![Telangana BJP appoints in charges for 17 parliament constituencies - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/9/bjp.jpg.webp?itok=ADXBe41X)
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా...బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ‘పొలిటికల్ ఇన్‌చార్జి’లను నియమించింది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండగా వారందరినీ ఆయా ఎంపీ సీట్లకు ఇన్‌చార్జులుగా నియమించింది.
యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ను, ఇంకా మిగతా స్థానాలకు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎంపీకి ఇన్‌చార్జిగా అవకాశం కల్పించింది. సోమవారం ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నియామకాలు చేసినట్టు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment