‘స్థానిక’ పునాదితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం
రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా.. బీజేపీ రాష్ట్ర విస్తృత
కార్యవర్గ సమావేశంలో రూట్‌మ్యాప్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతో మొదలు పెట్టి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు (నెల నుంచి 1500 రోజులకు) సిద్ధం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణలో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నందున ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని సంస్థాగతంగా బలపడాలని తీర్మానించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14% ఓటింగ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతానికి పెంచుకున్నందున, 2028 శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధికారానికి వచ్చేందుకు అనుకూల పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఏడునెలల కాంగ్రెస్ పాలనలో ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోకపోవడంతో.. రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, ఇలా అన్ని వర్గాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవకపోవడం ద్వారా బీఆర్‌ఎస్ బలహీనపడినట్టుగా బీజేపీ భావిస్తోంది. ఈ పరిస్థితులను ఉపయోగించు కుని తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని తీర్మానించింది.
త్వరలో చింతన్‌బైఠక్‌లు
అధికార కాంగ్రెస్‌కు బీజేపీ రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పార్టీ నుంచి పెద్దసంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునేలా కృషి చేయాలని పిలుపునిచి్చంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నాయకులు కృషి చేయాలని నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమయ్యేందుకు వెంటనే గ్రామాలకు తరలి పని ప్రారంభించాలని నిర్ణయించింది.
పారీ్టపరంగా వ్యూహాలను పటిష్టంగా అమలుచేసేందుకు తొందరలోనే 17 ఎంపీ నియోజకవర్గాల వారీగా లేదా 32 జిల్లాలను 4 ప్రాంతాలుగా విడదీసి ‘చింతన్ బైఠక్’(మేథోమథన శిబిరాలు) నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో చేపట్టాల్సిన రూట్‌మ్యాప్‌పై చర్చ సాగింది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ .జెండా ఆవిష్కరించగా, ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు.
పీఎం మోదీని అభినందిస్తూ ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర హోం శాఖ సహాయ బండి సంజయ్ తీర్మానం ప్రవేశ పెట్టగా, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ దానిని బలపరిచారు. సమావేశంలో ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యే లు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకే‹Ùరెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబు, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బంగారు శ్రుతి, ఎస్సీమోర్చా జాతీయకార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హామీలన్నింటినీ వెంటనే అమలుచేయాలి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ తీర్మానం ఆమోదించారు. సమావేశంలో ఏలెటీ మహేశ్వర్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు దానిని బలపరుస్తూ మాట్లాడారు.
రాజకీయ తీర్మానంలో ముఖ్యాంశాలు
⇒ వెంటనే రైతు రుణమాఫీని అమలు చేయాలి.
⇒ రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు వెంటనే విడుదల చేయాలి
⇒ గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి
⇒ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి
⇒ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారంపై సీబీఐకి అప్పజెప్పాలి
⇒ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా సీపీఐ కి అప్పజెప్పాలి
⇒ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి, శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి
⇒ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై జ్యుడీíÙయల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలి
⇒ గొర్రెల స్కాం మీద పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి
⇒ ల్యాండ్, శాండ్, గ్రానైట్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి
⇒ ధాన్యం కుంభకోణంపై విచారణ చేయాలి
⇒ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి
⇒ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి
⇒ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి.. ధరణి ప్రక్షాళన చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment