Parliament constituencies
-
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్రావు నిజామాబాద్- సుదర్శన్‌రెడ్డి ఆదిలాబాద్-సీతక్క కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్‌బాబు హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్-సంపత్, చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి మల్కాజ్గిరి-మైనంపల్లి హన్మంతరావు మెదక్- కొండా సురేఖ జహీరాబాద్-దామోదర రాజనర్సింహ -
YSRCP: పలు పార్లమెంట్, వివిధ జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం
సాక్షి,తాడేపల్లి: రాబోయే సాధారణ ఎన్నికలకుగాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. కర్నూల్,నంద్యాల పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పి. రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడుగా మల్లాది విష్ణును నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. -
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా...బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ‘పొలిటికల్ ఇన్చార్జి’లను నియమించింది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండగా వారందరినీ ఆయా ఎంపీ సీట్లకు ఇన్చార్జులుగా నియమించింది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ను, ఇంకా మిగతా స్థానాలకు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎంపీకి ఇన్చార్జిగా అవకాశం కల్పించింది. సోమవారం ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నియామకాలు చేసినట్టు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఎంపీలకు భలే చాన్స్..
నల్లగొండ ఎంపీకి నల్లగొండ, సూర్యాపేటలో.. భువనగిరి ఎంపీకి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా.. సెగ్మెంట్ల వారీ విభజన జిల్లాలకే పరిమితం పార్లమెంట్ స్థానాలు, వాటి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు యథాతథం నియోజకవర్గాలు పెరిగినా.. అదే పద్ధతి లోకల్ ప్రొటోకాల్ పరిధి విస్తరించడంతో ఎంపీలకు కొన్ని అధికారాలు కూడా పెరుగుతాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు సదరు పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు ఆయన లోకల్పొటోకాల్ పరిధి లోకి వచ్చే జిల్లాల్లోని మిగిలిన నియోజక వర్గాల్లో కూడా ఖర్చు చేసే వెసులు బాటు కలుగుతుంది. నల్లగొండ : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల విభజనతో పార్లమెంట్ సభ్యుల లోకల్ ప్రొటోకాల్ పరిధి పెరగనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలు.. 24 జిల్లాలుగా విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీల ప్రొటో కాల్ పరిధి కూడా విస్తరించనుంది. అంటే.. ఒకే జిల్లాను రెండు లేదా మూడు జిల్లాలుగా చేయడం..ఇందులోనూ ఒకే ఎంపీ స్థానంలోకి వచ్చే నియోజకవర్గాలను రెండు, మూడు జిల్లాలకు పంచేలా ప్రతిపాదనలు తయారు చేయడంతో ఎంపీల లోకల్ ప్రొటోకాల్ పరిధి ఆ మేరకు పెరిగే అవకాశం ఉంది. ఎంపీ ఒక్కరే... ప్రొటోకాల్ మూడు జిల్లాల్లో జిల్లాల విభజన ద్వారా ఒక ఎంపీకి పలు జిల్లాల్లో ప్రొటోకాల్ వర్తించనుంది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలున్నాయి. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాలు ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. అంటే ఇప్పటివరకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆ జిల్లాలో మాత్రమే లోకల్ ప్రొటోకాల్ ఉంటుంది. కానీ.. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం జిల్లా విడిపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలు సూర్యాపేట జిల్లాలోకి వెళ్తాయి. అప్పుడు నల్లగొండ, నాగార్జునసాగర్ నల్లగొండలో ఉంటాయి. అలా జరిగితే.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఈ రెండు జిల్లాల్లో (నల్లగొండ, సూర్యాపేట) లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. భువనగిరి ఎంపీ విషయానికి వస్తే లోకల్ ప్రొటోకాల్ పరిధి నాలుగు జిల్లాలకు వర్తించనుంది. ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ పరిధిలో నల్లగొండ జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలతో పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వరంగల్ జిల్లా జనగామ ఉన్నాయి. అంటే భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు ఈ మూడు జిల్లాల్లో లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తోంది. జిల్లా విభజన జరిగితే ఆయన లోకల్ పొటోకాల్ పరిధి నాలుగు జిల్లాలకు పెరగనుంది. ఎలాగంటే... భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలోకి వెళ్తుంది కనుక సూర్యాపేట జిల్లాలో కూడా భువనగిరి ఎంపీకి లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. ఈ జిల్లాతో పాటు నల్లగొండ, భువనగిరి కేంద్రంగా ఏర్పాటయ్యే యాదాద్రి, జనగామ నియోజకవర్గం వెళ్లే మానుకోట జిల్లాల్లో కూడా ఆయన ప్రాతినిధ్యం పెరుగుతుం ది. ఈ లెక్కన నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సభ్యులిద్దరికీ కలిపి మొత్తం ఐదు జిల్లాల్లో ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. అయితే, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగినప్పటికీ, ఆయా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీలు నియోజకవర్గాలు, జిల్లాల పరిధిలో ఎంపీ లోకల్ ప్రొటోకాల్ వర్తించనుంది. జెడ్పీ సమావేశాలతోపాటు... లోకల్ ప్రొటోకాల్ పరిధి పెరగడం ద్వారా ఎంపీలకు కొన్ని అధికారాలు కూడా పెరుగుతాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు సదరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ యన లోకల్ ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లోని మిగిలిన నియోజకవర్గాల్లో కూ డా ఖర్చు చేసే వెసులు బాటు కలుగుతుంది. అదేవిధంగా ఎంపీ స్థానం వచ్చే అన్ని జిల్లాల జెడ్పీ, డీఆర్సీ, బ్యాంకర్ల సమావేశాలు, అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరు కావచ్చు. కానీ.. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలకు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం మాత్రం ఒక్క జిల్లాలోనే ఉంటుంది. సదరు పార్లమెం ట్ పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ స్థానాలు కాకుండా... జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎంపీ తర్వాతే విస్తరణ ఎంపీలకు ప్రొటోకాల్ వర్తించనుంది. -
సారీ.... అన్నా..!
