కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా
మా విజయాన్ని రేవంత్, కేసీఆర్, ఒవైసీ అడ్డుకోలేరు
జీహెచ్‌ఎంసీ మేయర్ పదవినీ కైవసం చేసుకుంటాం
రాయదుర్గం (హైదరాబాద్): రాష్ట్రంలో 2028లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగే ఎన్నికలు బీజేపీ గెలుపే లక్ష్యంగా ఉంటాయని, వార్ వన్‌సైడ్ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీ లు కలిసి పోటీచేస్తాయని, అయినా బీజేపీకి తిరుగుండదని చెప్పారు.
తమ విజయాన్ని రేవంత్‌రెడ్డి, కేసీఆర్, ఒవైసీ అడ్డుకోలేరని, ఎంఐఎం పార్టీని ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు. ఎంఐఎంను తెలంగాణ నుంచి తరిమికొడతామని పేర్కొన్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అటు రాష్ట్రంలో, ఇటు జీహెచ్‌ఎంసీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డిలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను ప్రజలు మర్చిపోయేలా చేసేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నాయకులపై అనేక కేసు లు పెట్టిందని, రౌడీïÙట్లు ఓపెన్ చేసిందని చెప్పారు. తనపై 109 కేసులు పెట్టారని, 14 సార్లు జైలుకు పంపారన్నారు. అలాంటి కేసీఆర్‌ను వదిలిపెడ్తామా అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 50 లక్షల మందికి సభ్యత్వం
దేశంలో 10 కోట్ల మందికి, రాష్ట్రంలో 50 లక్షల మందికి సభ్యత్వం చేయించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని బండి చెప్పారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక్కసారైనా ప్రజాప్రతినిధిగా మారాలని, అందుకోసం పార్టీ సభ్యత్వం చేయించాలన్నారు. హైదరాబాద్‌లో, రంగారెడ్డి జిల్లాలోని 22 డివిజన్లలో అధికంగా చేయించాలనే తపనతో అందరూ పోటీ పడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment