సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. మండల, గ్రామ, బూత్‌స్థాయి కమిటీల నియామకంపై సీఎం కీలక దృష్టి సారించారు.
చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలన్నారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని సీఎం అన్నారు.
సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే:
♦మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించాను
♦అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలి
♦పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలి
♦క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలి
♦జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో కో–ఆర్డినేట్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలి
♦వీరంతా ప్రభావంతంగా పనిచేయాలి
♦గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి
♦నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత మీది
♦కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీది
♦కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలి
♦ప్రభుత్వపరంగా క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిస్తున్నాం, దీనికి తోడు గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేసుకుంటే గెలుపు అన్నది అసాధ్యం కానేకాదు
♦ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నాం
♦సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా మీమీద ఉంది
♦ప్రతినెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నాం
♦ఇవి జాగ్రత్తగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది
♦ జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తికావాలి
♦అలాగే పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలి
♦మహిళా సాధికారితకోసం ఈప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది
♦ పథకాల్లో సింహభాగం వారిదే
♦బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా వారికి ప్రాధాన్యత ఉండేలా చూసుకోండి
♦ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతాను: సీఎం
♦దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తాం: సీఎం
Comments
Please login to add a commentAdd a comment