ్లూ ఇలాంటి మంచి చేస్తామని చెప్పాలి. ► మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ప్రతి కుటుంబం ఆశీస్సులు పొందాలి. మూడేళ్లలో చేసిన మంచిని గుర్తు చేస్తాం. దాంతోపాటు మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశాం, ఏ స్థాయిలో అమలు చేశామన్న వివరాలతో.. నాడు–నేడు కింద గత సర్కారు ఏం చేసిందీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది.. అనే అంశాలపై మూడు కరపత్రాలు ఇస్తాం. వీటిని ప్రతి ఇంటికీ ఇచ్చి వాటి మీద వారే టిక్కులు పెట్టొచ్చు. ఈ సమావేశంలో ఉన్నవారికి ఇవన్నీ అదనపు బాధ్యతలు. మీ గ్రాఫ్‌ను పెంచుకోవడమే కాదు.. మీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌నూ పెంచుకోవాలి. మీరు సమర్థులని భావిస్తున్నా కాబ్టటి మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నా. బూత్ కమిటీల్లో 50 శాతం మహిళలు.. ► సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించినప్పుడు గడపగడపకూ పర్యటించడమే కాకుండా క్యాడర్‌ను ఏకం చేయాలి. సచివాలయంలో రెండు రోజుల పర్యటన కాగానే బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలి. బూత్ కమిటీలకు శిక్షణ అత్యంత ముఖ్యం. కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండాలి. కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూడాలి. ► ఆ గ్రామంలో ఉన్న ప్రతి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించాలి. ఎవరినీ విస్మరించవద్దు. బూత్ కమిటీలో కనీసం 10 మంది ఉండాలి. అవసరం మేరకు పెంచుకోవాలి. 90 శాతం పథకాలను సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో మహిళలకే ఇస్తున్నాం. ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాం. కుటుంబాలు బాగుండాలనే మనం వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దుష్ట చతుష్టయంపై యుద్ధం ► మన యుద్ధం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 లాంటి చెడిపోయిన వ్యవస్థలతో కూడా యుద్ధం చేస్తున్నాం. వాళ్ల అజెండా వేరు. మనం దిగిపోయి చంద్రబాబు అధికారంలోకి రావాలన్నది వారి అజెండా. దీన్ని కౌంటర్ చేయాలంటే ప్రజలకు నిజాలేమిటో చెప్పాలి. స్థిరంగా ఇది కొనసాగాలి. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ► రాబోయే రోజుల్లో ఎల్లో మీడియా ప్రతి ఎమ్మెల్యేనూ లక్ష్యంగా చేసుకుంటుంది. కట్టుకథలు అల్లి విష ప్రచారం చేస్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. వీరంతా దుష్టచతుష్టయం. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. అది జరగకముందే గ్రామాల్లోని మన క్యాడర్‌కు సరైన సమాచారాన్ని చేరవేయాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. ► ఈ రోజు నుంచీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే తీరును పెంచుకోవాలి. ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు అందరూ ప్రజలకు సుపరిచితులే. ఎల్లో మీడియా ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు తప్పనిసరిగా మనమంతా ఖండించాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. గ్రామ స్థాయిలో కూడా మనకు సోషల్‌మీడియా వారియర్స్ ఉండాలి. గడపగడపకూ పూర్తయ్యే సరికి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా వారియర్స్ ఉండాలి. ఇందులో క్యాడర్ కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్లీనరీలోగా సంస్థాగత నిర్మాణం ► జూలై 8న పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నాం. ఈలోగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, 50 శాతం మహిళలకు జిల్లా కమిటీల్లో స్థానం కల్పించాలి. ఎమ్మెల్యేల వద్ద నుంచి మండల కమిటీ అధ్యక్షుల జాబితా తీసుకోవాలి. గ్రామ కమిటీల అధ్యక్షులను కూడా తీసుకోవాలి. తర్వాత రీజనల్ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు వారి సహాయంతో మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. ► పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల గురించి నిరంతర అనుసంధానం కోసమే ఈ ఏర్పాటు. కమిటీల ఏర్పాటులో తప్పులు, అలసత్వం లేకుండా చూసుకోవాలి. ఎమ్మెల్యేలను బలపరచడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. క్రియాశీలంగా కమిటీలు పనిచేయడానికే ఈ విధానం. ప్లీనరీ నాటికి కమిటీల ఏర్పాటు కావాలి. గడపగడపకూ పూర్తయ్యే నాటికి అంటే 8 నెలల పూర్తయ్యే సరికి బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. మరింత సమర్థంగా సచివాలయాలు ► సచివాలయాల విధులపరంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సచివాలయాల సమర్థత మరింత పెరుగుతుంది. గ్రామాలకు వెళ్లినప్పుడు ఇప్పటికే నాడు–నేడు తొలిదశ కింద పనులు పూర్తి చేసుకున్న వాటిని ప్రారంభించి మిగిలిన స్కూళ్లలో రెండోదశ పనులకు శంకుస్థాపన చేయాలి. ► మూడేళ్లలో పెద్ద వ్యవస్థను సృష్టించాం. కార్పొరేషన్లు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు.. ఇలా ప్రతి ఎన్నికలోనూ గెలిచి పెద్ద వ్యవస్థను సృష్టించుకున్నాం. వీరందర్నీ క్రియాశీలం చేయాలి. ఇది జిల్లా అధ్యక్షుల బాధ్యత. ► వీరందరి సేవలనూ మనం ఉపయోగించుకోవాలి. దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. జరిగిన మంచి గురించి ఎక్కువ మంది మాట్లాడేలా చేయగలగాలి. మనం చేసిన మంచి ప్రచారంలో ఉండాలి. దీని వల్ల పార్టీకి సానుకూల పవనాలు వీస్తాయి. వివిధ పార్టీ విభాగాలను చైతన్యం చేయాలి. -
వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే
District President List Of TRS Party: వివిధ కారణాలతో చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎట్టకేలకు పూర్తిచేశారు. బుధవారం ఈ మేరకు జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ఎంపిక చేశారు. పార్టీ నూతన అధ్యక్షులుగా ఎంపికైన నేతలను మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అభినందించారు. జిల్లా అధ్య క్షులుగా నియమితులైన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన కొత్త అధ్యక్షులు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిం చిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు సీఎంను బుధవారం ప్రగతిభవన్‌లో కలిశారు. బడుగుల లింగయ్య యాదవ్ (సూర్యాపేట), రామకృష్ణారెడ్డి (యాదాద్రి), రమావత్ రవీంద్రకుమార్ (నల్లగొండ) కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వీరివెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు తదితరులున్నారు. దాస్యం వినయ్‌భాస్కర్ (హన్మకొండ), ఆరూరి రమేశ్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూ బాబాద్) కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి కూడా కేసీఆర్‌ను కలిశారు. గువ్వల బాలరాజు (నాగర్‌కర్నూలు) వెంట మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రగతిభవన్‌కు వచ్చారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్త గూడెం అధ్యక్షుడు ఎమ్మెల్యే కాంతారావు కూడా సీఎంను కలిశారు. -
పట్టాలెక్కేందుకు.. టీడీపీ ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వలసలతో చిక్కిశల్యమైన టీడీపీ మళ్లీ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేయి తిప్పుకునేందుకు ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధ్యక్షులను, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ని నియమించింది. నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ యూసుఫ్, సూర్యాపేటకు పెద్దిరెడ్డి రాజా, యాదాద్రి భువనగిరికి బండ్రు శోభారాణిలను అధ్యక్షులుగా అధినాయకత్వం నియమించింది. నల్లగొండ అసెంబ్లీ ఇన్చార్జ్గా మాదగోని శ్రీనివాస్‌గౌడ్ పేరును ప్రకటించింది. తెలంగాణ టీడీపీ నుంచి కొన్నాళ్లుగా అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు జరిగాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్య నేతలంతా ఖాళీ అయ్యారు. ఫలితంగా పార్టీ సంస్థాగతంగా కోలుకోలేకుండా అయ్యింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయినా ఆశలు సజీవంగా నిలుపుకొని నిలబడింది. వరుస కట్టిన సీనియర్లు కొద్ది నెలలుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల తర్వాత ఒక్కో సీనియర్.. పార్టీని వదలడంతో కుదేలైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే సీనియర్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్‌ల వలసలతో మొదలై.. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న బిల్యానాయక్ , గత ఎన్నికల్లో పార్టీనుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఉమామాధవరెడ్డి, సూర్యాపేటనుంచి పటేల్ రమేష్‌రెడ్డి తదితరులు పార్టీని వీడారు. మరోవైపు నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం రెండునెలల కిందటే పార్టీనుంచి టీఆర్ఎస్కు వెళ్లిపోయారు. ఈ వరుస పరిణామాల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ బతికి బట్టకట్టడం అసాధ్యమన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమైంది. కానీ, ఈ పరిస్థితినుంచి బయటపడి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి కోలుకునే దిశగా ఆ పార్టీ నాయకత్వం కాయకల్ప చికిత్స మొదలు పెట్టిందని, దీనిలో భాగంగానే మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించిందని, మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవులకు పోటాపోటీ ! గ్రూపు గొడవలకు తావులేకుండా జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని భావించిన పార్టీ నాయకత్వం పలువిడతలుగా జిల్లా నాయకులతో చర్చలు జరిపింది. నల్లగొండ జిల్లా అధ్యక్షపదవి కోసం యూసుఫ్‌తోపాటు నల్లగొండ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్, దేవరకొండ నుంచి వెంకట్‌రెడ్డి పోటీ పడ్డారు. సూర్యాపేట కోసం పెద్దిరెడ్డి రాజాతోపాటు కోదాడ ఇన్చార్జ్ బొల్లం మలయ్య యాదవ్ ప్రయత్నించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి అధ్యక్ష పదవి కోసం బండ్రు శోభారాణితో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన అయిలయ్య పోటీ పడ్డారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలే యాదాద్రి భువనగిరి జిల్లాలో కలవడంతో, మెజారిటీ శ్రేణులు ఆయన పేరును వ్యతిరేకించారని సమాచారం. అసెంబ్లీ నియోజకర్గ ఇన్చార్జులుగా ఉన్న వారికి అధ్యక్ష పదవులు ఇవ్వొద్దని సంస్థాగతంగా నిర్ణయించడంతో కోదాడ ఇన్చార్జ్గా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్‌ను పక్కన పెట్టారని తెలిసింది. నల్లగొండ ఇన్చార్జ్గా నియమిస్తున్నందున మాదగోని శ్రీనివాస్‌ను ఎంపిక చేసుకోలేదని సమాచారం. ఇక, మూడు జిల్లాల్లో సామాజిక సమీకరణ సమతూకం ఉండడానికే నల్లగొండ జిల్లాకు మైనారిటీ నేతను అధ్యక్షుడిగా ఎంచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. -
జిల్లా టీడీపీ అధ్యక్షుల పేర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు అయ్యాయి. గురువారం రాత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యా రు. జిల్లా అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేశారు. మొత్తం 25 జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటించగా, వివిధ కారణాలతో కొన్ని పేర్లు పెండింగ్‌లో పెట్టారు. 01. నిర్మల్– వేలం శ్యాంసుందర్ (మాదిగ), 02. ఆదిలాబాద్– సోయం బాపూరావు (ఎస్టీ–గోండు), 03. మంచిర్యాల– బోడ జనార్దన్ (మాల), 04. ఆసిఫాబాద్– గుళ్లపల్లి ఆనంద్ (పద్మశాలి), 05. నిజామాబాద్– అరికెల నర్సారెడ్డి (రెడ్డి) 06. కామారెడ్డి– సుభాష్‌రెడ్డి (రెడ్డి) 07. పెద్దపల్లి– విజయ రమణరావు (వెలమ), 08. కరీంనగర్– కవ్వంపల్లి సత్యనారాయణ (మాదిగ), 09. జగిత్యాల– ఐలినేని సాగర్‌రావు (వెలమ), 10. సిరిసిల్ల– అన్నంనేని నర్సింగరావు (వెలమ), 11. సంగారెడ్డి– శశికళా యాదవ్రెడ్డి (రెడ్డి) 12. సిద్దిపేట– ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (రెడ్డి), 13. వికారాబాద్– సుభాష్ యాదవ్ (యాదవ్), 14. రంగారెడ్డి– సామ రంగారెడ్డి (రెడ్డి), 15. మేడ్చల్– తోటకూర జంగయ్య (యాదవ), 16. వరంగల్ రూరల్– గన్నోజు శ్రీనివాసచారి (విశ్వబ్రాహ్మణ), 17. వరంగల్ అర్బన్– ఈగ మల్లేశం (పద్మశాలి), 18. భూపాలపల్లి– గండ్ర సత్య నారాయణరావు (వెలమ), 19.జనగాం– కొండామధుసూదన్రెడ్డి (రెడ్డి), 20. సూర్యాపేట్– పటేల్ రమేశ్‌రెడ్డి (రెడ్డి) 21. మెదక్– ఏకే గంగాధరరావు (వెలమ) 22. హైదరాబాద్– ఎంఎన్ శ్రీనివాస్ (మాల), 23. యాదాద్రి– ఎలిమినేటి సందీప్‌రెడ్డి (రెడ్డి), 24. మహబూబాబాద్– చుక్కల విజయ్‌చందర్ (ముదిరాజ్) 25. నల్లగొండ– బిల్యా నాయక్ (లంబాడీ) -
టీఆర్ఎస్ జిల్లా కమిటీలపై మల్లగుల్లాలు!
- సీఎం కేసీఆర్ చేతిలో జిల్లా అధ్యక్షుల జాబితా - కార్యవర్గాల కూర్పుపై మాత్రం జిల్లా నేతల తంటాలు - పలుచోట్ల విపరీతమైన పోటీ - రెండు రోజుల్లో కమిటీలు ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: పార్టీ సంస్థాగత కమిటీల నియామకం వ్యవహారం అధికార టీఆర్ఎస్లో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల కమిటీలు, ప్రతి జిల్లాలో తొమ్మిది అనుబంధ సంఘాల కమిటీలను ఒకేసారి ప్రకటించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కమిటీల ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. టీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు 4, 5వ తేదీల్లో కమిటీల్ని ప్రకటించే అవకాశముంది. ముందుగా జిల్లా అధ్యక్షులను ప్రకటించనున్నారు. అయితే పలు జిల్లాల్లో కార్యవర్గాల కూర్పు ఇంకా కుదరకపోవడంతో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సమీక్షలు జరుపుతున్నారు. అన్ని వర్గాల వారిని, ముందు నుంచి పార్టీకి సేవ చేసిన వారిని సంతృప్తి పరిచేలా కార్యవర్గాలను తీర్చిదిద్దుతున్నారు. కొన్ని జిల్లాలకు పాత అధ్యక్షులే! జిల్లా అధ్యక్షుల నియామకాన్ని తనకు వదిలేయాలని కేసీఆర్ ఇప్పటికే సూచించినా... ఆయా జిల్లాల నుంచి ఇద్దరు ముగ్గురి పేర్లతో కూడిన జాబితాలు ఆయనకు అందాయి. అన్ని కోణాల్లో పరిశీలించి ఆ పేర్ల నుంచే అధ్యక్షులను నిర్ణయించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 31 జిల్లాలకు గాను కొన్ని జిల్లాల్లో పాత అధ్యక్షులనే కొనసాగించనున్నట్లు పేర్కొంటున్నాయి. మొదట ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలన్న చ ర్చ జరిగినా.. వివిధ కారణాల వల్ల ఇతరులకే ఎక్కువ అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల పోటా పోటీ వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో ఇద్దరికి మించి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోనూ పోటీ ఉంది. స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్, ములుగు జెడ్పీటీసీ సభ్యుడు సకినాల శోభన్ , ఎస్.శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడుతున్నారు. శోభన్, శ్రీనివాస్‌రెడ్డి పేర్లను మంత్రి చందూలాల్ ప్రతిపాదించారు. ఇక స్పీకర్ నేరుగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేనందున తన తనయుడి పేరు ప్రతిపాదించారని, అది కుదరకపోతే మరో ఇద్దరి పేర్లనూ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. నిర్మల్‌లో సత్యనారాయణగౌడ్, రామకృష్ణారెడ్డిల మధ్య పోటీ ఉంది. ఆసిఫాబాద్‌లో కావేటి సమ్మయ్య, ఆర్కే నాగేశ్వర్‌రావులో ఒకరికి ఖాయం కానుంది. సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, వెంకటేశ్‌గౌడ్, ఆర్.సత్యనారాయణల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మెదక్‌లో ఎలక్షన్‌రెడ్డి, ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న మురళీ యాదవ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. వనపర్తి జిల్లాలో బి.లక్ష్మయ్య, శ్రీధర్‌గౌడ్ పోటీలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి పి.రాములు, తోకల మనోహర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కొన్ని పేర్లు ఖరారు.. పలువురు పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆరుగురు పాత అధ్యక్షులకే మళ్లీ అవకాశం దక్కనుంది. ఆది లాబాద్కు-లోక భూమారెడ్డి, నిజామాబాద్‌కు ఈగ గంగారెడ్డి, మహబూబాబాద్‌కు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఖమ్మంకు బుడన్ బేగ్, మహబూబ్‌నగర్‌కు శివకుమార్, వికారాబాద్ జిల్లాకు నాగేందర్గౌడ్లనే కొనసాగించే అవకాశముంది. ఇక రంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, మేడ్చల్‌కు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నల్లగొండకు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేటకు ఎర్నేని వెంకటరత్నం బాబు, భువనగిరికి కె.రామకృష్ణారెడ్డి, కరీంనగర్‌కు రామకృష్ణారావు, సిరిసిల్లకు తోట ఆగయ్య, పెద్దపల్లికి వెంకటరమణారెడ్డి, కామారెడ్డికి ముజీబుద్దీన్, సిద్దిపేటకు వేలేటి రాధాకృష్ణశర్మ, కొత్తగూడెంకు తాళ్లూరి వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని తెలుస్తోంది. -
త్వరలో విడుదల
టీఆర్ఎస్ సారథుల ఖరారు కేసీఆర్‌దే తుది నిర్ణయం రేపు ప్రకటించే అవకాశం ! కడియం ఇంట్లో ఐదు జిల్లాల నేతల భేటీ జిల్లా కార్యవర్గాల కూర్పు పూర్తి సాక్షి, వరంగల్ : టీఆర్ఎస్లో పార్టీ పదవుల పంపకాల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. జిల్లా అధ్యక్షులను అధినేత కేసీఆర్ నిర్ణయించనున్నారు. జిల్లాల వారీగా ముఖ్యనేతల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకున్నారు. దీపావళి రోజున కొత్త జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటే కార్యవర్గాలను కూడా ప్రకటించేలా కసరత్తు జరుగుతోది. జిల్లాల కార్యవర్గాల్లో ఎవరెవరిని నియమించాలనే అంశంపై ఐదు జిల్లాల టీఆర్ఎస్ నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారిక నివాసంలో ఈ భేటీలు జరిగాయి. ఎమ్మెల్యేలు రాకపోవడంతో వరంగల్ అర్బన్ జిల్లా సమావేశం జరగలేదు. వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల సమావేశాలు పూర్తయ్యాయి. జిల్లా కమిటీల్లో ప్రాతినిథ్యంపై స్పష్టత వచ్చింది. ఏ నియోజకవర్గానికి ఏ పదవి ఇవ్వాలనే విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన పదువులకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఎమ్మెల్యేలకు నిర్ణయాధికారం ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా శనివారం ఉదయం పార్టీ పదవుల్లో నియమించే వారి పేర్ల జాబితాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల కార్యవర్గాల పేర్ల జాబితాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సాయంత్రంలోపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయాల్సి ఉంది. అనంతరం జిల్లాల అధ్యక్షులతోపాటు కార్యవర్గాలను ప్రకటించనున్నారు. ఆదివారం రోజే కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదిలక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న జిల్లాలకు 24 మందితో జిల్లా కార్యవర్గం ఉంటుంది. మిగిలిన జిల్లాలకు 15 మందితో జిల్లా కమిటీ ఉంటుంది. వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు 15 మందితో కమిటీలు ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఒకరు చొప్పన, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శలు, ఐదుగురు కార్యవర్గ సభ్యులతో జిల్లా కార్యవర్గం ఉంటుంది. అన్ని జి ల్లా కమిటీలకు అనుబంధంగా ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువజన, రైతు, కార్మిక, విద్యార్థి కమిటీలు ఉంటా యి. అనుబంధ కమిటీల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు కార్యదర్శులు, నలుగురు సభ్యులు ఉంటారు. ఇలా తొమ్మిది అనుబంధ సంఘాలకు కలిపి 90 మందికి కమిటీల్లో చోటు దక్కుతుంది. అర్బన్ జిల్లాపై అనిశ్చితి... మిగిలిన నాలుగు జిల్లాలతో పోల్చితే వ రంగల్ అర్బన్ జిల్లా కమిటీలో ఎక్కువ మందికి చోటు దక్కనుంది. పది లక్షల జ నాభా కంటే ఎక్కువ ఉన్నందున 25 మం దితో వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఉం టుంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శలు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు వరంగల్ అర్బన్ జిల్లా కమిటీలో ఉండనున్నారు. ముఖ్యనేతల గైర్హాజరుతో వరంగల్ అర్భన్ జిల్లా సమావేశం జరగలేదు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు అరూరి రమే శ్, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఈ సమావేశానికి వచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండ మురళీధర్‌రావు హాజరు కాలేదు. ముఖ్యనేతలు హాజరుకాకపోవడంతో అర్బన్ జిల్లా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను శనివారం ఉదయం పంపించాలని ఎమ్మెల్యేలకు సూ చించారు. కుడా చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వచ్చే విషయంలో రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఈ సమావేశానికి వెళ్లనట్లు తెలిసింది. -
ఎమ్మెల్యేలకే జిల్లా అధ్యక్ష బాధ్యతలు!
• టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం? • అధికార పార్టీలో జోరుగా చర్చ • మొదలైన సంస్థాగత ఎన్నికల సందడి సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కానున్నారా..? కొత్త జిల్లాల్లో పార్టీకి ఎమ్మెల్యేలను అధ్యక్షులను చేయడం ద్వారా పార్టీని మరింతగా ప్రజల్లో విస్తరించాలని గులాబీ నాయకత్వం భావిస్తోందా.. ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఆ వర్గాల సమాచారం మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ దిశగా ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అసలు కొత్త జిల్లాల ఏర్పాటుతో పార్టీకి కొత్త కమిటీలను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. పాలనకు సంబంధించి ఒక్కో మంత్రికి కనీసం రెండు జిల్లాల బాధ్యతలు అప్పజెప్పాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. పార్టీ విషయానికి వచ్చే సరికి ఒకేసారి కొత్తగా 21 జిల్లాలకు కమిటీలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. పార్టీ కార్యకలాపాలను మరింతగా విస్తృత పరిచేందుకు వీలైనంత త్వరగా ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమించాలని.. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలకే ఆ బాధ్యతలను అప్పజెప్పాలన్న నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదిన్నరగా కమిటీలన్నీ ఖాళీ వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలు ఇప్పటికీ భర్తీ కాలేదు. గతేడాది ప్లీనరీ సమయానికే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడిని రెండేళ్ల పదవీ కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ప్లీనరీ కూడా ముగిసింది. గ్రామ, మండల కమిటీలు భర్తీ అయినా... జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి కాలేదు. చివరకు పొలిట్‌బ్యూరో సైతం భర్తీ కాలేదు. ప్రస్తుతం పార్టీ పదవుల్లో ఉన్న జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడి పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏర్పాటవడంతో దీపావళి నాటికి కొన్ని జిల్లా కమిటీలను నియమించాలనే నిర్ణయానికి అధినాయకత్వం వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఏర్పాటైన 125 మండలాలకూ మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పార్టీ అనుబంధ సంఘాల పదవులన్నీ ఖాళీగానే ఉన్నాయి. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక విభాగాలకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను భర్తీ చేయాల్సి ఉంది. వాటన్నింటినీ భర్తీ చేయడం ద్వారా పార్టీలోని సీనియర్లందరికీ సంస్థాగత పదవులు దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ప్లీనరీ సమయంలో నియమించే కమిటీలే ఆ తర్వాత రెండేళ్ల కాలానికి అంటే 2019 సార్వత్రిక ఎన్నికల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ఆరు నెలల కాలానికి తాత్కాలిక కమిటీలను నియమిస్తే నేతల పనితీరుపై ఓ అంచనాకు రావచ్చొన్న అభిప్రాయంలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలు తగ్గడంతో.. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో మూడు నుంచి 5 నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలే జిల్లా అధ్యక్షులైతే మెరుగ్గా ఉంటుందన్న చర్చ జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల అజమాయిషీతో పార్టీ కేడర్‌ను కూడా బాగా పనిచేయించుకోవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఎమ్మెల్యేలు లేరు. -
టీడీపీ జిల్లా అధ్యక్షుల మార్పు?