ఉపసంహరణకు ముందుకు రాని అభ్యర్థులు పార్టీ నేతలతో మొదలైన టెన్షన్ పనిచేయని ఆఫర్లు, ప్యాకేజీలు నేడు మధ్యాహ్నం 3గంటల వరకే గడువు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థులకు ప్రధాన పార్టీల నేతలు జరిపిన మంతనాలకు వారెవ్వరు ఒప్పుకోకపోగా, సారీ అంటూ చేతల్లో చూపించారు. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైనా శుక్రవారం ఏఒక్క అభ్యర్థి అయినా ఉపసంహరించుకొనేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రధాన పార్టీల నేతల గుండెల్లో బరిలో ఉన్నా స్వతంత్ర అభ్యర్థులు రైళ్లు పరుగెత్తిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసినప్పటినుంచి వారితో రెగ్యులర్‌గా మంతనాల్ని జరుపుతున్నా, తొలి రోజు ఉపయోగం లేకపోయింది. ఇక కొంత మంది స్వతంత్ర అభ్యర్థులకైతే అడిగినంతా ఇస్తాం, లేదంటే మంచి ప్యాకేజీలను ఇస్తామని ప్రకటించినా, బరిలో ఉన్న వారు అసక్తి కనపర్చడంలేదని తెలుస్తోంది. వీరికి ఇంకేం చేస్తే ఉపసంహరించుకుంటారని ప్రధాన పార్టీల నేతలు సమాలోచనలో పడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో: మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో 16మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఏఒక్కరు ఉపసంహరించుకోలేదు. ఇక నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 8మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవ్వరు ముందుకు రాకపోవడంతో వీరంతా బరిలో ఉంటారనే తెలుస్తోంది. ఇక రాత్రి రాత్రి చర్చల్లో ఎంత మందికి ముందుకు వస్తారానేది వేచి చూడాలి. అసెంబ్లీ బరిలో... 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో 213మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అచ్చంపేట్‌లో గువ్వల అమల, నారాయణపేట్ విఠల్ రావు ఆర్యాలు ఉపసంహరణకు దరఖాస్తు చేసుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా అమోదించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక అన్నింటికంటే ఎక్కువగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనే 24మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారే గెలుస్తామనే ధీమాలో ఉండడంతో, ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరిచే ఉపసంహరించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేయని ప్రయత్నమంటూ ఏమీ లేదు, అయినా ఫలితం కనిపించలేదు. దీంతో ఓనేత ఏకంగా స్వతంత్ర అభ్యర్థిని బెదిరించడంతో, అతను గడువు ముగిసేంత వరకు అండర్ గ్రౌండ్‌ల్లోకి వెళ్లినట్లు సమాచారం. నేటితో ముగింపు...ఉపసంహరణకు విధించిన గడువు నేడు మధ్యాహ్నం 3గంటలతో ముగియనుంది. ఇందుకుగాను స్వతంత్ర అభ్యర్థులచే ఉపసంహరింపజేసేందుకు ప్రధాన పార్టీలైతే ఏకంగా రాష్ట్ర నేతల్ని రంగంలోకి దింపారు. వీరి ప్రయత్నాలు, ప్యాకేజీలు, ఆఫర్లు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. -
నేడే నామినేషన్లు
ఎన్నికల క్షేత్రంలో ప్రధాన అంకమైన నామినేషన్ల ఘట్టానికి నేడు తెరలేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల బరిలో నిలిచే నేతలు తమ నామినేషన్ దాఖలుతో సమరానికి సై అంటున్నారు. నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 2 నేడు కాగా నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 9. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10న ముగుస్తుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 12 చివరి తేది. ఇక పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుండగా పోరుబరిలో ఉన్న నేతలు నువ్వానేనా అని పోటీపడనున్నారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థుల ప్రచారంతో నగరంలో ఎన్నికల పండగ బుధవారం నుంచే మొదలు కానుంది. సికింద్రాబాద్ మొత్తం ఓటర్లు: 2,26,001 పురుషులు: 1,17,727 మహిళలు: 1,08, 261 ఇతరులు: 13 పోలింగ్ బూత్‌లు: 199 ప్రిసైడింగ్ అధికారి పేరు: ప్రీతిమీనా సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 99638 56784 శేరిలింగంపల్లి మొత్తం ఓటర్లు: 5,31,352 పురుషులు: 2,91,560 మహిళలు: 2,39,727 ఇతరులు: 65 పోలింగ్ బూత్‌లు: 492 రిటర్నింగ్ అధికారి పేరు: పి.పంకజ సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 99899 30589 కూకట్పల్లి మొత్తం ఓటర్లు: 4,72,044 పురుషులు : 2,58,557 మహిళలు : 2,13,428 ఇతరులు: 59 పోలింగ్ బూత్‌లు : 442 రిటర్నింగ్ అధికారి పేరు: బి.వి.గంగాధర్‌రెడ్డి సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 98499 05907 మల్కాజిగిరి మొత్తం ఓటర్లు: 4,35,825 పురుషులు : 2,26,598 మహిళలు : 2,09,198 ఇతరులు: 29 పోలింగ్ బూత్‌లు : 402 రిటర్నింగ్ అధికారి పేరు: వెంకటేశ్వరరావు సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 98499 05902