Regional coordinator
-
ప్రచారానికి సిద్ధం..రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం భేటీ
-
YSRCP: పలు పార్లమెంట్, వివిధ జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం
సాక్షి,తాడేపల్లి: రాబోయే సాధారణ ఎన్నికలకుగాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. కర్నూల్,నంద్యాల పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పి. రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడుగా మల్లాది విష్ణును నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. -
CM Jagan: రెట్టించిన స్పీడ్‌తో పనిచేయాలి
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం: బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి: ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం వారంతా గజ దొంగల ముఠా దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి వాటిని తిప్పికొట్టాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు ఈ అడుగులన్నీ కూడా దానికోసమే కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది నేను చేయాల్సింది.. నేను చేయాలి మీరు చేయాల్సిది మీరు చేయాలి ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం -
‘జయహో బీసీ’ తరహాలో మిగతా విభాగాల సదస్సులు
సాక్షి, అమరావతి: విజయవంతమైన ‘జయహో బీసీ’ తరహాలోనే మిగతా విభాగాల సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల్లో వారికి దిశా నిర్దేశం చేశారు. జయహో బీసీ తరహాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సదస్సుల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. గతంలో నిర్దేశించుకున్న మేరకు సాధ్యమైనంత త్వరగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో వెనకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నియామకాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న చిన్నచిన్న అంతర్గత లోపాలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని చెప్పారు. అప్పటికీ సమస్యలు అపరిష్కృతంగా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రచార కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో పార్టీ నాయకులు, యంత్రాంగం చురుగ్గా పని చేసేలా చూడాలని సూచించారు. -
CM YS Jagan: ఇంటింటా మనం.. అదే మన లక్ష్యం
బూత్ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నదే మన లక్ష్యం. నెట్వర్క్ బలంగా ఉండడం వల్ల గెలుపు చాలా సులభం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కు 175 గెలవాలి. ఈ నెట్వర్క్ మొత్తాన్ని బలంగా పని చేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులందరి మీదా ఉంటుంది. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. మన ఎమ్మెల్యేలను గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా. దేవుడి దయ వల్ల వాతావరణం చాలా బాగుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా అమలవుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలకు పార్టీ బలం కూడా తోడైతే వచ్చే ఎన్నికల్లో మన గెలుపు మరింత సులువవుతుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతమవ్వడం కోసం ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మందిని పార్టీ తరఫున గృహ సారథులుగా నియమిస్తామని తెలిపారు. వీరు బూత్ కమిటీలలో సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లను నియమిస్తున్నామని, ఇందులో ఒక అక్క లేదా చెల్లెమ్మ కూడా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలో గడప గడపకు పార్టీని మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఒక స్పష్టమైన కార్యాచరణతో వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింది స్థాయిలో ఇంటింటికీ.. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నారన్నారు. ఇదే సమయంలో మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలని సూచించారు. దీనికోసం 10–15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సీఎంతో సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో మన సైన్యాన్ని వ్యవస్థీకృతం చేద్దాం ► వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్ (పునశ్చరణ) కోసం మిమ్మల్ని అందర్నీ పిలిచాం. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో ఎలా పనిచేయాలన్నదానిపై ఒక ప్రణాళికను మీకు వివరిస్తా. క్షేత్ర స్థాయిలో మన పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు రీజనల్ కో ఆర్డినేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశిస్తున్నాం. ► గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక మహిళ ఉంటారు. వీరందరూ స్థానికులై ఉండాలి. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు.. రాజకీయ అవగాహన కలిగిన, చురుగ్గా ఉన్న వారిని ఈ నెల 20వ తేదీ నాటికి కన్వీనర్లుగా ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా సక్రమంగా జరిగేలా నియోజకవర్గాల పరిశీలకులు చూస్తారు. ప్రతి 50 ఇళ్ల వారీగా మ్యాపింగ్ ► కన్వీనర్ల ఎంపిక తర్వాత ప్రతి 50 ఇళ్ల క్లస్టర్‌కు ఒక పురుషుడు, ఒక మహిళ చొప్పున ఇద్దరు గృహ సారథుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహ సారథులు కూడా అదే క్లస్టర్‌కు చెందిన వారై ఉండాలి. వీరు పార్టీ సందేశాన్ని చేర వేయడం, పార్టీ తయారు చేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు చూస్తారు. ఇందుకోసం ప్రతి 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నాం. ► మొత్తంగా 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహ సారథులు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 45 వేల మంది కన్వీనర్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి పార్టీ సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్‌ని అందిస్తారు. 15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు. మొదటిసారి ఇలా తిరగడం వల్ల ఆ సచివాలయం పరిధిలో ఒక అవగాహన వస్తుంది. అన్ని సచివాలయాల పరిధిలో కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ► సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పని తీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఖాయం ► మన ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో 84% కుటుంబాలకు మేలు జరిగింది. కార్పొరేషన్లలో 78 శాతం నుంచి 80%కుటుంబాలకు మేలు జరిగింది. ఇలాంటి మంచి వాతావరణంలో మనం అడుగులు ముందుకేస్తున్నాం. ► సాధారణంగా రాజకీయ నాయకులు ఊళ్లలో తిరగడానికి భయపడతారు. కానీ మొదటి సారి.. నాన్న (వైఎస్సార్) హయాంలో శాచ్యురేçÙన్ పద్ధతిలో పథకాలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అర్హత ఉన్నవారికి ఎవ్వరికీ నిరాకరించకుండా పథకాలు అమలుచేశాం. మూడున్నరేళ్లుగా ప్రతి కుటుంబానికీ మేలు జరిగింది. మన పార్టీ వల్ల మేలు జరిగిందన్న సంతోషం ఎమ్మెల్యేలకూ ఉంది. అందువల్లే ధైర్యంగా ఊళ్లలోకి వెళుతున్నారు. పార్టీలో ఎక్కడైనా చిన్నచిన్న బేధాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది. ► బటన్ నొక్కడమే కాదు (సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బులు జమ చేయడం).. ఈ నెట్వర్క్ మొత్తం చాలా బలంగా పని చేయాలి. ఈనెల 20వ తేదీలోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడటం ద్వారా ఈ కొత్త బాధ్యతలో తొలి అడుగు బలంగా వేయాలి. మీ కష్టానికి తగిన ఫలితం తప్పక ఉంటుంది. -
CM YS Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలన్నారు. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే ...: ♦పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఓరియంటేషన్ కోసం మిమ్మల్ని అందర్నీ పిలిచాం ♦రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో ఎలా పనిచేయాలన్నదానిపై ఒక ప్రణాళికను మీకు వివరిస్తాం ♦క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఉన్న సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లకు, పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ పరిశీలకులకు విధివిధానాలు నిర్దేశిస్తున్నాం ♦గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కింద స్థాయిలో ఇంటింటికీ వెళ్తున్నారు. నెలకు కనీసంగా 4 నుంచి 5 సచివాలయాల్లో తిరుగుతున్నారు. ♦ఓ వైపు గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలి. దీనికోసం 10-15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించింది. ♦దీనికోసం 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక పురుషుడు, ఒక మహిళ– గృహసారథులుగా ఉంటారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు వీళ్లు చూస్తారు. ♦అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీతరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారు. వీరిలో కనీసం ఒక్కరు మహిళ ఉంటారు. వీరు సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను చూస్తారు. రాజకీయ అవగాహన ఉన్నవారు, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపికచేయాలి. ♦మొత్తంగా యాభైఇళ్లకు ఇద్దరు చొప్పున 15వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 45 వేల మంది కన్వీనర్లు ఉంటారు. ♦ముందుగా చేయాల్సిన పని రాష్ట్రంలోని దాదాపు 15వేల సచివాలయాలకు ముగ్గురు చొప్పున కన్వీనర్ల ఎంపికను ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వీరిని ఎంపిక చేస్తారు. ఈ ప్రాసెస్ సక్రమంగా జరిగేలా నియోజకవర్గాల పరిశీలకులు చూస్తారు. ♦ఎంపిక పూర్తయిన తర్వాత ఈ సచివాలయాల పరిధిలోని పార్టీకి సంబంధించిన కన్వీనర్లు డోర్ టు డోర్ వెళ్లి పార్టీనుంచి సందేశాన్ని, పబ్లిసిటీ మెటీరియల్‌ని అందిస్తారు. ♦15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకుంటారు. మొదటసారి ఇలా తిరగడం వల్ల ఆ సచివాలయాల పరిధిలో ఒక అవగాహన వస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూనే.. మరోవైపు సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకూ తిరుగుతారు. ♦అన్ని సచివాలయాల పరిధిలోకూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది. కన్వీనర్లు అన్నవారు స్థానికంగా నివసించిన వారై ఉండాలి. కన్వీకనర్ల ఎంపిక తర్వాత తదనంతరం ప్రతి యాభై ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులను ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహసారథులు కూడా అదే క్లస్టర్లకు చెందినవారై ఉండాలి. ♦సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు. ♦ఈ కార్యక్రమాలు ఎందుకంటే బూత్ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. నెట్వర్క్ బలంగా ఉండడం వల్ల గెలవటం అన్నది చాలా సులభం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కి 175 గెలవాలి. ♦బటన్ నొక్కడమే కాదు, ఈనెట్‌వర్క్ మొత్తం చాలా బలంగా పనిచేయాలి. ఈ నెట్వర్క్ అంతా బలంగా పనిచేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులుగా మీ అందరిమీదా ఉంది. డిసెంబర్20లోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడాలి. ♦మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. కష్టపడకపోతే ఫలితం ఉండదు. కచ్చితంగా ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత మీది. ♦గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా. దేవుడి దయ వల్ల వాతావరణం చాలా బాగుంది. మన ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. కార్పొరేషన్లలో 78 శాతం నుంచి 80 శాతం కుటుంబాలకు మేలు జరిగింది. ఇలాంటి మంచి వాతావరణంలో మనం అడుగులు ముందుకేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు తిరగడానికి భయపడతారు. ♦కాని మొదటిసారి.. నాన్న హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో పథకాలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అర్హత ఉన్న వారికి ఎవ్వరికీ కూడా నిరాకరించకుండా పథకాలు అమలు చేశాం. మూడున్నరేళ్లుగా ప్రతి కుటుంబానికీ మేలు జరిగింది. మన పార్టీ వల్ల మేలు జరిగిందన్న సంతోషం ఎమ్మెల్యేలకూ ఉంది. పార్టీలో ఎక్కడైనా చిన్న చిన్న బేధాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది. -
CM YS Jagan: పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం భేటీ కానున్నారు. ఇటీవలే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్యేల పనితీరు, కిందిస్థాయి కార్యకర్తలు అభిప్రాయాలను అబ్జర్వర్ల ద్వారా తెలుసుకుంటున్నారు. సమావేశంలో పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం పరిశీలకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. చదవండి: (ఆ మాట జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి: సీఎం జగన్) -
వైఎస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల
-
వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని తెలిపింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చెవిరెడ్డి సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీలోని 23 అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రతి అనుబంధ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు రేయింబవళ్లు నిర్విరామంగా పని చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జాబితా ►శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ ►విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి ►కాకినాడ, తూగో, కోనసీమ, పగో, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, మిథున్‌రెడ్డి ►కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ►పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్‌రెడ్డి ►నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ►అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ►కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి జిల్లా అధ్యక్షుల జాబితా ►శ్రీకాకుళం - ధర్మాన కృష్ణదాస్ ►విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు ►పార్వతీపురం మన్యం - పరీక్షిత్ రాజు ►అల్లూరి సీతారామరాజు - కోటగుళ్ల భాగ్యలక్ష్మి ►విశాఖపట్నం - పంచకర్ల రమేష్ ►అనకాపల్లి - కరణం ధర్మశ్రీ ►కాకినాడ - కురసాల కన్నబాబు ►కోనసీమ - పొన్నాడ వెంటక సతీష్ కుమార్ ►తూర్పుగోదావరి - జక్కంపూడి రాజా ►పశ్చిమగోదావరి - చెరకువాడ శ్రీరంగనాథ రాజు ►ఏలూరు - ఆళ్ల నాని ►కృష్ణా - పేర్ని నాని ►ఎన్టీఆర్ - వెల్లంపల్లి శ్రీనివాసరావు ►గుంటూరు - డొక్కా మాణిక్య వరప్రసాద్ ►బాపట్ల - మోపిదేవి వెంకటరమణ ►పల్నాడు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►ప్రకాశం - జంకె వెంకటరెడ్డి ►నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ►కర్నూలు - బీవై రామయ్య ►నంద్యాల - కాటసాని రాంభూపాల్‌రెడ్డి ►అనంతపురము - పైలా నరసింహయ్య ►శ్రీసత్యసాయి జిల్లా - మాలగుండ్ల శంకరనారాయణ ►వైఎస్సార్ కడప - కొట్టమద్ది సురేష్‌బాబు ►అన్నమయ్య - గడికోట శ్రీకాంత్‌రెడ్డి ►చిత్తూరు - కె నారాయణస్వామి ►తిరుపతి - నెదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చదవండి: (ముస్లిం మైనార్టీలపై బాబు మొసలి కన్నీరు) -
టార్గెట్ 175.. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తే సాధ్యమే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి ప్రతి నెలా పథకాలను అందిస్తుండటాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా నిర్వహించే బాధ్యత మీదేనని ప్రాంతీయ సమన్వయర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీనిపై ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం సమావేశమై మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. నెలలో కనీసం 10 రోజులు ‘ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టాం. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. మీ నియోజకవర్గాలే కాకుండా మీకు అప్పగించిన బాధ్యతలను కూడా నెరవేర్చాలి’ అని సీఎం జగన్ నిర్దేశించారు. ‘పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ అందరిపై నమ్మకంతో ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించా’ అని గుర్తు చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. నిధులు సద్వినియోగం బాధ్యత మీదే.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదేనని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో కచ్చితంగా ఆరు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు స్పష్టం చేశారు. బూత్ స్థాయిల నుంచి కమిటీల నియామకం బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బూత్ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలని స్పష్టం చేశారు. వాటితోపాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని, పథకాల్లో సింహభాగం వారికే అందిస్తున్నామని గుర్తు చేశారు. అదే రీతిలో పార్టీ బూత్ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. వాస్తవాలతో ప్రజల్లోకి: గడికోట అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించామని, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా చేకూర్చిన మేలును నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సీఎం జగన్ ఆదేశించారని శాసనసభా వ్యవహారాల కో ఆర్డినేటర్, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా నినాదం అని ఆయన ప్రకటించారు. శుక్రవారం తాడేపల్లిలో గడికోట విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారన్నారు. అనుబంధ సంఘాలు సహా అన్ని కమిటీల ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. ఆగస్టు లోపు వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలు, అక్టోబర్ లోపు మిగిలిన అన్ని కమిటీలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఇక రానున్న రోజుల్లో సీఎం జగన్ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉంటారని చెప్పారు. ఎల్లో మీడియాను ఎదుర్కొన్న పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. -
బాధ్యతగా పనిచేయాలి: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. మండల, గ్రామ, బూత్‌స్థాయి కమిటీల నియామకంపై సీఎం కీలక దృష్టి సారించారు. చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలన్నారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని సీఎం అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే: ♦మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించాను ♦అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలి ♦పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలి ♦క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలి ♦జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో కో–ఆర్డినేట్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలి ♦వీరంతా ప్రభావంతంగా పనిచేయాలి ♦గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి ♦నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత మీది ♦కార్యక్రమం ఉద్దేశం అందరికీ అవగతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీది ♦కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలి ♦ప్రభుత్వపరంగా క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిస్తున్నాం, దీనికి తోడు గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేసుకుంటే గెలుపు అన్నది అసాధ్యం కానేకాదు ♦ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నాం ♦సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా మీమీద ఉంది ♦ప్రతినెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నాం ♦ఇవి జాగ్రత్తగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీది ♦ జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తికావాలి ♦అలాగే పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలి ♦మహిళా సాధికారితకోసం ఈప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది ♦ పథకాల్లో సింహభాగం వారిదే ♦బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా వారికి ప్రాధాన్యత ఉండేలా చూసుకోండి ♦ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతాను: సీఎం ♦దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తాం: సీఎం -
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం
-
సింగపూర్ 'రీజినల్ కోఆర్డినేటర్'గా ఇచ్చాపురం వాసి
అమరావతి : ఇచ్చాపురం సీనియర్ నాయకులు దక్కత లోకనాధం రెడ్డి పెద్ద కుమారుడు దక్కత జయప్రకాష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్నార్టీ సంస్థ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆయనకు నియామక పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు చేసిన విశేష సేవ కార్యక్రమాలు, పని పట్ల అకింత భావాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తనకు ఈ భాద్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, ఏపీఎన్ఆర్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్‌కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. తన భాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ.. పెట్టుబడులు, ఇతర అవకాశాలకు సింగపూర్‌లోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని జయప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. -
చెడ్డపేరు తెస్తే విధుల నుంచి తప్పిస్తాం
సాక్షి, సంగారెడ్డి: గురుకులానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా వ్యవహరిస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తామని గురుకుల పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) బాలస్వామి హెచ్చరించారు. నారాయణఖేడ్ మండలం జూకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావుతోపాటు పలు పలువురు అధ్యాపకుల తీరును నిరసిస్తూ వర్కర్లు ధర్నా చేయడం, తల్లిదండ్రుల ఆరోపణలపై ఆర్సీఓ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌తోపాటు కొందరు అధ్యాపకులపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ మద్యం సేవించి వర్కర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, భోజనం బాగుండడం లేదని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సరిపడా సరుకులు ఇవ్వడం లేదని, మటన్ కాంట్రాక్టర్‌తో ఇబ్బందులు ఎదురవడం, కాంట్రాక్టు మార్చడం, మెనూ ప్రకారం వంటకాలు ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై అంశాలవారీగా విచారణ చేసి గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి డా.ప్రవీణ్‌కుమార్‌కు నివేదిస్తామని అన్నారు. కొందరు లెక్చరర్లు, సిబ్బందితో కూడా సఖ్యతగా ఉండడం లేదని తెలపారు. ఈ అంశాలను విచారణ చేసి నిజం అని తేలితే శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ కూడా చేస్తామని అన్నారు. గురుకుల పాఠశాలకు చెడ్డపేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రిన్సిపాల్ గతంలో సస్పెన్షన్‌కు గురై ఇక్కడ బాధ్యతల్లో చేరారని, ఆయన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచిస్తామన్నారు. తాగుబోతు ప్రిన్సిపాల్ వద్దు.. పేరెంట్స్ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ఆర్సీఓను కలిసి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు తాగివచ్చి గురుకులం పేరును చెడగొడుతున్నారని, ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాగుబోతు ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించి గురుకులాన్ని మెరుగుపర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఇదిలా ఉండగా ఆర్సీఓ విచారణ జరుపుతున్న తరుణంలోనే ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావు తాను ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించనని రాజీనామా లేఖను ఆర్సీఓకు అందించారు. -
ప్రశాంతంగా ఎంసెట్
ఇంజినీరింగ్‌కు 6812, మెడిసిన్‌కు 2925 మంది హాజరు మొత్తం హాజరు శాతం 95.6 ఆర్టీసీ సమ్మెతో పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకున్న అభ్యర్థులు కడప ఎడ్యుకేషన్ : వైద్య, ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఎంసెట్-2015 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో 7,070 మంది విద్యార్థులకు గాను 6812 మంది (96 శాతం) పరీక్ష రాశారు. మెడిసిన్ విభాగంలో 3080 మందికి గాను 2925 మంది (95 శాతం) పరీక్ష రాశారు. కడప నగరంలో 10 పరీక్ష కేంద్రాల్లో, ప్రొద్దుటూరులో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. కడప నగరంలోని ఆరు కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో కడపలో 95.96 శాతం, ప్రొద్దుటూరులో 97 శాతం మంది పరీక్ష రాశారు. ముందే చేరుకున్న విద్యార్థులు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అభ్యర్థులు ముందు జాగ్రత్తగా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకున్నారు. ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు పలు ప్రయివేట్ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వాహనాల్లో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థిని గేటు వద్దే నిర్వాహకులు, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకుండా నిరోధించారు. ప్యాడ్లను కూడా అనుమతించలేదు. రీజనల్ కోఆర్డినేటర్ పరిశీలన నగరంలోని పరీక్ష కేంద్రాలను ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రఘునాథరెడ్డి, స్పెషల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం. రామకృష్ణారెడ్డి, అబ్జర్వర్లు మాధవరెడ్డి, సుబ్రమణ్యం శర్మ పరిశీలించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వారు తెలిపారు. -
అల్ ది బెస్ట్
విజయనగరం రూరల్/అర్బన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎంసెట్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యేసురత్నం బుధవా రం తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 5,228 మంది విద్యార్థులు ఎంసెట్ రాయనున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 3,834 మంది, మెడిసిన్ విభాగంలో 1394 మంది హాజరు కానున్నారని చెప్పారు. విజయనగరం జి ల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇంజినీరింగ్‌కు ఆరు, మెడిసిన్, అగ్రికల్చరల్కు రెండు కేం ద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చరల్ పరీక్షను మధాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు. మెడిసిన్ పరీక్ష జరిగే అన్ని కేంద్రాలకు జేఎన్టీయూ ప్రత్యేక పర్యవేక్షకులను పంపించనుంది. వీరితోపాటు స్థానిక పరిశీలకులు కూడా పర్యవేక్షించనున్నారు. పరీక్ష నిర్వహించే కేంద్రాలలో అక్కడి కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బంది పడకుం డా ఫర్నిచర్, మంచినీటి సౌకర్యంతోపాటు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉచిత బస్సు సౌకర్యం విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 8.30 గంటలకు, 8.45 గంటలకు, 9.00 గంటలకు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవలసిన బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తెలి పారు. ఎంసెట్ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఇంజినీరింగ్ విభాగం (నాలుగు కేంద్రాలు) 1. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం-01 (జేఎన్టీయూ, విజయనగరం క్యాంపస్) 2. ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల -03 (చింతలవలస- డెంకాడ మండలం) 3. సీతం ఇంజినీరింగ్ కళాశాల-01,(గాజులరేగ- విజయనగరం) 4. ప్రావీణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల -01, (మోదవలస, డెంకాడ మండలం, విశాఖ రోడ్) మెడిసిన్, అగ్రికల్చరల్ విభాగం (రెండు కేంద్రాలు) 1. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం-01 (జేఎన్టీయూ, విజయనగరం క్యాంపస్)2. సీతం ఇంజినీరింగ్ కళాశాల -01 (గాజులరేగ, విజయనగరం) విద్యార్థులు పాటించాల్సినవి... సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే వినియోగించాలి. ఓఎంఆర్ షీట్‌పై విద్యార్థి వివరాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులకు గంట ముందుగా అనుమతిస్తారు. ఇంజినీరింగ్‌కు ఉదయం 8 గంటలకు, మెడిసిన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అనుమతిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందు ఓఎంఆర్ షీట్‌ను అందిస్తారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు తీసుకురాకూడదు. పరీక్ష రాయడానికి ఉపయోగించే అట్టలు కూడా పరీక్ష కేంద్రలోని అనుమతించరు. ఒత్తిడిని జయించండి.... చివరి సమయంలో నూతన అంశాల జోలికి వెళ్లకండి. పరీక్ష బాగా రాయగలననే దృఢమైన నమ్మకంతో పరీక్షకు వెళ్లండి. స్నేహితులతో చర్చించి అనవసర ఆందోళన చెందకండి. ఇతరులతో పోల్చుకుంటూ భయపడకండి. పరీక్షకు సంబంధించిన విషయాలు చర్చించకండి. తగినంత విశ్రాంతి, సమతుల ఆహారం, తాగునీరు అందించాలి. ప్రశాంతంగా ఉండాలి.. పరీక్షకు రోజున ఉదయం నుంచీ మనసును ప్రశాం తంగా ఉంచుకోవాలి. కనీసం రెండు గంటల ముందు నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ చదవకూడదు. ఇతరత్రా ఆలోచనలను మనసులో ఉంచుకోకూడదు. పరీక్ష పూర్తయినంత వరకు ఇతరులతో మాట్లాడకూడదు. తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలి. రాని ప్రశ్నలను చది వి దిగులు పడకుండా వచ్చిన ప్రశ్నలకు జవాబు రాయడానికే తొలి ప్రాధాన్యమివ్వాలి. -డాక్టర్ ఎన్.వి.సూర్యనారాయణ, సైకాలజిస్ట్