
సాక్షి,కరీంనగర్ : తెలంగాణ విద్యా కమీషన్‌లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు.
బీఅర్ఎస్ అధినేతకు బీదర్‌లో దొంగనొట్లు ముద్రించే ప్రెస్ ఉందని, దొంగనోట్ల వ్యాపారం చేసి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వం భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చింది. ఈ ప్రభుత్వంలో 15 నుండి 18 కమిషన్ పెంచారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు.

Comments
Please login to add a commentAdd a comment