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జిల్లా మహానాడుల్లో వీరిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలుగా మారారు. మరికొందరు అంతకు ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలయ్యారు. వీరు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టక పోవడం, కనీసం సమావేశాలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొనడంతో అధ్యక్షులను మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న గౌనివారి శ్రీనివాసులు నాయుడు (చిత్తూరు), చక్రపాణిరెడ్డి (కర్నూలు), బుద్ధా వెంకన్న(విజయవాడ అర్బన్), జగదీష్ (విజయనగరం) రవిచంద్ర యాదవ్(నెల్లూరు) ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలు పార్థసారథి (అనంతపురం), జనార్దన్(ప్రకాశం), వాసుపల్లి గణేష్ కుమార్ (విశాఖ అర్బన్) జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతామాలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పుపై బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందో తమకు ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరికి చంద్రబాబు సూచించారు. వీవీవీ చౌదరి జిల్లాల వారీగా రెండు, మూడు పేర్లతో నివేదికలు రూపొందించి చంద్రబాబుకు అందిస్తారని సమాచారం. తునిలో జరిగిన విధ్వంసంపై ఈ సమావేశంలో చర్చించారు. మార్చి 1 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా వైఎస్సార్సీపీ చుట్టూ తిరిగేలా ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై సమాలోచన జరిపారు. సమావేశాలు ప్రారంభమయ్యేలోగా తుని ఘటనలో ఎఫ్ఐఆర్లో పేర్లున్న వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసి హడావిడి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. -
వైఎస్సార్సీపీ ఏపీ విభాగానికి ఎనిమిదిమంది ప్రధాన కార్యదర్శులు
జిల్లాలకు కొత్త అధ్యక్షులు.. నియామకాలు చేసిన జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగానికి 8 మంది ప్రధాన కార్యదర్శులతోపాటుగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులుగా సుజయ్ కృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులుగా రెడ్డి శాంతి (శ్రీకాకుళం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), గుడివాడ అమర్నాథ్ (విశాఖపట్టణం), జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావరి), ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి), కె.పార్థసారథి (కృష్ణా -దక్షిణం), కొడాలి నాని (కృష్ణా-ఉత్తరం), మర్రి రాజశేఖర్ (గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ప్రకాశం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (నెల్లూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (కర్నూలు), ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి (వైఎస్సార్), శంకరనారాయణ (అనంతపురం), కె.నారాయణస్వామిలను (చిత్తూరు) నియమించారు. -
రాష్ట్రంలోని వివిధ జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇడుపులపాయలో జరిగిన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశాలలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన సభా ముఖంగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా - ధర్మాన కృష్ణదాస్ విజయనగరం జిల్లా - పెన్మత్స సాంబశివరాజు విశాఖ జిల్లా - బి.వెంకట్రావ్ తూ.గో.జిల్లా - కుడిపూడి చిట్టాబ్బాయ్ ప.గో.జిల్లా - తెల్లం బాలరాజు కృష్ణా జిల్లా - సామినేని ఉదయభాను గుంటూరు జిల్లా - మర్రి రాజశేఖర్ ప్రకాశం జిల్లా - నూకసాని బాలాజీ నెల్లూరు జిల్లా - మేరుగ మురళీధర్ చిత్తూరు జిల్లా - నారాయణస్వామి వైఎస్ఆర్ కడప జిల్లా - సురేష్‌బాబు అనంతపురం జిల్లా - ఎం.శంకర్‌నారాయణ మహబూబ్‌నగర్ జిల్లా - ఎడ్మ కిష్ణారెడ్డి ఆదిలాబాద్ జిల్లా - వినాయక్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా - డాక్టర్ మధుశేఖర్ కరీంనగర్ జిల్లా - సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మెదక్ జిల్లా - భట్టి జగపతి వరంగల్ జిల్లా - ముత్తినేని సోమేశ్వరరావు ఖమ్మం జిల్లా - పాయం వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా - శేఖర్‌గౌడ్ హైదరాబాద్ జిల్లా - ఆదం విజయకుమార్ నల్గొండ జిల్లా - గట్టు శ్రీకాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ - ఎడ్మ కృష్ణారెడ్డి