రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్‌పై బొత్స ఫైర్‌ | Botsa Satyanarayana Fires On Chandrababu Government Over Budget For Super Six, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్‌పై బొత్స ఫైర్‌

Published Thu, Mar 20 2025 2:59 PM | Last Updated on Thu, Mar 20 2025 4:11 PM

Botsa Satyanarayana Fires On Chandrababu Government

సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్‌ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్‌ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.

‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్‌ జగన్‌ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.

గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్‌సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్‌సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ  వ్యాఖ్యానించారు.

రోజూ ఆవు కథ చెబితే ఎలా? కూటమిపై బొత్స సెటైర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement