![Ysrcp Appoints Regional Coordinators For Parliament Constituencies - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/02/10/ysrcpflag.jpg.webp?itok=fHHnmL03)
సాక్షి,తాడేపల్లి: రాబోయే సాధారణ ఎన్నికలకుగాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్‌సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు.
కర్నూల్,నంద్యాల పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పి. రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్‌నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడుగా మల్లాది విష్ణును నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment