appoinited
-
YSRCP: పలు పార్లమెంట్, వివిధ జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం
సాక్షి,తాడేపల్లి: రాబోయే సాధారణ ఎన్నికలకుగాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. కర్నూల్,నంద్యాల పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పి. రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడుగా మల్లాది విష్ణును నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. -
హైడ్రామాకు తెర
ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈగా కోటేశ్వరరావు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జిల్లా ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈగా కె.కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ నియామకంపై వారంరోజులుగా సాగిన హైడ్రామాకు తెరపడింది. సోమశిల ప్రాజెక్ట్, ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ వ్యవహరిస్తున్న పీవీ సుబ్బారావును ఇరిగేషన్ ఎస్ఈ అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతలను ప్రస్తుతం తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తున్న కోటేశ్వరరావుకు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్ఈ కోటేశ్వరరావు హరనాథపురంలోని ఇరిగేషన్ కార్యాలయంలో శనివారం ఈఈలు, డీఈలు, నీటియాజమాన్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సోమశిల జలాశయంలో ఉన్న 12.2 టీఎంసీల నీటితో 2.20 లక్షల ఎకరాల్లో వేసిన రెండో పంటకు నీరు అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. వీలైనంతవరకు డెడ్‌స్టోరేజ్ నీటిని వినియోగించకుండా వారాబంధి నిర్వహించి ఒక ఎకరా సైతం ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని నెల్లూరు, సంగం బ్యారేజీలను వచ్చే ఏడాది అక్టోబర్‌కు పూర్తిచేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. నీరు – చెట్టుపై జరిగిన అవినీతి ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.